TSRTC Will Run More Services of Metro Express Buses on New Year Celebration - Sakshi
Sakshi News home page

Hyd: న్యూ ఇయర్‌: మందుబాబుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Published Thu, Dec 30 2021 8:08 PM | Last Updated on Fri, Dec 31 2021 7:33 AM

TSRTC Provide Special Buses To New Year Events At City Outskirts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొనే మందుబాబుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసు సౌకర్యం కల్పించనుంది. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము 3గంటల వరకు బస్సు సేవలు అందిచనుంది.

18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 

టీఎస్‌ఆర్టీసీ కొత్త సంవత్సరం కానుక
కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement