వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అంటూ నగరవాసుల గూగుల్ సెర్చ్
లైవ్ కన్సర్ట్‌లు, ఇయర్ వేడుకలకు ముందస్తు బుకింగ్స్‌కు ఆసక్తి
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడూ బిజీ బిజీ లైఫ్‌తో తీరిక లేకుండా ఉండే నగరవాసులు ఒక్కసారిగా హైదరాబాద్‌లో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ప్రొఫెషనల్, పర్సనల్ పనులు సైతం కాస్త పక్కపెట్టి మరీ ఈ డిసెంబర్‌పై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే వాట్సాప్ హైదరాబాద్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిటీ అంటూ గూగులింగ్ చేస్తున్నారు. ఇయర్ ఎండ్ నేపథ్యంలో డిసెంబర్ నెలలో వేడుకలు, ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించి ముందే ప్లానింగ్ చేస్తున్నారు సిటీజనులు. ఇప్పటి నుంచే నగరంలో జరగనున్న ఈవెంట్లు, లైవ్ కన్సర్ట్‌లు, కేక్ మిక్సింగ్‌లు, 31 నైట్ సెలబ్రేషన్స్‌పై ముందస్తు బుకింగ్స్‌కు ఆసక్తి చూపుతున్నారు.
లైవ్ కన్సర్ట్‌లు.. మెమరబుల్ ఈవెంట్స్..
పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడం నగరం ఆనవాయితీ. ప్రతీ ఏడాది ఈ వేడుకల కోసం నగరం అందంగా ముస్తాబై విభిన్న ఆహ్లాదకర వేడుకలతో అలరిస్తూనే ఉంది. అయితే.. ఈ ఈవెంట్స్‌కు సంబంధించి ముందుగానే ప్లాన్ చేకుంటే పాసులు, ఎంట్రీ దొకరడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో నగరంలో జరగనున్న ఈవెంట్ల గురించి ముందుగానే ఆరా తీస్తున్నారు. చివరి రెండు వారాల్లో జరగనున్న లైవ్ కన్సర్ట్‌లు, ఫైవ్ స్టార్ ఈవెంట్లు, ఇతర వినోద కార్యక్రమాకు సంబంధించి గూగుల్‌లో, ఈవెంట్స్ వెబ్‌సైట్లలో వెతుకుతున్నారు. ఇలాంటి వేడుకలకు నగరవాసుల నుంచి పెరుగుతున్న ఆదరణ, అంతేగా కుండా ఆయా రోజుల్లో ముందస్తుగానే సెలవులు పెట్టుకోవాల్సిన దృష్ట్యా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అంటూ సెర్చ్ చేస్తున్నారు.
గ్రాండ్‌గా.. ఈవెంట్స్..
డిసెంబర్ నెలకు సంబంధించి నిర్వహించనున్న ఈవెంట్లకు సంబంధించి ఇప్పటికు ప్రణాళికలు మొదలైనప్పటికీ అనుమతులు, ఆంక్షల నేపథ్యంలో తేదీల వివరాలను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. కొన్ని ప్రత్యేక ఈవెంట్ల వివరాలు మాత్రం ఇప్పటికే వెల్లడించి బుక్ మై షోలో టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే మాదాపూర్, గచి్చబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. వీటి కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి సైతం ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్, ఈవెంట్స్ ఆర్గనైజర్స్ నగరానికి చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment