సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నూతన సంవత్సర వేడుకల సందడికి కంట్రీ క్లబ్ శ్రీకారం చుట్టింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ నెల 31న వార్ ఆఫ్ డీజేస్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది. క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్, ఎండీ రాజీవ్‌రెడ్డి ఈ వివరాలను తెలిపారు. నగరంలోని పోలీస్ హాకీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ వేడకలో భాగంగా టాప్ డీజేల మ్యూజిక్, విందు వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేవిధంగా సినీనటి దక్షా నాగర్కర్ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. సమావేశంలో నటి దక్షా పాల్గొని మాట్లాడిన అనంతరం నృత్యకార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment