Country Club
-
వెల్కమ్ వేడుక.. వార్ ఆఫ్ డీజేస్..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నూతన సంవత్సర వేడుకల సందడికి కంట్రీ క్లబ్ శ్రీకారం చుట్టింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ నెల 31న వార్ ఆఫ్ డీజేస్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది. క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్, ఎండీ రాజీవ్‌రెడ్డి ఈ వివరాలను తెలిపారు. నగరంలోని పోలీస్ హాకీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ వేడకలో భాగంగా టాప్ డీజేల మ్యూజిక్, విందు వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదేవిధంగా సినీనటి దక్షా నాగర్కర్ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. సమావేశంలో నటి దక్షా పాల్గొని మాట్లాడిన అనంతరం నృత్యకార్యక్రమం జరిగింది. -
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
సంక్రాంతి సంబురం.. సంప్రదాయ సోయగం (ఫొటోలు)
-
హైదరాబాద్ : కంట్రీ క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ విజేత దబాంగ్ డేర్ డెవిల్స్
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్‌ను ఓడించింది. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్‌కు రూ. 5 లక్షల ఫ్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. -
ఆజాదీకా అమృత్ మహోత్సవ్: సాంస్కృతిక కార్యక్రమ దృశ్యాలు
-
రిలయన్స్ చేతికి స్టోక్ పార్క్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా బ్రిటన్‌కు చెందిన దిగ్గజ కంట్రీ క్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ స్టోక్ పార్క్‌ను దక్కించుకుంది. ఈ డీల్ విలువ 57 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 592 కోట్లు). పలు జేమ్స్ బాండ్ సినిమాల్లో స్టోక్ పార్క్ దర్శనమిస్తుంది. బ్రిటన్‌కు చెందిన స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను తమ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ (ఆర్ఐఐహెచ్ఎల్) కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆతిథ్య రంగంలో కార్యకలాపాల విస్తరణకు రిలయన్స్‌కి ఈ డీల్ ఉపయోగపడనుంది. రిలయన్స్‌కి ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్)లో గణనీయంగా వాటాలు ఉన్నాయి. జేమ్స్‌బాండ్ సినిమాలకు కేరాఫ్.. బ్రిటన్ సినీ పరిశ్రమతో స్టోక్ పార్క్‌కు చాన్నాళ్ల అనుబంధం ఉంది. రెండు జేమ్స్‌బాండ్ సినిమాల్లో ఇది కనిపిస్తుంది. గోల్డ్‌ఫింగర్ (1964), టుమారో నెవర్ డైస్ (1997) సినిమాలను స్టోక్ పార్క్‌లో తీశారు. 300 ఎకరాల సువిశాల పార్క్లాండ్లో 49 లగ్జరీ బెడ్రూమ్లు, సూట్లు, 27 హోల్ గోల్ఫ్ కోర్స్, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్లను స్టోక్ పార్క్ నిర్వహిస్తోంది. స్టోక్ పార్క్ ఎస్టేట్‌కి దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉండగా 1908 దాకా ప్రైవేట్ ప్రాపర్టీగానే కొనసాగింది. -
ఎర్ర గులాబీ
-
సందడిగా అందాల పోటీలు
-
రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్
ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్, కర్ణాటకలోని సర్జాపూర్ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ (సీసీహెచ్‌హెచ్‌ఎల్) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. -
అవకాశం వస్తే టాలీవుడ్లో నటిస్తా
సనత్‌నగర్: బాలీవుడ్ తార సోహా అలీఖాన్ బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో సందడి చేశారు. కంట్రీక్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘మిలీనియర్స్ క్లబ్’ను బుధవారం ఆమె ప్రారంభించారు. తనకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని, నా బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచిందని చెప్పుకొచ్చారు. మా అత్త గారు ఇక్కడే బేగంపేటలో ఉండేవారని, తరచూ హైదరాబాద్ వస్తానన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్లో నటిస్తానన్నారు. ఫ్యామిలీ క్లబ్బింగ్, హాలిడే, ఫిట్నెస్, లీజర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కంట్రీక్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ల్యాండ్‌మార్క్‌గా మారిందన్నారు. ముంబయ్‌లోని కంట్రీక్లబ్‌కు తాను తరచూ వెళ్తుంటానని, తనకిష్టమైన చికెన్ టిక్కాను తింటానన్నారు. కంట్రీక్లబ్ సీఎండీ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్ళలో ఒక మిలియన్ కుటుంబాలు కంట్రీక్లబ్‌లో సభ్యులుగా చేరతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
ఏడాదిలో 25 కంట్రీ క్లబ్స్
⇒ శంషాబాద్, వైజాగ్, విజయవాడల్లో విస్తరణ ⇒ స్థానిక సంస్థలతో కలిసి లండన్, అమెరికాల్లో కూడా.. ⇒ 6 నెలల్లో ఓ విమానయాన సంస్థతో ప్రత్యేక ఒప్పందం ⇒ మూడేళ్లలో 10 లక్షల మంది సభ్యుల లక్ష్యం ⇒ గతేడాది రూ.500 కోట్ల టర్నోవర్; ఈ ఏడాది 25% వృద్ధి లక్ష్యం ⇒ కంట్రీ క్లబ్ సీఎండీ వై రాజీవ్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో హైదరాబాద్ కేంద్రంగా హాస్పిటాలిటీ మరియు హాలిడేస్ రంగంలో కొనసాగుతున్న కంట్రీ క్లబ్... ఈ ఏడాది భారీ విస్తరణ ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం దేశీయంగాను, సింగపూర్, దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్ వంటి 10 దేశాల్లో 55 సొంత ప్రాపర్టీలు ఉన్నాయి. వీటికి తోడుగా మరో 25 కంట్రీ క్లబ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఎండీ వై రాజీవ్ రెడ్డి మంగళవారం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఇందులో లండన్, అమెరికాల్లో ఒక్కో ప్రాపర్టీ మినహా మిగిలినవన్నీ మన దేశంలోనే మరీ ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్నాయని చెప్పారు. ‘‘శంషాబాద్ దగ్గర్లో కొంత భూమి ఉంది. అందులో తొలుత క్లబ్‌ను ఏర్పాటు చేస్తాం. తర్వాత విశాఖ, విజయవాడ నగరాలకు విస్తరిస్తాం. విదేశాల్లో అయితే లండన్‌లో స్థానికంగా ఉండే ఓ ప్రాపర్టీతో 15 ఏళ్ల లీజింగ్ ఒప్పందం చేసుకున్నాం. ఆ తర్వాత అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు విస్తరిస్తాం. వీటికి పెట్టుబడులెంతనేది ఇంకా నిర్ణయించలేదు. లీజింగ్ విధానంలో సేవలు విస్తరిస్తాం కనక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉండదు’’ అని ఆయన వివరించారు. 25 శాతం వృద్ధి లక్ష్యం... క్లబ్స్, హాలిడేస్, ఈవెంట్స్, ఫిట్నెస్ విభాగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కంట్రీ క్లబ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను సాధించిందని, మొత్తం ఆదాయంలో 35 శాతం విదేశాల నుంచే వస్తోందని రాజీవ్‌రెడ్డి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని, త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారాయన. ప్రస్తుతం 5 లక్షల మంది సభ్యులున్న కంట్రీ క్లబ్లో వచ్చే 3 ఏళ్లలో 10 లక్షల మంది సభ్యుల్ని చేర్చాలని లక్ష్యించామన్నారు. కొత్తగా కంట్రీ క్లబ్లో సభ్యత్వం తీసుకునే వారికి ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో ఓ విమానయాన సంస్థతో ప్రత్యేక ఒప్పందం చేసుకోనున్నామని, దీనివల్ల కంట్రీ క్లబ్ సభ్యులకు డిస్కౌంట్ ధరలకు విమాన టికెట్లు బుక్ చేసుకునే వీలు కలుగుతుందని తెలియజేశారు. ‘‘కంట్రీ క్లబ్ సేవలను నెలవారీ వాయిదా పద్ధతుల్లోనూ వినియోగించుకునేందుకు వీలుగా దేశంలో 11 ప్రధాన బ్యాంకులతో, విదేశాల్లో 3 బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. కస్టమర్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కస్టమర్ సెంట్రిక్ క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు. -
నవరాత్రి ఉత్సవాలకు కంట్రీక్లబ్ రెడీ
-
పేకాట క్లబ్‌పై దాడులు; ఏడుగురి అరెస్ట్
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): పేకాట ఆడుతున్న ఓ క్లబ్‌పై మంగళవారం దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట సమాచారం అందుకున్న పోలీసులు కంట్రీక్లబ్‌పై దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.36,830 నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, మూడు టూ వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీకి చెందిన నడికొప్పు రాజు ఆధ్వర్యంలో ఈ పేకాట నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దావత్ల దరహాసాలు!
ఆరో కుతుబ్‌షాహీ భార్య హయత్ బక్షీబేగంను ‘మా సాహెబా (అమ్మగారు)’ అని నగర ప్రజలు పిలుచుకునేవారు. ఆమె పేరుతో తవ్వించిన చెరువును మా సాహెబా తలాబ్ అనేవారు. చెరువు కనుమరుగై ‘మాసాబ్ ట్యాంక్’ మిగిలింది! మాసాబ్‌ట్యాంక్‌లో మా సమీప బంధువు నివసించేవారు. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో కజిన్ ఇంట్లో కొన్నాళ్లున్నాం. మా పొరుగు ఇల్లు ఓ నవాబుగారిది. నిజాం పాలనలో ఉన్నతాధికారులను, వారి బంధువులను, సామాజికంగా ఉన్నత కుటుంబీకులను నవాబులుగా వ్యవహరించేవారు. నిజాం హయాం గతించినా, ఓడలు బండ్లు అయినా.. నవాబులు తమ సోషల్ స్టేటస్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చేవారు. narendrayan - 4 డేట్ దేఖో.. వఖ్త్ నహీ! నగరం డిన్నర్ పార్టీలకు పెట్టింది పేరు. నిజాం హయాంలో అధికారిక విందు కార్యక్రమాలను గుర్తు చేస్తూ ‘దావత్ -ఎ-నిజాం’ పార్టీలు నిర్వహించేవారు. తిరస్కరించకూడని గౌరవనీయుల నుంచి ఆహ్వానాలొచ్చేవి. దావత్‌కు కారణాలు ఏమిటి? అని లోతుల్లోకి పోకూడదు. ‘బహానా(సాకు)’లు ఒకోసారి చిత్రంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా దావత్‌కు పిలిచారనుకోండి. ఏ రోజు అని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఏ సమయం అని గుర్తుంచుకోకూడదు. ఫలానా సమయం అన్నారు కదా అని ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్లారా? ‘తప్పు’లో కాలేసినట్లే! నగరానికి వచ్చిన తొలిరోజుల్లో అమాయకంగా ఓ పార్టీకి వెళ్లా, చెప్పిన టైంకు! దావత్ తాలూకూ అలికిడి కన్పించలేదు. ఆహ్వానించిన పెద్దమనిషి కన్పించలేదు. ఆదుర్దాతో పనిమనిషిని వెన్యూ గురించి అడిగాను. ‘రావాల్సిన చోటికే వచ్చారు. డిన్నర్‌కు రావాల్సిన వారు, సాయంత్రం టీ వేళకు వ చ్చారు’ అని జాలిపడ్డాడు. ఓ గంట తర్వాత మధువులొలకడం మొదలైంది. రాత్రి 11 గంటలైంది. నా కడుపులో సెకనుకో ఆకలి గంట మోగుతోంది.చివరికి తెగించి అడిగేశాను. అయ్యా భోజనం పెట్టించండి అని! హోస్ట్ ఆశ్చర్యపోయారు. ‘అదేంటి..అప్పుడే భోజనమా? ఆహ్వానించిన వారిలో చాలామంది రానే లేదు’ అన్నారు. ఆయన దయాశీలి! నా కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను తెలివి తెచ్చుకున్నాను. ఏ పార్టీకి వెళ్లినా చెప్పిన టైంకు కనీసం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ‘బేగం’ దావత్! త్వరగా వెళ్లి త్వరగా ఇంటికి రావాలనుకున్నా, లేదా పార్టీ ముగిసేంతవరకూ ఉండి రావాలనుకున్నా.. హైద్రాబాద్ పార్టీలకు భోంచేసి వెళ్లడం మంచిది. నిజాంకు అత్యంత సన్నిహిత కుటుంబీకులు పైగాలు. ఆ వంశానికి చెందిన వలీ ఉద్ దౌలా నిజాంకు ప్రధానిగా పనిచేశారు. ఆయన శ్రీమతి(బేగం) ఓసారి తమ స్వగృహం విలాయత్ మంజిల్ (బేగంపేటలోని ఇప్పటి కంట్రీ క్లబ్)లో డిన్నర్‌కు పలిచారు. టైంకు వెళితే బావుండదు కదా! కొంచె ఆలస్యంగానే వెళ్లాను! ఇదిస్వీకరించండి, అది స్వీకరించండి అనే మర్యాదల నేపథ్యంలో తేలిన విషయం ఏమిటయ్యా అంటే, అందరిలో నేనొక్కడినే శాకాహారిని! మళ్లీ కడుపు కాలింది. బేగంగారు ఇతర ముఖ్యులు శ్రద్ధతో వాకబు చేశారు. యురేకా! ‘పుడ్డింగ్’! ప్రెజెంటేషన్ : పున్నా కృష్ణమూర్తి -
భలే బోన్సాయ్...
-
ముందంజలో శివ నాగరాజు
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ 0-7 కేటగిరీలో శివ నాగరాజు ముందంజలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ గోల్ఫ్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్, కంట్రీ క్లబ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శివ నాగరాజు 74 గ్రాస్ స్కోర్‌తో ముందంజలో కొనసాగుతున్నాడు. నరేష్ (76) రెండో స్థానంలో, హరిధర్ రెడ్డి (78) మూడో స్థానంలో ఉన్నారు. 8-12 కేటగిరీలో సంతోష్ 69 నెట్ స్కోరుతో ఆధిక్యంలో నిలిచాడు. అయితే తనతో పాటు అశోక్ రెడ్డి (69) సమాన స్కోరుతో రెండో స్థానంలో ఉండగా, ప్రవీణ్ (70) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 13-18 కేటగిరీలో అగ్రస్థానంలో ఉమేష్ గుప్తా(60), మనోజ్ (63), హుస్సేన్ (65) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే 0-7 కేటగిరీలో 10 మంది, 0-8, 13-18 కేటగిరీల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. -
క్లబ్బులో ‘సంజన’
-
‘సేవ’పై నిఘా
సాక్షి, గుంటూరు :‘స్వచ్ఛంద సేవ’ ముసుగులో ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్ఎంపీ, హిమ్, కంట్రీక్లబ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ వసూళ్ల దందా తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి పేర్లతో కార్య కలాపాలు సాగిస్తున్న సంస్థల వివరాలను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల కిందట ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో స్వచ్ఛంద సంస్థలపై సర్వే ప్రారంభించగా, పోలీసు, ఇంటెలిజెన్స్ సిబ్బంది బోగస్ సంస్థలను గుర్తించే పనిలో ఉన్నారు.జిల్లాలో అధికమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలను పరిశీలిస్తే హైదరాబాద్, ప్రకాశం జిల్లాల తరువాత స్థానం గుంటూరుదే కావడం గమనార్హం. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా 20,620 స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అయితే కేవలం నాలుగువేలకు పైగా సంస్థలు మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిని కొందరు స్వశక్తితో నడుపుతుండగా, మరికొందరు డొనేషన్ల ద్వారానే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 16,980 సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెన్యువల్‌కు పరిమితమయ్యాయి.శాఖల వారీగా... జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ అర్గనైజేషన్ పేరుతో 1100 స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేషన్, రీసెర్చ్ పేరుతో 5,578, కల్చరల్, రిక్రియేషన్ 2,116, సోషల్ సర్వీస్ 3,854, ఎన్విరాన్మెంట్ 47, హౌసింగ్ డెవలప్మెంట్ 3 వేలకు పైగా, లా అండ్ అడ్వకేట్ అండ్ పాలిటిక్స్ పేరుతో 8, ఇంటర్నేషనల్ స్థాయిలో 28, రిలీజియన్స్ పేరుతో 574, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ అండ్ యూనియన్స్ 939, ఇవికాక మరో 5,907 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని జిల్లా ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఐటీ మినహాయింపునకు... స్వచ్ఛంద సేవా సంస్థలను నెలకొల్పే ఉద్దేశం ఏమైనప్పటికీ వాటిని స్వార ్థప్రయోజనాలకు వాడుకుంటున్న ఉదంతాలు అనేకం. మత సంస్థలు కాకుండా కొందరు రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పేరొందిన వ్యక్తులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఎవరికివారు సంస్థలు నడుపుతున్నారు. వీరి స్నేహ బంధాలను ఉపయోగించుకుని డొనేషన్ల రూపంలో రసీదులు రాయించడం వాటిని ఐటీ రిటర్న్స్‌కు చూపడం పరిపాటిగా మారింది. కొన్ని సంస్థలు గ్రామాల్లో అమాయక ప్రజలను గ్రూపులుగా విభజించి వారితో వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టించడం రెట్టింపు వస్తుందని నమ్మించడం, పర్యటన ప్యాకేజీలంటూ డబ్బులు కాజేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో ఓ సంస్థ వెనుకబడిన వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ ఒక్కో కుటుంబం నుంచి రూ.5 వేలు వసూలు చేసింది. ఆర్ఎంపీ, హిమ్ సంస్థల వ్యవహారం గుప్పుమనడంతో ఇళ్లు కట్టిస్తానన్న ప్రతినిధులు కూడా మాయమయ్యారు.రంగంలోకి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం .. బోగస్ సంస్థల గురించి ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తుండగా, పోలీసు ఇంటెలిజెన్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నరసరావుపేట డివిజన్లో మొత్తం 5,300 స్వచ్ఛంద సంస్థలు, తెనాలి డివిజన్లో 5,538 సంస్థలు రిజిస్టర్ కాగా, వీటిల్లో 1,284 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. మిగిలినవి కాగితాలకే పరిమితమని అధికారుల అభిప్రాయం. -
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ వేడుకలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పది నగరాలతో పాటు మధ్యప్రాచ్యంలోని దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, దోహాలో ఈ ఏడాది డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి తెలి పారు. రాఖీ సావంత్, షెఫాలీ జరీవాలా వంటి తారలు పాల్గొంటారని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో సినీ తార చార్మి పాల్గొంటారని ఆయన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. దేశీయంగా ఢిల్లీ, ముంబై, జైపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే వేడుకల్లో ఆర్తి చాబ్రియా, పాయల్ రోహత్గీ తదితరులు సందడి చేయనున్నట్లు రాజీవ్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. కొత్త సంవత్సర సంరంభాల్లో ఆసియాలోనే ఇవి అతి పెద్ద వేడుకలని, వీటిని ఎనిమిదోసారి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి కోసం కసరత్తు ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం కంట్రీ క్లబ్లో నాలుగు లక్షల దాకా సభ్యులున్నారని ఆయన తెలియజేశారు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, బ్రిటన్ దేశాల్లో కూడా తమ కార్యకలాపాలు విస్తరించామని రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఇటీవలే హెల్త్, ఫిట్నెస్ రంగంలోకి కూడా ప్రవేశించామన్నారు. ఇప్పటికే 20 ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయని, వచ్చే ఏడాది మరో 30 ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తమ పేజీకి 2.50 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని రాజీవ్‌రెడ్డి తెలిపారు.