
సనత్‌నగర్: బాలీవుడ్ తార సోహా అలీఖాన్ బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో సందడి చేశారు. కంట్రీక్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘మిలీనియర్స్ క్లబ్’ను బుధవారం ఆమె ప్రారంభించారు. తనకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని, నా బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచిందని చెప్పుకొచ్చారు. మా అత్త గారు ఇక్కడే బేగంపేటలో ఉండేవారని, తరచూ హైదరాబాద్ వస్తానన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్‌లో నటిస్తానన్నారు. ఫ్యామిలీ క్లబ్బింగ్, హాలిడే, ఫిట్‌నెస్, లీజర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి కంట్రీక్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ల్యాండ్‌మార్క్‌గా మారిందన్నారు. ముంబయ్‌లోని కంట్రీక్లబ్‌కు తాను తరచూ వెళ్తుంటానని, తనకిష్టమైన చికెన్ టిక్కాను తింటానన్నారు. కంట్రీక్లబ్ సీఎండీ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్ళలో ఒక మిలియన్ కుటుంబాలు కంట్రీక్లబ్‌లో సభ్యులుగా చేరతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment