అడ్డంగా బుక్కైన బేగంపేట్‌ ఏసీపీ | Begumpet ACP slaps Woman in-front of Media | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 11:03 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

Begumpet ACP slaps Woman in-front of Media - Sakshi

మహిళ పై చెయ్యి చేసుకున్న బేగంపేట్‌ ఏసీపీ రంగారావు

సాక్షి, హైదరాబాద్‌ : బేగంపేట్‌ ఏసీపీ రంగారావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓ మహిళపై మీడియా ముందే చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఈ వీడియో వైరల్‌ అవుతుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నెల 9వ తేదీన బొల్లారం పయొనీర్‌ బజార్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ముగ్గురు మహిళలను, దొంగసొత్తును అమ్ముతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆపై జర్నలిస్టుల ముందే ఏసీపీ రంగరావు మహిళ దొంగపై చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement