rangarao
-
రచయితలు నన్ను తిట్టుకునేవారు..!
-
TS: విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు చార్జీల షాక్ తగలనుంది. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సబ్సిడీలు సర్దుబాటు చేశాక 2022–23కు సంబంధించిన రూ.10,928 కోట్ల భారీ ఆర్థిక లోటును పూడ్చడానికి భారీగా విద్యుత్ చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేకుం డాపోయింది. అయితే చార్జీల పెంపు ద్వారా ఎంత మేరకు ఆర్థిక లోటును పూడ్చుకోవాలన్న దానిపై త్వరలో ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులపై ప్రత్యక్షంగా రూ.2వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.2వేల కోట్ల వరకు చార్జీల పెంపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పెంపుపై స్పష్టత ఇవ్వని డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికతో పాటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల (రిటైల్ టారిఫ్ షెడ్యూల్) ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పిం చాల్సి ఉంది. మంగళవారం ఏఆర్ఆర్ నివేదికలు అందజేసిన పంపిణీ సంస్థలు.. చార్జీల పెంపు ప్రతిపాదనలను మాత్రం వాయిదా వేసుకున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. డిస్కంలు వీటిని సమర్పిస్తేనే విని యోగదారుల కేటగిరీల వారీగా విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. డిస్కంల ప్రతిపాదనలు అందిన తర్వాత నిబంధనల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి చార్జీల పెంపునకు అనుమతిస్తామని శ్రీరంగారావు పేర్కొన్నారు. 2021–22కి సంబంధించిన ఏఆర్ఆర్లను సైతం డిస్కంలు సమర్పించినా, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న మరో 4 నెలల్లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని చైర్మన్ ప్రకటించారు. 2021–22లో రూ.10,624 కోట్ల ఆర్థిక లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, ట్రూఅప్ చార్జీల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. పొంచి ఉన్న ఆరేళ్ల భారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్ చార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలని విద్యుత్ చట్టం పేర్కొంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సరఫరా చేసేందుకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది? ఇందుకు ఎంత వ్యయం కానుంది? ప్రస్తుత చార్జీలతోనే విద్యుత్ సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎంత? ఏర్పడే ఆదాయం లోటు ఎంత? ఈ లోటును పూడ్చుకోవడానికి ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి అనే సమగ్ర అంచనాలు ఏఆర్ఆర్ల్లో ఉంటాయి. తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, ఆ తర్వాత 2016–17లో రెండో/చివరిసారిగా విద్యుత్ చార్జీలు పెంచారు. చివరిసారిగా డిస్కంలు 2018–19కి సంబంధించిన ఏఆర్ఆర్లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. దీంతో 2016–17లో పెంచిన విద్యుత్ చార్జీలే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆరేళ్ల ఆదాయ లోటును ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలుగా డిస్కంలు త్వరలో ఈఆర్సీకి పిటిషన్ సమర్పించే అవకాశం ఉంది. దీనికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి ఆరేళ్ల భారం పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచితే ఆ మేరకు భారం వినియోగదారులపై తగ్గే అవకాశం ఉంది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే, ట్రూ అప్ చార్జీల రూపంలో ఆ తర్వాత వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోమని గత ఈఆర్సీ అప్పట్లో తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలకు కట్టుబడి ఉంటారా అని ప్రస్తుత చైర్మన్ శ్రీరంగారావును విలేకరులు ప్రశ్నించగా.. డిస్కంల నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. ట్రూ అప్ చార్జీలంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు సంబంధించిన మొత్తం వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదించి, దానికి అనుగుణంగా విద్యుత్ టారిఫ్‌ను నిర్ణయిస్తుంది. ఏడాది ముగిశాక ఈఆర్సీ ఆమోదించిన అంచనాలకు మించి ఖర్చు అయితే.. ఆ వ్యత్యాసాన్ని వసూలు చేసుకోవడానికి (ట్రూ అప్ చార్జీల పేరిట) డిస్కంలకు ఈఆర్సీ అనుమతిస్తుంది. -
ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు ఆధారాల్లేవు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో కొందరు రాజకీయ, ఇతర నాయకుల ప్రమేయంతోనే స్మగ్లింగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు వ్యాఖ్యలకు తగిన ఆధారాలు లేవని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు స్పష్టం చేశారు. విశాఖ నుంచి వెళ్లిన ఒక ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ను విచారించిందన్నారు. అందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశామని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర –ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో గంజాయి సాగు శాశ్వత నిర్మూలన ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో సంకల్పించాలని సూచించారు. నల్గొండ పోలీసులు రెండు వారాల ముందు నుంచే విశాఖ ప్రాంతంలో పలు కేసుల విషయమై స్థానిక పోలీసులను సంప్రదించారని, కానీ చింతపల్లి వద్ద కాల్పుల ఘటన విషయమై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సమస్య దశాబ్దాల కాలంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కొంత కాలంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో 2016లో 724 ఎన్డీపీఎస్ కేసులలో 2,290 మందిని అరెస్ట్ చేశామన్నారు. 2017లో 712 కేసుల్లో 2,100 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 812 కేసుల్లో 2,565 మందిని, ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. రెండేళ్లలో విశాఖ పోలీసులు ఏవోబీలో దాదాపు 50 గ్రామాల్లో 800 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల సమాచారం ఉందని ఎవరు చెప్పినా విచారిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. -
రేపు పర్యాటక పురస్కారాల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషిచేస్తున్న ఆ రంగ భాగస్వాములకు పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27న టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను అందించనున్నట్లు పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. 2021 సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిది వెస్టిన్ హోటల్, పార్క్‌హయత్, గోల్కొండ రిసార్ట్స్, దస్పల్లా హోటల్, మృగవని రిసార్ట్స్ అండ్ స్పా, బెస్ట్ వెస్ట్రన్ అశోకా లక్డీకాపూల్, పామ్ ఎక్సోటికా రిసార్ట్, వైల్డ్ వాటర్స్, హైటెక్‌సిటీ ఓహ్రీస్ సాహిబ్ బార్బిక్, తారక రెస్టారెంట్ కరీంనగర్, ప్రశాంత్ హోటల్ మహబూబ్‌నగర్, నోవాటెల్, హెచ్ఐసీసీ కాంప్లెక్స్, రామోజీ ఫిల్మ్‌సిటీ.. బెస్ట్ ఫిల్స్‌కు సంబంధించి కె.రంగారావు, అడ్వెంచర్ క్లబ్, కథనాలకు సంబంధించి యాదగిరి, మహేశ్.. బెస్ట్ హరిత హోటళ్లలో తారామతి బారాదరి కల్చరల్ కాంప్లెక్స్, రామప్ప హరిత హోటల్, అలీసాగర్ హరిత లేక్‌వ్యూ రిసార్ట్స్, గరుడ టూరిజం టూర్ ఆపరేటర్లను పురస్కారాలకు ఎంపిక చేశారు. -
దర్శకుడు కట్టా రంగారావు మృతి
ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారాయన. ‘ఇంద్రధనస్సు’ చిత్రంతో దర్శకుడిగా మారిన రంగారావు ‘ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు’తో పాటు మరికొన్ని చిత్రాలను రూపొందించారు. దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
సొంత పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ చింతమనేని
-
అడ్డంగా బుక్కైన బేగంపేట్ ఏసీపీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఏసీపీ రంగారావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓ మహిళపై మీడియా ముందే చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 9వ తేదీన బొల్లారం పయొనీర్ బజార్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ముగ్గురు మహిళలను, దొంగసొత్తును అమ్ముతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆపై జర్నలిస్టుల ముందే ఏసీపీ రంగరావు మహిళ దొంగపై చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
మహిళపై చెయ్యి చేసుకున్న బేగంపేట్ ఏసీపీ
-
పొందూరు సర్పంచ్ అక్రమ అరెస్టు
► టంగుటూరు పీఎస్‌ను ముట్టడించిన గ్రామస్తులు ► వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో 500 మందితో ధర్నా ► అర్థరాత్రి నుంచి ఉదయం 11 వరకు కొనసాగిన నిరసన ► సంబంధం లేని కేసులో జైలుకు తరలించిన పోలీసులు ► బెయిలు మంజూరు చేసిన జిల్లా కోర్టు ఒంగోలు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అర్ధరాత్రి అరెస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి, రాష్ట్రస్థాయి నాయకుల వరకూ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా టంగుటూరు మండలం పొందూరు గ్రామ సర్పంచ్ రంగారావును తెలుగుదేశం నేతలు అక్రమంగా అరెస్టు చేయించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో రంగారావును అక్రమంగా ఇరికించి అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. 500 మందికి పైగా వైఎస్సార్సీపీ అభిమానులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో పోలీసుస్టేషన్‌కు చేరుకుని గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఉదయం రంగారావును ఒంగోలు జిల్లా కోర్టులో హాజరుపరచడంతో జడ్జి ఆయనకు బెయిలు మంజూరు చేశారు. దీంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఢాకా పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల రామారావు, కొండపి మండల నాయకులు వాకా బాలకృష్ణారెడ్డి, వాకా శ్రీకాంత్‌రెడ్డి, పొందూరు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగారావుపై ఎందుకంత కుట్ర.. పొందూరు గ్రామంలో పోటాపోటీగా జరిగి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధిగా రంగారావు విజయం సాధించి సర్పంచ్ అయ్యారు. దీంతో 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన వ్యాపారాలపై దాడులు చేయంచడం.. ఆయనకు చెందిన ఆస్తులకు నష్టం కలిగించడం చేసిన టీడీపీ నాయకులు.. తాజాగా తనకేమాత్రం సంబంధం లేని ఓ కేసులో పోలీసులను పురమాయించి టంగుటూరు పీఎస్‌కు తరలించారు. దాదాపు 3 వేలకు పైగా ఓట్లున్న పొందూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చిట్నీడి రంగారావు బలమైన నాయకుడు. పైగా రంగారావుకు మాజీ మంత్రి బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబులతో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఆయన రాజకీయంగా ఎదిగితే గ్రామంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందనే భయంతోనే టీడీపీ నాయకులు ఆయనపై అసత్య ప్రచారంతోపాటు, అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. తాజాగా రంగారావుకు ఏమాత్రం సంబంధం లేని కేసులో ఇరికించడం ద్వారా తమ అధికార ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించింది. కానీ పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు తరలిరావడంతో వారి ఆటలు సాగలేదు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ఆటలు సాగబోనివ్వమని స్పష్టం చేశారు. -
‘మా ప్రజాప్రతినిధులకు సంపాదనే ధ్యేయం’
కొవ్వూరు : టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా తప్పులు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేవీకే రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయనొక ప్రకటన చేస్తూ డబ్బు సంపాదించుకుకోవాలన్న ఆరాటంతో ప్రజాప్రతినిధులమనే మాట మరిచిపోయి ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు చేస్తున్నారన్నారు. వారివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఇలాంటి వారివల్ల పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న వారికి చెట్టపేరు వస్తోందన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని స్వార్థంతో డబ్బు సంపాదన కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓ ప్రజాప్రతినిధి కుమారదేవం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి రభస చేయడం విచారకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుడు రంగారావు (60) బుధవారం సాయంత్రం రాజీవ్ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొని అతడిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో రంగారావు ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. -
రావుగారు వెనక్కి...
హన్మకొండ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫ రా సొసైటీ లిమిటెడ్ (సెస్) ఎండీ రంగారావు తిరిగి పాత స్థానానికే బదిలీ అయ్యారు. ఈనెల 21న జరిగిన ఎస్ఈల బదిలీల్లో ప్రాజెక్టు జీఎం గా ఉన్న రంగారావు సెస్ ఎండీగా నియమితులయ్యారు. అయితే గతంలో సెస్ ఎండీగా పని చేసిన సమయంలో రంగారావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ స్థానం లో రంగారావును నియమించడంపై విమర్శ లు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను తిరిగి పాత చోటికే బదిలీ చేశారు. సెస్ ఎండీగా ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా ఉన్న రామకృష్ణను నియమిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రావుగారి కథ.. 2007-10 మధ్య కాలంలో సెస్ ఎండీగా రంగారావు పని చేశారు. అప్పుడు రూ.4 కోట్ల సొ మ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడేళ్ల కాలంలో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పేరిట చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద మొత్తంలో దుర్వినియోగమయ్యాయనే ఫిర్యాదులు అందాయి. ఈ బాగోతం విచారణ నిమిత్తం అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా ఎన్పీడీసీఎల్ నియమించింది. రంగారావు హయాంలో సెస్ పరిధిలో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, మైనర్ ఎక్స్టెన్షన్ విభాగాలుగా మొత్తం 3,207 పనులు జరిగాయి. అందులో కేవలం 1,837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1,370 పనుల ను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవడంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం అయ్యాయంటూ గమనించారు. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయిం చి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు విచారణ కమి టీ నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి పక్కదారి పట్టించినట్లు వేలెత్తిచూపింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయం ఉందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రంగారావును సెస్ ఎండీగా నియమించడంతో పాత ఫైల్ బయటకు వచ్చింది. విజిలెన్స్, డిపార్ట్మెంట్ విచారణ నివేదికలను సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. రంగారావును అక్కడ నుంచి తప్పించాలని, మరిన్ని పనులపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన అక్కడ ఉంటే విచారణకు అడ్డుగా ఉంటుందని అధికారులకు సూచించారు. -
మొదటి జెడ్పీ చైర్మన్ రంగారావు
భైంసా, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్. కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన ఆయనను సమితి అధ్యక్షులు చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. జిల్లా ఆవిర్భావం 1959 నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతోంది. 1987లో జెడ్పీ చైర్మ న్ ఎన్నిక తొలిసారిగా ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. 1987లో మండల వ్యవస్థ ఏర్పడకముందు సమితి అధ్యక్షులు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు. అప్పట్లో సర్పంచులు సమితి అధ్యక్షులను ఎన్నుకునే పద్ధతి ఉండేది. ప్రతి తాలూకాలో ఇద్దరు సమితి అధ్యక్షులు ఉండేవారు. అప్పట్లో జిల్లాలో తొమ్మిది తాలుకాల పరిధిలో 18 మంది సమితి అధ్యక్షులు, వీరు ఎన్నుకునే ఆరు కో ఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు. మొదటి చైర్‌పర్సన్‌గా పల్సికర్ రంగారావు 29-11-1959 నుంచి 26-1-1960వరకు ఒక పర్యాయం, 29-05-1961 నుంచి 10-9-1964 వరకు రెండో పర్యాయం జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో... జిల్లాలో జెడ్పీ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు 1987లో ఒక్కసారే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపొందారు. అప్ప ట్లో మండల అధ్యక్షుల ఎన్నికలు ప్రత్యక్షంగానే జరిగాయి. ఆ తర్వాత నుంచి అన్ని పరోక్ష ఎన్నికలతోనే జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు. ఊరిపేరే ఇంటిపేరు.. మహారాష్ట్ర సరిహద్దులోని పల్సి గ్రామానికి చెందిన రంగరావు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతోమంది వచ్చేవారు. మహారాష్ట్ర వాసులకు పెద్దమొత్తంలో ఇక్కడి వారితో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉండేవి. వ్యాపార లావాదేవీలతోపాటు బంధుత్వాలు మెండుగానే ఉండేవి. అలా రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది.. రంగారావు పల్సికర్ అని పిలిచేవారు. ‘మహా’ మాజీ సీఎం పల్సి అల్లుడే.. రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలికి విలాస్‌రావు దేవ్ముఖతో వివాహం జరిపించారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రంగారావు మరణించినప్పుడు పెద్దకర్మ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ పల్సికి వచ్చి వెళ్లారు. విలాస్‌రావు కుమారుడు, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వివాహం 2012 ఫిబ్రవరిలో నటి జెనీలియాతో జరిగింది. ఆ జంటను ఆశీర్వదించేందుకు అప్పట్లో ఈ ప్రాంత వాసులకు ఆహ్వానం అందింది. వైఎస్సార్ చొరవతో.. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా దివంగత ముఖ్యమం త్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు రంగారావు పల్సికర్ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎర్రదండు గర్జన
ఖమ్మం/ ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం..జిల్లా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కదంతొక్కింది. పోరుగర్జన పేరిట ఖమ్మంలో బుధవారం భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివచ్చారు. తమ సమస్యలపై గర్జించారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. పలు రకాల డిమాండ్లను సభ ముందు ఉంచారు. ఆంక్షలు లేని ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు, ముంపు ప్రాంతాలను తెలంగాణ నుంచి విడదీయరాదు, పోడు భూములకు పట్టాలివ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, గ్రీన్‌హంట్ ఆపరేషన్లు నిలిపివేయాలి, తెలంగాణ ఉద్యమ వీరుల విగ్రహాలను హైదరాబాద్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి...మొత్తం 28 డిమాండ్లను పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు సభ ముందుంచారు. వీటికి సభ ఆమోదం తెలిపింది. జిల్లాలోని గిరిజనులు, ఇతర అట్టడుగు వర్గాలకు ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందినప్పుడే ఆరు దశాబ్దాల కల సాకారమైనట్టని సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యమకారులు చూపిన పోరాట పటిమ చిరస్మరనీయమన్నారు. వేలాదిమంది తెలంగాణ అమరుల త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. రాష్ట్రం వస్తుందనే సంతోషం ఉన్నా.. జిల్లాలోని గిరిజనులు, కొండరెడ్లు, కోయ, ఇతర ఆదివాసీలు, వారి సంస్కృతి జలసమాధి అవుతుందనే బాధ వెంటాడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినంత మాత్రాన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని దేవత అని సంబోధించడం సరికాదన్నారు. 60 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు జంకి జంకి రాష్ట్రం ఇచ్చారన్నారు. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన జిల్లాలో సమస్యలు తీరవని, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిందే అన్నారు. పోలవరం ముంపు, సింగరేణి ఓపెన్‌కాస్టుల విధ్వంసం, టేల్పాండ్ భూముల నష్టం...తదితర అంశాలు మనముందు శాపాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన, మైనింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధి మార్గాలు చూపడం వంటి లక్ష్యాలు మనముందున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ అన్నారు. అంగన్వాడీలు, బీడీ, పారిశుధ్య మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు పోరుపథంలో నడిచి తెలంగాణ ఉద్యమానికి శక్తిని ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పంజాబ్ నాయకులు ఎస్ఎస్ మాల్, రాష్ట్ర నాయకులు గాదె దివాకర్, బలచంద్ర సంగిడి, కెచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, జేఏసీ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, కూరపాటి రంగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఖాజామియా, అరుణోదయ కళాకారులు నాగన్న, రామారావు, సురేష్, ఎన్డీ నాయకులు చంద్ర అరుణ, జగ్గన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పీవైఎల్ నాయకులు పుల్లయ్య, మాదా భిక్షం, చిల్లగుండ నాగేశ్వరరావు, ఆవులు వెంకటేశ్వర్లు, చలపతి పాల్గొన్నారు.