
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషిచేస్తున్న ఆ రంగ భాగస్వాములకు పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27న టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను అందించనున్నట్లు పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. 2021 సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు.
వివిధ కేటగిరీలకు సంబంధించిది వెస్టిన్ హోటల్, పార్క్‌హయత్, గోల్కొండ రిసార్ట్స్, దస్‌పల్లా హోటల్, మృగవని రిసార్ట్స్ అండ్ స్పా, బెస్ట్ వెస్ట్రన్ అశోకా లక్డీకాపూల్, పామ్ ఎక్సోటికా రిసార్ట్, వైల్డ్ వాటర్స్, హైటెక్‌సిటీ ఓహ్రీస్ సాహిబ్ బార్‌బిక్, తారక రెస్టారెంట్ కరీంనగర్, ప్రశాంత్ హోటల్ మహబూబ్‌నగర్, నోవాటెల్, హెచ్‌ఐసీసీ కాంప్లెక్స్, రామోజీ ఫిల్మ్‌సిటీ.. బెస్ట్ ఫిల్స్‌కు సంబంధించి కె.రంగారావు, అడ్వెంచర్ క్లబ్, కథనాలకు సంబంధించి యాదగిరి, మహేశ్.. బెస్ట్ హరిత హోటళ్లలో తారామతి బారాదరి కల్చరల్ కాంప్లెక్స్, రామప్ప హరిత హోటల్, అలీసాగర్ హరిత లేక్‌వ్యూ రిసార్ట్స్, గరుడ టూరిజం టూర్ ఆపరేటర్లను పురస్కారాలకు ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment