‘మా ప్రజాప్రతినిధులకు సంపాదనే ధ్యేయం’
Published Wed, Mar 15 2017 1:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
కొవ్వూరు : టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా తప్పులు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేవీకే రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయనొక ప్రకటన చేస్తూ డబ్బు సంపాదించుకుకోవాలన్న ఆరాటంతో ప్రజాప్రతినిధులమనే మాట మరిచిపోయి ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు చేస్తున్నారన్నారు. వారివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఇలాంటి వారివల్ల పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న వారికి చెట్టపేరు వస్తోందన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని స్వార్థంతో డబ్బు సంపాదన కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓ ప్రజాప్రతినిధి కుమారదేవం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి రభస చేయడం విచారకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Advertisement