dist
-
శ్రీ సత్యసాయి జిల్లాలో అతి పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం
-
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
కొమరంభీం జిల్లాలో భారీ బియ్యం కుంభకోణం
-
2న గవర్నర్ రాక
ఏలూరు (మెట్రో) : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 2న ఉదయం 11.30 గంట లకు విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు ద్వారకా తిరుమల వస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వారకా తిరుమల నుంచి హెలికాప్టర్లో గన్నవరం చేరుకుంటారు. -
‘మా ప్రజాప్రతినిధులకు సంపాదనే ధ్యేయం’
కొవ్వూరు : టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా తప్పులు చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేవీకే రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయనొక ప్రకటన చేస్తూ డబ్బు సంపాదించుకుకోవాలన్న ఆరాటంతో ప్రజాప్రతినిధులమనే మాట మరిచిపోయి ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు చేస్తున్నారన్నారు. వారివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఇలాంటి వారివల్ల పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న వారికి చెట్టపేరు వస్తోందన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని స్వార్థంతో డబ్బు సంపాదన కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓ ప్రజాప్రతినిధి కుమారదేవం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి రభస చేయడం విచారకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇలాగైతే కష్టం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ‘ఇలా అయితే కష్టమే. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సరికాదు. అందరూ కలిసి పనిచేయండి. జిల్లాకు ఏం కావాలో ప్రతిపాదనలు ఇవ్వండి. మీ జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. మంగళవారం రాత్రి అమరావతిలోని తన కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన వ్యతిరేక కథనాలను చదివి విని పించారు. వాటిపై సంబంధిత ప్రజాప్రతినిధులను వివరణ కోరారు. ఇందులో ఎక్కువ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలే ఉన్నాయి. కామవరపుకోట మండ లంలో ఉద్యాన శాఖలో అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై చర్చ నడిచింది. మంత్రి పీతల సుజాత స్పందిస్తూ ఈ అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నారని, త్వరలో బాధ్యులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కుంభకోణంలో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండగా, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాత్రం వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఎంపీ మాగంటి బాబు–పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, మాగంటి బాబు–మంత్రి పీతల సుజాత మధ్య గల విభేదాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కామవరపుకోటలో సినిమా థియేటర్ విషయంలో మంత్రి పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్ మధ్య వివాదంపైనా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ‘అది మంత్రి నియోజకవర్గం. అక్కడ నీకేం పని’ అంటూ చింతమనేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ‘పార్టీ కోసం కష్టపడుతున్నావు... ఇలా మిగిలిన వారితో విభేదాలు పెట్టుకుంటే బలహీనం అవుతావు కదా. నువ్వు కూడా మారాలి’ అంటూ మంత్రి సుజాతకు సూచన చేశారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌కు కూడా ఎమ్మెల్యేలు, కిందిస్థాయి కార్యకర్తలను కలుపుకుపోవాలంటూ హితవు పలికినట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో నెలకొన్న వివాదంపైనా చర్చ సాగింది. బీజేపీ మిత్రపక్షం కావడంతో సాధ్యమైనంత వరకూ సర్దుకుపోవాలని, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడిని ఈ వివా దాన్ని పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అభినందించారు. తాడేపల్లిగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా నేతలు సీఎంను కోరారు. -
సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిది
భీమవరం : ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా 35వ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇచ్చేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గృహిణిగా సామాన్య జీవితం సాగిస్తున్న తాను మునిసిపల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలిగా ముందుకు వెళ్లడానికి పాత్రికేయుల సహకారం ఎంతో ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిజంపై 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అయితే వీరికి హెల్త్‌కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వాంధ్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందరం మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రత్యేక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని, ఆత్మగౌరవ పింఛన్లు ఇవ్వాలని, రూ.20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటుచేయాలని తీర్మానం చేస్తున్నట్టు చెప్పారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రఘురామ్ అధ్యక్షత వహిం చగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మ¯ŒS కొటికలపూడి గోవిందరావు, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మ¯ŒS గోకరాజు మురళీరంగరాజు, అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ఎలక్టాన్రిక్స్ మీడియా జిల్లా అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వానపల్లి సుబ్బారావు కార్యదర్శి నివేదిక అందించగా యర్రంశెట్టి గిరిజాపతి స్వాగతం పలికారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ప్రధాన కార్యదర్శిగా వాకల సత్యసాయిబాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కంకిపాటి మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా గజపతి వరప్రసాద్, ఎంవీ గంగాధరరావు, పీటీ వెంకటేశ్వరరావు, డీవీ రామాంజనేయులు, బి.మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్కే రియాజ్, టి.స్వామి అయ్యప్ప, యడ్లపల్లి శ్రీనివాస్, డీవీఎల్ఎ¯ŒS స్వామి, కె.కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా డెస్క్ జర్నలిస్టులు ఎస్కే శ్రీనివాసరెడ్డి, బీఎస్ రెడ్డి, బి.పీటర్, కార్యవర్గ సభ్యులుగా డీవీ భాస్కరరావు, కేవీవీ సత్యనారాయణతో పాటు మరో 17 మందిని, ఎలక్టాన్రిక్ మీడి యా అధ్యక్ష, కార్యదర్శులుగా కె.మాణిక్యరావు, పి.రవీంద్రనాథ్, చిన్నపత్రికల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిౖMðనట్టు ఎన్నికల అధికారి గంగాధరరెడ్డి ప్రకటించారు. -
అనాలోచిత నిర్ణయాలవల్లే కష్టాలు
రాజంపాలెం(గోపాలపురం) : పెద్దనోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని, ఇలాంటి నిర్ణయాల వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని విమర్శించారు. గోపాలపురం మండలం రాజంపాలెంలో ఆదివారం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మండల కన్వీనర్ పడమటి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన గపడగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అస్తవ్యస్త విధానాల వల్ల జిల్లాలో అభివృద్ధి కుంటుపడిదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం విజయవంతమైందని, దీనిలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనకు త్వరలో శుభం కార్డు పడనుందని, వై.ఎస్.జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సువర్ణ పాలన వస్తుందని నాని పేర్కొన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చంద్రబాబు రెండునాల్కల ధోరణి మరోసారి బట్టబయలైందని ఆళ్లనాని విమర్శించారు. పెద్దనోట్లు రద్దు విషయం ముందే తెసుకున్న చంద్రబాబు నాయడు ఏడాది క్రితమే రూ.వెయ్యి రూ.500నోట్లు రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖరాశారని, రద్దయిన తర్వాత ప్రజల ఇబ్బందులు చూసి కేంద్రానికి లేఖ రాశానని చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రుల సలహా సంఘానికి ఆయనను కేంద్రం కన్వీనర్‌గా నియమించగానే ఆ లేఖ సంగతి మరిచిపోయారని, కేంద్రానికి వంతపాడుతున్నారని ఆళ్లనాని ధ్వజమెత్తారు. ప్రజల అవస్థలను పట్టించుకోలేని చంద్రబాబునాయుడు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దులో చంద్రబాబునాయుడు ప్రధాన సూత్రదారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జి పోల్నాటి బాబ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చెలికాని రాజబాబు, జిల్లా క్రమశిక్షణాసంఘం సభ్యులు పోతుల రామతిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు చనమలశ్రీనివాస్, పాముల పర్తి శ్రీనివాస్, కామిశెట్టి మల్లిబాబు, చిన్నం గంగాధర్, ఇళ్ళ భాస్కరరావు, కాండ్రేకుల శ్రీహరి పాల్గొన్నారు. -
భద్రాచలం జిల్లా కోసం ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష
భద్రాచలం: ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను జిల్లా కేం ద్రం చేయాలని, వాజేడు, వెం కటాపురం మండలాలను భూపాలపల్లిలో కలపొ ద్దంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొమరం ఫణీశ్వరమ్మ వేర్వేరు శిబిరాల్లో గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. కేసీఆర్ సొంత జాగీరులా వ్యవహరిస్తూ.. స్వార్థ రాజకీయాల కోసం బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు జిల్లాలను మంత్రులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. భద్రాచలం జిల్లా చేయాలని తాము మొదటి నుంచీ పట్టుబడుతున్నామని గుర్తుచేశారు. నా ప్రాణాలైనా ఇస్తా: ఫణీశ్వరమ్మ ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి కొమరం ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన భద్రాచలంపై సీఎం కేసీఆర్‌కు ఎందుకింత చిన్నచూపు అని ఆమె ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీతోపాటు దళిత, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించారుు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా చేయాలనే డిమాండ్‌తో గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య వెంకటాపురంలో పాదయాత్ర చేపట్టారు. -
నూతన జిల్లాల పేరుతో మోసం
గుండాల : ప్రజా సమస్యలను పక్కనబెట్టి నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయం మేరకు నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తూనే అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతుందన్నారు. భువనగిరితో 70 సంవత్సరాల శాస్త్రీయ సంప్రదాయ సంబంధాలు కలిగిన గుండాల మండలాన్ని ఆలేరు నియోజకర్గం నుంచి జనగామలో కలపడం సిగ్గుచేటని విమర్శించారు. గుండాల మండలంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యుల నుంచి మొదలు కొని ఎంపీపీ, జెడ్పీటీసీల వరకు రాజీనామా చేసి ఆమోదింపజేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం కలిగి గుండాల మండలాన్ని యాదాద్రిలో కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులచే రాజీనామాలు చేయించి ఆమోదింప చేయించుకునే బాధ్యత తమదేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అ«ధ్యక్షుడు బబ్బూరి సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ దుంపల శ్రీనువాస్, తుర్కలషాపురం సర్పంచ్ పురుగుల మల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు బూడిద రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజరత్నం, నాయకులు బండారు వెంకటేష్, బిక్షం, తదితరులు ఉన్నారు. -
రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు, దేవరకొండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కలుపుతూ రాచకొండ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆ«ధ్వర్యంలో బుధవారం సంస్థాన్ నారాయణపురంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఉన్న నారాయణపురం మండలాన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం యాదాద్రిలో కలపాలని చూడడం సరైంది కాదన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేశామన్నారు. ఎంతో చారిత్రక ప్రాంతమైన రాచకొండను జిల్లాగా చేయాలని, లేకపోతే ప్రజల అభీష్టం మేరకే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏర్పుల సుదర్శన్, బద్దుల కృష్ణయ్య, రాసమళ్ల యాదయ్య, ఎండీ.రహీంషరీఫ్, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, జక్కిడి మేఘారెడ్డి, సూరపల్లి శివాజీ, వలిగొండ యాదయ్య, కుందారపు యాదయ్య, బైకని నరేందర్, ఉప్పల శ్రీను, చంద్రారెడ్డి, యాదయ్య, భిక్షం, యాదగిరి తదితరులున్నారు. -
లక్ష మందితో జనగామ జనగర్జన
జనగామ : జనగామ జిల్లా సాధనే లక్ష్యంగా ప్రజ లను మరితం చైతన్యవంతం చేస్తూ, ప్రభుత్వా న్ని మేలుకొలిపే విధంగా జనగామలో జనగర్జన సభ నిర్వహిస్తామని జేఏసీ చైర్మను ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీగార్డెనులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి జిల్లా ఉద్యమం వరకు ప్రాణాలర్పించిన ఉద్యమకారులను స్మరిస్తూ మైదానానికి అమరుల ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. లక్ష మంది జనంతో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు ఆరు రోజులపాటు నిర్వహించే కార్యాచరణ రూపొం దించామన్నారు. మానవహారాలు, బైక్ ర్యాలీలు, ఇంటిట ప్రచారం, డప్పుచాటింపు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని అన్నారు. మండల, గ్రామ స్థాయి జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. 14న జనగామలో పది వేల మందితో మానవహారం, 16న పట్టణం నుంచి రెండు రూట్లలో 400 బైక్‌లతో గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు. ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించిన ఆయా గ్రామాల జేఏసీలు బైక్‌ర్యాలీగా వచ్చిన ప్రతినిధులకు వాటిని అప్పగించాలని సూచించారు. అదేరోజు అన్ని గ్రామాల్లో ఇంటిటికీ బొట్టు పెట్టి జనగర్జన సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నా రు. 19న డప్పు చాటింపుతో ప్రచారం చేస్తామన్నారు. నెహ్రూ పార్కు మీదుగా భారీ ర్యాలీ జనగర్జన సభ ప్రారంభానికి ముందు కళాకారుల నృత్యాలు, వేషధారణలతో భారీ ర్యాలీ, ప్రదర్శనగా అమరవీరుల ప్రాంగణం వద్దకు చేరుకుంటామన్నారు. జనగామకు మద్దతుగా వచ్చిన అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అ న్ని వర్గాల వారికి ఆహ్వానం పంపిస్తామన్నారు. సీతారాంపురం, కడవెండి, బైరానుపల్లి మీదుగా వచ్చే అమరుల జ్యోతి ర్యాలీ 10 గంటల వరకు చేరుకుంటుదని వివరించారు. జనగర్జనతో ప్రభుత్వంలో కదిలిక వచ్చేలా చేసే బాధ్యత ప్రజలపై ఉందని, డివిజనులోని అన్ని ప్రాంతాల నుంచి పిల్లా, పాపలతో కలిసి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ¯ŒSలైన్లో సిద్దిపేట జిల్లాపై వచ్చే ఫిర్యాదులను తొలగిస్తున్నారని అనుమానంగా ఉందని, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి వద్దు, జనగామ జిల్లా కావాలని ఇప్పటి వరకు ఆ¯ŒSలై¯ŒSలో పదివేల అభ్యం తరాలు రాగా, లిఖిత పూర్వకంగా మరో 50వేల ఫిర్యాదులు వెళ్లినట్లు వివరించారు. జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీను, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సురేష్, తిప్పారపు విజయ్, బొట్ల శేఖర్, జి.కృష్ణ తది తరులు ఉన్నారు. -
సుపరిపాలనకే జిల్లాల విభజన
చౌటుప్పల్ : ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలనను అందించేందుకు ప్రభుత్వం జిల్లాలను విభజిస్తోందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. చౌటుప్పల్‌లో ఆదివారం రూ.5 కోట్లతో చేపట్టిన కులవృత్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అంకిరెడ్డిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, మహిళల కుట్టుశిక్షణ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాళ్లసింగారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, ఎస్.లింగోటంలో సీసీ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న గౌడ సంఘం భవనాన్ని పూర్తి చేసే పనులను ప్రారంభించారు. అనంతరం జైకేసారంలో సీసీ రోడ్డు, గౌడ సంఘం భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనను ప్రజల అభీష్టం మేరకే చేస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటిస్తామన్నారు. చౌటుప్పల్‌లో రూ.1.50 కోట్లతో నీరా‡ పరిశ్రమను ఏర్పాటు చేయిస్తాననిపేర్కొన్నారు. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిప్పించేందుకు కృషి చేస్తానన్నారు. దివీస్ కంపెనీలో ఉద్యోగాల కోసం కంపెనీ ఎండీతో మాట్లాడుతానన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళాభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ కాయితీ రమేష్‌గౌడ్, సర్పంచ్‌లు బొంగు లావణ్య, సుర్వి మల్లేష్‌గౌడ్, చెన్నగోని విజయలక్ష్మీ, జీండ్రు నిర్మల, ఎం.దయాకరాచారి, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల వరలక్ష్మీ, దాసోజు సుధారాణి, పిట్టల శంకరమ్మ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలి
వరంగల్ రూరల్ జిల్లాకు అనువైన ప్రదేశం అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం పట్టణంలోని వరంగల్ రోడ్డులో రాస్తారోకో నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేస్తే నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించి, కాకతీయలు నిర్మించిన సరస్సు పాకాల పేరును జిల్లాకు నామకరణం చేయాలని జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో గుంటి రాంచందర్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాను రద్దు చేసి ప్రభుత్వం తెరపైకి వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేసుందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలని, ఒకవేళ వరంగల్ రూరల్ జిల్లాలో ప్రభుత్వం కొనసాగించాలనే ఆలోచనకు వస్తే వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రంగా నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలన్నారు. తప్పనిసరిగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం ఏకపక్షంగా తీర్మానించినట్లు తెలిపారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంద్ నర్సంపేటను జిల్లా చేయాలని కోరుతూ పట్టణంలో అమరవీరుల స్థూపంవద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం పలు నినాదాలు చేశారు. ఈనెల 8న బంద్ ప్రకటించినట్లు అంబటి శ్రీనివాస్ తెలిపారు. అయినప్పటికీ నర్సంపేటకు నష్టం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటే ఆమరణ నిరాహర దీక్ష చేపడుతామని తెలిపారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం అఖిలపక్ష కమిటీ సమావేశంలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిపై జేఏసీ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడిన విధానంపై టీఆర్ఎస్ నాయకులు కామగోని శ్రీనివాస్ కల్పించుకొని అభ్యంతరం తెలుపుడంతో జేఏసీ నాయకులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అందరూ సర్దుచెప్పి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొనసాగించారు. జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు : డాక్టర్ జగదీశ్వర్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి నర్సంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రానికి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్అన్నారు. రాజకీయ లబ్ధికోసమే జిల్లాల విభజన : నాడెం శాంతి కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పునర్విభజన ప్రజాభీష్టం మేరకే జరగాలే తప్ప రాజకీయ లబ్ధికోసం చేపట్టకూడదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న పిల్లలకు చాక్లెట్లను పంచిన విధంగా జిల్లాల పంపిణీ చేపట్టడం స రైంది కాదన్నారు. జిల్లాలో ప్రజలను ఏకం చేసి వారి అభిష్టం మేరకే జిల్లా విభజన చేపట్టాల ని, రాజకీయ లబ్ధి కోసం చేపట్టకూడదన్నారు. జిల్లా ఏర్పాటుకు వైఎస్సార్సీపీ పూ ర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. జిల్లా కోసం అ ఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమన్నారు. ప్రజల అభీష్టం మేరకు ముందుకు : నాయిని నర్సయ్య, టీఆర్ఎస్ పట్టణ అ«ధ్యక్షుడు ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు జరుగుతుందని, జిల్లా పునర్వ్యవస్థీకరణలో మా నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. భవిష్యత్తు కార్యాచరణను మా అధినాయకత్వంతో ప్రకటించి, వారి అభిప్రాయాల మేరకు ముందుకు సాగుతామన్నారు. ప్రాతినిధ్యం తగ్గకుండా చూశారు : రాంచందర్, నగర పంచాయతీ చైర్మన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్ని నియోజకవర్గా లు చీలిపోయాయని, మా నేత పెద్ది మాత్రం నర్సంపేట ను ఒకే జిల్లాలో కొనసాగే విధంగా కృషి చేశారన్నారు. ఒకవేళ రూరల్ జిల్లా తెరపైకి వస్తే ఖచ్చితంగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్ అన్నారు. జిల్లా కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్దం : ఎర్ర యాకుబ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వరంగల్ జిల్లాలో నర్సంపేటను కొనసాగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, ఒకవేళ రూరల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలంటే మాత్రం నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కోసం అవసరమైతే ప్రా ణాలకైనా సిద్ధపడుతామన్నారు. -
స్మార్ట్‌గా సాధన
భీమవరం టౌన్ : ప్రజాసాధికార (స్మార్ట్ పల్స్) సర్వే గడువు నాటికి లక్ష్యాన్ని చేరుకోకపోయినా మన జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. ఆగస్ట్ నెలాఖరుకు నూరు శాతం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ గడువు నాటికి జిల్లాలో 74.59 శాతం సర్వే పూర్తయింది. అయితే రాష్ట్రంలో మన జిల్లా ప్రథమస్థానం సాధించడం గమనార్హం. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసాధికార సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వే నత్తనడకన సాగింది. సర్వే ప్రారంభమైన నెల రోజులకు సమస్యలు పరిష్కారం కావడంతో సర్వే ఊపందుకుంది. ఎన్యుమరేటర్లు రేయింబవళ్లు కష్టించి సర్వే చేశారు. 29.83 లక్షల మంది వివరాల సేకరణ జిల్లాలో ఆగస్ట్ నెలాఖరుకు 29,83,878 మందికి సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు. మండలాల్లో 2686 మంది ఎన్యుమరేటర్లు 8,72,527 కుటుంబాలను సర్వే చేసి 24,54,387 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. మునిసిపాలిటిల్లో 658 మంది ఎన్యుమరేటర్లు1,80,109 కుటుంబాలను సర్వే చేసి 5,29,491 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. మండలాల వారీగా సర్వే వివరాలు మండలం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు 1. ఆచంట 15,842 44,292 2. ఆకివీడు 21,138 60,367 3. అత్తిలి 20,476 56,451 4. భీమడోలు 19,190 53,294 5. భీమవరం 23,011 66,101 6. బుట్టాయగూడెం 7,201 20,908 7. చాగల్లు 18,967 53,744 8. చింతలపూడి 25,095 72,547 9. దెందులూరు 19,827 55,378 10. దేవరపల్లి 22,157 63,184 11. ద్వారకాతిరుమల 20,738 58,162 12. ఏలూరు 31,340 92,699 13. గణపవరం 19,168 52,111 14. గోపాలపురం 9,637 26,858 15. ఇరగవరం 20,734 56,201 16. జంగారెడ్డిగూడెం 17,920 51,902 17. జీలుగుమిల్లి 6,224 17,036 18. కాళ్ల 20,167 56,067 19. కామవరపుకోట 16,297 48,880 20. కొవ్వూరు 21,113 59,066 21. కొయ్యలగూడెం 12,039 32,154 22. కుక్కునూరు 4 13 23. లింగపాలెం 5,908 45,879 24. మొగల్తూరు 17,106 51,867 25. నల్లజర్ల 25,113 67,060 26. నర్సాపురం 19,491 56,063 27. నిడదవోలు 21,339 58,899 28. నిడమర్రు 14,493 40,344 29. పాలకోడేరు 19,014 53,173 30. పాలకొల్లు 19,579 54,523 31. పెదపాడు 19,480 55,298 32. పెదవేగి 23,293 68,095 33. పెంటపాడు 21,804 58,490 34. పెనుగొండ 19,341 55,051 35. పెనుమంట్ర 18,846 51,655 36. పెరవలి 22,029 62,229 37. పోడూరు 19,656 56,356 38. పోలవరం 7,662 20,848 39. తాడేపల్లిగూడెం 26,680 74,535 40. తాళ్లపూడి 15,735 44,234 41. తణుకు 18,600 51,247 42. టి.నర్సాపురం 15,927 45,027 43. ఉండి 19,561 52,585 44. ఉండ్రాజవరం 22,335 59,600 45. ఉంగుటూరు 24,531 68,463 46. వీరవాసరం 17,091 49,676 47. వేలేరుపాడు 2 4 48. యలమంచిలి 19,626 55,771 మొత్తం 8,72,527 24,54,387 పురపాలక సంఘాల పరిధిలో.. పట్టణం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు 1. భీమవరం 35,690 1,04,747 2. ఏలూరు 41,345 1,24,408 3. జంగారెడ్డిగూడెం 8,473 25,315 4. కొవ్వూరు 11,543 33,422 5. నర్సాపురం 14,218 41,836 6. నిడదవోలు 10,604 30,468 7. పాలకొల్లు 14,536 43,619 8. తాడేపల్లిగూడెం 20,471 57,421 9. తణుకు 23,229 68,255 మొత్తం 1,80,109 5,29,491 -
సెప్టెంబర్ 2న బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
టూటౌన్ : సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు వచ్చే నెల 2వ తేదిన నల్లగొండలోని సెయింట్ ఆల్ఫెన్సస్ స్కూల్లో ఎంపిక జరపనున్నారు. బాస్కెట్‌బాల్ అండర్–14 బాల బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కరెంట్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాల కొరకు 9848432182 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
శ్రావణం..భక్తిపారవశ్యం
-
26, 27వ తేదీల్లో ఓరియంటేషన్ తరగతులు
విద్యారణ్యపురి : జిల్లాలో ఇన్‌సె్పౖర్ అవార్డు పొందిన విద్యార్థులు, గైడ్ టీచర్లకు ఈనెల 26, 27వ తేదీలల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ తెలిపారు. జిల్లాలో 564 మంది విద్యార్థులు ఇన్‌సె్పౖర్ అవార్డులు పొందారని, వీరితో పాటు గైడ్ టీచర్లకు సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు ఓరియంటేషన్‌కు పంపించాలని సూచించారు. ఈ నెల 26న వరంగల్ డివిజన్ విద్యార్థులు, గైడ్ టీచర్లకు కాజీపేటలోని బిషప్ బెరట్టా హైస్కూల్లో, జనగామ డివిజన్ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు స్టేషన్ ఘ¯Œæపూర్ శివునిపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఓరియంటేషన్ ఉంటుందని తెలిపారు. ఈనెల 27న మహబూబాబాద్ డివిజన్ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు అక్కడి ఫాతిమాహైస్కూల్‌లో, ములుగు డివిజన్ విద్యార్థులు, గైడ్ టీచర్లకు ఆత్మకూరు మండలం ఊరుకొండ అబ్యాస్ హైస్కూల్లో ఓరియంటేషన్ ఏర్పాటుచేశామని డీఈఓ వివరించారు. -
మధ్యతరహా జలాశయాలకు జలకళ
రామప్ప, మల్లూరుకు పెరుగుతున్న వరద మత్తడి పడుతున్న లక్నవరం ఏటూరునాగారంలో అత్యధికంగా వర్షపాతం వరంగల్ : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులన్నీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. గత సంవత్సరం నీరు లేక వెలవెలబోయిన జలాశయాలు ఇప్పుడు నిండుకుండలా మారాయి. లక్నవరం చెరువు పూర్తి స్థామర్థ్యం 34.4 అడుగులు. కొత్తగూడ, నర్సంపేట, ములుగు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 36సెంటీ మీటర్ల భారీ వర్షాలతో లక్నవరం చెరువు నిండిపోయి గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ఈనెల 3వ తేదీ నుంచి మత్తడి పోస్తోంది. లక్నవరం అందాలు తిలకించేందుకు వస్తున్న సందర్శకులకు మత్తడి పడడం అదనపు ఆకర్షణగా తయారైంది. గత నెల వరకు నీరు లేక వెలవెల పోయిన పాకాలకు ఇప్పుడు మెల్లమెల్లగా జలకళ వస్తోంది. పాకా ల చెరువు గరిష్ట నీటి మట్టం 30.3 అడుగులు కాగా 4వ తేదీ నాటికి నీటిమట్టం 21అడుగులకు చేరుకుంది. ఈ వర్షాలు మరో వారం రోజులు పడితే పాకాల మత్తడి పోసే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అ«ధికారులు తెలిపారు. రామప్ప చెరువు గరిష్ట నీటి మట్టం 35ఫీట్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 16అడుగులకు చేరుకుంది. రామప్ప పరివాహక ప్రాం తాల్లో భారీ వర్షాలు లేక పోవడం వల్ల పూర్తి స్థాయిలో వరద రాకపోవడం వల్ల చెరువు నిండలేదు. ప్రస్తుత వర్షాలు ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. జిల్లాలోని నాలుగు మధ్య తరహా ప్రాజెక్టుల నీటి మట్టాలు గురువారం సాయంత్రం వరకు ఇలా ఉన్నాయి. జిల్లాలో మండలాల్లో గడిచిన నాలుగు రోజుల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. చేర్యాల 13.8మి.మీ., మద్దూరు 14.8, నర్మెట 23.4, బచ్చన్నపేట 19.4, జనగామ 9.4, లింగాలఘనపురం 7, రఘునాథపల్లి 18.2, స్టేషన్‌ఘన్‌పూర్ 31.4, ధర్మసాగర్ 55.4, హసన్‌పర్తి 74.4, హన్మకొండ 64.8, వర్ధన్నపేట 26.4, జఫర్‌గఢ్ 20.2, పాలకుర్తి 16.4, దేవరుప్పుల 6, కొడకండ్ల 10, రాయపర్తి 21.8, తొర్రూరు 23.8, నెల్లికుదురు 16.6, నర్సింహులపేట 5.4, మరిపెడ 32.4, డోర్నకల్ 15.8, కురవి 93.2, మహబూబాబాద్ 24.8, కేసముద్రం 31.6, నెక్కొండ 46.8, గూడూరు 61.6, కొత్తగూడ 78.4, ఖానాపూరం 67, నర్సంపేట 61.4, చెన్నారావుపేట 43.4, పర్వతగిరి 25.4, సంగెం 41.2, నల్లబెల్లి 47.8, దుగ్గొండి 62.4, గీసుకొండ 65.6, ఆత్మకూరు 74.6, శాయంపేట 89, పరకాల 68.4, రేగొండ 79.4, మొగుళ్లపల్లి 71.2, చిట్యాల 65.4, భూపాలపల్లి 77.6, గణపురం 81.4, ములుగు 82.4, వెంకటాపూరం 60.4, గోవిందరావుపేట 96, తాడ్వాయి 97.2, ఏటూర్‌నాగారం 117, మంగపేట 104, వరంగల్ 58.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
మునగపాక:జిల్లాస్థాయి ఆహ్వాన వాలీబాల్ పోటీలు ఆగస్టు 12నుంచి మూడు రోజులు నిర్వహిస్తున్నట్టు గ్రామీణ యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి గంగమహేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ పోటీల వివరాలకు8008574728 నంబర్లో సంప్రదిచాలి. -
తెలంగాణ సర్కారీ కాలేజీల హవా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో వివిధ జిల్లాల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిల హవా కొనసాగింది. బాలురతో పోలిస్తే బాలికలు ఎప్పటిలాగానే ప్రతిభ కనబర్చారు. తెలంగాణలోని పది జిల్లాల ఫలితాలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్- రంగారెడ్డి హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన గాయ్రతి జ్యోతి, కావ్య, భార్తవి, రవీంద్ర అత్యుత్తమ పలితాలు సాధించారు. మూసాపేట: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు... కార్పొరేట్ కళాశాలలకు తీసిపోమని నిరూపించారు. గత ఏడాది 50.5 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి ఈ సంఖ్య 72.2కు పెరిగింది. సాధారణ కోర్సుల్లో 314 మంది విద్యార్థులకు 206 మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యలో 104 మంది విద్యార్థులకు 96 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులో (ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్-పీఎస్టీటీ) గాయత్రి జ్యోతి 487 మార్కులు, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ (సీజీఏ)లో స్వాతి 484, అకౌంటింగ్, ట్యాక్సేషన్(ఏటీ)లో ఎ.కావ్య 482 మార్కులు సాధించారు. సీఈసీలో బి.రవీంద్ర 457, ఎంపీసీలో భార్గవి 429, బైపీసీలో పవిత్ర 388 మార్కులు సాధించారు. రాయదుర్గం: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో పేద విద్యార్థినులు సత్తా చాటారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారు. క ళాశాల ఉత్తీర్ణత శాతం 75గా నమోదైంది. ఎంఈసీలో 25 మంది పరీక్షలు రాయగా... 17 మంది ఉత్తీర్ణులయ్యారు. సీఈసీలో 37 మందికి గాను 25 మంది పాసయ్యారు. గౌలిదొడ్డిలోని గురుకుల బాలికల కళాశాలలో ఎంఈసీ చదువుతున్న మాధురి మొత్తం 500 మార్కులకు గాను 483 మార్కులు సాధించింది. ఇదే కళాశాలకుచెందిన స్రవంతి మొత్తం 500 మార్కులకుగాను 479 సాధించింది. గౌలిదొడ్డిలోని టీఎస్‌డబ్ల్యూఆర్(ఐఐటీ-ఎల్టీసీడీ) కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో సత్తా చాటారు. ఈ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిఅఖిల్ ,లీల, ప్రేమ్‌సాగర్ పవిత్ర టాప్‌లో నిలిచారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది 6.21 శాతం పెరిగింది. జిల్లాలో దేవరుప్పల ప్రభుత్వ జూనియర్ కళాశాల 92 శాతం ఉత్తీర్ణతతో టాప్‌గా నిలిచింది. తాడ్వారు, నెల్లికుదురు సంగెం తర్వాతి స్థానంలో నిలిచాయి.పర్కాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 43 మందికి నలుగురే ఉత్తీర్ణత సాధించి అట్టడుగున నిలిచారు. ప్రభుత్వ కళాశాలల్లోని ఒకేషనల్ కోర్సుల్లో 59.35 శాతం ఉత్తీర్ణులయ్యూరు. కాగా జిల్లాలోని 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో రెండు కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో మడికొండ రెసిడెన్షియల్ కాలేజీలో 76 మందికి 76 మంది.. పర్వతగిరి రెసిడెన్షియల్కాలేజీలో 79 మందికి 79 మంది ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో 77 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచారు. జిల్లాలో నాలుగు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీల్లో 75.67 శాతంఉత్తీర్ణత సాధించారు. ఇందులో ములుగు రోడ్డులోని ట్రైబల్ వెల్ఫేర్ ఎక్సెలెన్స్ జూనియర్ కాలేజీ టాప్లోనూ ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ చివరి స్థానంలో నిలిచాయి. మోడల్ స్కూళ్లలో నెల్లికుదురు మోడల్ స్కూల్ 98.46 శాతం ఉత్తీర్ణతతో టాప్లోను, వెంకటాపూర్ మండలంలోని జవహార్‌నగర్ మోడల్ స్కూల్ చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలో ఆరు ఏయిడెడ్ జూని యర్ కాలేజీల్లో డోర్నకల్‌లోని డీ డీ కాలేజీలో 58.57 శా తం ఉత్తీర్ణత సా ధించి టాప్‌లో నిలిస్తే మహబూబియా పంజ తన్ ఏయిడెడ్ కాలేజీలో 100 మందికి ఐదుగురే ఉత్తీర్ణత సాధించారు. కరీంనగర్ జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం 6,866 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 64 మంది పాసై జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారు. రెండవ స్థానాన్ని అదే మండలంలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కైవసం చేసుకుంది. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ మూడో స్థానం పొందింది. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలోనే చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది స్థానంలో నిలిచిన జిల్లా బుధవారం వెలువరించిన ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జీజేసీ బనిగండ్లపాడు నూటికి నూరుశాతం ఫలితాలు సాధించింది. గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 52 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఆదిలాబాద్ ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల కళాశాలలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ బాలికల కళాశాలలు, ఆదిలాబాద్, నార్నూర్, లాల్టెక్డి బాలుర కళాశాలలు కలిపి మొత్తం ఆరు కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 779 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కాగా.. 681 మంది ఉత్తీర్ణత సాధించారు. 98 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇచ్చోడ బాలికల కళాశాల అత్యధికంగా 99.13 శాతం సాధించి మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నార్నూర్ బాలుర కళాశాల 96.48 శాతం సాధించింది. ఆదిలాబాద్ బాలుర కళాశాల 68 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలలో కూడా ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలలో 5,159 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 2,743 మంది ఉత్తీర్ణులయ్యారు. మెదక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 45 శాతం ఉత్తీర్ణ సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రితం సారి కంటే ఈసారి ఒక శాతం ఫలితాలు క్షీణించాయి. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం రాష్ట స్థాయిలో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలో తొగుట జూనియర్ కళాశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా నార్సింగ్ జూనియర్ కళాశాల కేవలం 14 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానానికి పడిపోయింది. కోహీర్: ఇంటర్ ఫలితాల్లో కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో రెండో స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ జయరావు తెలిపారు. మహబూబ్ నగర్ మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 48శాతం ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలో అయిదవ స్థానంలో నిలిచాయి. ఉత్తీర్ణతా శాతంలో జిల్లాలో ప్రథమ స్థానంలో తాడూరు, రెండవ స్థానంలో పెబ్బేరు, కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాల చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల శాతం ఘోరంగా దెబ్బతింది. గత కొన్నేళ్లుగా 90 శాతానికి పైగా ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జీజేసీ నెమ్మికల్‌లో ఈ సంవత్సరం 13.77 శాతం ఫలితాలు సాధించింది. 94.53 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ సంస్థాన్ నారాయణ్‌పూర్ ప్రథమ స్థానంలో ఉండగా, 87.90 శాతంతో జీజేసీ నడిగూడెం 2వ స్థానంలో నిలిచింది. 84.29 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ విజయపురి నార్త్ (నాగార్జునసాగర్) తృతీయ స్థానం పొందింది. జిల్లాలోని నాలుగు ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం 12.02 శాతం ఉత్తీర్ణతే నమోదయ్యింది. సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్ జూనియర్ కాలేజీలో 70 మంది పరీక్ష రాయగా ఒకే ఒక్కడు ఉత్తీర్ణుడయ్యాడు.