సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిది
సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిది
Published Mon, Dec 12 2016 2:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
భీమవరం : ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా 35వ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇచ్చేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గృహిణిగా సామాన్య జీవితం సాగిస్తున్న తాను మునిసిపల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలిగా ముందుకు వెళ్లడానికి పాత్రికేయుల సహకారం ఎంతో ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిజంపై 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అయితే వీరికి హెల్త్‌కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వాంధ్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందరం మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రత్యేక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని, ఆత్మగౌరవ పింఛన్లు ఇవ్వాలని, రూ.20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటుచేయాలని తీర్మానం చేస్తున్నట్టు చెప్పారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రఘురామ్ అధ్యక్షత వహిం చగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మ¯ŒS కొటికలపూడి గోవిందరావు, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మ¯ŒS గోకరాజు మురళీరంగరాజు, అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ఎలక్టాన్రిక్స్ మీడియా జిల్లా అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వానపల్లి సుబ్బారావు కార్యదర్శి నివేదిక అందించగా యర్రంశెట్టి గిరిజాపతి స్వాగతం పలికారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికైంది.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ప్రధాన కార్యదర్శిగా వాకల సత్యసాయిబాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కంకిపాటి మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా గజపతి వరప్రసాద్, ఎంవీ గంగాధరరావు, పీటీ వెంకటేశ్వరరావు, డీవీ రామాంజనేయులు, బి.మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌కే రియాజ్, టి.స్వామి అయ్యప్ప, యడ్లపల్లి శ్రీనివాస్, డీవీఎల్‌ఎ¯ŒS స్వామి, కె.కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా డెస్క్ జర్నలిస్టులు ఎస్‌కే శ్రీనివాసరెడ్డి, బీఎస్ రెడ్డి, బి.పీటర్, కార్యవర్గ సభ్యులుగా డీవీ భాస్కరరావు, కేవీవీ సత్యనారాయణతో పాటు మరో 17 మందిని, ఎలక్టాన్రిక్ మీడి యా అధ్యక్ష, కార్యదర్శులుగా కె.మాణిక్యరావు, పి.రవీంద్రనాథ్, చిన్నపత్రికల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిౖMðనట్టు ఎన్నికల అధికారి గంగాధరరెడ్డి ప్రకటించారు.
Advertisement
Advertisement