apuwj
-
సాక్షి జర్నలిస్టులపై దాడిని ఖండించిన APUWJ
-
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా. సీఎం జగన్ ఆశయాల మేరకు పనిచేస్తా ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీనాథ్ దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం జగన్ ఆశయ సాధన దిశగా పనిచేస్తానని ఆయన చెప్పారు. డిజిటల్ యుగంలో మీడియా రంగంలో పెరిగిన ఆధునిక సాంకేతిక వినియోగం, అలాగే సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులకు సరైన దిశగా పునశ్చరణ అవసరమని, అందుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. -
చింతమనేని దూషణలు..హేయమైన చర్య
తాడేపల్లిగూడెం: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను చింతమనేని బండబూతులు తిడుతూ దూషించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట ఏరియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో దూసనపూడి విలేకరులతో మాట్లాడారు. చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారహీనంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన్ని కంట్రోల్ చేసే విధానం ప్రభుత్వానికి కనిపిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంటే శాసనాలు చేసి ప్రజల్ని పరిరక్షించాలి కానీ ఇలా జనాలపై దాడులు చేస్తూ, బాధ్యతా రాహిత్యంగా ఉన్న వ్యక్తికి శాసనసభకు వెళ్లే అర్హత లేదని స్పష్టం చేశారు. చింతమనేని వ్యవహారంలో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులను దూషించడం, వారిపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రాంతాలకతీతంగా జర్నలిస్టులంతా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన APUWJ సంఘం నేతలు
-
రిపోర్టర్‌పై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి
కర్నూలు(న్యూసిటీ) : ఇసుక అక్రమ రవాణాపై కవరేజ్ చేసిన ఐ–న్యూస్ రిపోర్టర్ రామిరెడ్డిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, జిల్లా కోశాధికారి హుసేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీలు, గుండాలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. మొన్న సాక్షి, నిన్న టీవీ 5, నేడు ఐ–న్యూస్ పాత్రికేయులపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుందని విమర్శించారు. మీడియాపై జరుగుతున్న దాడుల నియంత్రణకు మహారాష్ట్ర తరహాలో మీడియా ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని సీనియర్ పాత్రికేయులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్మన్న, ఇస్మాయిల్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, వీడియో జర్నలిస్టు సంఘం కార్యదర్శి మౌలాలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి చాంద్, కోశాధికారి మధు తదితరులు పాల్గొన్నారు. -
నిజాలను నిర్భయంగా రాస్తే దాడులా?
- ప్రభుత్వానికి ఏపీయూడబ్ల్యూజే నేతల ప్రశ్న - దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు (రాజ్‌విహార్): సమాజంలో జరిగే అంశాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడుల చేస్తే సహించబోమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు టి. అంబన్న హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో సాక్షి రిపోర్టర్, రాజమహేంద్రవరం (రాజమండ్రి) టీవీ-5 రిపోర్టర్లపై జరిగిన దాడులను నిరశిస్తూ శుక్రవారం కలెక్టరేట్ మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత్రికేయులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ‘సాక్షి’ దినపత్రిక బ్యూరో ఇన్చార్జీ కె.జి. రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రాజధాని పేరుతో అమరావతిలో జరుగుతున్న భూ కుంభకోణాన్ని ఎత్తి చూపుతూ కథనాలు రాస్తున్నప్పటి నుంచి దాడులు చేస్తున్నారన్నారు. వాస్తవాలు రాస్తున్న పాత్రికేయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. వార్తా కథనాలపై విచారణ పేరుతో రిపోర్టర్లను పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారని, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ది హిందు దినపత్రిక ప్రతినిధి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మీడియాపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తేవాలని టీవీ-9 జిల్లా కరస్పాండెంట్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు జర్నలిస్టులపై దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సాక్షి టీవీ జిల్లా కరస్పాండెంట్ లోకేష్ మండిపడ్డారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి హుసేన్, సహాయ కార్యదర్శి శేఖర్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హుసేన్, వీడియో జర్నలిస్టు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు స్నేహాల్, మౌలాలి, చాంద్, మధు, రిపోర్టర్లు ఎస్.పి. యూసుఫ్, గోపాలకృష్ణ, జమ్మన్న, శ్రీనివాసులు, రఫీ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. - జిల్లా వ్యాప్తంగా నిరసనలు.. జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరశిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు టి. అంబన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆలూరులో మోకాళ్లపై నిలిచి ఆందోళన చేయగా నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరులో రాస్తారోకో, హొళగుంద, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాయలం, పెద్దకడుబూరు, పాములపాడు, డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆదోని, కొత్తపల్లి తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటం
– ప్రభుత్వ మెడలు వంచి ఆరోగ్య బీమాను తీసుకొచ్చాం – వెనుకబడిన ప్రాంతాలాభివృద్ధిలో పాత్రికేయులదే ప్రథమ స్థానం – కర్నూలు జిల్లాలో కోటి రూపాయలతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు – ఏపీయూడబ్ల్యూజే ప్రాంతీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటాలు చేసేందుకు ఏపీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు, బండపల్లి అక్కులప్ప పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను ప్రభుత్వం మెడలు వంచి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టులకు అందుతున్న ప్రతి పథకం ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితమేనని చెప్పారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏపీయూడబ్ల్యూజే కర్నూలు, అనంతపురం ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతి–మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుతోపాటు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మహాలక్ష్మి కమ్యూనికేషన్ ఎండీ సత్య, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి కేజేరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..కర్నూలులోని జర్నలిస్టులకు హౌస్ ఫర్ ఆల్ స్కీంలో రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా ఇళ్లు నిర్మించేందుకు కలెక్టర్, హౌసింగ్ పీడీలకు లేఖ రాశానని, వెంటనే జర్నలిస్టుల జాబితాను తనకు అందజేస్తే ఇళ్లు మంజూరుకు మార్గం సుగమం అవుతుందన్నారు. స్థలమున్న వారు ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కర్నూలులో పాత్రికేయుల కోసం రిక్రియేషన్ క్లబ్ నిర్మించాలని సీఎం కోరుతానని చెప్పారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న మాట్లడుతూ..పాత్రికేయుల కోసం కోటి రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూ సభ్యత్వం ఉన్న రిపోర్టర్ చనిపోయినా, ప్రమాదంలో గాయపడినా ఆదుకోవడానికి ఈ నిధి నుంచి సాయాన్ని అందిస్తామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను అమ్ముకుని దర్జాగా తిరుగుతున్న వారిపై పోరాటం తప్పదన్నారు. మరోవైపు వెనుకబడిన కర్నూలు, అనంతపురం జిల్లాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పాత్రికేయులు తమ కథనాలతో ప్రజలను మేల్కోపాలని సూచించారు. సదస్సుకు ముందు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకు జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాజు, హుస్సేన్, కిశోర్, జమ్మన్న, శ్రీనివాసులుగౌడ్, శీను, శేఖర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు మౌలాలి, స్నేహాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిది
భీమవరం : ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా 35వ మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇచ్చేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గృహిణిగా సామాన్య జీవితం సాగిస్తున్న తాను మునిసిపల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలిగా ముందుకు వెళ్లడానికి పాత్రికేయుల సహకారం ఎంతో ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిజంపై 15 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, అయితే వీరికి హెల్త్‌కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వాంధ్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందరం మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్‌పాస్‌లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రత్యేక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని, ఆత్మగౌరవ పింఛన్లు ఇవ్వాలని, రూ.20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటుచేయాలని తీర్మానం చేస్తున్నట్టు చెప్పారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.రఘురామ్ అధ్యక్షత వహిం చగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మునిసిపల్ చైర్మ¯ŒS కొటికలపూడి గోవిందరావు, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మ¯ŒS గోకరాజు మురళీరంగరాజు, అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ఎలక్టాన్రిక్స్ మీడియా జిల్లా అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వానపల్లి సుబ్బారావు కార్యదర్శి నివేదిక అందించగా యర్రంశెట్టి గిరిజాపతి స్వాగతం పలికారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికైంది. నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా జీవీఎస్‌ఎ¯ŒS రాజు, ప్రధాన కార్యదర్శిగా వాకల సత్యసాయిబాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కంకిపాటి మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులుగా గజపతి వరప్రసాద్, ఎంవీ గంగాధరరావు, పీటీ వెంకటేశ్వరరావు, డీవీ రామాంజనేయులు, బి.మురళీధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్కే రియాజ్, టి.స్వామి అయ్యప్ప, యడ్లపల్లి శ్రీనివాస్, డీవీఎల్ఎ¯ŒS స్వామి, కె.కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా డెస్క్ జర్నలిస్టులు ఎస్కే శ్రీనివాసరెడ్డి, బీఎస్ రెడ్డి, బి.పీటర్, కార్యవర్గ సభ్యులుగా డీవీ భాస్కరరావు, కేవీవీ సత్యనారాయణతో పాటు మరో 17 మందిని, ఎలక్టాన్రిక్ మీడి యా అధ్యక్ష, కార్యదర్శులుగా కె.మాణిక్యరావు, పి.రవీంద్రనాథ్, చిన్నపత్రికల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిౖMðనట్టు ఎన్నికల అధికారి గంగాధరరెడ్డి ప్రకటించారు. -
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి
– జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు కర్నూలు(టౌన్): జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా సమితి పిలుపు మేరకు యూనియన్ నాయకులు కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు అవుతున్న ఇంత వరకు ఇళ్లు కాని, స్థలాలు కాని ఇవ్వలేదన్నారు. కర్నూలులో జగన్నాథగట్టుపై జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈ.ఎస్.రాజు, కోశాధికారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్యాకేజీలు కాదు.. హోదా కావాలి
– ఏపీయూడబ్ల్యూజే అవగాహన సదస్సులో వక్తలు విజయవాడ (గాంధీనగర్) : విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్యాకేజీలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రత్యేక హోదా కావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యాన ‘ప్రత్యేక హోదా’పై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కమీషన్లకు ఆశపడే సీఎం చంద్రబాబు ప్యాకేజీ ఇస్తామనగానే చంకలు గుద్దుకుంటున్నారన్నారు. హోదా తెస్తామని ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిన చంద్రబాబు ప్యాకేజీ పేరుతో ప్రజల చెవులో పూలు పెడితే అంగీకరించాలా..? అని నిలదీశారు. హోదా వల్లే ఉత్తరాఖండ్ అభివృద్ధి చెందిందని నాడు పార్లమెంట్లో ప్రభుత్వం చేసిన ప్రకటనను కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజానచౌదరి గుర్తించాలని హితవుపలికారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సి.నరసింహారావు మాట్లాడుతూ హోదాకు, ప్యాకేజీకి ఎంతో తేడా ఉందన్నారు. స్టెల్లా కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్ రెజీనా మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మేధోవలసలను అరికట్టాలంటే పరిశ్రమలు రావాలన్నారు. ఇందుకు ప్రత్యేక హోదానే శరణ్యమని పేర్కొన్నారు. -
ఏపీ సర్కారు తీరును ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
హైదరాబాద్: జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతీకార చర్యను ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. వార్తల ద్వారా లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సింది పోయి, పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు దిగడం సరైంది కాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. -
జర్నలిస్టు పిల్లలందరికి 50 శాతం రాయితీ
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పత్రికల్లో పనిచేసే జర్నలిస్టు పిల్లలందరికి ప్రైవేటు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇప్పించేందుకు కృషి చేస్తానని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీసీఈబీలో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిçస్టులతో నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే జర్నలిస్టులకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం మానవతా సహృదంతో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. జిల్లాలో గతేడాదే కొంతమేర అమలు అయ్యిందని ఈ ఏడాది పూర్థిస్థాయిలో అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎక్కడైనా 50 శాతం రాయితీ ఇవ్వకుంటే తమదృష్టికి తీసుకు రావాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ డీఈఓ ప్రతాప్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడే ఆ జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించారన్నారు. సమావేశానంతరం పలు పత్రికల ప్రతినిధులకు రాయితీకి సంబంధిచిన పత్రాలను అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు రామాంజనేయరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
'సాక్షి' పై కేసులను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
రాజమండ్రి: 'సాక్షి' పై కేసులు నమోదు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. పత్రికలపై నేరుగా పోలీసులే కేసులు బనాయించడం దారుణమని పేర్కొంది. కేసు సెక్షన్లను గమనిస్తే బ్రిటీష్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలోనే అలాంటి కేసులు నమోదయ్యాయని ధ్వజమెత్తింది. కావాలనే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళిని ఇరికించారని ఏపీయూడబ్ల్యూజే మండిపడింది. సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరాంమూర్తి, సీనియర్ జర్నలిస్టు సారధి, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రెహమాన్, పలువురు జర్నలిస్టులు సాక్షిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. -
'జర్నలిస్టుల విషయంలో వైఎస్ నాకు స్ఫూర్తి'
-
'జర్నలిస్టుల విషయంలో వైఎస్ నాకు స్ఫూర్తి'
గుంటూరు: రాజకీయ వ్యవస్థను మార్చగలిగే, శాసించే సత్తా జర్నలిజానికి ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ముగింపు మహాసభకు హాజరయిన ఆయన మాట్లాడారు. . విలేకరులతో ఎప్పటికీ విభేదాలు ఉండవని, ఉండొద్దని తన తండ్రి, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చెప్పిన సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. మున్ముందు తనకు కూడా వైఎస్సారే స్ఫూర్తి అని, జర్నలిస్టులపై వైఎస్సార్‌కు ఎలాంటి అభిప్రాయం ఉండేదో తనకూ అలాంటి అభిప్రాయమే ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు తీరును ఆయన ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ, బీజేపీ మోసం చేశాయని అన్నారు. దొంగతనానికి పాల్పడిన వారిపై సైతం 420 కేసులు పెడుతున్నారని.. అలాంటప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడిపై ఎలాంటి కేసులు పెట్టాలని జగన్ ప్రశ్నించారు. అసలు ఇలాంటి వారిని సరిగా ప్రశ్నించగలుగుతున్నామా అని అన్నారు. మనందరికీ ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నించగలిగినప్పుడే అన్ని సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని వైఎస్ జగన్ చెప్పారు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన వారు నేడు పక్కా పథకం ప్రకారం ఆ విషయాన్ని పక్కకు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను నిలువరించేందుకే వైఎస్సార్సీపీ ముందడుగు వేస్తోందని చెప్పారు. ఈ నెల 29న ఇచ్చిన బంద్ పిలుపు తన కోసమో, తన కుటుంబం కోసమో కాదని, యావత్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్ కోసమని గుర్తు చేశారు. ఈ బంద్‌ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి కుట్రలు చేస్తారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆ రోజూ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పేటలో మార్మోగిన సమైక్య నినాదం
చిలకలూరిపేట టౌన్, న్యూస్‌లైన్:పట్టణంలో సమైక్య నినాదం మార్మోగింది. విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చారు. తొలుత ఎన్ఆర్టీ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుదాసు, ఏపీ ఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు, డిప్యూటీ తహశీల్దార్ నాంపల్లి నాగమల్లేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఎన్ఆర్టీ సెంటర్ నుంచి బయలు దేరిన ర్యాలీ చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, గడియారస్తంభం సెంటర్, అడ్డరోడ్డు సెంటర్ మీదుగా తిరిగి ఎన్ఆర్టీ సెంటర్‌కు చెరుకుంది. ఎన్సీసీ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కళామందిర్ సెంటర్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఐదువేల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఎన్జీవోల సంఘం చిలకలూరిపేట అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని విమర్శించారు. పంచాయతీ రాజ్ ఏఈ బి.మోహనరావు మాట్లాడుతూ సీమాంధ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు టీవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మనకు కాకుండా పోతాయన్నారు. ఆర్టీసీ డిపోమేనేజర్ ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజనతో సీమాంధ్ర ఆర్టీసీకి అప్పులు, తెలంగాణ ఆర్టీసీకి ఆస్తులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి.భక్తవత్సలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండా గోపి, ఏఎంజీ సంస్థ సీఏవో విజయకుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, డి.ధనలక్ష్మి, సాంబశివరావు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి చేబ్రోలు మహేష్, సూదా రమేష్‌బాబు, కృష్ణారావు, అస్లాం, స్థానిక జర్నలిస్టు నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పెయిడ్ ఆర్టికల్స్‌తో పత్రికలు కలుషితం
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: చెల్లింపు వార్తలతో పత్రికా రంగం కలుషితం అవుతోందని ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ది పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ‘జాతీయ అభివృద్ధి- ప్రజా సంబంధాలు, పాత్రికేయుల పాత్ర’పై చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. పెద్ద పత్రికలే ఈ అనైతిక చర్యకు పాల్పడుతున్నాయన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, పార్టీల అధిపతుల చేతుల్లోకి మీడియా వెళ్తుండటం పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. కార్యక్రమంలో ది హిందు రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్, పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ నరసింహరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీ ఆవిష్కరణ ఏపీయూడబ్ల్యూజే 2014 డైరీని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ఆవిష్కరించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.