'సాక్షి' పై కేసులు నమోదు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే ఖండించింది.
రాజమండ్రి: 'సాక్షి' పై కేసులు నమోదు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. పత్రికలపై నేరుగా పోలీసులే కేసులు బనాయించడం దారుణమని పేర్కొంది. కేసు సెక్షన్లను గమనిస్తే బ్రిటీష్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలోనే అలాంటి కేసులు నమోదయ్యాయని ధ్వజమెత్తింది. కావాలనే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళిని ఇరికించారని ఏపీయూడబ్ల్యూజే మండిపడింది.
సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీరాంమూర్తి, సీనియర్ జర్నలిస్టు సారధి, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రెహమాన్, పలువురు జర్నలిస్టులు సాక్షిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమార్కు వినతి పత్రం ఇచ్చారు.