పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివ‌రికి యువ‌తి? | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివ‌రికి యువ‌తి?

Published Fri, Dec 15 2023 12:52 AM | Last Updated on Fri, Dec 15 2023 1:35 PM

- - Sakshi

మహబూబాబాద్‌: పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనే కారణంతో ఓ యువతి తన బంధువులతో కలిసి గురువారం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం వరంగల్‌ జి ల్లా రాయపర్తి మండలం సూక్యతండాకు చెందిన గుగులోత్‌ సావిత్రి, గోప్యతండాకు చెందిన భూక్యా ప్రతాప్‌ ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు ఆమె వివాహం కోసం సంబంధాలు చూస్తుండగా సావిత్రిని తానే పెళ్లి చేసుకుంటానని ప్రతాప్‌ హామీ ఇచ్చాడు. తీరా వివాహం చేసుకోవాలని కోరగా నెలరోజులుగా తప్పించుకుంటున్నారన్నారు. దీంతో చేసేది ఏమిలేక ప్రతాప్‌ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించినట్లు తెలిపింది. ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి చ‌ద‌వండి: బెజవాడ పాతబస్తీలో దారుణ ఘ‌ట‌న‌! క్యాట‌రింగ్‌ బాయ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement