breaking news
Mahabubabad District News
-
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్‌లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
ప్రాజెక్టు సర్వేకు వచ్చిన అధికారుల అడ్డగింత
గార్ల: మండలంలోని మున్నేరు ఏటి నీటిని పాలేరుకు తరలింపులో భాగంగా మంగళవారం కాల్వల నిర్మాణ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను దుబ్బగూడెం గ్రామంలో రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మున్నేరు నీటిని కాల్వల ద్వారా తన నియోజకవర్గం పాలేరుకు తరలిస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే పాలేరుకు నాగార్జునసాగర్, సీతా రామ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు వస్తుందని, ఇంకా మున్నేరు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం తగదన్నారు. దుబ్బగూడెం ప్రాంతంలో మున్నేరు ఏటిపై ప్రాజెక్టు కట్టి కాల్వల నిర్మాణం కోసం భూముల సర్వేకు వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించామని చెప్పారు. కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రభుత్వంపై పోరాటాలు చే స్తామని రైతులు హెచ్చరించారు. మా నీళ్లు మాకు ఉపయోగపడకుండా, మా భూములను కోల్పోయి, పాలేరుకు నీళ్లు ఎందుకు ఇవ్వాలంటూ రైతులు అధి కారులను ప్రశ్నించారు. సర్వేను అడ్డుకున్న వారిలో సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాసరావు, రైతులు జాస్తి సత్యనారాయణ, జాస్తి సాగర్‌బాబు, జాస్తి రాజా, నాగేందర్‌బాబు, ఉదయ్‌కుమార్, సుజాత, వేజెళ్ల సుధాకర్, వై.పట్టాబి, బి. తేజ్యా, ఎన్.బాలు, బి.చందర్, కిషన్, వి.శ్రీను, బి.సరిలాల్ ఉన్నారు. కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన రైతులు -
సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మహాజాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల క్యూలైన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మహాజాతరలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దన్నారు. భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు ఇరువైపులా బోర్లు, చేతి పంపులు, రహదారుల జంక్షన్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు కాల్వపల్లి –ఊరట్టం బీటీ నిర్మాణ పనులు, ఊరట్టం– కొండాయి రోడ్డు పనులు, గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష -
విద్యార్థులు.. గజగజ
మహబూబాబాద్ అర్బన్: రోజురోజుకూ చలి తీవత్ర పెరుగుతుండడంతో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాయంత్రం 4గంటల నుంచే చల్ల టి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. కాగా ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. గదులకు తలుపులు సరిగ్గా లేక, కిటికీలకు రెక్కలు లేక చలి నేరుగా గదిలోకి వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. సరైన దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి దుప్పట్లతోనే సర్దుకుపోతున్నారు. చన్నీటి స్నానాలు.. జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి తోడు దోమలు స్వైర విహారంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోతోంది. చలికి తోడు చన్నీళ్ల స్నానాలతో జలు బు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, కేజీబీవీలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వేడి నీళ్లు లేకపోవడంతో చన్నీటి స్నానం చేయాలంటే జంకుతున్నారు. జిల్లాలో వసతి గృహాల వివరాలు.. జిల్లాలో 19 ఎస్సీ హాస్టళ్లలో 1,878మంది విద్యార్థులు ఉన్నారు. 34 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ హాస్టళ్లలో 8,861మంది, 14 బీసీ హాస్టళ్లలో 1,300మంది, 6 మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2,970మంది, 6 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 3,440మంది, 16ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6,059 మంది, 5 మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1,129మంది, 16 కస్తూర్బాగాంధీ విద్యాలయాల వసతి గృహాల్లో 3,391మంది, 8 మోడల్ స్కూల్ కళాశాలల వసతి గృహాల్లో 760మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కిటికీలు, తలుపుల మరమ్మతులకు రూ.లక్షలు నిధులు మంజూరయ్యాయి. కానీ నేటికీ మరమ్మతులు మాత్రం చేయించలేదు. విద్యార్థులు తమ బాధలను చెప్పుకుందామన్నా.. పలువురు హాస్టల్ వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. స్థానికంగా ఉండని వార్డెన్లు.. ప్రభుత్వ నింబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు వసతి గృహాల్లోనే రాత్రి బస చేయాలి. కానీ పలు హాస్టళ్ల వార్డెన్లు రాత్రి వేళల్లో బస చేయకుండా వరంగల్, హనుమకొండ వంటి పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా మానుకోట జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో రాత్రి వేళ దొంగలు దూరి విద్యార్థుల ఫోన్లు, దుప్పట్లు, దుస్తులు, డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. ఈ విషయంపై విద్యార్థులు వార్డెన్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే పలు హాస్టళ్ల విద్యార్థులు రాత్రి వేళ మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బయటి నుంచి ఎవరు ఎప్పుడు వస్తున్నారో అర్థం కావడం లేదని, దీంతో చాలా మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తుకు బానిసలవుతున్నారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. గిరిజన హాస్టల్లో నేలపై నిద్రిస్తున్న విద్యార్థులు రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత కిటికీలు, తలుపులకు రెక్కలు కరువు స్థానికంగా ఉండని వార్డెన్లు -
యూరియా కోసం రైతుల లొల్లి
కురవి: మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణం వద్ద మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులు క్యూలో నిల్చొని పడిగాపులుపడ్డారు. కూపన్లు చేత పట్టుకుని రైతులు, మహిళా రైతులు క్యూలో బారులుదీరారు. యూరియా పంపిణీ సమయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. యూరియా పంపిణీ వద్ద ఎలాంటి బందోబస్తు లేకపోవడంతో రైతులు ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల మధ్య లొల్లి జరగడంతో షాపు యజమాని యూరియా పంపిణీ చేయకుండా షాపు తలుపులు మూసివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏఓ నరసింహరావు ఎరువుల దుకాణం వద్దకు వచ్చి పరిశీలించారు. రైతుల మధ్య గొడవ జరగడంతో ఏఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, యూరియా పంపిణీ సక్రమంగా చేయాలని రైతులు కోరుతున్నారు. యూరియా కోసం క్యూ.. డోర్నకల్: మండలంలోని గొల్లచర్ల గ్రామ సమీపంలోని డోర్నకల్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. గొల్లచర్ల, చిలుకోడు, వెన్నారం క్లస్టర్ల పరిధి రైతులు భారీ సంఖ్యలో పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. యూరియా నమోదు కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ పని చేయకపోవడంతో ఆఫ్‌లైన్ పద్ధతిన ఎరువులను పంపిణీ చేశారు. మరోవైపు డోర్నకల్‌లోనూ రెండు దుకాణాల్లో యూరియా పంపిణీ చేయగా.. బస్తాతో పాటు రూ.500 విలువైన ఇతర ఉత్పత్తులను అంటగట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజలు సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నా రు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం (డిసెంబర్ 31), జనవరి ఒకటో తేదీన ఎలాంటి డీజే కార్యక్రమాలకు అనుమతిలేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షార్హులవుతారని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై కేకలు వేయడం, అతివేగంగా వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై క్రాకర్స్ కాల్చడం, కేకులు కట్ చేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించబోమని, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కమిషన్ ఏర్పాటు చేయాలి తొర్రూరు: ఓసీల సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. జనవరి 11న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే ఓసీ ల సింహగర్జన బహిరంగ సభ పోస్టర్లను సంఘ నాయకులు ఆవిష్కరించారు. జేఏసీ నాయకుడు ముద్దం విక్రమ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. ఐదేళ్ల కాల పరిమితితో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ అర్హత మార్కులు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలన్నారు. సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాసరావు, నాయకులు నడిపల్లి వెంకటేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పొద్దుటూరి గౌరీశంకర్, తమ్మెర లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అడిషనల్ సీపీ వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైం) శ్రీనివాస్ కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని వారు కొనియాడారు. -
పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మహబూబాబాద్: రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం యూరియా పంపిణీపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల ద్వారా అదనపు యూరియా అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేనందున సవ్యంగా పంపిణీ చేయాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో రైతులకు యూరియా అందజేయాలన్నారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. యూరియా పంపిణీ విషయంలో పోలీసుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కేంద్రాల వద్ద పక్కాగా క్యూలైన్లు, టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓ గణేష్, డీఏఓ విజయనిర్మల ఉన్నారు. యూరియా పంపిణీ పరిశీలనబయ్యారం: మండలంలో యూరియా పంపిణీని కలెక్టర్ ఆద్వైత్కుమార్సింగ్ మంగళవారం పరిశీలించారు. బయ్యారంలోని సొసైటీ, ఆగ్రోస్, కొత్తపేటలోని సొసైటీ ఎరువుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందితో మాట్లాడారు. యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ రాజు, సీఐ రవికుమార్ తదితరులు ఉన్నారు. -
డెడ్‌లైన్ టెన్షన్..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్‌లైన్ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డిసెంబర్ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, సీతక్క డెడ్‌లైన్ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్‌లైన్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్‌లైన్ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్‌లైన్ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్‌ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్‌లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పాయింట్ మంచెల పనులూ అంతే.. జాతరలో కవరేజ్ కోసం మీడియా పాయింట్ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు మిగిలింది 27 రోజులే. మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ మధ్యలో జీపీ సిమెంట్ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి నిరంతరం మేడారం పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మహాజాతర నాటికి పూర్తయ్యేనా? -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ● ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్‌శాఖ సన్నద్ధం ● వారబందీ పద్ధతి అమలుసాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి.. ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతోంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేష్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ -
సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్ఐఆర్లు, 160 ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్సీఎల్పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి.. స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు. -
1న వరంగల్ మార్కెట్‌కు సెలవు
వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ కోరిక మేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు. పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ● తొమ్మిది మంది అరెస్ట్.. రూ.1,86,020 స్వాధీనం ● మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్హసన్పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్, పిట్టల ప్రవీణ్, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్‌కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్, హుస్నాబాద్‌కు చెందిన కారెపు శ్రీనివాస్, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ బాబులాల్,ఎస్సై చందర్, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నకిలీ గన్‌తో బెదిరించి డబ్బుల డిమాండ్..● ఈ ఘటనలో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు జనగామ రూరల్: నకిలీ గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై భరత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 28 తేదీన జనగామకు చెందిన మల్లిగారి సతీశ్ పట్టణంలోని ఓ లిక్కర్ మార్ట్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలం గబ్బెటకు చెందిన నిందితుడు ఇంజ ప్రశాంత్ నకిలీ గన్‌తో సతీ శ్ను బెదిరించి రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు సతీశ్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టి మంగళవారం జనగామలో నిందితుడిని అరెస్ట్ చేసి అ తడి వద్ద నుంచి నకిలీ గన్ను స్వాధీనం చేసుకుని రి మాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కా గా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కృష్ణ, సాగర్, చరణ్‌ను డీసీపీ, ఏసీపీ అభినందించారు. బావిలో పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన వీరసారపు గణేశ్‌కుమార్(40) ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
మహబూబాబాద్ రూరల్: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల రక్షణ, పునరావాసం, వారి హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తామని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. బాలల భవిష్యత్‌ను కాపాడే దిశగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మంగళవారం ఆవిష్కరించారు. జనవరి 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, చైల్డ్ లైన్ 1098 , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, భరోసా కేంద్రం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర విభాగాలు సమన్వయంతో పని చేస్తాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ బాలుడు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడని, బాలల చిరునవ్వును కాపాడడమే ఆపరేషన్ స్మైల్ ప్రధాన లక్ష్యమన్నారు. బాల కార్మిక వ్యవస్థపై రాజీ పడేది లేదని, బాలకార్మికులను గుర్తించి రక్షించడం, బాధిత పిల్లలకు పునరావాసం కల్పించి పాఠశాలల్లో చేర్చడం, బాలల అక్రమ రవాణా, దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు ఎవరైనా బాలకార్మికులు లేదా పిల్లలపై జరుగుతున్న అక్రమాలను గమనిస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు అశోక్, డేవిడ్, చైల్డ్ లైన్, భరోసా, షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ -
కామన్ మెస్‌లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్‌లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్ిపీ రాజ్‌కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్‌లో మాల్‌ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళన రిజిస్ట్రార్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్న డైరెక్టర్ -
అభివృద్ధి అంతంతే..
నిర్మాణ దశలోనే కార్యాలయాలు.. సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అయితే గతంలో ప్రారంభించిన పనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాదిలో పూర్తవుతాయని భావించిన ప్రభుత్వ కార్యాలయా ల భవనాల నిర్మాణాల్లో పురోగతి లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడత 10,651 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 9,858 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. కొత్త ఉద్యోగుల రాక.. గతంలో నిర్వహించిన గ్రూప్స్ నియామకాల ప్రక్రియ ఈ ఏడాది పూర్తి చేశారు. దీంతో జిల్లాకు 160 మంది గ్రూప్–4 ఉద్యోగులతో పాటు, గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల్లో ఎంపికై న ఉద్యోగులు కొలువుదీరారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత కొంత మేరకు తీరింది.శిలాఫలకాలకే పరిమితం.. కేసముద్రం ప్రాంతానికి మహర్దశ పట్టింది. మండల కేంద్రంగా ఉన్న కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాల మంజూరు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ పట్టణంలో జూలై 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో పాటు, ఆరుగురు మంత్రులు రూ.400కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది కొత్తరేషన్ కార్డులు, పేదలకు సన్నబియ్యం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మెడికల్ కళాశాల హాస్టల్ భవనం ప్రారంభం పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మొదటి స్థానం రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో నిర్మాణానికి అడుగులు!నూతనంగా ఏర్పడిన జిల్లాలో అనేక మార్పులు వచ్చాయి. ఈమేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణం సాగుతోంది. అయితే ఇందులో బాలికలు, బాలుర హాస్టల్ భవనాలను మాత్రం రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఇక మున్సిపల్, పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయినా.. వినియోగంలోకి రాలేదు. కేసముద్రానికి మహర్దశ -
నేడు ముక్కోటి ఏకాదశి
మహబూబాబాద్ రూరల్: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పూజా వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు జ రుపుకోనున్నారు. ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా జిల్లాలోని ఆలయాల్లో అర్చకులు ఉత్తర ద్వార దర్శనాల కు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం, వేణుగోపాలస్వామి దేవాలయం, వెంకటేశ్వరబజార్లోని స్వయంభు వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాత బజార్‌లోని ఉమాచంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు జరగనున్నాయి. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి మహబూబాబాద్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డీటీఓ సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మైస నాగయ్య అధ్యక్షత వహించగా డీటీఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ, డీఏ, ఈహెచ్ఎస్ ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీటీఓ కార్యాలయం పరంగా పెన్షనర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏటీఓ రా మకృష్ణ, ఈశ్వర్, నాగేందర్, వెంకట్‌రెడ్డి, మహేందర్, సత్యనారాయణ, ప్రసాద్, సంకా బద్రినారాయణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.● ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ● తెల్లవారుజామున 5 గంటల నుంచే దైవ దర్శనాలు -
రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరు..
మానుకోటకు మరో మణిహారంగా వస్తుందని భావించిన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరుపై ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. రూ.908కోట్లు మంజూరు కాగా.. నిర్మాణానికి భూమి చూపించలేదనే నెపంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నష్కల్‌కు డిపో తరలివెళ్తుందనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం సమీపంలో 409.01 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాసింది. -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేట, వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్‌పాడ్, ఖమ్మం, వ రంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వి కారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట, వరంగల్ మీ దుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ టైర్ల దొంగల అరెస్ట్ నర్సంపేట రూరల్ : టిప్పర్ టైర్లను అపహరిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట పీఎస్‌లో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. నర్సంపేట మండలం లక్నెపల్లికి చెందిన గొర్రె కృష్ణంరాజు గత నెల 10వ తేదీన గ్రామ శివారులోని ఇసుక డంప్ వద్ద టిప్పర్ నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి దుండగులు ఆ టిప్పర్ నాలుగు టైర్లను అపహరించడంతో బాధితుడు నర్సంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గురిజాల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బొలెరోలో నాలుగు టైర్లను గూడూరు నుంచి వరంగల్‌కు తరలిస్తుండగా పట్టుకుని టైర్లతోపాటు బొలెరో, బైక్‌ను స్వాధీనం చేసుకుని నలుగురు సోడా రాజశేఖర్, మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, బుడిగబోయిన ఉదయ్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు గూడ అరణ్, రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● భట్టుపల్లి రోడ్డులో ఘటన ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (25) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్‌పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్‌కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్‌పై రాంగ్రూట్లో వచ్చి ప్రవీణ్‌యాదవ్‌ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
బతుకుదెరువుకు వెళ్లి దుర్మరణం..
● ముంబయిలో లింగాలఘణపురం వాసి మృతి ● 20 అంతస్తుల భవనంపై సీన్ బిల్లులు లెవల్ చేస్తుండగా ఘటన లింగాలఘణపురం: బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లిన జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన సుక్క సత్యనారాయణ (39) ఆదివారం రాత్రి 20 అంతస్తుల భవనంపై నుంచి పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సు మారు ఇరవై ఏళ్లుగా ముంబయిలో ఉంటున్న సత్యనారాయణ.. కూ లీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు వారీగా సత్యనారాయణ, రజిత దంపతులు తమ కుమారుడు చందుతో కలిసి ఘాట్కోపర్ ప్రాంతంలో ఒకే చోటకు సీన్ బిల్లలు పెట్టే పనికి వెళ్లారు. 20 అంతస్తులు భవనంపై సీన్ బిల్లులు పెట్టిన అనంతరం స త్యనారాయణ వాటిని లెవల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జరుగుతూ వెనుక ఉన్న ప్లంబింగ్ పైపులు వెళ్లే రంధ్రంలో పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రజిత, కుమారుడు చందు బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు. ఇదిలా ఉండగా ఇరవై ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దయ్యాల నర్సయ్య కూడా ముంబాయిలోనే కూలీ పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ వివిధ ఘటనల్లో చనిపోతుండడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. -
గ్రామాలకు నిధులు కేటాయించాలి
డోర్నకల్: గ్రామ పంచాయతీలుగా మారిన గిరిజన తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 600 గిరిజన తండాలు, ఆవాసాలు ఉన్న డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజనులు కష్టపడి సంపాదించిందంతా విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అదనపు ఆదాయం కల్పించాలని కోరారు. డోర్నకల్‌లో 50 పడకల, కురవిలో 30 పడకల ఆస్పత్రులు నెలకొల్పాలని, మున్సిపాలిటీల్లో ప్రమాదకరంగా మారిన కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోతులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు మహాబూబాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి నాగేశ్వర్రావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సోమవారం యూరియా పంపిణీ, యాప్‌పై కలెక్టర్లు, అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు జిల్లాల్లో ఫర్టిలైజర్ యాప్ విజయవంతమైందన్నారు. యూరియా సరఫరాలో రైతులకు ఎలా ంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. పంపిణీని కలెక్టర్లు ప ర్య వేక్షించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలె త్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. పర్యవేక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వీసీ లో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, డీఏఓ విజయ నిర్మల ఉన్నారు. దివ్యాంగులకు వివాహ నగదు ప్రోత్సాహకం మహబూబాబాద్: దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తోందని డీడబ్ల్యూఓ సబిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు వివాహం జరిగిన సంవత్సరంలోపే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాన్నారు. ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకంమహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మార్పిడితో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాలను శాస్త్రవేత్తలు, అధికారుల బృందం సందర్శించి సోమవారం రైతులకు మిరప, కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, ఆయిల్ పామ్‌లో అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూడిద బూజు తెగులు, ఎండు తెగులు, తెల్లదోమ, పేను బంక, తదితర రసం పీల్చే వాటి నుంచి ఉద్యాన పంటలను సకాలంలో సంరక్షించుకోవాలని తెలిపారు. శాస్త్రవేత్తలు సురేష్, సాయికృష్ణనిఖిల్, ప్రశాంత్ ఉన్నారు. -
5లోగా విద్యుత్ పనులు పూర్తి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం మహాజాతరలో చేపడుతున్న విద్యుత్ పనులన్నీ వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులు పరిశీలించి మాట్లాడారు. గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తులకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. నార్లాపూర్లోని 33 /11 కేవీ సబ్‌స్టేషన్ సందర్శించి జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం మేడారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్తంభాల ఏర్పాటు పనులను పరిశీలించి నిర్దేశిత సమయం కల్లా పూర్తి చేయాలన్నారు. మేడారం, వెంగళాపూర్, చింతల్ క్రాస్ రోడ్డు, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించి విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఊరట్టం స్తూపం జంక్షన్, హరిత హోటల్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, కన్నెపల్లి రోడ్డు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, ఎస్ఈ ఆనందం, డీఈ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మేడారంలో విద్యుత్ పనుల పరిశీలన -
మేడారం జాతరపై పీఓ సమీక్ష
● పాల్గొన్న పూజారులు, ఆదివాసీ సంఘాలు ఏటూరునాగారం : జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరపై ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఆదివాసీ సంఘాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులతో సమీక్షించారు. జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, దీనికి అనుగుణంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని పూజారులు, ఆదివాసీ సంఘాలు, వడ్డెలను కోరారు. కోళ్లు, మద్యం, బెల్లం, కొబ్బరికాయల షాపుల కేటాయింపు విషయంలో వారి అభిప్రాయాలు సేకరించారు. ఆదివాసీ సంఘాల్లోని సమస్యలు, జాతర సమయంలో పూజారులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఎక్కడ, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పీఓ తెలిపారు. కాగా, మేడారం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని పూజారులు పీఓను కోరారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, జీసీసీ డీఎం వాణి, ఎస్ఓ రాజ్‌కుమార్, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆకట్టుకునేలా!
ఖానాపురం: పాకాల.. పచ్చందాలకు నెలవు. ఆ హ్లాదకర వాతావరణానికి నిలయం. పక్షుల కిలకిలరావాలు, సరస్సులోని నీటి అలల సవ్వడి, చిలకలగుట్ట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తా యి. గతంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్న పాకాలకు పర్యాటకులు తాకిడి అంతంత మాత్రంగా ఉండేది. అయితే అటవీ శాఖ ఇక్కడి ఆభయారణ్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులతో కొన్ని సంవత్సరాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులోని పాకాల పర్యాటక ప్రాంతానికి ఉమ్మడి వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారు. సెలవు, ప్రతీ ఆదివా రాల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చి అందాల ను వీక్షిస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వర్షాకాలంలో సరస్సు మత్తడి పరవళ్లలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. మత్తడి పోసిన అన్నీ రోజులు పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో పర్యాటకుల ద్వారా వచ్చిన నిధులతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో వచ్చే నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పాకాల.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది వరంగల్ జిల్లా స్థాయిలో ఏకై క పర్యాటక ప్రాంతంగా పేరొందింది. నర్సంపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాకాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుత సంవత్సరం రూ.50 లక్షల వ్యయంతో గేట్ వద్ద నుంచి చివరి వరకు 1.5 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు, డార్మెటరీ మరమ్మతులు, ఈసీ భవన పునరుద్ధరణ, తూముల ఆధునికీకరణ, బటర్ ఫ్లైగార్డెన్ వద్ద సెల్ఫీ పాయింట్, ఆర్చ్‌లు, మూడు పెడల్బోట్స్, పార్కింగ్ స్థల అభివృద్ధి, బటర్‌ఫ్లై గార్డెన్ సమీపంలో ఫూల్ నిర్మాణం, రెండు బ్యాటరీ వాహనాలు, షెడ్ నిర్మాణం, ఓపెన్ ఎయిర్ క్యాంటీన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పాకాలకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గేట్ ఎంట్రీ, వాహనాల రుసుము, పర్యాటకుల హాజరుకు రుసుములను అటవీశాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. దీంతో 2024 సంవత్సరంలో 33,500 మంది పర్యాటకులు పాకాలను సందర్శంచడంతో రూ.18.50 లక్షల ఆదాయం సమకూరింది. 2025లో 44,500 మంది పర్యాటకులు సందర్శించడంతో రూ. 30.50లక్షల ఆదాయం సమకూర్చుకుంది. ప్రకృతి అందంతో పాటు పాకాలలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోది. గత సంవత్సరం కంటే ప్రస్తుతం పెరగడంతోపాటు ఆదాయం కూడా రెట్టింపుగా పెరిగింది. పాకాల..వరంగల్ జిల్లాలో ప్రధాన పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకొస్తాం. ఉన్నతాధికారుల సహకారంతో నిధులు మంజూరయ్యాయి. దీంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ పనులతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య పెరిగింది. – పుప్పాల రవికిరణ్, ఎఫ్ఆర్వో, నర్సంపేట -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ● ప్రజావాణిలో 86 అర్జీల స్వీకరణ మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలని, పరిష్కారం చేయలేనవి ఉంటే కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 86 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూరియా బస్తాలు ఇప్పించాలి ఇందిరానగర్ తండా జీపీ గతంలో కేసముద్రం మండలంలో ఉండగా ఇటీవల మానుకోట మండల పరిధిలోకి మార్చారు. దీంతో మండలం సమస్య వస్తుంది. మా భూములన్నీ కేసముద్రం మండల పరిధిలో ఉన్నాయి. మండలం సమస్యను సాకుగా చూపి అధికారులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. సమస్యను పరిష్కరించి బస్తాలు ఇవ్వాలి. –డి.లాల్ సింగ్–మంగమ్మ దంపతులు, ఇందిరానగర్ కాలనీ జీపీ ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదు.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. వెంటనే పాత ఇల్లు కూల్చివేసి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాం. బేస్‌మెంట్‌తో పాటు బీమ్ల నిర్మాణం పూ ర్తయి ఆరు నెలలు అవుతున్నా బిల్లు రాలేదు. ఆధా ర్ నమోదు కాలేదని చెప్పడంతో.. హౌజింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా చేయడం లేదు. వెంటనే బిల్లు ఇస్తే మిగిలిన పనులు చేపడుతాం. –సట్ల మాధవి, భగత్‌సింగ్ నగర్‌కాలనీ, మానుకోట పట్టణం భూములు కబ్జా కాకుండా చూడాలిమాకు జిల్లా కేంద్రం శివారులోని హైమాగార్డెన్ వెనుక ఆరు ఎకరాల భూమి ఉంది. దానిని కొంత మంది ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే ఎకరం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. – ఆకుల లక్ష్మి -
మున్సిపల్ ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ, విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని, ఎన్నికల పట్టికల తయారీకి సంబంధించి దశలవారీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలు పాతవి ఉండగా వీటికితోడు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు(మంగళవారం) 30వ తేదీన మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ డేటాను సమీకరించడం, 31న పోలింగ్‌స్టేషన్ వారీగా వార్డుల డేటా పునర్వ్యవస్థీకరణ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వార్డుల వారీగా పోలింగ్‌స్టేషన్ జాబితాల తయారీ, జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, 5వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం, 6వ తేదీన ఎన్నికల అధికారుల సమావేశం, 10వ తేదీన తుది ఓటరు జాబితాల విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్‌తో రాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగుపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల నేటినుంచి ఓటరు జాబితాల సమీకరణ -
విషాద యాత్ర
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్ : విహారయాత్ర మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాల్లో తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, మిట్టపల్లి గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చెందిన చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్ (31) అక్కడికక్కడే మృతిచెందగా, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, కొలిపాక క్రాంతి, ఉప్పుగల్లుకు చెందిన అజయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతిచెందగా కొలిపాక క్రాంతికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి.. జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చిల్లర బాలకృష్ణ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సొంతంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో స్నేహితుడు రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంద అజయ్ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, క్రాంతి మరికొంత మంది స్నేహితులతో కలసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి ఉప్పుగల్లుకు వచ్చి వారిని ఇంటి వద్ద వదిలేసి స్నేహితులతో కలిసి అదే రోజున బయలుదేరారు. మూడు కార్లలో సుమారు 15 మంది యువకులు ముందుగా ఒడిశాలోని పూరిజగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింహాచలం, అరకు, వైజాగ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా తల్లాడ సమీపం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొంది. దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు జనగామ జిల్లా వాసుల మృతి ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో విషాదంఘన్పూర్కు చెందిన గట్టు కరుణాకర్, పద్మ దంపతులకు ఒక కుమారుడు రాకేశ్, కూతురు సంతానం. కరుణాకర్ టైర్ల పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పదేళ్ల క్రితం కరుణాకర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో స్థానిక దాతల సహకారంతో ఖరీదైన వైద్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏడేళ్ల క్రితం కరుణాకర్ భార్య పద్మ అనా రోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం కరుణాకర్ కుమారుడు రాకేశ్ జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు ఆయిల్ మిల్లులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అదేవిధంగా జనవరి 3న అతడి పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ యాత్రకు స్నేహితులతో వెళ్లి మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కొలిపాక ఐలయ్య, లలిత దంపతుల కుమారుడు క్రాంతి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఆరునెలలే అవుతోంది. రోడ్డు ప్రమాదంలో క్రాంతి రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంట సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పంట పొలాల్లో పులి పాదముద్రలు
● పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన ములుగు రూరల్: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం పందికుంట పంట పొలాల్లో పులి సంచారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ మాట్లాడుతూ భూపాలపల్లి అటవీ ప్రాంతం నుంచి ములుగు మండలం జాకారం సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతున్న సమయంలో 108 డ్రైవర్ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ములుగు, అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో అటవీశాఖ అధికారులు బీట్ టీంలతో కలిసి పులి జాడను పరిశీలించారు. పందికుంట శివారులో మిర్చి తోటలో పులి పాదముద్రలు గుర్తించామన్నారు. మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, పంచోత్కులపల్లి, రాయినిగూడెం, సర్వాపూర్ గ్రామ శివారులో పులి సంచరించే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లె కూలీలు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, ఎవరైనా హాని తలపెడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించనున్నారు. 11 అంశాలను పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా 46 మంది అధ్యాపకులకు ఇంట ర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులకు సంబంధించి పాలకమండలి చర్చించి ఆమోదించనున్నారు. యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నా యి. అయితే సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించాలా లేక సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలా అనే అంశం పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సూపరింటెండెంట్లకు రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచించగా దానిని సూపరింటెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వెకెన్సీలు చూపుతున్నారని సమాచారం.అయితే అందులో వివిధ విభాగాల్లోని వెకెన్సీల భర్తీ విషయంలో రోస్టర్ ఫిక్స్ చేసే అంశంపై కూడా పాలకమండలిలో చర్చించనున్నారని తెలి సింది. కేయూ ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి మూడు ఎండోమెంట్ల లెక్చర్ల ఏర్పాటునకు ఇటీవలే పలవురు యూనివర్సిటీకి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు చెల్లించారు. ఎండోమెంట్ లెక్చర్ల ఏర్పాటుకు కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల విభాగంలోని కాన్ఫిడెన్షియల్ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొనబోతున్నారు. అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం లభించే అవకాశం! -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
జనగామ రూరల్: అన్ని రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండు రోజులపాటు నిర్వంచిన రాష్ట్ర విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జీఓల జోక్యం నిరోధించాలని, శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్‌లు, (ఉన్నతి, ఎఫ్ఎల్ఎస్, లక్ష్య, ఎఫ్ఆర్ఎస్) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్‌రెడ్డి, డి.సత్యానంద్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, ఎస్.మల్లారెడ్డి, జి.శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్‌రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగుజయప్రకాశ్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ముగిసిన రాష్ట్ర విద్యాసదస్సు -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24)అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
ప్రజలకు చేరువలో పోలీసులు
● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్: జిల్లా ప్రజలకు పోలీసులు మరింత చేరువలో ఉంటూ సేవలు అందిస్తారని, నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదిక వివరాలను ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల కేసులు పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు కూడా పెరిగాయన్నారు. గతంలోకన్నా 2025లో రౌడీషీట్లు కూడా ఎక్కువ ఓపెన్ చేశామని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. 2026లో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్యాయానికి గురైన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్త ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మోహన్, విజయ్ ప్రతాప్, ఎస్బీ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీసీఎస్ సీఐ హతీరాం, పీసీఆర్ సీఐ శంకర్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, చంద్రమౌళి, గణేష్, సత్యనారాయణ, రవికుమార్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాల ఎగరవేతకు చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మా ంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
తల్లులకు తనివితీరా మొక్కులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. చోరీలు జరగకుండా భక్తులను అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. అమ్మవార్ల గద్దెలకు తాళాలు.. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు తాళాలు వేశారు. దీంతో భక్తులు అమ్మవార్ల గద్దెలను బయట నుంచే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వెళ్లి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది పోలీసులు బందోబసు..్త అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల కోసం 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న తరుణంలో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ముందస్తుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైల బందోబస్తులో పాల్గొన్నారు.తల్లులకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు మేడారానికి వేలాదిగా తరలొచ్చిన భక్తులు జనసందడిగా మారిన గద్దెల ప్రాంగణం -
విద్యారంగం అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్హాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, టీఏ, డీఏలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, కారుణ్య నియామకాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన వేళలను సవరించాలని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, పేదలకు నాణ్యమైన విద్యనందించడంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. ‘పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగం చూశాం.. అంబేడ్కర్ అంటే ఏమొస్తది.. దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు.. చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటదా నరకం ఉంటదా మనకు తెలియదు.. కానీ, బతికున్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకుని జ్ఞానాన్ని నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు’ అని పేర్కొన్నారు. జనగామ ఎమెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకత్వంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాష్ట్ర నాయకులు మోత్కూరు నరహరి, రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ శ్రీనివాస్‌రావు, పాలకుర్తి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, ఆకుల శ్రీనివాస్‌రావు, జాక్ జిల్లా చైర్మన్ ఖాజాషరీఫ్, జిల్లా అద్యక్షుడు కోర్రె లీయస్, నిర్వాహకులు మడూరి వెంకటేశ్, విద్యావేత్తలు, 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట జనగామ చౌరస్తా నుంచి మాంగళ్య ఫంక్షన్‌హాల్ (సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం), రావెళ్ల రాఘవయ్య వేదిక వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వేల మందితో ర్యాలీ చేపట్టారు. ప్రమాదంలో ఉపాధి హామీ చట్టం.. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది కుటుంబాలు సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశముందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం పేదల హక్కులను రక్షించే స్పష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, చట్టాన్ని కాపాడుకోవడం అంటే పేదల హక్కులను కాపాడుకోవడమేనన్నారు. దీనిపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి ిసీతక్క -
ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఏటీఎంలలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్ప డుతున్న రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు సభ్యులు అంతర్ ర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు. వీరి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా మాల్కిడా తాలుకాలోని ఖారెడా గ్రామానికి చెందిన ఆరిఫ్‌ఖాన్, బీజ్వాడ నారోక గ్రామానికి చెందిన సర్ఫరాజ్, మోరేడా గ్రామానికి చెందిన ఎం.ఆష్‌మహ్మద్, షాపుస్ఖాన, షారూఖాన, అస్లాంఖాన, మహావకార్డ్ గ్రామానికి చెందిన షారుక్‌ఖాన్ నిందితులు. వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి.. పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లలోని లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యయనం చేశారు. ఏటీఎంలు్ తెరిచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారని తెలిపారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో వీరు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలను చోరీ చేసినట్లు తెలిపారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. నగదు పోయిందని ఖాతాదారులు సంబంధిత బ్యాంకుల్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ (ఫైనాన్సియల్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్) లిమిటెడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, క్రైం, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్‌రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలలో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చారు. ఏటీఎం తలుపు తెరిచి దానికి స్టిక్కర్ అతికించిన ఐరన్ ప్లేట్ బిగిస్తుండగా.. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీసీఎస్ ఇన్‌న్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్‌పాషా, కాజీపేట ఎస్సైలు నవీన్‌కుమార్, లవణ్ కుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. నగదు, రెండుకార్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
చారిత్రక ద్వీపంలో చిట్టడవి!
ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్.. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అరుదైన కట్టడాలకు వేదిక. ఎన్నో ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలకు చిరునామాగా ఉంటూ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పంట్ల తోటలతో చిట్టడవిగా రూపుదిద్దుకుంది. ఈ చిట్టడివి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. ఆదివారం వస్తే చాలు.. నగరం నుంచి చాలా మంది యువత ఇక్కడికి వస్తున్నారు. అద్భుత పూల వనాలు, పండ్లతోటలు, ఎత్తైన వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్‌గా మారింది. ఆ పక్కనే రంగుల పూల వనం.. మరో పక్క పక్షుల కిలకిల రాగాలు.. అలా నడుచుకుంటూ మరింత ముందుకెళ్తే సముద్రాన్ని తలపించేలా చెరువు కనిపిస్తుంది. ఈ వేసవికి విహార యాత్రలకు సుదూర ప్రాంతాలకు పరుగులు పట్టాల్సిన పని లేదు. మన చెంతనే ఉన్న ఈ అటవీ ద్వీపంలోనే ఎంజాయ్ చేయొచ్చు.. అందాలను ఆస్వాదిద్దాం.. చారిత్రక ఖిలా వరంగల్ మధ్య కోట ప్రకృతి సౌందర్యంతో ద్వీపంలా ఉంటుంది. కోట చుట్టూ రెండు నీటి కోటలు, అనేక వంపులతో కూడిన మట్టి, రాతికోట నిర్మాణ శైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్క్, బోట్ షికారు, గుండు చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్కు మాత్రమే చూశాం. ఇప్పుడు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన వృక్షాలతో సహజ సిద్ధ అడవి రూపుదిద్దుకుంది. నాలుగేళ్ల క్రితం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాటిన మియావాకి మొక్కలు నేడు దట్టమైన అడవిగా తయారైంది. ఈ మార్గానికి ఇరువైపులా 20 ఫీట్ల ఎత్తుతో దట్టంగా వృక్షాలు ఉన్నాయి. ఒక్కసారి ఇందులోకి వెళ్లిన వారు దారి తెలియక ఇబ్బంది పడాల్సిందే. ఇందులో పర్యాటకులు సేదదీరేలా అవకాశాలు ఉన్నాయి. పార్కు నిర్వాహకుడు మరో 18 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని రకాల పండ్ల మొక్కలు నాటారు. ఏకశిల గుట్ట పక్కన గుండు చెరువు కట్టపై 25 ఏళ్ల క్రితం ‘కుడా’ఆధ్వర్యంలో ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయగా.. చెరువు చుట్టూ బాండ్ ఏర్పాటు చేశారు. విశాల స్థలంలో పర్యాటకులు టెబుల్ మీద కూర్చుని చల్లని గాలి ఆస్వాదిస్తూ .. చెరువు అందాలు వీక్షిస్తూ పచ్చిన చెట్ల నీడన ప్రకృతి అందాలను చూడొచ్చు. అంతేకాదు పార్కులో చెట్లు, పూల వనం, రోజ్ గార్డెన్, పాత్‌వేలు, సీసీ రోడ్లు, నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. దీంతో వేసవిలో పర్యాటకులు పచ్చని చెట్ల నీడన ఎంజాయ్ చేస్తున్నారు. కోటకు ఇలా చేరుకోవచ్చు.. చారిత్రక ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు. రై ల్వేస్టేషన్, బస్సు స్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యకోట పర్యాటక ప్రాంతానికి రూ. 20 చార్జి చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు. నేరుగా స్వయంభూ శంభులింగేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాకతీయుల శిల్పకళా సంపద వీక్షించొచ్చు. అనంతరం చిల్డ్రన్ పార్కులో సేదదీరుతూ ప్రకృతి అందాలు చూడొచ్చు. ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పండ్ల తోటలు చెట్లపై సేదదీరుతున్న అనేక రకాల పక్షులు ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో రూపుదిద్దుకున్న పచ్చని ప్రాంతం -
అదనపు కట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు
●పోలీసులు న్యాయం చేయండి ● వీడియో ద్వారా బాధితురాలి వేడుకోలు.. ఐనవోలు: నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.. దీనిపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితురాలు వీడియోలో చెబుతున్న వివరాల ప్రకారం.. మండలంలోని కక్కిరాలపల్లికి చెందిన రాపోలు కేతమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె, బాధితురాలు సుమలతకు ఏడేళ్ల క్రితం ఒగులాపురం గ్రామానికి చెందిన బోసు సాంబరాజుతో వివాహమైంది. మద్యానికి బానిసైన సాంబరాజు.. భార్య సుమలతను కొట్టడంతోపాటు ఆమె బంగారు ఆభరణాలను అమ్ముకుని జల్సాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకువాలని వేధించడంతో సుమలత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారి ఇంటికి చేరుకుంది. అనంతరం ఐనవోలు పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. జఫర్‌గఢ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో దమ్మన్నపేటలో ఇరువురి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడానికి వెళ్లగా సుమలత, ఆమె తల్లిదండ్రులపై సాంబరాజు దాడి చేయించాడు. ఈ ఘటనపై సుమలత వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై.. సాంబరాజును పిలిచి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఈ ఘటనపై ఇప్పటికై నా ఐనవోలు, వర్ధన్నపేట పోలీసులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ అంశంపై ఐనవోలు ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఐదు రోజుల క్రితం సుమలత ఫిర్యాదు చేసిందన్నారు. 498 కేసు నమోదు చేస్తానని చెబితే నిరాకరించిందన్నారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. -
మల్లన్న ఆలయంలో నిలువు దోపిడీ
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను ఒగ్గు పూజారులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని భక్తుడు ఆరోపిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాంకుమార్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాడు. ముందుగా ఆలయం లోపల పట్నం వేయడానికి కౌంటర్ వద్ద రూ.300 టికెట్ కొనుక్కొని ఆలయం లోపల పట్నాలు వేసే ప్రదేశానికి వెళ్లాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒగ్గు పూజారులు సామూహికంగా పట్నాలు వేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ అనే ఒగ్గు పూజారి రాంకుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తీసుకుని రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఎందుకు ఇవ్వాలని ఒగ్గు పూజారిని భక్తుడు ప్రశ్నించడంతో పట్నం, పూజ మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భక్తుడు ఆగ్రహానికి గురై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరో ఒగ్గు పూజారితో భక్తుడి పట్నం మొక్కులను పూర్తిచేయించారు. ఈ విషయంపై ఈఓ కందుల సుధాకర్‌ను వివరణ కోరగా ఇటీవల ఒగ్గు పూజారులు, కల్యాణకట్ట సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి కానుకలు ఆశించవద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆదివారం భక్తుడితో అనుచితంగా ప్రవర్తించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒగ్గు పూజారిని 15 రోజులు ఆలయానికి రాకుండా ఆదేశాలు ఇచ్చానన్నారు. రెండు రోజుల్లో ఆలయ చైర్మన్‌తో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదని పూజ మధ్యలోనే వెళ్లిపోయిన ఒగ్గు పూజారి 15 రోజులు విధులకు రావొద్దని ఒగ్గు పూజారికి ఈఓ ఆదేశాలు -
సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరంగల్ జట్టుకు మూడో స్థానం
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో 3–2 స్కోర్ తేడాతో మహబూబ్‌నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈఓ అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. సౌత్‌జోన్ పోటీలకు కేయూ జట్టుకేయూ క్యాంపస్: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ ఉమెన్ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. జట్టులో డి.హర్షిత, జి.శ్రీవాణి, పి. సృజన, ఎం.సంజన, ఇ.అనన్య తేజ, సి.హెచ్ తులసి, బి.రాధిక, బి.అఖిల, బి.వాణి, డి.పూజిత, కె.రచన, జి.అనిత ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు బొల్లికుంటలోని వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్‌యాసిన్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారని వెంకయ్య తెలిపారు. కేయూలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలుకేయూ క్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్‌జోన్ గోల్డ్‌కప్– 2025 క్రికెట్ పోటీలు కాకతీయ యూనివర్సిటీ క్రీదామైదానంలో రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. ఖమ్మం వర్సెస్ మహబూబాబాద్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ చేసిన మహబూబాబాద్ జట్టు 176 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా.. ఖమ్మం జట్టు విజయం సాధించింది. తర్వాత మ్యాచ్‌లో ఖమ్మం వర్సెస్ ములుగు క్రికెట్ జట్టు పోటీపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ములుగు జట్టు 13 ఓవర్లలో 78 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఖమ్మం జట్టు 15.2 ఓవర్లలో 79 పరుగులు చేసి విజయం సాధించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, ఉపాధ్యక్షుడు మహ్మద్అలీముద్దీన్, బాధ్యులు డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, సమిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విశ్వదాస్, శశాంక్, మరిగంటి నవరసన్ పాల్గొన్నారు. తెలంగాణ ఈస్ట్‌జోన్‌లోని 8 జిల్లాల జట్లు ఈపోటీల్లో పాల్గొంటున్నాయి. జనవరి 1వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
యూరియా కోసం రైతుల బారులు
క్యూలో నిరీక్షిస్తున్న మహిళలు కాంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం బారులుదీరిన రైతులుకురవి: సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. రైతులు అధిక సంఖ్యలో తరలిరాగా.. ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో తోపులాట జరిగింది. గతంలోనే ప్రతీ రైతుకు గుర్తింపు కార్డును అధికారులు అందించారు. ఆ కార్డు పట్టుకుని యూరియా కోసం సొసైటీ వద్దకు రైతులు తరలివచ్చారు. యూరియా పంపిణీ సమయంలో క్యూలో ఉన్న రైతులు ఒకరినొకరు తోచుకోవడంతో స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. మహిళలు సైతం అధిక సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చారు. రెండు క్యూ ల్లో రైతులు ఎక్కువగా ఉండడం, పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది నెలకొంది. భద్రాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సీరోలు పోలీసులు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో యూరియా పంపిణీలో పోలీసుల బందోబస్తు తక్కువగా ఉంది. దీంతో రైతులు ఎవరిమాట వినే పరిస్థితిలో లేకుండా పోయారు. ఒకే బస్తా పంపిణీ చేస్తుండడంతో మండిపడ్డారు. యాసంగి వరికు, మొక్కజొన్న సాగుకు ఒక్క బస్తా యూరియా సరిపోదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ వద్ద తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న సీరోలు ఎస్సై సంతోష్ అదనపు సిబ్బందిని అక్కడికి పంపించడంతో రైతులు శాంతించారు. విషయం తెలుసుకున్న ఏఓ చాయారాజ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కురవి మండల కేంద్రంతోపాటు నేరడ, గుండ్రాతిమడుగు(విలేజి) సొసైటీల్లో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఒకరికి ఒకే బస్తా పంపిణీ రైతుల తోపులాట -
46 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
దంతాలపల్లి: 46 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న మిత్రులు విద్యార్థి దశ తర్వాత వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. కానీ, తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు మరోసారి కలిశారు. ఆరుపదుల వయస్సులో ఉన్నవారంతా కలిసుకునేందుకు తాము చదువుకున్న పాఠశాలనే వేదిక చేసుకున్నారు. మండలంలోని పెద్దముప్పారంలో 1979లో ఏడో తరగతి పూర్తి చేసిన నాటి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. చిన్నతనంలో తాము చదివిన, ఆడుకున్న బడి ఆవరణలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు, అప్పటి గురువులు గోపిరెడ్డి, సోమిరెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, పూర్వ విద్యార్థులు అశోక్‌రెడ్డి, సమ్మయ్య, మార్కండేయ, జ్యోతి, రజియా బేగం, కర్ని వెంకన్న, ముత్యం వెంకన్న పాల్గొన్నారు. -
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
గార్ల: రాజస్థాన్‌లో జనవరి 2 నుంచి జరిగే జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు అండర్–19 విభాగంలో తెలంగాణ టీంలో గార్లకు చెందిన పిల్లలమర్రి వెంకటసాయి ఎంపికయ్యారు. గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వెంకటసాయి జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక కావడంపై గార్ల సీహెచ్‌సీ డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్, ఆయనను శాలువాతో సన్మానించి రాజస్థాన్ వెళ్లేందుకు ఆర్థికసహాయం అందించారు. వార్డుసభ్యులు తోడేటి శ్రీనుగౌడ్, ఇస్లావత్ రావూజీ, ఎస్కే యాకూబ్‌పాషా, వేశమల్ల రాజశేఖర్, ఈశ్వర్‌లింగం, గోపాల్‌రెడ్డి, నవీన్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో మహిళలు పూజలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. జంపన్నవాగులో బస్తాలతో అడ్డుకట్ట ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులో నీటి లభ్యత కోసం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇసుక బస్తాలతో అడ్డుకట్ట పనులు చేపట్టారు. మేడారం భక్తులు పుణ్యస్నానాల కోసం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీటి లభ్యతగా ఉండేలా వాగులో తొమ్మిది ప్రదేశాల్లో బస్తాల్లో ఇసుక నింపి వాగుకు అడ్డుకట్టగా వేస్తున్నారు. నీరు నిల్వ ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. చట్ట సభల్లో ప్రస్తావించాలి కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరా రు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేట ర్లు జక్కుల రవీందర్‌యాదవ్, విజయశ్రీ రజా లి, జలగం రంజిత్‌రావు, సంపత్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం ఆర్టీసీ బస్టాండ్‌లో భద్రాచలం, కొత్తగూడెం క్యూలైన్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతర సమయంలో కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న తరుణంలో క్యూలైన్లపై తడుకల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు నీడ కోసం పలుచటి తడుకలను ఏర్పాటు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. -
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో శ్రీమోంథాశ్రీ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా రైతులు 2025లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. -
అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్
మహబూబాబాద్ రూరల్ : అభివృద్ధికి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో ఆవిర్భవించిందన్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరకు త్యాగాలతో కూడిన సేవలను భారతదేశానికి గాంధీ, నెహ్రూ కుటుంబాలు అందించాయన్నారు. టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, కాటా భాస్కర్, లింగాల వీరభద్రంగౌడ్, పోతరాజు రాజు, లక్ష్మి, సత్యమనోరమ, చెన్నూరి విజయలక్ష్మి, విజయ, చెన్న సీతారాములు, ఎండి.హారుణ్, ఖలీల్, గపూర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
హేమాచల క్షేత్రంలో సందడి
● సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రం ఆదివారం మేడారం భక్తులతో సందడిగా మారింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు హేమచలుడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి వివిధ రకాల అర్చనలు, నాభిచందన ప్రసాదం, శాశ్వత పూజ పేరిట రూసుము వసూలు చేస్తున్నారే తప్ప.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం శద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం లేదని భక్తులు అంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
కలిసిరాని కాలం
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు !జిల్లాలో నూతన పంటల సాగు మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఈఏడాది మోంథా తుపానుతో పంటలకు కొంతమేర వాటిల్లింది. కానీ, భూగర్భజల మట్టం పెరగడంతో నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. ఇదిలా ఉండగా.. పలువురు రైతులు వినూత్న పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరూ సాగు చేయని పంటల సాగు ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 2,04,018 ఎకరాల్లో పంటల సాగు చేయగా.. ఖరీఫ్‌లో 4,22,641 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. అంతర పంటగా వక్క సాగు.. తొర్రూరు మండలంలోని గుర్తూరు, అమ్మాపురం గ్రామాల్లో, చిన్నగూడూరు మండలకేంద్రంలో ఈ ఏడాది కొత్తగా వక్క సాగును రైతులు ప్రారంభించారు. పామాయిల్ తోటల్లో అంతరపంటగా వక్క పంటను సాగు చేశారు. మాకాడామియనట్ సాగు చేశా.. ఏడాది క్రితం రెండున్నర ఎకరాల్లో మాకాడామియనట్ పంటసాగు ప్రారంభించాను. దక్షిణాఫ్రికా నుంచి ఈ మొక్కలను కర్ణాటక రాష్ట్రంలోని శాస్త్రవేత్తల ద్వారా తెప్పించాను. ఒక మొక్క ఖరీదు రూ.1,600 వరకు ఉంటుంది. రెండున్నర ఎకరాల్లో 500 మొక్కలు నాటించాను. జిల్లా రైతులకు కొత్త పంటలను పరిచయం చేయాలనే ఆలోచనతో మాకాడామియనట్ సాగుకు సిద్ధమయ్యాను. మాకాడామియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి, కాంఫెక్షనరీ ఉత్పత్తుల్లో, వివిధ రకాల క్రీములు, లోషన్లు, నూనె, షాంపూల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. – మాధవపెద్ది వినిల్‌రెడ్డి, రైతు, అప్పరాజుపల్లి ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా (ఎకరాల్లో).. అంచనా : 15,65,250సాగైంది : 15,82,755వరి అంచనా : 85,8376సాగైంది : 8.15 లక్షలు పత్తి సాగు అంచనా : 5,79,863పత్తి సాగైంది : 5,83,219 వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల్లో ఉమ్మడి జిల్లాలో నష్టం ఇలా..మొత్తం రైతులు : 1,29,228ఎకరాలు : 2.16 లక్షలు రైతులను వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ధీమా ఇవ్వని ‘బీమా’.. ఇంకా చేతికందని పరిహారం పెరిగిన వాణిజ్య పంటల సాగు... వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు రైతులకు తప్పని ఎరువుల కొరత.. వరి, పత్తికి దక్కని మద్దతు ధర ఒడిదుడుకుల మధ్య సాగిన వ్యవసాయం -
నేటి నుంచి యాప్ ద్వారానే యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్ : యూరియా పంపిణీకి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలను ప్రారంభిస్తున్నామని డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో మండలంలోని ఎరువుల డీలర్లకు ఫెర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ పని విధానంపై ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంలో జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా యూరియా సరఫరాకు ఎంపిక చేశారన్నారు. ఇకనుంచి రైతులు యూరియా కోసం ఇబ్బందిపడకుండా వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే జిల్లాలో అన్ని ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్న యూరియాను సాగుచేసే పంటలకు బుకింగ్ చేసుకుని పొందవచ్చన్నారు. యూరియా అవసరమున్న రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రైతు లాగిన్‌లో తమ పంటల సాగు వివరాలు నమోదు చేసి తమకు అందుబాటులో యూరియా ఉన్న డీలర్ వద్ద పొందవచ్చని తెలిపారు. సందేహాలు ఏమైనా ఉంటే మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు బెల్లంకొండ సాయిప్రకాష్, రెడ్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణ
సాక్షి, మహబూబాబాద్: 2025 సంవత్సరంలో నేరాలు నియంత్రణలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది జిల్లాలో పాత నేరాలకు బదులు కొత్తరకం నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే మొత్తంగా కేసుల సంఖ్య తగ్గినా.. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. నూతన టెక్నాలజీని వినియోగించుకొని నిందుతులు నేరాలకు పాల్పడగా.. పోలీసులు అదేస్థాయిలో రికవరీ చేసేందుకు పోటీ పడ్డారు. మొత్తంగా 65 శాతం కేసుల్లో శిక్ష పడింది. అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు, బాలికల కిడ్నాప్ మొదలైన కేసులు నమోదు కాగా.. అందులో కొందరికి శిక్ష పడింది. తగ్గిన కేసులు.. 2024లో మొత్తం 4,375 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 4,275 కేసులు మాత్రమే నమోదు చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. పెరిగిన రోడ్డు ప్రమాదాలు జిల్లా వ్యాప్తంగా 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా నమోదైంది. రోడ్డు ప్రమాదంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం సమానంగా 121 మంది మరణించారు. అదే విధంగా గతఏడాది 134మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడగా.. ఈ ఏడాది 159 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా స్వల్పగాయాలతో బయట పడిన ప్రమాదాలు గత ఏడాది 19 ఉంటే ఆ సంఖ్య 37కు చేరింది. అయితే ఇందులో అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అవగాహన ర్యాలీలు, ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించింది. మహిళలపై పెరిగిన నేరాలు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాపులు, హత్యల కేసులు గతంతో పోలిస్తే పెరిగాయి. గత ఏడాది 43 అత్యాచార కేసులు నమోదు కాగా.. వాటి సంఖ్య 55కు పెరిగింది. అదే విదంగా కిడ్నాపులు 42 నుంచి 54కు చేరాయి. ఈ కేసుల్లో 11 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఒకరికి, 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరోకేసులో విధించగా.. ఇతర చిన్న కేసులకు సైతం ఆయా స్థాయిలో శిక్షలు పడ్డాయి. బాలికల లైంగిక కేసుల విషయంలో సున్నితంగా దర్యాప్తు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఆర్థిక మోసాలు జిల్లాలో ఆర్థిక మోసాలకు సంబంధించి మొత్తంగా 633 ఫిర్యాదులు నమోదు కాగా, బాధితులు మొత్తం రూ.4.65 కోట్లు కోల్పోయారు. సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా రూ.1.06 కోట్లు (354 ఫిర్యాదులు) హోల్డ్ చేయబడింది. ఈ కేసుల్లో 200 ఫిర్యాదులపై కేసులు నమోదు చేయగా, 153 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 212 ఫిర్యాదులకు సంబంధించిన రూ.60.26 లక్షల రీఫండ్‌ను బాధితులకు అందించేలా చర్యలు చేపట్టబడింది. ఆర్థిక మోసాలు కాకుండా.. మొత్తం 188 ఫిర్యాదులు నమోదయ్యాయి. తగ్గిన కేసులు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు కోర్టు కేసుల్లో 65 శాతం శిక్షలు సైబర్ నేరాలపై ప్రత్యేక విశ్లేషణ ఆస్తుల చోరీలో రూ.1.13 కోట్లు రికవరీ మహిళలు, పిల్లల రక్షణపై ప్రత్యేక చర్యలుకేసులు 2024 2025 చోరీలు 159 148 చీటింగ్ 256 268 హత్యాయత్నం 28 28 హత్యలు 16 21 రోడ్డు ప్రమాదాలు 274 317 ఇతర బీఎన్ఎస్ 941 1,198 ఎస్ఎల్ఎల్ 1099 492 మిస్సింగ్ 211 258 -
కాంగ్రెస్ .. పేదల కష్టాలు తీర్చే ప్రభుత్వం
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్.. పేదల కష్టాలు తీర్చే ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్.. మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, అలాంటి సర్కారులో సర్పంచులుగా ఎన్నికయ్యారని, ఓడిపోయిన వారు అభద్రతా భావానికి లోనుకావొద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సర్పంచులందరూ ప్రజలకు మంచి సేవలు అందించి గ్రామాలను అభివృద్ధి ప థంలో నడిపించాలని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజాప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, పేదలకు భరోసా ఇచ్చే ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నారని, చేసింది త క్కువ ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణ, గోదావరి నీళ్లను ఇతరులకు ధారాదత్తం చేసిన ప్రబుద్ధులని, రెండేళ్లు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకొచ్చి కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చుక్క నీటిని కూడా వదులుకోదన్నారు. అవాకులు, చవాకులు పేల్చే నాయకులు ఈ నెల 29వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహా యం రఘురాంరెడ్డి, ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్ల య్యనాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, జాటోత్ రాంచంద్రునాయక్, కోరం కనకయ్య, సంవిధాన్ బచాఓ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోత్ నెహ్రూనాయక్, మానుకోట, కేసముద్రం ఏఎంసీ చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి.. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన నూకల రామచంద్రారెడ్డి స్మారక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలిగినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
ముగిసిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
● సీనియర్స్‌లో మహబూబాబాద్ జట్టుకు ప్రథమస్థానంకేసముద్రం: కేసముద్రం మున్సిపల్ పరిధి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు మూడో రోజు శనివారం ముగిశాయి. సీనియర్స్ విభాగంలో (పురుషులు) మహబూబాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. నారాయణపేట ద్వితీయ స్థానం, నల్గొండ, మహబూబ్‌నగర్ జట్లు సంయుక్తంగా తృతీయస్థానంలో నిలిచాయి. సీ్త్రల విభాగంలో మేడ్చల్ జట్టు ప్రథమస్థానం, మహబూబ్‌నగర్ ద్వితీయస్థానం, రంగారెడ్డి, నల్గొండ జట్లు తృతీయస్థానంలో నిలిచా యి. పాస్ట్ఫైవ్ విభాగంలో(పురుషులు) మహబూ బ్‌నగర్ ప్రథమస్థానం, ఖమ్మం ద్వితీయస్థానం, కరీంనగర్, మేడ్చల్ జట్లు తృతీయస్థానంలో నిలిచా యి. సీ్త్రల విభాగంలో మేడ్చల్ ప్రథమస్థానంలో నిలవగా, ఖమ్మం జట్టు ద్వితీయ, రంగారెడ్డి, అసీ ఫాబాద్ జట్లు తృతీయస్థానంలో నిలిచాయి. మిక్స్ డ్ విభాగంలో మేడ్చల్ ప్రథమస్థానంలో, మహబూబ్‌నగర్ ద్వితీయస్థానం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జట్లు తృతీయస్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు విక్రమ్ఆదిత్యారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరీషారాణి, జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ప్రధానకార్యదర్శి తుమ్మ సురేష్, పీడీ కొప్పుల శంకర్, ఆర్టీఏ జిల్లా డైరెక్టర్ రావుల మురళి, బీఆర్ఎస్ పార్టీ నేత నీలం దుర్గేష్, పీసీసీ సభ్యుడు గుగులోతు దస్రూనాయక్, కొల్లూ రు శ్రీనివాస్, ప్రభుకిరణ్, ఏలేందర్, సంతోష్‌రెడ్డి, సదానందం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు
మహబూబాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆగం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్లో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షత వహించగా కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను తిట్టడం, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాల్లో ఎవరికీ బీ ఫాం ఇస్తే వారిని గెలిపించాలన్నారు. కమీషన్ల రూపంలో ప్రజాధనమంతా ఢిల్లీకి పోతుందన్నారు. అధికార పార్టీ ఆగడాలు, ఆరాచకాలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థులు వీరోచిత పోరాటం చేసి గెలిచారన్నారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బ, అయ్యా సొమ్ము కాదని, రాజ్యాంగ హక్కున్నారు. రాష్ట్రాన్నికి సీఎం ఎలాగో గ్రామానికి సర్పంచ్ అలా అన్నారు. ఢిల్లీకి మూటలు, సంచులు, చెప్పులు మేసే సన్నాసి రేవంత్‌రెడ్డి అన్నారు. 500 జనాభా ఉన్న తండాలను జీపీలను చేయడంతో పాటు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ పది శాతం చేసి వారికి ఆత్మ గౌరవం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆంగోత్బిందు, రాకేశ్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, రా మ్మోహన్‌రెడ్డి, మాళ్ల మురళీధర్‌రెడ్డి, మార్నెనీ వెంకన్న, యాకూబ్‌రెడ్డి, భరత్‌కుమార్ రెడ్డి, రవి చందర్‌రెడ్డి, గుడిపూడి నవీన్, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, కెఎస్‌ఎన్‌రెడ్డి, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్.. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కమీషన్ల రూపంలో ఢిల్లీకి పోతున్న ప్రజాధనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు తీరని అన్యా యం చేశారని ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర విమర్శించారు. పార్టీ గుర్తు లేకుంటేనే బీఆర్ఎస్కు అన్ని సర్పంచ్ స్థానాలు వచ్చాయని, రాబోయే ఎన్నికలు పార్టీ గుర్తుతో ఉంటాయని, బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుస్తుందని ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్రావు అన్నారు. గత ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని ప్రజలు అనుకోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి చూడాల్సి వచ్చిందని, పార్టీ గుర్తు ఎన్నికల్లో వార్ వన్ సైడే అని మాజీ మంత్రి దయాకర్‌రావు అన్నారు. నూకల రామచంద్రా రెడ్డిని కాంగ్రెస్ మర్చి పోయిందని, కేసీఆరే గుర్తు పెట్టుకుని విగ్రహం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాబోయే సీఎం కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో కరెంట్ తీసి ఫలితాలను తారు మారు చేశారని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ప్రభుత్వం.. బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మండిపడ్డారు. -
కాంగ్రెస్ .. పేదల కష్టాలు తీర్చే ప్రభుత్వం
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఆగం చేశారు ● సీఎం రేవంత్‌కు కేసీఆర్‌ను తిట్టడమే పని ● కమీషన్ల రూపంలో ఢిల్లీకి ప్రజాధనం ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్● గత ప్రభుత్వం గొప్పలు చెప్పి కాలం వెళ్లదీసింది.. ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ● జిల్లాలోని నూతన సర్పంచ్‌లకు సన్మానం -
ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు మెండు
కేయూ క్యాంపస్ : ఫార్మసీ రంగంలో ఉపాధి అవకా శాలు మెండుగా ఉన్నాయని, వైద్యుడి కంటే ఫార్మసిస్టే కీలకమని హైదరాబాద్ అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూని వర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రారంభమాయ్యయి ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. గొప్ప కళా శాలంటే భ వనాలు వసతులు కాదు, అక్కడ అధ్యాపకులు చేసే విద్యాబోధన అన్నారు. అరబిందో సంస్థ 1986లో రూ.20 లక్షల తక్కువ మూలధనంతో నే ఏర్పాటు చేశామని, నేడు కెమిస్ట్ ఉత్పత్తిదారుడిగా ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించిందన్నారు. నాణ్యత పాటించటడంతోనే ఇది సాధ్యమైందన్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో తా ము చదువుకున్న రోజుల్లో వసతులు తక్కువగా ఉండేవని, అయినా క్రమశిక్షణ గల అధ్యాపకులతో ఉన్నత స్థితికి చేరుకుని దేశ విదేశాల్లో ఎన్నో ఫ్యాక్టరీలను స్థాపించానని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ డీన్ మన్సూర్ఖాన్ అన్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలి ప్రపంచ స్థాయి పరిశోధనలు కలిగిన కేయూ ఫార్మసీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో మంది దేశ విదేశాలల్లో స్థిర పడ్డారని, వీరిని యువ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 3,000 మంది బీ ఫార్మసీ, 1800 మంది ఎం.ఫార్మసీ 400 మంది పీహెచ్‌డీలు, 3 వేలకుగాపై పరిశోధన పత్రాల సమర్పన కళాశాల గొప్పతనమన్నారు. కేయూ రిటైర్డ్ ఆచార్యులు వి. కిషన్ మాట్లాడుతూ ఎండోమెంట్ లెక్చర్లు, ఎండోమెంట్ చైర్, డిజిటల్ తరగతి గదులు, ధన్వంతి విగ్రహం, ల్యాబ్, లైబ్రరీ పెంపు వసతులు టార్గెట్‌గా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఫార్మసీ కళాశాల పూర్వవిద్యార్థి, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు సాంబారెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, డీన్ ఆచార్య గాదె సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. ప్రసాద్, డిప్యూటీ డ్రగ్‌కంట్రోల్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎ. రాంకిషన్, యూఎస్ఏ ఎఫ్‌డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి, తెలంగాణ డ్రగ్స్ కంట్రోలర్ జాయింట్ డైరెక్టర్ జి. రాంధన్, రిటైర్డ్ ప్రొఫెసర్లు మల్లారెడ్డి, అమరేశ్వర్, రాంభహు, తదితర పూర్వ విద్యార్థులు తరలొచ్చారు. కాగా, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఆదివారం (నే డు) ముగియనున్నాయి. వైద్యుడి కంటే ఫార్మసిస్టే కీలకం.. అరబిందో ఫార్మా డెరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి -
చలికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి
● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుమన్ సూచనలునెహ్రూసెంటర్: చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ బండి సుమన్ సూచించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ఆయన ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయంపై ప్రొఫెసర్లు బండి సుమన్, మోహన్, వసంత్ ప్రజలకు వివరించారు. ప్రశ్న: చలికాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– లక్ష్మణ్ గూడూరు, రఘు నడివాడ, శ్రవన్‌కుమార్ బయ్యారం, కరుణాకర్ కేసముద్రం డాక్టర్: పిల్లల్లో చలి, వేడిని తట్టుకునే శక్తి తక్కువ. చలిలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. స్వెట్టర్లు వాడాలి. జలుబు, దగ్గు వంటివి వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయొద్దు. ప్రశ్న: వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? – చక్రధర్ చిన్నగూడూరు, శేషాద్రి గుండంరాజుపల్లి, రజాక్ మానుకోట, కుమారస్వామి కంఠాయపాలెం డాక్టర్: చలి, మంచు తగ్గేవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రొటీన్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. స్వెట్టర్లు, దుప్పట్లు వినియోగించాలి. ఇప్పటికే ఏదేని జబ్బుకు సంబంధించి మందులు వాడుతుంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి. ప్రశ్న: జలుగు, దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదు?– సురేష్ బొద్దుగొండ, మహేశ్వరీ మానుకోట, వెంకన్న మానుకోట, అమర్నాథ్ బయ్యారం, రితిక మానుకోట, సతీష్ మచ్చర్ల, శ్రీనివాస్ అమనగల్ డాక్టర్: వాతావరణ పరిస్థితులు, చల్లగాలుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్తో కూడా తగ్గకుండా ఉండొచ్చు. రోజుల తరబడి తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. ప్రశ్న: ఉదయం వాకింగ్‌కు వెళ్లొచ్చా..? – యాకేందర్ తొర్రూరు, చారీ కురవి, రాజునాయక్ మరిపెడ, యాదగిరి కొత్తగూడ డాక్టర్: ఉదయం చలి ఎక్కువగా ఉంటుంది. వేకువజామునే కాకుండా చలి తగ్గాక వాకింగ్ వెళ్లాలి. ఇంట్లోనే వ్యాయాయం చేయడం మేలు. ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – వీరన్న మానుకోట, విజయ్ జయ్యారం, కృష్ణవేణి గూడూరు, స్వామి గార్ల డాక్టర్: వేడి ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే పులుపు తగ్గించాలి. వారానికి రెండుసార్లు మాంసాహారం తీసుకోవచ్చు. ప్రశ్న: చర్మ సమస్యలు, దురద వస్తున్నాయి? – ఉస్మాన్ మానుకోట, కుమారస్వామి తొర్రూరు, అశోక్ మరిపెడ, సతీష్ రాంపురం డాక్టర్: చలికాలం చేతులు, కాళ్లు పగుళ్లకు గురైతే వైద్యులను సంప్రదించి లోషన్స్ వాడాలి. కాళ్లు, చేతులకు సాక్స్ ధరించాలి. ప్రశ్న: ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా? – వెంకన్ననాయక్ మానుకోట, వీరన్న దంతాలపల్లి, రాజశేఖర్ కేసముద్రం డాక్టర్: అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలో వైద్యులను సంప్రదించి వైద్య సహాయం తీసుకోవచ్చు. జీజీహెచ్‌కు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రశ్న: గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి? – సుధాకర్ జంగిలిగొండ, వెంకన్న కొత్తగూడ, మాలిక్ తొర్రూరు, ప్రకాశ్ కురవి డాక్టర్: పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసేలా డీఎంహెచ్ఓకు తెలియజేస్తాం. ప్రశ్న: ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – వీరన్న కేసముద్రం, వెంకటేష్ మానుకోట, మురళీ మానుకోట, రాంబాబు గార్ల డాక్టర్: ఆస్తమా రోగులు చలిలో బయటకు వెళ్లొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రి లో వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రశ్న: చలిమంటలు వేసుకోవచ్చా? – గణేష్ మానుకోట, రమేష్ లక్ష్మీపురం, వినయ్‌కృష్ణ అమీనాపురం, కుమార్ తొర్రూర్ డాక్టర్: చలిమంటల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. మంటల నుంచి వచ్చే పొగతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. ఆస్తమా, జలుగు, దగ్గు ఉంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రశ్న: హాస్టల్స్‌లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి? – అమీర్ తొర్రూరు, మధు మానుకోట, శ్రావణ్ మానుకోట, వెంకన్న మరిపెడ డాక్టర్: విద్యార్థులు ఉదయమే చన్నీళ్లతో స్నానం చేస్తుంటారు. చలి తీవ్రతతో జలుగు, దగ్గు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక క్యాంపులు నిర్వహించేలా వైద్యశాఖ అధికారులకు తెలియజేస్తాం. ప్రశ్న: జీజీహెచ్‌లో దంతాలకు చికిత్స ఉందా? – వినయ్ ముడుపుగల్, రమేష్ గూడూరు, డాక్టర్: వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆస్పత్రికి వచ్చి చూపించుకోవచ్చు. దంత సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రశ్న: ఇదివరకే ఉన్న వ్యాధులు చలికాలంలో రెట్టింపు అవుతాయా..? – కుమారస్వామి అమ్మపాలెం, యుగేందర్ గార్ల, లింగ్యా మల్యాల డాక్టర్: చలితీవ్రత పెరుగుతుండడంతో శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదివరకే ఉన్న వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. చలికి బయటకు రాకుండా ఉండాలి. వైద్యుల సలహాతో మందులు వాడాలి. ప్రశ్న: చలికాలం ఏ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి? – అరుణ్ కొత్తగూడ, రవి మచ్చెర్ల, జానీ మానుకోట, వేణు సీతారాంపురం డాక్టర్: చలికాలం ప్రతీఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యేకంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. -
ఎన్పీడీసీఎల్కు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్ రక్షణాత్మక విధానాలు, ఉద్యోగుల ఆరోగ్యంపై కనబరుస్తున్న శ్రద్ధకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా –2024 సంవత్సరానికిగాను సేఫ్టీ అవార్డు అందించింది. ఈ నెల 23న ముంబాయిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ (ఐటీ,ప్లానింగ్) ఎన్.శ్రవణ్ కమార్, వరంగల్ సర్కిల్ టెక్నికల్ డీఈ, సేఫ్టీ ఆఫీసర్ వై.రాంబాబు అవార్డు స్వీకరించారు. ఈ అవార్డును శనివారం హనుమకొండలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఈ సేవలను గుర్తించిన నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2024 సంవత్సరానికి సేఫ్టీ అవార్డు అందించిందన్నారు. 5,580 మంది ఉద్యోగులకు, 787 మంది కాంట్రాక్ట్ కార్మికులకు భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,340 పొలం బాట కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్యం చేసినట్లు తెలిపారు. ౖ ఈ అవార్డు రావడంలో ప్రతీ ఉద్యోగి కృషి ఉందన్నారు. పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ? కాజీపేట: కాజీపేట పట్టణంలో ఇటీవల ఏటీఎంలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ము ఠా కాజీపేటకు వచ్చి ఏటీఎం కేంద్రాల్లో కస్టమర్లను బోల్తా కొట్టిస్తూ డబ్బులు దోచుకుంటుంది. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయ గా సీఐ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో క్రైం పార్టీ పోలీ సులు పట్టణంలోని పలు ఏటీఎం కేంద్రాలపై నిఘా పెంచారు. నాలుగు రోజుల క్రితం ఓ ఏటీఎంలో బాక్స్ తెరచి డబ్బులు కాజేయడానికి యత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వి చారించగా నిందితుడి సమాచారంతో మరో ఆరుగురిని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. నిందితులు ఏటీఎం బాక్స్‌లు తెరచి ప్లాస్టిక్ కవర్లను లోపల అమర్చుతున్నారు. ఈ విషయాలు తెలియని ఖాతా దారులు డబ్బులు డ్రా చేయగా బయటకు రావడం లేదు. ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసె జ్లు మాత్రం వస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఖాతాదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కొద్ది రోజులుగా నిఘా పెంచి నిందితులను పట్టుకున్నట్లు తెలిసింది. -
అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా..
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిడోర్నకల్/మరిపెడ: రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పని చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డోర్నకల్‌లో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, రూ.20 కోట్లతో చేపడుతున్న ట్యాంక్ బండ్ పనులు, రూ.8 కోట్లతో నిర్మిస్తున్న డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బిషప్ ఈజరయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో రూ.6.50 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటికాల్వ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు నెహ్రూనాయక్, నర్సింహమూర్తి, మున్సి పల్ కమిషనర్ నిరంజన్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, హనుమ, గంగా ధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉడకని అన్నం.. రుచిలేని కూరలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ మెస్‌లో భోజనం నాణ్యతగా ఉండటం లేదని, దీనిపై పలుమార్లు విన్నవించినా హాస్టళ్ల డైరెక్టర్ పట్టించుకోవడం లేదని శనివారం మధ్యాహ్నం ఆ హాస్టల్ విద్యార్థులు ఉడకని అన్నం తీసుకొచ్చి మొదటి గేట్‌వద్ద వద్ద ధర్నా నిర్వహించారు. స్టీమ్‌పై వంట చేయడంతో అన్నం సరిగా ఉడకడం లేదని, అలాగే కూరలు కూడా నాణ్యతగా ఉండడం లేదన్నారు. దీంతో తాము ఎలా తినాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్.పి రాజ్‌కుమార్.. ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో వారితో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, కేర్ టేకర్ కూడా సరిగా ఉండడం లేదని ఆరోపించారు. కూరల్లో కారం, పసుపు, మసాలా అధిక స్థాయిలో వేస్తున్నారని, తద్వారా తినలేకపోతున్నామని పలువురు విద్యా ర్థులు ఆరోపించారు. మెస్‌లోకి వచ్చి పరిశీలించాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాజేందర్.. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తారనని విద్యార్థులకు హామీ ఇచ్చారు. సరిగా వండాలని సంబంధిత వర్కర్లకు చెబుతామని, వారు సరిగా చేయకపోతే మార్చుతామని తెలిపారు. న్యూపీజీ హాస్టల్మెస్ను సందర్శించిన ఇన్చార్జి రిజిస్ట్రార్.. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ క్యాంపస్‌లోని న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ మెస్‌ను సందర్శించి పరిశీలించారు. అక్కడి వర్కర్లతో మాట్లాడి వంటలు సరిగా చేయాలన్నారు. లేనిపక్షంలో మా ర్చుతామని హెచ్చరించారు. అలాగే, మెస్ కమిటీలో ఉన్నవారు ఎప్పటికప్పుడు అన్నం, కూరల నాణ్యతను పరిశీలించుకోవాలన్నారు. అధికారుల తీరుపై న్యూపీజీ హాస్టల్ విద్యార్థుల ఆగ్రహం ఉడకని అన్నం తీసుకొచ్చి మొదటి గేట్ వద్ద ఆందోళన నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ -
రాష్ట్ర సదస్సుకు జనగామ ముస్తాబు..
జనగామ రూరల్: రెండు రోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విద్యా సదస్సు విస్తృత స్థాయి సమావేశాలకు జనగామ ముస్తాబైంది. పట్టణ ప్రారంభం పెంబర్తి కాకతీయ తోరణం, యశ్వాంతాపూర్ శివారులో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్ హాల్లో 28, 29 తేదీల్లో విద్యా సదస్సులు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ దశ, దిశను మార్చేవిగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30గంటలకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు నుంచి సమావేశాలు జరిగే సయ్యద్ జియాఉద్దీన్ ప్రాంగణం (మాంగళ్య ఫంక్షన్ హాల్) వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం సభ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నార న్నారు. విద్యా సదస్సుల్లో డాక్టర్ కె. నాగేశ్వర్, మాడభూషి శ్రీధర్ వివిధ అంశాలపై కీలకోపన్యాసాలు చేస్తారన్నారు. రెండో రోజు సోమవారం ప్రతినిధుల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సంఘం ప్రతినిధులు 500 మంది పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు యూటీఎఫ్ రాష్ట్ర విద్యాసమావేశాలు హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు -
డయల్ యువర్ డీఎంకు స్పందన
తొర్రూరు: ఆర్టీసీ అధికారులు శనివా రం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 15 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వేములవాడకు ప్రత్యేక సర్వీస్ నడపాలని, దంతాలపల్లిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తేవా లని, కేసముద్రం వరకు బస్సులు నడపాలని పలువురు కోరారు. అన్నారం, పెరికేడు మీదుగా వరంగల్‌కు సర్వీస్ వేయాలని, బీరిశెట్టిగూడెంలోని రిక్వెస్ట్ స్టాప్‌లో బస్సులు నిలపాలని, బస్సులు సమయ పాలన ప్రకారం నడిచేలా చూడాలని విజ్ఞప్తులు వచ్చినట్లు డీఎం పద్మావతి తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలి గూడూరు: అర్హులైన ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో శనివారం ఆయన మాట్లాడారు. ఐదో తరగతి నుంచి 8వ తరగతి బాలురకు రూ.1,000, బాలికలకు రూ.1,500 చొప్పున స్కాలర్షిప్ ఉంటుందని, 9, 10వ తరగతి బాలబాలికలకు రూ.3,500 చొప్పున స్కాలర్షిప్ ఉంటుందని తెలిపారు. అర్హులైన డే స్కాలర్ విద్యార్థులు కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలతో స్కాలర్షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని ఊట్ల మట్టెవాడ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలతోపాటు సీతానగరంలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి తెలిపారు. ప్రత్యేక తరగతులతో పదో తరగతి విద్యార్థులు ఉన్నత శ్రేణిలో రాణించేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్, హెచ్ఎం శరత్‌బాబు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. హేమాచలుడి సన్నిధిలో అడ్వకేట్ జనరల్ మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారి కి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించా రు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రామప్పలో భక్తుల సందడి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. గోదావరి వెంట హెలికాప్టర్ చక్కర్లు కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరం గోదావరి వెంట ఓ హెలికాప్టర్ శనివారం చక్కర్లు కొట్టింది. ఆ హెలికాప్టర్‌పై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదు. గోదావరి పొడవునా సంచరించిన హెలికాప్టర్ సమీపంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించినదని పలువు రు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో వారానికి రెండు మూడు సార్లు వీఐపీ, వీవీఐపీ, పోలీసు అధికారులు నిత్యం హెలికాప్టర్లపై విహంగ వీక్షణం చేయడం జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆ హెలికాప్టర్ ఎక్కడిదని పోలీసులు కూడా ఆరాతీస్తున్నట్లు సమాచారం. -
చురుగ్గా కస్టమర్ చార్జీ వసూళ్లు..
హన్మకొండ: వ్యవసాయ సర్వీస్‌ల కస్టమర్ చార్జీల వసూళ్లపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే విద్యుత్ పంపిణీ మండలి ప్రతీ సర్వీస్‌కు రూ.30 చొప్పున కస్టమర్ చార్జీలు విధిస్తోంది. ఏడాదికి మొత్తం రూ.360 చొప్పున ఏటా డిసెంబర్లో వసూలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా బిల్లుల వసూళ్ల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. స్వల్ప మొత్తం కావడంతో ప్రతీ సర్వీస్ నుంచి బకాయిలు వసూలు చేసే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక విద్యుత్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కస్టమర్ చార్జీలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు వ్యవసాయ సర్వీస్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతుల నుంచి నిరసన, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో వ్యవసాయ సర్వీస్‌లకు విద్యుత్ కోత విఽధించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌లు మొత్తం 13,84,126.. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉచిత వ్యవసాయ వి ద్యుత్ సర్వీస్‌లు మొత్తం 13,84,126 ఉన్నాయి. వీ టి బకాయిలు మొత్తం రూ.119,56,41,000 ఉన్నా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉచిత వ్యవసాయ సర్వీస్‌లు 4,02,062 ఉండగా బకాయిలు రూ.37, 62,82,000 ఉన్నాయి. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు విద్యుత్ అధికారులు గ్రామాల్లో రైతులను కలిసి కస్టమర్ చార్జీలు చెల్లించాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కిల్ వారీగా వ్యవసాయ సర్వీస్‌ల బకాయిల వివరాలు సర్కిల్ ఉచిత వ్యవసాయ బకాయిలు సర్వీస్‌లు (రూ.లక్షల్లో) హనుమకొండ 68315 813.35 వరంగల్ 71633 776.03 భూపాలపల్లి 72011 1179.49 జనగామ 93532 89.15 మహబూబాబాద్ 96571 904.80టీజీ ఎన్పీడీసీఎల్ వ్యవసాయ బకాయిలు రూ.119.56 కోట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.37.62 కోట్లు.. ప్రతీ సర్వీస్‌కు నెలకు కస్టమర్ చార్జీ రూ.30 ఏడాదికి రూ.360 చొప్పున వసూళ్లు ఏటా డిసెంబర్లో వసూళ్లు..గ్రామాల్లో ముమ్మరంగా సాగుతున్న ప్రక్రియ -
డ్రమ్ సీడర్ విధానం లాభదాయకం
● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ● అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ గూడూరు: వరి సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి అధిక ఆదాయం పొందేందుకు వ్యవసాయ అధికారులు యాంత్రీకరణ సాగుపై దృష్టి సారించారు. ఇదే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తుండడంతో రైతులు ఈ విధానంలో వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ సాగు విధానం కన్నా డ్రమ్ సీడర్ పద్ధతులు ఎంతో లాభదాయకమని రైతులు అంటున్నారు. 4 వేల ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో డ్రమ్ సీడర్ విధానంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం యాసంగి వరి సాగు కొన్ని మండలాల్లో ఆలస్యమవుతున్నందున మరో వారం రోజుల్లో సాగు పుంజుకుంటుందని చెపుతున్నారు. ప్రయోజనాలు.. ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలు సరిపోతాయి. 24 గంటలపాటు నీటిలో నానబెట్టి, మరో 24 గంటలపాటు మండె కట్టాలి. వరి గింజ పగిలితే చాలు పంట ఎదుగుతుంది. విత్తనాలు చల్లే సమయానికి పొలంలో నీరు లేకున్నా కేవలం బురదగా ఉంటే చాలు. ఒక్కో వరుస మధ్య 20 సెంటిమీటర్ల దూరం ఉండేలా గింజలు పొలంలో పడతాయి. డ్రమ్ సీడర్‌తో ఎకరం విత్తడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నాటుకు 12 మందికి బదులు ఇద్దరితో పని పూర్తి చేయొచ్చు. విత్తిన నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత నీరు తీసేసినపుడు టాప్ స్టార్ ఆఫ్ లీటరు నీటిలో కలిపి 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. లాభాలు.. తక్కువ విత్తనాలు, కూలీలతో రైతు తన పొలంలో తానే విత్తుకోవచ్చు. ఏ రకమైన వరి అయినా 7 నుంచి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. రెండు లేదా నాలుగు క్వింటాల దిగుబడి అధికంగా వస్తుంది. -
జీఓ నంబర్ 252ను సవరించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ నంబర్ 252ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు వచ్చే అక్రిడిటేషన్ కార్డును గతంలో మాదిరిగానే డెస్క్ జర్నలిస్టుందరికీ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (143)తోపాటు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఇటీవల వెలువడిన జీఓ 252 అసంబద్ధం, లోపభూయిష్టంగా ఉందన్నారు. డెస్క్ జర్నలిస్టుల న్యాయబద్ధమైన హక్కును హరించేదిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్త సేకరణలో విలేకరుల ఎంత కష్టపడతారో.. అంతకన్నా ఎక్కువ కష్టం డెస్క్ జర్నలిస్టు పడతాడని తెలిపారు. ఇలా ఒకే పనివిధానం ఉన్న వారిని వేర్వేరుగా చూడడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 252జీఓను రద్దు చేసి పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మికి వినతిపత్రాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో డీజేఎఫ్టీ నాయకులు వర్ధెల్లి లింగయ్య, శంకేసి శంకర్రావు, టీయూడబ్ల్యూజీఏ (143) నాయకులు బీఆర్. లెనిన్, చిలుముల సుధాకర్, కక్కెర్ల అనిల్ కుమార్‌గౌడ్,, తడక రాజ్‌నారాయణ, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, పొగుకుల అశోక్, నవీన్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. డెస్క్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్ హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట ఆందోళన -
డ్రమ్ సీడర్ పద్ధతి ఎంతో మేలు
గత నాలుగు సంవత్సరాల నుంచి 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్ పద్ధతిన వరి సాగు చేస్తున్నా. ఈ విధానంలో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాను. కూలీలతో ఎక్కువగా అవసరం ఉండదు. కూలీలతో సాగు విధానంలో ఎకరాకు 22 నుంచి 25 క్వింటాలు వస్తే, డ్రమ్ సీడర్ విధానంలో 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – రూపురెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు, గూడూరు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి డ్రమ్ సీడర్ విధానం వరి సాగులో ఎంతో మేలు. కూలీల పని తక్కువగా ఉంటుంది. ఖర్చు, కూలీల పని తగ్గుతుంది. మొదటిసారి దిగుబడి అనుకున్నంత రాకున్నా, రెండో సారికి దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో, ఈ సంవత్సరం చాలా చోట్ల రైతులు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేస్తామంటున్నారు. – అబ్దుల్మాలిక్, ఏఎఓ, గూడూరు -
నేటినుంచి గోల్డెన్‌జూబ్లీ ముగింపు సమావేశాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనిర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నా యి. ముగింపు స మావేశాలను హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. ఫార్మసీ కళాశాల పూర్వవిద్యార్థి ప్రవాస భారతీయుడు, అమెరికా సంయుక్తరాష్ట్రా ల నివాసి డాక్టర్ సాంబారెడ్డి కన్వీనర్‌గా, కోకన్వీనర్‌గా కే యూ ఫార్మసీ కళా శాల డీన్ ఆచార్య గాదె సమ్మయ్య, అధ్యక్షురాలిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సి పాల్ ఆచార్య కృష్ణవేణి వ్యవహరిస్తుండగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య ప్రసాద్, వైస్ చైర్మన్ ఆచార్య నర్సింహారెడ్డి బాధ్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ షాయెదా, డాక్టర్ స్వరూపరాణి తదితరులు ఏర్పా ట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఫార్మసీ కళాశా ల పూర్వవిద్యార్థులు హాజరుకా నున్నారు. ఈనెల 27న జరిగే ఈ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల ముగింపు ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌లోని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్‌మోహన్‌రెడ్డి గౌరవఅతిథిగా అమెరికా లోని టెక్సాస్ ఎఅండ్ఎం యూనివర్సిటీ కాలేజీ ఫా ర్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్, చీఫ్ ప్యాట్రన్‌గా కే యూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, ప్యాట్రన్‌గా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పాల్గొని ప్రసంగించనున్నారని నిర్వాహకులు తెలిపారు. పార్మసీ కాలేజీలో రెండు రోజులపాటు నిర్వహణ -
బంగారు వర్ణం గ్రిల్స్ ఏర్పాటు
● స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మాణం ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ గతంలో తెలుపు రంగులో ఉండే గ్రిల్స్‌ను బంగారు వర్ణంతో ఉన్న స్టెయిన్లెస్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సా రించి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నూతన హంగులతో గద్దెలను దివ్యాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే నూతనంగా నిర్మించిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల చుట్టూ ఇప్పటికే గ్రానెట్ రాయితో గ ద్దెలను నిర్మించారు. దాని చుట్టూ భక్తుల తాకిడి గద్దెలకు తగలకుండా ఉండేందుకు నూతనంగా స్టెయిన్లెస్ స్టీల్ బంగారు వర్ణంలో ఉన్న పైపులతో నిర్మాణాలను చేపడుతున్నారు. దీనివల్ల ఎన్ని సంవత్సరాలైనా ఈ పైపులు తుప్పుపట్టకుండా మన్నికగా ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఇలాంటి బంగారు రంగు స్టెయిన్లెస్ స్టీల్‌ను మేడారం గద్దెల చుట్టూ వాడుతుండడం గమనార్హం. అర్హులకు అందని సాయం ● ఆశగా ఎదురుచూస్తున్న తుపాను బాధితులు ఖిలా వరంగల్: మొంథా తుపాను ప్రభావంతో సర్వసం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వం మొండిచేయిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల సాయం నిజమైన లబ్ధిదారులకు అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండునెలలుగా ఎదురుచూసిన బాధితులకు సాయం దక్కలేదు. భారీ వరదలకు 34, 35 డివిజన్ల మధ్య రోడ్లకు ఇరువైపులా ఉన్న సుమారు 200 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ముంచెత్తడంతో సర్వసం కోల్పోన ప్రజలు నాడు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ, 100 ఇళ్లకు మాత్రమే రూ.15 వేలు సాయం అందించడం బాధాకరమని, ఎలాంటి వరద తీవ్రత లేని కొందరికి సాయం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు రీ సర్వేచేసి అసలైన లబ్ధిదారులను గుర్తించి సాయం అందజేయాలని వరద బాధితులు కోరుతున్నారు. -
పార్కులపై పట్టింపేది
అధ్వానంగా మారిన పార్కులు, ఓపెన్ జిమ్లుఅధ్వానంగా చిల్డ్రన్స్ పార్కులు..కొన్ని గ్రీన్‌ల్యాండ్‌లలో చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేశారు. వాటిలో ఆట వస్తువులు మాత్రమే ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించారు..కానీ ప్రహరీ లేక, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పందుల సంచారం పెరిగింది. పార్కులు అపరిశుభ్రంగా మారడంతో దోమల సంఖ్య పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థాని కులు అంటున్నారు. ఎన్జీఓఎస్ కాలనీలో పాడైపోయిన ఆట వస్తువులు మహబూబాబాద్: ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యంతో పాటు గ్రీన్ ల్యాండ్స్ పరిరక్షణలో భాగంగా పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ఆట వస్తువులు, జిమ్ పరికాలు పూర్తిగా మరమ్మతుల బారిన పడి చాలా వరకు నిరుపయోగంగా మారాయి. ఒక్కో పార్కు, జిమ్‌ను లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆహ్లాదం కోసం.. మానుకోట విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఆరు పార్కులు, తొమ్మిది ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిని గ్రీన్ ల్యాండ్లలో ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా చేయడంతో కబ్జా కు గురికాకుండా ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోనిచాలా గ్రీన్‌ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్కులు పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నాయి. ఆరు పార్కులు.. పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీ, ఇందిరాగ్రౌండ్, బ్రహ్మకుమారి మందిరం సమీపంలో, మహర్షి విద్యాలయం సమీపంలో, హౌసింగ్ గ్ బోర్డు కాలనీలో పార్కులు ఏర్పాటు చేశారు. 18వ వార్డు పరిధిలో బటర్‌ఫ్లై పార్కు ఏర్పాటు చేశారు. పార్కులలో ఆటవస్తువులతో పాటు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, అలంకరణ మొక్కలు, సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. తొమ్మిది ఓపెన్ జిమ్‌లు.. ఎన్జీఓఎస్ కాలనీలోని పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇందిరాగ్రౌండ్ పార్కులో, బ్రహ్మకుమారి మందిరం సమీపంలోని పార్కులో, యశోద గార్డెన్ ఎదుట, ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ(బాలుర)శనిగపురం, హైమాగార్డెన్, కంకరబోడ్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేఽశారు. ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల జిమ్ మాత్రం ప్రభుత్వ స్థలంలో.. మిగిలినవి గ్రీన్ ల్యాండ్లలో ఏర్పాటు చేశారు. అధ్వానంగా నిర్వహణ.. పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు ఆట వస్తువులు చాలా వరకు మరమ్మతుల బారిన పడ్డాయి. బెంచీలలో కూడా చాలా వరకు పగిలిపోయాయి. జిమ్‌లలో పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో వాకర్స్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడైపోయిన ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు పందులకు ఆవాసంగా చిల్డ్రన్స్ పార్కులునూకల రామచంద్రారెడ్డి పార్కు ఏర్పాటు.. నేడు ఆవిష్కరణజిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కంబాలచెరువు పక్కనే సుమారు 12గుంటల భూమిలో నూకల రామచంద్రారెడ్డి స్మారకార్థం పార్కు ఏర్పా టు చేశారు. పట్టణ ప్రగతి నిధులతో పాటు పలు గ్రాంట్ల నుంచి సుమారు రూ.50లక్షల వ్యయంతో నిర్మించారు. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆపార్కును ఈనెల 27న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆవిష్కరణ ఉదయం 11.10 గంటలకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, అధికారులు పార్కుల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నారే తప్ప, నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
రైతు వేదికల నిర్వహణకు 39 నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఏఈఓలు సొంత డబ్బు వెచ్చిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమావేశాల సమయంలో హాల్‌ను సిద్ధం చేయడం, కుర్చీలు వేయడం వంటి పనులకు అటెండర్లు లేక ఏఈఓలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతీ రైతు వేదికకు అటెండర్‌ను నియమించాలి. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి. – చెలికాని రాజు, ఏఈఓల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వానికి నివేదించాంరైతు వేదికల్లో నెలకొన్న ఇబ్బందులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వీటి నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉంది. అవి రాగానే వేదికలకు కేటాయిస్తాం. – విజయనిర్మల, డీఏఓ -
సర్పంచ్లతోనే గ్రామాల అభివృద్ధి : సీతక్క
కొత్తగూడ: సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి సాధకులు అని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కొత్తగూడ, గంగారం మండలాల నూతన సర్పంచ్‌లను సన్మానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రెండు మండలాల్లో మన మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని అన్నారు. వారి నమ్మకం వమ్ము కాకుండా అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధిచేయాలని సూచించారు. మీ గ్రామాలకు ఏం కావాలో అడగండి.. ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామాల వారీగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజ కుసుమాంజలి, వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, చల్ల నారా యణరెడ్డి, బిట్ల శ్రీనివాస్, మల్లెల రణధీర్, కారోజు రమేశ్, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవార్లకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మొక్కులు సమర్పించేందుకు భక్తులు సుమారుగా అరగంటపాటు క్యూలో నిలబడ్డారు. ఒకే వరుసలో అమ్మవార్ల దర్శనం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో అభివృద్ధి పనులు సాగుతుండగా మేడారానికి భక్తులు తాకిడి భారీగా పెరిగింది. దీంతో పోలీసులు ఒకే వరుసలో క్రమ పద్ధతిలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో స్నానాలు చేసిన భక్తులు నేరుగా గద్దెల వద్దకు వచ్చిన భక్తులను పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా అమ్మవార్లను దర్శించుకునేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒకే దారిలో వెళ్లిన భక్తులు సమ్మక్క గద్దెను దర్శించుకుని అదే వరుసలో ఉన్న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద మొక్కులు చెల్లించి దర్శించుకున్నారు. పక్కదారి నుంచి రాకుండా వన్‌వే ఏర్పాటు చేయడంతో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ భక్తుల రద్దీని పర్యవేక్షించి పోలీసు అధికారులకు భక్తులు ఇబ్బంది కలగకుండా చూడాలని పలు సూచలను చేశారు. వందల సంఖ్యలో వాహనాలు క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు భారీగా వాహనాల్లో మేడారం వైపు కదిలివచ్చాయి. వందల సంఖ్యలో వచ్చిన వాహనాలను పోలీసులు పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించేందుకు శ్రమించారు. మేడారం చుట్టూ ఉన్న అన్ని దారుల్లో పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు. మేడారంలో భక్తుల రద్దీ వనదేవతల దర్శనానికి వన్‌వే ఏర్పాటు పర్యవేక్షించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
బయ్యారం: విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన మానుకోట జిల్లా బయ్యా రం మండలంలోని కాచనపల్లి స మీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగడ్డ గ్రామానికి చెందిన ఊకే వెంకటేశ్వర్లు(42) పదిహేనేళ్లుగా విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వి ద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ప్రసారం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు భార్య రమ్యకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై మహబూబీ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఏడీఏ రమేష్, ఏఈ సుమన్, సబ్ఇంజనీర్ సందీప్ తోపాటు సిబ్బంది పరిశీలించి నివాళులర్పించారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి -
కేయూ బాస్కెట్‌బాల్ టీం కెప్టెన్‌గా తులసి
మహబూబాబాద్ అర్బన్: కాకతీయ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీం కెప్టెన్‌గా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థిని చెవుల తులసి ఎంపికై నట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ డోలి సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో తులసిని కళాశాల అధ్యాపకులు, సీనియర్ క్రీడాకారులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తున్నామని, తులసి కేయూ బాస్కెట్ బాల్ టీం కెప్ట్‌న్‌గా ఎంపికవ్వడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై. కృష్ణప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’తొర్రూరు: తొర్రూరు బస్ డిపో పరిధిలో నేడు (శనివారం) ఉదయం 11నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తిగలవారు 9959226053 ఫోన్ నంబర్లో నిర్ణీత సమయంలో ఫోన్ చేయవచ్చని తెలిపారు. పంచాయతీ కార్యాలయం సందర్శనబయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయానిన జాతీయ ఎస్టీ కమిష న్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్ ప్రవీణ్‌నాయక్‌ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న పాలకవర్గం ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టి వారి మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సందిగ్ధంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. విద్యుత్ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని గత 15 రోజులుగా విస్తృత ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాతో బదిలీలు జరుగుతాయనే స్పష్టత వచ్చింది. మరో వైపు ఇంధన శాఖ బదిలీలపై నిషేఽ దం ఎత్తివేయడంతో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు ఇక ఆగవనే నమ్మకాన్ని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో కల్పించింది. బదిలీలు కోరుకునే వారు ఆశల్లో తేలియాడుతుండగా మరో వైపు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బదిలీలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత యాజమాన్యానికి చేరడంతో బదిలీలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాలు, ఇంజనీర్స్, పీ అండ్ జీ, అకౌంట్స్ ఆఫీసర్స్ అసోషియేషన్లతో టీజీ ఎ న్పీడీసీఎల్ యాజమాన్యం ఈ నెల 27న ప్రత్యేక స మావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం జ రిగే సమావేశంలో బదిలీలు చేపట్టాలా.. వద్దా.. చేపడితే మార్గదర్శకాలు ఎలా ఉండాలి.. అనే అంశాల పై యాజమాన్యం చర్చించనుంది. సంఘాలు, అ సోసియేషన్ల నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు బ దిలీలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. బదిలీలపై భిన్నాభిప్రాయాలు.. సాధారణంగా మే, జూన్ మాసంలో బదిలీలు జరుగుతాయి. కానీ, ఇందుకు విరుద్దంగా మధ్యలో బదిలీలు చేయడమేమిటని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సమయం బదిలీలకు సరైంది కాదని వ్యక్తం చేస్తున్నాయి. మరో నాలుగు నెలలు ఆగాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు స్థానచలనం కోరుకుంటున్న వారు బదిలీలు ఎప్పు డు జరిగితే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో బదిలీ లపై విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ సంఘాలు, అసోసి యేషన్ల అభిప్రాయాల మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇన్చార్జ్ పదోన్నతిపై ఆశలు.. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వర్క్‌మెన్ క్యాడర్ ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, పీ అండ్ జీ, అకౌంట్స్ విభాగంలో ఇంచార్జ్ పదోన్నతి ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో వర్క్‌మెన్ క్యాడర్లో తమకు కూడా ఇంచార్జ్ పదోన్నతి కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజ మాన్యం వర్క్‌మెన్ క్యాడర్లో ఇంచార్జ్ పదోన్నతి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సీనియారిటీ జాబితాను సిద్ధం చేసింది. ఇంచార్జ్ పదోన్నతితోపాటు బదిలీలు చేయాలనే ఆ లోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. బదిలీ లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఇంచార్జ్ పదోన్నతుల అంశం ఎటు తిరుగుతుందో ననే ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులున్నారు. బది లీలకు సంబంధం లేకుండా ఇంచార్జ్ పదోన్నతి కల్పించాలని పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కోరుతుండడం గమనార్హం. ఉద్యోగ సంఘాలతో చర్చించనున్న యాజమాన్యం నేడు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఇప్పటికే సీనియారిటీ జాబితాల తయారీ -
‘కథాశివిర్’కు ఓరుగల్లు విద్యార్థులు
జనగామ: దేశ యువతలో జాతీయత, క్రమశిక్షణ, సాంస్కృతిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రాష్ట్రీయ కథాశివిర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులకు అపూర్వ అవకాశంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలోని ఉప్లేటా, ప్రాస్లా గ్రామంలో నిర్వహిస్తున్న 26వ ‘రాష్ట్రీయ కథా శివిర్’కు ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది విద్యార్థుల (10 మంది బాలురు, 10 మంది బాలికలు)ను ఎంపిక చేశారు. జనగామ జిల్లాలోని కొడకండ్ల సోషల్ వెల్ఫేర్, పాలకుర్తి పీఎం శ్రీ ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరి చొప్పున నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి నుంచి 26 మంది కథా శివిర్‌కు అర్హత సాధించారు. 27వ తేదీ (శనివారం)నుంచి జనవరి 4 వరకు ‘శివిర్’ కార్యక్రమం జరగనుంది. ఎంపికై న విద్యార్థులతో ప్రతీ జిల్లానుంచి ఇ ద్దరు (పురుష, మహిళ) ఉపాధ్యాయులు వెళ్లారు. ప్రతిభ, ఆసక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంవంటి అంశాలు ప్రమాణాలుగా విద్యార్థులను ఎంపిక చే శారు. శివిర్‌ను నిర్వహిస్తున్న శ్రీ వేదిక్ మిషన్ ట్ర స్ట్ దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెర్రి టరీలనుంచి విద్యార్థులను ఆహ్వానించింది. మొత్తం 2.76లక్షల మంది విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు పాల్గొటున్నారు. 800 నుంచి వేయి మంది విద్యార్థులకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అబ్దుల్ కలాం ప్రశంసలు.. ● దివంగత, డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం వంటి ప్రముఖులు కూడా గతంలో ఈ శిబిరాలకు హాజరై ప్రశంసించినట్లు ట్రస్ట్ గుర్తు చేసింది. ● ప్రతి రోజు శిబిరంలో ఉదయం శారీరక శిక్షణతో ప్రారంభమై, ఉపన్యాసాలు, జాతీయ భద్రతా అంశాలు, నీతి, నిజాయితీ బోధనలు, క్రీడలు, కళా, సాంస్కృతిక, కార్యక్రమాలు, సైన్య విభాగాల ప్రదర్శనలు, భారత రాజ్యాంగం, జాతీయ సమైక్యత, సాంస్కృతిక, వ్యక్తిగత అభివృద్ధి, జాతీయవాదం, దేశ భక్తి, పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. ● డిజిటల్ ఇండియా, నీటి సంరక్షణ, మానవ హక్కులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక, సామాజిక సామరస్యం, విపత్తు నిర్వహణ, రహదారి భద్రత నియమాలు, మార్షల్ ఆర్ట్స్, జూడో, కరాటే, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టాగ్ఆఫ్ వార్, యోగా, ధాన్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ● వీటితోపాటు భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం, రక్షక దళం, ఎన్నికల కమిషన్, వివిధ ప్రదర్శనల గురించి విద్యార్థులకు తెలియజేస్తారు. ● ప్రముఖుల ఉపన్యాసం, చర్చావేదిక, మానవ, ప్రాథమిక విధులు, మహిళా సాధికారత, ప్రకృతి మధ్య సంబంధం, క్రీడలు, ఆటలు తదితర అంశాల గురించి రోజువారీగా వివరిస్తారు. ● శివిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లతోపాటు అందుకు సంబంధించి పుస్తకాలు అందజేస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది ఎంపిక గుజరాత్లో నేటినుంచి దేశవ్యాప్త శిక్షణ ప్రారంభం వ్యక్తిత్వ వికాసం.. జాతీయతపై తరగతులుజిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య జిల్లా విద్యార్థులు జనగామ 04 వరంగల్ 04 హనుమకొండ 04 ములుగు 04 భూపాలపల్లి 04 మొత్తం 20 -
నేటినుంచి రాష్ట్రస్థాయి జూడో పోటీలు
రామన్నపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో నగరంలోని పోచమ్మ మైదాన్‌లోని కెమిస్ట్రీ భవన్లో రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలు నిర్వహించినున్నట్లు తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనే బాల బాలికలు 2006 నుంచి 2011 సంవత్సరం మధ్య జన్మించి ఉండాలని, బాలుర విభాగంలో అండర్ 55 కేజీల విభాగం నుంచి 100 కేజీ అదనం విభాగాల వరకు, బాలికలకు అండర్ 44 కేజీల విభాగం నుంచి 78 కేజీల అదనం విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజనం, వసతి, పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌తోపాటు గెలుపొందిన వారికి సర్టిఫికెట్‌తోపాటు మెడల్స్ అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జనవరి 23 నుంచి 26వ తేదీల్లో కలకత్తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, వరంగల్ క్రీడా మండలి అధికారి అనిల్, హ్యాండ్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, తెలంగాణ జూడో అసోసియేషన్ బాధ్యులు సోమరాజు, దుపాకి సంతోష్ కుమార్, కోచ్‌లు లింగమూర్తి, చుక్కా రామకృష్ణ, రాము, కుమార్, తదితరులు పాల్గొన్నారు. జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాష్ యాదవ్ -
సాక్షి ఫోన్ ఇన్..
నెహ్రూసెంటర్: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ బండి సుమన్‌తో నేడు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్‌తో మాట్లాడవచ్చు. తేదీ 27–12–2025, శనివారం సమయం ఉదయం 11నుంచి 12గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 99639 29800, 99482 93597 -
నత్తనడకన నిర్మాణ పనులు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతోన్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లాలు పురుడుపోసుకున్నాయి. పూర్వ వరంగల్ జిల్లా కేంద్రంగా హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్లో నూతన జిల్లాల వారీగా సర్కిళ్లను ఏర్పాటు చేసింది. పూర్వ వరంగల్ సర్కిల్ కార్యాలయంలోనే హనుమకొండ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం వరకు హనుమకొండ నక్కలగుట్టలోని హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోనే కొనసాగిన వరంగల్ సర్కిల్ కార్యాలయాన్ని ములుగు రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కేంద్రానికి తరలించారు. యాజమాన్యం వరంగల్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రూ.1,33,88,971 వ్యయంతో ములుగు రోడ్డులో భవన నిర్మాణాన్ని చేపట్టారు. సంవత్సరన్నర కాలంగా ఈ నిర్మాణం సాగుతోంది. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పనులను పరిశీలించి జనవరి 26 లోపు పూర్తి చేసి నూతన భవనంలోకి కార్యాలయాన్ని తరలించాలని ఆదేశించారు. అయినా పనుల్లో వేగం పెంచలేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులతీరును పరిశీలిస్తే మరో రెండు నెలలైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని అధికారులే చెప్పడం గమనార్హం. ఈ పనులు పర్యవేక్షిస్తున్న సివిల్ ఇంజనీర్లు కూడా భవన నిర్మాణ పనులన్నీ పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని చెప్పడం కొసమెరుపు. దీనికితోడు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడిందనే ఆరోపణలున్నాయి. మెటీరియల్ వినియోగంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సిమెంట్ నిర్ణీత మోతాదుకంటే తక్కువ వాడుతున్నారు. కొనసాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ భవనం పనులు జనవరి 26 లోపు పూర్తి చేయాలని సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాలు -
యూరియా జపం..
యాసంగి వరి సాగుకు సిద్ధమైన రైతులుసాక్షి, మహబూబాబాద్: వానాకాలంలో యూరియా కోసం పడరాని పాట్లుపడిన రైతులకు యాసంగిలోనూ తిప్పలు తప్పడం లేదు. వరి సాగుకు సిద్ధమైన రైతులు యూరియా కోసం వెళ్తే ఫర్టిలైజర్ షాపులు, పీఏసీఎస్‌ల వద్ద దొరకడం లేదు. వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పీఏసీఎస్‌ల వద్ద రైతులు క్యూలో పడిగాపులు పడుతున్నారు. యూరియా పంపిణీలో సరైన విధి విధానాలు లేవని, వ్యవసాయశాఖ, పీఏసీఎస్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సాగు ముందుకు.. యాసంగిలో 25,55,27 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. వరి 16,41,24 ఎకరాలు, మొక్కజొన్న 84,261 ఎకరాలు, పెసర 2,879 ఎకరాలు, మినుములు 394 ఎకరాలు, జొన్న 1,565 ఎకరాలు, వేరుశనగ 1,043 ఎకరాలు, బొబ్బెర 1,261 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటికే మొక్కజొన్న సాగు చేశారు. వరి నార్లుపోసి నాట్లు వేస్తున్నారు. ఇతర పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు. కార్డులు పంపిణీ చేసినా.. వానాకాలం సీజన్లో యూరియా కోసం రైతులు పడిన ఇబ్బందులు తొలగించేందుకు కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో పీఏపీఎస్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రైతులు సాగుచేసిన పంటలకు కావాల్సిన యూరియా ఇవ్వాలి. అధికంగా ఇవ్వడంతోనే కొరత వస్తుందని భావించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్యం కార్డులు తయారు చేశారు. ఇందులో రైతుల పేర్లు, సాగు వివరాలు పొందుపరిచి వాటి ద్వారా యూరియా పంపిణీ చేయాలని భావించారు. ఎకరాకు వరికి మూడు, మొక్కజొన్నకు ఐదు, మిర్చికి ఆరు బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2.24లక్షల కార్డులను తయారు చేశారు. అయితే ఈ కార్డులను కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేసినట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాల్లో కార్డులు సరఫరా చేయకపోవడం, ఆన్లైన్లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చనే ప్రకటనలు రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. యూరియా దొరకడం లేదురెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. నెలరోజులుగా యూరియా కోసం పీఏసీఎస్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. శుక్రవారం యూరియా వచ్చిందని తెలియగానే మహబూబాబాద్‌కు వచ్చాను. అప్పటికే పొడుగూత నిలబడ్డారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. – తేజావత్ భద్రు, ఆబుతండాయూరియా కొరత లేదువానాకాలంలో యూరియా సరఫరాలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక సిద్ధ చేశాం. ఇందుకోసం రైతులకు కార్డులు సరఫరా చేశాం. ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న రైతులకు యూరియా ఇస్తున్నాం. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. కొరతపై వచ్చే వదంతులను నమ్మకండి. – విజయ నిర్మల, డీఏఓదిగుమతిలో జాప్యంయాసంగి సీజన్ ప్రారంభం నుంచి అంటే అక్టోబర్ నుంచే యూరియా దిగుమతి కోసం అధికారులు అంచనాలు వేశారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. ఇలా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 34,780 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 15,345 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు సరఫరా చేశారు. మిగిలిన యూరియా దిగుమతిలో జాప్యం కావడంతో యూరియా కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖలోని పలువురు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ, సహకార శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు పీఏసీఎస్‌ల వద్ద రైతుల పడిగాపులు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
● రెండో రోజు ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు కేసముద్రం: మానుకోట జిల్లా కేసముద్రం మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు రెండోరోజు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ట్రెడిషనల్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో మహబూబాబాద్ జట్టు(పురుషుల విభాగం) 22 పాయింట్లతో మొదటి విజేతగా గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. నారాయణపేట 20 పాయింట్లతో రెండో విజేతగా నిలవగా, నల్లగొండ, మహబూబ్‌నగర్ జట్లు 6 పాయింట్లు సంయుక్తంగా సాధించి తృతీయస్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. సీ్త్రల విభాగంలో జరిగిన ట్రెడిషనల్ మ్యాచ్‌లో మేడ్చల్ 19 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. రంగారెడ్డి, నల్లగొండ, ఇరుజట్లు సంయుక్తంగా 4 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచాయి. ముందుగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ సురేష్, పీడీ కొప్పుల శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్రావు, ఆర్టీఏ మెంబర్ రావుల మురళీ, బండారు దయాకర్, చిదురాల వసంతరావు, వేం యాకుబ్‌రెడ్డి, లెంకల సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ పునఃప్రారంభంఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా పస్రా – తాడ్వా యి మధ్యలో జలగవంచ వాగులో అటవీశాఖ ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐల్యాండ్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం అని, జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ఒకటని పేర్కొన్నారు. పర్యాటకులు ఇక్కడ ఆనందంగా గడపవచ్చని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు. -
రైతు వేదిక.. నిర్వహణ లేక
తొర్రూరు: నిర్వహణ నిధులు లేక రైతు వేదికలు నిస్తేజంగా మారుతున్నాయి. 39 నెలలుగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఏఈఓలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేక ఈ వేదికలకు వచ్చే అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొంత మంది ఏఈఓలు తమ సొంత డబ్బులతో రైతు వేదిక నిర్వహణ చూసుకుంటున్నారు. రెండున్నరేళ్లకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆరంభంలో ఆర్భాటం.. పంటల సాగుపై అన్నదాతలకు సూచనలు, సలహాలు, శిక్షణ తరగతుల నిర్వహణ, తదితర లక్ష్యాల కోసం జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికలు నిర్మించారు. ప్రతీ ఐదు వేల మంది కర్షకులకు, రెండు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి వ్యవసాయ శాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10 లక్షలు వెచ్చించి నిర్మించారు. ఒక్కో వేదిక నిర్వహణకు ఒక ఏఈఓను నియమించారు. పంటల సాగుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా.. రైతు వేదికల నిర్వహణకు నిధుల్లేక ఏఈఓలకు భారంగా మారాయి. 39 నెలలుగా అందని నిధులు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ వ్యవసాయ డివిజన్‌కు ఒక రైతు వేదికను నిర్మించారు. మొదట్లో ఒక్కోదాని నిర్వహణకు నెలకు రూ.3 వేలు ఇచ్చారు. ఆ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు 2020 ఏప్రిల్ నుంచి రూ.9 వేల చొప్పున అందజేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఆగస్టులో 5 నెలలకు కలిపి ఒక్కో రైతు వేదికకు రూ.45 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. తర్వాత 39 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. జిల్లాలో ఒక్కో రైతు వేదికకు రూ.3.51 లక్షల చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.2.87 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతులు, స్టేషనరీ, రైతు శిక్షణలు, తాగునీటి సదుపాయం తదితరాలకు ఏఈఓలే తమ వేతనాల నుంచి భరిస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోదానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 39 నెలలుగా నిలిచిన నిధులు పెండింగ్‌లో రూ.2.87 కోట్ల బకాయిలు ఏఈఓలకు గుదిబండగా వేదికలు -
ఐటీ కోర్ బృందానికి ప్రశంసపత్రాల అందజేత
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో విధుల్లో రాణించిన ఐటీ కోర్ బృందాన్ని అభినందిస్తూ అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి.శ్రీనివాసరావు ప్రశంస పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీఎన్ఎస్ విధుల్లో రాణించిన ఐటీ కోర్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కమిషనరేట్ ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, నర్సయ్య, రమేశ్‌తోపాటు హసన్‌పర్తి, దుగ్గొండి, స్టేషన్‌ఘన్‌పూర్ కానిస్టేబుళ్లు సోమన్న, రాకేశ్, రాఘవేందర్‌ను అదనపు డీజీపీ అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. కాగా, ప్రశంస పత్రాలు అందుకున్న ఐటీ కోర్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అధికారుల గుర్తింపుతో పాటు శాఖపరమైన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. -
క్రీస్తు బోధనలు అనుసరణీయం: సీతక్క
కొత్తగూడ: మండలంలోని సరసనపల్లిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యేసుక్రీస్తు బోధనలు అనుస రణీయమని అన్నారు. ఎవరి ఆచారాలు, విశ్వాసాలు వారు పాటిస్తూ ఎదుటి వారి నమ్మకాలను గౌరవించాలన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించారు. రోడ్డు పనుల పరిశీలన.. మండల కేంద్రం సమీపంలోని గాదెవాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంజ సూర్య, కుసుమాంజలి, వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి, మల్లెల రణధీర్, బిట్ల శ్రీనివాస్, బానోతు రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్క.. పక్కాగా చూపాల్సిందే
సంగెం : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కచ్చితంగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భవిష్యత్‌లో ఎన్నికల బరిలో నిలబడే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. నిబంధనల మేరకు గెలిచిన అభ్యర్థులే లెక్కలు ఇస్తారు.. తాము సమర్పించకుంటే ఏమవుతుందిలే అని ఓడిపోయిన అభ్యర్థులు అనుకుంటే చిక్కుల్లో పడినట్లే. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరూ విధిగా లెక్కలు సమర్పించాలని, లేనిపక్షంలో వేటు పడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కాగా, నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఐదు వేల జనాభా దాటిన జీపీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 50 వేలు, 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ● అభ్యర్థులు.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రచార, వ్యయ పుస్తకాలను ఎప్పటికపుడు నమోదు చేసుకుని ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలి. ● అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు జరిగిన ఖర్చుల వివరాలను పుస్తకాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదు చేసుకుని ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలి. ● ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోటీలో నిలిచిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా నిర్ణీత గడువులోగా లెక్కలు చూపాలి. మూడు దశల్లో లెక్కల ఖర్చు చూపాలి.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతోపాటు ఓడిపోయిన వారు కూడా తమ ఖర్చుల లెక్కలు మూడు దశల్లో చూపాలి. ఇప్పటి వరకు జిల్లాలో తొలివిడత ఈ నెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17వ తేదీన జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఒక దశ కూడా ఎన్నికల ఖర్చులు చూపని అభ్యర్థులు ఉన్నారు. కాగా, ఎన్నికల ఖర్చులను లెక్కించడానికి ఆడిట్ శాఖ అధికారులను మండలాల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. మండలాల వ్యయపరిశీలనపై ఆడిట్‌శాఖ ఉన్నతాధికారులను జిల్లాకు ఒకరిని నియమించారు. నోటీసులు జారీ చేసే అవకాశం.. అభ్యర్థులు ఎన్నికల లెక్కలు చూపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో నోటీసులు జారీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నాటి నుంచి 45 రోజుల్లో పూర్తి లెక్కలు చూపని అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.లేదంటే చిక్కులు తప్పవు.. ఎన్నికల ఖర్చులు అభ్యర్థులు సమర్పించాల్సిందే.. గడువులోగా చూపకపోతే నోటీసులు జారీ భవిష్యత్‌లో పోటీకి అనర్హులయ్యే అవకాశం లెక్కకు మించితే వేటు..ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో గెలుచుకున్న పార్టీల మద్దతుదారులు (ఏకగ్రీవాలు కలుపుకుని) విడత గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులుమొదటి 555 333 148 17 57 రెండు 563 332 181 09 41 మూడో 564 371 150 05 38 -
సభను విజయవంతం చేయాలి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్పంచ్ల ఆత్మీయ అభినందన సన్మాన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాస గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 18 మండలాలకు చెందిన పార్టీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సర్పంచ్ల ఆత్మీయ అభినందన సన్మాన సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు తీసి ఇబ్బందులు పెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు, ప్రస్తుత పరిస్థితులు, ఇతర విషయాలపై కేటీఆర్ మాట్లాడుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామన్నారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ వెంకన్న, నాయకులు నవీన్‌రావు, మహేందర్‌రెడ్డి, ముత్యం వెంకన్న, మురళీధర్‌రెడ్డి, శ్రీను, అశోక్, రఘు ఉన్నారు. -
గెలుపోటములపై చర్చ!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నుంచి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడింది. అన్ని గ్రామాల్లో పార్టీకి బలమైన పట్టు ఉన్నా.. బరిలో నిలిచేందుకు పలుచోట్ల సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. కార్యకర్తలు ఉన్నా.. వారికి వెన్నంటి ఉండే సరైన నాయకులు లేకపోవడంతోనే ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య సమన్వయం కుదరకపోవడమే ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములపై జరుగుతున్న చర్చ ప్రత్యేకతను సంతరించుకుంది. 135 స్థానాలకే పరిమితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. జిల్లాలో మొత్తం 482 జీపీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 317మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో 135మంది సర్పంచ్‌లే గెలిచారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవితలు ప్రచారం చేశారు. ప్రతీ గ్రామంలో నువ్వా.. నేనా.. అన్నట్లు అభ్యర్థులు పోటీ పడ్డారు. అయినా 53 స్థానాలు మాత్రమే గెలిచారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రచారం చేసినా.. కొన్ని స్థానాలపైనే దృష్టి పెట్టారని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ కవిత కొన్ని ప్రాంతాలకే పరిమితమై ప్రచారం చేసినట్లు సమాచారం. మిగిలిన నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అభ్యర్థులు ఒంటరి పోరాటం చేసినా.. 53 పంచాయతీలు మా త్రమే గెలిచారు. ఇక ఇల్లెందు నియోజకవర్గంలోని గార్లలో బీఆ ర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. బయ్యారం మండలంలో మాత్రం ఎనిమిది పంచాయతీలు గెలిచారు. అయితే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెద్దగా పట్టించుకోలేదని, కనీసం పోటీలో నిలబడిన పలువురు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాలేదని విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో తొమ్మిది, పెద్దవంగర మండలంలో ఎనిమిది పంచాయతీలు గెలుచుకున్నారు. ఇక ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో దుర్గారం, గంగారం మండలంలో మూడు పంచాయతీలు మొత్తంగా నాలుగు జీపీలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇక్కడ మంత్రి సీతక్కకు దీటుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయలేకపోయారు. కేటీఆర్ రాకతో.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారిని అభినందించేందుకు ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాక ప్రత్యేకతను సంతరించుకోనుంది. గెలిచిన పంచాయతీలే కాకుండా ఓటమికి గల కారణాలు తెలుసుకునే పనిలో కేటీఆర్ ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు ఉన్నారు.. కానీ మొదటి శ్రేణి నాయకుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిని సరిదిద్దకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.బీఆర్ఎస్ పార్టీలో మేధోమథనం అన్ని గ్రామాల్లో బలమున్నా.. సర్పంచ్ అభ్యర్థులు దొరకని పరిస్థితి నాయకుల సమన్వయ లోపంతో తప్పని ఇబ్బందులు గెలిచిన వారికి అభినందనలు.. ఓటమిపై సమాలోచనలు రేపు జిల్లాకు కేటీఆర్ రాక -
ఫార్మసీ కళాశాల
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగింపు సమావేశాలు ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కేయూలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 4న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ప్రారంభించారు. ఈఫార్మసీ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. అందుకే సెప్టెంబర్ 12,13 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో కూడా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. అలాగే, అక్టోబర్11,12 తేదీల్లో హైదరాబాద్‌లోని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ఉత్సవాల ముగింపు సమావేశాలు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. 940 మంది వరకు రిజిస్ట్రేషన్.. కేయూ ఫార్మసీ కళాశాల గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలకు దేశ, విదేశాల నుంచి కొందరు పూర్వ విద్యార్థులు తరలిరానున్నారు. మొత్తం 940మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఆర్గనైజింగ్ కమిటీ గౌరవ చైర్మన్‌గా వి. మల్లారెడ్డి, చైర్మన్‌గా వి. కిషన్, ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయుడు సాంబారెడ్డి కన్వీనర్‌గా, కో కన్వీనర్‌గా ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య, అధ్యక్షురాలిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి వ్యవహరిస్తున్నారు. రెండురోజుల కార్యక్రమాలు ఇలా .. ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే కేయూ ఫార్మసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. 27న ప్రారంభోత్సవ సమావేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌లోని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఎం. మదన్ మోహన్‌రెడ్డి, గౌరవ అతిథిగా అమెరికా టెక్సాస్‌లోని ఎఅండ్ఎం యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మసీ డీన్ మన్సూర్ ఖాన్ , చీఫ్ ప్యాట్రన్‌గా కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, ప్యాట్రన్‌గా రిజిస్ట్రార్ వి. రామచంద్రం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం విశ్రాంత ఆచార్యులు, ఉద్యోగులకు సన్మానం కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4: 30 నుంచి 5గంటల వరకు ఫొటో సెషన్ ఉంటుంది. 5:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 28న ఉదయం9: 30 గంటల నుంచి పూర్వ విద్యార్థుల సమావేశం, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు ముగింపు సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కేయూ గెస్ట్‌హౌస్‌లో తేనీటి విందు ఉంటుంది. 27, 28వ తేదీల్లో కాళోజీ కళాక్షేత్రంలో సమావేశాలు తరలిరానున్న పూర్వ విద్యార్థులు -
మానవాళి రక్షణకు క్రీస్తు జననం
కాజీపేట రూరల్ : ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు జన్మించారని ఓరుగల్లు కథోలిక పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ డి. విజయపాల్‌రెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమా కెథిడ్రల్ చర్చి ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు క్రిస్మస్ జాగరణ, దివ్య బలి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాదర్ విజయపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు జననం చారిత్రాత్మక సత్యమని, అద్భుత ఘట్టమని, ప్రపంచంలోని 195 దేశాల్లో క్రీస్తు జననాన్ని పండుగగా జరుపుకుంటున్నారన్నారు. నీతి, న్యాయం, ధర్మం, ప్రేమతో జీవించాలని క్రీస్తు బోధించారని తెలిపారు. అనంతరం అందరి సమక్షంలో ఫాదర్ విజయపాల్‌రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంగీత దర్శకుడు నల్ల ప్రణిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీస్తు గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో చర్చి విచారణ గురువు కాసు మర్రెడ్డి, సహాయ విచారణ గురువు ఫాదర్ విద్యాసాగర్, బ్రదర్స్, సిస్టర్స్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ఫాతిమా కెథిడ్రల్ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి మహోత్సవ, దివ్య బలి పూజ నిర్వహించి క్రిస్మస్ సందేశం చేసి క్రీస్తు జననం గురించి వివరించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓరుగల్లు పీఠం పాలనాధికారి ఫాదర్ విజయపాల్‌రెడ్డి -
తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య
ములుగు రూరల్: సరిగా చదవడం లేదని త ల్లి మందలించగా మనస్తాపం చెందిన ఓ వి ద్యార్థి గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని జాకారంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓరుగంటి విశ్వత్(16) పదో తరగతి చదువుతున్నాడు. అయితే సరిగా చదవడం లేదని తల్లి బుధవారం మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విశ్వత్ గడ్డిమందుతాగాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈఘటనపై మృతుడి తల్లి భీష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మేడారం.. జనహారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మహాజాతరకు ముందుగానే భక్తులు మేడారానికి భారీగా తరలొచ్చారు. గురువారం సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి వివిధ వాహనాల్లో వేలాదిగా తరలొచ్చారు. తొలుత జంపన్నవాగు స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సందడిగా మేడారం.. భక్తుల రద్దీతో మేడారం సందడిగా మారింది. ఉద యం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఊహించని విధంగా భక్తుల వేల సంఖ్యలో తరలిరావడంతో సమ్మక్క, సారలమ్మ గద్దెలు కిక్కిరిసిపోయాయి. గద్దెల పునర్నిర్మాణం పనులు జరుగుతున్న తరుణంలో భక్తులు క్రమపద్ధతిలో రావడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి వరుస క్రమంలో నిలిపిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వనంలో వంటావార్పు.. మేడారంలోని వనాలన్నీ భక్తుల విడిదితో సందడిగా మారాయి. అమ్మవార్ల దర్శనం అనంతరం శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహంపక్తి భోజనాలు చేశారు. కాగా, తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ఒక్కో మినరల్ వాటర్ క్యాన్‌కు రూ. 50 చెల్లించి వంటావార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడారంలో అభివృద్ధి పనులు భక్తులు కొనియాడేలా జరుగుతున్నా తాగునీటి కోసం మాత్రం తంటాలు పడ్డారు. అమ్మవార్లకు ముందస్తు మొక్కులు వేలాదిగా తరలొచ్చిన భక్తులు వనంలో వంటావార్పుతో సందడి తాగునీటికి ఇక్కట్లు.. -
బైక్‌ను ఢీకొన్న డీజిల్ ట్యాంకర్
● పాల వ్యాపారి మృతి ● అన్నాసాగరం క్రాస్ వద్ద ఘటన హసన్‌పర్తి : బైక్‌ను డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ పాల వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటన అన్నాసాగరం క్రాస్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కతుర్తి మండలం చింతలపల్లికి చెందిన చందుపట్ల అశోక్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు చందుపట్ల విద్యాసాగర్(23) ఉన్నారు. అశోక్ ప్రస్తుతం ఎల్కతుర్తిలోనే ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నాడు. విద్యాసాగర్ పాల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బైక్‌పై పాలు తీసుకుని భీమారం వైపునకు బయలుదేరాడు. మార్గమధ్యలోని అన్నాసాగరం క్రాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన డీజిల్ ట్యాంకర్.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో విద్యాసాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. -
పంట ఉత్పత్తులకు రక్షణ
మహబూబాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లో విక్రయించే సమయంలో వర్షం కురిసి తడిస్తే రైతు బాధ మాటల్లో చెప్ప లేం. కాగా సరిపడా కవర్ షెడ్లు లేకపోవడంతో ఆరుబటయ సరుకులను నిల్వ చేస్తున్నారు. దీంతో వర్షం వచ్చి తడిస్తే వ్యాపారులు అడిగిన ధరకు అమ్మాల్సిన దుస్థితి మానుకోట వ్యవసాయ మార్కెట్లో నెలకొంది. ఈమేరకు మార్కెట్ యార్డులో నూతన కవర్ షెడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్డు.. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఇప్పటికే ఒక కవర్ షెడ్డు ఉండగా అందులో సీజన్ ఆధారంగా రైతులు మొక్కజొన్నలు, వరి పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చి రాశులుగా పోసుకుంటున్నారు. అయితే మిర్చి, పత్తి బస్తాలను మాత్రం కవర్ షెడ్డులో పెట్టేందుకు స్థలం లేకపోవడంతో యార్డు ఆవరణలోని ఆర్ఓబీ కింది భాగంలో ఏర్పాటు చేసిన షెడ్లు, ఇతర రేకుల షెడ్ల ప్రాంతాల్లో క్రయవిక్రయాల సమయాల్లో నిల్వ చేసుకుంటుంటారు. అకాల వర్షం, గాలివాన, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు రైతుల అవసరాల మేరకు ఉన్న షెడ్లు సరిపోకపోవడంతో దశాబ్దాల తరబడి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రేకుల షెడ్లు ధ్వంసం.. ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న పాత మూడు రేకుల షెడ్ల పూర్తిగా ధ్వంసమై అడుగు భాగంలో ఉన్న సీసీ కూడా గుంతలు పడి వర్షం పడిన ప్రతీసారి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్లు పలుమార్లు చేసిన విజ్ఞప్తులను గుర్తించి స్పందించిన ప్రభుత్వం మూడు మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన నూతన కవర్ షెడ్డును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1.97 కోట్ల వ్యయంతో 81 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో పాత ఇనుప రేకుల షెడ్లను తొలగించి నూతన కవర్ షెడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రైతుల కష్టాలకు చెల్లుచీటీ పడగా నూతన కవర్ షెడ్డు నిర్మాణం త్వరితగతన పూర్తి జరిగితే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అందులో నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు త్వరలోనే నూతన కవర్‌షెడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.నూతన కవర్ షెడ్డు మంజూరు అకాల వర్షం, సరుకుల నిల్వ సమస్యలకు చెక్ మానుకోట వ్యవసాయ మార్కెట్లో నిర్మాణం -
క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే భూ క్య మురళీనాయక్ అన్నా రు. గురువారం మున్సి పల్ కేంద్రంలో జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీనియర్, పాస్ట్ ఫైవ్ నెట్‌బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. కాగా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో 27 జిల్లాల నుంచి మహి ళ, పురుషుల విభాగంలో 800 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు ట్రెడిషనల్, పాస్ట్పైవ్, మిక్స్డ్ విభాగంలో లీగ్ మ్యాచ్‌లు పూర్తయినట్లు తెలిపారు. నెట్‌బాల్ అ సోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ ఆది త్యారెడ్డి, ప్రధాన కార్యదర్శి శిరీషారాణి, జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ప్రధా న కార్యదర్శి తుమ్మ సురేశ్, ఆర్టీఏ డైరెక్టర్ రావుల మురళి, పీడీ కొప్పుల శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్రావు, నాయకులు అంబటి మహేందర్‌రెడ్డి, గుగులోత్ దస్రూ నా యక్, బండారు వెంకన్న, కదిర సురేందర్, ఎం.డి. ఆయూబ్‌ఖాన్, సీహెచ్. ఎలేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కేసముద్రంలో రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు ప్రారంభం -
జాతీయ సదస్సులో టీచర్ అశోక్ పరిశోధన పత్రం సమర్పణ
విద్యారణ్యపురి : న్యూఢిల్లీలోని జాతీయ విద్యాపరిశోధన శిక్షణ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వ హించిన జాతీయ సదస్సులో హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశోధన పత్రం సమర్పించారు. ప్రస్తుతం అశోక్ వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ జాతీయ సదస్సులో అశోక్ ‘ఎన్హాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై పరిశోధనాపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ నుంచి పోగు అశోక్ పరిశోధన పత్రం ఎంపిక కావడంతో ఆయన సమర్పించారు. ఈ జాతీయ సదస్సులో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్‌ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ప్రకాశ్‌చంద్ర అగర్వాల్, అజ్మీర్ ప్రిన్సిపాల్ సుచితప్రకాశ్ చేతులమీదుగా అశోక్ ప్రశంస పత్రం అందుకున్నారు. సైబర్ మోసం.. ● రైతు ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం ● కోమటిగూడెంలో ఘటన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన రైతు పర్శ సంతోష్ బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.50 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ఈ నెల 18న సంతోష్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,980 మాయం చేశారు. దీంతో బాధితుడు అదేరోజు పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం గురువారం మరోసారి ఎస్బీఐ ఖాతా నుంచి రూ.50,900 కాజేశారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆందోళనకు గురై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి ఆన్లైన్ లింక్‌లు ఓపెన్ చేయలేదని, ఖాతాలోని డబ్బులు ఎలా పోయాయో అర్థం కావడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయమై పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని, పోగొట్టుకున్న డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
క్రిస్మస్..శాంతి, సామరస్యానికి ప్రతీక
నర్సంపేట రూరల్: క్రిస్మస్.. శాంతి, సామరస్యానికి ప్రతీకని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌లో తన మిత్రులు పూదోట సురేశ్‌కుమార్, సుధీర్‌కుమార్ ఇంటి వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి బుధవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. అంతేకాక ఏసుక్రీస్తు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆ కరుణామయుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేశ్, జిల్లా కార్యదర్శి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్‌రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్యగౌడ్, యూత్ మండల అధ్యక్షులు బండి హరీశ్, మాదారపు చరణ్, నరిశెట్టి సతీశ్, పూదోట నవీన్‌కుమార్, సునీల్‌కుమార్, బోటర్, తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
నిందితులను కఠినంగా శిక్షించాలి
గార్ల : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీన మామను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హ క్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలంలోని భోజ్యాతండాలో రాష్ట్ర మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం మృతుడు లాలూనాయక్ కుటుంబ సభ్యులను కలిసి హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్యాతండాకు చెందిన లాలూనాయక్ కూతురు లహరిని పెద్దతండాకు చెందిన గుగులోత్ సీతారాం కుమారుడు గాంధీబాబుకు ఇచ్చి 2022 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. వరకట్నం కింద సుమారు రూ. కోటి అందజేశారు. లహరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయినా అదనపు కట్నం కావాలని భర్త, అత్త, మామ.. తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 11న కూడా వేధింపులకు గురిచేయడంతో లహరి తన తండ్రికి ఫోన్ ద్వారా విషయం చెప్పింది. వెంటనే తండ్రి లాలూనాయక్, తమ్ముడు కలిసి అల్లుడి ఇంటికి వచ్చారు. తన కూతురును ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు అల్లుడు, మామ, అత్త కలిసి లాలూనాయక్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పాడు. వెంటనే కుమారుడు.. లాలూనాయక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. తన తండ్రి లాలూనాయక్ మృతికి కారణమైన అల్లుడు, అతడి తండ్రి, తల్లిని కఠినంగా శిక్షించి త మకు న్యాయం చేయాలని లహరి మానవ హక్కుల వేదిక బృందాన్ని వేడుకుంది. విచారణ చేపట్టిన బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రాజు, కార్యదర్శి టి. హరికృష్ణ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎ. యాదగిరి, ప్రధాన కార్యదర్శి దిలీప్, తదితరులు ఉన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య భోజ్యాతండాలో విచారణ -
ధాన్యం సేకరణ 62.36 శాతమే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకవడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఽఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మె.టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు... వానాకాలంలో సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు 10,39,815 మె.టన్నులు ధాన్యం రైతులనుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్‌లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ’కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లోనుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను నిండా ముంచిందిమోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరి యా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నెలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నకం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మె.టన్నుల్లో) జిల్లా సేకరించాల్సిన కొనుగోలుకేంద్రాల కొనుగోలుకేంద్రాల కొనుగోలు రైతుల కొనుగోలు ధాన్యం ప్రతిపాదన ప్రారంభం ధాన్యం సంఖ్య విలువ (రూ.కోట్లలో) హనుమకొండ 1,80,355 157 157 1,03,154 25754 246.39 వరంగల్ 1,95,141 260 260 1,15,440 28604 275.77 జనగామ 1,69,662 294 294 1,45,206 36274 346.87 మహబూబాబాద్ 2,24,688 260 260 1,54,520 31334 369.06 జేఎస్‌భూపాలపల్లి 1,22,543 204 204 49,356 9616 117.89 ములుగు 1,47,426 185 185 80,702 11775 192.21 ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మె.టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
మానుకోట మున్సిపాలిటీలో సమస్యల తాండవం మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాల్లో సగానికి పైగా మరమ్మతుల బారిన పడి షెడ్డుకే పరిమితమయ్యాయి. దీనికి తోడు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఇదిలా ఉండగా అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పందుల స్వైర విహారం చేస్తుండగా పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 143మంది మాత్రమే.. మానుకోట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్‌లో 205 మంది సిబ్బంది ఉండగా, వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. 12 ట్రాక్టర్లు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 14 మూడు చక్రాల ఆటోలు, రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వలు శుభ్రం చేసే వాహనం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిగ్నల్ కాలనీ, గాంధీపురం శివారులో చెత్త డంపింగ్ యార్డులు ఉన్నాయి. వాహనాల మరమ్మతులు.. మానుకోట మున్సిపాలిటీలో 36 వాహనాలు ఉండగా.. వాటిలో 10 మూడు చక్రాల ఆటోలు, 5 నాలుగు చక్రాల ఆటోలు, ఒక ట్రాక్టర్ మరమ్మతుల బారిన పడ్డాయి. అవి అన్ని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉన్న షెడ్డుకే పరిమితమయ్యాయి. దీంతో పారిశుద్ధ్య పనుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. పలు కాలనీల్లో రోజు విడిచి రోజు చెత్త సేకరణ చేస్తుండగా.. శివారు కాలనీల్లో వారానికి రెండు రోజులు సేకరణ చేస్తున్నట్లు ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు. వేధిస్తున్న కార్మికుల కొరత.. జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ మానుకోట.. అలాగే జిల్లా కేంద్రం కావడంతో పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయి. షాపులు, ఆస్పత్రులు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, షాపింగ్‌మాల్స్ ఎక్కువగా ఉన్నా యి. అయితే అవసరాలకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికులు లేరు.. 143 మంది మాత్రమే ఉన్నా రు. వారిపై పనిభారం పడుతోంది. వారిలో కూడా కొంతమంది కార్మికులు అధికారుల ఇళ్లలో పని పనిచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమం జరిగినా పారిశుద్ధ్య కార్మికులు వెళ్లాల్సి వస్తోంది. కాగా, కార్మికుల సంఖ్య పెంచాలని సీడీఎంఏను కోరగా.. ఆదాయం పెంచుకుని కార్మికుల సంఖ్య పెంచుకోవాలని చెప్పడంతో చేసేది ఏమీ లేక ఉన్న వారితో నిర్వహణ చేపడుతున్నారు. బిల్లుల జాప్యంతోనే షెడ్డులోనే వాహనాలు.. మెకానిక్‌లకు ఇచ్చే బిల్లుల్లో జాప్యంతో వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్పెషల్ ఆఫీస ర్ పాలన కావడంతో బిల్లుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో బిల్లులు ఆలస్యమవుతున్నాయని మెకానిక్‌లు వాహన మరమ్మతులకు ముందుకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో నెలల తరబడి షెడ్డులోనే ఉంటున్నాయి. రూ.55లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రోడ్డు స్వీపింగ్ మిషన్, రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన కాల్వలు శుభ్రం చేసే మిషన్ నెలల తరబడి షెడ్డుకే పరిమితమయ్యాయి. పర్యవేక్షణ లోపం.. పారిశుద్ధ్య పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కమిషనర్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాల్వలు శుభ్రం చేయడం లేదు. కొన్ని కాల్వలు తీసినప్పటికీ.. అక్కడి చెత్త కుప్పలు తీసుకెళ్లకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాటితో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నామమాత్రంగా ఫాగింగ్.. మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్ నామమాత్రం చేస్తున్నారు. దీంతో దోమల సంఖ్య పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా వాడడం లేదు. తాగునీటి సరఫరాలోనూ సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రత్యేక చొరవ తీసుకుంటేనే పారిశుద్ధ్యంత పాటు ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతుల బారినపడిన వాహనాలు వేధిస్తున్న కార్మికుల కొరత పందుల స్వైర విహారం అపరిశుభ్రంగా పరిసరాలు రోగాల బారిన పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు16 వాహనాలు మరమ్మతుల బారిన పడ్డాయి మున్సిపాలిటీలో 16 వాహనాలు మరమ్మతుల బారిన పడి షెడ్డులో ఉన్నాయి. రెండు నెలలు కావస్తోంది. బిల్లుల ఆలస్యంతో మెకానిక్‌లు ముందుకు రావడం లేదు. అయితే రెండు రోజుల్లో వాహనాల మరమ్మతులు పూర్తి చేయిస్తాం. ఉన్న వాహనాలతో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్, వాహనాల అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ మహబూబాబాద్: వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తమ హక్కులు, బాధ్యతలపై కూడా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవా న్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు చట్టాలపై విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యపర్చాలన్నారు. అన్యాయం జరిగితే న్యాయం కోసం జాతీయ వినియోగదారుల సంస్థ పని చేస్తుందన్నారు. డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ రమేశ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఉండ్రుపుర చర్చి
జనగామ: జనగామలోని ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలు స్తోంది. లోకరక్షకుడి సేవలో 125 ఏళ్లుగా సేవలందిస్తోంది. 1901లో స్థాపితమైన చర్చి.. అనేక సేవా కార్యక్రమాలతో జిల్లాలో తల్లి సంఘం చర్చిగా నామకరణం పొందింది. రష్యా చెందిన దంపతులు అన్న ఉన్రు(భార్య), హెర్ని ఉన్రు (భర్త) అనేక దేశాలు పర్యటిస్తూ జనగామకు చేరుకున్నారు. 1901 నుంచి వారి సేవలను కొనసాగిస్తూ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ నుంచి చర్చి సేవలు, ప్రార్థనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఎదుట(ప్రస్తుతం)కు మార్చారు. రష్యాకు చెందిన ఉన్రు దంపతులకు 8 మంది సంతా నం కలగగా చదువు ఇక్కడే పూర్తి చేశారు. తదనంతరం వారు రష్యా, అమెరికాకు వెళ్లి పోయారు. కాలక్రమేనా 1912లో భర్త హెర్ని ఉన్రు మృతి చెందగా, భార్య అన్న ఉన్రు 1921లో రష్యాలో మృతి చెందారు. ఉన్రు పెద్ద కూతురు తండ్రితోనే జనగామలో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఆమె కూడా చనిపోవడంతో ప్రెస్టన్‌లోని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు. 2002లో నూతన చర్చి ప్రారంభం.. 2000లో నూతన భవన నిర్మాణం కోసం భూమి పూజ చేసి 2002లో చర్చిని ప్రారంభించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీ దుగా ఉండ్రుపుర సెంటనరీ బాపిస్టు చర్చిలో విద్యుత్ వెలుగులు ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక మంది పాస్టర్లు కరుణామయుడి సన్నిధిలో సేవలందించారు. -
రూ.16 లక్షల విలువైన పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత
పాలకుర్తి టౌన్: అక్రమంగా తరలిస్తున్న రూ.16 లక్షల విలువైన రేషన్ (పీడీఎస్) స న్న బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఐతే కృష్ణ, శ్రీకాంత్.. రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలో సేకరించిన బియ్యాన్ని రెండు లారీల్లో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని వల్మిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో రెండు లారీలను ఆపారు. సన్న బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారని డ్రైవర్లను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం పౌర సరఫరాల శాఖ డీటీ.. లారీల్లోని బియ్యాన్ని పరిశీలించి రేషన్‌గా తేల్చారు. దీంతో రెండు లారీల్లో రూ.16 లక్షల విలువైన 370 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని లారీలను సీజ్ చేయడంతో పాటు కృష్ణ, శ్రీకాంత్, జార్ఘండ్‌కు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై తెలిపారు. కృష్ణ, శ్రీకాంత్ పరారీలో ఉన్నారని ఎస్సై పేర్కొన్నారు. -
కేంద్రప్రభుత్వ న్యాయవాదులు నియామకం
మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన తుంపిల్ల శ్రీనివాస్, జిల్లా కేంద్రానికి చెందిన నలుసాని ప్రభాకర్రెడ్డిలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నియమించినట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్‌సుందర్‌శర్మ బుధవారం తెలిపారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశా రు. తమ నియామకానికి సహకరించిన జాటోతు హుస్సేన్‌నాయక్, శ్యామ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా వారికి బీజేపీ నాయకులు శఅభినందనలు తెలిపారు. -
86 ఏళ్లుగా ప్రభు సేవలో..
డోర్నకల్: డోర్నకల్‌లో ప్రసిద్ధిగాంచిన ఎఫిఫనీ చర్చి 86 ఏళ్లుగా ప్రభు సేవలో తరిస్తోంది. నాటి మద్రాస్ బిషప్ వైట్ హెడ్ ఆధ్వర్యంలో 1915 జనవరి 24న చర్చి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణం 1939లో పూ ర్తికాగా డోర్నకల్ బిషప్ అజరయ్య నేతృత్వంలో అదే సంవత్సరం ఎఫిఫనీ పండుగ రోజున ప్రారంభించి ఎఫిఫనీ చర్చిగా నామకరణం చేశారు. ద్రవిడ, క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ చర్చిని నిర్మించారు. చర్చి ముఖ శిఖ రాలు మసీదు గుమ్మటాలను పోలి ఉండగా వాటిపై రెండు పద్మాలు, రెండు శిలువలు ఉంటాయి. ఆలయం లోపల ఏసుక్రీస్తు 12 మంది శిష్యుల పేరుతో 12 స్తంభాలను నిర్మించారు. స్తంభాలకు ఇరువైపులా ఉమ్మెత్త పుష్పాలు, అరటి మొగ్గలు నిర్మించారు. దీంతో అద్భుత శిల్ప సౌందర్యంతో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రతీ సంవత్సరం దేశ, విదేశాల నుంచి అనేకమంది డోర్నకల్‌కు వస్తున్నారు. కాగా, ఎఫిఫనీతోపాటు డోర్నకల్ పరిధిలోని పలు చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. -
దర్శనాల నిలిపివేత.. ఆరుబయట పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు మేడారానికి భారీగా తరలివచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పూజారులు దర్శనాల నిలిపివేత ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం అందని భక్తులు వంద సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను గద్దెల వద్దకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు బయటనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని పక్కనే ఉన్న చెట్టు వద్ద పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో భక్తులు సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు పూజా కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులను గద్దెల ప్రాంగణంలో రాకుండా చర్యలు తీసుకున్నారు. -
రైల్వే ప్రాజెక్టు సాఽధించుకుందాం
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను అందరి సహకారంతో సాధించుకుందామని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ని సెక్రటేరియట్లో అఖిలపక్ష పార్టీల నాయకులు బుధవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మానుకోటలోనే డిపో ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ పొరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అఖిలపక్ష పార్టీల నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్, బి.విజయసారథి, మార్నేని వెంకన్న, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య, దార్ల శివరాజ్, కొత్తపల్లి రవి, తేళ్ల శ్రీనివాస్, నెహ్రూనాయక్, అజయ్‌సారథిరెడ్డి, రఘు, ఘనపురపు అంజయ్య, సూర్నపు సోమయ్య, ముత్యం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో సైబర్ నేరాల కట్టడి
● డీఎస్పీ తిరుపతిరావు కురవి: అప్రమత్తతతో సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఆన్లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోన్, బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై గండ్రాతి సతీష్, సైబర్ క్రైం ఎస్ఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
రైతును బురిడీ కొట్టించి రూ.40 వేలు డ్రా..
వర్ధన్నపేట: ఏటీఎం కేంద్రంలో ఓ రైతును దుండగుడు బురిడీ కొట్టించాడు. రైతు ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు డ్రా చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన బుధవారం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రైతు పిన్నింటి కిషన్‌రావు తన ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కావడంతో ఎస్బీఐకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడానికి అధికారులను సంప్రదించాడు. అయితే బ్యాంకులో డబ్బులేదని ఏ టీఎం ద్వారా డ్రా చేసుకోవాలని వారు సూచించారు. కిషన్‌రావుకు ఏటీఎం వినియోగం తెలియకపోవడంతో అక్కడే ఉన్న ఓ గుర్తు తెలి యని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేయాలని కోరాడు. అతడికి తన పిన్ నంబర్ చెప్పాడు. అయితే ఏటీఎం కార్డు పని చే యడం లేదని దుండగుడు.. కిషన్‌రావును న మ్మించాడు. అనంతరం మరో ఏటీఎం కార్డు ఇవ్వగా కిషన్‌రావు అక్కడి నుంచి వెళ్లి పోయా డు. తన ఏటీఎం కార్డు పని చేయడం లేదని బ్యాంకు సిబ్బందికి తెలిపి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును చూపాడు. ఆ కార్డును చూసిన సి బ్బంది కిషన్‌రావుకు చెందిన కాదని, డుప్లికేట్‌గా గుర్తించారు. వెంటనే కిషన్‌రావు ఖాతాను పరిశీలించగా అప్పటికే ఏటీఎం కార్డు ద్వారా రూ.40 వేలు వేరే ఏటీఎం దగ్గర నుంచి డ్రా చే సినట్లు గుర్తించారు. ఈ విషయం కిషన్‌రావుకు తెలపడంతో లబోదిబోమన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణ చేపట్టారు. ఏటీఎం కార్డు మార్చి ఇచ్చిన దుండగుడు అనంతరం మరో ఏటీఎంలో డబ్బులు డ్రా -
క్షేత్రస్థ్ధాయిలో సర్వే నిర్వహించాలి
నెహ్రూసెంటర్: ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి కుష్ఠువ్యాధి నియంత్రణకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జాన్‌బాబు, సెంట్రల్ అబ్జర్వర్ జయంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు సబ్ సెంటర్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చర్మంపై మచ్చలు ఉన్నట్లయితే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సర్వే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డీపీఎంఓ వాలియా, వైద్యాధికారి మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
తిమ్మరాయినిపహాడ్‌లో జిల్లాలోనే అతిపెద్ద చర్చి ..
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పెద్ద చర్చిగా పిలువబడుతున్న తిమ్మరాయినిపహాడ్లోని పునీత రాయప్ప దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1924లో కమ్మ కులస్తులు ఈ గ్రామాన్ని స్థాపించారు. 1930లో ఫాదర్ పజలీనా కాజీపేట నుంచి వస్తూ స్వరూపాలు, పటాలు అందిస్తూ దైవ కార్యాలు నిర్వహించేవారు. చిన్న పూరి గుడిసెలో మొదట క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారు. 1956లో నూతన చర్చి పనులు ప్రారంభించి 1967లో పూర్తి చేశారు. యూఎస్ఏలో స్థిరపడిన నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వగ్రామం చేరుకున్నా. నాన్నతో ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ విజయరాజు, తిమ్మరాయినిపహాడ్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామంలో 90 శాతం మంది ప్రజలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించాం. రాత్రి నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. -
బోడమంచ తండాలో ఉద్రిక్తత..
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాలో బుధవారం ఉద్రికత్త చోటు చేసుకుంది. భుక్య వీరన్న అనే వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని తండావాసులు ఆందోళన చేపట్టారు. భుక్య వీరన్న హత్యకు మృతుడి భార్య విజయ, ఇదేతండాకు చెందిన బోడ బాలోజీ, అతడి స్నేహితుడు, ఆర్ఎంపీ ధర్మారపు భరత్ కారణమని ఆరోపిస్తూ బాలోజీ, విజయ ఇళ్లపై దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇటుక విసరడంతో అక్కడున్న సెకండ్ ఎస్సై నరేశ్, కానిస్టేబుల్ నరేశ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే మానుకోటలో ఓ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆర్ఎంపీ భరత్‌కు చెందిన బైక్‌ను తండావాసులు దగ్ధం చేశారు. అతడు ఉండే గుమ్చిని సైతం ధ్వంసం చేశారు. ఘటనా స్థలికి మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్, కేసముంద్రం సీ ఐలు సర్వయ్య, సత్యనారాయణ, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు ఎస్సైలు క్రాంతికిరణ్, కరుణాకర్, రమేశ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. హత్య ఘటనలో అనుమానితుల ఇళ్లపై దాడికి యత్నం -
విద్యుత్ వెలుగుల్లో ‘సీబీసీ’ జిగేల్ ..
ఖిలా వరంగల్: వరంగల్ క్రిస్టియన్ కాలనీలో 137 సంవత్సరాల చరిత్ర గల సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చర్చి ఫాదర్లు రెవరెండ్ పుల్ల జగ్జీవన్ బాబ్జీ, ఎం. ఆత్యుష్, కార్తీక్ అబ్రహ్మ సంయూక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి క్రైస్తవులు అర్ధరా త్రిని స్వాగతించారు. 12 గంటలకు కేక్ కేట్ చేసి పరస్పరం శు భాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, సీబీసీ విద్యుత్ దీపాల వె లుగులో జిగేల్‌మంటోంది. వేడుకలకు లక్ష మంది భక్తులు తరలొచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు చర్చి నిర్వాహకులు ఏ ర్పాట్లు చేశారు. చర్చి ఎదుట ప్రత్యేక దుకాణాలు, రంగుల రా ట్నాలు ఏర్పాటు చేయడంతో జాతరను తలపిస్తోంది. కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రెసిడెంట్ పోలెపాక మనోహర్, ఉపాధ్యక్షుడు పోలెపాక రత్న బాబు, కార్యదర్శి మేగల భరత్, కోశాధికారి బషికే విజయ్‌కుమార్, పోలేపాక కిరణ్ కుమార్, బైరపా క సామేల్ రాజ్, గుండేటి శ్యామ్, మడిపెల్లి ప్రాన్సిస్ జాశ్వా , లిమ్యూల్, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ
మహబూబాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి రెండు, మూడు గంటల ప్రయాణంలోనే చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వైభవం, అభయారణ్యాలను ఆస్వాదించాలంటే ఉమ్మడి వరంగల్, మానుకోటను సందర్శించాల్సిందేనని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పర్యాటక బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మానుకోట జిల్లా పరిధిలోని బయ్యారం పెద్దచెరువు, బీమునిపాద జలపాతం, పురాతన ఆలయాలు, ఏడు బావులు, ఇతర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల పరిచయంలో భాగంగా 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్లుగా మార్చేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి శివాజీ, డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్, టూరిజం ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లోకేఽశ్వర్ పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్‌కు సెలవులుమహబూబాబాద్ రూరల్: మహబూబాద్ వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. క్రిస్మస్, బా క్సింగ్ డే సందర్భంగా గురు, శుక్రవారం, వా రాంతపు సెలవుల సందర్భంగా శని, ఆది వా రాల్లో వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు బంద్ ఉంటాయన్నారు. రైతులు నాలుగు రోజుల సెలవుల విషయాన్ని గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని ఆయన కోరారు. మళ్లీ సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ సేవలకు ప్రశంసపత్రాలుమహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్/ఐటీ ఆధారిత వ్యవస్థల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు బుధవారం రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వీవీ.శ్రీనివాసరావు చేతుల మీదుగా అభినందనలు పొంది, ప్రశంసపత్రాలు స్వీకరించారు. జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు ఎం.సంతోష్ కుమార్, జి.కిశోర్ కుమార్, టెక్ టీం రైటర్లు ఉమ (డబ్ల్యూపీసీ, రూరల్ పోలీస్ స్టేషన్), వై.శ్రావణ్ కుమార్ (డోర్నకల్ పోలీస్ స్టేషన్) హైదరాబాద్‌లోని పోలీసు శాఖ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రశంసపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్‌లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి పోలీసు శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలని ఆకాంక్షించారు. 27న రిజిస్ట్రేషన్ మేళా మహబూబాబాద్: జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఈనెల 27న ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు, రిజిష్ట్రేషన్మేళా నిర్వహించనున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27న కలెక్టరేట్లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలన్నారు. ఈ మేళాలో రెన్యూవల్ కూడా చేస్తారని చెప్పారు. పూర్తి వివరాల కోసం 90002 84353 నంబర్లో సంప్రదించాలన్నారు. -
వైభవంగా ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ వేడుక
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 7 నుంచి మొదలైన పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగాయి. పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు సమ్మక్క, సారలమ్మ పూజారులతో కలిసి గద్దెలపై ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవార్లకు పూజారులు యాటలను నైవేద్యంగా సమర్పించారు. మార్మోగిన గద్దెల ప్రాంగణం.. ధ్వజ స్తంభాలను నూతన గద్దెలపైకి తీసుకొసున్న క్రమంలో ఆదివాసీల డోలు వాయిద్యాల చప్పులతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులతోపాటు వారి కుటుంబీలు వందల సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల దర్శనాలు నిలిపేయడంతో ప్రశాంత వాతావరణంలో పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. నూతన గద్దెలను దర్శించుకున్న మంత్రి సీతక్క గోవిందరాజు, పగిడిద్దరాజు నూతన గద్దెలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మేడారం ఈఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం సర్పంచ్ భారతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు దర్శించుకున్నారు. పూనుగొండ్ల, కొండాయి నుంచి వచ్చిన పూజారుల కుటుంబీలు, బంధువులు గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. పూర్వీకుల సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాం.. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజు, గోవిందరాజుల ఽగద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను వరుస క్రమంలో పూజారుల అనుమతితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని, పూర్వీకుల ఆదేశాలతో పాటు ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. నేడు మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. శాసీ్త్రయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందని, దీనిని వినియోగంతో పూర్వంలో గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదన్నారు. సమ్మక్క తల్లి గోత్రం బండాన్నీ అని కోయ భాషలో బండారి అని కూడా పిలుస్తారని మంత్రి తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన పూజలు తరలొచ్చిన పూజారుల కుటుంబీకులు, ఆడపడుచులు -
గట్టమ్మ వద్ద దుకాణాల వేలం
ములుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా ఆది దేవత గట్టమ్మ వద్ద భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధికారులు బుధవారం వేలం పాటలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వేలం పాటలకు వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలం పాటల్లో కొబ్బరికాయ దుకాణం రూ.12.80లక్షలు, పసుపు–కుంకుమ రూ. 4.20 లక్షలు, కూల్‌డ్రింక్స్ రూ.1.90 లక్షలు, మొక్కజొన్న కంకులు రూ. 20 వేలు, బెల్లం రూ.75 వేలు, హోటల్ రూ. 20 వేలు, జనరల్ షాపు రూ.25 వేలు, పండ్ల షాపు రూ.13 వేలు, కాఫీ షాపు రూ.12 వేలు, ఐస్‌క్రీమ్ రూ.45 వేలు, చెరుకు రసం, కొబ్బరి బొండాలు రూ.13 వేలకు హెచ్చుగా పాట నిర్ణయించినట్లు తెలిపారు. పరిశీలకులు అనిల్‌కుమార్, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య!
కేసముద్రం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచాతండాజీపీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భుక్య వీరన్న(45) కౌలు వ్యవసాయంతోపాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫోన్ రావడంతో తాను బయటకు వెళ్లొస్తానని భార్య విజయకు చెప్పి బైక్‌పై వెళ్లాడు. అర్ధర్రాతి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంటికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తండాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా ప్రధాన రహదారి పక్కన వీరన్న మృతి చెంది ఉండడాన్ని గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తల వెనుకవైపు ఆయుధంతో కొట్టినట్లు గాయం ఉండడంతోపాటు మృతదేహానికి కొంత దూరంలోని వ్యవసాయ భూమిలో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని మరోచోటు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతదేహంపై బైక్ ఉండడంతో రోడ్డు ప్రమాదంగా దుండగులు చిత్రీకరించినట్లు పలువురు భావిస్తున్నారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, బయటకు వెళ్లొస్తానని రాత్రి ఇంచి నుంచి వెళ్లిన వీరన్న.. తెల్లవారుజామున శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి అరెస్ట్ నెల్లికుదురు : లైంగికదాడి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇనుగుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్సై కరుణాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఓ వివాహితపై ఈ నెల 22న గ్రామంలోని ఓ రైస్ మిల్లులో కూలి పనిచేస్తున్న బిహార్‌కు చెందిన అంకల్ మాంజి లైంగికదాడికి పాల్పడినట్లు రుజువైందని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.● ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం? ● బోడమంచాతండాజీపీలో ఘటన -
కోర్టు ఆవరణలో మరదలిపై బావ దాడి
జనగామ : కక్షలను మనసులో పెట్టుకుని కోర్టు పేషీకి హాజరైన మరదలి(తమ్ముడి భార్య)పై బావ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణరెడ్డి, బాధితురాలి తల్లిదండ్రులు ముశిని బాలయ్య, యాదమ్మ కథనం ప్రకారం.. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన బూడిద అర్చన అలియాస్ అండాలుకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సుంచనకోటకు చెందిన బూడిద అశోక్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోగా, ఇరువర్గాల కేసు నమోదుతో వారు కోర్టు పేషీకి హాజరవుతున్నారు. ఈ క్రమంలో సుంచనకోట, కట్కూరు నుంచి రెండు వర్గాలుగా మంగళవారం కోర్టుకు వచ్చారు. అందులో బాధితురాలి బావ నర్సయ్య సైతం ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి అర్చన చెట్టుకింద కూర్చుని ఉండగా అదే సమయంలో నర్సయ్య బండరాయితో అర్చన తలపై రెండు సార్లు మోదాడు. మూడో సారి దాడిచేసే క్రమంలో అక్కడే ఉన్న కొందరు అడ్డుకోవడంతో ప్రాణా పాయం తప్పింది. వెంటనే గాయపడిన అర్చనను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పోలీసులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నర్సయ్యను అదుపులోకి తీసుకుని బాధితురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బండరాయితో మోది హత్యాయత్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి ● వంగాలపల్లిలో ఘటన చిల్పూరు: బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్ స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి (54) ఆటోలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలోని ఎస్బీఐకి వస్తూ కరుణాపురంలో దిగాడు. అక్కడ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి హనుకొండకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కదిరె సాయివివేకానందరెడ్డిపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేల ఆరోగ్యంతోనే రైతులు బాగు
● ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి హన్మకొండ: నేల ఆరోగ్యంతోనే రైతులు బాగుంటారని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీ య రైతు దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ క్రమంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిచారు. కార్యక్రమంలో మధ్య తెలంగాణ మండలంలోని రైతు విజ్ఞాన కేంద్రాలైన వరంగల్, జోగిపేట, తోర్నాల కోఆర్డినేటర్లు డాక్టర్ ఎ.విజయభాస్కర్, డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వగ్రామం చేరిన ఆజాద్..
● ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు గోవిందరావుపేట : ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న మంగళవారం తన స్వగ్రామం మండల పరిధిలోని మొద్దులగూడేనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆజాద్ మాట్లాడారు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగానన్నారు. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన తాను ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నెల రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు ఆజాద్ అలియాస్ గోపన్న తన తల్లి లచ్చమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
ప్రపంచం దృష్టి భారత్ వైపు..
కేయూ క్యాంపస్: దేశ పునర్మిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమైందని, ప్రపంచం దృష్టి భారత్ వైపు చూస్తోందని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. రెండురోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కొనసాగిన రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టికోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని దేశం కోసం పనిచేసేది ఏబీవీపీ కార్యకర్తలేనన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ హాస్టళ్ల కన్వీనర్ జీవన్, కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ ,కార్యదర్శి జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జాతీయసహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు, ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్‌ఎస్‌తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
బైక్‌ను ఢీకొన్న ఇసుక లారీ..
● యువకుడి దుర్మరణం ● దేవన్నపేటలో విషాదం హసన్‌పర్తి: ఇసుక లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి–ఉనికిచర్ల మార్గమధ్యలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ పంజాల నాగలక్ష్మి కుమారుడు చరితకుమార్(27) స్థానికంగా వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేడోడువాడుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం జాతీయ రహదారి మీదుగా బైక్‌పై నిరూప్‌నగర్ తండా వైపునకు బయలుదేరాడు. సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగా, వడ్డేపల్లి నుంచి ఉనికిచర్ల వైపునకు వెళ్తున్న ఇసుక లారీ డివైడర్ల పైనుంచి దూసుకొచ్చి బైక్‌ను ఢీకొంటూ రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ప్రమాదంలో చరితకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, భూపాల్‌తోపాటు బంధువులు ఘటనా స్థలికి తరలొచ్చి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చరితకుమార్ మృతితో దేవన్నపేటలో విషా దం అలుముకుంది. కాగా, సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘటనాస్థలిని సందర్శించి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఐపీఎల్ సెలక్టర్‌గా సాయినాథ్‌రెడ్డి మహబూబాబాద్ అర్బన్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన సంకేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కీర్తన దంపతుల కుమారుడు సాయినాథ్‌రెడ్డి ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సూపర్ సెలక్టర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల ఐపీఎల్ టెక్నికల్ వింగ్‌కు దేశ వ్యాప్తంగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో సాయినాథ్ రెడ్డి సెలక్టర్‌గా ఎంపికయ్యారు. దీంతో యూ ఏఈలోని అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోచ్ సంగక్కర, డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్తోపాటు సాయినాథ్‌రెడ్డి.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కాగా, సాయినాథ్‌రెడ్డి బెంగళూరులో డేటా సైంటిస్ట్ ఉద్యోగం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. బీసీ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ హన్మకొండ: ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) ఆధ్వర్యంలో బీసీ మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్‌లోని ఓబీసీ కార్యాలయంలో ఫ్రీ ఉమెన్ ట్రైనింగ్ ఫర్ బీసీ ఉమెన్ కార్ పైలట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు బీసీ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 20257రైతులకు సహకరించాలిమహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని జెడ్పీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్ల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకువస్తే తేమశాతం ఆధారంగా కొనుగోళ్లు చేసేందుకు వీలుంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా రైతులకు అవగాహన కల్పించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టి, కాంటాలు త్వరగా పూర్తిచేసి, బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు. లారీలు, బస్తాలు, ఇతర రవాణా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మల్యాల ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి జగన్ ఉన్నారు. -
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, డైనింగ్ హాల్, వంటశాల గదులు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడి ఆహారం అందించాలన్నారు. రాత్రివేళలో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలన్నారు. స్నానానికి వేడి నీరు అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయించాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారి పరిధిలో ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ భవనం పరిశీలన
కురవి: మండల కేంద్రంలో ప్రైవేట్ భవనాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతిగృహం నిర్వహణ కొనసాగుతోంది. హాస్టల్‌ను వేరే చోటుకు మార్చేందుకు గతంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల కొనసాగిన భవనాన్ని ఆయన పరిశీలించా రు. అనంతరం ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ విజయ, ఆర్ఐ రవికుమార్ భవనాన్ని పరిశీలించి, సౌకర్యాలు తెలుసుకున్నారు. నేడు లక్ష తులసి అర్చన మహబూబాబాద్ రూరల్: ధనుర్మాసవ్రత మహోత్సవాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి అర్చన బుధవారం జరగనుందని ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ.కృష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉదయం 9గంటలకు ప్రారంభంకానున్న లక్ష తులసి అర్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. విష్ణు సహస్ర నామాలు చదివే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. డిపో అభివృద్ధికి పాటుపడాలి నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు, సిబ్బంది పాటుపడాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ సూచించారు. డిపోలోని సెక్షన్లను పరిశీలించి మంగళవారం ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మేడారం జాతరకు ఆర్టీసీ మరింత సేవలు అందించేలా సిద్ధం కావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ వి.కల్యాణి, డిపో సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్ పాపిరెడ్డి, రాములు, ఏడీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. దాతలు ముందుకు రావాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వీ వాటర్ ప్లాంట్‌ను డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దేశం, సొంత గ్రామం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం యూత్ సభ్యులను సన్మానించి అభినందించారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, పాఠశాల హెచ్ఎం సిరి నాయక్, ఉపాధ్యాయులు వాసుదేవ్, రవీందర్‌నాయక్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వనదేవతలకు భక్తుల మొక్కులు ఎస్ఎతాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చా రు. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద జల్లు స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. యాటలను మొక్కుగా సమర్పించారు. అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనా లు ఆరగించారు. అలాగే మేడారం పనుల పరి శీలనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారువేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన, భక్తుల రద్దీతో మేడారంలో సందడి నెలకొంది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రేగొండ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని రామన్నగూడెం తండా గ్రామంలో జరిగింది. ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అజ్మీరా రూప్లా నాయక్ (75) తన మొక్క జొన్న పంటకు నీరు పారించేందుకు వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడలతో మానసికోల్లాసం
స్టేషన్‌ఘన్‌పూర్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నిట్ వరంగల్ పీడీ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 12 కళాశాలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని, పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్‌ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25న ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధ్దన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలు జనవరి చివరి వారంలో షెడ్యూల్‌కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్‌ఘన్‌పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16‘పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
టార్గెట్ జనవరి 5..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని, అటు ఇటు అయితే జనవరి 5 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారంలోని హరితహోట్లో మంత్రి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. ప్రాకారం పనులపై సుదీర్ఘ సమీక్ష అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న ప్రాకారం రాతి నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుమారు అరగంటకుపైగా సమీక్షించారు. ప్రాకారం చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్ ఏర్పాట్ల పనులు, గోవిందరా జు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 5వ తేదీ లోపు ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా విజిట్ చేస్తానని, పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. జనవరి 6వతేదీన సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే చాన్స్ ఉందని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. స్వస్తిక్ గుర్తు ఆదివాసీల సంప్రదాయమే.. స్వస్తిక్ గుర్తును ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గొట్టు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నారన్నారు. కాగా, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాల సందర్భంగా నేడు (బుధవారం) అమ్మవార్ల దర్శనాలు నిలిపివేసినట్లు పూజారులు ప్రకటించారని, భక్తులు సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన జాతర పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అంతకుముందు మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీచందర్ ఉన్నారు.మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు (బుధవారం) ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని మంగళవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాల ను నిలపనున్నట్లు పూజారులు తెలిపారు. ఆ లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అధికారులకు మంత్రి పొంగులేటి డెడ్‌లైన్ క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రులు -
సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఎంజీఎం : పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపం ఉన్న వరంగల్‌కు చెందిన 16 నెలల చిన్నారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ ఈఎన్టీ సర్జన్, తెలంగాణ రాష్ట్ర కోక్లియర్ ఇంప్లాంట్ నోడల్ ఆఫీసర్ మనీష్ గుప్తా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా సరి చేయొచ్చన్నారు. తద్వారా మూగ, చెవిటి కాకుండా నిరోధించి సామాన్య జీవితం అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఈఎన్టీ హెచ్ఓడీ సంపత్, ప్రొఫెసర్ విజయ్, కోఠి ఈఎన్టీ వైద్యురాలు వీణ, ఎంజీఎం అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ చిలక మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మావతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంతా గందరగోళం!
సాక్షి, మహబూబాబాద్: గత విద్యాసంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగిన విద్యాశాఖ ఈ ఏడాది వెనుకబడిపోయింది. ఇందులో పంచాయతీ ఎన్నికలు, ఉపాధ్యాయులకు శిక్షణ, డ్యూటీల పేరుతో 15రోజులకు పైగా పాఠాలు సాగలేదు. దీనికి తోడు మారిన అధికారులు, ఖాళీలు, సమన్వయలోపం.. అంతా వార్షిక పరీక్షల ఫలితా లపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ముందస్తు ప్రణాళిక.. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆతర్వాత సంవత్సరం కాస్త మెరుగుపడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపుతో గత విద్యా సంవత్సరం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏఏఈఈఆర్‌టీ రూపొందించిన కరదీపికలతోపాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్‌తోపాటు, పలు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు వరంగల్, హనుమకొండ నుంచి సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులను పిలిపించి ప్రత్యేక క్లాసులు చెప్పించారు. వీటన్నింటి ఫలితంగా 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. మరో 80రోజుల్లో పరీక్షలు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు వంద రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేసిన విద్యాశాఖ ఈ ఏడాది అంత ఉత్సాహం చూపించడం లేదు. గతంలో డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేయించి వందరోజులకు ముందుగా స్లిప్ టెస్ట్‌లు పెట్టారు. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందుకోసం దాతల సహకారం తీసుకొని విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. కాగా, ఈ ఏడాది మార్చి 14నుంచి పరీక్షల నిర్వహణ టైంటేబుల్ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం సరిగ్గా 80రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రణాళికలే తయారు చేయకపోవడం శోచనీయం. విద్యార్థుల స్టడీ మెటీరియల్ కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల వివరాలు.. మరో 80రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఎన్నికలతో అంతా అస్తవ్యస్తం ముందుకు సాగని ప్రణాళికలు మెటీరియల్ కోసం దాతలవైపు చూపు సిలబస్ గురించి ఆలోచించరా? గత సంవత్సరం పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో వచ్చిన దక్షిణామూర్తి జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. జిల్లానుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితిలో స్వచ్ఛంద పదవీ విరమణ పొంది వెళ్లిపోయారు. అయితే జిల్లా పరిస్థితిని చూసి జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏడీ రాజేశ్వర్‌కు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకోగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. ఈ పనులపై 15రోజులకుపైగా కాలయాపన జరిగింది. దీనికి తోడు ఏఎంఓగా పనిచేసిన ఆజాద్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. అలాగే ఉద్యోగులు, కో–ఆర్డినేటర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటివరకు ప్రణాళిక కాదుకదా.. అసలు సిలబస్ గురించి ఆలోచించిన వారు లేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.విద్యా సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో రాసిన వారు స్థానం2022–23 8,461 7,227 85.54 22 2023–24 8,178 7,738 94.62 12 2024–25 8,184 8,126 99.29 01ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఆలోపే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే పనిలో ఉన్నాం. సిలబస్‌ను నాలుగు భాగాలుగా విభజించి టెస్ట్‌లు నిర్వహిస్తాం. జిల్లా ఉన్నతాధికారులతో హైస్కూల్ హెచ్ఎంల సమావేశం నిర్వహించి టెన్త్ ఫలితాల ప్రాముఖ్యతను వివరిస్తాం. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తాం. – రాజేశ్వర్, డీఈఓ -
జీవన ఎరువులతో అధిక దిగుబడులు
● మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్‌గార్ల: రైతులు పంటల్లో జీవన ఎరువులు, ఎన్పీకే గుళికలు, పీఎస్బీ ద్రావణం వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండలంలోని సీతంపేట గ్రామ సమీపంలో జీవన ఎరువులతో రైతు బాలాజీ సాగుచేసిన మొక్కజొన్న పంటలో క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి జీవన ఎరువులు వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో చీడపీడలను నివారించవచ్చన్నారు. అపరిమితంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. కొన్నేళ్ల తర్వాత పంటలు పండవని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జీవన ఎరువులు మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతాయని సూచించారు. జీవన ఎరువులు రైతులకు అన్ని విధాలా లాభదాయకం అన్నారు. రబీలో రైతులు వరిపంటకు జీవన ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఏడీఏ వెంట ఏఓ కావటి రామారావు, రైతులు మాలోత్ బిక్షం తదితరులు ఉన్నారు. -
పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: గిరిజన పాఠశాలల్లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుగులోతు దేశీరాం నాయక్ మాట్లాడుతూ.. 60 రోజుల నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రతీ రోజు ఉదమం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఏఈలను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లు, బాత్రూమ్లను శుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓలు భాస్కర్, ఉపేందర్, ఏసీఎంఓ రాములు, డిప్యూటీ ఈఓ సారయ్య, జీసీడీఓ విజయ, డీఆర్పీ శ్రీకాంత్, ఏఈ లు ఎర్రయ్య, శోభన్, శ్రీను, పాఠశాల హెచ్ఎంలు నర్సయ్య, కిషన్‌నాయక్, కోటేశ్వరి, వార్డెన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తప్పని యూరియా కష్టాలు
● క్యూకట్టిన రైతులు ● నిరాశపరిచిన ప్రత్యేక యాప్ మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వదిలిపెట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు ఎదురుచూశారు. వానాకాలం పంటల సాగు ముగించుకుని యాసంగి పంటల సాగు కోసం రైతులు పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రైతులు మొక్కజొన్న, మిర్చి సాగు చేయడంతో పాటు యాసంగి వరి నార్లు పోసుకుని వరి పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మూడు పంటలకు కూడా యూరియా తప్పనిసరి అని భావించిన రైతులు ఆ బస్తాల కోసం రెండు మూడు రోజుల క్రితం వరకు ప్రత్యేక యాప్ వస్తుందని ఎదురు చూశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం నిర్ణయించిన ప్రత్యేక యాప్ కార్యకలాపాలు కొద్దిరోజుల వరకు నిలిపివేస్తున్నారని చెప్పడంతో యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న, మిరప సాగు చేసిన రైతులు యూరియా కోసం మానుకోటలోని పీఏసీఎస్ వద్దకు తెల్లవారుజామునే చేరుకోగా క్యూలో వేచిఉండడం కనిపించింది. అదేవిధంగా శనిగపురం గ్రామంలోని యూ రియా విక్రయ కేంద్రం వద్ద కూడా రైతులు బస్తాల కోసం క్యూలో వేచిఉండగా స్టాకు ఉన్నంత మేరకు బస్తాలను సంబంధిత అధికారులు, సిబ్బంది పోలీ సు బందోబస్తు మధ్య రైతులకు అందజేసి మిగిలిన రైతులను తర్వాత రమ్మని చెప్పి పంపించారు. మా నుకోట పీఏసీఎస్ పరిధిలో 444బస్తాల యూ రియా, శనిగపురం విక్రయ కేంద్రం పరిధిలో 666బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశామని మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, సొసైటీ సీఈఓ ప్రమోద్ తెలిపారు. -
సకుటుంబ సపరివారంగా..
● తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్.. ● భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశాయి. ఇందులో తల్లి సర్పంచ్‌గా తనయుడు ఉప సర్పంచ్‌గా, భార్య సర్పంచ్‌గా భర్త ఉప సర్పంచ్‌గా, నాడు భర్త సర్పంచ్‌గా, నేడు భర్త సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ● తీగరాజుపల్లి మాజీ సర్పంచ్‌గా కర్జుగుత్త రమ కొనసాగగా సోమవారం భర్త గోపాల్ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మొండ్రాయిలో తల్లి గూడ స్వరూప సర్పంచ్‌గా తనయుడు విజయ్‌కుమార్ ఉపసర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దతండాలో భార్య గుగులోత్ వినోద సర్పంచ్‌గా, భర్త రవీందర్‌నాయక్ ఉపసర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అరకొర వసతుల మధ్య నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండలంలోని ఎల్గూర్‌రంగంపేటలో జీపీ భవనం లేకపోవడంతో మత్స్యపారి శ్రామిక సంఘం కమ్యూనిటీహాల్లో, ముమ్మడివరంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో, గొల్లపల్లిలో అద్దె భవనంలో నూతన పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సంగెం మండలం మొండ్రాయిలో సర్పంచ్‌గా తల్లి స్వరూప, ఉపసర్పంచ్‌గా తనయుడు విజయ్‌కుమార్, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధికారులు -
తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం
● అద్దె రూ.6లక్షలు బకాయి చెల్లించకపోవడంతో యజమాని తాళం ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు నుంచి ప్రైవేట్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రెండేళ్లుగా అద్దె చెల్లించేదు. సుమారు రూ.6లక్షల పైగా అద్దె బకాయి ఉండడంతో యజమాని సమ్మయ్య సోమవారం తాళం వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది బయటనే ఉండిపోయారు. పలు రకాల పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లి అద్దె చెల్లిస్తామని యజమానిని ఒప్పించడంతో తాళం తీశారు. కాగా, అద్దె ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేదిలేక భవనానికి తాళం వేసినట్లు సమ్మయ్య తెలిపారు. భవన నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకున్నానని, అద్దె రాకపోవడంతో ఈఎంఐ కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
బచ్చన్నపేట: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ కూతురు అనుశ్రీ (21)ని సాల్వాపూర్ గ్రామానికి చెందిన గూడెపు రాజమణి సత్తయ్య దంపతుల పెద్ద కుమారుడు అజయ్‌కు ఇచ్చి 13 నెలల క్రితం వివాహం చేశారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి అనుశ్రీని భర్త అజయ్ వద్దకు పంపించారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ ఉరివేసుకొంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా వచ్చి అజయ్‌లో ఇంటిని, సామగ్రిని ధ్వంసం చేశారు. అనుశ్రీ మృతికి అత్తింటి సభ్యులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలం వద్ద నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్ తెలిపారు. -
‘అక్షయ పాత్ర’ సేవలు అనిర్వచనీయం
వరంగల్: పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఆవరణలోని ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో హెచ్డీబీ సహకారంతో ఏర్పాటు చేసిన వంటశాలలోని అధునాతన యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవ సంస్థగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇస్కాన్ అన్నారు. అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతూ హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్‌కు అనుబంధంగా పని చేస్తున్నదన్నారు. ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో బెంగుళూరు కేంద్రంగా అక్షయపాత్రను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనన్నారు. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ప్రతీరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు వేగంగా పూర్తి
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: విద్యుత్ సబ్స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్‌టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా ఆటో మేటిక్ మీటర్ రీడింగ్ ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ డివిజన్లో హై–లాస్ ఫీడర్లను గుర్తించి వాటిని పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించి నష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని సూచించారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్‌గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణమోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ పాల్గొన్నారు. -
కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి
● టీటీడబ్ల్యూఆర్‌సీఈ విద్యార్థినుల డిమాండ్ వరంగల్: ఐఐటీ, నీట్ లాంటి ఉన్నత చదువుకు గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్‌సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ 3వ డివిజన్ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్‌సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్, ఆర్‌సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్సీఓ డీఎస్.వెంకన్న, ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్సీఓ డీఎస్.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు. -
ఒక్కటే జీపీ.. వేర్వేరు చోట్ల ప్రమాణస్వీకారాలు
● బోటిమీది తండా జీపీలో విచిత్ర పరిస్థితి ఖానాపురం : మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు పాలకవర్గాలు ప్రమాణ స్వీకారాలు చేశాయి. కానీ మండలంలోని బోటిమీదితండాలో మాత్రం విచిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎంపీడీఓ అద్వైత సమక్షంలో సర్పంచ్ భానుప్రసాద్, నలుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే జీపీలో కొనసాగుతున్న గొల్లగూడెంతండా చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు మాత్రం బోటిమీది తండా జీపీలో కాకుండా గొల్లగూడెంతండాలోనే పాత జీపీ కార్యాలయం వద్ద కార్యదర్శి సమక్షంలో ఉపసర్పంచ్‌తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ జీపీ పాలకవర్గ ప్రమాణస్వీకార ప్రక్రియ విచిత్రంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
పాముకాటుతో రైతు మృతి
నల్లబెల్లి: పాముకాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య(50) ఈ నెల 19వ తేదీన తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సాగు పనుల్లో ఉన్నాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎడ్లకు వేత వేసేందుకు యత్నిస్తుండగా చేతిపై పాము కాటువేసింది. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలింకారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అరుణ, కుమారులు మునేందర్, రాజేందర్ ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సరైన ఉద్యోగం రావడం లేదని యువకుడు..
ఖానాపురం: సరైన ఉద్యోగం రావడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని రేవతండాలో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజేందర్(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈక్రమంలో 20 రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఈనెల 6న తల్లికి హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ పనిచేయలేదు. ఇదే సమయంలో యువకుడి తల్లి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూడగా రాజేందర్ మృతదేహం కనిపించింది. భయాందోళనకు గురై తండాకు వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రఘుపతి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి తార ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి సోమవారం తెలిపారు. -
తొలి హామీ అమలు..
● కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి సర్పంచ్ నకీర్త రాజు తన తొలిహామీ నెరవేర్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్ల కు జన్మనిచ్చిన అంకిళ్ల మౌనిక, రాజు దంపతులకు ఆడపిల్ల భరోసా కింద రూ.5,116 నగదు అందజేశారు. ● కన్నాయిగూడెం: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాడి రాంబాబు సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఎస్టీ కాలనీ, సమ్మక్క, సారలమ్మ గుడికి, హాస్టల్ వాడల్లో బోర్లు వేయించారు. -
.. అనే నేను
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 11,14, 17వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొలువుదీరారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అనుచరగణంతో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పలు చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 పంచాయతీల్లో అతిచిన్న వయసున్న సర్పంచ్‌గా వర్సా దీప రికార్డులోకెక్కాకారు. నామాలపాడు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో దిగిన 24 సంవత్సరాల దీప ఎన్నికల్లో విజయం సాధించి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో గ్రామస్తులు గెలిపించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ● నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా జీపీ సర్పంచ్‌గా 22 ఏళ్ల జి. హేమలత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.75 ఏళ్ల వయసులో సర్పంచ్‌లుగా.. జనగామ రూరల్: మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన చిర్ర సత్యనారాయణ రెడ్డికి 75 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా అవకాశం లభించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్‌గా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుండెల్లి కల్పన రెండో సారి ఉప సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ● భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం బావు సింగ్పల్లికి చెందిన పొనగంటి ముత్తమ్మ సర్పంచ్‌గా రెండో విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 సంవత్సరాల వయసులో సోమవారం గ్రామ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. -
యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
కేయూ క్యాంపస్: సముద్రాంతర్భాగం నుంచి ఆకాశం వరకు అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు, యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కేయూ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ఇండియా అన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యావ్యవస్థ ఉండాలన్నారు. ప్రస్తుతం 80లక్షల మంది విద్యార్థులకు లక్షమంది అధ్యాపకులు ఉన్నారన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవనే విషయం వాస్తవమని, ప్రతీ విద్యార్థి, సంస్థలు కూడా నవీకరణ చెందాలన్నారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ గతిని మార్చేశక్తి భారతీయ యువతపై ఉందన్నారు. విప్లవాత్మక మార్పులను గమనిస్తూ తీర్చిదిద్దుకోవాలి.. దేశంలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులు తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతోపాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూలతో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయన్నారు. జాతీయ విద్యావిధానం విద్యార్థులకు వరం.. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీర్ఘకాలిక పోరాటాల ఫలితమే జాతీయ విద్యావిధానమని, ఇది నేడు దేశంలోని విద్యార్థులకు వరమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీల హాస్టళ్ల కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతుసింగ్, కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు మాట్లాడారు. కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. బాలకిష్టారెడ్డి దృష్టికి వర్సిటీల్లోని సమస్యలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పలు సమస్యలు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఆ యూనివర్సిటీ నేత సుమ, అలాగే, ప్రతీ యూనివర్సిటీలోనూ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఓయూ విద్యార్థి రాజు, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలు పరిష్కరించేలా తమవంతు కృషిచేస్తున్నామని బాలకిష్టారెడ్డి ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూలో వర్సిటీల విద్యార్థుల సమ్మేళనం -
ప్రజలకు రవాణా కష్టాలు
మరిపెడ రూరల్: జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొతకు గురై కొట్టుకుపోయింది. దీంతో ఏడాదిగా పలు గిరిజన తండాలు, గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు అవతలి ఒడ్డున ఉన్న వాల్యతండా, కోట్యతండా, అజ్మీరా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 12 తండాల గిరిజన ప్రజలు, సరిహద్దు జిల్లాల ప్రజలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తారు. అయితే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. కాగా, ప్రభుత్వాలు మారినా వంతెన కష్టాలు తీరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా నిలిచిన రాకపోకలు.. పాలేరు వాగుపై లోలెవల్ వంతెన కొట్టుకుపోవడంతో ఏడాదిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వాగు మీదుగా మరిపెడ మండల కేంద్రానికి నిత్యం వందలాది మంది గిరిజనులు వెళ్తుంటారు. వివిధ సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంటారు. అయితే ఆయా గ్రామాల గిరిజన ప్రజలు వాగు దాటే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి సూర్యాపేట జిల్లా బికుమళ్ల గ్రామం శివారు 356 జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టూ తిరిగి రావడంతో ఖర్చుతో పాటు సమయం వృథా అవుతుందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.1.20 కోట్ల బ్రిడ్జి టెండర్ రద్దు.. గత ప్రభుత్వం హయాంలో పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అప్పుటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా పాలేరు వాగుపై కోతకు గురైన లోలెవల్ బ్రిడ్జికి రూ.1.20 కోట్లు నిధులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను దక్కించుకున్నాడు. నిధులు సరిపోవని చివరి నిమిషంలో సంబంధిత అధికారులు బ్రిడ్జి టెండర్ పనులు రద్దు చేశారు. మళ్లీ లోలెవల్ వంతెన నిర్మిస్తే దానిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని, అందుకు ఈ నిధులు సరిపోవని హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని, సుమారు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి హైలెవల్ వంతెనకునిధులు మంజూరు చేసి తమను వాగు కష్టాల నుంచి గట్టు ఎక్కించాలని ఆయా గిరిజన తండాలు, గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఇదే అవస్థ.. వర్షాలు కురిసి వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. లోలెవల్ బ్రిడ్జి కావడంతో పై నుంచి వాగు ప్రవహిస్తోంది. వాగు దాటే దారి లేక మండల కేంద్రానికి వెళ్లలేక పోతున్నాం. ప్రతీ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది. పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. –బానోతు అమ్రియా, కోట్యతండా, మరిపెడ భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పాలేరు వాగు లోలెవల్ వంతెన నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏడాదిగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ పక్క జిల్లా సరిహద్దు గ్రామాలనుంచి ప్రయాణం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. జనవరి 30న జరగనున్న తెలంగాణ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో బార్ కౌన్సిల్ రెండు సంవత్సరాలకు ఎన్నుకుంటే ఎనిమిది సంవత్సరాలకు పొడిగించుకుని కాలయాపన చేసిందని, న్యాయవాదులకు సరైన న్యాయం చేయలేదన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం పోరాటం చేస్తానని, యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్య కార్డులు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తానని, మౌలిక సదుపాయాల కోసం పాటుపడతానని పేర్కొన్నారు. న్యాయవాదుల గొంతుకగా నిలబడతానని హామీఇస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ రెడ్డి, రహీంపటేల్, సంద కృష్ణ, దర్శనం రామకృష్ణ, జీవై.గిరి, సత్యనారాయణ, చిన్నమహేందర్, మున్నా, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
చిన్నగూడూరు: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్(డీపీఎంఓ) వనాకర్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మాలోత్ తండాలో లెప్రసీ కేసు డిటెక్షన్ సర్వే పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాఽధి ప్రాథమిక దశలో తెలుపు రంగు మచ్చలు, ఎరుపురంగు, గోధుమ వర్ణం కలిగి స్పర్శజ్ఞానం కోల్పోవడం జరుగుతుందన్నారు. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పీహెచ్‌సీల్లో ఉచితంగాచికిత్స చేస్తారని తెలిపారు. ఈ నెల 31వరకు ఆశవర్కర్లు ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కుష్ఠు వ్యాధి అంటువ్యాధి కాదని అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ నర్సులు, ఆశవర్కర్లు ఉన్నారు. -
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 10వేల చొప్పున గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫారం 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని ఈ ప్రక్రియ జనవరి 2026లోగా పూర్తి చేయాలని తెలిపారు. వీసీ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై బీఎల్ఓలతో సమీక్షించి పురోగతి సాధించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, ఆర్డీ ఓ కృష్ణవేణి, పరిపాలన అధికారి పవన్‌కుమార్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. మేడారంలో నేడు మంత్రుల పర్యటన ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పర్యటించనున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, జాతర పనులను పరిశీలించనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
కురవి: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యాసదస్సు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జనగామ జిల్లా కేంద్రంలో జరగబోయే విద్యాసదస్సులో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు హాజరవుతారని తెలిపారు. అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జానయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు బాబు, శ్రీనివాస్, విజయరాణి, సుహాసిని, రాధిక, శోభారాణి, రమేశ్, సైదన్న, శ్రీనివాస్, గోపాల్, యాకలత, విజయలక్ష్మి పాల్గొన్నారు. వ్యర్థ వస్తువులతో ఆదాయం పొందాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు వ్యర్థ వస్తువులతో ఆదాయం పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్లో సోమవారం డివిజన్ పరిధిలో వేస్ట్ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్‌ను డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పరిసరాల్లోని చెత్త, ఇంట్లో నుంచి వచ్చిన తడి, పొడి చెత్త నుంచి ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం మొదటిస్థానంలో నిలిచిన ఏకశిల హోలిఏంజిల్స్ స్కూల్, ద్వితీయ స్థానంలో నిలిచిన మోడల్ స్కూల్, తృతీయ స్థానంలో నిలిచిన కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల భద్రతే షీటీం లక్ష్యం మహబూబాబాద్ అర్బన్: బాలికలు, మహిళల భద్రతే లక్ష్యమని షీ టీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీం, భరోసా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసిన, వేధించిన, ఇబ్బందికరంగా మాట్లాడినా.. వెంటనే 100, 1098, వాట్సాప్ 8712656935 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చల్లగాలి మెజెస్, ప్రిన్సిపాల్ పుల్లారావు, షీటీం సిబ్బంది సుధాకర్, రమేష్, అరుణ, పార్వతి, జ్యోత్స్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీహెచ్డబ్ల్యూఓ జిల్లా నూతన కమిటీ మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫోరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్లో సోమవారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కాగా, టీహెచ్డబ్ల్యూఓ అసోసియేట్ అధ్యక్షుడిగా నర్సింగ్తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడిగా సదానందం, ప్రధాన కార్యదర్శిగా స్వామి, కోశాధికారిగా పైడి, ఉపాధ్యక్షులుగా పద్మ, కల్పన, పూర్ణచందర్, జాయింట్ సెక్రటరీలుగా ఎల్లస్వామి, సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ ఎన్నికల అధికారి రోహిత్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.


