
సాక్షి, మహబూబాబాద్: మండలకేంద్రంలో ఐకేపీ వీఓఏగా పనిచేస్తున్న ఓ మహిళ రూ.మూడు కోట్ల మేర అప్పులు చేసి ఉడాయించినట్టు ప్రచారం జరుగుతోంది. పలువురు మహిళలతో ఏర్పడిన పరిచయం వల్ల డబ్బులను అప్పుగా ఇచ్చి, పుచ్చుకోవడాన్ని నమ్మకంగా చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పులిచ్చే వారికి నమ్మకం కలిగించిన సదరు వీఓఏ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు గ్రామసమాఖ్యల ద్వారా ఐకేపీ గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి డబ్బులను సైతం ఓ వీఓ దగ్గర నుంచి రికవరీ పేరుతో తీసుకున్నట్టు సమాచారం. నాలుగు రోజులుగా డబ్బులు తీసుకున్న వీఓఏ జాడలేకపోవడంతో అనుమానం వచ్చి మహిళలు విచారించగా ఉడాయించినట్టు గుర్తించారు. దీంతో అప్పులు ఇచ్చిన మహిళలు తమ నగదు ఎలా తిరిగి వస్తాయోననే ఆందోళనలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి: 'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే..
Comments
Please login to add a commentAdd a comment