VOA
-
వీఓఏల పోరుబాట
సాక్షి నెట్వర్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దుచేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖç³ట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల రాష్ట్ర సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది. -
వెలుగు కార్యాలయం ఎదుట వీవోఏల ఆందోళన
జే.పంగులూరు: టీడీపీ కూటమి నేతల బెదిరింపులే లక్ష్యంగా 18మంది వీవోఏలను అక్రమంగా తొలగించారని నిరసన తెలుపుతూ వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు సోమవారం మండల వెలుగు కార్యాలయం ముందు నిరవధిక ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకూ 24 గంటలు వెలుగు కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మండలంలో 38మంది వీవోఏలు ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జీతాలున్నా, లేకున్నా గ్రామంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధులు పెంచేందుకు తమ వంతు సాయి అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వాలు ఎన్నిమారినా ఎవరూ తొలగించేవారు కాదనీ, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే 18మంది వీవోఏలను నిర్ధాక్షిణ్ణ్యంగా ఎలాంటి సమాచారం, గ్రూపు సభ్యుల తీర్మానాలు లేకుండా, వారి సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన వ్యక్తికి మద్దతు తెలపకుంటే ఇంటికి వచ్చే పథకాలు రద్దు చేస్తామని ఒత్తిడి చేసి డ్వాక్రా మహిళలతో వారికి ఇష్టం లేకుండా సంతకాలు చేయించుకుని వారికి నచ్చిన వారిని వీవోఏలుగా నియమిస్తున్నారని వాపోయారు.అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్‌బాబు, సీఐటీయూ మండల కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి రామారావుతో కలిసి మండల సమైక్య అధ్యక్షురాలు బాచిన నాగలక్ష్మీ, వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు తహసీల్దార్ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. -
AP: జీతాలు ఇవ్వండి మహాప్రభో
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళా సాధికారిత, స్వావలంబన కోసం నిరంతరం పనిచేసే క్షేత్ర స్థాయి సిబ్బందిపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గత ఐదు నెలలుగా జీతాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులకు రాజకీయ వేధింపులకు గురిచేస్తు న్న కూటమి పాలకులు వీఓఏలు, ఆర్పీలను కూడా వేధిస్తున్నారు.జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ–వెలుగు సంస్థలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను ఆర్థికంగా తీర్చిదిద్దే గ్రామ స్థాయి ఉద్యోగులు సీఎఫ్ (వీఓఏ), పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) పరిధిలో వార్డుల్లో పనిచేస్తున్న ఆర్పీలకు ఐదు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలలు దాటినా క్షేత్రస్థాయి ఉద్యోగులు జీతాలు విడుదల చేయలే దు. దీంతో వీరికి అవస్థలు తప్పడం లేదు. రూ.3వేలు ఉన్న వీరి జీతాలను గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.8వేలకు పెంచారు. మరో రూ.2వేలు గ్రామ సంఘం లాభాల నిధుల నుంచి తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరికి వేతనాలు అందాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వీరికి జీతాలు ఆగాయి. తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని డీఆర్డీఏ పరిధిలో 1224 మంది సీఎఫ్‌లు (వీఓఏ)లు ఉన్నారు. మెప్మా పరిధిలో ఆర్పీలు 48 మంది ఉన్నారు. జీతాలు లేక వీరంతా అల్లాడిపోతున్నారు.పని భారం పెంచినా..గ్రామ సంఘాల నిర్వహణ, సమావేశాలు నిర్వహించడం, వారికి సూచనలు సలహాలు అందజేయడం, ప్రతి నెల రెండు పర్యాయాలు సంఘాల కు వివరాలతో బుక్కీపింగ్, సంఘాలకు బ్యాంకు రుణాలు(లింకేజీలు)అందజేయడం, సీ్త్రనిధి రుణా లు అందజేయడం, ఎన్ఆర్హెచ్ఎం పాలసీ లో భాగంగా లైవ్లీహుడ్ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు, నిర్వహణ, పర్యవేక్షణ వంటివెన్నో వీరు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమాలు, ఇతర కార్యక్రమాలకు జన సేకరణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి వీరు నిర్వహిస్తున్నారు. ఇంతచేస్తున్నా జీతాల బకాయిలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలకు ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని లేకుంటే పోరాటాలు చేపడతామని వీఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. వెలుగు వీఓఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలోని సీఐటీ యూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వీఓఏలకు 5 నెల ల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అనేక గ్రామాలలో వీఓఏపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీఓఏల మె డపై కత్తిలా ఉన్న మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్ మీ కోసంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు డి.జోగారావు, జి.యర్రయ్య, డి.పద్మావతి, బి.కనకలక్ష్మి, సీహెచ్ స్వాతి, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్!
సాక్షి, మహబూబాబాద్: మండలకేంద్రంలో ఐకేపీ వీఓఏగా పనిచేస్తున్న ఓ మహిళ రూ.మూడు కోట్ల మేర అప్పులు చేసి ఉడాయించినట్టు ప్రచారం జరుగుతోంది. పలువురు మహిళలతో ఏర్పడిన పరిచయం వల్ల డబ్బులను అప్పుగా ఇచ్చి, పుచ్చుకోవడాన్ని నమ్మకంగా చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పులిచ్చే వారికి నమ్మకం కలిగించిన సదరు వీఓఏ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు గ్రామసమాఖ్యల ద్వారా ఐకేపీ గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి డబ్బులను సైతం ఓ వీఓ దగ్గర నుంచి రికవరీ పేరుతో తీసుకున్నట్టు సమాచారం. నాలుగు రోజులుగా డబ్బులు తీసుకున్న వీఓఏ జాడలేకపోవడంతో అనుమానం వచ్చి మహిళలు విచారించగా ఉడాయించినట్టు గుర్తించారు. దీంతో అప్పులు ఇచ్చిన మహిళలు తమ నగదు ఎలా తిరిగి వస్తాయోననే ఆందోళనలో ఉన్నారు. ఇవి కూడా చదవండి: 'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే.. -
వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు. జీతాల పెంపు ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇది కూడా చదవండి: అంగన్వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె -
‘సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీవోఏ, సంఘమిత్ర, మెప్మా సిబ్బంది తెలిపారు. ఏపీ ప్రభుత్వం వారి జీతాలు మూడు వేల నుంచి 10 వేలకు పెంచడంతో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన వేలాది మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: ఏపీ ప్రభుత్వం వీవోఏ,ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పదివేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జంగారెడ్డి గూడెం మసీదు సెంటర్లో ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలు పెంచాలని ఆర్పీలు, వీవోఏలు ధర్నాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా: తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం పట్ల కైకలూరు నియోజకవర్గ బుక్ కీపర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు శృంగవరపుకోట వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరుకు చాలీ చాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 10 వేలు వేతనాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామన్నారు. దేవి కూడలిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వీవోఏలు పూలమాలలు వేశారు. తూర్పుగోదావరి: సీఎం వైఎస్ జగన్ పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంపై యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి మెప్మా, ఆర్పీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. -
మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యానిమేటర్లకు వైఎస్సార్సీపీ అండ
అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాలకు జీవనాడిగా ఉన్న యానిమేటర్లకు (వీఓఏ) వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. డిమాండ్ల సాధనకు వీఓఏలు చేస్తున్న పోరాటాలకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసి కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట యానిమేటర్లు చేపట్టిన ధర్నాకు వారు హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షులు ఇ.ఎస్.వెంకటేశ్ మాట్లాడుతూ, దసరా కానుకగా జీఓ 1,243ను విడుదల చేసిన ప్రభుత్వం..ఏడాది కాల పరిమితికే జీఓ ఇవ్వడం మోసం చేయడమేనన్నారు. ఇందులో పదోన్నతులు, ప్రమాదబీమా, సెర్ఫ్ నుంచి గుర్తింపుకార్డులు, యూనిఫారం ప్రస్తావన లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే యానిమేటర్లకు ఉద్యోగభద్రత కల్పించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర (రాజారాం), ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ వాసునాయక్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మాటికీ మోసం చేయడమే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్న యానిమేటర్లకు వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభించడం బాధాకరం. యానిమేటర్లకు రూ.3 వేలు ఇచ్చేలా జీఓ ఇచ్చి అమలు చేయకపోవడం మోసమే. అది కూడా ఒక ఏడాదికి మాత్రమే ఇవ్వడం దుర్మార్గం. చంద్రబాబు స్వయం సహాయక సంఘాల్లో రాజకీయం జొప్పించి కలుషితం చేశారు. మహిళ సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విశేష కృషి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహానేత అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాం. కచ్చితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం అమలు చేసి భద్రత కల్పిస్తారు.– అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య యానిమేటర్లకు తీరని అన్యాయం యానిమేటర్లకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న ప్రజాప్రతినిధులు.. యానిమేటర్లకు వేతనం ఇప్పించేందుకు మాత్రం మనసు రావడం లేదు. గౌరవవేతనం రూ.3 వేలు సర్వీసు చార్జీ ఇస్తామంటూ జీఓ ఇచ్చి దానిని అమలు చేయకపోవడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 50 వేల సంఘాలు డీఫాల్ట్ అయ్యాయి. ప్రభుత్వం యానిమేటర్లను రాజకీయంగా వాడుకుంటోంది. ప్రజాప్రతినిధులు కూడా తమకు నచ్చిని వారిని తొలగించి...అనుకూలమైన వారిని నియమించుకుంటూ అభద్రతాభావం తీసుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు తప్పక న్యాయం జరుగుతుంది. –రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి -
నెలరోజుల్లో వేతనాల విషయం తేల్చకుంటే సమ్మెలోకి..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పది వేల రూపాయల వేతనం ఇస్తామని ప్రకటిస్తే గానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే వీవోఏ (డ్వాక్రా యానిమేటర్లు), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్పీ (పట్టణ రిసోర్సు పర్సన్)లు మండిపడ్డారు. తమ వేతనాల విషయంలో నెల రోజుల్లోగా సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే సమ్మెలోకి వెళతామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వీవోఏలు, ఆర్పీలకు నెలకు రూ. 5,000 వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డ్వాక్రా యానిమేటర్లు, ఆర్పీలు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్థానిక అలంకార్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఏపీ వెలుగు వీవోఏ సంఘం, ఏపీ మెప్మా ఆర్పీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ నాయకులు మద్దిలేటి, అలివేణి నేతృత్వంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. వీవోఏలు, ఆర్పీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా మెప్మా ఎండీ చిన తాతయ్య ధర్నా చౌక్ వద్దకు వచ్చారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆందోళనకారులు మండిపడ్డారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌ను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేయతలపెడితే.. ఆదిలోనే అణిచివేయడానికి ప్రయత్నించారని, గృహ నిర్భందంలో ఉంచారని మండిపడ్డారు. ప్రకటన చేస్తే సరిపోదు.. ధర్నాలో నేతలు ప్రసంగిస్తూ.. వేతనాలు చెల్లింపుపై సీఎం కేవలం ప్రకటన చేయడమో లేదంటే సర్కులర్లు జారీ చేయడమో కాకుండా పూర్తి విధి విధానాలతో జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ. 2 వేలు వేతనం చెల్లించడానికి అప్పటి ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడయే కాకుండా, 2 నెలలు వేతనాలు కూడా ఇచ్చారని తెలిపారు. తర్వాత అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీవోఏలు, ఆర్పీలకు వేతనం చెల్లించడం నిలిపివేసిందని మండిపడ్డారు. వీవోఏలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రూ. 2 వేల వేతనాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బంది పెడుతోందని గఫూర్ దుయ్యబట్టారు. -
వీవోఏల జీతం రూ. 5 వేలు
⇒ వారి వేతనాల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ⇒ ప్రభుత్వం తరఫున రూ.3 వేలు, గ్రామైక్య సంఘాల నుంచి రూ.2 వేలు ⇒18,405 మందికి ప్రయోజనం ⇒ డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు నడపాలన్న సీఎం ⇒ అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: జనహిత వేదికగా వివిధ వర్గాలతో సమావేశమవుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో వరం ప్రకటించారు. గ్రామాల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వివో ఏల) వేతనాలను రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అందులో రూ.3 వేల ను ప్రభుత్వం తరఫున, మరో రూ.2 వేలు గ్రామైక్య సంఘాల తరఫున అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 18,405 మంది వీవోఏలు ఉన్నారు. సీఎం తాజా నిర్ణయంతో వారందరికీ లబ్ధి కలగనుంది. ఒక్కొక్కరికి కనీసం రూ.3,500 వేతనం పెరగనుంది. ఇప్పుడిస్తున్నది రూ. 1,500 లోపే! ప్రస్తుతం గ్రామంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీవోఏలకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా వీవోఏలకు నెలకు రూ.500 నుంచి రూ.1,500 వరకు మాత్రమే వేతనంగా అందుతున్నాయి. దీంతో తాము చేసే పనికి వస్తున్న జీతం సరిపోవడం లేదంటూ వారు కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామైక్య సంఘాలిచ్చే డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా కొంత వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో బుధవారం ప్రగతి భవన్లో వీవోఏలతో సీఎం కేసీఆర్ సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి నెలకు రూ.5 వేల వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. గ్రామైక్య సంఘాలు రూ.2 వేలు చెల్లించాలని, మిగతా రూ.3 వేలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తామని, గ్రామైక్య సంఘాల వాటాను చెల్లించే బాధ్యతను సూపర్ వైజర్లు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితి మెరుగు పడాలని చెప్పారు. ‘రాష్ట్రంలో మహిళా సంఘాలకు మంచి పేరు వచ్చింది. కేవలం పొదుపుతోనే సరిపెట్టుకోకుండా కుటీర పరిశ్రమలు నడ పాలి. గ్రామాల్లో దొరికే వస్తువులను మార్కెట్ అవసరాలు తీర్చేలా ప్రాసెసింగ్ చేయాలి. కారంపొడి, పసుపు పొడి, పాపడాలు, కారా, బూందీ లాంటి వస్తువులను తయారు చేయా లి. అప్పుడు మహిళలకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు కల్తీలేని సరుకులు దొరుకుతాయి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు అవసరమైన శిక్షణను అందిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాలు, బంగ్లా దేశ్ లాంటి దేశాల్లో మహిళా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేస్తామని... పూర్తిస్థాయి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సెర్ప్ సీఈవో నీతూ ప్రసాద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఐకేపీ వీఓఏలు
కలెక్టరేట్ దద్దరిల్లింది.. మూడు గంటలపాటు అట్టుడికింది.. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం వీఓఏలు కలెక్టరేట్‌ను ముట్టడించారు.. జిల్లావ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.. ధర్నాతో కలెక్టర్ కార్యాలయం ప్రధానగేటు, సుబేదారికి వచ్చే రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద రహదారిని పోలీసులు మూసివేశారు. సుబేదారి : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) వీఓఎలు మం గళవారం కదం తొక్కారు. వీఓఏల సంఘం ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మూడు గంటల వరకు ప్రధాన గేట్లను దిగ్బంధించారు. మహిళలను విస్మరిస్తే.. మహిళలు, మహిళా సంఘాలను విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని ఐకేపీ సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాకు హాజరైన వారిని ఉద్దేశించి తెలంగాణ ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షురా లు మారపల్లి మాధవి మాట్లాడుతూ 18నెలలుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లకు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఇప్పటికైనా వీఓఏల ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.5వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సహజ మరణానికి బీమా సౌకర్యం కల్పించాలని, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఎస్‌హెచ్‌జీలకు 12నెలల జీరో శాతం వడ్డీ ఇవ్వాలని, అభయ హస్తం పింఛన్లు కొనసాగించాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన అంగన్వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ మహిళా సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లేదా పీడీ రావాలి కలెక్టర్ లేదా ఐకేపీ పీడీ ఎవరో ఒకరు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వీఓఏల సంఘం బాధ్యులు స్పష్టం చేశారు. ఈ విషయమై సుబేదారి పోలీసులు ప లుమార్లు చెప్పినా వారు వినిపించుకోలేదు. అయితే, సమస్య తమ పరిధిలో లేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని జిల్లా అధికారులతో మాట్లాడిన పోలీసులు చెప్పడంతో చివరకు వీఓఏలు ధర్నా విరమించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, ఉపాధ్యక్షుడు రొయ్యల రాజు, నాయకులు టి.పులా, విద్యాసాగర్, డి.తిరుమల్‌రెడ్డి, ఎం.సాంబయ్య, పి.శంకర్, రమేష్, యాదానాయక్, శ్రీనివాస్, కుమార్, కె.మాధవి, రవీందర్, యువరాజు, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాతో దారుల మూసివేత ఐకేపీ వీఓఏల ధర్నాలో కలెక్టరేట్ ప్రధాన గేట్లతో పాటు సుబేదారికి వచ్చి రోడ్డు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గరి రోడ్లను పోలీసులు మూసివేయించారు. బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలను నియంత్రించారు. ఎక్సైజ్ కా లనీ రోడ్డు నుంచి కాజీపేటకు వెళ్లే వాహనాలు, ఫాతి మానగర్ క్రాస్ రోడ్డు నుంచి హన్మకొండకు వెళ్లే వాహనాలను మళ్లించారు. సుబేదారి ఎస్సైలు రాంప్రసాద్, సుబ్బారెడ్డి బందోబస్తు పర్యవేక్షంచారు. -
వీవోఏలపై వికృత చర్యలు
విధుల్లో చేరకపోతే తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపు అధికారులకు అనధికారికంగా హుకుం జారీ జిల్లాలో 52రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కార్ వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం వికృత చర్యలకు పాల్పడుతోంది. వారి నోరు నొక్కేసేందుకు దిగజారి వ్యవహరిస్తోంది. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. 15 నెలల వేతన బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 2,125 మంది వీవోఏలు కుటుంబాలు గడవక అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుడ్లవల్లేరు : ఐకేపీలో డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చే విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్ల(వీవోఏ)ల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. 15 నెలల వేతనాలు ఎగవేయడంతో కుటుంబాలు పస్తులుంటున్నాయి. వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లాలో 2,125మంది వీవోఏలు సెప్టెంబరు 15 నుంచి సమ్మెబాట పట్టారు. వీరి ఉద్యమాన్ని పట్టించుకున్న పాలకులే కరువయ్యారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయకపోగా ఉద్యమబాట పట్టిన వారిని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకూ వీవోఏలతో వెట్టిచాకిరి చేయించుకుని వేతనాలు కూడా ఇవ్వకుండా తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇవ్వవలసిన 15నెలల వేతనాల్ని పక్కన పెట్టి... సమ్మె నుంచి తప్పుకుని తాము చెప్పినట్లుగా విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అధికారులకు అనధికార హుకుం జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలగించే హక్కే లేదు వీవోఏలను బలవంతంగా తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. సమ్మె విరమించి విధులకు రావాలంటూ బెదిరింపులకు దిగితే ఆందోళనలు తప్పవు. వారి వేతన బకాయిలు చెల్లిస్తే విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బెదిరింపులు తగవు. కె.సుబ్బారావు, గుడివాడ డివిజన్ సీఐటీయూ కార్యదర్శి వేతనాలు ఎవరు ఇస్తారు జిల్లాలో 2,125మంది వీవోలకు 15నెలల వేతనాల్ని ప్రభుత్వం బకాయి పడింది. సర్కార్ మారిందని ఆ వేతనాలు మరచిపోవాలంటే ఎలా? వీవోఏలకు ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన సెల్ఫోన్లు కూడా లాక్కోవటమే కాకుండా కేసులు పెట్టే ప్రయత్నాలు చేసిన అధికారులు చేయించుకున్న పనికి వేతనాలు కూడా చెల్లిస్తే బాగుంటుంది. అప్పుడే విధుల్లో చేరతారు. ఎ.కమల, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు