AP: జీతాలు ఇవ్వండి మహాప్రభో | - | Sakshi
Sakshi News home page

AP: జీతాలు ఇవ్వండి మహాప్రభో

Published Tue, Aug 13 2024 12:52 AM | Last Updated on Tue, Aug 13 2024 9:32 AM

-

ఐదు నెలలుగా వేతనాలు లేక అల్లాడిపోతున్న వీఓఏలు

పనిభారం పెంచి జీతం మరిచిన వైనం

బకాయిలపై పెదవి విప్పని అధికారులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మహిళా సాధికారిత, స్వావలంబన కోసం నిరంతరం పనిచేసే క్షేత్ర స్థాయి సిబ్బందిపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గత ఐదు నెలలుగా జీతాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్కీమ్‌ వర్కర్లు, చిరుద్యోగులకు రాజకీయ వేధింపులకు గురిచేస్తు న్న కూటమి పాలకులు వీఓఏలు, ఆర్పీలను కూడా వేధిస్తున్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ–వెలుగు సంస్థలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను ఆర్థికంగా తీర్చిదిద్దే గ్రామ స్థాయి ఉద్యోగులు సీఎఫ్‌ (వీఓఏ), పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) పరిధిలో వార్డుల్లో పనిచేస్తున్న ఆర్పీలకు ఐదు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలలు దాటినా క్షేత్రస్థాయి ఉద్యోగులు జీతాలు విడుదల చేయలే దు. దీంతో వీరికి అవస్థలు తప్పడం లేదు. రూ.3వేలు ఉన్న వీరి జీతాలను గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ రూ.8వేలకు పెంచారు. మరో రూ.2వేలు గ్రామ సంఘం లాభాల నిధుల నుంచి తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరికి వేతనాలు అందాయి. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో వీరికి జీతాలు ఆగాయి. తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని డీఆర్‌డీఏ పరిధిలో 1224 మంది సీఎఫ్‌లు (వీఓఏ)లు ఉన్నారు. మెప్మా పరిధిలో ఆర్పీలు 48 మంది ఉన్నారు. జీతాలు లేక వీరంతా అల్లాడిపోతున్నారు.

పని భారం పెంచినా..
గ్రామ సంఘాల నిర్వహణ, సమావేశాలు నిర్వహించడం, వారికి సూచనలు సలహాలు అందజేయడం, ప్రతి నెల రెండు పర్యాయాలు సంఘాల కు వివరాలతో బుక్‌కీపింగ్‌, సంఘాలకు బ్యాంకు రుణాలు(లింకేజీలు)అందజేయడం, సీ్త్రనిధి రుణా లు అందజేయడం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పాలసీ లో భాగంగా లైవ్‌లీహుడ్‌ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు, నిర్వహణ, పర్యవేక్షణ వంటివెన్నో వీరు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమాలు, ఇతర కార్యక్రమాలకు జన సేకరణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి వీరు నిర్వహిస్తున్నారు. ఇంతచేస్తున్నా జీతాల బకాయిలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వెలుగు వీఓఏలకు ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని లేకుంటే పోరాటాలు చేపడతామని వీఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. వెలుగు వీఓఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలోని సీఐటీ యూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వీఓఏలకు 5 నెల ల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అనేక గ్రామాలలో వీఓఏపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీఓఏల మె డపై కత్తిలా ఉన్న మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్‌ మీ కోసంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు డి.జోగారావు, జి.యర్రయ్య, డి.పద్మావతి, బి.కనకలక్ష్మి, సీహెచ్‌ స్వాతి, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement