Srikakulam District News
-
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వినాయకం బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కుడిమి వినాయకం గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో పల్నా డు జిల్లాలో రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ అందజేసేలా కృషి చేస్తానన్నారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జగన్నాయకులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అదనపు జడ్జి కోర్టు, జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సోంపేట కోర్టు పీపీ దువ్వు జగన్నాయకులు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టుకు వచ్చిన ఈయన న్యాయమూర్తులను, బార్ సభ్యుల ను, ఇప్పటి వరకు పీపీ బాధ్యతలు నిర్వర్తించి న వాన కృష్ణచంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యారావు, జిల్లా బార్ ప్రతినిధులు మరిసర్ల అన్నంనాయుడు, బీసీ న్యాయ వాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, ఎస్.వెంకటరావు, కొమ్ము రమణమూర్తి, టి.ఖగేంద్రనాథ్, ఎన్.శ్రీరామమూర్తి, బొత్స సుదర్శన్, టి.రామారావు, ఎన్.దుర్గా శ్రీనివాసరావు, జి.వెంకటేష్ పాల్గొన్నారు. చోరీ కేసులో నగలు రికవరీ ఎల్.ఎన్.పేట: మండలంలోని చిట్టిమండలం కాలనీలో నివాసముంటున్న ఎ.లక్ష్మీ ఇంట్లో చోరీ ఘటనకు సంబంధించి నాలుగు తులాల బంగారు నగలు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించామని సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి గురువారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళ దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నగలు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించామని తెలిపారు. -
రిమ్స్ సమస్యలపై కలెక్టర్ ఆరా
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల సమస్యలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ‘రిమ్స్ విద్యార్థుల ఆకలి కేకలు, రిమ్స్ హాస్టల్లో కాలకృత్యాలుకూ కష్టమే’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. తొలుత విద్యార్థి నాయకులను పిలిపించి మాట్లాడారు. హాస్టల్లో మెస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తోందని, వారు సరైన ఆహారం సరఫరా చేయని పక్షంలో వారిని మార్చే వెసులుబాటు ఉందన్నారు. విద్యార్థులంతా సమావేశమై ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్లతో మాట్లాడి సరైన ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఏపీఎంహెచ్‌ఐడీసీ అధికారులను పిలిపించి మరుగుదొడ్ల సమస్య లేకుండా చూడాలన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, తాగునీరు సమస్య పరిష్కరించాలని సూచించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి టెక్కలి: కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిలో పెద్దబమ్మిడి సమీపంలో ఈ నెల 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావుపేట గ్రామానికి చెందిన బాన్న ప్రత్యుష(29) గురువారం మృతి చెందింది. తన భర్త నడుపుతున్న ఆటోలో ప్రయాణిస్తూ కారును ఢీకొనడంతో ప్రత్యుష తీవ్రంగా గాయపడింది. భార్యభర్తలు ఇరువురు డాన్సు మాస్టర్లుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎస్ఐ వి.సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మృతదేహం నగర వాసిదే శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని హయాతినగరం సమీప నాగావ ళి నదీ తీరంలో బుధవారం కలకలం రేపిన మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించారు. మీడియాలో కథనాలు చూసి కుటుంబ సభ్యులే గుర్తుపట్టి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తోటపాలెం జంక్షన్ సమీప నీలమ్మకాలనీకి చెందిన దండు త్రినాథరావు (45) మద్యానికి బానిసయ్యాడు. ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకెళ్లి కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదని భార్య వెంకటలక్ష్మి వాపోయారు. త్రినాథరా వు పీఎస్ఎన్ఎం స్కూల్ సమీప దుకాణంలో కమ్మరి పనిచేస్తుండేవాడు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం
శ్రీకాకుళం న్యూకాలనీ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేకుంటే ఉద్యమాలు తప్పవని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి అన్నారు. శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్లో అత్యవసర కార్యవర్గ సమావే శం నిర్వహించారు. అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ ఉద్యోగవర్గాల కు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి ఎస్టీయూ సంఘం తరఫున పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే పీఆర్సీని అమలుపర్చేలా చర్యలు చేపట్టాలని, ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు, పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ, శ్రీనివాసరావు, రామారావు, శ్రీధర్, తేజ, లక్ష్మణరావు, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. గోవుల వాహనాలు సీజ్ సరుబుజ్జిలి: కబేళాకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 28 గోవులను పట్టుకున్న ట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. హిరమండ లం నుంచి వాహనాల్లో పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో గురువా రం సరుబుజ్జిలి జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు వాహనాల్లో ఉన్న 8 మందిని విచారణ చేయగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గోవుల ను కొనుగోలుకు చేసి కబేళాకు తరలించినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. వీరిపై కేసు లు నమోదు చేసి వామనాలను సీజ్ చేసి ఆమ దాలవలస జూనియిర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. గోవులను విజయనగరం జిల్లా గుర్జంగివలస గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన వాహనం -
ఆదివాసీలకు న్యాయం చేయాలి
ఆమదాలవలస : సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో వేల ఎకరాల్లో చేపట్టనున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో ఆదివాసీలు, గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, కూటమి ప్రభుత్వ చర్యను అడ్డుకుని స్థానికులకు న్యాయం చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. గురువారం పాలకొండ విచ్చేసిన జగన్మోహన్రెడ్డిని సరుబుజ్జిలి, బూర్జ థర్మల్ పవర్‌ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి అత్తులూరి రవికాంత్, ఆయా మండలాల నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.పరిశీలించిన జగన్ తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు రవికుమార్ తెలిపారు. పేదలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పోరాట కమిటీ నాయకులు సురేష్‌దొర, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
అర్ధశతాబ్దపు అద్భుతం
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. కాలేజీ గోల్డెన్ జూబ్లీని శుక్రవారం నిర్వహించేందుకు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. 1974లో కాలేజీ ఏర్పాటైంది. కాలేజి మొదటి ప్రిన్సిపాల్ ఎద్దు గోపాలదాసు నాయుడు. ప్రస్తుతం కాలేజీలో 300 మంది వరకు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఘనతను ఈ కాలేజీ సొంతం చేసుకుంది. ఇక్కడ చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొత్తూరులో కాలేజీ ఏర్పాటు కోసం స్థానిక నాయకుడు లోతుగెడ్డ చంద్రయ్య నాయుడు, మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు కృషి చేశారు. 1972 ఏడాది నుంచి కాలేజీ కోసం ప్రయత్నాలు చేయగా 1974లో ఏర్పాటైంది. మొదట ఉన్నత పాఠశాల గదుల్లో తరగతులు ప్రారంభించారు. కొత్తూరు, భామిని, హిరమండలం, సీతంపేట, ముమ్మలక్ష్మిపురంతో పాటు పలు ప్రాంతాలకు ఈ కాలేజీ ఎంతో కీలకంగా నిలిచింది. -
ఒకటే గమనం.. గమ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: నేషనల్ మీట్‌కు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్స్ పురుషులు, మహిళల జట్లకు శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి.జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా సాగిన ఈ శిబిరాల్లో రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులు పాల్గొని నాలుగు రోజులుగా కఠోర సాధన చేశారు. గేమ్‌లో మెలకువలతోపాటు ఫిట్‌నెస్‌పై తర్ఫీదు పొందారు. జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ ట్లు పతకమే లక్ష్యంగా ఇక్కడ సాధన కొనసాగింది. ఏపీ సాఫ్ట్‌బాల్ పురుషుల జట్టుకు ఎంపికై న ఆరుగు రు అంతర్జాతీయ క్రీడాకారులు ఈ శిబిరాల్లో పాల్గొ నడం విశేషం. ఆతిథ్య శ్రీకాకుళం జిల్లా నుంచి మొ త్తం ముగ్గురు(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) క్రీ డాకారులు ఏపీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.50 మందితో రెసిడెన్షియల్ క్యాంప్..ఏపీ రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులు, కోచ్‌లతో కలిపి మొత్తం 50 మందితో ఇక్కడ సాఫ్ట్‌బాల్ సంఘం తరఫున రెసిడెన్షియల్ కోచింగ్ పొందారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలిదిండి నరసింహరాజు, కన్వీనర్ వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి సిగిలిపల్లి లక్ష్మిదేవి, కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమన పర్యవేక్షించారు. క్రీడాకారులకు సీనియర్ ఏపీ సాఫ్ట్‌బాల్ కోచ్ ఎం.బద్రీనారాయణ(గుంటూరు), కోచ్ కమ్ నేషనల్ రిఫరీ జి.మహేష్ (నెల్లూరు), సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్ ఇ.ఉమామహేశ్వరి (కర్నూలు), జిల్లాకు చెందిన పలువురు పీడీలు శిక్షణ అందించారు. మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న 46వ ఆలిండియా సీనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు గురువారం క్రీడాకారులు పయనమయ్యారు.సిక్కోలు క్రీడాకారులు..శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ సీనియర్స్ జట్టకు ముగ్గురు ఎంపికయ్యారు. పురుషుల జట్టుకు సిద్దార్ధ మహరాణ (మందస), బుడు మూరు రామ్మోహన్ (కేశవరావుపేట గ్రామం– ఎచ్చెర్ల మండలం), మహిళల జట్టుకు గురుగుబెల్లి దు ర్గాప్రశాంతి (కేశవరావుపేట) ఎంపికయ్యారు. వీరు ముగ్గురు పలు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు.ఈ ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులే..కోచ్ బద్రీనారాయణతో కలిసి కనిపిస్తున్న వీరంతా అంతర్జాతీయ క్రీడాకారులే. పి.జయవర్ధన్ (అనంతపురం), బి.ఫృథ్వీరాజ్ (అనంతపురం) , ఆర్.లోకేష్ (చిత్తూరు), ఎం.బద్రీనారాయణ (కోచ్–గుంటూరు), బి.మహేష్ (అనంతపురం), బి.రాంబాబు (గుంటూరు), పి.గౌతమ్‌రాజ్ (కర్నూలు)జపాన్, నేపాల్, హాంకాంగ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్లలో భారత జట్లకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్‌ఎస్‌ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు. -
ఆస్పత్రి వైద్య వర్గాల్లో కలకలం
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేసిన చల్లా రవికుమార్ జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. అప్పట్లో ఈయన ఇచ్చిన సదరం సర్టిఫికెట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పరిశీలన చేసిన దర్యాప్తు అధికారు లు తప్పుడు సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. తా జాగా ఈ సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన రవికుమార్‌తో పాటు వాటిపై సంతకాలు చేసిన అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.జయశ్రీ తో పాటు మరో ఇద్దరు వైద్యులు నవీన్, నామగల్లేశ్వరిలకు ప్రభుత్వ కార్యదర్శి మంజుల హో స్మాని బుధవారం రాత్రి నోటీసులు జారీ చేశా రు. దీంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. సద రం సర్టిఫికెట్లు జారీ చేసిన రవికిరణ్ శ్రీకాకుళం రిమ్స్‌లో పనిచేస్తుండగా మరో వైద్యురాలు నాగమల్లేశ్వరి అనధికార గైర్హాజరులో ఉన్నారు. నవీన్ టెక్కలిలో పనిచేస్తున్నారు. అప్పట్లో ఆ స్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న జయశ్రీ ప్రస్తుతం నరసన్నపేటలోనే వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరందరికీ నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. వైకల్యశాతం ఆర్థో సర్జన్ నిర్ధారిస్తారని, నిబంధనల మేరకు తాము కౌంటర్ సంతకాలు చేశామని, తమకు నోటీసులు ఇవ్వడం అభ్యంతకరమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరం లేక సమావేశాలు వాయిదా అరసవల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు కోరం లేకపోవడంతో వాయిదా ప డ్డాయి. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన మొత్తం ఏడు స్థాయీ సంఘ సమావేశాలకు కూడా జెడ్పీటీసీ సభ్యులెవ్వరూ హాజరుకాకపోవడంతో అన్ని సమావేశాలూ వాయిదా పడ్డాయి. దీంతో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ సూచనల మేరకు జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలను శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీ సీఈ ఓ శ్రీధర్‌రాజా ప్రకటించారు. దీంతో అధికారులంతా ఎవరి విధుల్లోకి వారు చేరుకున్నారు. కార్పొరేట్ సంస్థల చొరవ అభినందనీయం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ముఖ్య ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పరిశ్రమలు, పలు కార్పొరేట్ యాజమాన్య ప్రతినిధులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచినీటి వసతి, సోలార్ లైట్ల ఏర్పాటు, పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు తోడ్పాటు, పలాసలో డయాలసిస్ యూనిట్ల నిర్వహణ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. పనుల అంచనాలను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. -
ఏపీ గురుకులం భూముల కబ్జా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల స్థలా లను తెలుగు తమ్ముళ్లు దర్జాగా కబ్జా చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాలో.. వీరి బారి నుంచి బడిని కాపాడుకోవాలో తెలీక అక్కడి టీచర్లు సతమతమవుతున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి టీడీ పీ నాయకులు బరి తెగించారు. ఇప్పటికే అధికారు లకు పలు పర్యాయాలు పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యా దు చేశారు. అయినా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. అదే పనిగా పాఠశాల భూముల్లో పాగా వేస్తున్నారు. తాజాగా పాఠశాల ప్రహరీ హద్దులను దాటి కబ్జాకు పాల్పడ్డారు. దీనిపై అటు ఎస్ఐకు, ఇటు వీఆర్ఓకు గురువారం ఫిర్యాదు చేశారు.గురుకుల భూములపై కన్నుఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో 1984లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రెసిడెన్సియల్ స్కూల్ సొసైటీ పేరుతో స్థానికుల నుంచి భూములను కొనుగోలు చేశారు. సంపతిరా వు, వావిలపల్లి, గురుగుబిల్లి కుటుంబీకుల నుంచి 13.7ఎకరాలను సొసైటీ కొనుగోలు చేసింది. ఇది కా కుండా ప్రభుత్వం మరో 40ఎకరాల ప్రభుత్వ భూ మిని కూడా గురుకుల పాఠశాలకు కేటాయించింది. మొత్తంగా సుమారు 54ఎకరాలు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ పేరు మీదే ఉంది. ఇవన్నీ సర్వే నంబర్ 112 సబ్ డివిజన్ 635/2లో ఉన్నాయి. ఈ భూముల్లో కొంతమేర భవనాలు నిర్మించారు. మిగ తా భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఉంచారు. ఖాళీగా ఉన్న భూములపై అక్కడి కీలక నేతల కన్ను పడింది. తమ బినామీలను రంగంలోకి దించి దశల వారీగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తొలుత 2014–19లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకరిద్దరు గురుకుల పాఠశాల భూములను ఆక్రమించి, చదును చేసి నీలగిరి మొక్కలు వేసేశారు.మళ్లీ అధికారంలోకి వచ్చాకమళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆక్రమణదారులు చొరబడ్డారు. తమ కుటుంబీకులే అప్పట్లో రెసిడెన్షియల్ సొసైటీకి భూములు విక్రయించారని, ఆ భూములను 20ఏళ్ల లోపు వినియోగించకపోతే తిరి గి అసలు యజమానుల కుటుంబీకులు స్వాధీనం చేసుకుని, చదును చేసుకుని, తమ అవసరాలకు వినియోగించుకోవచ్చన్న కారణాలు చూపించి గురుకుల పాఠశాల భూములను ముగ్గురు దర్జాగా చదు ను చేసి ఆక్రమించారు. వాస్తవంగా రెసిడెన్షియల్ సొసైటీ కొనుగోలు చేసిన భూములకు ఆక్రమణదారులు చెప్పిన నిబంధన వర్తించదు. సొసైటీ పేరుతో రిజిస్ట్రైన భూములను భవిష్యత్‌లో అవసరాల దృష్ట్యా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. కోర్టు కూ డా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఖాళీగా ఉందని కొందరు, డీ పట్టా భూమి ఉందని మరొకరు అక్రమంగా చదును చేసేశారు. దీనిపై ఈ ఏడాది జూలై లో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపారు. వివాదాస్పద భూముల తో పాటు భూములకు హద్దులు నిర్ణయించారు.తాజాగా సరిహద్దులు దాటి కబ్జాఐదు నెలల కింద అంతా విచారణ జరిపి, హద్దులు ఫిక్స్ చేయగా, ఇప్పుడా హద్దులు దాటి అధికార పార్టీకి చెందిన వ్యక్తి గురుకుల పాఠశాల భూమిని కబ్జా చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ తదితర సిబ్బంది అభ్యంతరం తెలిపినా వెనక్కి తగ్గలేదు. తన కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత చెప్పినా బరితెగించి, భూములకు ఆక్రమిస్తుండటంతో గురువారం ఎస్ఎంపురం వీఆర్ఓకు, ఎచ్చెర్ల స్టేషన్ ఎస్ఐకు ఫిర్యాదు చేశారు.ఆక్రమణపై ఫిర్యాదుఐదు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సరిహద్దులు నిర్ణయించారు. ఆ సరిహద్దులు దాటి కబ్జా చేస్తున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, పాఠశాల భూములను కాపాడాలని అటు వీఆర్ఓ, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశాం. – ఎం.గుణస్వామి, ఏపీ గురుకుల పాఠశాల ఎస్ఎంపురం, ఇన్చార్జి ప్రిన్సిపాల్ -
ఫొటోలు తీసి.. మార్ఫింగ్ చేసి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఒళ్లు గగుర్పాటు కలిగించే విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థినితో చనువు పెంచుకున్న ఓ యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఏకంగా పోర్న్ వెబ్సైట్లో పెట్టిన అకృత్యాన్ని పోలీసులు పసిగట్టారు. మరొక యువకుడు ఇలాగే మార్ఫింగ్ వీడియోలను టెలిగ్రామ్‌లో షేర్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థినికి తెలియకుండానే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్కు జిల్లాలో చదువుతున్న విద్యార్థినితో పరిచయం ఉంది. ఆ విద్యార్థినితో చనువుగా ఉంటూ ఆమెకు తెలియకుండానే ఆమె చిత్రాలను, వీడియోలను తీసేవాడు. కొన్నాళ్లకు ఆమె వీడి యోలను, ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేశా డు. తెలియని నంబర్ నుంచి ఆమె వాట్సాప్‌కు ఫొటోలను, వీడియోలను పంపుతూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ధైర్యంగా ఫిర్యాదు చేసి.. ఇలా ఎవరు చేస్తున్నారో తెలియని విద్యార్థిని మొ దట్లో తీవ్ర వేదన అనుభవించింది. తల్లిదండ్రులకు, పోలీసులకు చెబితే పరువు పోతుందని మొ దట్లో భావించింది. కానీ ధైర్యం చేసి ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఈశ్వరరావు విచారణ ఆరంభించి పరిచయస్తుల పనే అని భావించి తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్ అని తెలుసుకుని నాలుగు రోజుల కిందట తిరుపతిలో ఉంటున్న అతనికి నోటీసులు పంపారు. మరో దొంగ.. సోయల్‌ను విచారించడం, ఆయన ఫోన్‌ను క్షు ణ్ణంగా పరిశీలించడంతో విద్యార్థిని ఫొటోలు, వీ డియోలు వెబ్పోర్న్ సైట్లో అప్లోడ్ చేయడం చూశారు. అవే చిత్రాలు, వీడియోలు ఇన్‌స్టాగ్రా మ్, టెలిగ్రామ్‌ల్లో సైతం ఎలా అప్లోడ్ అయ్యా యన్నది అర్థం కాక జిల్లా సైబర్ సెల్ బృందాన్ని రంగంలోకి దింపారు. వారు ఇన్‌స్టా, టెలిగ్రామ్ యాజమాన్యాలకు మెయిల్లో ఫిర్యాదు పంపగా అటునుంచి వారు ఐడీలు, ఫోన్ నంబర్ పంపించారు. అవి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఉప్పుగళ్ల రఘువిగా గుర్తించి అతనికి నో టీసులు పంపారు. గురువారం రఘు స్టేషన్‌కు రాగా విచారించారు. ఒప్పుకున్నాడు.. పోర్న్సైట్లో వచ్చిన వీడియోలను అప్లోడ్ చేసు కుని ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లలో పెట్టింది తానేనని, ఒకసారి లింక్ చేసే ముందు తనకు రూ. 200లు పంపించాలని చెప్పడంతో చాలామంది తనకు డబ్బు పంపారని రఘు చెప్పారు. విస్తుపోయే నిజాలు తెలియడంతో సీఐ ఈశ్వరరావు గురువారం రాత్రి ఇరువురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మార్ఫింగ్ వీడియోలను పోర్న్ సైట్లో పెట్టిన యువకుడు టెలిగ్రామ్‌లో వీడియోలు పెట్టి డబ్బులు చేసుకున్న మరో యువకుడు వివరాలు వెల్లడించిన సీఐ పి.ఈశ్వరరావు వీడియోలు మార్ఫింగ్ చేస్తే సహించేది లేదు సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టినా, వీడియోలు మార్ఫింగ్ చేసినా సహించేది లేదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గు రువారం హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
లక్ష్యం పేరిట నిర్లక్ష్యం
ఉన్నతాధికారులకు నివేదించాం.. మండలంలో మరో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ధాన్యం కొనుగోలు జరుగుతుంది. – ఎం. శ్రీకాంత్, తహసీల్దార్, జి.సిగడాం ●సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు భారీ తేడా కనిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం భారీగా కొనుగోలు చేశా మని లెక్కలు చూపిస్తే.. మరోవైపు కళ్లాల్లోనే ధాన్యం బస్తాలు కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేసింది. మరో వైపు రబీ క్రాప్ సాగు అ వుతోంది. మరో మూడు నెలలు ఆగితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. అయినప్పటికీ గత ఖరీఫ్‌లో పండిన పంట నేటికీ కొనుగోలుకు నోచుకోలేదు. మరోవైపు 4లక్షల 67వేల 272 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వ లెక్కలు చె బుతున్నాయి. అంత కొనుగోలు చేస్తే రైతుల వద్ద ఇంకా ధాన్యం భారీగా ఉండటమేంటి? ఇందులో ఉన్న మతలబు ఏంటి? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండటంతో కొనుగోల్‌మాల్ జరిగినట్టుగా స్పష్టమవుతోంది. కాగితాల్లో కొనుగోలు తప్ప క్షేత్రస్థాయిలో అనుకు న్న విధంగా జరగడం లేదన్నది అర్థమవుతోంది. జిల్లాలో పండిన పంటలో రైతుల అవసరాలు పోను విక్రయాలకు సిద్ధం చేసిన దాంట్లో నాలుగో వంతు ధాన్యం రైతుల పొలాల్లోనూ, కళ్లాల్లోనే ఉన్నాయి. గత నెలన్నర రోజులుగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను, నాయకులను రైతులు ప్రాధేయపడుతున్నారు. కానీ ఎవరూ కనికరించడం లేదు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో పండిన పంటను కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో యంత్రాంగం ఉంది. అదిగో ఇదిగో అని చెప్పడం తప్ప కొనుగోలు చేసిన దాఖలాలు కనబడటం లే దు. లక్ష్యాల మేరకు కొనుగోలు చేసేశామని, మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాలు పూర్తి అయిపోయాయని అధికారులు చేతులేత్తేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో, పండిన పంటను ఏం చేసుకోవాలో తెలియ ని దుస్థితిలో అన్నదాతలు ఉన్నారు. గతంలో ఎన్న డూ లేని పరిస్థితిని జిల్లా రైతులు తొలిసారిగా చూ స్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతుల నుంచి 4లక్షల 90వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చే యాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. 4లక్షల 67వేల 272మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేసినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. 99,337 మంది రైతులకు రూ. 1070కోట్లు చెల్లింపులు చేసినట్టుగా చూపిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని 266 మి ల్లులకు కేటాయింపులు చేయడమే కాకుండా వాటిని నుంచి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)కూడా తీసుకుంటున్నారు. అధికారుల లెక్కలు సరే, క్షేత్రస్థాయిలో ఆ స్థాయిలో కొనుగోలు చేసినట్టుగా కనబడడం లేదు. దీంతో దాదాపు ప్రతి మండలంలోనూ ఎంతో కొంత ధాన్యం కొనుగోలుకు నోచుకోకుండా కళ్లాల్లోనే ఉండిపోయింది. అనేక అనుమానాలు ఈ సారి ధాన్యం కొనుగోలులో గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కీలక నేత సోదరుడు కీలకంగా వ్యవహరించి, వారి అనుయాయులను మిల్లర్ల పెద్దలుగా పెట్టి, గూడు పుఠాణీ నడిపి, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలు వస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే, కొనుగోలు చేసినట్టు చూపించి, ఆ ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించినట్టుగా పొందుపరిచి, వాటి నుంచి పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్‌గా తీసుకున్నట్టుగా మిస్టరీ నడిపి, ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నా యి. కొనుగోలు జరిగినట్టు, రైతులకు చెల్లింపులు చేసినట్టుగా మాయాజాలం చేసి అక్రమాలకు పాల్ప డినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలు, విమర్శలు, వాదనలు వాస్తవమా? కాదా? అన్నది తేలాలంటే మిల్లర్ల వారీగా కేటాయించిన ధాన్యం, వాటి నుంచి వచ్చిన సీఎంఆర్‌ను సమగ్రంగా పరిశీలించి, విచారణ జరపాల్సిందేనని రైతులు కోరుతున్నారు. భారీగా ధాన్యం కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపిస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు పండిన పంటను కొనుగోలు చేయడం లేదని రైతుల గగ్గోలు కొనుగోళ్లకు, క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యానికి కుదరని పొంతన కీలక నేత సోదరుడి కనుసన్నల్లో గూడుపుఠాణి అంకెల గారడీతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు గత నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో మందగించాయి. తమకు కేటాయించిన లక్ష్యం పూర్తయిపోయిందని మిల్లర్లు చెబుతుండగా, అవునని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఫలితంగా పండిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. ఎప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలో ఇప్పటికే 20వేల నుంచి 30వేల టన్నుల ధాన్యాన్ని దళారులకు విక్రయించినట్టు తెలుస్తోంది. దీనివల్ల సంబంధిత రైతులు మద్దతు ధరను కోల్పోయారు. దళారులు ఎంత చెబితే అంతకు ఇచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా ఏ గ్రేడ్ రకమైతే 100కిలోలు రూ.2320, 80కిలోలు రూ.1856, 40కిలోలు రూ.928 మేర మద్దతు ధర ఉండగా, కామన్ రకమైతే 100కిలోలు రూ.2300, 80కిలోలు రూ.1840, 40కిలోలు రూ.920 మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం అనుకున్న మేర కొనుగోళ్లు చేయకపోవడంతో దళారులకు మద్దతు ధరకు నాలుగైదు వందలు తక్కువ చేసి విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్దాంలో ప్రభుత్వం ధాన్యంను కొనుగోలు చేయకపోవడంతో పొలంలోనే ఉన్న ధాన్యం బస్తాలివి. గత నెల 23 నుంచి ధాన్యం కొనుగోళ్లు ఆగిపోవడంతో.. దాదాపు 9వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉన్నట్లు సమాచారం. – జి.సిగడాం -
● వైఎస్ జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్య తలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో ని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి లో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూ చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు. -
రూ.10 వేలు ఇవ్వాల్సిందే..
ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యా దు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజారోగ్యం కోసం పాటు పడాలే తప్ప వసూళ్లకు పాల్పడకూడదు. సాధ్యమైనంత వరకు సక్రమంగా ఉండేలా హోటల్స్, స్వీట్స్టాల్స్ తదితర యజమానులకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ప్రమాదకరంగా ఉంటే శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. – కె.వెంకటరత్న, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆ అధికారి వస్తే చాలు హోటల్స్, స్వీట్ స్టాల్స్ యజమానులు హడలెత్తిపోతున్నారు. ఆహార తనిఖీల పేరుతో హడావుడి చేసి సొమ్ము గుంజుకుంటున్నారు. హోటల్‌కు వచ్చి దర్జాగా తిని, ఇంటికి పార్సిల్ కూడా కట్టించుకుని, ఆపై హోటల్‌కు ఇంత చొప్పున రేటు ఫిక్స్ చేసి దండుకుంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకై తే ఏకంగా రూ.10 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పలాసలో పలు హోటల్స్ యజమానులను ఇలాగే డిమాండ్ చేస్తే వారంతా గగ్గోలు పెట్టడంతో పాటు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. జిల్లాలో దాదాపు 3వేలకు పైగా పెద్ద, చిన్నహోటల్స్ ఉన్నాయి. స్వీట్ స్టాల్స్ 200 వరకు ఉన్నాయి. లైసెన్స్డ్ కిరాణా షాపులు 1500 వరకు ఉన్నాయి. వీటితో పాటు ప్యాకింగ్ వాటర్ యూనిట్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటిన్నింటినీ విధిగా తనిఖీ చేయాలి. నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నారో లేదో చూసుకోవాలి. ప్రజారోగ్యానికి హాని జరగకుండా పర్యవేక్షించాలి. అంతవరకు ఫర్వాలేదు గానీ తనిఖీల ముసుగులో చేతివాటం ప్రదర్శించడంతో విమర్శలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఓ అధికారి వసూళ్లే లక్ష్యంగా చేసుకుని హోటల్స్, స్వీట్ స్టాల్స్ తదితర షాపులపై ‘దృషి’్ట పెడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలోకి ఎప్పటికప్పుడు వెళ్లడమే కాకుండా తనకు కావాల్సిన వారిని తీసుకెళ్లి కడుపు నిండినంత తింటున్నారు. అంతటితో ఆగకుండా పార్శిల్స్ కట్టించి తీసుకుని వెళ్తున్నారు. అక్కడితో వదిలేయకుండా ఎప్పటికప్పుడు మామూళ్లకు తెగబడుతున్నారు. ఈ ప్రభావం మిగతా ప్రాంతాల్లో కంటే శ్రీకాకుళం నగరంలోని హోటల్స్‌పై ఎక్కువగా పడుతోంది. ఈయన బాగోతాలు ఆ హోటల్స్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. చెప్పినట్టుగా ఆ హోటల్స్ యజమానులు చేయకపోతే నానా హడావుడి చేస్తుంటారు. ఈయనతో ఎందుకని చాలా మంది సర్దుకుపోవాల్సి వస్తోంది. ప్రజారోగ్యం కోసం తనిఖీలు చేయడంలో తప్పేమీ లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని వసూళ్లకు తెగబడటమే కాకుండా ఫుడ్ కోసం కక్కుర్తి పడటం ముమ్మాటికీ తప్పే. ముఖ్యంగా హోటల్స్, స్వీట్ స్టాల్స్‌లో టేస్టింగ్ సాల్ట్, రకరకాల రంగులు వాడుతున్నారా? ప్లేట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? తయారీకి వాడే వస్తువులు శుభ్రంగా ఉన్నాయా? లేదా? కిచెన్ నీటుగా ఉందా? ఏ రోజు ఆయిల్ ఆ రోజే వినియోగిస్తున్నారా? ఒకసారి ఫ్రై చేసేందుకు వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగిస్తున్నారా? వండిన ఆహారం ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ప్రోజోన్ ఫుడ్స్‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా? ఇలాంటివన్నీ తనిఖీ చేసి సరి చేయాలి. ఎక్కడైనా తేడాలుంటే సూచనలు చేయడంతో పాటు హెచ్చరికలు చేయాలి. ముఖ్యంగా హోటల్స్, స్వీట్ స్టాల్స్ తదితర వన్నీ క్లీన్‌గా, స్వచ్ఛమైన పదార్థాలతో ఆహార ఉత్పత్తులు తయారు చేసేలా సంబంధిత యజమానులకు అవగాహన కల్పించాలి. సీరియస్ నెస్ ఎక్కువగా ఉంటే కేసులు నమోదు చేయాలి. అవసరమైతే విజిలెన్స్‌కు రాయాలి. ఈ రకమైన పర్యవేక్షణ చేయాల్సింది పోయి తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఓ అధికారి చేతివాటం హోటల్స్, స్వీట్ స్టాల్స్, ఇతర షాపుల నుంచి అడ్డగోలు వసూళ్లు తాజాగా పలాసలో ఒక్కొక్క హోటల్ నుంచి రూ.10వేలు డిమాండ్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చిన అక్కడి యజమానులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన అసోసియేషన్ నాయకులు తాజాగా పలాసలో హోటల్స్ తనిఖీకి వెళ్లిన ఈ అధికారి ఒక్కోక్క హోటల్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కసారిగా రూ.10వేలు అంటే కష్టమని సదరు హోటల్స్ యజమానులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సంబంధిత హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అసోసియేషన్ నాయకులు అక్కడి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేలా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. -
● దోబూచులాట..
పాలకొండకు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక నేడు నరసన్నపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పాలకొండకు గురువారం రానున్నారని, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎంతో రాజకీయ చరిత్ర కలిగి అనేక పదవులు పొంది ప్రజలకు సేవ చేసిన పాలవలస రాజశేఖరం ఇటీవల మర ణించిన విషయం విదితమే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ పట్టణానికి వస్తారని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు జలుమూరు: శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు బుధవారం తెలిపారు. ముందుగా ఆలయం రెండు వైపులా మాడవీధుల గుండా బారికేడ్లు ఏర్పాటుచేసి అవసరమైతే ఆలయ పరిసరాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయంలో తొమ్మిది సీసీ కెమెరాలు ఉండగా అదనంగా సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నేడు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అరసవల్లి: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లుగా జెడ్పీ సీఈఓ ఎల్‌ఎన్‌వి.శ్రీధర్‌రాజా తెలియజేశారు. ఈ మేరకు ఉదయం 10.30 గంటల నుంచి 6వ స్థాయీ, 11.30 గంటలకు 3వ, 12.30 గంటల నుంచి 5వ, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వరుసగా 2వ, 4వ, 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతా యని ప్రకటించారు. సంబంధిత ఉమ్మడి జిల్లా అధికారులంతా తమ శాఖల ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర కీలకమని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సూక్ష్మ పరిశీలకులతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అనుసరించాల ని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. -
సమీకృత కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న పార్కింగ్, సెక్యూరిటీ, ప్రహరీ తదితర పను లను బుధవారం పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ -
స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏలూరులోని శాయ్ స్పోర్ట్స్ హాస్టల్ ఎస్ఎల్కేసీలో ప్రవేశాలకు ఈ నెల 27, 28 తేదీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో బాలికలు, అథ్లెటిక్స్‌లో బాలురుకు ఎంపికలు జరుగుతాయని చెప్పారు. 12 నుంచి 18 ఏళ్ల బాలబాలికలు అర్హులని తెలిపారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు, చదువుకు ఫీజులు, స్పోర్ట్స్ కిట్లు, ఇన్సూరెన్స్ సదుపాయాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పిస్తుందని వివరించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక జరిగే ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెంటర్ ఇన్చార్జి డీఎన్వీ వినాయక్(9885312356), వి.ఉదయ్సందీప్ (వెయిట్‌లిఫ్టింగ్ కోచ్)(9182993497) నంబర్లను సంప్రదించాలని కోరారు. -
అందరి బాధ్యత..
అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమష్టిగా మాతృ భాషాభివృద్ధికి చొరవ చూపాలి. – కోనే శ్రీధర్, హిందీ మంచ్ వ్యవస్థాపకులు అక్షయపాత్ర వంటిది.. అమ్మభాషను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగు భాష సొగసైన పద్యాలు, సౌరభాలు వెదజల్లే గద్యాలు, మురిపించే కావ్యాలతో నిండి ఉండే అక్షయ పాత్ర వంటిది. – డాక్టర్ సనపల నారాయణమూర్తి, తెలుగు పండితులు -
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్
శ్రీకాకుళం న్యూకాలనీ: అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ పెట్టిందని విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మత్స విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. బుధవారం బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025–26పై మేధావుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లోని ముఖ్య అంశాలపై పలువురు వక్తలు చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.అమ్మన్మాయుడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఐ.కె.రావు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, అంబేడ్కర్ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, కంపెనీ సెక్రటరీ బుర్రా భార్గవ్, విద్యావేత్త నిక్కు అప్పన్న, ఎన్జీవో మణిశర్మ, గురజాడ విద్యాసంస్థల ప్రతినిధి సంయుక్త, విద్యావేత్త జామి భీమశంకర్, జర్నలిస్టు సంఘ నాయకుడు కొంక్యాణ వేణుగోపాల్, డాక్టర్ పైడి సింధూర, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర రావు, దుర్గారావు గాంధి, కరుణాకరరావు, నరేంద్రచక్రవర్తి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
రైతులకు ఉపయోగపడేలా శిక్షణ
ఆమదాలవలస: రైతులకు ఉపయోగపడేలా యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ బి.ముకుంద రావు సూచించారు. ఆమదాలవలసలోని కృషివిజ్ఞాన కేంద్రంలో బుధవారం కె.వి.కె. ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు అధ్యక్షతన 43వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025– 26 సంవత్సరంలో చేయాల్సిన పరిశీలన క్షేత్రాలు, ప్రదర్శన క్షేత్రాలపై దిశా నిర్దేశం చేశారు. నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.భరత లక్ష్మి, కె.వి.కె. సమన్వయకర్త డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి, జిల్లా మత్స్య అధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్‌రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి కె.రమేష్ కృష్ణ, నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ విస్తరణశాఖ డాక్టర్ డి.చిన్నంనాయుడు, కీటక శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ పి.సీతారాం, రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి.ఉదయ బాబు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ జి.చిట్టిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ భవానీశంకర్, రెడ్డి ఫౌండేషన్ మేనేజర్ హరిబాబు వివిధ అంశాలపై ప్రంసగించారు. రైతులకు అందించాల్సిన శిక్షణలు, పరిశోధనలు, దిగుబడులు, చీడ పీడ నివారణపై చర్చించారు. -
కష్టార్జితం కాలిపోయింది..
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచి గ్రామంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో కిరాణా షాపు దగ్ధమైంది. కష్టపడి దాచుకున్న సొమ్ము కాలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుడియా బిమ్మో ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజాము ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే అత్తమ్మ వైద్యం కోసం పెట్టెలో భద్రపరిచిన మూడు లక్షల రూపాయల నగదు కాలిపోయాయి. రెండు ఫ్రిజ్‌లు, కిరాణా సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు మూడున్నర లక్షల రూపాయల సామాన్లు కాలిపోయినట్లు అగ్నిమాపకాధికారులు కె.ప్రశాంత్, సూర్యారావు తెలిపారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి పరామర్శించారు. షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు -
తల్లిదండ్రుల పాత్ర కీలకం..
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు. – లలితా రెడ్డి, తెలుగు ఉపాధ్యాయిని, రచయిత మాతృభాషలోనే అభ్యాసం మాతృభాష సృజనశీలి. వ్యక్తిత్వ వికాస సూత్రం. ప్రాథమిక, మాధ్యమిక విద్యావ్యవస్థలో మాతృభాషలో బోధన, అభ్యసనం చాలా అవసరం. ఇటీవల జిల్లాలో చాలామంది దుకాణాలకు తెలుగు పేర్లు పెట్టడం స్వాగతించదగ్గ పరిణామం. – భమిడిపాడి గౌరీశంకర్, తెలుగు విభాగాధిపతి, గాయత్రీ కళాశాల -
నెలాఖరులోగా ‘పల్లె పండుగ’ పూర్తవ్వాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ ఈ నెల చివరి వారం నాటికి పూర్తిచేసి బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంజూరైన, పూర్తయిన పనులు, బిల్లుల మంజూరు, పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు నూరు శాతం పూర్తిచేసి బిల్లులు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే, నిధులు వెనక్కు వెళ్లక ముందే చొరవ తీసుకుని పని చేయించాలన్నారు. పంచాయతీరాజ్ అధికారులకు నిర్దేశించిన పనుల ప్రగతిలో వెనుకబడిన కొత్తూరు, వజ్రపు కొత్తూరు, టెక్కలి మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. విధుల్లో అలసత్వం చూపుతున్నారని, 60 శాతం పనులు మాత్రమే పూర్తవడం పట్ల పాతపట్నం అర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎచ్చెర్లలో సచివాలయ ఉద్యోగుల హాజరు 46 శాతం మాత్రమే ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై ఏ మండలంలోనైనా సచివాలయ ఉద్యోగుల హాజరు 70 శాతం కంటే తక్కువ ఉంటే ఆయా ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీఓ భారతి సౌజన్య, జిల్లా వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి, డీఎంహెచ్ఓ టీవీ బాలకృష్ణ, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
ఉగాది పురస్కారాల కవితా సంపుటాలకు ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వేమన కవితా నిలయం(శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో ఉగాది సందర్భంగా సాహితీ పురస్కార సభ ఏర్పాటు చేస్తున్నట్లు మహ్మద్ రఫీ, తపస్వీ మనోహరం అధినేత నిమ్మగడ్డ కార్తీక్, బుర్రి కుమారరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వావసు నామ ఉగాది సందర్భంగా మార్చి 23న జరిగే ఈ సభ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు 2023 ఏడాదిలో ముద్రణ జరిగిన కవితా సంపుటి రెండు ప్రతులను మార్చి 15లోగా పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న మూడు పుస్తకాలకు రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. సభకు హాజరైన వారికి సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. కవితా సంపుటాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా మహ్మద్ రఫీ (ఈవేమన), ఎస్–1 శారదా అపార్టుమెంట్, లక్ష్మీనగర్, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా 532407 చిరునామాకు పంపించాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం కలకలం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని హయాతినగరం సమీపంలో నాగావళి నదీ తీరంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వ్యక్తి ఎడమ చేతి భుజంపై మహిళ బొమ్మ, డి.లక్ష్మి అనే అక్షరాలు పచ్చబొట్టుగా వేసి ఉన్నాయని ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజులు కిందట వ్యక్తి చనిపోయి ఉంటాడని, వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నామన్నారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలిని పరిశీలించామని, పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయవచ్చన్నారు. విద్యార్థిని ఆత్మహత్య కాశీబుగ్గ: మందస మండలం లోహరిబంద గ్రామంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి అనూష (14) లోహరిబంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఏం జరిగిందో గానీ ఇంటి పక్కనున్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని వెతుక్కుంటూ వెళ్లిన ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడటం చూసి నిర్ఘాంతపోయారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాడి రైతులకు పోటీలు రణస్థలం: ఆధునిక శాసీ్త్రయ పరిజ్ఞానం వినియోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధించి పశుషోషణ లాభసాటిగా మార్చడం, ఔత్సాహిక నిరుద్యోగ యువతను పాడి పరిశ్రమ వైపు ఆకర్షితులను చేసే ఉద్దేశంతో పాల పోటీలు నిర్వహిస్తున్నట్లు రణస్థలం పశుసంవర్థకశాఖ ఏడీఏ బి.దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర స్థాయిలో మార్చి 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లా తోటపాలెంలో కె.వైకుంఠరావు డైరీ ఫారమ్‌లో జరిగే ఈ పోటీలకు పాడి రైతులు పాల్గొనాలని కోరారు. గంజాయి నేరగాళ్లపై ఉక్కుపాదం శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారిని, క్రయవిక్రయాలు జరిపేవారిని, సేవించేవారిని గుర్తించి ప్రత్యేక షీట్లు తెరవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశించారు. రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో కేసులపై సమీక్షించారు. గంజాయి ద్వారా ఆదాయం అర్జించే వారి ఆస్తుల స్వాధీనం చేసుకోవడంతో పాటు పీడీ యాక్టు పెట్టేలా పురోగతి చూపాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చొరవతీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
● దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులే శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలోని టిడ్కో కాలనీ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సీక్రెట్‌గా గంజాయి సేవిస్తుండగా రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే ఇందులో విశాఖపట్నంకు చెందిన వారు ఇద్దరు కాగా, శ్రీకాకుళానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరంతా శ్రీకా కుళంలోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు తెలు స్తోంది. పట్టుబడిన వారి వద్ద నుంచి అరకిలోకు పైగానే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టౌన్ సీఐ పైడపునాయుడును వివరణ కోరగా ఆరుగురు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. ఎంత మోతాదుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించగా కేవలం 50–60 గ్రాము లు మాత్రమే వారివద్ద ఉందన్నారు. వీరిపై కేసు నమోదు చేయ లేదని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ ఉద్యోగాలంటూ మోసం సంతబొమ్మాళి: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు టోపీ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపురం పంచాయతీ బడే నర్సాపురం గ్రామానికి చెందిన మోడీ భాస్కర్‌రెడ్డి కోటబొమ్మాళిలో శ్రీమారుతి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఇటలీలో ఉద్యోగాలంటూ ఇన్ స్టిట్యూట్లో పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమా రు కోటి రూపాయలు వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొ మ్మాళి ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెబుతూ బడే నర్సాపురంలో ఉన్న ఇంటికి వెళ్లడంతో అక్కడకు వెళ్లిన బాధితులు భాస్కర్‌రెడ్డితో వాగ్వా దానికి దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్‌కు ఇచ్చి తాను మోసపోయానని భాస్కర్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. శాంతించని యువకులు నిలదీయడంతో.. వారి నుంచి తప్పించుకొని బైక్‌పైన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేపట్టారు. శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 3.33 లక్షలు జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3,33,634 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపారు. 84 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మెగా డీఎస్సీ హామీ ఏమైంది..? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అని చెప్పి నేటికీ భర్తీ చేయకపోవడం దారుణమని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఎన్.ఆర్ దాసరి క్రాంతి భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ లేక లక్ష లాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఽఖర్చుచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న పె ద్దలు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్. రామోజీ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
బొడ్డపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
పలాస: పలాస మండలం బొడ్డపాడులో మార్చి 1న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు షీల్డుతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ. 10వేలు ఇస్తామన్నారు. క్రీడాకారులు త మ జట్టుతో మార్చి 1న హాజరు కావాలని, క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.300లు చెల్లించి తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 8309642480 సెల్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఉప్పు పరిశ్రమపై దౌర్జన్యం సంతబొమ్మాళి: నౌపడ ఉప్పు పరిశ్రమపై మూలపేట పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై నౌపడ సాల్ట్ రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎన్ఎస్ కంపెనీ) యాజమాన్యం, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా వారి ఆధీనంలో ఉన్న ఉప్పు మడులపై పోర్టు యాజమాన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎస్ఎస్ కంపెనీ మేనేజర్ దివాకర్ షాతో పాటు ఉప్పు కార్మికులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. జరిగిన నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అయినా పోర్టు సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగించారు. దీంతో ఏమీ చేయలేక ఎన్ఎస్కంపెనీ సిబ్బంది, ఉప్పు కార్మికులు వెనుదిరిగారు. అ నంతరం రోడ్డు నిర్మాణానికి తమ ఉప్పు భూ ములు ఎంత వరకు తీసుకుంటున్నారో పోర్టు యాజమాన్యం వెల్లడించలేదని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
● దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులే శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలోని టిడ్కో కాలనీ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సీక్రెట్‌గా గంజాయి సేవిస్తుండగా రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే ఇందులో విశాఖపట్నంకు చెందిన వారు ఇద్దరు కాగా, శ్రీకాకుళానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరంతా శ్రీకా కుళంలోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు తెలు స్తోంది. పట్టుబడిన వారి వద్ద నుంచి అరకిలోకు పైగానే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టౌన్ సీఐ పైడపునాయుడును వివరణ కోరగా ఆరుగురు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. ఎంత మోతాదుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించగా కేవలం 50–60 గ్రాము లు మాత్రమే వారివద్ద ఉందన్నారు. వీరిపై కేసు నమోదు చేయ లేదని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ ఉద్యోగాలంటూ మోసం సంతబొమ్మాళి: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు టోపీ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపురం పంచాయతీ బడే నర్సాపురం గ్రామానికి చెందిన మోడీ భాస్కర్‌రెడ్డి కోటబొమ్మాళిలో శ్రీమారుతి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఇటలీలో ఉద్యోగాలంటూ ఇన్ స్టిట్యూట్లో పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమా రు కోటి రూపాయలు వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొ మ్మాళి ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెబుతూ బడే నర్సాపురంలో ఉన్న ఇంటికి వెళ్లడంతో అక్కడకు వెళ్లిన బాధితులు భాస్కర్‌రెడ్డితో వాగ్వా దానికి దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్‌కు ఇచ్చి తాను మోసపోయానని భాస్కర్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. శాంతించని యువకులు నిలదీయడంతో.. వారి నుంచి తప్పించుకొని బైక్‌పైన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేపట్టారు. శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 3.33 లక్షలు జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3,33,634 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపారు. 84 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మెగా డీఎస్సీ హామీ ఏమైంది..? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అని చెప్పి నేటికీ భర్తీ చేయకపోవడం దారుణమని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఎన్.ఆర్ దాసరి క్రాంతి భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ లేక లక్ష లాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఽఖర్చుచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న పె ద్దలు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్. రామోజీ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి
ఆమదాలవలస: సొంత భూమి గల ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. జొన్నవలస రైతుసేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. అనంతరం మునగవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమి రికార్డుల వివరాలతో రైతు సేవా కేంద్రంలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, వ్యవసాయ సహయకులు, రైతులు పాల్గొన్నారు. -
ఉద్దానంలో ఎలుగు సంచారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర జీడి తోటల్లో గత రెండు రోజులుగా ఎలుగు సంచరిస్తూ రైతుల కంట పడటంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉద్దాన ప్రజల జీవనాధారమైన జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు తోట పనుల్లో బిజీ బిజీగా తోటల్లోనే గడుపుతున్నారు. తోటకు కంచెలు ఏర్పాటు చేయడం, పురుగు మందులు వేయడం, తదితర పనులు చేసేందుకు తోటకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఎలుగు దాడి చేస్తుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటిని తప్పించబోయి వ్యక్తి మృతి కాశీబుగ్గ: మందస మండలం ముకుందపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మందసకు చెందిన జయరాం తన భార్యతో కలిసి స్కూటీపై వస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి రావడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జయరాం అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారని, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని పశుసంచార వాహన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని వాటిని ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. అదే విధంగా తమకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేయడం అనివార్యమైతే తమను పశుసంవర్ధక శాఖలో కొనసాగించాలని కోరారు. -
ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా చేసి నేరప్రవృత్తిని పెంచుతోంది. జిల్లాలో గంజాయి దొరకని పట్టణమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి టౌన్‌కు సినిమా థియేటర్, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నంత సాధారణంగా... గంజాయ
● జిల్ల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు ● మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత ● కట్టడి లేదని అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు ఆమదాలవలసలో.. ●● బీఆర్నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇటీవల కొంతమంది గంజాయి సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ● ఒడిశా నుంచి రైళ్లలో బ్యాగుల్లో పట్టుకుని వచ్చి ఎదురుగా ఉండే ఒకట్రెండు లాడ్జీల్లో మకాం వేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో.. ● రైల్వేస్టేషన్ శివార్లు, ఎల్మ్యాక్స్ సమీప పొదలు, బెల్లుపడ కాలనీ శివారు, పురుషోత్తపురం శివార్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా ఉన్నాయి. ● ఈ ప్రాంతాల్లో ఇటీవల ఎనిమిది మందిని పట్టుకున్నారు. ● కంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో పొట్లాల్లో క్రయ విక్రయాలిప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పలాస–కాశీబుగ్గ కేంద్రంగా.. ● నగర శివార్లలోని హుద్‌హుద్ ఇళ్లు, కోసంగిపురం జగనన్న కాలనీ, సూదికొండ, నెమలికొండ, రైల్వేస్టేషన్ అంబుసోలి, బెండితోట రిజర్వ్ ఫారెస్టు, రైల్వే గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ● రైల్వేస్టేషన్ సమీప ఆలయాలు, పలాస అన్నపూర్ణ సమీప పరిసరాల వద్ద సాధువులు అమ్ముతుంటారు. నరసన్నపేటలో.. ● ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సులభ్కాంప్లెక్సు అడ్డాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ● జమ్ము జంక్షన్ సమీప పరిసరాల్లోను, బజారులో రాజేశ్వరి టాకీస్ దగ్గర పల్లిపేట జంక్షన్ వెంకటేశ్వర థియేటర్ రాజుల చెరువు గట్టు మీద కాలనీలో, కొన్ని స్లమ్ ఏరియా ఉన్న కాలనీల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. టెక్కలిలో.. ● జాతీయ రహదారి ఆనుకొని నిర్మానుష్య ప్రాంతాలు, తోటలు, ప్రైవేటు లేఅవుట్లు, వెంచర్లు, వంశధార కాలువ ఏరియా మత్తుపదార్థాల సేవనానికి కేరాఫ్‌లుగా నిలుస్తున్నాయి. ● టెక్కలిలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులను కలిపే రైలు మార్గం ఉండటం, గుణుపూర్ నుంచే గంజాయి వస్తుందని స్థానికంగా చర్చజరుగుతోంది.అదేమీ శివారు ప్రాంతం కాదు.. నిర్మానుష్య ప్రాంతం అంతకంటే కాదు. దాదాపు నగరం నడిబొడ్డున.. అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఇద్దరు యువకులు గంజాయి తీసుకుంటూ దొరికిపోయారు. అది కూడా వీరు సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే కంట పడ్డారు. మార్కెట్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ వస్తే ఈ బాగోతం బయటపడింది. జిల్లా కేంద్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో ఎమ్మెల్యే సాక్షిగా ఘటన రుజువు చేసింది.జిల్లా కేంద్రంలో.. నగరంలోని ఉమెన్స్ కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. డచ్‌బంగ్లా వెనుక ఖాళీ స్థలం కూడా వీరి అడ్డానే. అఫీషియల్కాలనీ ఫైర్ ఆఫీస్, ఆర్అండ్బీ సమీప సబ్పోస్టాఫీస్లలో రాత్రి వేళ చూస్తే భయం పుట్టక మానదు. మత్తులో నేరాలు – ఘోరాలు జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో నిందితుడిని ఇంటరాగేట్ చేసేందుకు పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. గంజాయి మత్తు దిగాక గానీ అతడు విచారణకు సహకరించలేదు. గత ఏడాది అక్టోబర్‌లో శ్రీకాకుళంలోనే ఓ యు వకుడిపై మరొకరు బ్లేడుతో గొంతు కోసేశాడు. ఒడిశాకు చెందిన ఓ యువకుడు పచ్చని కాపురంలో ప్రేమ పేరుతో చిచ్చుపెట్టాడు. మత్తులో ఏకంగా హత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో ఓ యువకుడు సొంత మేనమామ తమకు రావాల్సిన వాటాకు అడ్డుగా నిలుస్తున్నాడన్న కోపంతో స్నేహితుని సాయంతో మత్తులోనే కర్కశంగా చంపేశాడు. -
బొడ్డపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
పలాస: పలాస మండలం బొడ్డపాడులో మార్చి 1న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు షీల్డుతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ. 10వేలు ఇస్తామన్నారు. క్రీడాకారులు త మ జట్టుతో మార్చి 1న హాజరు కావాలని, క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.300లు చెల్లించి తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 8309642480 సెల్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఉప్పు పరిశ్రమపై దౌర్జన్యం సంతబొమ్మాళి: నౌపడ ఉప్పు పరిశ్రమపై మూలపేట పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై నౌపడ సాల్ట్ రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎన్ఎస్ కంపెనీ) యాజమాన్యం, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా వారి ఆధీనంలో ఉన్న ఉప్పు మడులపై పోర్టు యాజమాన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎస్ఎస్ కంపెనీ మేనేజర్ దివాకర్ షాతో పాటు ఉప్పు కార్మికులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. జరిగిన నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అయినా పోర్టు సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగించారు. దీంతో ఏమీ చేయలేక ఎన్ఎస్కంపెనీ సిబ్బంది, ఉప్పు కార్మికులు వెనుదిరిగారు. అ నంతరం రోడ్డు నిర్మాణానికి తమ ఉప్పు భూ ములు ఎంత వరకు తీసుకుంటున్నారో పోర్టు యాజమాన్యం వెల్లడించలేదని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నువ్వలరేవులో విషాదం
కంచిలి/వజ్రపుకొత్తూరు రూరల్: కంచిలి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెహరా ధర్మారావు(31), బెహరా సన్నా అలియాస్ షణ్ముఖరావు(38) మృతిచెందడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్‌ను తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మారావు స్వగ్రామంలో టైలరింగ్ చేస్తుండేవాడు. అతని సహాయకుడిగా సన్నా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ రెడీమేడ్ దుస్తుల్ని కుట్టి బరంపురంలోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆర్డర్‌పై అందిస్తుడేవారు. ఈ క్రమంలోనే బరంపురం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లబోదిబోమంటున్నకుటుంబాలు.. ధర్మారావుకు భార్య పూజ, కుమారుడు మున్నా, కుమార్తె వర్షిణి ఉన్నారు. సన్నాకు భార్య శృతి, మూడేళ్ల కుమారుడు రోషన్ ఉన్నారు. వీరంతా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు యువకుల మృతితో నువ్వలరేవులో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరడంతో అశృనయానాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీలు, మత్య్సకార సొసైటీ సభ్యులు, గ్రామపెద్దలు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అశ్రునయనాల మధ్య రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియలు బాధిత కుటుంబాలకు పలువురి పరామర్శ -
సీఐడీ ఉచ్చు!
ఎస్బీఐ మెడకు● సీఐడీ చేతికెళ్లిన నరసన్నపేట ఎస్బీఐ బ్రాంచి వ్యక్తిగత రుణాల అవినీతి బాగోతం ● అంతర్గతంగా తేల్చలేక సీఐడీకి అప్పగిస్తూ ఫైలు పెట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు ● పరిశీలన దశలో ఉండటంతో నంబర్ ఖరారు చేయని సీఐడీ ● గార బ్రాంచి బంగారం మిస్సింగ్ కేసు తీర్పు కోసం ఎదురు చూపులు ● ఏం గుర్తించారో వెల్లడించని పరిస్థితి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన రెండు బ్రాంచిల్లో చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారం మొత్తం ఆ బ్యాంకుకే మచ్చ తెచ్చిపెట్టింది. వీటిలో ఒకటి ఇప్పటికే కోర్టు పరిధిలో ఉండగా, మరొకటి సీఐడీ చేతికి వెళ్లింది. నరసన్నపేట బ్రాంచ్‌లో ఖాతాదారులకు తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల మీదుగా రుణాలు డ్రా చేసిన నిర్వాకాన్ని సీఐడీకి అప్పగించాలని బ్యాంకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోగా, గార ఎస్బీఐలో తాకట్టు బంగారం మాయం కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నరసన్నపేట బ్రాంచ్‌కు సంబంధించి ఇప్పటివరకు సీఐడీ నంబర్ ఇవ్వలేదు. పలు డాక్యుమెంట్లతో కూడిన వివరాలను అడిగినట్టు తెలిసింది. అన్నీ పరిశీలించాకే కేసు నంబర్ ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ బ్యాంకుల్లో కోటి రూపాయలకు లోపు అక్రమాలు జరిగితే స్టేట్ పోలీసు డిపార్ట్మెంట్కు, రూ.మూడు కోట్ల లోపైతే సీఐడీకి, రూ.3 కోట్లు దాటితే సీబీఐకి కేసు అప్పగించాల్సి ఉంటోంది. నరసన్నపేట ఎస్బీఐ బ్రాంచిలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా బ్యాంకు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కచ్చితమైన లెక్క లేకపోయినా రూ.3కోట్ల లోపే అక్రమాలు జరిగినట్టు తేలడంతో కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. నరసన్నపేటలో ఏం జరిగిందంటే... నరసన్నపేట బ్రాంచిలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలపై వ్యక్తిగత రుణాలను బ్యాంకు అధికారులే వాడేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టగా జరిగిన అక్రమాలను గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రీజనల్ స్థాయి అధికారితో పాటు పలువురు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం. తొలుత విషయం బయటకు పొక్కడంతో నాడు పనిచేసిన బ్యాంకు మేనేజర్ శ్రీకర్ మెడకు చుట్టుకుంది. రీజనల్ స్థాయి అధికారి ఒత్తిడితో సుమారు రూ.65లక్షలు బ్యాంకుకు తిరిగి జమ చేసినట్టు తెలిసింది. ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లినట్టు సమాచారం. అక్రమాలు జరిగాయని శాఖా పరంగా గుర్తించడంతో నాడు రీజనల్ మేనేజర్‌గా పనిచేసిన రమణమూర్తిరాజును యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు. ఆ తర్వాత అప్పట్లో మేనేజర్‌గా పనిచేసిన శ్రీకర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ శాఖా పరంగా విచారణ కొలిక్కి రాకపోవడంతో పాటు రూ.కోటికి పైగా అక్రమాలు జరగడంతో సీఐడీకి కేసు అప్పగించాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో గార బ్రాంచ్ వ్యవహారం గార ఎస్బీఐలో ఖాతాదారులు పెట్టిన బంగారాన్ని భద్రంగా ఉంచాల్సిందిపోయి వాటిని తీసుకెళ్లి కొందరు ఉద్యోగులు ఓ ప్రైవేటు సంస్థలో కుదవ పెట్టి కోట్ల రూపాయలు తీసుకుని సొంతానికి వాడుకున్నారు. దాదాపు 86 సంచుల్లోని రూ.4.7 కోట్ల విలువైన 7.146 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఈ రకంగా పక్కదారి పట్టాయి. కేసుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. మిస్సయిన ఖాతాదారుల బంగారమంతా రికవరీ కావడంతో వ్యవహారం కొలిక్కి వచ్చేసిందని, కోర్టు తీర్పు ఇవ్వగానే ఎవరి బంగారం వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే దీంట్లో కీలక వ్యక్తులు తప్పించుకున్నారని, ముఖ్యంగా రీజనల్ మేనేజర్ రమణమూర్తిరాజు పాత్ర చూపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత రిమాండ్ రిపోర్టు కూడా సక్రమంగా లేదని తర్వాత వచ్చిన పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ మేరకు విచారణ కూడా చేశారు. కానీ ఏం గుర్తించారో వెల్లడి కాలేదు. ఆర్ఎం రాజు పాత్రపై నేటికీ రాని స్పష్టత.. ● గార ఎస్బీఐ కేసులో ఏ–1 ముద్దాయిగా పేర్కొన్న స్వప్నప్రియ 2023 అక్టోబరు నెలకు సంబంధించి బంగారు సంచులను మాయం చేసినట్లు ఉండే సీసీ ఫుటేజీని ఆర్ఎం రాజు పోలీసులకు ఇచ్చారు. కానీ అంతకుముందు నెలే (సెప్టెంబరు) బ్రాంచిలో సెంట్రల్ ఆడిట్ జరిగింది. అందులో ఎలాంటి తేడా లేదని క్లియర్‌గా ఉన్నట్లు చూపించారు. వాస్తవానికి పోలీసుల విచారణలో 14 నెలలుగా స్వప్నప్రియ ద్వారా ఈ తతంగం జరిగినట్లు చెప్పారు. అలాంటప్పుడు సెప్టెంబరులో జరిగిన సెంట్రల్ ఆడిట్లో ఈ అవకతవకలు బయటపడలేదా అన్నది అనుమానం. ● మొత్తం బ్యాగులన్నీ మార్చింది స్వప్నప్రియే అన్నట్లు చూపించారు. క్యాషియర్ పాత్ర లేకుండా సాధ్యమా.. ఉదంతం జరిగే సమయంలో క్యాషియర్ సురేష్‌ను ఆర్ఎం రాజు మూడు చోట్ల పోస్టుల్లో ఉంచారు. అంతే కాకుండా క్యాషియర్ సురేష్‌పై స్వప్నప్రియకు సంబంధించిన వారే దాడి చేశారంటూ అంతకుముందే గార పీఎస్‌లో కేసు నమోదు చేయడం.. అది ఫేక్ అని తేలడం జరిగాయి. దీనివెనకున్నది ఎవరో తేలలేదు. ● పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఓ నిందితుడు(లోహితాక్షి కన్సల్టెన్సీ తిరుమలరావు) రూ.1.70 కోట్ల వరకు నరసన్నపేట కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కుటుంబ ఖాతాలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీని వెనక ఆర్ఎం పాత్ర ఉందనే అనుమానం ఉంది. దీనిపై కూడా స్పష్టత లేదు. ● కేసు విచారణ జరుగుతుండగా గార బ్రాంచిలో పనిచేస్తున్న సిబ్బందిని అంతా ఒకేసారి ఆర్ఎం బదిలీ చేశారు. అది రూల్స్‌కు విరుద్ధం. కేసు పెట్టాల్సింది స్థానికంగా ఉన్న బ్రాంచి మేనేజరే తప్ప ఆర్ఎంకు సంబంధం లేదు. కానీ ఆయనే డైరెక్ట్‌గా కేసు పెట్టారు. దీని వెనక కుట్ర ఉందనే వాదనలు ఉన్నాయి. ● స్వప్నప్రియ బతికి ఉన్నప్పుడు అసలేం జరగలేదని చెప్పిన ఆర్ఎం ఆమె చనిపోయాక ఏ1గా ఫిర్యాదులో పెట్టడం వెనక కారణమేంటో ఇప్పటికీ సమాధాననం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. -
మూలకు చేరిన నిఘా నేత్రం!
● శ్రీకూర్మం క్షేత్రంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని పాలకులు గార : విష్ణువు అవతారాల్లో రెండో అవతారం, ప్రపంచంలో ఇంకెక్కడా నిర్మించకూడదని పురాణాలు పేర్కొన్న ప్రముఖ క్షేత్రం శ్రీకూర్మం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం వద్ద నిఘా మసకబారుతోంది. గతంలో మూలవిరాట్ స్కాన్, తిరునామం పగలగొట్టడం వంటి ఘటనలు నేపథ్యంలో 2012లో హిందుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలువురు అధికారులు మారినప్పుడు సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. తర్వాత నిర్వహణ కొరవడంతో సీసీ కెమెరా వ్యవస్థ పనిచేయడం లేదు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించే మానిటర్ వ్యవస్థ పాడైపోయింది. గర్భగుడి లోపలికి, ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు గమనించేందుకు సీసీలు ఏర్పాటు చేసినప్పటికీ మానిటర్ కొద్దిరోజుల కిందట కాలిపోయింది. ఇప్పటీకీ మరమ్మతులు చేయలేదు. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఈవోకు రావివలస, పలాస గ్రూపు ఆఫ్ టెంపుల్స్‌తో పాటు శ్రీకూర్మనాథాలయం బాధ్యతల ఉన్నాయి. ఇక్కడ ఈవోతో మొదలుకొని అందరూ ఇన్‌చార్జిలే. రాత్రిపూట పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథరావు వద్ద ప్రస్తావించగా సీసీ టీవీ మానిటర్ కాలిపోవడం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. తన మొబైల్లో లింక్ ద్వారా సీసీ ఫుటేజ్ చూస్తున్నానని తెలిపారు. -
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
ఎచ్చెర్ల క్యాంపస్: పంజాబ్‌లోని ఛండీఘడ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22 నుంచి 27 వరకు అఖిల భారత మహిళలు, పురుషుల వుషు పోటీలు జరగనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్.పావని (ప్రతిభా డిగ్రీ కళాశాల), ఎం.శిరీష (విద్యాధరి డిగ్రీ కళాశాల) ప్రాతినిధ్యం వహించనున్నారు. కోచ్‌గా కె.మురళీ వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులను వీసీ కె.ఆర్.రజిని, అధికారులు మంగళవారం అభినందించారు. ఇన్ఫోసిస్ స్కాలర్షిప్కు విద్యార్థి ఎంపిక టెక్కలి: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అందజేసే స్కాలర్షిప్కు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మొదటి ఏడాది సీఎస్ఈ విద్యార్థిని ఎ.హేమలత ఎంపికై నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థినికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు రూ. 4 లక్షలు ఉపకార వేతనం కింద అందజేస్తారని వివరించారు. పదో తరగతి, ఇంటర్లో సాధించిన మార్కులతో పాటు ఆర్థిక స్థోమత, ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, సీఎస్ఈ హెచ్ఓడీ వై.రమేష్, అసిస్టెంట్ హెచ్ఓడీ టి.చలపతిరావు, శాక్ ఇన్చార్జి జె.సురేష్‌కుమార్ అభినందించారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన మినీ వ్యాన్ టెక్కలి : కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన వండాన శ్రీను టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు తన ట్రాక్టర్‌తో వస్తుండగా, బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. వ్యాన్ డ్రైవర్ బాదల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్‌కుమార్(33) ఆమదాలవలస పట్టణానికి చెందిన చిట్టీ వ్యాపారి వేధింపులు తాళలేక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతున్న సురేష్‌కుమార్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తండ్రి పొన్నాడ దమరకేశ్వరరావు, తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్–2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ సహా, పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడల్
కళాశాలల్లో క్రీడలకు దూరం.. నేను ఆలిండియా యూనివర్సిటీ హ్యాండ్‌బాల్‌లో గోల్డ్ మెడల్ విన్నర్‌ని. గేమ్స్‌లో ఆసక్తితో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగంలో చేశాను. స్కూల్స్ వరకే పీడీ, పీఈటీలు ఉన్నారు. కాలేజీలకు పూర్తిగా పీడీలు లేరు. గత ప్రభుత్వం హయాంలో నాకు పదోన్నతి లభించింది. హెచ్ఎంగా చేరాల్సి వచ్చింది. క్రీడ లకు దూరమైపోయాను. అదే జేఎల్స్‌గా పదోన్నతులు కల్పించి పీడీలుగా నియమిస్తే జూనియర్ కాలేజీలు సైతం క్రీడలతో కళకళలాడుతుండేవి. –ఎమ్మెస్ చంద్రశేఖర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు మండలం శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు శిక్షకులు కావాలి. అందుకు ప్రభుత్వ స్కూళ్లలో పాఠశాల స్థాయిలో పీడీ/పీఈటీలు ఉన్నారు. పాఠశాల స్థాయి తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38 ఉంటే.. పనిచేస్తున్న పీడీలు సున్నా. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు, శిక్షకులను నియమించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా శిక్షకులు లేక నిరాశకు లోనవుతున్నారు.కొంతమంది పిల్లలు వివిధ వేదికల్లా రాణిస్తున్నా.. వారి వ్యక్తిగత ప్రతిభతోనే గుర్తింపు పొందుతున్నారు. నాలుగు గదులకే పరిమితమవుతూ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు పీఈటీలు, పీడీలు విద్యార్థులకు క్రీడల పట్ల మంచి శిక్షణ ఇస్తున్నారు. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అయితే వారి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్లో చేరేసరికి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడం. సర్కారీ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు క్రీడలు, వ్యాయామాలకు దూరమైపోతూ నిరంతనం తరగతుల గదులకే పరిమితం అవుతున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్, గంజాయి, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. అదే కాలేజీల్లో పీడీలుంటే వ్యాయామం, క్రీడలు, ఆటపాటలపట్ల ఆకర్షితులను చేస్తే మానసిక ఉల్లాసం, ఆనందం కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పదోన్నతల ప్రక్రియ.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 30 మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38 ఉన్నాయి. వీటిల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరూ లేరు. పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఎంపీఈడీ కోర్సు పూర్తి చేస్తే పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందేవారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు ఉద్యోగోన్నతులపై జూనియర్ కళాశాలలకు వెళ్లేవారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతున్నందున ఉద్యోగ పదోన్నతులు రెండు దశాబ్దాలుగా ఆగిపోయాయి. పీఈటీలంతా పాఠశాలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో పీడీలను పాఠశాలల్లో హెచ్‌ఎంలగా పదోన్నతులు కల్పించి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి వారి పేరిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. కానీ న్యాయస్థానాల్లో కేసులు కారణంగా జూనియర్ కాలేజీలకు పీడీలగా మాత్రం ఉద్యోగోన్నతలు పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగోన్నతుల ద్వారా ఉన్నత పాఠశాలల్లో పీడీలను జేఎల్స్ పీఈగా పదోన్నతులు కల్పించాలని పీడీ, పీఈటీల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడీలుఇంటర్ సెకెండియర్ విద్యార్ధులు3863837883 ఉద్యోగోన్నతులు కల్పించాలి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామకాలను ఉద్యోగోన్నతుల ప్రక్రియ ద్వారా చేపట్టాలి. జూనియర్ కళాశాలల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. క్రీడలకు దూరమైపోతున్నారు. జూనియర్ కాలేజీల్లో పీడీల నియామకాలు జరిగితే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు జూనియర్ కాలేజీల్లో కనుమరుగవుతున్న ఫిజికల్ డైరెక్టర్లు మొత్తం 38 చోట్ల ఒక్కరూ లేని వైనం నష్టపోతున్న విద్యార్థులు పట్టించుకోని ప్రభుత్వం 0 -
బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
● తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని సుంకిడి పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ మహంతి (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ మహంతి కుమారుడు జగదీష్ ఐటీఐ చదువుతున్నాడు. జగదీష్ కొర్లాం వద్దకు బస్సులో రాగా.. కుమారుడిని తీసుకురావడానికి నర్సింగ్ సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. బుసాబద్ర పంచాయతీ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని జంతువు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నర్సింగ్ కిందపడి గాయపడ్డాడు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బుడితి సచివాలయంలో ఒకే ఒక్కడు సారవకోట: మండలంలోని బుడితి సచివాలయానికి ఎంపీడీఓ మోహన్ కుమార్ మంగళవారం ఉదయం 10.10 గంటలకు తనిఖీ చేయడానికి వచ్చారు. ఆ సమయానికి వీఆర్ఓ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శి హాజరు కాగా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. ఒక్క బుడితిలోనే కాకుండా అన్ని సచివాలయాలలో ఇదే తంతు నడుస్తుందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈనెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి అండతో మైనింగ్ దోపిడీ
టెక్కలి: జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీలు, ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజస్థాన్‌కు చెందిన కొంత మంది బ్రోకర్లతో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి కమీషన్ల దుకాణాలు తెరిచారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ దుయ్యబట్టారు. సోమవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి పా లనలో గ్రామస్థాయి నుంచి కక్ష సాధింపు చర్యల కు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఎన్నికల మును పు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలపై కనీసం దృష్టి సారించడం లేదన్నారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన పాలనాపరమైన ర్యాంకింగ్‌లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుకు 17వ ర్యాంకు వచ్చిందని, అయితే కక్ష సాధింపుల్లో మా త్రం మొదటి ర్యాంకులో ఉన్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు రైతులను పట్టించుకోకుండా ఏం వెలగబెడుతున్నారని నిలదీశారు. గతంలో అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన బోయిన రమేష్‌కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించి ధాన్యం కొనుగోలులో మంత్రి సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తిలక్ దుయ్యబట్టారు. వైఎస్ జగన్ హయాంలో పోర్టు పనులు మొదలయ్యాయని, దానికి అనుసంధానంగా రోడ్లకు ప్రతిపాదిస్తే.. ఆ రోడ్లు తామే ఇచ్చామంటూ బాబాయ్, అబ్బాయ్‌లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితులపై కూటమి నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోకుండా తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీనిపై తిరుగుబాటు తప్పదన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులు, విజిలెన్స్ ఎస్పీ కూటమిగా చేరి కింజరాపు కుటుంబం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, పార్టీ నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల నాయకులు ఎస్.సత్యం, జీ.వి.రెడ్డి మాష్టారు, ఎస్.హేమసుందర్‌రాజు, ఆర్.మల్లయ్య, బి.మోహన్‌రెడ్డి, కె.సంజీవ్, డి.రామకృష్ణారెడ్డి, పోలాకి మోహన్, పి.వెంకట్రావు, దివాకర్, ఎన్.భీమారావు, కె.జీవన్, కె.రామరాజు, బి.వెంకటరమణ, పి.మోహన్, పి.బాలకృష్ణ, మదీన్, హెచ్.గోవిందరావు, పి.కరుణాకర్, ఎ.మల్లేష్, హెచ్.లక్ష్మణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ -
గ్రూప్–2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 మెయిన్ పరీక్షలు ఈ నెల 23న జరగనున్నాయని, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించా రు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారు లు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవె న్యూ అధికారి వెంకటేశ్వర రావుతో కలిసి సెంటర్ల వారీగా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడు తూ, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీని కోసం శ్రీకాకుళం, ఎచ్చెర్లలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5535 మంది సభ్యులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. -
విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి
నరసన్నపేట: ప్రజలకు ఆధార్ కార్డు లాగానే రైతులకు గుర్తింపు నంబర్లు తీసుకోవాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారి త్రినాథస్వామి అన్నారు. మండలం కోమర్తి సచివాలయంలో రైతులకు విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే దానిపై ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు యూనిక్ ఐడీ చాలా ముఖ్యమని అన్నారు. ప్రభు త్వం నుంచి ఏ పథకం రైతులు పొందాలన్నా ఈ సంఖ్య ఉండాలని, రైతులు గమనించి సంబంధిత వీఏఏ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అలాగే ఈ నెల 28 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వీఏఏలకు ఆదేశించారు. కోమర్తి సచివాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా ఉందని వీఏఏ కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 190 మంది రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. మిగిలిన రైతులు కూడా 28 కల్లా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే రబీ పంటల నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, మండల వ్యవసాయాధికారిణి కె. సునీత తదితరులు ఉన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార కాలువల ఆధునికీకరణకు రూ.1500 కోట్లు కేటాయించాలన్నారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 17 ఏళ్లయినా నేటికీ 40 శాతం పనులు కూడా జరగలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గతంలో అంచనా వేసిన రూ.17 కోట్లు మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా మరో 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మందస మండలంలోని కళింగదళ్, డబార్సింగ్, దామోదర్ సాగరం ప్రాజెక్టులను ఆధునికీకరించాలని కోరారు. చీపి గడ్డ ద్వారా వృధాగా పోతున్న నీటిని గోపాలసాగరానికి మళ్లించాలని కోరారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న నారాయణపురం, తోటపల్లి, మడ్డువలస సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి అవసరమైన మొత్తం నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. -
అన్నింటా ఆయనే..
టెక్కలి జాతీయ రహదారిపై అధిక బరువుతో ఉన్న గ్రానైట్ బ్లాకులతో ప్రమాదకరంగా వెళుతున్న లారీ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఎవరి గ్రానైట్ క్వారీ నడవాలి..? ఎవరిది ఆపేయాలి..? ఏ క్రషర్ ఉంచాలి.. ఎవరిది ఉంచకూడదు.. ఇలా మైనింగ్‌కు సంబంధించి ప్రతీదీ కీలక నేత సోదరుడే డిసైడ్ చేస్తున్నారు. మైనింగ్ అనే కాదు.. ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోలు.. అన్నింటా ఆయనదే రాజ్యం. మైనింగ్ ఆధిపత్యం వల్ల ఆయన అనుయాయులంతా లాభ పడుతుండగా.. మిగతా వ్యాపారులు మాత్రం క్వారీలు, క్రషర్లు మూసుకుని నష్టపోతున్నారు. గ్రానైట్ రాళ్లను రవాణా చేసే వాహనాల విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. తమకు కావాల్సిన డబుల్ హౌసింగ్ లారీలకు మాత్రమే రాళ్ల రవాణా అప్పగించాలని, కాదన్న వారిని దూరం పెట్టాలని హకుం జారీ చేశారు. ఫలానా నంబర్లు గల ట్రైలర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, మిగతా వాటిని ఎక్కడికక్కడ ఆపేయండని అధికార వర్గాలకు సూచన ప్రాయ ఆదేశాలిచ్చారు. ఈ వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేసుకుంటున్నా.. ఆయనను అడిగే నాథుడు లేకపోయాడు. అంతా ఆయన కనుసన్నల్లోనే.. జిల్లాలో విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాకులను ప్రతి రోజూ 50 నుంచి 100 వరకు ట్రైలర్లు జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు విశాఖపట్నం పోర్టుకు రవాణా చేస్తుంటాయి. విశాఖకు వెళ్లేవన్నీ పెద్ద బ్లాకులే. ఇంకా పెద్దవాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా మనకు జిల్లాకు సంబంధించి గ్రానైట్‌ను మలేషియా, సింగపూర్, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వస్తే బెంగళూరుకు ఎక్కువగా తరలిస్తారు. మధ్యస్తంగా ఉన్న బ్లాకులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పాలిషింగ్ యూనిట్లకు తరలిస్తుంటారు. ముఖ్యంగా నిమ్మాడ, పెదబమ్మిడి, వాండ్రాడ సమీపంలో 90 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు అత్యధికంగా గ్రానైట్ క్వారీల నుంచి రవాణా చేస్తుంటారు. అలాగే, మెళియాపుట్టి మండలం వెంకటాపురం ఏరియాలోని పాలిషింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. ఈ గ్రానైట్ బ్లాకుల రవాణా అంతా కీలక నేత సోదరుడు చెప్పిన ట్రైలర్లతోనే చేయాలి. మిగతా వాటికి అప్పగిస్తే ఆ క్వారీ టార్గెట్ అయిపోయినట్టే. అందుకనే ఎందుకొచ్చిన గొడవ అని ఆ తమ్ముడు చెప్పిన ట్రైలర్లకే క్వారీ యజమానులు అప్పగిస్తున్నారు. జిల్లాలో 90కి పైగా ట్రైలర్లు ఉన్నాయి. వీటిలో 30 ట్రైలర్లు మాత్రమే తమకు కావాల్సినవని చెప్పి, వాటికి మాత్రమే రవాణా అప్పగించాలని హకుం జారీ చేశారు. దీంతో మిగతా 60కి పైగా ఉన్న ట్రైలర్ల యజమానులకు రవాణా పని దొరక్క నష్టపోతున్నారు. చర్యలు తీసుకోరే.. దీనికి తోడు పరిమితికి మించి ఏకంగా 100 టన్నుల సామర్థ్యంతో బ్లాకులను తరలిస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. ‘సోదరుడు’ చెప్పిన నంబర్లు గల లారీలు కావడంతో వాటిని ఆపే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా పరిమితికి మించి, సామర్థ్యాన్ని దాటి రవాణా చేసిన ట్రైలర్ ఒకటి ఇటీవల విశాఖ జిల్లా ఎండాడ దిశా మహిళా పోలీసు స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో భారీ బండ రాళ్లు(బ్లాకులు) జాతీయ రహదారికి అడ్డంగా పడిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పీఎంపాలెం పోలీసులు క్రేన్ల సహాయంతో వాటిని తొలగించడంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి పరిసర ప్రాంతాల నుంచి రోజు వందల సంఖ్యలో గ్రానైట్ బ్లాకుల రవాణా అడ్డగోలుగా జరుగుతుందని, పరిమితికి మించి లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఇటీవల కొందరు జిల్లా ఉన్నతాధికారికి, రవాణ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్పందన లేదన్న వాదనలు ఉన్నాయి. కీలక నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమాలు మైనింగ్, ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోళ్లు.. అన్ని రంగాల్లో ఆయనే ఆధిపత్యం గ్రానైట్ బ్లాకుల రవాణాలోనూ అక్రమాలే సామర్థ్యానికి మించి లోడింగ్ చేసి రవాణా ఇటీవల విశాఖ జిల్లా ఎండాడలో ప్రమాదానికి గురైన ఓ వాహనం భారీ గ్రానైట్ బ్లాకులతో రవాణా అవుతున్న ట్రైలర్‌ను చూడండి. 22 టైర్ల గల ఈ వాహనంపై రాష్ట్ర పరిధిలో 57 మెట్రిక్ టన్నుల బ్లాకులను మాత్రమే రవాణా చేయాలి. రాష్ట్రం దాటితే 55టన్నుల సామర్థ్యం గల బ్లాకులనే రవాణా చేయాలి. కానీ, ఇప్పుడీ ట్రైలర్లపై రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలోనే 100 టన్నులకు పైగా బరువుల గల బ్లాకులను ఎక్కించి రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటిని ఏ ఒక్క అధికారి అడ్డుకోవడం లేదు. జిల్లాకు చెందిన కీలక నేత సోదరుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు. మద్యం, ధాన్యం, ఇసుక, మైనింగ్.. ఇలా అన్నింటిలోనూ వేలు పెడుతున్నారు. అతగాడి జోక్యం ఉంటే చాలు ఆ అక్రమాల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ‘ఆయనున్నాడు మనకెందుకులే.. మనకు ఎంతో కొంత వస్తుంది దాంతో సరిపెట్టుకుందాం’ అన్న ధోరణి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇసుక దందా చేస్తున్నారు. ఈ విషయంలో కీలక నేత సోదరుడితో పాటు ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం నేతలకు భాగస్వామ్యం ఉంది. కానీ, సంబంధిత వర్గాలు మొత్తం కీలక నేత సోదరుడు చెప్పినట్టుగానే చేస్తున్నాయి. ఇక జిల్లాలోని మూడింతల మద్యం షాపులు కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే ఉన్నాయి. చాలా వరకు షాపులు ఆయన అనుయాయులు, కుటుంబీకులకే దక్కాయి. జిల్లాలో అక్రమాలకు దోహదపడ్డ మరో ప్రధాన అంశం ధాన్యం కొనుగోళ్లు. జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాలు, మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, గోడౌన్లలో కస్లమ్ మిల్లింగ్ రైస్ స్టాక్ చేసేందుకు మిల్లర్ల దగ్గరి నుంచి ముడుపులు, సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం బదులు పీడీఎస్ బియ్యం ఇచ్చే విషయంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన నిర్ణయాలే అమలవుతున్నాయి. మిల్లర్లు ఆవేదనతో ఉన్నా అధికారానికి భయపడి కక్కలేక, మింగలేక కుమిలిపోతున్నారు. -
వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కాశీబుగ్గ: మందసలోని వాసుదేవుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దాసాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశా రు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ పండా, వివేక్ సాతుర్వేది, అనిల్ పండా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో భద్రతపై దిశానిర్దేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలును కఠినంగా పరిశీలిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యుటేన్ వంటి మండే స్వభా వం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని, విష వాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పింఛన్ సొమ్ముతో విలేజ్ సర్వేయర్ పరారీ జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న చదువుల భాను ప్రతాప్ రూ.49వేల పింఛన్ సొమ్ముతో పరారైనట్లు ఆ సచివాలయ సి బ్బంది సోమవారం తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సచివాలయంలో 2024 జూన్ నుంచి పింఛన్ల పంపిణీ బాధ్యతలను ప్రతాప్‌కు అప్పగించారు. ఈ నెలకు సంబంధించి 1లక్ష 66వేల రూపాయల గాను 1లక్ష 17 వేలు రూపాయలను పంపిణీ చేశాడు. మిగతా సొమ్ము రూ.49వేలు లబ్ధిదారులకు ఇవ్వకుండా పరారయ్యాడని సచివాలయ సిబ్బంది ఫిర్యా దులో పేర్కొన్నారు. సంబంధిత పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా సచివాలయ సిబ్బంది తమ సొంత నిధులు రూ. 33వేలు వెచ్చించి ఇచ్చారు. మరో రూ.16వేలు మృతి చెందిన లబ్ధిదారుల పింఛన్లని, వీటిని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉందన్నారు. శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా బందోబస్తు జలుమూరు: శ్రీముఖలింగంలో శివరాత్రికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలపై అర్చకులు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో మాట్లాడారు. దక్షిణ ద్వారం గుండా వీఐపీల దర్శనాలను రద్దు చేయాలన్నారు. సామాన్యులు సులభంగా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోప్ పార్టీలు అదనంగా ఏర్పాటు చేయాలని టెక్కలి డీఎస్పీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తికి ఆదేశించారు. చక్రతీర్థ స్నానాలకు అదనపు బందోబస్తు ఉండాలని, రోడ్డు, నది మార్గాలు శుభ్రం చేయాలని సూచించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదన్నారు. దీనికి ముందు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు సీఐలు ఇమ్మాన్యుయేల్ రాజు, జె.శ్రీనివాస్, సత్యనారాయణ, ఎస్ఐలు అశోక్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో పట్టాభిషేకం
జలుమూరు: దక్షిణ కాశిగా పేరొందిన శ్రీముఖలింగంలో సోమవారం కళింగరాజు అనంత వర్మ చోడ గంగదేవుడి 947వ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, వారాహి అమ్మవారికి కుంకమ పూజలు నిర్వహించారు. నాటి రాజు పాలన, సైనిక శక్తి, ఆలయాల అభివృద్ధి, శ్రీముఖలింగం రాజధానిగా చేసుకొని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మించిన ఆలయాలు, శాసనాలను ఒడిశా ప్రాజెక్టు అధికారి విష్ణు మోహన్ వివరించారు. నాటి కట్టడాలు విశిష్టతను కటక్ చాపర్ కో కన్వీనర్ దీపక్‌కుమార్ నాయక్ తెలియజేశారు. గంగదేవుడి చిత్రపటాలతో ప్రదక్షిణలు చేసి ఆలయ కార్యాలయంలో భద్రపరిచారు. కళింగ రాజ్యంతోపాటు జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన దానాలు, తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలను పీఏఎస్ కార్యదర్శి, కో కన్వినర్ మురళీధర్, తరుణ్ సింగ్‌లు వివరించారు. భావితరాలకు ఆనాటి రాజుల చరిత్ర తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
టోకరా
విదేశీ ఉద్యోగాల పేరిటవిదేశీ ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులు అప్పు చేసి డబ్బులు చెల్లించాను మాది టెక్కలి మండలం గోకర్లపల్లి. ఇటలీలో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుందని స్నేహితుల ద్వారా తెలుసుకొని రెండో బ్యాచ్‌గా ఇచ్ఛాపురం సూర్యా లాడ్జిలో మొదటి విడతగా రూ.30వేలు చెల్లించాను. తర్వాత హైదరాబాద్‌లో రూ.1.28లక్షలు ఇచ్చాను. ఇటలీలో మంచి ఉద్యోగం అని చెప్పడంతో మా పేరెంట్స్ అప్పు చేసి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అంతా బోగస్ అంటున్నారు. – పడాల గణేష్, టెక్కలి మండలం స్థానికుల పరిచయంతో బలయ్యా.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామం మాది. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఏజెంట్ ధర్మరాజు మా పక్క ఒడిశాకు చెందిన వ్యక్తి కావడంతో పాటు మా ప్రాంతంలో ఏజెంట్‌కు బంధువులు ఉండటంతో వారి ద్వారా నమ్మి ఇచ్ఛాపురం లాడ్జీలో రూ.50వేలు చెల్లించాను. ఇటలీలో వైన్ ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఇచ్ఛాపురం గవర్నమెంట్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ల్యాబ్‌లో మాకు మెడికల్ టెస్ట్‌లు జరిగాయి. ఈ రోజు ఉదయం ‘అంతా బోగస్...మోసపోయాం’ అంటూ మెసేజ్ పెట్టడంతో మాకుతెలిసింది. మాకు న్యాయం జరగాలి. – సాహుకారి భానుప్రకాష్, ధర్మపురం, ఇచ్ఛాపురం మండలం ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం కేంద్రంగా జరిగిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట సుమారు 350 మందికి టోకరా వేసి సుమారు ఆరున్నర కోట్ల రూపాయలతో ఓ ప్రబుద్ధుడు పరారయ్యాడు. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మరాజు పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులతో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇటలీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని స్థానికులైన కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)లతో ఉన్న బంధుత్వంతో ప్రచారం చేసుకున్నాడు. ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్లు కంపెనీలో ప్యాకింగ్ వంటి ఆకర్షణీయమైన ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మబలకడంతో జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు ఈయన వలలో పడ్డారు. ఇచ్ఛాపురం కేంద్రంగా ఓ లాడ్జిని తీసుకొని తొలి విడతలో గత ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి వారి దగ్గర రూ.ఇరవై వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్ష లు చొప్పున వసూలు చేశాడు. అలాగే నెల తిరక్క ముందు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ పేరిట 175 మంది వద్ద రూ.1.35 లక్షలు చొప్పున, ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీమారుతీ ఇన్స్టిట్యూట్లో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి వారి వద్ద నుంచి రూ.50వేలు చొప్పున వసూలుతో పాస్‌ఫొటోలు తీసుకున్నాడు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఇటలీ వెళ్లేందుకు సిద్ధం కావాలని నమ్మబలికాడు. ఇచ్ఛాపురం పట్టణలోని ఓ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది యువకులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి యువకులను మరింత నమ్మించాడు. ఈ మెడికల్ టెస్ట్‌లో ఒక్కోక్కరి వద్ద రూ.2,500 నుంచి రూ.3,200 వరకు వసూలు చేసినట్లు యువకులు విలేకరులకు తెలిపారు. అంతా బోగస్సే.. ఇటలీ వెళ్లేందుకు మొదటి విడతలో 30 మంది ఢిల్లీ వచ్చి పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కోరడంతో జిల్లా నుంచి శుక్రవారం ఢిల్లీ వెళ్లిన యువకులకు ఆదివారం రాత్రి పిడుగులాంటి వార్త చెవిన పడింది. ఇక్కడ ఇలాంటిది ఏమీ లేదని, అంతా బోగస్ అని తెలియడంతో లబోదిబోమన్నారు. ఇటలీ వెళ్లేందుకు డబ్బులు చెల్లించిన నిరుద్యోగుల గ్రూపులో సోమవారం ఉదయం ఏజెంట్ ధర్మరాజు వాయిస్ మెసేజ్ పెడుతూ ‘సారీ గయ్స్... మనమంతా మోసపోయాం. మీతో పాటు నేనూ కూ డా మోసపోయాను’ అంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేయ డంతో అందుబాటులో ఉన్న యువకులంతా సోమ వారం ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐ ఎం.చిన్నంనాయుడును కలసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. తామంతా మోసపోయామని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. పట్టణం పోలీస్ స్టేషన్లో బాధిత యువకులు ఫిర్యాదు చేసినట్లు బాధిత యువకులు తెలిపారు. జిల్లాలో 350 మంది బాధితులు ఇచ్ఛాపురం కేంద్రంగా మోసం -
విద్యార్థుల జీవితాలతో ఆటలా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనతో విద్యార్థుల బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయని వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజికవర్గ అధ్యక్షుడు దుంపల రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము విడుదల చేసి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ కంటే అధికంగా ఇస్తానని చెప్పి అధికారం చేపట్టాక విద్యార్థులతో ఆడుకోవడం సీఎం చంద్రబాబుకు తగదన్నారు. నిరుద్యోగ భృతి జాడే లేదని, సంపద సృష్టించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన అబద్దాల బాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి యువతను ఆదుకున్నట్లు గుర్తు చేశారు. -
ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ మహాలక్ష్మీనగర్‌లో ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామి వెంకటేశ్వరి రణస్థలం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఆమె ఈ నెల 15న పర్లాకిమిడి వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి 7.45 గంటలకు ఇంటికి రాగానే తలుపులు పగులకొట్టి, తాళాలు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా తెరిచి ఉండటంతో వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.అవతారం ఇన్చార్జి ఎస్సై జి.లక్ష్మణరావులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం ఎస్సై భరత్ ఆధ్వర్యంలో సిబ్బంది రామారావు, శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ వివరాలు సేకరించారు. తులం బంగారం, 300 గ్రాముల వెండి పోయినట్లు ఉందని, ఇంకా పూర్తిగా చూడాల్సి ఉందని బాధితులు చెప్పారు. ఇంటి పరిసరాలు తుప్పలతో నిండి ఉండటం, చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనం సులువుగా జరిగిందని భావిస్తున్నారు. జె.ఆర్.పురం పంచాయతీ మహాలక్ష్మీనగర్‌లో ఘటన రంగంలోకి దిగిన పోలీసులు -
వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు చక్కటి భోజనం, వసతులు కల్పించాలని ఆదేశించారు. కాశీబుగ్గలో ఉద్రిక్తత కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడు రోడ్లు కూడలి వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న పూజా సామగ్రి షాపు తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో జేసీబీతో షాపును తొలగిస్తుండగా దుకాణదారుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి దుకాణదారులను అదుపుచేశారు. ఈ క్రమంలో షాపు యజమాని కఠారి శ్యామ్ ఒంటిపై నూనె పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని శ్యామ్‌ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులను కూడా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో ఎల్.శ్రీరాములుకు చెందిన ఖాళీ కోళ్ల ఫారం సోమవారం దగ్ధమైంది. మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రణస్థలం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రణస్థలం అగ్నిమాపకాధికారి పైల అశోక్ తెలిపారు. జర్నలిస్టులపై దాడులు అమానుషం శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని నినదించారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జె.ఆర్.పురం పోలీస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి తనిఖీ చేసిన ఎస్పీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్, పైడిభీమవరంలోని జిల్లా ఇసుక చెక్‌పోస్టును ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఓ హోంగార్డు, కానిస్టేబుల్ నిద్రపోయి ఉండగా.. అందులో కానిస్టేబుల్ మద్యం సేవించినట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టగా 86 పాయింట్లు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇన్చార్జి ఎస్సై జి.లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా.. కానిస్టేబుల్‌పై విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. కాగా, సోమవారం ఎస్పీ కార్యాలయ టెక్నికల్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అక్రమ ఇసుక తరలింపులో లంచావతారం ఎత్తిన ఓ అధికారిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్న సమయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్‌ను అర్ధరాత్రి తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. -
పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున ఎటువంటి మాస్ కాపీయింగ్, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలను సిద్ధం చేసి పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు వారి స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ● సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డు పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. జిల్లాలో 28,984 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. 149 కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ● ఏపీ సార్వత్రిక విద్యా సంస్థ నిర్వహించే ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షలు కూడా ఎస్ఎస్సీ పరీక్షల సమయంలోనే జరగనున్నాయని కలెక్టర్ చెప్పారు. 807 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, జిల్లాలో 8 కేంద్రాలకు ఎనిమిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ● ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 1553 మంది హాజరు కానున్నారని చెప్పారు. 8 కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ● జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిప్రత్యూష, ఏసీఈ లియాఖత్ అలీఖాన్, జిల్లా ఒకేషనల్ అధికారి తవిటినాయుడు, జిల్లా వైద్యారోగ్య అధికారి బాల మురళీకృష్ణ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్, యూత్ కో–ఆర్డినేటర్ ఉజ్వల్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలకు 28,984 మంది విద్యార్థులు ఓపెన్ టెన్త్ పరీక్షలకు 807 మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 1553 మంది విద్యార్థులు అధికారుల సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
పట్టపగలు చోరీచేసింది పక్కింటోడే..
శ్రీకాకుళం క్రైమ్: గత నెల 22న గార మండలం శాలిహుండంలోని ఓ పండ్లవ్యాపారి ఇంట్లో పట్టపగలు జరిగిన చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాధితుడి ఇంటి పక్కన నివాసముంటున్న ఆటోడ్రైవరే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో.. శాలిహుండం గ్రామానికి చెందిన ఉర్జాన ఆదినారాయణ, రమణమ్మలు సింగుపురం కూడలి వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఉదయం వెళ్తే రాత్రి వరకు తిరిగిరారు. జనవరి 22న ఎప్పట్లాగే ఉదయం ఏడు గంటలకు వ్యాపారానికని వెళ్లిన దంపతులు రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చేసరికి వెనుక తలుపులు తీసివున్నాయి. వాస్తవానికి దంపతులే తలుపులు వేయడం మరిచారు. రమణమ్మ తాను వేసుకున్న బంగారు గాజులు, గొలుసు బీరువాలో పెట్టడానికి తాళాలు వెతకగా కనిపించకపోవడంతో షరాబుని పిలిపించి తెరిపించింది. బీరువాలో తన ఇద్దరు కుమార్తెలకు చెందిన ఆరు తులాల గొలుసు, నాలుగు తులాల హారం, రెండున్నర తులాల నక్లెస్, రెండు తులాల వొంటిపేట గొలుసు కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే గార స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన దర్యాప్తు చేపట్టారు. స్థానికుల పనేనని గుర్తించి ఓ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. అప్పుల బెడద ఎక్కువై.. రమణమ్మ పక్కింట్లో నివాసముంటున్న జోగి రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి వరకు తిరిగి రాని రమణమ్మ ఇల్లే దొంగతనానికి సరైనదని భావించి రెండు, మూడుసార్లు ప్రయత్నించాడు. నాలుగోసారి గత నెల 22న చోరీ చేశాడు. చోరీ సొత్తును రాజు తన ఇంటి మేడపైన హోమ్ థియేటర్ స్పీకర్ బాక్సుల్లో దాచాడు. అప్పుల వారి తాకిడి ఎక్కువైపోవడంతో ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఆరు తులాల ఆభరణాలు తనఖా పెట్టేందుకు బయల్దేరాడు. అప్పటికే రాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఇంటివద్దే అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయాన్ని బయటపెట్టాడు. ప్రతిభకు ప్రశంసలు.. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన, వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుని వద్ద మొత్తం సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వీడిన శాలిహుండం చోరీ కేసు మిస్టరీ పండ్లవ్యాపారి ఇంట్లో 17 తులాలకు పైగా ఆభరణాలు మాయం చేసిన ఆటోడ్రైవర్ అరెస్టు -
విశాఖ ఉక్కుపై బిల్లు పాస్ చేయించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి నిర్ణయం తీసుకోవాలని సమాజ వికాస సేవా సంఘం సభ్యులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో భూకుంభ కోణాలు, స్టీల్‌ప్లాంట్‌కు నాణ్యతలేని బొగ్గును సరఫరా చేసే అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పర్యావరణాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి బొడ్డేపల్లి సత్యనారాయణ, కె.గోపాల్, ఎస్.ధనుంజయ, ఎ.సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆమదాలవలస రూరల్: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్‌కుమార్ అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంభ సభ్యులు చెబుతున్నారు. చిట్టీ డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ చిట్టీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక సోమ వారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు, ఈ మేరకు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ ఎస్.బాలరాజు వద్ద బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అయోడిన్ లోపంపై అవగాహన
అరసవల్లి: అయోడిన్ లోపంతో శరీరంలో వచ్చే మార్పులు, అనారోగ్య పరిస్థితులపై ఆశావర్కర్లు అవగాహన కలిగి ఉండాలని ఐ.జి.డి. జిల్లా కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆశా వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఇన్‌స్టిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయోడిన్ లోపంతో వచ్చే సమస్యలపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 40 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాంను ఐటీసీ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ట్రైనర్ డాక్టర్ ఎం.చైతన్య మాట్లాడుతూ అయోడిన్ లోపంతో థైరాయిడ్, క్రిటినిజం, ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, బలహీనం తదితర లోపాలు తలెత్తుతాయన్నారు. అయోడిన్‌తో కూడిన ఉప్పును మాత్రమే వినియోగించాలని, ఆకుకూరలు, గుడ్లు, పాలు, బీన్స్, క్యార ట్, బెల్లం, పండ్లను తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ, జిల్లా ఐజీడీ కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అంగన్వాడీలు సుదీర్ఘ పోరాటం చేశారని, ఆ సమయంలో కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, వారి ప్రభుత్వం ఏర్పడినా నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా 2019 నుంచి జీతాలు పెరగలేదన్నారు. దీనికితోడు యాప్‌లు, నూతన విధానాలతో పని భారాలు పెంచుతున్నారని వాపోయారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్. ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.జ్యోతి, జి.రాజేశ్వరి, కె.సంధ్యారాణి, అంజలీభాయ్, కృష్ణభారతి, లక్ష్మి, లక్ష్మినారాయణ, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా -
నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
కాశీబుగ్గ: మందస పట్టణంలో కొలువైన వాసుదేవు ని 16వ బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 1744 సంవత్సరంలో నరసాపురానికి చెందిన తెలికిచెర్ల కందాడ రామాను జాచార్యస్వామి ఇక్కడ సంస్థానాచార్యులుగా ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ రా మనుజ పెద్ద జీయర్ స్వామి, గోపాలాచార్య స్వా మి శిష్యులుగా ఉండేవారు. అప్పట్లో ఇక్కడ ఉన్న వేద పాఠశాలలో పండితులు విధ్యనభ్యసించేవారు. 1950 వరకు ఆలయంలో క్రతువులు జరిగేవి. రాజు ల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆల యం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. చిన్నజీయరుస్వామి వాసుదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి తన గురువు స్మారకార్థం జీర్ణోద్ధరణ చేసేందుకు సంకల్పించి 2001 నుంచి పున:నిర్మాణ పనులను చేపట్టారు. 2009లో ఆలయాన్ని పునఃప్రతిష్టించారు. ఆలయంలో రాజుల పాలన కా లంలో ఉన్న విగ్రహాన్నే పునఃప్రతిష్టించారు. ఆలయంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ విగ్రహ నిజరూ పం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం మాదిరిగానే ఉంటుంది. బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు ఈ నెల 17వ తేదీ సోమవారం ఆంజనేయస్వామి అభిషేకం. 18న శ్రీవాసుదేవ పెరుమాళ్ అభిషేకం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, అంకురారోపణం. 19న గరుడపూజ, ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ. 20న కల్పవృక్ష వాహనము, ఎదుర్కోలు ఉత్సవం. 21న శ్రీ వాసుదేవ్ పెరుమాళు కల్యాణ మహోత్సవం, గరుడవాహన సేవ. 22న పొన్నచెట్టు వాహనము, తెప్పోత్సవం, అశ్వవాహనము 23న రథోత్సవ, చక్రస్నానం, ద్వాదశరాధన, శ్రీపుష్పయాగం. -
‘ఆదిత్యుడిని తలచుకున్నాకే పాట’
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నిత్యం తలచుకున్నాకే తన గీతాలాపన ప్రారంభమవుతుందని సినీ గాయని సునీత అన్నారు. ఆదివారం ప్రత్యేకంగా ఆమె సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్వామి ప్రసాదించిన ఆరోగ్యంతోనే గత రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో పాటలు పాడుతున్నానన్నారు. తన కెరీర్లో 9 నంది అవార్డులతో పాటు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్లో గుర్తింపు రావడం నిజంగా తన అదృష్టమన్నారు. అంతకుముందు సూర్యనమస్కారాల పూజల ను తిలకించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేదాశీర్వచనాన్ని అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ తదితరులు పాల్గొన్నారు. ‘థర్మల్ ప్లాంట్‌తో అభివృద్ధి బూటకమే’ సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం అంతా బూటకమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కు ల వేదిక కన్వీనర్ వీఎస్ కృష్ణ తెలిపారు. ఆదివారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసాన్‌పుట్టి, బొడ్లపాడు, తిమడాం, జంగాలపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశం నిర్వహించారు. పచ్చని పంటపొలాల్లో థర్మల్ ప్లాంట్ నిర్మాణ ఆలోచనలు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ నిర్మా ణం వల్ల వందలాది ఎకరాల పంట భూములతోపాటు, మానవాళి మనుగడే ప్రఽశ్నార్థకంగా మారుతుందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు 2050 నాటికి థర్మల్ ప్లాంట్లు మూసివేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కొత్తగా ఈ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చే స్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాబోయే ప్రమాదాన్ని ముందు గానే అరికట్టి, భావితరాల భవిష్యత్‌ను కాపా డుకోవాలంటే పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన విరమించేవరకు కలసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథం, ప్రసూనకర్త అనురాధ, జిల్లా కార్యదర్శి సురేష్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చౌదరి లక్ష్మణరావు, ఆదివాసీ సంక్షేమపరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వంకల మాధవరావు, థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి అత్తులూరి రవికాంత్, కోశాధికారి సింహాచలం పాల్గొన్నారు. అంధకారంలో మార్చురీ టెక్కలి: టెక్కలి జిల్లా ఆస్పత్రికి చెందిన మా ర్చురీ విభాగం సుమారు నెల రోజులుగా అంధకారంలో ఉంది. పాత ఆస్పత్రికి ఆనుకుని ఉన్న మార్చురీ విభాగానికి చెందిన విద్యుత్ సరఫరా వైర్లను నెల రోజుల కిందట దుండగులు చోరీ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ విభాగానికి విద్యుత్ సరఫరా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక్కడ రెండు ఫ్రీజర్లు ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. అయితే దానికి సైతం విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో చీకటి పడిన తర్వాత తీసుకువచ్చిన మృతదేహాలను భద్రపరచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో తీసుకువచ్చిన మృతదేహాలతో పాటు కుటుంబ సభ్యులు రేయింబవళ్లు చీకట్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి మార్చురీ విభాగానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి
పొందూరు : పొందూరు పరిధిలోని అలబోయినపేట మంగళకాలనీ సమీపంలో కుక్కలు మూకుమ్మడిగా చేసిన దాడి చేయడంతో ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగల శ్యామల తీవ్రంగా గాయపడింది. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న శ్యామల స్నేహితులతో కలిసి సమీపంలో పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. నాలుగు కుక్కలు వెనుక నుంచి ఒక్కసారిగా అరుస్తూ దూసుకొచ్చాయి. కుక్కల అరుపులకు పిల్లలంతా భయపడి పారిపోగా శ్యామలకు వినిపించకపోవడంతో అక్కడే ఉండిపోయింది. స్నేహితులు ఎందుకు పరుగుపెడుతున్నారో తెలుసుకునేలోగానే నాలుగు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కాళ్లు, చేతులు, పొట్టభాగంలో గాయాలయ్యాయి. ఇంతలో అటుగా వస్తున్న గ్రామస్తులు కుక్కలు తరిమి చిన్నారిని కాపాడారు. చిన్నారిని పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఆదాయానికి మద్యమే మార్గమంటూ..
● గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్న టీడీపీ నాయకుడు ● కపాసుకుద్ది కేంద్రంగా బెల్టులకు మద్యం సరఫరా ● మత్స్యకార గ్రామాలకు అధికంగా మద్యం పంపిణీఇచ్ఛాపురం రూరల్: కొత్త మద్యం పాలసీతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాలకు అక్రమంగా మ ద్యం తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కవిటి మండలం మత్స్యకార గ్రా మానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇలా మద్యం సరఫరా చేసిన వైనం వెలుగు చూడడంతో అతను ప్రస్తుతం పరారైపోయాడు. ఈ నాయకుడు ప్రస్తుతం మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా, రేషన్ షాపు డీలర్ ప్రతినిధిగా పరపతి సంపాదించాడు. తన వ్యాపారానికి కవిటి మండలం కపాసుకుద్ది కేంద్రంగా చేసుకుని ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి కపాసుకుద్ది, కర్రివారిపాలెం, ఇద్దివానిపాలెం, బెజ్జిపుట్టుగ, బొరివంక, కుసుంపురం, బల్లిపుట్టుగ వరకు బెల్టు షాపులను ఎంచుకొని ఇచ్ఛా పురం మండలం కొఠారీ వైన్ షాపుల వద్ద నుంచి రాత్రి సమయాల్లో సరుకును తీసుకొని పై గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం ఇచ్ఛాపురం రూరల్ పోలీసులకు సుమారు రెండు లక్షల రూపాయల మద్యం దొరకడంతో.. సరుకును తీసుకువెళ్తున్న వ్యాను డ్రైవర్ ఈ ‘బాబు’ బండారాన్ని బయటపెట్టేశాడు. దీంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ నేత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికో రేటు.. గ్రామాల్లో బెల్టు షాపును నిర్వహించేందుకు గ్రామానికో రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మత్స్యకార గ్రామాల్లో రెండేసి బెల్టు షాపులు చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో బెల్టు షాపు నుంచి గ్రామానికి రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఒక రేటు, ఎకై ్సజ్ శాఖ స్టేషన్‌కు ఒక రేటును నెలవారీ మామూళ్లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం పాన్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే అడ్డా.. గత ప్రభుత్వంలో ఎక్కడా బెల్టు షాపుల ఊసే లే దు. ఒకవేళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులు, సెబ్ అధికారులు దాడు లు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేవా రు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోని పాన్‌షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను ఏకంగా మినీబార్లుగా మార్చేశారు. ఇక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తూ రోజంతా మందుబాబులకు సరుకు అందిస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులు క్వార్టర్ బాటిల్‌కు రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. ఈ బెల్టుషాపులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పాన్ షాపుల వద్ద బహిరంగంగా మద్యం తాగుతున్న మందుబాబులుఅక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. సిబ్బందితో ముమ్మరంగా దాడులు చేయించి ఇప్పటికే అరెస్టులు, కేసులు నమోదు చేయడం జరిగింది. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం నేరం. వైన్ షాపులు బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. – పి.దుర్గాప్రసాద్, సీఐ, ఎకై ్సజ్ శాఖ, ఇచ్ఛాపురం -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థు లు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొ లి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొ త్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీఓ)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. ● 27న జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం ● 18న తొలి విడత శిక్షణ తరగతులు ● 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ -
ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలి
శ్రీకాకుళం: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయి లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. ఆదివారం జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులతో ఆర్ట్స్ కళాశాలలోని ప్రాంగణంలో గల ఆర్ఐఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షణ అధికారి, పరీక్ష కమిటీ సభ్యులు, ప్రిన్సిపాళ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆయన సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.దుర్గారావు మాట్లాడుతూ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి ఏడాది 20,389 మంది, రెండో ఏడాదికి 19,967 మంది పరీక్ష రాస్తారని తెలిపారు. పర్యవేక్షణకు 1600 మంది ఇన్విజిలేటర్లు, 1480 సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షా కమిటీ సభ్యులు భీమేశ్వరరావు, నారాయణరావు, సింహాచలం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
నరసన్నపేటలో గంజాయి కలకలం
నరసన్నపేట : నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో గంజాయి వినియోగం ఒక్కసారి బట్టబయలైంది. ఒకేసారి 9 మంది అరెస్టు కావడంతో కలకలం రేగింది. స్థానికంగా గంజాయి అమ్మకాలు, వినియోగం జరుగుతుందని గమనించిన పోలీసులు దీనిపై నిఘా వేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా చేతులు మారుతున్నట్లు అనుమానంతో ఇటీవల సోదాలు చేశారు. అప్పట్లో ఏమీ లభించలేదు. శనివారం స్థానిక వెంకటేశ్వరాలయం ఎదురుగా రాజులు చెరువు గట్టుపై ఉన్న వీధిలో పసుపుల రమణ ఇంటి వద్ద కొందరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.66 వేల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు గంజాయిని వినియోగిస్తున్నారు. వీరిని విచారించగా మిగిలిన వారూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 9 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. స్థానిక ట్యాంకు బండ్ వీధికి చెందిన కోట ప్రతీప్, శ్రీరాంనగర్‌కు చెందిన లిమ్మా రాహుల్, పెద్దపేటకు చెందిన అరసవల్లి వరప్రసాద్, జగన్నాథపురానికి చెందిన దనిమిశెట్టి అజయ్, హనుమాన్‌నగర్‌కు చెందిన గొడ్డు రాఘవేంద్ర, బొంతల వీధికి చెందిన పొన్నాడ అజయ్, మేదర వీధికి చెందిన బెహరా హరి, శ్రీకాకుళం సానా వీధికి చెందిన తట్టా హేమంత్, పోలాకి గొల్లలవలసకు చెందిన దంత పునీత్‌లను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వీరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ● 22 కేజీలు స్వాధీనం.. 9 మంది అరెస్టు -
రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లో
తనిఖీలతో ఆగిన లారీలు● జిల్లాలోని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉన్నతాధికారులు సీరియస్ ● అక్రమ రవాణాను క్యాష్ చేసుకున్న అధికారిపైనే ప్రధానంగా ఫోకస్ ● సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం ● అధికారికి లారీకి రూ. 2వేలు చొప్పున ముడుతున్నట్టు భోగట్టా సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా నుంచి అక్రమ ఇసుకను దగ్గరుండి సరిహద్దులు దాటిస్తున్న ‘లంచావతారం’పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సెలవు రోజైనా ఆదివా రం కూడా ఇదే విషయమై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అధికారి ఒక్కో లారీకి రూ.రెండేసి వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాంపులో ఇసుక ఎత్తినందుకు రూ.వెయ్యి, అక్రమ రవాణా చేసినందుకు రూ.వెయ్యి వసూలు చేసి లబ్ధిపొందుతున్నట్టు సమాచారం. జరుగుతున్న భాగోతంపై ‘సాక్షి’లో కథనం వచ్చాక విస్తృతంగా చర్చకు దారి తీసింది. అధికారిక ర్యాంపులు ఏడే.. జిల్లాలో అధికారికంగా 11 ఇసుక ర్యాంపులు నడిచేవి. ఇందులో రీచ్‌లతో పాటు డీ సిల్టేషన్ ర్యాంపులున్నాయి. వీటిలో గార, ముద్దాడపేట, కాఖండ్యాం, బట్టేరు రీచ్లకిచ్చిన ఏడాది గడువు ముగిసింది. దీంతో అధికారికంగా నడుస్తున్నవి ఏడు రీచ్‌లే. కానీ, గడువు తీరిన రీచ్‌లతో పాటు అనధికారికంగా వంశధార, నాగావళి నదీ తీరం పొడవునా ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసు క ర్యాంపులు నడుస్తున్నాయి. మంచినీటి ఇన్‌ఫిల్టరేషన్ బావులు, సంపులు, వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వేసి తరలించేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో దూసి, ఇసుకలపేట, దిబ్బలపేట, తొగరాం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, పాతూరు, నారాయణపురం, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొరపాం, తోటాడ, సింగూరు, చెవ్వాకులపేట, సవలాపురం, శ్రీకాకుళం నియోజకవర్గంలోని బైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొన్నాం, బట్టేరు, నైరా, గార, నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీముఖలింగం, దొంపాక, లుకలాం, బుచ్చిపేట, ఉర్లాం, చేనులవలస, గోపాలపెంట, పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు, హిరమండలం మండలాల్లోని పలు గ్రామాల నదీ తీరంలో అక్రమంగా ఇసుక ర్యాంపులు నడిచాయి. దీంతో పాటు గడువు ముగిసిన గార, బట్టేరు, కాఖండ్యాం, ముద్దాడపేట రీచ్‌ల్లో కూడా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెళ్లి తనిఖీలు చేయడంతో వాటిలో కాస్త తవ్వకాలు ఆగాయి. రాత్రి పూట మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి. అనధికార ర్యాంపుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్న 10టైర్ల లారీకి రూ. 12వేలు, 12టైర్ల లారీకి రూ. 14వేలు, 14టైర్ల లారీకి రూ. 16వేలు, 16టైర్ల లారీకి రూ. 18వేలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్ గ్రీవె న్స్‌కు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇలా మొత్తం తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టుగా అ క్రమ తవ్వకాలు, తరలింపులో నాయకులతో పాటు పలువురు భాగస్వామ్యం కావడంతో అక్రమ సొ మ్ముకు కక్కుర్తిపడే అధికారులకు పంట పండింది. క్యాష్ చేసుకున్న ఆ అధికారి అక్రమ రవాణా అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రణస్థలం మండలం పైడి భీమవరం సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యే క దళాలకు చెందిన సిబ్బందిని తనిఖీల కోసం నియమించారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా అక్రమ రవాణా సాగుతోంది. ఇక ఉదయం నకిలీ బిల్లుల సాయంతో వందలాది లారీలు జిల్లా దాటేస్తున్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని లంచావతారం ఎత్తిన ఓ అధికారి క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమార్కులతో అధికారికి లింకులు విశాఖకు చెందిన లారీ యజమానులతో పాటు అనధికార ర్యాంపులు నిర్వహిస్తున్న నిర్వాహకులతో డీల్ కుదుర్చుకుని పథకం ప్రకారం జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇచ్ఛాపురానికి చెందిన ఓ లారీ య జమాని విశాఖలో ఉంటూ ఆయనకు బాగా సహకరిస్తున్నారు. ఆ యజమానికి సొంతంగా 13లారీలు ఉండటం, ఆ వ్యక్తికి లంచావతారమెత్తిన అధికారికి సన్నిహిత సంబంధాలుండటంతో ఈ యజమాని మరికొంతమంది లారీ యజమానులతో ఒప్పందం కుదిర్చి జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఇసుక కొరత ఉన్న మొదట్లో లారీకి రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు ముడుపులు తీసుకోగా, ప్రస్తుతం లారీకి రూ. 2వేలు చొప్పున తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇందులో సగం అక్రమ ర్యాంపుల నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రికార్డెడ్‌గా రోజుకి 150నుంచి 180వరకు లారీలు తరలివెళ్తున్నట్టు తెలిసింది. అనధికారికంగా ఎన్ని లారీలు వెళ్తున్నాయో యజమానులకే తెలియాలి. ఇలా, రికార్డయిన అయిన లారీలను జా యింట్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేసేసరికి 28 లారీల్లో 12లారీలు నకిలీ బిల్లులతో తరలిస్తున్నట్టుగా గుట్టు రట్టు అయింది. సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్న విషయం తెలుసుకుని దానికి ముందు కొంత దూరంలో 50వరకు లారీలు చాలా సేపు నిలిచిపోయాయి. ఆ తర్వాత రణస్థలం, సతివాడ, రామతీర్థం మీదుగా మళ్లించేశారు. ప్రస్తుతం కూడా ఈ రూట్లోనే అక్రమ రవాణా సాగుతోంది. జయహో.. రాజమ్మ తల్లి వత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం యాత్ర ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఉన్నతాధికారి ఆరా జిల్లాలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నకిలీ బిల్లులపై జిల్లా ఉన్నతాధికారి సీరియస్‌గా దృష్టిసారించారు. ముఖ్యంగా సరిహద్దులో లంచావతారం ఎత్తిన అధికారి కోసం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఎవరా అధికారి అని నిఘా వర్గాల ద్వారానే వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇసుక వ్యవహారంలో సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. -
ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో మాఘమాస సందడి నెలకొంది. మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇతర జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలపై క్షీరాన్నాన్ని వండి ఆదిత్యునికి నివేదించారు. తలనీలాల మొక్కులు తీర్చుకుని ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి వేకువజామున 6 గంటల నుంచే ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో సర్వదర్శనాలకు సిద్ధం చేశారు. భక్తులకు ఎండ వేడి నుంచి రక్షణగా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో దర్శన మార్గాల్లో టెంట్లు వేయించారు.మంచినీటిని సరఫరా చేయించారు. మరుగుదొడ్లు విషయంలో మాత్రం భక్తులు అవస్థలు పడ్డారు. పలువురు అధికారులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి రావడంతో వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.8.15 లక్షలు, విరాళాలు, ప్రత్యేక పూజలు టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,08,740, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 2.25 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో ప్రకటించారు. -
డీఎస్సీ–2003 టీచర్లకు పాతపెన్షన్ అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డీఎస్సీ–2003 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ వెలువడిన 2003 సమయంలో సీఎంగా చంద్రబాబునాయుడే ఉన్నారని.. ఆరోజు నియామకాల జాప్యానికి నాటి ప్రభుత్వాలే కారణమని చెప్పారు. ప్రభుత్వ జాప్యానికి ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం తగదని.. పాతపెన్షన్‌ను అమలు చేయకుటే ఉద్యమబాట పడతామని ఫోరం ప్రతినిధులు స్పష్టంచేశారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కళింగభవన్‌లో డీఎస్సీ 2003 ఉత్తరాంద్ర ఫోరం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ ఉపాధ్యాయ సాధన సమితి సమావేశం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్ 13న విడుదలైనప్పటికీ నియామకాలు 2005 నవంబర్‌లో చేపట్టి.. రెండేళ్లపాటు ప్రభుత్వం జాప్యం చేసిందని, తమను బలవంతంగా సీపీఎస్ విధానంలోకి నెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన 7361 మంది ఉపాధ్యాయులకు, హోంశాఖ కు చెందిన 1800 మంది కానిస్టేబుళ్లకు, గ్రూప్–2, గ్రూప్–1, హెల్త్ విభాగానికి చెందిన 1800 మందికి మొత్తం 11,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపచేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఇది ఆర్థిక భారమైన డిమాండ్ కాదని.. న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని దానికి అవసరమైన అన్ని రకాల సహకారం ఏపీ ఎన్న్జీవో సంఘం తరఫున అందిస్తామన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాంప్రసాద్ మాట్లాడుతూ మెమో 57 ప్రకారం 15 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేశాయన్నారు. ఇక్కడ అమలు చేసి 16వ రాష్ట్రంగా నిలవాలని కోరారు. ఫోరం జిల్లా కన్వీనర్ పి.శ్రీహరి మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలవాలన్నారు. సమావేశంలో సుబ్బారెడ్డి, విజయనగరం కన్వీనర్ రవి, విశాఖ కన్వీనర్ షేక్ మహ్మద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గాదె శ్రీనివాసులునాయుడు, కోరేడ్ల విజయ్గౌరి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వన్ స్టేట్ వన్ అసోసియేషన్ రాష్ట్ర అడహాక్ కమిటీ కన్వీనర్ కె.గోవిందరావు, రాష్ట్ర స్థాయి క్రియాశీలక నాయకులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు, రాజమండ్రికి చెందిన సీనియర్ మాజీ సైనికులు, న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్ హాజరయ్యారు. మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మృతి చెందారు. అరకబద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి(63) ఆదివారం ధర్మపురం బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ధర్మపురం–ఈదుపురం రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. పంట పొలాల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య సీతమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేసిన కృష్ణారెడ్డి మృతి పట్ల జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంపత్ని చిట్టిబాబు, నాయకులు సంతాపం తెలియజేశారు. -
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న ఆటో పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా, మిగిలిన ముగ్గురూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన వీరంతా ఆటోలో నిమ్మాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌హెచ్ పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి తగిన సహాయం అందించారు. మంత్రిని కలిసిన వెటర్నరీ సిబ్బంది కాశీబుగ్గ: తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ వెటర్నరీ(1962) వాహనం సిబ్బంది ఆదివారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడం భావ్యం కాదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెటర్నరీ వాహనాల నిర్వహణ అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, 104లా చిన్న వాహనం పెట్టేందుకు ఆలోచిస్తున్నామని, జీవీకే సంస్థకు రూ. 150 కోట్ల బకాయి ఉందని తెలియజేశారు. ఈ సమస్యలన్నీ తేలాక మళ్లీ పిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం అన్యాయమని, ఉద్యోగుల కోసం నిరహార దీక్షలు చేస్తామని సీఐటీయూ అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. -
● కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం
కారులో మంటలు టెక్కలి: మండలంలోని నరసింగపల్లి సమీపంలో ఆదివారం ఓ కారు నుంచి హఠాత్తుగా మంటలు రావడంతో యజమాని గమనించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన బెండి ఉదయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో పర్లాఖిమిడి వైపు వెళ్తుండగా, నరసింగపల్లి సమీపంలో రోడ్డుపై వేసిన మినుము మొక్కలు ఇంజిన్లోకి వెళ్లి రాపిడికి మంటలు వ్యాపించాయి. ముందుగా పొగలు రావడంతో గమనించిన ఉదయ్ ఒక్కసారిగా అప్రమత్తమై కారును నిలిపివేసి హుటాహుటినా కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం గ్రామస్తుల సాయంతో మంటలపై నీరు చల్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ఇంజిన్, అడుగు భాగం దెబ్బతింది. -
వ్యక్తి ఆత్మహత్య
ఇచ్ఛాపురం రూరల్: మద్యానికి బానిసైన వ్యక్తి గెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురం గ్రామానికి చెందిన పైల నూకయ్య(58) మద్యానికి బానిసయ్యాడు. శారీరక సమస్యలతో బాధపడుతూ రెండు రోజుల క్రితం గ్రామానికి కొంత దూరంలో ఉన్న దండుగెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం శవమై తేలడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. నూకయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐఎఫ్ఈఏ చీఫ్ ప్యాట్రన్ కె.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(1938) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అద్యయన తరగతులు నిర్వహించారు. ఏపీటీఎఫ్ కార్యకర్తలకు ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నూతన విద్యా విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బి.రవి, జిల్లా గౌరవ అధ్యక్షులు టెంక చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లు పట్టివేత గార: ఉత్తరాంధ్రలో పేరున్న వత్సవలస రాజులమ్మ తల్లి యాత్రలో అనధికార మద్యం వ్యాపారం జోరందుకుంది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ యాత్రకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో అనధికార మద్యం వ్యాపారం జరగ్గా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 10 బాటిళ్లు, మరొక వ్యక్తి నుంచి 15 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు ఆర్.మహేష్‌బాబు, బి.రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఓల్డేజ్ హోమ్‌లో గుర్తు తెలియని బాలిక బూర్జ: మండలంలోని పాలవలసలో సహాయమాత ఓల్డేజ్ హోమ్‌లో గుర్తు తెలియని బాలిక ఉందని, ఈమె వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్వాహకులు ఆదివారం బూర్జ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నరసన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అమ్మాయి గాయపడటంతో స్థానికులు కొందరు శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారని, కాళ్లు విరగడంతో కొన్ని రోజులు అక్కడే ఉంచి చికిత్స అందించారని, ఆమె ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని, కనీసం పేరు కూడా చెప్పడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిమ్స్ సిబ్బంది 2023 డిసెంబరు 31న ఓల్డేజి హోమ్‌లో చేర్పించారని, ఇంతవరకు బాలిక కోసం కుటుంబ సభ్యులు రాలేదని, వారి వివరాలు కనుక్కోవాలని కోరారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి కాశీబుగ్గ: తిరుపతి–పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. విశాఖపట్నం వద్ద రైలు ఎక్కిన 40 ఏళ్ల తప్పతాగి ఉన్నాడని, పలాస రైల్వే స్టేషన్ వచ్చేసరికి మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడి వివరాలు లభించలేదని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తిలోదకాలు
సర్వీస్ రూల్స్‌కు.. ● బీసీ సంక్షేమశాఖ రూటే సెప‘రేటు’ ● నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఆపై పదోన్నతులు ● ముడుపులు చెల్లిస్తే అక్రమాలన్నీ సక్రమాలే శ్రీకాకుళం పాతబస్టాండ్: బీసీ సంక్షేమ శాఖలో సర్వీస్ రూల్స్‌కు తిలోదకాలిస్తున్నారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఇక్కడ పదోన్నతుల వ్యవహారం సాగుతోంది. అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్)గా విధుల్లోకి చేరిన వారు, కుక్‌గా చేరిన వారు ఒక్క సారిగా మూడు కేడర్లు దాటి వసతి గృహ సంక్షేమాధికారిగా పదోన్నతులు పొందుతున్నారు. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు.. ఆ సర్టిఫికెట్ నకిలీదా వాస్తవమైనదా అన్నది పరిశీలించకుండానే పదోన్నతులు కట్టబెట్టేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించి ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు, అడ్డగోలుగా పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మాకొట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ●2006లో జీఓ 36 ప్రకారం 10 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారిచేసింది. అప్పటికి అర్హత ఉన్నవారి ప్రకారం 8 మందికి పదోన్నతులు కల్పించాల్సింది. అయితే ఈ జీవోని తుంగలోకి తొక్కి అధికారులే సొంత జీవోను తయారు చేసుకొని కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 25 మంది కింది స్థాయి ఉద్యోగులకు వార్డెన్లుగా (హెచ్‌డబ్ల్యూఓ) పదోన్నతులు కల్పించారు. ఈ ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయో..ఏ జీవో ప్రకారం పదోన్నతుల కల్పించారో వారికే ఎరుక. ఇటువంటి పదోన్నతుల పర్యవసానంగానే గతంతో ఇక్కడ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఇప్పటికీ పెన్షన్ రాలేదు. అంతేకాకుండా ఆ కేసులు కూడా తేలలేదని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆ తర్వాత డీబీసీడబ్ల్యూఓగా వచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిణి కి కూడా కేసుల బెడద తప్పలేదు. ● జీవో ప్రకారం పదోన్నతి పొందిన వారు మూడేళ్లలోపే బీఈడీ పూర్తి చేయాలి. అలా పూర్తి చేయకపోతే తిరిగి సబార్డినేట్ పోస్టుకి వెళ్లాలి. ఇక్కడ మాత్రం పదోన్నతి పొందడమే తప్ప ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక వేళ ఎవరైనా డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చినా అవి నిజమైనవా నకిలీవా అన్న దర్యాప్తు కూడా చేపట్టడం లేదు. ● ఏ ఉద్యోగికై నా పదోన్నతి పొందాక రెండేళ్లలోపు డిపార్ట్మెంట్ టెస్టులు రాయాలి. అంటే ఎస్ఓ–1 ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే పాత కేడర్‌కే రివర్ట్ చేయాల్సి ఉంది. ఆ నిబందన కూడా ఈ శాఖలో ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఇటువంటి వాటిని ఆ ఉద్యోగులకు బూచిగా చూపించి కొందరు జిల్లా స్థాయి అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖలో డబ్బులిస్తే చాలు ఉన్నతాధికారులను, ఆపై ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించడంలో కొందరు ఘనాపాటిలు ఈ శాఖలో తిష్ఠ వేశారు. ● బీసీ సంక్షేమశాఖలో ముఖ్యంగా జోన్–1లో రూల్ 16 హెచ్ నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 2008లో సీనియారిటీ లిస్ట్ ఇచ్చారని, మరలా ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని వార్డెన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రూల్ 16హెచ్ పక్కను పెట్టి సీనియారిటీ పేరిట కొత్తగా అవినీతి పదోన్నతులు పేరిట ఫైల్‌ను తయారుచేసి మరోసారి కలెక్టర్, ఇతర అధికారులను తప్పుతోవ పెట్టించే ప్రయత్నం ఈ శాఖలో మొదలైందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తప్పుడు పదోన్నతులు ఇవ్వడం ఈ శాఖకు అలవాటుగా మారిందని ఆ ఆద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సెటిల్డ్ సీనియారిటీ మార్చే అధికారం ఎవరికీ లేదు. 2008లో ఇచ్చిన సెటిల్డ్ సీనియార్టిని ఒక వేళ మార్పు చేయాలంటే మూడేళ్లలోపే మార్చే అధికారం ఉంటుంది. అప్పుడు చేయకుండా ఇప్పుడు మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ● లావేరులో పనిచేసిన ఓ అటెండర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో వార్డెన్‌గా పదోన్నతి పొందినట్లు ఆ శాఖ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆయనతో పాటు పదోన్నతి పొందిన ఇద్దరు ఉద్యోగ విరమణ పొందినా క్రమశిక్షణ చర్యలు క్రింద పెన్షన్ నిలుపుదల చేశారు. దీనిని బట్టి కొంతమందికే క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందికి మినహాయింపులు ఉంటాయనేది అర్ధం చేసుకోవచ్చు. ● ప్రధానంగా జిల్లా అధికారికి, కార్యాలయ సిబ్బందికి, అస్మదీయులకు అనుకూలంగా ఫైల్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నష్టపోయినవారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యలు, వివాదాలతో కూనరిల్లుతున్న ఈ సంక్షేమ శాఖ మరింత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ శాఖ జిల్లా కార్యాలయంలో అధిక శాతం మంది కారుణ్య నియామకం పొందినవారే. వారికి సర్వీస్ రూల్స్‌పై అవగాహన లేకపోవడం, అధిక వేతనంపై ఆశతో తప్పులమీద తప్పులు చేస్తున్నారని ఆ శాఖలో కొంతమంది ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. -
దేవుడా.. ప్రమాదం తప్పింది
● చెరువులో పడిపోయిన స్కూల్ బస్సు ● స్థానికుల స్పందనతో నిలబడిన విద్యార్థుల ప్రాణాలు ● ఐదుగురు విద్యార్థులకు గాయాలు కాశీబుగ్గ: మందస మండలం ఉమాగిరి వద్ద స్కూల్ బస్సు శనివారం చెరువులో పడిపోయింది. బస్సులో ముప్పై మంది ఉండగా.. ఐదుగురు గాయపడ్డారు. మిగతా వారు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మందస మండల కేంద్రంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులతో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మందస నుంచి భైరిసారంగిపురం, బెల్లుపటియా, పెడంగో, బుడార్సింగి గ్రా మాలకు బయల్దేరింది. ఉమాగిరి వద్ద చెరువు పక్కన కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్న ప్రదేశంలో.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి బస్సు చెరువులో పల్టీ కొట్టింది. దీంతో పిల్లలంతా ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. అక్కడున్న స్థానికులు వెనువెంటనే స్పందించి పిల్లలను, బస్సు సిబ్బందిని బయటకు తీశారు. చెరువులో నీరు తక్కువగా ఉండ డంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ బుడార్సింగి, పెడంగో గ్రామాలకు చెందిన ఐదు మంది విద్యార్థులు ఎన్.ధీరజ్, ఎన్.లోకేష్, పవి త్ర పట్నాయక్, హర్షిత, మహేష్ గౌడ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉమాగిరి వాసి శిష్టు బాబ్జితో పాటు స్థానికులు రక్షించారు. 108 సాయంతో గాయపడిన వారిని మందస మండలం హరిపురం ప్రభుత్వ సామా జిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డాక్టర్ ఐశ్వర్య, రాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి రైతు దుర్మరణం
పొందూరు/ఆమదాలవలస రూరల్: : ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన ఘటన ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పొందూరు మండలం తాడివలసకు చెందిన తమ్మినేని భాస్కరరావు(51) తనకు ఉన్న ఎకరా పొలంతో పాటు సుమారు ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి దుక్కులు దున్నడం, పొలం పనులు చేయడం వంటి పనులు చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 5 గంటలకు వ్యవసాయ పనుల కోసం సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలోని పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. పొలం లోతట్టులో ఉండటంతో ట్రాక్టర్ బోల్తా పడి భాస్కరరావు కిందనే చిక్కుకుపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసేసరికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న భార్య రమణమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమదాలవలస ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. -
మూడు రకాల చెత్తలు వేరు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రజలు మూడు రకా ల చెత్తలను వేరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి, పొడి, హానికరమైన చెత్తల ను వేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. అక్కడి సిబ్బందికి తడి, పొడి, హానికరమై న చెత్తలపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయవచ్చన్నారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్త రీ సైక్లింగ్‌కు పంపిస్తామని చెప్పారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ న్యాప్కిన్స్, మెడిసిన్స్, గాజు, తదితరమైనవి హానికరమైనవని తెలిపారు. వీటిని రెడ్ కలర్ డబ్బాలో వేయాలన్నారు. -
శ్రీకాకుళం
లక్కీచాన్స్సిక్కోలు బౌలర్‌కు లక్కీ చాన్స్ వచ్చింది. మెక్‌గ్రాత్ క్రికెట్ అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. –8లోఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పైడిబీమవరం చెక్‌పోస్టు వద్ద నిలిపిన లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తనిఖీ చేయగా నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా నిర్ధారణ జరిగిన వాహనాలివి. 28 లారీలను తనిఖీ చేస్తే వాటిలో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా చేసున్నట్టుగా తేలింది. బట్టేరు, బైరి, కాఖండ్యాం, గార ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకతో అక్రమంగా వస్తున్నట్టుగా గుర్తించారు. విచారణ 24కు వాయిదా ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తొలగించిన 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేబర్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జనవరి 2న ఫిర్యా దు చేయగా, పలు వాయిదాలు పడ్డాయి. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలోని లేబర్ కమిషన్ కార్యాలయంలో శనివారం విచారణ నిర్వహించాల్సి ఉండగా, ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. విచారణ రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ, వర్సిటీ అధికారులు హాజరు కావాలని సూచించారు. వేకువజామున ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నరసన్నపేట: రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ సమర్థంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. అలాగే జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహన సిబ్బంది కూ డా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శనివారం వేకువజామున ఆయన నరసన్నపేట పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అప్ప టికి స్టేషన్లో ఉన్న సిబ్బందిని నైట్ డ్యూటీలు, నైట్ పెట్రోలింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్యవరం కూడలి వద్ద జాతీయ రహ దారి పెట్రోలింగ్ పోలీసు వాహన సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్ మరింత సమర్థంగా నిర్వహించాలన్నారు. రాజమ్మ తల్లి జాతర రెండోవారం ప్రారంభం గార: మండలంలోని చినవత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం జాతర శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి రాత్రికి విడిది చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ 130 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. వత్సవలస గ్రామాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద సాయంత్రం పరిశీలించి బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవ్‌టీజింగ్, పిక్కాట, పేకాటలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుకను ఇష్టాను సారం తరలిస్తున్నారు. జేసీ ఆకస్మిక తనిఖీలతో ఈ విషయం బట్టబయలైంది. ఇన్నాళ్లూ లోప భూయిష్టమైన తనిఖీల కారణంగానే నకిలీల గుట్టు రట్టు కాలేదు. వాస్తవానికి జిల్లాలో నకిలీ బిల్లులతో ఇసు క రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. పత్రికల్లోనూ అనేక మార్లు కథనాలు వచ్చాయి. ఇందులో ఓ అధికారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఉన్న ఫలంగా రూ.లక్షలు గడించారన్న ఆ రోపణలు సైతం ఉన్నాయి. విశాఖలోని బిల్డర్లు, లారీల యజమానులతో కుమ్మకై ్క, జిల్లాలో ఉన్న పలు ఇసుక ర్యాంపులతో ఒప్పందాలు కుదుర్చు కుని పథకం ప్రకారం నకిలీ బిల్లులతో ఇసుక రవా ణా చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిల్లులు లేకుండా కూడా సరిహద్దు దాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ సంబంధాలతో... ఈ అధికారికి విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలోని ఇసుక ర్యాంపుల నిర్వాహకుల తో కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా రు. ముందుగానే ముడుపుల వ్యవహారం కుదుర్చు కుని పథకం ప్రకారం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసినప్పుడు వ్యూహాత్మకంగా ర్యాంపుల్లో ఓ ప్రత్యేక పరికరంతో తయారు చేసిన బిల్లులు చూపించి దాటించేస్తున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపుల వద్ద ఏ రోజుకారోజు ఏయే లారీ నంబర్లతో అధికారికంగా ఇసుక తరలివెళ్తుందో తెలిపే డేటాతో కూడి న లాగిన్ చెక్ పోస్టు సిబ్బంది వద్ద ఉండటం లేదు. దీంతో నకిలీ బిల్లులు గుర్తించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ అనధికారిక ర్యాంపులు జిల్లాలో అధికారిక ర్యాంపులతో పాటు టీడీపీ నేత ల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అన ధికార ర్యాంపులు కొనసాగుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కొందరు నేతలు కోట్లాది రూపాయలు గడించారు. ఇప్పటికే జిల్లాలో రూ. 500కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందన్న వాదనలు ఉన్నా యి. పగటి పూట కంటే రాత్రిపూటే ఎక్కువగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు ఇసుక లారీల జాతరే జరుగుతోంది. దీన్నివల్ల పల్లెల్లో రోడ్లు శిథిలమవ్వడమే కాకుండా లారీ ల రాకపోకలతో ఎప్పుడే ప్రమాదం చోటు చేసుకుంటుందోనన్న భయం కూడా గ్రామాల్లో ఉంది. క్యాష్ చేసుకుంటున్న అధికారి అనధికార ర్యాంపుల్లో జరుగుతున్న ఇసుక రవా ణాను ఓ అధికారి క్యాష్ చేసుకుంటున్నాడు. అటు విశాఖ బిల్డర్లు, లారీ యజమానులతోనూ, ఇటు ర్యాంపుల నిర్వాహకులను డీల్ కుదుర్చుకుని పక్కా వ్యూహం ప్రకారం జిల్లా నుంచి ఇసుక దాటించేస్తున్నారు. చెక్ పోస్టు వద్ద ఉన్న కదలికలు ఆ అధికారికి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా తన అధికారాన్ని ఉపయోగించుకుని జిల్లా నుంచి ఇసుకను సేఫ్‌గా దాటించేస్తున్నారు. తనిఖీలు జరిగినప్పుడు అధికారులపై నాయకుల పేర్లు చెప్పి ఒత్తిడి తీసుకువచ్చి లారీలు విడిపించుకుంటున్నారు. జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ఎప్పటి నుంచో సాగుతున్న అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. నకిలీ బిల్లుల బాగోతం బయటపడింది. అయితే బిల్లుల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సి ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల సమావేశం నేడు ఆమదాలవలస: ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో.. 2003 డీఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో ఆది వారం శ్రీకాకుళం పట్టణంలోని కళింగ భవన్లో నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కొత్తకోట శ్రీహరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2004 వ సంవత్సరానికి ముందు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల ఉద్యోగ నియామకాలను ఆలస్యం చేశాయని తెలిపారు. అలాగే పాత పింఛన్ అమలు చేయాలని కోరారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో మూడు జిల్లాల బాధిత ఉద్యోగులు తప్పని సరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలింపు సంతబొమ్మాళి: కోటబొమ్మాళికి చెందిన ఒక వ్యాపారి తన వ్యాన్‌లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మర్రిపాడు వద్ద కొంత మంది యువకులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. వ్యాన్‌లో సుమారు 40 బస్తాల బియ్యం ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్ఐ ప్రసన్న, మర్రిపాడు వీఆర్ఓ ఉమాపతికి ఫోన్లో సమాచారం ఇచ్చినా ఘటనా స్థలానికి రాలేదు. సుమారు గంటన్నరకు పైగా పీడీఎస్ బియ్యం ఉన్న వ్యాన్‌ను అడ్డుకున్నా రెవెన్యూ అధికారులు రాకపోవడంపై స్థానికులు అసహ నం వ్యక్తం చేశారు. న్యూస్‌రీల్ ఇసుక అక్రమ రవాణాకు సూత్రధారిగా ఓ అధికారి విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో ఒప్పందం జిల్లా నుంచి ఇసుక అక్రమ తరలింపునకు సహకారం భారీగా అందుతున్న ముడుపులు జేసీ తనిఖీలతో నకిలీ బిల్లుల గుట్టురట్టు పైడిభీమవరం చెక్ పోస్టు వద్ద ఇసుక లారీలు ఆపుతున్నారని తెలుసుకుని యూబీ పరిశ్రమ ఎదుట, నెలివాడ, వరిసాం, పైడి భీమవరం ఫ్లై ఓవర్‌కు ముందు నిలిపివేసిన లారీలివి. దాదాపు 50 ఇసుక లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పక్కాగా బిల్లులు ఉంటే ఆపేవారు కాదు. -
అతిథిదేవోభవ అంటూ..
కవిటి: అతిథి దేవోభవ అన్న ఆర్యోక్తిని కవిటి మండలం ఆర్.భైరిపురం వాసులు చేసి చూపించారు. ఇటలీలోని రోమ్ నగరానికి చెందిన ఎమ్మా ఎన్‌గ్రేసియా అనే యువతి ఇండియాలో కోల్‌కతా నుంచి కేరళ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం బరంపురం నుంచి బయలుదేరి 65 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రయ్యే సరికి కవిటి మండలం ఆర్.భైరిపురం చేరుకున్నారు. ఇక్కడ బొర్ర పృథ్వీ అనే యువకుడు ట్రా వెలింగ్ కౌచ్ యాప్ ద్వారా ఆమెకు ఆతిథ్యం ఇచ్చాడు. దీంతో ఆమె అచ్చ తెలుగు ఆడపడుచులా మారి వారితో కలిసిపోయారు. తాను ఇప్పటివరకు 951 కిలోమీట ర్లు యాత్ర చేశానని, ఇంకా 1800 కిలోమీట ర్లు ప్రయాణించాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఓ పెళ్లికి కూడా హాజరై సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఆత్మీ యత, ఆదరణ తనను మంత్రముగ్ధురాల్ని చేసిందని అన్నారు. -
‘సంచార పశు ఆరోగ్య సేవలు ఆపేయండి’
కాశీబుగ్గ: పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార పశు ఆరోగ్యసేవలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తోంది. ఉన్న ఫలంగా సంచార పశు ఆరోగ్య సేవలను ఆపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 మే 2022లో ప్రారంభించిన ఫేజ్–1లో 175 వాహనాలు తిరిగి ఆయా ఏడీ కార్యాలయంలో అప్పగించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆయా వెహికల్స్‌లో పనిచేస్తున్న పైలెట్, పారావిట్, డాక్టర్, పైలెట్ రిలీవర్లు విధులకు హాజరు కాకూడదని వాట్సాప్‌లో సూచించారు. జిల్లాలో ఫేజ్–1లో 09 వాహనాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
ముగిసిన రహదారి భద్రతా మాసోత్సవాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రహదారి భద్రతపై పలువురు నిపుణులు, అధికారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో 889 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 285 మంది మరణించగా, 1043 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ విజయసారథి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్అండ్బీ ఎస్ఈ జాన్ సుధాకర్, డీఎంహెచ్ఓ టీవీ బాలమురళీకష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్‌రావు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పి.వి.గంగాధర్, ఆర్.అనిల్, మున్సిపల్ ఇంజినీర్ దక్షిణామూర్తి, నెహ్రూ యువ కేంద్రం కో–ఆర్డినేటర్ ఉజ్వల్, రవాణా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే : క్విజ్: కె.లోహిత(కేజీబీవీ, గార), ఎస్.రేఖ(కేజీబీవీ, గార), బి.రాజానందిని (శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం), జి.హితేష్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం). వ్యాసరచన: టి.హారిక (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), ఎ.సూర్య (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), పి.రేణుశ్రీ (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), కె.రాము (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), జె. ఝాన్సీరాణి (సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), జె.హోయ్ (9వ తరగతి) – సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), యు.మానస (సెయింట్ క్లారెట్), డి.సింధూర (సెయింట్ క్లారెట్), కె.హారిక (బీఎస్సీ, గాయత్రీ కళాశాల, మునసబ్పేట), ఎం.జోష్నవి (గాయత్రీ కళాశాల), డి.మేనక (గాయత్రీ కళాశాల), టి.తైవేన్ (ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం), హాసిని (డిగ్రీ)(ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం) -
గంజాయి రవాణా గుట్టురట్టు
కాశీబుగ్గ: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు ఒడిశా వాసులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. శనివారం కాశీబుగ్గ పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంజాం జిల్లా బురైపహాడా గ్రామానికి చెందిన బిక్రమ్ మండల్, సునంద సవరలు 8 కేజీల గంజాయిని ముంబై తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు రాగా పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా, ఒడిశా రాష్ట్రం గండాహాతి వాటర్ ఫాల్స్ సమీపంలో గంజాయిని పండించి అందులో మూడు కేజీల అమ్మేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చిన గంగవైన ఉదయకుమార్, గౌరవ్ పొరివా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని కలిసేందుకు వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు. రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. ఆరు కేజీల గంజాయితో.. ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అంతర్భఅదవచుడంగపూర్ గ్రామానికి చెందిన మిలన్ పరిచ్ఛా అనే యువకుడు అదే రాష్ట్రానికి చెందిన చంద్రు అనే వ్యక్తి వద్ద 6.220 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. బరంపురంలో బస్సు ఎక్కి ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనంతరం బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ముంబైలో గంజాయి వ్యాపారి ప్రేమానంద్మల్లిక్కు అందజేసేందుకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సమావేశంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం
శ్రీకాకుళం కల్చరల్: సమాజ చైతన్యానికి గ్రంథాలయాలుతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్‌లో శనివారం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలతోనే మేథావి వర్గం తయారవుతుందన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల సెస్ బకాయిలు రూ.710 కోట్లు ఉన్నట్లు వివరించారు. రచయిత అట్టాడ అప్పలనాయడు మాట్లాడుతూ ఒకప్పుడు పంచాయతీల స్థాయిలో గ్రంథాలయాలు ఉండేవని, ఇప్పుడవి కనుమరుగైపోయాయని చెప్పారు. అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతి మాట్లాడుతూ కొత్త తరాల జ్ఞాన వికాసానికి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం తోడ్పాటునందిస్తుందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత జామి భీమశంకర్, జీన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు పత్తి సుమతి, బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూడు సూర్యారావు, సీపీఐ పట్టణ కార్యదర్శి టి.తిరుపతిరావు, విశ్రాంత ఇంజినీర్ బి.ఎ. మోహనరావు, ఇస్కాఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి.మల్లేశ్వరరావు, జి.వి.నాగభూషణరావు, పాలకొండ డివిజన్ గ్రంథాలయ ఉద్యమ నాయకులు సుబ్బా నానాజీ తదితరులు పాల్గొన్నారు.