
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.