VOA salary
-
వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు. జీతాల పెంపు ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇది కూడా చదవండి: అంగన్వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె -
ముఖ్యమంత్రి నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు
కృష్ణాజిల్లా :ఇచ్చిన మాట ప్రకారం జీతాలను 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకోవటంతో మెప్మా,ఆర్పిలలో ఆనందం వ్యక్తమవుతోంది. మంగళవారం జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, నాయకులు తన్నీరు నాగేశ్వరావు, ముత్యాల వెంకటాచలం, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్‌లు పాల్గొన్నారు. కానూరులో వీఓఏలు ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొఠారి శ్రీను, మాజీ ఎంపీటీసీ ఛాన్ బాషాలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి యానిమేటర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లెక్సీ కి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప.గో.జిల్లా :పాలకొల్లు పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా ఆర్.పిలకు10వేలు జీతాలు పెంచినందుకునియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందనీ, మా కష్టాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ప్రశంసించారు. వైఎస్సార్ జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కడప నగరంలో విఓఏలు ర్యాలీ నిర్వహించారు. జీవితాంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. విశాఖ: నర్సిపట్నంలోని కేడీ పేటలో గ్రామ సంఘాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిటికెల భాస్కర నాయుడు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా : నాయుడుపేట పట్టణంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం : జీతాలు పెంపుపై డీఆర్డీఏ , మెప్మా ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్లను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. తెలిపిన డిఆర్ డిఏ ,మెప్మా ఉద్యోగులు, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం -
కొత్త వెలుగు
మహిళా సాధికరతకు మేమే బాటలు వేశామని ఇంతకాలం డబ్బా కొట్టుకున్న నాటి టీడీపీ పాలకులు.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో మహిళా స్వయంశక్తి సంఘాలకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉంటున్న వెలుగు వీవోఏలకు చేసిందేమీ లేదు. ఇన్నాళ్లూ వారు రూ.2వేల గౌరవ వేతనంతోనే కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. సంఘాల లావాదేవీల ఖాతాలు, సమావేశాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలతో బిజీగా ఉండే వీవోఏలు ఏమాత్రం సరిపోని గౌరవ వేతనాన్ని పెంచాలని ఎంత మొత్తుకున్నా గత పాలకులకు పట్టలేదు. ఈ తరుణంలో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిపై కరుణ చూపింది. వారి కృషిని గుర్తించి.. జీవితాల్లో కొత్త వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది. వారికిస్తున్న గౌరవవేతనాన్ని ఏకంగా రూ.8 వేలు పెంచి రూ.10వేలు చేసింది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మరో హామీని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విధంగా అమల్లోకి తెచ్చారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 3007 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. దీనిపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడంతో వెలుగు ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మైదాన ప్రాంతం 28 మండలాల్లో 1,453 మంది, ఏజెన్సీ 11 మండలాల్లో 583 మంది వీవోఏలు, విశాఖ నగరపాలక సంస్థతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల పరిధి లో 1,071 మంది యానిమేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. మొత్తం 3,007 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శుభవార్త అందించారు. ఎస్‌హెచ్‌జీలో తాము అందిస్తున్న సేవలకుగాను ఇప్పటివరకూ అందుతున్న రూ.2 వేలకు తోడు మరో రూ.8 వేలను ప్రభుత్వం తరఫున చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నంబరు 2544తో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు... స్వయం సహాయక సంఘాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా సమన్వయం చేయడంలో వీవోఏల పాత్ర గురుతరమైంది. సంఘంలోని సభ్యుల్లో బాగా క్రియాశీలకంగా ఉన్న ఒకరిని ఎంపిక చేసి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. సంఘం సమావేశాలను నెలలో ఒకటీ రెండు సార్లు తప్పకుండా నిర్వహించడం, సంఘం ఖర్చు, జమా ఖాతా నమోదుచేయడం, రుణాల మంజూరు విషయంలో ఇటు గ్రూపునకు అటు బ్యాంకు మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, గ్రూపు ఖాతాను పర్యవేక్షించడం వంటి బాధ్యతలన్నీ వీవోఏ చూడాల్సిందే. ఇంత కష్టం ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం మాత్రం వారిని సభలకు జనసమీకరణ చేసేవారిగానే చూస్తూ వచ్చింది. ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా సభ్యులను బతిమిలాడి వాహనం ఎక్కించకపోతే పైనుంచి వేధింపులు తప్పేవికావు. ఇంతచేసినా వేతనం మాత్రం రూ.2 వేలు మాత్రమే. తమ వేతనాలు పెంచాలని వీవోఏలు ఎంత మొత్తుకున్నా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు ఎన్నికలకు ముందు రూ.5 వేల చొప్పున ఇస్తానని చెప్పినా సంఘం లాభాలతో ముడిపెట్టారు. అంటే ఏ సంఘమైతే లాభాల్లో ఉందో ఆ వీవోఏ మాత్రమే ఆ మొత్తాన్ని తీసుకోవడానికి అర్హులనడంతో దీనివల్ల చాలామందికి ప్రయోజనం లేకపోయింది. పాదయాత్రలో మాటిచ్చారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాము పడిన కష్టాలను వీవోఏలు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. దీనికి ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినవెంటనే వేతనం రూ.10 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అలా ఇచ్చిన మాటను నెరవేర్చారు. వేతనం పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రకారం గతంలో మాదిరిగానే రూ.2 వేలు సంఘం తరఫున, మిగతా రూ.8 వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ వేతనంగా అందుతాయి. సోమవారం ఈ వార్త తెలిసిన వెంటనే వీవోఏల ఇంట సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ప్రజాప్రతినిధులను కలిశారు. వారితో తమ ఆనందం పంచుకున్నారు. వారితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. -
వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే గ్రామ సంఘ సహాయకురాలు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. పొదుపు సంఘాల సభ్యుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక పనులను వీవోఏ, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. వీవోఏలను గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అని పిలిచేవారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 27,797 గ్రామ సమాఖ్యలు, పట్టణ ప్రాంతాల్లో 8,034 ఎస్ఎల్ఎఫ్, టీఎల్‌ఎఫ్‌లున్నాయి. గ్రామ సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది వీవోఏలు, ఆర్పీలు పర్యవేక్షిస్తున్నారు. నాడు గౌరవ వేతనాన్ని రద్దు చేసిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెర్ప్‌లో పనిచేసే వీవోఏలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున చెల్లించే గౌరవ వేతనాన్ని 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశారు. గౌరవ వేతనం నిలిపివేస్తున్నట్టు వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. 27 వేల మందికిపైగా వీవోఏలు 2015లో ఏకంగా 75 రోజుల పాటు సమ్మె చేసినా కరుణించలేదు. అసలు వీవోఏలు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, రూపాయి కూడా గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే 2019 ఎన్నికలు రావడం, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో అప్రమత్తమైన గత సర్కారు వీవోఏలకు ప్రభుత్వం నుంచి రూ.3 వేలు, గ్రామ సమాఖ్య నుంచి మరో రెండు వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని అధికారం కోల్పోయే సమయంలో గత్యంతరం లేక హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీలకు నామమాత్రంగా గౌరవ వేతనం చెల్లించేందుకు అంగీకరించింది. వారి కష్టాలు స్వయంగా చూసి.. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా 2018 జూలై 15న తూర్పు గోదావరి జిల్లాలో తనను కలిసిన వీవోఏ, ఆర్పీలకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ.పది వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 27,797 మంది వీవోఏలకు నెలకు రూ.10 వేలు (ప్రభుత్వం నుంచి రూ.8 వేలు + గ్రామ సమాఖ్య నిధుల నుంచి రూ.2 వేలు) చొప్పున చెల్లించేలా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే 8,034 మంది ఆర్పీలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించేలా పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. మా జీవితాల్లో నిజమైన వెలుగు.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యానిమేటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున వేతనాన్ని పెంచడంతో మా జీవితాల్లో నిజమైన వెలుగు వచ్చింది. 2003 నుంచి పనిచేస్తున్న మాకు గత ప్రభుత్వం ఏ సాయం చేయలేదు. మా కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి మొదటి కేబినెట్లోనే మా గురించి ఆలోచించి హామీని అమలు చేయడం ఆనందంగా ఉంది’ – వసంత, వీఓఏ, పుంగనూరు మండలం, చిత్తూరు జిల్లా గతంలో నష్టపోయాం.. ‘ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. టీడీపీ పాలనలో పొదుపు సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలాంటి పథకాలు అందక నష్టపోయాం. ఇప్పుడు నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుంది’ – క్రిష్ణవేణి, శ్రీరామ మహిళా సంఘం అధ్యక్షురాలు, పుట్లూరు గ్రామం, అనంతపురం జిల్లా మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషం.. ‘వీవోఏలు రాత్రిపగలు కష్టపడినా గత ప్రభుత్వం గుర్తించలేదు. జీతం పెంచాలని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకున్నవారే లేరు. ఎంతసేపూ సభలకు జనాన్ని తెమ్మనేవారు. ఎన్నికలకు ముందు పెంచుతున్నట్లు ప్రకటించినా సంఘం లాభాల్లో ఉంటేనే అంటూ మెలిక పెట్టడంతో పెంచిన మొత్తాన్ని మేం తీసుకోలేదు. పాదయాత్రలో జగనన్న నర్సీపట్నం వచ్చినప్పుడు మా కష్టాలు చెప్పుకున్నాం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ – కె.నాగలక్ష్మి, అమ్మపేట గ్రామం, గొలుగొండ మండలం, విశాఖ జిల్లా -
మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే అనేక హామీలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి
ఎల్లారెడ్డిపేట:గత 14ఏళ్లుగా పేదరికంలో ఉన్న మహిళలను పో గు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసిన ఐకేపీ వీవోఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ ఐకేపీ వీఏవోలు సోమవారం జేసీ యాస్మిన్ బాషాను ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. ఐకేపీ వీవోఏల సంఘం మండల అధ్యక్షులు రమా మాట్లాడుతూ రాష్ట్రంలో 18396మంది వీవోఏలు ఉన్నామన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ ఐకేపీ వీవోఏల కు రూ. 5వేల వేతనం ఇస్తూ రెగ్యూలరైజ్ చేస్తామన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ గౌరవ వేతనం రాకపోవడమే కాకుండా రెగ్యూలరైజ్ కూడా చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాణి, రా మకళ, వాణిశ్రీ, పద్మ, మంజుల, మేఘన పాల్గొన్నారు.