వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి | VOA salary should pay | Sakshi
Sakshi News home page

వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి

Published Tue, Jan 10 2017 10:54 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి - Sakshi

వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి

ఎల్లారెడ్డిపేట:గత 14ఏళ్లుగా పేదరికంలో ఉన్న మహిళలను పో గు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసిన ఐకేపీ వీవోఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ ఐకేపీ వీఏవోలు సోమవారం జేసీ యాస్మిన్ బాషాను ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. ఐకేపీ వీవోఏల సంఘం మండల అధ్యక్షులు రమా మాట్లాడుతూ రాష్ట్రంలో 18396మంది వీవోఏలు ఉన్నామన్నారు.

తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్‌ ఐకేపీ వీవోఏల కు రూ. 5వేల వేతనం ఇస్తూ రెగ్యూలరైజ్‌ చేస్తామన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ గౌరవ వేతనం రాకపోవడమే కాకుండా రెగ్యూలరైజ్‌ కూడా చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాణి, రా మకళ, వాణిశ్రీ, పద్మ, మంజుల, మేఘన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement