JC Yasmin Basha
-
విద్యార్థులతో థౌజండ్‌వాలా సినిమా చూసిన జేసీ
సిరిసిల్ల : 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహసనం పై తెలుగు సినిమా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. విడుదలైనా పది రోజులోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. సింహానసం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రసేనుడిది.. రికార్డులు సృష్టించేది ఇక్కడ ఈ బాహుబలిది అన్నటుగా ఉంది సినిమా. ఈ థౌజండ్‌వాలా సినిమాను ఓ జాయింట్ కల్లెక్టర్ అనాధ విద్యార్థులకు చూపించాలనుకున్నారు. రాజన్న సిరిసిల్లా జ్లిలా జాయింట్ కల్లెక్టర్ యాస్మీన్ బాషా అనాథ పిల్లల పట్ల తన ప్రేమను ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను మంత్రముగ్థల్ని చేస్తున బాహుబలి-2 ను రంగినేని ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులనున ఆమె సినమాకు తీసుకెళ్లారు. సోమవారం ఆమె సిరిసిల్ల నటరాజ్ థియేటర్లో బాహుబలి-2 సినిమాను చూశారు. జేసీ మాట్లాడుతూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో నిలిపిన బాహుబలి-2. ఇటువంటి అద్బుత సినిమాపై పిల్లల్లో నెలకొన్న ఉత్సాహంతోనే వారికి సినిమా చూపించాలన్నుకున్నట్లు జేసీ చెప్పారు. అనాథ పిల్లల మనసులో కుటుంబ సభ్యులతో సినిమా చూసే అదృష్టం, అవకాశం లేదనే నిరాశను వారిలోంచి తొలగించి ఆనందం నింపినట్లయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని ట్రస్టు వ్యవస్థాపకుపడు మోహన్‌రావు, థియేటర్ మేనేజర్ వెంగయ్య, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లోనే మద్దతు ధర
► జేసీ యాస్మిన్ బాషా ► సిరిసిల మార్కెట్లో కందుల కొనుగోళ్లు ప్రారంభం సిరిసిల్ల : రైతులు తాము పండించిన కందులను మార్కెట్ యార్డుల్లో విక్రయిస్తేనే మద్దతు ధర లభిస్తుందని జేసీ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ఉత్పత్తులను దళారులు, ప్రైవేట్ బ్రోకర్లకు విక్రయించకుండా మార్కెట్‌కు తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తూకంలోనూ మోసాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కిందుల మద్దతు ధర రూ.4,625 ప్రకటించిందని, రాష్ట్రప్రభుత్వం రూ.425 బోనస్ ఇస్తోందన్నారు. తద్వారా రైతుకు క్వింటాలుపై రూ.5050 ధర లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సేవలు అందిస్తామని ఏఎంసీచైర్మన్ జిందం చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిల్‌కుమార్, ఏఎంసీ కార్యదర్శి రాజశేఖర్, ఏఈవో తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తు రాంరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కూలీల సంఖ్య పెంచకుంటే చర్యలు
► రోజూ 50వేల మందికి ‘ఉపాధి’ కల్పించాలి ►26న మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటన ► నగదు రహిత గ్రామాలుగా 61 ఎంపిక ► వీడియోకాన్ఫరెరన్స్ లో జేసీ యాస్మిన్ బాషా సాక్షి, సిరిసిల్ల : ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల్లో కూలీల సంఖ్య పెంచకపోతే ఏపీవోలపై చర్యలు తీసుకుంటామని జేసీ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించా రు. సోమవారం మండల అధికారులతో సిరిసిల్ల నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజూ 50 వేల మందికి పైగా కూలీలకు పని కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతీగ్రామంలో ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి జిల్లాను వందశా తం బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని అన్నారు. కేంద్ర బృందం మూడుసార్లు జిల్లాలో పర్యటించి నిర్ధారించుకున్నాకే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తుందన్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలకు 61 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ గ్రామాల్లోని ప్రజలందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించాలన్నారు. హరితహారంలో నర్సరీల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామపంచాయతీలకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.10 వేలు మంజూరు చేశామని, వీటిని వినియోగించి పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు వంద శాతం ఉపయోగంలో ఉండాలన్నారు. డీఆర్డీవో పీడీ ఎన్ .హన్మంతరావు, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్‌వో ఆర్.రమేశ్, అధికారులు పాల్గొన్నారు. -
వీవోఏలకు గౌరవ వేతనం చెల్లించాలి
ఎల్లారెడ్డిపేట:గత 14ఏళ్లుగా పేదరికంలో ఉన్న మహిళలను పో గు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసిన ఐకేపీ వీవోఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ ఐకేపీ వీఏవోలు సోమవారం జేసీ యాస్మిన్ బాషాను ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. ఐకేపీ వీవోఏల సంఘం మండల అధ్యక్షులు రమా మాట్లాడుతూ రాష్ట్రంలో 18396మంది వీవోఏలు ఉన్నామన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ ఐకేపీ వీవోఏల కు రూ. 5వేల వేతనం ఇస్తూ రెగ్యూలరైజ్ చేస్తామన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ గౌరవ వేతనం రాకపోవడమే కాకుండా రెగ్యూలరైజ్ కూడా చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాణి, రా మకళ, వాణిశ్రీ, పద్మ, మంజుల, మేఘన పాల్గొన్నారు. -
చేనేతకు అధికారుల చేయూత
► దుస్తులు కొనుగోలు చేసిన తహసీల్దార్లు ►‘చేనేతలక్ష్మి’లో చేరిన సంక్షేమ అధికారులు సాక్షి, సిరిసిల్ల : వారంలో ఒకరోజు చేనేత వస్రా్తలు ధరించాలని స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అధికారులు, తహసీల్దార్లు స్పందించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాల్లో శుక్రవారం తహసీల్దార్లు చేనేత వస్త్రా లు కొనుగోలు చేశారు. సంక్షేమ అధికారులు చేనేతలక్ష్మి పథకంలో చేరారు. మంత్రి చేసిన సూచనతో ప్రతీ సోమవారం అధికారులు విధిగా చేనేత వస్రా్తలను ధరించాలని పదిరోజుల క్రితం కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ తీర్మానించడం తెలిసిందే. అదేక్రమంలో గత సోమవారం చేనేత దుస్తులు, అందునా పంచెకట్టుతో కలెక్టర్ ప్రత్యేకంగా కనిపించారు. ఆరోజు కొందరు అధికారులే చేనేత దుస్తులు ధరించడంతో..వచ్చే సోమవారం నాటికి అందరూ చేనేత దుస్తులు ధరించాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా తహసీల్దార్లు చేనేత దుస్తులు కొనుగోలు చేశారు. ‘చేనేతలక్ష్మి’లో చేరిన అధికారులు చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేతలక్ష్మి పథకంలో అంగన్ వాడీ, సంక్షేమ శాఖల అధికారులు చేరారు. శుక్రవారం సిరిసిల్లలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేసీ యాస్మిన్ బాషా సమక్షంలో చేనేతలక్ష్మి పథకంలో అధికారులు చేరారు. ఇప్పటివరకు 13 మంది సంక్షేమ శాఖ అధికారులు ఈ పథకంలో చేరారు. ఈ కార్యక్రమంలో డీడీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత తదితరులు పాల్గొన్నారు. నేత వస్రా్తలు ధరించాలి : డీఆర్వో చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు నేత దుస్తులు ధరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్యామ్‌ప్రసాద్ లాల్ సూచించారు. తహసీల్దార్లు చేనేత దుస్తులు కొనుగోలు చేసిన సందర్భంగా డీఆర్వో మాట్లాడారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి నేత కార్మికులకు ఉపాధి మెరుగు పరచాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన చేనేత లక్ష్మి పథకంలో చేరి ఐదు నెలల అనంతరం 50 శాతం లబ్ధిపొంది వస్రా్తలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రజలను ఈ పథకంలో చేర్పించి, నేతకార్మికులకు చేయూతనందించాలని కోరారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగయ్య, తహసీల్దార్లు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.