మార్కెట్‌లోనే మద్దతు ధర
► జేసీ యాస్మిన్ బాషా
► సిరిసిల మార్కెట్‌లో కందుల కొనుగోళ్లు ప్రారంభం
సిరిసిల్ల : రైతులు తాము పండించిన కందులను మార్కెట్ యార్డుల్లో విక్రయిస్తేనే మద్దతు ధర లభిస్తుందని జేసీ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ఉత్పత్తులను దళారులు, ప్రైవేట్ బ్రోకర్లకు విక్రయించకుండా మార్కెట్‌కు తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తూకంలోనూ మోసాలు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కిందుల మద్దతు ధర రూ.4,625 ప్రకటించిందని, రాష్ట్రప్రభుత్వం రూ.425 బోనస్ ఇస్తోందన్నారు. తద్వారా రైతుకు క్వింటాలుపై రూ.5050 ధర లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన సేవలు అందిస్తామని ఏఎంసీచైర్మన్ జిందం చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిల్‌కుమార్, ఏఎంసీ కార్యదర్శి రాజశేఖర్, ఏఈవో తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తు రాంరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.