విద్యార్థులతో థౌజండ్‌వాలా సినిమా చూసిన జేసీ
సిరిసిల్ల : 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహసనం పై తెలుగు సినిమా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. విడుదలైనా పది రోజులోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. సింహానసం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రసేనుడిది.. రికార్డులు సృష్టించేది ఇక్కడ ఈ బాహుబలిది అన్నటుగా ఉంది సినిమా. ఈ థౌజండ్‌వాలా సినిమాను ఓ జాయింట్ కల్లెక్టర్ అనాధ విద్యార్థులకు చూపించాలనుకున్నారు. రాజన్న సిరిసిల్లా జ్లిలా జాయింట్ కల్లెక్టర్ యాస్మీన్ బాషా అనాథ పిల్లల పట్ల తన ప్రేమను ప్రదర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను మంత్రముగ్థల్ని చేస్తున బాహుబలి-2 ను రంగినేని ట్రస్టులో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులనున ఆమె సినమాకు తీసుకెళ్లారు. సోమవారం ఆమె సిరిసిల్ల నటరాజ్ థియేటర్‌లో బాహుబలి-2 సినిమాను చూశారు. జేసీ మాట్లాడుతూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో నిలిపిన బాహుబలి-2. ఇటువంటి అద్బుత సినిమాపై పిల్లల్లో నెలకొన్న ఉత్సాహంతోనే వారికి సినిమా చూపించాలన్నుకున్నట్లు జేసీ చెప్పారు. అనాథ పిల్లల మనసులో కుటుంబ సభ్యులతో సినిమా చూసే అదృష్టం, అవకాశం లేదనే నిరాశను వారిలోంచి తొలగించి ఆనందం నింపినట్లయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగినేని ట్రస్టు వ్యవస్థాపకుపడు మోహన్‌రావు, థియేటర్ మేనేజర్ వెంగయ్య, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.