లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి | Commandant Dies In Lift Accident In Sircilla, Details Inside | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి

Published Tue, Mar 11 2025 8:49 AM | Last Updated on Tue, Mar 11 2025 11:37 AM

Commandant dies in lift accident in Sircilla

రాజన్న:  తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్ కు వెళ్లాడు గంగారం. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం.

అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో.. కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కేటీఆర్‌ సంతాపం
తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం తెలియజేశారు. గంగారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement