నగేశ్(ఫైల్)
రాయికల్ పట్టణంలో విషాదం
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment