Holi festival
-
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్‌లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హోలీ రోజు విషాదం.. వార్దా నదిలో గల్లంతైన యువకులు మృతి
సాక్షి, కొమురంభీం జిల్లా: హోలీ పండుగ రోజు అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. మృతులను కౌటాల మండలం నదీమబాద్‌కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)గా గుర్తించారు. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ.. సెల్పీలు దిగి హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి వద్దనున్న వార్ధా నదికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టిన ఫలితం లభించలేదు. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ నాడుఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో బాధితుల కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. -
Amritsar Holi Photos: రంగుల్లో మునిగి తేలిన అమృత్సర్.. విశేషం ఏంటంటే? (ఫోటోలు)
-
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
ఈ గ్రామాల్లో హోలీ వేడుకలు ఎలా ఉంటాయంటే..?
తీర్థయాత్రలు చేస్తారు కొందరు. వర్ణయాత్రలు కొందరికి ఇష్టం. మన దేశంలో హోలి చాలా హుషారైన పండగ. బహుశా దీపావళి తర్వాత చిన్నా పెద్దా అందరూ కేరింతలతో పాల్గొనే పండగ ఇదే. రొటీన్ వితంలో రంగులను నింపుకోవడం బాగుంటుంది. అయితే కొందరికి ఇంట్లోనో, అపార్ట్మెంట్ ప్రాగణంలోనో, వీధిలో, ఏరియా చౌరస్తాలోనో ఆడే హోలీ పెద్దగా ఆనదు. వారికి భారీ హోలి వేడుక చూడాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం హోలి డెస్టినేషన్స్ ఉన్నాయి. మన దేశంలో. ఈ హోలీకి వెళ్లగలిగితే వెళ్లండి. మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలి వేడుకలు చూడటం అంటే కృష్ణ రాధలు ఆడే హోలిని చూసినట్టే. ఇక్కడి బర్సానాలో స్త్రీలు గోపికల్లా, పురుషులు గోపబాలురలా అలంకరించుకుని హోలి ఆడతారు. రంగులు చల్లడానికి వచ్చిన గోపబాలురను స్త్రీలు సరదాగా బడితెలతో బాది దూరం తరుముతారు. అందుకే దీనిని ‘లాత్మార్ హోలి’ అంటారు. ఉదయ్‌పూర్: ఇక రాచరికస్థాయిలో హోలి చూడాలంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి సిటీ ప్యాలెస్‌లో రాజ వంశీకుల హాజరీలో అద్భుతమైన హోలి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థానీ జానపద కళల ప్రదర్శన ఉంటుంది. టూరిస్ట్‌లు ఈ వేడుకలు చూడటానికి తెగబడతారు. బృందావన్: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళితే అక్కడి బన్కె బిహారి ఆలయంలో పూలు, రంగులు కలిపి చల్లుకుంటూ కోలాహలంగా హోలి నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘ఫూల్వాలోంకి హోలి’ అంటారు. ఇక్కడ ఒకరోజు రెండు రోజులు కాదు... వారం రోజులపాటు హోలి వేడుకలు జరుగుతునే ఉంటాయి. చుట్టుపక్కల పల్లెలు రంగులతో తెల్లారి రంగులతో అస్తమిస్తాయి. ఈ అద్భుతమైన వేడుకలను చూడానికి టూరిస్ట్‌లు వస్తారు. హంపి: తుంగభద్ర నది ఒడ్డున రంగుల పండగ ఎలా ఉంటుందో చూడాలంటే హంపి వెళ్లాలి. ఇక్కడ హంపి సందర్భంగా భారీగా అలంకరించి నిర్వహించే రథయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ సాంస్కృతిక క్షేత్రంలో హోలీ ఒక విచిత్ర భావన కలిగిస్తుంది. నగర ప్రజలు డోళ్లు మోగిస్తూ హోలి వేడుకల్లో విశేషంగా పాల్గొంటారు. విరూపాక్ష ఆలయం ఈ సందర్భంగా కళకళలాడిపోతుంది. దక్షిణాదివారు హోలీ సెలవు హంపిలో గడిపి ఆనందించవచ్చు. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో హోలి అయితే నయనానందమూ శ్రవణానందమూ కూడా. ఎందుకంటే అక్కడ హోలి అంటే రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... నృత్యాలు, సంగీతం, కవిత్వం... అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మనోహరంగా హోలి జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలెట్టిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడకు వెళ్లి హోలి చూసినవారి హృదయం కచ్చితంగా రంగులతో నిండిపోతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్: పంజాబ్‌లోని ఈ ఊళ్లో హోలీ రంగులకు కళ్లు చెదురుతాయి. నిహాంగ్ సిక్కులు ఇక్కడ హోలి సమయంలో యుద్ధ విద్యలు ప్రదర్శిస్తారు. ఉత్తుత్తి పోరాటాలు ఇరు జట్ల మధ్య జరుగుతాయి. డోళ్లు తెగ మోగుతాయి. ఆట పాటల అట్టహాసం చూడతగ్గది. ఇవి చదవండి: పిచ్చుకా క్షేమమా..ఐ లవ్ స్పారోస్!! -
హోలీ వేడుకల్లో రఘువీరారెడ్డి డ్యాన్స్
-
Holy 2023: రంగులు త్వరగా పోవాలంటే..
హోలీ ఆడడం ఒక ఎత్తు అయితే.. ఆ మరకలను వదిలించుకునేందుకు పడే శ్రమ మరో ఎత్తు. పైగా హోలీ ఆడేప్పుడు రంగులే కాదు.. అడ్డమైనవన్నీ పూసేసుకుంటారు కొందరు. మరకలు త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. అయితే.. హోలీ ఆడిన తర్వాత త్వరగా రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్‌లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ► ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్‌ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా.. హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్‌గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్‌లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
Happy Holi 2023: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఎప్పుడు జరుపుకోవాలంటే..?
మంగళవారం(07-03-2023)రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేటి ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఎన్నిరోజులు జరుపుకొంటారు? హోలికా దహనం ఎందుకు చేస్తారు? ఈ ఏడాది ఏ మూహుర్తంలో పూజలు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, రాధా కృష్ణల ప్రేమకు గుర్తుగా హోలీ జరుపుకొంటారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు చోటీ హోలి. అంటే హోలికా దహనం. రెండో రోజు రంగుల హోలి. అంటే ఒకరిపైఒకరు రంగులు జల్లుకొని పండుగ చేసుకోవడం. ఈ ఏడాది చోటి హోలి (హోలికా దహన్) మార్చి 7న, బడీ హోలి(రంగుల హోలి)మార్చి 8న జరపుకోవాలని ప్రముఖ పంచాంగం వెబ్సైట్ డ్రిక్ పంచాగ్ తెలిపింది. హోలికా దహనం ఏ సమయంలో.. హోలికా దహనాన్ని మార్చి 7న(మంగళవారం) సాయంత్రం 6:24 గంటల నుంచి రాత్రి 8:51 గంటల మధ్యే జరుపుకోవాలి. అయితే పౌర్ణమి తిథి మార్చి 6(సోమవారం) సాయంత్రం 4:17కు ప్రారంభమై, మార్చి 7( మంగళవారం) సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగిస్తారు. తెలుగురాష్ట్రాల ప్రజలు ఈ పూజను సాయంత్రం 6:24 నుంచి రాత్రి 08:49 మధ్య జరుపుకోవాలని పండితులు చెప్పారు. ఎందుకీ పండుగ? హిందూ పురాణాల ప్రకారం హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకుంటే అతడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు. దీంతో ఎన్నోసార్లు ప్రాహ్లాదుడ్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. విష్ణువు అతడ్ని కాపాడుతుంటాడు. అయితే ప్రహ్లాదుడ్ని చంపేందుకు హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా సాయం చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి పథకం పన్నుతారు. దీని ప్రకారం హోలికా మంటల్లో కూర్చుంటే.. ప్రహ్లాదుడ్ని ఆమె ఒడిలో కూర్చోమని హిరణ్యకశ్యపుడు ఆదేశిస్తాడు. తండ్రిమాట ప్రకారం ప్రహ్లాదుడు వెళ్లి మంటల్లోనే హోలికా ఒడిలో కూర్చుంటాడు. కాపాడమని విష్ణువును ప్రార్థిస్తాడు. దీంతో విష్ణువే ప్రహ్లాదుడ్ని మంటల్లో కాలిపోకుండా చేస్తాడు. హోలికా మాత్రం అదే మంటల్లో కాలిబూడిదవుతుంది. దీంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలికా దహనం చేసి, ఆ మరునాడు హోలి పండుగను ఘనంగా జరుపుకొంటారు. అలాగే ఈ పండుగను శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు , రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుటుందని, అందుకే ఈ రోజును రంగుల పండుగగా జరుపుకుంటారని ప్రజలు విశ్వసిస్తారు. -
Holi 2023: రంగు వెనక రహస్యం
హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది. ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు. పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు. ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు: రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు. -
రంగులతో తడిసి ముద్దైన హైదరాబాద్ యువత (ఫోటోలు)
-
హోరెత్తిన హోలీ సంబరాలు.. ఫోటో గ్యాలరీ
-
F3 Movie: ఆడియన్స్‌కి హోలీ ట్రీట్, స్పెషల్ వీడియో చూసేయండి
F3 Movie Team Shares Special Video: ‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఇక నేడు హోలీ పండగ సందర్భంగా ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చింది ఎఫ్ 3 టీం. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ పేజీలో ఈ మూవీ అప్డేట్ ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్‌తో ఈ వీడియోలో నటీనటులు కనిపించడంతో బాగా ఆకట్టుకుంటుందో. ఫస్ట్ హీరో వెంకటేశ్‌తో స్టార్ అయిన ఈ వీడియో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, నటి ప్రగతి, సునీల్, ఆలీ ఇలా అందరూ నవ్వులు పూయిస్తూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం టీంలో సందడి చేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు చాలా బాగుందని మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు.. #F3Movie Family wishes you all a very Happy & Safe Holi ♥️ May the festival of colours fill your lives with lots of happiness 🌈✨#HappyHoli@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @adityamusic @SVC_official @f3_movie #F3OnMay27 pic.twitter.com/hlp7aGGrUz — Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2022 -
హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
-
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
-
దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ హోలీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రంగుల కేళీ హోలీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. आप सभी को होली की हार्दिक शुभकामनाएं। आपसी प्रेम, स्नेह और भाईचारे का प्रतीक यह रंगोत्सव आप सभी के जीवन में खुशियों का हर रंग लेकर आए। — Narendra Modi (@narendramodi) March 18, 2022 రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘హోలీ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ, మత సామరస్యం సయోధ్యకు సజీవ ఉదాహరణ. హోలీ అందరి జీవితాల్లో ఆనందం, ఉత్సాహం. కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు होली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। रंगों का पर्व होली, सामुदायिक सद्भाव और मेल-मिलाप का जीवंत उदाहरण है। यह वसंत ऋतु के आगमन का शुभ समाचार लेकर आता है। मेरी कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में आनंद, उमंग और नई ऊर्जा का संचार करे। — President of India (@rashtrapatibhvn) March 18, 2022 ప్రధాని మోదీ, రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. CM Sri KCR has conveyed #Holi greetings to the people of the State. Hon'ble CM stated that the festival of colours conveys the message of unity and togetherness. Wished people to celebrate the festival with joy and with eco-friendly colours.#HappyHoli pic.twitter.com/clrRdgjRjO — Telangana CMO (@TelanganaCMO) March 18, 2022 -
రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే..
రంగులు మనసులను ఉల్లాసపరిస్తే.. తియ్యని రుచులు మదిని ఆనందంతో నింపేస్తాయి. వర్ణాలన్నీ ఏకమయ్యే శుభ సమయాన అందరి నోళ్లను ఊరించే ఘుమఘుమలు పండగ వేడుకకు మరిన్ని వన్నెలద్దుతాయి. గుజియా కావల్సినవి: మైదా – 3 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఫిల్లింగ్‌కి.. పంచదార – కప్పు; కోవా – 200 గ్రాములు; బాదాములు – 5 (సన్నగా తరగి, నీళ్లలో నానబెట్టాలి); బొంబాయిరవ్వ – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; తయారీ: ► పిండిలో తగినన్ని నీళ్లు పోసి, కలిపి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మెత్తగా కావడానికి ఒక తడి క్లాత్ కప్పి, పక్కనుంచాలి. ►స్టౌ పై పాన్ పెట్టి, కోవా, రవ్వ. బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పంచదారకలిపి, మంట తీసేసి, చల్లారనివ్వాలి. ∙చల్లారిన కోవా మిశ్రమంలో ఏలకుల పొడి, బాదాంపప్పు తరుగు వేసి బాగా కలపాలి. ►కొద్దిగా నెయ్యిని వేళ్లతో అద్దుకొని, అరచేతిపైన రాసి, చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఉండలుగా చేసి, అదిమి పక్కనుంచాలి. ►పిండిని మృదువుగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి, పూరీలా వత్తాలి. ►∙గుజియా అచ్చుపైన పూరీ వేసి, మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, అదిమి, చుట్టూతా నమూనా ప్రకారం రోల్ చేయాలి. ఇదే విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. ►స్టౌ పైన బాణలి పెట్టి, నెయ్యి పోసి వేడిచేయాలి. నెయ్యి కాగుతున్నప్పుడు సిద్ధం చేసుకున్న గుజియాలను వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. ►ఇలా తయారుచేసుకున్న గుజియాలను ప్లేట్లో పెట్టి, తరిగిన బాదంపప్పును అలంకరించి, సర్వ్ చేయాలి. Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా! -
Holi Festival 2022: హోళీ సప్తవర్ణశోభితం
-
ఆ రంగువల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది : రాశీ ఖన్నా
హోలీ.. రంగోలీ అంటూ జాలీ జాలీగా రంగులతో ఆడుకునే సమయం ఆసన్నమైంది. రంగుల పండగ వేళ జీవితం కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ పండగ చేసుకుంటుంటారు. మరి.. పండగ వేళ అందాల తారలు రాశీ ఖన్నా, నేహా శెట్టి ఏమంటున్నారో చదువుదాం. ఫస్ట్ టైమ్ మీరెప్పుడు హోలీ జరుపుకున్నారో గుర్తుందా? రాశీ ఖన్నా: చిన్నప్పుడు హోలీ పండగ సమయంలో నేను రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఎందుకంటే మా కజిన్స్ చాలామంది అక్కడున్నారు. చాలా సందడిగా ఉండేది. హోలీ అంటే రంగులతో ఆడుకోవడం మాత్రమే కాదు.. స్వీట్లు తినడం, ఇంకా అత్తయ్య చేసే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లాగించడం.. ఇవన్నీ జీవితాంతం నాకు గుర్తుండిపోయే మంచి జ్ఞాపకాలు. ఎక్కువమంది కలిసి జరుపుకున్నందున ఓ పెద్ద ఫ్యామిలీ పండగలా అనిపించేది. నేహా శెట్టి: చిన్నప్పుడు నాకు హోలీ అంటే భయంగా ఉండేది. ఎందుకంటే రంగు పొడి నా కళ్లల్లో పడిపోతుందని భయపడుతుండేదాన్ని. దాంతో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్లు. ముఖ్యంగా నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు బాగా ఏడిపించారు. దాంతో మొత్తం రంగులన్నింటినీ నా ఒంటి మీద చల్లుకున్నాను. చాలా సరదాగా అనిపించింది. హోలీ అంటే రంగుల పండగ.. మీకు నచ్చే రంగు? రాశీ ఖన్నా: పసుపు రంగుని చాలా ఇష్టపడతాను. ఆ రంగు నాకు సూర్యుణ్ణి గుర్తుకు తెస్తుంది. చాలా ప్రకాశవంతమైన రంగు. ఆనందానికి ప్రతీకలా అనిపిస్తుంది. అలాగే ఓ దృఢమైన నమ్మకాన్ని కలిగించే రంగులా భావిస్తాను. నేహా శెట్టి: నాకు నీలం రంగు ఇష్టం. అయితే ఆ రంగు ఎందుకు ఇష్టమో నేనెప్పుడూ ఆలోచించలేదు. నా ఆలోచనలు ఆకాశాన్ని దాటి, సముద్రం అంత లోతుగా ఉంటాయి కాబట్టే ఆ కలర్ అంటే ఇష్టమేమో! ఆకాశం, సముద్రం నుంచే నీలం రంగు వచ్చిందని నా ఫీలింగ్. మీ లైఫ్‌లో ఇప్పటివరకూ ఉన్న కలర్‌ఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారా? రాశీ ఖన్నా: నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ కలర్‌ఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సెలవుల్లో ఎలానూ సందడి సందడిగా ఉంటుంది. అవి కాకుండా పుట్టినరోజులు, పండగలు, కుటుంబంలో జరిగే వేడుకలు, ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలవడం.. ఇవన్నీ నాకు కలర్‌ఫుల్ మూమెంట్సే. నేహా శెట్టి: ఒక్కో భావోద్వేగానికి ఒక్కో షేడ్ ఉంటుంది. మనందరి జీవితం కూడా ఒక ఎమోషనల్ రైడ్ ద్వారానే సాగుతుంది. అందుకే జీవితమే ఒక కలర్‌ఫుల్ జర్నీ అంటాను మనసు బాగా లేనప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తారు? రాశీ ఖన్నా: ఎరుపు రంగు. రెడ్ కలర్ డ్రెస్ ధరించినప్పుడల్లా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మాత్రమే కాదు.. ఆ కలర్ వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా అనిపిస్తుంది. సో.. నా డల్ మూడ్ అప్పుడు రెడ్ కలర్ డ్రెస్ మంచి ఆప్షన్లా భావిస్తాను. నేహా శెట్టి: నీలం రంగు ఇష్టం. రంగు లతో ఆడటం ఇష్టమేనా? రాశీ ఖన్నా: ఇష్టమే కానీ నేచురల్ కలర్స్‌తో ఆడతాను. కొన్ని బ్యాడ్ కలర్స్ ముఖం మీద, శరీరం మీద బాగా మరకలు పడేలా చేస్తాయి. అవి ఓ పట్టాన వదలవు. హోలీ ఆడినంతసేపూ బాగానే ఉంటుంది కానీ అవి వదిలించుకునేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. అందుకే నేచురల్ కలర్స్ వాడతాను. నేహా శెట్టి: హోలీ కలర్స్‌కి పెద్ద ఫ్యాన్‌ని కాదు. కానీ ఈ పండగ తెచ్చే ఎనర్జీ అంటే ఇష్టం. హోలీ సందర్భంగా ఏదైనా సందేశం... ? రాశీ ఖన్నా: బ్యాడ్ కలర్స్ వాడకండి. వాటివల్ల చర్మం పాడవుతుంది. హోలీ ఆడేముందు ఒంటికి నూనె రాసుకోండి. ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. అప్పుడు రంగులను తేలికగా వదిలించు కోవచ్చు. నేహా శెట్టి: సింథటిక్ కలర్స్‌కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ కలర్స్ వాడండి. సేఫ్‌గా ఉండండి. హోలీని ఎంజాయ్ చేయండి. -
సాక్షి కార్టూన్ 18-03-2022
-
హోలి హోలీల రంగ హోలీ... మంచి రంగులే మంచిది చమ్మకేళీ!
హోలీ పండగరోజు ‘రంగు పడుద్ది’ అని అరవడం, రంగు ఇష్టంగా పడిపించుకోవడం బాగానే ఉంటుంది గానీ అది ఏ ‘రంగు’ అనేది ముఖ్యం. ఎందుకంటే అన్ని రంగులు ఒక్కటి కాదు! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి రోజు రంగుల రూపంలో చెడు రసాయనాలు చేటు చేస్తున్నాయి. చర్మం, కళ్లు...మొదలైన వాటికి హాని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, థానే జిల్లాలోని ముర్బాద్, సరగామ్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం అగ్రికల్చరల్ సైన్స్డిపార్ట్మెంట్ వర్క్‌షాప్ నిర్వహించింది. హోలీ సందర్భంగా వాడే రంగులలోని కెమికల్స్ వల్ల జరిగే హాని గురించి వివరించారు. ‘అలా అని పండగ సంతోషం దూరం చేసుకోనక్కర్లేదు’ అని చెబుతూ... మందారం, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, గోరింటాకుతో పచ్చని రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగు... ఎలా తయారు చేయాలో నేర్పించారు. మరిచిపోయిన మోదుగుపూల రసాన్ని మళ్లీ రంగం మీదికి తీసుకువచ్చారు. ‘మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది?’ అని అడిగారు. చింతచెట్టు, నిమ్మచెట్టు, నీలగిరి చెట్టు... ఇలా రకరకాల సమాధానాలు వినిపించాయి. ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవడం, ఆ రంగులను అందంగా ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి?.. మొదలైన విషయాలు నేర్పించారు. దీనిద్వారా వారికి ఉపాధి అవకాశం దొరికింది. ‘మేము పచ్చటి చెట్ల మధ్య నివసిస్తున్నాం. అయితే హోలీ పండగ రాగానే రంగుల కోసం పట్టణం వెళ్లేవాళ్లం. ఎదుటి వ్యక్తిని ఎంతగా రంగుల్లో ముంచెత్తితే పండగ అంత ఘనంగా జరిగింది అనుకునేవాళ్లం. ఇక్కడికి వచ్చిన తరువాత నా దృష్టి మారింది. రసాయన రంగులను ఉపయోగించడం వల్ల జరిగే హాని గురించి తెలుసుకున్నాను. నేను ఇక్కడ విన్న విషయాలను మా కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లకు కూడా చెబుతాను’ అంటుంది వర్క్‌షాప్‌కు హాజరైన శాంతి పవార్. ‘ఈసారి పండగ కొత్తగా జరుపుకుందాం. ఆరోగ్యకరంగా జరుపుకుందాం’ అనే నినాదంతో ముందుకు కదిలారు వర్క్‌షాప్‌కు హాజరైన మహిళలందరూ తాము తయారు చేసిన సహజమైన రంగులను ఇంటింటికి పరిచయం చేస్తున్నారు. వర్క్‌షాప్ లో విన్న విషయాలను చెబుతున్నారు. తాము తయారు చేసిన రంగులు అమ్ముడుపోతున్నాయనే సంతోషం కంటే, తమ ద్వారా మంచి సందేశం చేరుతుందనే తృప్తి వారి కళ్లలో కలర్ఫుల్గా కనిపిస్తుంది. -
హోమ్ మేడ్ హోలీ కలర్స్...
-
‘హిజాబ్’పై హోలీ తర్వాత విచారణ: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. -
హోలి: ఇక్కడ పురుషులకు నిషేధం!
రకరకాల రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకునే హోలి పండుగను ఇష్టపడని వారంటూ ఉండరు. హోలి కోసం పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎదురు చూస్తుంటారు. ఎంతో సరదా గా చేసుకునే పండగని ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం మహిళలే చేసుకుంటారు. వీరి హోలి సంబరాల్లోకి పురుషులు ఎవరైనా పొరపాటున వచ్చారంటే తన్నులు తినాల్సిందే. నిబంధన అతిక్రమించిన పురుషులకు శిక్షగా లంగా, జాకెట్‌ను ధరింపచేసి హోలీ రంగులు చల్లుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు జరుగుతోంది. యూపీలోని హరీమ్‌పూర్ జిల్లాలో కుందౌరా అనే కుగ్రామం ఉంది. ఊరి జనాభా ఐదువేలు మాత్రమే. ఇక్కడ హోలీ పండుగను కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారు. మూడురోజులపాటు హోలీ సంబరాలు జరుగుతాయి. హోలి మొదటి రోజు మాత్రం పురుషులు రంగులు చల్లుకుంటూ హోలి ఆడతారు. రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారు. ఈరోజు మహిళలు, అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలి ఆడవచ్చు. ఈ సంబరాల్లోకి మగవాళ్లకు అస్సలు అనుమతి లేదు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ నాట్యం చేస్తారు. సంప్రదాయం ప్రకారం మామగారి ముందు కోడళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అందువల్ల పురుషులను ఈ పండక్కి బయటకు రానివ్వరు. పురుషులు ఇంటికే పరిమితమవ్వాలి లేదా ఊర్లో ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యాకే ఊర్లోకి రావాలి. హోలీ రెండోరోజు పురుషులు ఆరుబయట కనిపించడం నిషేధం కనుక ఎవరైనా వచ్చారంటే శిక్షను అనుభవించాలి. ఆరుబయట కనిపించిన పురుషులకు లెహంగా చోళీ ధరింపచేసి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో మహిళలు వారిని కొడుతుంటారు అర్ధరాత్రిదాకా... మూడో రోజు హోలి పండుగను రామ్ జానకి గుడి ఆవరణలో నిర్వహిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద మొత్తం దీనిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ నృత్యం చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం కాగానే ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు నిషేధం. -
Holi 2022: పూల రంగులతో హోలీ సంబురం
Make Organic Holi Colours with Flowers: హోలీ 2022 సంబురం వచ్చేసింది. ఈ రంగులకేళిలో రసాయన రంగుల్ని వాడటం ‘ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు... కాదంటూ’ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కృత్రిమ రంగులతో పోలిస్తే ఆర్గానిక్ కలర్ పౌడర్లకే మార్కెట్లో రేటు ఎక్కువ. పైగా అవి నిజంగానే ఆర్గానిక్‌వేనా అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజరంగుల్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగూ.. ఎర్రటి ఎండలు దండి కొడుతున్నాయ్ కదా! రెడ్/ఎరుపు మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ఆ పువ్వులను మెత్తని పొడిగా నూరుకోవాలి. అంతే.. ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మిశ్రమానికి కొంచెం బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది. మందారతో పాటు ఎర్ర చందనం పౌడర్‌తో కూడా రెడ్ కలర్‌ను తయారుచేసుకోవచ్చు. పైగా ఎర్ర చందనం శరీరానికి మంచి రంగును ఇస్తుంది. దీనిని తడి, పొడి రంగుగా వాడుకోవచ్చు. లీటర్ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పౌడర్ని కలపి దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. చల్లారక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగు తయారవుతుంది. ఆరెంజ్/కాషాయం మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెట్టినా సరిపోతుంది. పసుపు–కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. మైదాకు(గోరింటాకు)ను నీటిలో కలిపి ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే కొంచెం ఇది కాస్ట్లీ వ్యవహారం. యెల్లో/పసుపు ఈ రంగును తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. పొద్దుతిరుగుడు పువ్వులు(యాభై గ్రాములు), నారింజ తొక్కల పొఇ(ఇరవై గ్రాములు), చేమ గడ్డ పొడి(రెండొందల గ్రాములు), పసుపు(వంద గ్రాములు), నిమ్మ రసం(ఇరవై చుక్కలు).. ఈ మొత్తాన్ని ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే మెత్తని పసుపు రంగు తయారవుతుంది. బ్లూ/నీలం సూర్య కాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా పెరిగే చెట్లు జకరండ(నీలి గుల్మహార్). వీటి పువ్వులు నీలి, ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతంలో అయితే నీలి మందారం మొక్కల నుంచి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తారు. తడి రంగు కోసం నీలిమందు చెట్ల కాయల్ని(బెర్రీలు) పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని జాతుల నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటితో కలిపి బ్లూ రంగు తయారుచేసుకోవచ్చు. గ్రీన్/ఆకుపచ్చ గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యప్పిండి కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా చేయాలి. పై పై నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు. పింక్/గులాబీ పసుపు రంగు మందార పువ్వులు, బీట్రూట్ ద్వారా ఆర్గానికి పింక్ రంగును తయారు చేయొచ్చు. బీట్రూట్ను పేస్ట్‌గా నూరి.. ఆ మిశ్రమాన్ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పొడికి కొంచెం శెనగ లేదా గోధుమ పిండిని కలపాలి. తడి రంగు కోసం బీట్రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి.. చల్లార్చాలి. బ్రౌన్/గోధుమ గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పాళ్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్యప్పిండిని కలిపితే చాలు. ఆయుర్వేదంలో హోలీ హోలీ వెనుక పురాణకథనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. చలి కాలం వెళ్లిపోయి.. వేసవి వచ్చేప్పుడు గాలిమార్పు కారణంగా జ్వరాలు, జలుబూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడిలను నీళ్లలో కలిపి చల్లుకునేందుకే ఈ వేడుక పుట్టిందని చెప్తారు. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, హోలీ పండుగ పూట చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరిచేరవని అంటారు. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే ఈ పండుగకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్ని మరింత రంగుల మయం చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కేంద్రం ఉద్యోగులకు రూ.10,000 అడ్వాన్స్‌గా అందించనుంది. ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా హోలీకి ముందే రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. దీనివల్ల వ్యాపారాలు ఊపందుకోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మంద గమనాన్ని అధిగమించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లలో పేర్కొన్నాయి. ఇప్పటికే కేంద్ర ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతేడాది కూడా ఈ పథకాన్ని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం మళ్లీ అదే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇక కేంద్రం అందించనున్న ఈ రూ.10వేల అడ్వాన్స్ వారి అకౌంట్లలో జమవుతాయి.ఉద్యోగులు తీసుకున్న మొత్తాన్ని10 వాయిదాల్లో నెలకు రూ.1000 చొప్పున రూ.10,000 మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా కేంద్రం వెసలు బాటు కల్పించనుంది. -
Holi 2021: ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్..
రంగుల పండుగ హోలీలో కలర్స్ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. యూపీలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు. ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్ గులాల్ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్.. ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్ తెలిపారు.యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ డైరెక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి. సోన్‌భద్రా, మీర్జాపూర్ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్ గ్రూపు మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058 మహిళలు మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్ ఇన్పెక్షన్స్ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్ హోలీ ఆడండి. -
హోలీ ఎలా ప్రారంభమైందో తెలుసా?
స్వర్గలోకం కళకళలాడుతోంది. ముఖ్యంగా ఇంద్ర సభ కోలాహలంగా ఉంది. ఇంద్రుడు, శచీ దేవి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు... అందరూ హడావుడి పడుతున్నారు. ఇంద్రుడు మాత్రం అందరి హడావుడిని సంబరంగా చూస్తున్నాడు. వినోదంగా చూస్తున్నాడు. విలాసంగా చూస్తున్నాడు. ఆహ్లాదంగా చూస్తున్నాడు. ఇంద్రుడిని పలకరించటానికి ఎవ్వరికీ ధైర్యం చాలట్లేదు. శచీదేవి వచ్చి, ‘ప్రభూ! మిమ్మల్ని పలకరించటానికి అందరూ భయపడుతున్నారు. అందరూ సంబరాలు చేసుకుందామని ఉబలాటపడుతూ, హడావుడి పడుతూంటే, మీరేమిటి, నిశ్చింతగా మీ సింహాసనం మీద కదలకుండా కూర్చున్నారు. అక్కడ నుంచి లేస్తే, ఎవరైనా ఎత్తుకుపోతారని భయమా’ అంది కొంచెం హేళనగా. ఇంద్రుడు నో కామెంట్. పెదవి విప్పలేదు. ముఖంలో ఏ భావమూ కనపడనివ్వలేదు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు వచ్చి, ‘ప్రభూ! ఈ రోజు అందరూ ఇంత సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకుంటుంటే, మీరు మా మధ్యలోకి రాకుండా, ఏకాంతంగా మీ సింహాసనం మీద కదలకుండా కూర్చోవటం భావ్యంగా లేదు. లేచి రండి’ అంటూ ఇంద్రుడిని గోముగా ఆహ్వానించారు. ఇంద్రుడు నో కామెంట్, నో రెస్పాన్స్. ‘ఐరావతంలా కూర్చునిపోయారేంటి’ అంది మళ్లీ శచీదేవి. అక్కడే ఉన్న ఐరావతానికి కోపం వచ్చి, గట్టిగా ఘీంకరించింది. వెంటనే సద్దుకుని, ‘ఏమిటీ ఉచ్చైశ్రవంలానైనా కదలటంలేదు’ అంది. అంతే! అశ్వరాజానికి కోపం వచ్చి సకిలించింది. ‘అమ్మో! ఎవర్ని ఏమన్నా కోపం తెచ్చుకుంటున్నారు.. అనుకుంది శచీదేవి. ఇంద్రుడిలో ఏ చలనమూ లేదు. ‘ఆ కల్పవృక్షమే నయం. ఎవరు ఏది కోరితే అది ఇస్తుంది, మీరూ ఉన్నారు ఎందుకు, కనీసం కంటితో కూడా మాట్లాడట్లేదు’ అంది శచీదేవి. కల్పవృక్షం సంతోషంతో తన తనువును ఊగిసలాడించింది. శచీదేవికే సమాధానం చెప్పనివాడు, మన మాటకు ఏం విలువ ఇస్తాడు, ఇంద్రసభకు ఎవరొచ్చినా మనం నాట్యం చేయాలి, మనకు ఆరోగ్యం బాగోలేకపోయినా తప్పనిసరిగా నర్తించాలి. పెదవుల మీదకు నవ్వు పులుముకోవాలి. ఈయనగారు మాత్రం నోరు విప్పకుండా మనల్ని అగౌరవపరుస్తూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు... అనుకుంటూ నలుగురూ చిన్నబుచ్చుకుని, వెనుకకు మరలుతూ, ఇంద్రుడిని తూలనాడుకున్నారు. వారు అటు మరలగానే, కిన్నెరకింపురుషులు ‘ప్రభూ! మీరు మౌనం విడవాలి, మీ సింహాసనాన్నీ విడవాలి. ఇక్కడే ఇలా బెల్లంకొట్టిన రాయిలా కదలకుండా కూర్చుంటే, మా గతేంటి. ప్రభువులు వచ్చి ప్రారంభించకపోతే ఏ కార్యక్రమాన్నీ ప్రజలు జరుపుకోలేరు కదా. ఈరోజు పండుగ కదా. అదీరంగుల పండుగ కదా. ఏడాదికోసారి వచ్చే పండుగ కు కూడా మీరు రాకుండా ఉంటే ఎలా అంటున్నారు... అంటూ సుమధుర స్వరంతో ఏకబిగిన తూలనాడుతూనే ఉన్నారు. వినిపించుకోలేదు ఇంద్రుడు. చివరగా గంధర్వులు వచ్చి, ‘ప్రభూ, మీ మౌనానికి, మీ స్తబ్దతకు కారణం తెలుసుకోవచ్చా. మీరు లేచి రాకపోతే ఎలా ప్రభూ, లేవండి రండి, పండుగను ప్రారంభించండి’ అన్నారు బతిమలాడే ధోరణిలో. నెమ్మదిగా పెదవుల పట్లు సడలిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, కుడి చేతిని కుడిపక్కకు పంపి శరాలు అందుకుని, ఎడమచేత్తో విల్లు అందుకుని, బాణం సంధించి ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఆకాశంలో పెద్ద ఇంద్రధనుస్సు ప్రత్యక్షమై, తెల్లటి ఆకాశమంతా సప్తవర్ణాలతో కన్నులపండువుగా అయ్యింది. అంతే! స్వర్గమంతా హోలీ సంరంభం ప్రారంభమైంది. శచీదేవి, కిన్నెరకింపురుషులు, గంధర్వులు అందరూ ఆ రంగులలో తడిసిముద్దయిపోయారు. ఇందుకేనా ఇంద్రుడు ఇంతవరకు కదలకుండా కూర్చున్నాడు. ఇంద్రధనుస్సు సంధించి హోలీ పండుగను ప్రారంభించాడు. ఎంతైనాకలోకాధిపతి, ఇంద్రపదవీ ధారులు.. అంటూ అందరూ కేరింతలు కొట్టారు. ఇంద్రుడు దర్పంగా ఎక్కుపెట్టిన బాణాన్ని తిరిగి తన చేతిలోకి తీసుకుని, రెండు మూడుసార్లు అదేవిధంగా సంధించి, అందరూ రంగులతో ఆడుకుంటుంటే విలాసంగా వీక్షిస్తూ ఆనందించాడు. సృజన రచన: వైజయంతి పురాణపండ -
హోలీ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
హోలీ పండుగను రెండు భాగాలుగా జరుపుకోవటం ఆనవాయితీ. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు ముక్కంటి తన కంటి మంటతో కాముడిని కాల్చివేశాడనీ, దేవతల ప్రార్థనలు మన్నించి, ఫాల్గుణ పౌర్ణమినాడు మన్మథుడికి మళ్లీ ప్రాణం పోశాడనీ ఒక గాథ. కనుక చతుర్దశినాడు కామ దహనం జరిపి, పశ్చాత్తాపంతో పరిశుద్ధుడైన పంచబాణుడిని పౌర్ణమినాడు మళ్లీ ఆహ్వానించి, అర్చించుకోవటం చాలా ప్రాంతాలలో సంప్రదాయం. కామదహనంలో దహించబడే మన్మథుడు ఒక వ్యక్తి కాదు. కామం అనే శక్తికి ప్రతీక. కామం అంటే కోరిక. విషయ వాంఛ. ఇంద్రియ, మనస్సంబంధమైన కోరికలన్నీ కామమే. కోరిక హద్దులో అదుపులో ఉన్నంతసేపూ, ధర్మ విరుద్ధం కానంతసేపూ తప్పులేదు. కోరికలు తృప్తిపరచుకోవటం పురుషార్థాలలో ఒకటి. కానీ కోరికను అదుపులో ఉంచలేని వారి మనోబుద్ధులను, కోరికే తన అదుపులోకి తీసేసుకుని, విచక్షణను నాశనం చేసి, వినాశనానికీ విషాదాంతాలకూ దారి తీస్తుంది. విజితేంద్రియుడైన విశ్వేశ్వరుడి ముందు విజృం భించబోయి పుష్పబాణుడు బూడిదయ్యాడు. కామాన్ని నియంత్రించగల వాడే కామ పురుషార్థాన్ని అర్థవంతంగా అనుభవించగలడు. కామానికి స్థానమే లేని జీవితం నిస్సారం, నిస్తేజం, కళా విహీనం. కామమూ, కాముడూ మనసులోకే రాని మను గడ, మనుగడ కాదు.. మరుభూమి. కానీ మనసును విశృంఖలమైన కామాలకు వశం చేసిన బతుకూ, బతుకు కాదు.. బానిసత్వం. మనసు లోకి ప్రవేశించి ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగించే కామం మనిషి వశంలో ఉన్నంతసేపూ–ఉన్నంతసేపే! ‘మార! మా–రమ–మదీయ–మానసే/ మాధవైక నిలయే...’ అంటుంది కృష్ణ కర్ణామృతంలో గోపిక. ‘మన్మథుడా! మాధవుడి నిల యమైన మదీయ మానసంలో, నీ ఇష్టం వచ్చినట్టు విహరించాలను కోకు! ఎందుకని?... ‘ఆ లక్ష్మీపతి చటుక్కున ఎప్పుడైనా వచ్చేయ గలడు. (నిన్ను గట్టిగా దండించనూ గలడు). తన సొంత ఇంట్లో మరొ కడు దూకి తందనాలాడుతుంటే ఎవరు ఊరుకొంటారు?’ ఎంత మంచి భావన! గోపికలే కాదు, భక్తులందరూ చెప్పాల్సిన మాట! – ఎం. మారుతి శాస్త్రి -
షూట్ చేస్తే..రంగు పడుద్ది!
లక్నో: ఒకపక్క కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోక్క రంగుల పండగ హోలీ దగ్గరపడుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే కలర్‌పుల్ పండగ హోలీ. మరోసారి కేసులు పెరుగుతున్న తరుణంలో హోలీ ఎలా జరుపుకోవాలి? అని బాధపడేవారందరికి తియ్యటి వార్త చెబుతున్నాడు వారణాసికి చెందిన విశాల్. హోలీ పండగ జరుపుకునేందుకు ప్రత్యేకంగా ‘యాంటీ కరోనా వాటర్ గన్’ రూపొందించిన విశాల్.. వాటర్‌గన్ ఉండగా మీకు చింతేలా అంటున్నాడు. కరోనా భయాన్నీ పక్కనబెట్టి, ఎటువంటి ఆందోళన లేకుండా ఈ వాటర్ గన్‌తో రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోండి అంటూ భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పండగ జరుపుకోవాలన్నా సోషల్ డిస్టెన్స్ పాటించక తప్పదు. అయితే కొన్ని పండగల్ని డిస్టెన్స్ పాటిస్తూ జరుపుకోవచ్చు కానీ, హోలీ లాంటి వాటికి కుదరదు. అందువల్ల దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో చదువుతోన్న విశాల్ పటేల్. ఇటు కరోనాను ఎదుర్కొంటూ అటు హోలీని ఎప్పటిలాగా జరుపుకునే విధంగా ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే యాంటీ కరోనా వాటర్ గన్ను రూపొందించాడు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ గన్ ఉపయోగించి సోషల్ yì స్టెన్స్ పాటిస్తూ రంగులను చల్లవచ్చు. అయితే ఇది చేతితో పట్టుకుని షూట్ చేసే గన్ మాదిరి ఉండదు. దీనిని ఇంటిపైన అమర్చి ఉంచుతారు. ఎవరైనా వాటర్ గన్ ఉన్న ప్రాంతం వైపు వచ్చినప్పుడు వెంటనే.. గన్‌లో ఉన్న సెన్సర్లు యాక్టివేట్ అయ్యి వారి మీద రంగులు చిమ్ముతుంది. ఒకవేళ గన్ పరిసరప్రాంతాల్లో ఎవరూ రాకపోతే గన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది. ఇవేగాక ఈ గన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే పిచికారీ కలపడం వల్ల ఇది మంచి శానిటైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఒకేసారి ఎనిమిది లీటర్ల రంగును గన్‌లో నింపవచ్చు. గన్‌లో 12 ఓల్టుల బ్యాటరీతోపాటు ఇన్ఫ్రారెడ్ సెన్సర్, అల్ట్రాసోనిక్ సెన్సర్ స్విచ్, ఎల్ఈడీ లైటు ఉంది. ఇన్ని హంగులున్న వాటర్ గన్ను విశాల్ పదిహేను రోజుల్లో తయారు చేయడం విశేషం. దీని ధర దాదాపు రూ.750 మాత్రమే. బనారస్ హిందూ యూనివర్సిటీ కోఆర్డినేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిహేవియర్ ఆర్ట్స్ సెంటర్‌కు చెందిన మనీష్ అరోరా మాట్లాడుతూ.. వాటర్ గన్ వినూత్న ఆలోచన అని, సురక్షితంగా హోలీ జరుపుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ప్రశంసించారు. రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ సెల్ ఇన్చార్జ్ శ్యామ్ ఛౌరాసియా మాట్లాడుతూ.. ఈ సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విశాల్ పటేల్ వాటర్ గన్ రూపొందించి గొప్ప పనిచేశాడని అభినందించారు. -
కరోనా టెర్రర్.. హోలీ పండుగపై నిషేధం
సాక్షి, ముంబై: కరోనా వైరస్ రోజరోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ముంబైలో ఏటా ఎంతో ఘనంగా జరుపుకొనే హోలీ పండుగపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. రాజధానిలో రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ వెల్లడించారు. నగరంలోని భవనాలు, సొసైటీ కాంపౌండ్లలో, చాల్స్ ఆవరణంలో, రోడ్లపై, మైదానాలలో, బహిరంగ ప్రదేశాల్లో హోలీ దహనకాండ కార్యక్రమం నిర్వహించకూడదని చహల్ ఆదేశించారు. నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జరిమానా, కొద్ది నెలలు జైలు శిక్ష విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. మైదానాలపై నిఘా.. రాష్ట్రంతోపాటు ముంబైలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే ప్రధానంగా జనాలు ముఖాలకు మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటివి కచ్చితంగా పాటించాలి. అయితే ఈ నెల 28న (ఆదివారం) హోలీ దహనం, మరుసటి రోజు (సోమవారం) రంగులతో ఆడుకునే వేడుక ఉంటుంది. కానీ, ఆదివారం రాత్రి మైదానాలలో, రోడ్లపై, నివాస భవనాలు, సొసైటీ కాంపౌండ్లలో, చాల్స్‌లో జరిగే హోలీ దహన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడతారు. ఆ తరువాత కట్టెలు, పిడకలు, గడ్డితో పేర్చిన హోలీని దహనం చేస్తారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తిని మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం రంగులు పూసుకోవడం, జల్లుకునే వేడుక ఉంటుంది. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్) దీంతో పిల్లలు, యువతి, యువకులు, పెద్దలు, వృద్ధులు ఇలా వయోబేధం లేకుండా అందరు రంగులు ఆటలు ఆడతారు. ఇది కూడా కరోనా వైరస్‌కు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. దీంతో కరోనా వైరస్ మరింత అదుపుతప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ముంబైకర్లు ఈ సారి హోలి పండుగకు దూరంగా ఉండాలని బీఎంసీ సూచించింది. నివాస సొసైటీలు, చాల్స్, ఖాళీ మైదానలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను నియమించినట్లు చహల్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా సమస్యత్మక ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఉంటుందన్నారు. ఇదిలాఉండగా సోమవారం రోజుంతా హోలీ ఆడిన తరువాత సాయంత్రం అనేక మంది స్నానాలు చేయడానికి సముద్ర తీరానికి చేరుకుంటారు. నగరంలో మెరైన్ డ్రైవ్, చర్నిరోడ్, వర్లీ సీ ఫేస్, శివాజీ పార్క్, మాహీం, బాంద్రా, అక్సా బీచ్, జుహూ, గొరాయి బీచ్ తదితర సముద్ర తీరాలవద్ద రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కూడా బీఎంసీ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. అదే రోజు రాత్రులందు కూడా బార్లు, పబ్‌లపై కూడా నిఘావేస్తారని ఆయన అన్నారు. అయితే హోలీ పండుగను జరుపుకొనేందుకు ముంబై, పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్ తదితర ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు రావొద్దని ఇదివరకే వారి కుటుంబ సభ్యులు సూచించిన విషయం తెలిసిందే. ఇక్కడ కరోనా లేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మీరొచ్చి చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని స్వగ్రామానికి రావద్దని వారి బంధువులు ఫోన్లో తెలియజేస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా స్వగ్రామానికి రావల్సి వస్తే తనకు కరోనా లేదు అని వైద్యుడి నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్) అయోమయంలో వ్యాపారులు.. ముంబైలో హోలీ పండుగను నిషేధించడంతో దీనిపై ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలు ఆయోమయంలో పడిపోయాయి. ముంబై శివారు ప్రాంతాల్లో నివాసముండే పేదలు హోలీ పండుగకు ముందే ఎంతో కష్టపడి పిడకలు, గడ్డి మోపులు, కట్టెల రాసులు సిద్దం చేసుకుంటారు. వాటిని ట్రక్కులు, టెంపోలలో ముంబైకి తీసుకొచ్చి విక్రయిస్తారు. ఇలా హోలీ పేదలకు, వ్యాపారులకూ ఉపాధినిస్తుంది. కానీ, హోలీ పండుగను నిషేధించడంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. నిషేధం కారణంగా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రారు. దీంతో పెద్దఎత్తున పిడకలు, గడ్డి, కట్టెలు ముంబై తీసుకొచ్చి విక్రయించాలన్న లేదా తిరిగి తీసుకెళ్లాలంటే రవాణ చార్జీలు వృథా అవుతాయని ఆందోళన చెందుతున్నారు. వాటిని వచ్చే సంవత్సరం వరకు నిల్వ ఉంచాలంటే స్థలం కొరత, ఆ తరువాత వర్షం నుంచి కాపాడటం పెద్ద సమస్యగా మరనుంది. దీంతో వారు ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే హోలి పండుగపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా అనేక మంది పేద కుటుంబాలకు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాలుగు డబ్బులు సంపాదించుకునే హోలీని కూడా నిషేధించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కమీదా తాటికాయ పడ్డ చందంగా మారింది. -
కరోనా ఎఫెక్ట్: దయచేసి హోలి పండుగకు ఊరు రావొద్దు
సాక్షి, ముంబై: ఈ సారి హోలి పండుగకు ఊరికి రావొద్దని ముంబైలో ఉంటున్న తమవారికి గ్రామాల్లో ఉన్న బంధువులు ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనూ హోలి పండుగపై అధికారులు ఆంక్షలు విధించడంతో రావొద్దని కోరుతున్నారు.ఏటా ఎంతో ఘనంగా, ఆర్భాటంగా నిర్వహించే హోలి పండుగా ఈ సారి కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహించాలని అనేక గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేగాకుండా కలెక్టర్లు హోలి పండుగపై కొన్ని మార్గదర్శక సూచనలు జారీ చేశారు. అందులో పట్టణాల్లో ఉంటున్న తమ బంధువులను, పిల్లలను, ఇతర కుటుంబ సభ్యులను స్వగ్రామాలకు రావొద్దని చెప్పాలని పేర్కొన్నారు. అంతేగాకుండా పల్లెటూర్లలో జరుగుతున్న హోలి పండుగ కార్యక్రమాన్ని ఆన్లైన్లో, కేబుల్ నెట్వర్క్ లేదా వెబ్సైట్ తదితర మాధ్యమాల ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించాలని కలెక్టర్లు కోరారు. ఒకవేళ బంధువులు వేడుకలకు రావాలనుకుంటే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చేతపట్టుకుని రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) రత్నగిరిలో వైభవంగా.. ఏటా స్వగ్రామంలో జరిగే హోలి పండుగకు హాజరయ్యేందుకు ముంబై, పుణే నుంచి పెద్ద సంఖ్యలో రత్నగిరి, సింధుదుర్గ్ తదితర జిల్లాలకు బయలుదేరుతారు. ఈ ఏడాది హోలి పండుగ ఈ నెల 29వ తేదీన ఉంది. దీంతో 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29 సోమవారం హోలి ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కూలీలు, ఇతర రంగాల కార్మికులు స్వగ్రామాలకు బయలు దేరేందుకు ఇప్పటి నుంచి సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. కానీ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని హోలి పండుగకు స్వగ్రామాలకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ హోలి పండుగ జరుపుకోవడం లేదని, మీరు రావద్దని ఫోన్లో చెబుతున్నారు. దీంతో ఏటా సొంత ఊళ్లలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవల్సిన హోలీ పండుగను ఈ సారి ముంబైలోనే ఒంటరిగా లేదా మిత్రుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు వాపోతున్నారు. ఒకవేళ ఊరు వెళ్లాల్సి వస్తే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని చెప్పడంతో అయోమయంలో పడిపోయారు. చదవండి: (సెకండ్ వేవ్ భయం.. లాక్డౌన్ దిశగా కర్ణాటక!?) -
జాజిరి.. జాజిరి.. జాజిరేయ్!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : హోలీ పర్వదినంలో భాగంగా మొదటి రోజు పులారా కార్యక్రమాన్ని ముగించిన ఆదివాసీలు రెండో రోజు మంగళవారం రంగోత్సవం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కాముని దహనం చేసిన చోటే రాత్రంతా జాగరణ చేశారు. ఆటలు ఆడారు, పాటలు పాడారు. ఆచారాలు, సంస్కృతిని కాపాడుతున్న ఆదివాసీలు మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. బూడిదను దొంగలిస్తారని... ‘మాతారి మాతరల్’, కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేశారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో భాగం. అందుకే వేరేవారు ఎవ్వరూ కాముని దహనం చేసిన బూడిదను దొంగలించకూడదనే ఉద్దేశంతో గ్రామంలోని పురుషులందరూ బూడిదకు రక్షణగా రాత్రంతా జాగరణ చేశారు. అంతకు ముందు కాముడి చుట్టూ సంప్రదాయ ప్రదర్శన చేశారు. సుమారు గంట సేపు డోలు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. లకాముని దహన స్థలంలో ఆదివాసీల భోజనాలు గుడాలే నైవేద్యంగా పులారా అనంతరం దురాడి రోజు మంగళవారం ఆయా ఆదివాసీ గ్రామాల్లోని పురుషులు ఉదయాన్నే మేల్కొని ఇంట్లో వంట చేసిన గుడాలతో గొడ్డలి, గడ్డపారలతో పొలిమేర వద్దకు వెళ్లి పొదలు కొట్టారు. నైవేద్యపు నీళ్లు చల్లి, పూజలు చేశారు. ఇప్పటి నుంచి పొలం పనులు ప్రారంభిస్తామని గ్రామ పటేళ్లు చెప్పారు. దురాడి తెల్లారి పొదలు కొట్టడం లాంటి కార్యక్రమంలో పొలం పనులు ప్రారంభిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారు చెబుతున్నారు. అనంతరం మళ్లీ కాముడి దహనం వద్దకు వెళ్లి గుడాలను నైవేద్యంగా సమర్పించారు. అక్కడే వాటిని ఆరగించాక కాముడి బూడిదను తీసుకెళ్లి తమతమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లారు. ఇలా చల్లడం వల్ల బయట శక్తులు ఇళ్లలోకి ప్రవేశించవని వారి నమ్మకం. ఇంటింటికి ‘బోజర’ రెండు రోజుల కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాక చివరిగా డోలు వాయిస్తూ ‘జాజిరి.. జాజిరి.. జాజిరేయ్’ అంటూ ప్రతి ఇంటికీ తిరుగుతూ బోజర(ధర్మం) అడిగారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి బోజర అడుక్కున్నారు. దీంతో పల్లెలు డోలు వాయిద్యాలతో మారుమ్రోగాయి. మధ్యాహ్నం తర్వాత సమీప వాగుల్లో స్నా నాలు చేసి తమతమ ఇళ్లకు బయలుదేరారు. ప్రదక్షిణలు చేస్తున్న ఆదివాసీలు -
దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు..
-
వారసులను కోల్పోయిన రెండు కుటుంబాలు
మదనపల్లె టౌన్ : హోలీ పండుగ రోజు బడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న ఇద్దరు పిల్లలు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ సమీప బంధువులు. కాగా రెండు కుటుంబాలకూ ఆ ఇద్దరే వారసులు కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. సోమవారం మదనపల్లె మండలం చీకలబైలులో ఈ విషాదకర సంఘటన జరిగింది. రూరల్ పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు చీకలబైలుకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాసులు, భార్య గౌరవమ్మ కుమారుడు సందీప్(13), అదే ఊరికి చెందిన బావమరిది కుక్కల ఈశ్వరయ్య, గంగారాణి కుమారుడు గణేష్(9) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. సోమవారం హోలీ పండుగ కావడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నారు. ఊరికి సమీపంలో ఉన్న శ్రీనివాసులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. సరదాగా అక్కడ వెంకటమ్మ చెరువు నీటికుంటలో ఈత ఆడేందుకు నీళ్లలోకి దిగారు. వారికి ఈత రాదు. లోతు ఎక్కువగా ఉన్న కుంట నీటిలో మునిగిపోయారు. బట్టలు ఉతుకున్న గ్రామస్తురాలు పాపులమ్మ గమనించి కేకలు వేసింది. సమీపంలో ఉన్న రైతులు పరుగున వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హరిహరప్రసాద్, తహసీల్దార్ సురేష్‌బాబు, వీఆర్వో ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కదిరి పౌర్ణమి రోజు విషాదం హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే మొలకల, కదిరి పున్నమి రోజు చీకలబైలు గ్రామంలో విషాదం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లలు ఈతకెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్కూలుకు వెళ్లి ఉంటే బతికివుందురే మా బిడ్డలు రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూలుకు వెళ్లి ఉంటే బతికుందురే..దేవుడా ఎందుకు వారిని స్కూల్‌కు వెళ్లనీయకుండా చేశావు. మాపై ఎంత అసూయ ఉంటే వారిని దూరం చేసి, కడుపుకోత మిగిల్చావు. మా కుటుంబాలకు వారసులను దూరం చేశావే. మమ్మల్ని కూడా ఇప్పుడే తీసుకెళ్లిపో’ అంటూ మృతుల తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. -
అందరికీ హోలీ శుభాకాంక్షలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.(ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్) May the festival of colors bring immense joy, peace, and prosperity in your lives. Wishing you and your loved ones a very happy, safe and colorful Holi. #HappyHoli — YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2020 హోలీ పండుగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల వసంతోత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
రంగుల కేళి.. కరోనాతో జాగ్రత్త మరి
సాక్షి సిటీబ్యూరో: హోలీ.. రంగుల పండుగ. ప్రేమానురాగాలకు ప్రతీక. అలాంటి పండుగతో ఇష్టానుసారం రంగులు వాడి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దంటున్నారు నిపుణులు. సహజసిద్ధ రంగులను వినియోగించి హోలీని ఆనందాల పండుగగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. కరోనా ప్రభావం ప్రతి ఏటా హోలి పండుగ అనగానే అందరూ రంగులు చల్లుకునే వారు. అయితే ఈ ఏడాది హోలీ సందడి తగ్గిందనే చెప్పవచ్చు. కారణం కరోనా ప్రభావం. మార్కెట్లో రంగులు పెద్దగా కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నగరంలో హోలీ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లకు కూడా పెద్దగా ఆదరణ లేదు. ప్రేమను పెంచుకోండి... హోలీ అంటేనే రంగులు, మిఠాయిలు. హోలీతో అనుబంధాలు పెంచుకోవాలి తప్ప రోగాలను తెచ్చుకోవొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వల్ల శరీరంతో పాటు ప్రకృతికి కూడా మేలు చేసిన వారమవుతామన్నారు. హోలీ సందర్భంగా వినియోగించే ఒక్కో రంగు ఒక్కో భావానికి ప్రతీకగా నిలిచినట్లే ఆయా రంగుల్లోని ఒక్కో రసాయనం ఒక్కో జబ్బుకు కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండాలి హోలీ వేడుకల్లోఅప్రమత్తంగా ఉండకపోతే సమస్యలు కొనితెస్తుంది అంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వైద్యురాలు డా.ఆర్.రాజ్యలక్ష్మి. ఆమె అందిస్తున్న సూచనలివి... ♦ రంగులలో వెజిటబుల్స్, ఫ్లవర్ డైలు ఉపయోగిస్తున్న సహజ రంగులు తగిన పరిమాణంలో లభ్యం కావడం లేదు. దీంతో సింథటిక్ కెమికల్ కలర్స్ విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. తద్వారా రకరకాల ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపుపై ఈ తరహా రంగులు చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి హోలీ ఆడే సమయంలో... ♦ కంటి చుట్టూ ఉండే చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది. కొబ్బరినూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తగినంత కంటి చుట్టూ అప్లయి చేయడం మంచిది. అలాగే నాణ్యమైస సన్‌గ్లాసెస్ కూడా వినియోగించడం అవసరం. రంగులు కంటిలో, నోటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా అనుకోకుండా కళ్లలో రంగులు ప్రవేశిస్తే వాటిని నలపడం వంటివి చేయకూడదు. శుభ్రం చేసుకున్న చేతులలో నీళ్లు పోసుకుని అరచేతుల్లో కళ్లు ఆర్పుతూ మూస్తూ క్లీన్ చేసుకోవాలి. అంతే తప్ప కంటిపై నీళ్లను గట్టిగా చల్లకూడదు. వాటర్ బెలూన్స్ వినియోగం వద్దు. ఇవి కంటికి చాలా ప్రమాదకరం. కళ్లజోడు ఫ్రేమ్స్ లో ఉండిపోయే రంగులు తర్వాత తర్వాత ఇబ్బందులు సృష్టించవచ్చు. రిమ్లెస్ కళ్లజోళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్‌లు వాడే అలవాటు ఉంటే వాటికి రంగుల పండుగ రోజు దూరంగా ఉండాలి. -
పాక్‌లో పండుగ సంబరాలు : వైరల్ వీడియో
ఇస్లామాబాద్ : ప్రపంచవ్యాప్తంగా మత, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజల్ని సమీకృతం చేసే ఏకైక సందర్భం పండుగలు. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్, భారత మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాసగుతుండగా మరోవైపు పాకిస్తాన్లో హోలీ సంబరాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇపుడు హల్చల్ చేస్తోంది. నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్-ఐ-అజమ్ యూనివర్సిటీ విద్యార్థులు హోలీ సంబరాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మార్చి 25వ తేదీన విశ్వవిద్యాలయ మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమతాలకతీతంగా అందరూ స్టెప్పులేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పుల్వామా ఉగ్రదాడి దాయాది దేశాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని రాజేసింది. ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకు వెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
రక్తపుటేరులు
రంగుల హోలీ సంబరాల్లో మునిగి ఆ మధుర జ్ఞాపకాలతో సొంతూరుకు పయనమైన యువకులపై మృత్యువు కర్కశంగా విరుచుకుపడింది. అతివేగమే ప్రాణం తీసింది. వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోవాకు వెళ్లిన తమ పిల్లలు వస్తున్నారని ఇళ్లలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయారు. విజయపుర జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. సాక్షి, బళ్లారి: కర్ణాటకలో శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.« మూడు రోజుల కిందట ధార్వాడ నగరంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో 12 మంది మృతి చెందిన ఘటన మరవకముందే విజయపుర జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సంభవించింది. శుక్రవారం విజయపుర జిల్లా సింధగి తాలూకా, చిక్క సింధగి సమీపంలోకి జాతీయ రహదారి 218లో క్రూసర్–లారీ ఢీకొనడంతో ఘటన స్థలంలోనే 9 మంది మృతి చెందడంతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో పాటు ఆ ప్రాంతం రక్తమడుగుతో భీతావహంగా మారింది. మృతులు అందరూ కూలికార్మికులు కాగా గోవాలో హోలీ సంబరాలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కలబుర్గి జిల్లాకు చెందిన కట్టడ కూలి కార్మికులు గోవా నుంచి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో క్రూషర్లో ఉన్న వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. దీంతో అక్కడికక్కడే 9 మంది మృతి చెందడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కలకలం సృíష్టించింది. మృతులను సాగర్ (24), చాంద్‌బాషా (22), అజీం (21), అంబరీష్ (29), కే.కే.షాకీర్ (25), శ్రీనాథ్ (30), యూసఫ్ (27), గురు (21), మాబుసాబ్ (29)లుగా గుర్తించారు. హోలీ సంబరాలను ఆనందంగా చేసుకుని తిరిగి వస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో చిత్తాపురలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, కట్టుకున్న భర్త అకాల మృత్యువు చెందడంతో భార్య రోదనలు చిత్తాపురలో కలిచివేశాయి. సింధగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతివేగమే ప్రాణం తీసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
హోలీ.. కేళీ
-
‘అంతిమ’ ప్రయాణం
కారేపల్లి: హోలీ పండగకు వచ్చి..తిరిగి హైద రాబాద్‌కు బయల్దేరిన ఓ యువకుడు రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసు కుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గొల్లపల్లి లక్ష్మాతండాకు చెందిన బాణోతు యుగంధర్ (25) ఈ ప్రమాదంలో చనిపోయాడు. పాలిటెక్నిక్ డిప్లొమా, టీటీసీ పూర్తి చేసిన ఇతను హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇటీవల హైదరాబాద్ నుంచి ఇంటికి (లక్ష్మాతండా) వచ్చాడు. హోలీ పండగను ఆనందంగా జరుపుకొని ఆదివారం రాత్రి 10గంటల సమయంలో బొమ్మనపల్లిలో లారీ ఎక్కి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కాకతీయ ఫాస్ట్ పాసింజర్ రైలు ఎక్కిన యుగేందర్, రైలు డోర్ వద్ద కూర్చొని ఉంటాడని, గాంధీపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొమ్ముగూడెం గేటు అతి మూల మలుపు వద్ద వెనుకనుంచి డోర్ వేగంగా నెట్టివేయడంతో అదుపు తప్పి రైలు కిందపడి మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన కొమ్ముగూడెం గ్రామస్తులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం రైలు కిందికి దూసుకుపోవటంతో..సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకుపోయి..నుజ్జునుజ్జుగా మారింది. ఘటనా స్థలంలో ఆ«ధార్ కార్డు, చేతివేలికి ఉన్న ఉంగరం, సెల్‌ఫోన్ ఆ«ధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యుగేందర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడా..? లేక ఆత్మహత్యానా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాంధీపురం రైల్వే స్టేషన్ నుంచి కారేపల్లి రైల్వే స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ అత్యంత మూలమలుపు కలిగి ఉంటుంది. ఇక్కడ బోగీలు ఓవైపునకు ఒంగినట్లు అవుతాయి. అప్పుడు డోర్ వద్ద ఉన్న వారు ప్రమాదాలకు గురవుతుండడం ఇటీవల పెరిగింది. లక్ష్మాతండాలో విషాదం.. టేకులపల్లి: చేతికి అందొచ్చిన కొడుకు ఉద్యోగం చేసి ఇంటికి ఆసరాగా ఉంటాడనుకుంటే..ఇలా దుర్మరణం చెందడంతో..అతడి స్వగ్రామం బొమ్మనపల్లి పంచాయతీ లక్ష్మాతండాలో విషాదం అలుముకుంది. మాజీ సర్పంచ్ బాణోతు ఆల్యానాయక్, సోనా దంపతుల కుమారుడైన ఇతను ఇంటర్మీడియట్ వరకు కొత్తగూడెంలో చదివాడు. డిప్లొమా, ఉపాధ్యాయ శిక్షణ హైదరాబాద్‌లో పూర్తి చేసి, ఇటీవల టీఆర్టీ పరీక్ష కూడా రాశాడు. హోలీ పండగకు స్వగ్రామానికి వచ్చి..ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరి..ఇలా ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ సందర్శించారు. -
హోలీ వేడుకల్లో విషాదం
ఆదిలాబాద్‌రూరల్: పట్టణంలోని శాంతినగర్‌లో హోలీ వేడుకల్లో విషాదం నెలకొంది. శాంతినగర్‌కు చెందిన వసంతు, కమలబాయి దంపతుల రెండవ కుమారుడు పవర్ శ్రీనివాస్ (17) హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో కలిసి మండలంలోని లాండసాంగ్వి వాగుకు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యాడు. తోటి మిత్రులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీనివాస్ పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పరీక్షకు సైతం హాజరయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు..
-
హోలీ సంబరాల్లో కిరాక్ పార్టీ హీరో
-
రంగు భళా.. రక్షణ ఇలా
సాక్షి, సిటీబ్యూరో : రంగులతో ఆడుకోవడం.. ఈ పండగ ప్రధాన ఆకర్షణ. రంగులుపరస్పరం చల్లుకోవడం,రంగు నీళ్లలో మునిగితేలడం... ఇవి లేని హోలీ లేదు. ఒక్క రంగు అంటేనే అందం.. ఇక అన్ని రంగులు కలిస్తే అందమే ఆనందం. అందుకే హోలీ అందమైన పండగ. ఇందులో యువతీయువకుల సంబరం మరింత ఎక్కువ. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా సాగే ఈ సంబరంలో... ఎలాంటిచెడు మనకి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సిటీకి చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్ డాక్టర్ వాణి. ముఖ్యంగా ఈ పండుగసమయంలో అత్యధిక ప్రభావానికి లోనయ్యే చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షించుకోవడంపై ఆమె అందిస్తున్నసలహాలివీ... ♦ రంగులతో ఆడుకునే ముందు తగినంత నూనెను చర్మానికి దట్టించాలి. ఈ ఆయిల్.. నీటి ఆధారిత రంగుల ప్రభావాన్ని తిప్పికొడుతుంది. చర్మానికి రంగు గాఢంగా అంటకుండా చూస్తుంది. ♦ ఎండలో ఆడతారు కాబట్టి.. ఆటకు కనీసం 20 నిమిషాల ముందుగా సన్‌స్క్రీన్ అప్లయ్ చేయడం మంచిది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఎస్పీఎఫ్ శాతం 30 కన్నా ఎక్కువ మొత్తంలో ఉన్నసన్స్క్రీన్ మంచిది. అదే విధంగా సరిపడా మాయిశ్చరైజర్‌ని శరీరం మీద అప్లయ్ చేయడం ద్వారా చర్మం హైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు. ♦ గోళ్లకు నెయిల్ వార్నిష్లను రక్షణ కవచంగా ఉపయోగిస్తే రంగులు గోళ్లను పాడుచేయకుండా జాగ్రత్త పడొచ్చు. ♦ కంట్లో గాఢమైన రసాయనాలు కలిసిన రంగులు పడితే చూపునకు హానికరంగా పరిణమిస్తుంది. కంటికి రక్షణ అందించే కళ్లద్దాలు తప్పనిసరిగా వాడాలి. అయితే కాంటాక్ట్ లెన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడం మంచిది కాదు. ♦ మనం ఎంతో మురిపెంగా చూసుకునే హెయిర్ స్టైల్‌ను కూడా పాడు చేసే శక్తి ఈ రంగులకు ఉంది. అలాగే తల మీద చర్మానికి కూడా హాని చేస్తాయి. అందుకని హెయిర్‌ని గట్టిగా దగ్గరకి అల్లి బన్ తరహాలో ముడేయాలి. తద్వారా వీలున్నంతగా నష్టాన్ని తగ్గించొచ్చు. ♦ ఎండ వేడికి హైడ్రేట్ అయిన చర్మం మరింత తేలికగా దుష్ప్రభావానికి లోనవుతుంది. కాబట్టి.. పండ్ల రసాలు, మంచి నీరు లేదా గ్లూకోజ్ వాటర్ బాగా తీసుకోవాలి. ♦ ఫుల్ నెక్ లేదా ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు వినియోగిస్తే మంచిది. ఎంత వరకు వీలైతే అంత వరకు నేరుగా రంగులు చర్మాన్ని తాకకుండా జాగ్రత్తపడితే మంచిది. ♦ హోలీకి ముందుగా వ్యాక్స్ (వెంట్రుకలనుతొలగించడం) చేయించుకోవద్దు. సున్నితంగా ఉన్న చర్మం మరింత త్వరగా రంగులప్రభావానికి గురవుతుంది. ♦ రంగుల్లో తడిసిన కారణంగా ఏదైనా అలర్జీ లాంటి రియాక్షన్ కలిగినట్టు గమనిస్తే... అలర్జీ సోకిన ప్రాంతాన్ని స్వచ్ఛమైన చల్లని నీటితో కడగాలి. అవసరాన్ని బట్టి సమీపంలోని చర్మ వైద్యులను సంప్రదించాలి. ♦ పండగ సందడి ముగిశాక, వీలైనంత త్వరగా సున్నితమైన క్లీన్సర్స్ను ఉపయోగించి చర్మంపై పేరుకున్న రంగుల్ని తొలగించుకోవాలి. దీనికి గాఢమైన ఆల్కలీ సబ్బులు లేదా షాంపులు వాడితే అవి మరింతగా చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. -
వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. రాజేంద్రనగర్: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్‌ఫుల్‌ఈవెంట్‌లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్‌సైన్స్ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది. రంగులు లభించే ప్రాంతాలు.. సైఫాబాద్ హోమ్‌సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్ స్వీట్ హౌస్, హైదర్‌నగర్‌లోని 24మంత్ర ఆర్గానిక్ షాప్ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. కిలో రూ.400 హోమ్‌సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్‌లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058. పెరుగుతున్న డిమాండ్.. ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం. – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్ ప్రిన్సిపల్, హోమ్‌సైన్స్ కాలేజీ ఉపయోగాలు... ♦ ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ♦ శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు. ♦ పర్యావరణంపై ప్రభావం చూపవు. ♦ శుభ్రపరుచుకోవడం చాలా తేలిక. ♦ నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ. ♦ భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక వాడం.. సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్లో రంగులు కొనుగోలు చేశాం. – కె.వనజ, హైదర్‌గూడ -
వారణాసిలో హోలీ సంబరాలు
-
చీకట్లు నింపిన హోలీ
⇒ చెరువులు, కాలువల్లో మునిగి 11 మంది మృత్యువాత ⇒ మరో తొమ్మిది మంది గల్లంతు ⇒ మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే.. సాక్షి నెట్వర్క్: సంబరాలు పంచాల్సిన హోలీ పండుగ ఆ కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఆదివారం వివిధ జిల్లాల్లో స్నేహితులతో కలసి సంతోషంగా హోలీ ఆడి చెరువులు, కాలువల్లోకి స్నానాలకు వెళ్లి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు. నల్లగొండ, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నిర్మల్, వనపర్తి, జనగామ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. పండగపూట తమవారిని పొగొట్టుకొన్న కుటుంబాలు కన్నీరుమున్నీ రయ్యాయి. ఎక్కువ మంది యువకులు, విద్యార్థులే.. భద్రాచలం పట్టణానికి చెందిన మోరుపూడి రాంప్రసాద్(19), బోటా రమేశ్(19) స్నేహితులతో హోలీ ఆడి గోదావరిలోకి స్నానానికి వెళ్లారు. నీటి ఉధృతికి వారిలో ఐదుగురు కొట్టుకుపోతుండగా.. అక్కడున్న గజ ఈతగాళ్లు ముగ్గుర్ని రక్షించారు. రాంప్రసాద్, రమేశ్ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానందనగర్‌కు చెందిన ఇంటర్ చదివే విద్యార్థి శివరాం(13) ఉదయసముద్రం చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి నీటమునిగి మృత్యువాత పడ్డాడు. నల్లగొండలోని సతీశ్నగర్కు చెందిన కృష్ణ కుమార్ (27) పట్టణ శివారులోని ఉదయసముద్రం చెరువులో జారిపడి చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా బోరబండ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(16), గణేశ్(15) స్నేహితులతో కలసి మొయినాబాద్‌లోని గండిపేట చెరువుకు స్నానానికి వెళ్లి నీటమునిగారు. వీరిలో పవన్‌కుమార్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. గణేశ్ కోసం గాలిస్తున్నారు. ఇదే జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో పల్లోల నాగరాజు (23) స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి చనిపోయాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సాయికుమార్(17) ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. రాత్రి వరకు గాలించినా దొరకలేదు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్‌కు చెందిన తుంకి శ్రీనివాసరెడ్డి(24) గ్రామ శివారులోని చెరువులో మునిగి గల్లంతయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థి బైరి మహేశ్(15) హోలీ ఆడి సాయంత్రం స్నానానికి వాగులోకి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఎం.శివకుమార్‌చారి స్నేహితులతో కలసి సరళాసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ బైక్ అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఫతేపురానికి చెందిన ఐటీఐ విద్యార్థి నరేశ్(21) చెరువులోకి ఈతకు వెళ్లి చనిపోయాడు. జనగామలోని గణేశ్‌నగర్‌కు చెందిన క్రాంతికుమార్(19), నాగరాజు(10) నర్మెట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో బైరి వీరేష్(9), నర్ర చరణ్(10) హోలీ వేడుకల తర్వాత ఊరి పక్కనే ఉన్న చెరువు వద్దకు స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం ఠాగూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అమరవాది చెరువుకు స్నానానికి వెళ్లి అందులో గల్లంతయ్యాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారానికి చెందిన పొట్టాల సంపత్ (36) కాకతీయ కాలువలో మునిగి చనిపోయాడు. ఇదే జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన పదో తరగతి విద్యార్థి రాజశేఖర్ ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాచన్పల్లికి చెందిన కనక బబ్లూ(17) హోలీ తర్వాత స్నానానికి చెరువుకు వెళ్లి బురదలో కూరుకుపోయి చనిపోయాడు. రంగు నీళ్లనుకొని.. కిరోసిన్ చల్లి.. రంగు నీళ్లు అనుకొని కిరోసిన్ చల్లడంతో మంటలు అంటుకొని బీటెక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం దేవుని చెరువుతండాకు చెందిన జర్పుల చందూనాయక్(24) చంపాపేట సమీపంలోని సింగరేణి గుడిసెల్లో సోదరుడి ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో హోలీ ఆడుతుండగా.. పక్కనే ఉండే ఓ యువతి చందూనాయక్ తలపై గుడ్డు కొట్టింది. దీంతో రంగు చల్లేందుకు వెళ్తుండగా.. ఆమె పక్కనే డబ్బాలో కిరోసిన్‌ను రంగునీళ్లు అనుకొని చందూనాయక్‌పై చల్లింది. తప్పించుకునే ప్రయత్నంలో చందూ పక్కన ఉన్న కట్టెల పొయ్యి వద్ద పడ్డాడు. దీంతో మంటలంటుకున్నాయి. 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
రంగుల కేరింత
సప్తవర్ణ శోభిత రంగుల్లో హోలీ పండుగను ఆదివారం జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనంద హేళిలో మునిగితేలారు. హోలీ పూర్ణిమ వసంత రుతు ఆగమనానికి సంకేతం. విజయానికి ప్రతీకగా ఈ హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పట్టణాలు, నగరాల్లో చిన్న పిల్లల నుంచి యువత రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టడం కనిపించింది. ఎదురుపడిన స్నేహితులకు రంగులు చల్లి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయక యువత హోలీ సంబరాలలో మునిగితేలింది. ప్రధానంగా చిన్నారులు, యువతీ యువకులు హోలీ వేడుకలతో సరదాగా గడిపారు. కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు, నగర వీధుల్లో హోలీ వేడుకలు హోరెత్తాయి. ముఖ్యంగా తిరుపతి నగరంలో మార్వాడీలు, చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల హోలీని ఆడంబరంగా జరుపుకున్నారు. - తిరుపతి కల్చరల్ -
రంగ్ బర్సే
-
ఈ జీవితం వర్ణశోభితం
హోలీ పూర్ణిమ వసంత రుతు ఆగమనానికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే, వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. అదేవిధంగా, పాతకోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ ఉంటాయన్నమాట. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. పురాగాథ ఏమిటంటే, లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు, తన స్నేహితుడైన వసంతుడిని వెంటబెట్టుకుని వెళ్లి, తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మథుడు. తపోభంగం కావడంతో శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. అయితే, మన్మథుడి భార్య రతీదేవి పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో, సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి ఆమెకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు, మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే, అతను రతీదేవికి తప్ప మరెవరికీ తన రూపంలో కనిపించడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి, తన బాణాలద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారు చేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఫాల్గుణ పూర్ణిమనాడు పెళ్లికాని యువతీ యువకులు ఒకచోట చేరి, వసంతం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దీనిద్వారా వారికి గల పరస్పర ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసుకుంటారు. పెద్దలు వారి ప్రేమను ఆమోదిస్తారు. రాధాకృష్ణుల రంగుల కేళీ: రాధాకృష్ణులు ఓరోజున ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమెపై రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా బయటకు పరుగులు తీసిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో ఆనాడు రంగుల పండుగ చేసుకున్నారట. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. హోలికా పేరు మీదుగానే: హిరణ్యకశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. ఆమెకు అనేక దుష్టశక్తులతోపాటు మంటలలో దూకినా కాలిపోని వరం ఉంది. హోలిక చాలా దుష్టురాలు, దుర్మార్గురాలు. పసిపిల్లలను ఎత్తుకుపోయేది. తన కుమారుడయిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ మానకపోయేసరికి హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే, హోలిక మాడిపోగా, ప్రహ్లాదుడు సురక్షితంగా బయట పడ్డాడు. దుష్టరాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు చిమ్ముకుంటూ ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి పేరు మీదుగా ‘హోలీ’ అనే పేరు వచ్చిందట. ఇవే కాకుండా హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలోని దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం అనే సుగుణాలతో కూడిన లే లేత ఆకులను చిగురింపచేసుకోవాలి.ఈ రోజున ఏం చేస్తే మంచిదంటే... మహాలక్ష్మి ఫాల్గుణ పూర్ణిమ నాడే పాలకడలి నుంచి ఆవిర్భవించిందని, అందుకే ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణోక్తి. ఈ రోజున బాలకృష్ణుని ఊయలలో వేసి ఊపుతారు. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో డోలోత్సవంగా జరుపుకుంటారు. అయ్యప్ప పంబల రాజుకు కనపడింది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడేనని, కనుక ఈ వేళ అయ్యప్పకు పూజలు చేస్తే మంచిదని విశ్వాసం. అలాగే ఈ వేళ రతీమన్మథులను పూజించడమూ మంచిదే. అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి అనే రాక్షసి పీడను వదిలించుకునేందుకు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. హోలీపండుగ రోజున లేలేత మావిచిగుళ్లు తింటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని శాస్త్రోక్తి. -
లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఉత్సవం జరుపుకునే సందర్భానికి తగ్గట్టు ఈ పాట రాశాను. విజయం సాధించే సమయానికే హోలీ పండుగ కూడా వస్తుంది. అలా ఈ పాటను సందర్భోచితంగా హోలీ పండుగను అన్వయిస్తూ రాశాను. ఈ సినిమా పెద్దగా ఆడకపోవటం వలన ఈ పాట కూడా అందరికీ ఎక్కువగా తెలియదు. కాని నాకు చాలా బాగా నచ్చిన పాట, బాగా వచ్చిన పాట కూడా ఇది. హరివిల్లులో ఉండే రంగులను, హోలీ రంగులకు... మనుషుల్లో ఉండే భావాలకు అన్వయిస్తూ ఈ పాట రాశాను. ఆ ఊరి వారంతా వారి ఆనందాన్ని, సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఉత్సాహంగా నాట్యం చేస్తూ పాడుకునే పాట. ఇది మంచి ఆలోచనతో సాగే పాట. హరివిల్లే వరదల్లే ఇలపైకి దిగివచ్చే సింగారంగా రంగల్లే విరిజల్లే వరమల్లే ఎదలోకి ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు చెంగుమంటూ చిందులేద్దామా నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు ముంగిలంతా ముగ్గులేద్దామా హరివిల్లు అంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సింగారంగా రంగురంగులుగా వరదలా భూమి మీదకు వచ్చాయి. పూలజల్లులు వరాలు ఇస్తున్న చందంగా మనసుల్లోకి గంగా ప్రవాహంలా వైభోగంగా ఎందురొచ్చాయి. అటువంటి ఇంత అందమైన పండుగరోజున అందరం రంగులు చల్లుకుందాం. ఆడుతూ పాడుతూ చెంగుచెంగుమంటూ చిందులు వేద్దాం. మన ఆనందాలన్నీ నింగి హద్దులు దాటాలి. ముంగిళ్లన్నీ ముగ్గులతో నిండిపోవాలి... అంటూ పండుగ సంబరాలు జరుపుకోవడానికి ఒకరినొకరు ఆహ్వానించుకోవడం పల్లవిలో చూపాను. నవ్వే తెలుపంట చూపే ఎరుపంటా నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంటా నీడే నలుపంటా ఈడే పసుపంటా లోలో దాగే ఊహలపొంగే ఊదారంగంటా లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో ఏకంగా కదలాలో శోకాలే సంతోషాలే కొలువుంటవి మదిలో రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే... మొదటి చరణంలో రంగుల విశిష్టతను వివరించాను. మనలోని భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తాయి రంగులు. భౌతికమైన రూపం రంగు. భావోద్వేగాలు మానసికమైనవి. వన్నె కలిపితే అది రంగుగా మారుతుంది. తెలుపు రంగు నవ్వుకి చిహ్నం. ఎరుపురంగు చూపుకి చిహ్నం. ఆశ అనేది జీవచైతన్యానికి ప్రతీక. అది పచ్చరంగులో ఉంటుంది. ఒక కొత్త శక్తి వస్తుంది. అందుకు ప్రతీకగా పచ్చపచ్చగా చిగురించే ఆకుపచ్చ రంగును భౌతిక రూపంగా చూపాను.నీడ నల్ల రంగులో ఉంటుంది. నలుపు భయానికి ప్రతీక. చాలా మంది నీడను చూసి భయపడతారు. పసుపు రంగు ఈడుకి ప్రతీక. పిల్లలకు ఈడొచ్చినప్పుడు పసుపు, గంధం పూస్తాం. అందుకే ఆ రంగుతో పోల్చాను. ఊహలపొంగు ఊదారంగు. మన మనసులో మెదడులో, బుద్ధిలో ఉంటాయి ఊహలు. వాటిని ఊదారంగుతో పోల్చాను. ఇది చాలా అరుదైన రంగు. ప్రతిమనిషిలోనూ ఊహలు బయటికి కనిపించవు. అవి లోలోపలే ఉంటాయి. అందుకే ఎక్కువగా కనిపించని ఈ రంగుతో పోల్చాను. ఊహలు బయటకు రావడం చాలా అరుదు. ఊహ బయటకు వస్తే వాస్తవం అవుతుంది.సృష్టిలోని రంగులన్నీ మనలోనే ఉన్నాయి. ఉద్వేగం, భావం అన్నీ మన మనసులో నుంచే పుడతాయి. పాంచభౌతికమైన మనిషి దేహమే అన్నిటికీ మూలం. ప్రకృతికి ఒక సంక్షిప్త రూపం మానవుడు. ఐదడుగుల రూపంలో మలిస్తే మానవుడు. మానవుడి తాలూకు అన్ని చర్యల్లోను ఒక్కోరంగు ఉంటుంది. మనలోని భావోద్వేగాలు, మనలోని స్పందనలు, మనలోని ఆలోచనలు ఈ రోజు రంగులుగా మారాయి అని చెప్పడం. మోసం నిలవదుగా ద్రోహం మిగలదుగా ఏనాడైనా అన్యాయానికి న్యాయం జరగదుగా పంతం చెదరదుగా ఫలితం దొరికెనుగా ఏ రోౖజ నా మంచికి చెడుపై విజయం తప్పదుగా ఆలోచన బీజం వేసి చెమటే నీరుగ పోసి ఆవేశం ఎరువే వేసి పని చేస్తే పండేనంట ఆనందాలరాసి రెండవ చరణంలో సినిమా కథకు సందర్భోచితంగా రచన సాగింది... అలతి అలతి పదాలతో కవితాత్మకంగా సాగింది ఈ చరణం. ఆనందాల రాసులు కావాలంటే, ఎంత కష్టపడాలో చెప్పడానికి చేనుతో పోల్చాను. ధాన్యరాసులు చేతికి రావడానికి ఎంత కష్టపడాలో, అదేవిధంగా ఆనందాల రాసులను సంపాదించుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. పంతం పడితే అన్నీ లభిస్తాయి. సాధారణ కోణంలో చూస్తే... మంచి గెలుస్తుంది... చెడు ఓడిపోతుంది.... అనిపిస్తుంది. అన్యాయానికి న్యాయం జరగదు అని చెప్పడంలో ఎప్పుడూ న్యాయమే గెలుస్తుంది అని చెప్పడం. మనకు మనసు బాగుండకపోతే ప్రపంచంలో ఏవీ సానుకూలంగా కనిపించవు. మనసు హాయిగా ఉంటే, ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి... మన భావోద్వేగాలకు ప్రకృతి దర్పణం. – సంభాషణ: డా. వైజయంతి -
విస్తారా హోలీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా హోలీ సందర్భంగా తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. విస్తారా ఎయిర్‌లైన్స్, టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఉమ్మడి వెంచర్లో హోలీ పండుగ సందర్భంగా రూ.999తో ప్రారంభమయ్యే తగ్గింపు ధరలను అందిస్తోంది. వీటిని విస్తారా మొబైల్ యాప్, లేదా www.airvistara.com ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ను పొందాలంటే కనీసం 21 రోజులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కలుపుకొని ఒక మార్గంలో అందిస్తున్న ఈ టికెట్లను మార్చి 10 నుండి మార్చి 15 వరకు బుక్ చేసుకోవాలి.అలాగే టికెట్ల ద్వారా మార్చి 30 నుంచి అక్టోబర్ 1, 2017 మధ్య ప్రయాణించవచ్చు. గుర్గావ్-ఆధారిత ఎయిర్‌లైన్స్ గౌహతి-బాగ్డోగ్రా మార్గం రూ 999 దాని ప్రచార ఛార్జీల అందిస్తోంది జమ్మూ- శ్రీనగర్ విమాన టికెట్ రూ 1199లుగా, ఢిల్లీ-లక్నో రూ.1,549లు, ఢిల్లీ-చండీగఢ్ టికెట్ రూ 1649 లుగా ఉండనుంది. వీటితోపాటు, ఢిల్లీ- హైదరాబాద్, గోవా,పుణే , అహ్మదాబాద్ తదితర రూట్లలోనూ తగ్గింపు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు విస్తారా అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయగలరు. -
హోలీకా ఇనామ్..!
► భైంసా చెక్‌పోస్టులో వ్యాపారుల నజరానాలు.. ► ఆర్థిక సంవత్సరం ముగింపులోనూ మారనితీరు ► వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి బాగోతం భైంసా : హోలీ పండుగ అందరినీ రంగుల్లో ముంచెత్తితే.. భైంసా పట్టణ సమీపంలోని వాణిజ్యపన్నుల శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బందిని మాత్రం నజరానాలతో తడిపేస్తోంది. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. దీంతో పట్టణసమీపంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు ఏర్పాటైంది. భైంసా పట్టణం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వరకు పన్నులు చెల్లించకుండా అధికారులతో ముందస్తుగా సమాచారం ఇచ్చి వాహనాలను దాటించడం ఇక్కడ ‘మామూలు’ వ్యవహారంగా మారింది. అందుకే ఈ చెక్‌పోస్టులో పని చేసేందుకు అధికారులు, సిబ్బంది ఎక్కువ మక్కువ చూపుతుంటారు. గతంలో ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించినా అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇక్కడి అధికారులంతా బడా వ్యాపారుల కనుసన్నల్లోనే పని చేస్తుంటారనే ఆరోపణలున్నారుు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారులు కూడా వారికి నజరానాలు ప్రకటిస్తుంటారు. ప్రతియేటా దీపావళి, దసరా, హోలీ పర్వదినాలు వచ్చాయంటే వ్యాపారులే ముందుకు వస్తారు. ఇనామ్‌ల పేరిట చెక్‌పోస్టుల్లో పనిచేసే అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఈ హోలీ వేడుక కూడా కలిసి రావడంతో వ్యాపారులు అధికారులను మెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగింపు నెల అయినప్పటికీ... మార్చి నెల అంటేనే ఆర్థిక సంవత్సరానికి ముగింపు. అలాంటి ఈ నెలలోనూ భైంసా వాణిజ్యపన్నుల కేంద్రంలో తనిఖీలు అంతగా జరగడంలేదని విమర్శలు ఉన్నాయి. ముగింపు నెలలోనూ హోలీ పండుగ కలిసి రావడంతో ఈ చెక్‌పోస్టు గుండా వాహనాలు దాటించే బడా వ్యాపారులంతా ఇనామ్‌లు పంపిస్తున్నారన్న విషయం బాహాటంగా చర్చకు వస్తోంది. ఇక్కడి పరిస్థితిపై, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తీరుపై తెలిసిన చర్యలు మాత్రంలేవు. పైగా పై అధికారులు కూడా ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. అధికారుల తీరు కాస్త ప్రభుత్వ ఖజానాకు గండి పడేలా చేస్తోంది. ఏళ్లుగా ఇదేతంతు.. భైంసా పట్టణం మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలోనే వాహనాలు సరిహద్దు దాటి వస్తుంటాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పక్కాగా తనిఖీ చేస్తే అక్రమ వ్యాపారుల గుట్టు బట్టబయలవుతుంది. ఏళ్లుగా జాతీయ రహదారిపై భైంసా నుంచి వెళ్లేందుకు ప్రతి ఒక్కరికీ సులభమని తెలియడంతో వ్యాపారులంతా ఇటువైపే దృష్టి సారిస్తున్నారు. ముందస్తుగా స్థానిక చెక్‌పోస్టులో సమాచారం అందించి వాహనాలను యథేచ్ఛగా దాటిస్తున్నారు. వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేసి ఇక్కడ విధులు నిర్వహించే అధికారులను మచ్చిక చేసుకుని తమ పని కానిస్తున్నారు. పోలీసుల తనిఖీలతో.. వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులను దాటి భైంసా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పట్టణ సీఐ రఘు ఇప్పటికే తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన గు ట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పట్టణ సీఐగా బాధ్యతలు తీసుకున్న వారం రో జుల్లోనే తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారుల అక్రమదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు మరింత దృష్టి సారిస్తే కల్తీ నూనె, అనుమతి పత్రాలు లేకుండా వచ్చే చక్కెర లారీలు చిక్కే అవకాశం ఉంది. పోలీసు అధికారి తనిఖీలతో ఈ విషయం బయటపడుతుంటే ఇక్కడ తనిఖీల్లో షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించే వాణిజ్యపన్నుల అధికారులు, సిబ్బందికి ఇలాంటివి కనిపించకపోవడం గమన్హారం. -
హున్సాలో పిడిగుద్దుల వర్షం
బోధన్: హోలీ పండగ వేళ కొన్నేళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో గురువారం పిడిగుద్దులాట ఉత్కంఠ మధ్యసాగింది. సాయంత్రం 15 నిమిషాల పాటు పిడిగుద్దులాట ఆడారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఐదారు ఫీట్ల ఎత్తులో ఉన్న స్తంభాలు ఏర్పాటు చేసి, మధ్యలో బలమైన తాడును కట్టారు. బుధవారం రాత్రి కాముని దహనంతో హోలీ సంబరాలు ప్రారంభించారు. గురువారం ఉదయం రంగులాడారు. సాయంత్రం 4.30 గం.కు కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం పిడిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు మొదట డప్పువాయిద్యాలతో గ్రామ పెద్దల ఇంటింటి వెళ్లి వేదిక వద్దకు పిలుచుకుని వచ్చారు. గ్రామ పెద్దలు వేదిక వద్దకు చేరుకోగానే పిడిగుద్దులాట ప్రారంభించారు. తాడుకు ఇరువైపుల ముందువరుసలో ఉన్న గ్రామస్తులు ఎడమచేతితో తాడును పట్టుకుని కుడిచేతితో పిడికిలి బిగించి ప్రత్యర్థులపై బాధారు. ఒకరినినొకరు బిగి పిడికిలితో కొట్టుకున్నారు. ఆట ముగిసినంతరం తాడు ఇరువైపుల మోహరించిన గ్రామస్తులు ఒకరినొకరు ఆలంగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా, గతంలో పిడిగుద్దులాట గంటపాటు కొనసాగేది. పోలీసు అధికారుల సూచన మేరకు ప్రతి ఏటా సమయాన్ని కుదిస్తున్నారు. ఈ సందర్భంగా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ వెంకన్న నేతృత్వంలో బందో బస్తు నిర్వహించారు. -
మిత్రులను మింగిన మృత్యువు
► సుంకేసుల వద్ద నీటిలో పడి ఇద్దరు ► విద్యార్థుల దుర్మరణం ► రెండు కుటుంబాల్లో విషాదం సుంకేసుల(గూడూరు రూరల్): హాలీ పండగ రెండు కుటుంబీల్లో విషాదం నింపింది. సంబరాల అనంతరం స్నానాలు చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు సుంకేసుల బ్యారేజీ వద్ద నీటి గుంతలో పడి మృత్యువాతపడ్డారు. కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బుధవారం హోలీ సంబరాల్లో సంతోషంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం 4గంటల ప్రాంతంలో స్నానాలు చేసేందుకు సుంకేసుల బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మొదట 8 మంది విద్యార్థులు బ్యారేజీ 29వ వెంట్ సమీపంలోని నీటిలో స్నానాలకు దిగారు. సాయంత్రం చీకటి పడే సమయంలో కర్నూలులోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న ట్రాన్స్‌కో ఉద్యోగి రాఘవేంద్రప్రసాద్, అరుణమ్మ దంపతుల కుమారుడు చైతన్య, పింజరి వీధిలో నివాసం ఉంటున్న పెయింటర్ పల్నాటిశివ, పద్మ దంపతుల కుమారుడు భార్గవ్ కనిపించలేదు. దీంతో స్నేహితులు వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల గాలించారు. చివరకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆందోళనతో రాత్రంతా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం 29వ గేటు వద్ద వారంతా స్నానం చేసిన చోటనే మిత్రుల చెప్పులు నీటిపై తేలియాడంతో అనుమానంతో ఈతగాళ్లతో గాలించారు. చైతన్య, భార్గవ్ మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం డప్పు కొట్టి చిందేశారు. హోలీని పురస్కరించుకుని ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలసి డప్పు కొట్టారు. నృత్యం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖరరెడ్డిలు పాల్గొన్నారు. గవర్నర్‌ను కలసిన చంద్రబాబు : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గవర్నర్ ఇటీవలనే రాష్ట్ర శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలపటంతో పాటు హోలీ పండుగను పురస్కరించుకుని గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని అధికారవర్గాల సమాచారం. -
హోలీలో అపశ్రుతి
► కాల్వలో మునిగి యువకుడి మృత్యువాత ► కల్వకోల్ శివారులో ఘటన ► శోకసంద్రంలో కుటుంబసభ్యులు పెద్దకొత్తపల్లి : తోటి స్నేహితులతో కలిసి ఆ యువకుడు హోలీ సంబరాలు జరుపుకొన్నాడు.. ఆనందడోలికల్లో తేలియాడాడు.. ఆ సంతోషం ఎంతోసేపు నిల్వలేదు.. స్నానం చేసేందుకు సమీపంలోని కాల్వకు వెళ్లగా నీట మునిగి మృత్యువాత పడటంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మండలంలోని కల్వకోల్‌కు చెందిన నలవాల లక్ష్మయ్య (28) కు వీపనగండ్ల మండలం కొప్పునూరు వాసి కవితతో సుమారు ఎనిమిదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం నెలరోజుల కుమారుడు ఉన్నాడు. భర్త స్థానికంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామ యువకులతో కలిసి హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకొన్నారు. అనంతరం సింగోటం రిజర్వాయర్ కాల్వ వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని కొల్లాపూర్ ఎస్ఐ మనోజ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హోలీ పండగ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకోవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
స్పెయిన్‌లో హోలీ పండగ
-
హోళీ వేడుకల్లో విషాదం: బాలుడు మృతి
ఏలూరు: హోళీ రోజున కొవ్వూరులో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు సమీపంలోని కాపవరం గ్రామంలో హోళీ పండగ ఆడిన తర్వాత ముఖాలు కడుక్కుందామని పక్కనే ఉన్న చెరువులోకి దిగిన నలుగురు బాలురు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ముగ్గురు యువకులను రక్షించారు. కాపవరానికి చెందిన గుమ్మాల సుధాకర్ (11) చనిపోయారు. గ్రామస్తులు సుధాకర్ మృతదేహన్ని చెరువు నుంచి వెలికి తీశారు. సుధాకర్ మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
చంచల్‌గూడ జైలుకు ఎంపీ అంజన్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: హోలీ రోజున పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కేసులో సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ రెండో కుమారుడు అరవింద్ యాదవ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరవింద్ యాదవ్(24), అతని స్నేహితులైన బి.బాబూరావు(25), ఎ.రోహిత్‌కుమార్(28), ఎం.మనోహర్ యాదవ్(26)లను మంగళవారం ఉదయం అరెస్ట్ చేసిన హుస్సేనీఆలం పోలీసులు వారికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక నాంపల్లి కోర్టుకు తరలించారు. కోర్టు వారికి రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
సూరత్‌లో వైభవంగా హోలీ వేడుకలు
సాక్షి, ముంబై: ప్రముఖ వాణిజ్యపట్టణమైన సూరత్‌లో తెలుగు ప్రజలు హోలీ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రతాప్‌నగర్‌లోని శ్రీ మార్కండేయ మందిరం ఎదుట కాముని దహనాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు కార్పొరేటర్ రాపోలు లక్షి బుచ్చిరాములు నివాసంలో పలువురు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో సూరత్ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కూరపాటి ఐలయ్య,ప్రతాప్‌నగర్ సమాజం అధ్యక్షుడు జెల్ల రాంచందర్. కార్యదర్శి దాసరి సూర్యనారాయణ, మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మణ్, ఎలిగేటి నాగేష్, చిట్యాల శ్రీనివాస్, అడిగొప్పుల సత్యనారాయణ, సాదుల లక్ష్మీనారాయణ, గౌరి యతిరాజం, యెలుగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా సహజసిద్ధమైన రంగులతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టిబందోబస్తులను ఏర్పాటు చేశారు. పద్మశాలి సంఘ సభ్యుల విహారయాత్ర సాక్షి, ముంబై: హోలీ సందర్భంగా తూర్పు బాంద్రాలోని జ్ఞానేశ్వర్నగర్ తిరంగ వెల్ కమిటీ ఆదర్శ పద్మశాలి సేవా సంఘ సభ్యులు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. దీనిలో భాగంగా లోనావాలా, ఏకవీర మాతా మందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం సభ్యులందరూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సభ్యులు పలి వెంకటేశం, ఎనగందుల మల్లేశ్, కొంగారి వెంకట్‌స్వామి, దీకొండ ప్రభాకర్, వెంగల లక్ష్మణ్, బోగ సత్యనారాయణ, కొంగారి లక్ష్మీ, దీకొండ యశోద్ తదితరులు పాల్గొన్నారు. -
విషాదాన్ని నింపిన హోలీ
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : హోలీ పండుగ ముగ్గురి కుటుం బాల్లో విషాదం నింపింది. దీంతో ఆయా కుటుంబాన్ని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రంగులు కనుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి కింద నీటిలో శవమై తేలాడు. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామానికి ఆంజనేయులు, స్వరూ ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రమేష్ (24) రెండో వాడు. తండ్రి నిర్వహిస్తున్న హోటల్లో పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే హోలీని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులు లింగం, హరిశంకర్, విక్రమ్‌లతో కలిసి రమేష్ స్నానం చేసేందుకు పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ముగ్గు రు మిత్రులకు ఈత రాక పోవటంతో వారు ఒడ్డున కూర్చొని స్నానాలు చేశా రు. రమేష్ మాత్రం బ్రిడ్జి పై భాగంలో లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి నీట మునిగాడు. దీంతో విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా అప్పటికే చీకటి పడడంతో వెనుతిరిగి సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమేష్ మృతదేహం నీట తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మరో సంఘటనలో సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన మల్యాల ప్రవీణ్ (15) బావిలో మునిగి దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సత్త య్య, దేవవ్వలకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు మల్యాల ప్రవీణ్ (15) తొమ్మిదవ తరగతి చదువుతున్నా డు. హోలీ పండుగలో భాగంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. దీంతో ఒంటికి అంటిన రంగులు కడుక్కోవడానికి గ్రా మ శివారులో ఉన్న ఓ బావిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో బావిలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ మునిగి పోయాడు. దీందో విషయాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చేరవేశారు. వారు బావి వద్దకు చేరుకుని మృతదేహం కోసం రెండు గంటల పాటు వెతికి బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూ సి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరిగౌడ్‌లు కోరారు. జేసీబీ గుంతలో పడి మరొకరు పటాన్చెరు టౌన్ : కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జేసీబీ గుం టలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నందిగామలో సోమవారం చోటు చేసుకుంది. బీడీఎల్ భానూర్ పోలీసుల కథనం మేర కు.. రాజస్థాన్ రాష్ట్రం బైరాన్ మండలం అసాక్ గ్రామానికి చెందిన జితేందర్‌సింగ్ (25) మండల పరిధిలోని నందిగామలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే పరిశ్రమలో ఉన్న ఓ గదిలో బంధువులతో కలిసి ఉం టున్నాడు. అయితే సోమవారం హోలీ పండుగ కావడంతో పరిశ్రమలో ఉండే తోటి బంధువులతో కలిసి హోలీ ఆడా డు. అనంతరం చిన్నాన్న మహేందర్‌సింగ్, మామయ్య జితేందర్‌తో కలసి స్నా నానికి వెళ్లాడు. అయితే ముందుగా జితేందర్ సింగ్ కాలకృత్యాలకు వెళ్లాడు. అనం తరం జేసీబీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందా డు. అయితే జితేందర్ ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు అక్కడికి వె ళ్లి చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ ప్రసాద్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
హొలీ డే స్పెషల్-రంగ్ దే బసంతి
-
హొలీ రోజు పిడిగుద్దుల ఆట
-
కలర్లోనే కళర్ ఫుల్ జీవితం...
అన్నింట్లోకి వేడి రంగు అంటే ఇదే. అతిగా స్పందించే గుణం ఉన్నవారు, కాస్త విపరీత ధోరణి ఉన్నవారు ఈ రంగును ఎక్కువగా ఎంచుకుంటారు. ఇది కోపానికి, ప్రమాదానికి, మంటలకు కూడా చిహ్నం గానూ ఉపయోగిస్తారు రక్తపు రంగును పోలి ఉంటుంది కాబట్టి... దీన్ని సామర్థ్యానికి, ప్రాణానికి గుర్తుగానూ నిర్వచిస్తారు. అతి ఇష్టానికి, అతి వ్యామోహానికి కూడా ఈ రంగు చిహ్నమే. అత్యుత్సాహం తెచ్చుకోవాలన్నా, తీవ్రమైన ఆసక్తిని ప్రేరేపించుకోవాలన్నా, మరింత శక్తిసామర్థ్యాలు సంతరించుకోవాలన్నా, కలల సాకారానికి అవసరమైన అనూహ్యమైన పట్టుదలను తెచ్చుకోవాలన్నా... ఏదో రూపంలో రెడ్ను మన ఆహార్యంలో భాగం చేసుకోవాలని కలర్థెరపిస్ట్లు సూచిస్తున్నారు. మనల్ని మనం బోల్డ్‌గా, డైనమిక్‌గా వ్యక్తీకరించుకోవాలంటే ఓ చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని మన శరీరంపై ధరించినా చాలట. పింక్ అంటే ఆహ్లాదం... ఎరుపు తెలుపుల కాంబినేషన్‌గా మనం చెప్పుకునే కలర్ పింక్. ఈ కలర్... ఆవేశాన్ని తగ్గించేందుకు పనికొస్తుందంటారు. అందుకే కొన్ని కారాగారాల్లో ఖైదీల మానసిక ప్రవర్తన, తెగింపు ధోరణిలను సరిదిద్దేందుకు గాఢమైన పింక్‌ను వినియోగిస్తారట. శ్రద్ధచూపే తత్వాన్ని, దయ, ప్రేమ పూర్వక మనస్తత్వాన్ని, అంగీకారధోరణిని పింక్ ప్రతిబింబిస్తుంది. అస్తవ్యస్థ మనస్తత్వాన్ని చక్కదిద్దుకోవాలన్నా, ఆహ్లాదకరంగా ఉండాలన్నా పింక్‌ను మన జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంత చిత్తం కలిగిన, వేధింపులకు తావివ్వని వ్యక్తిగా మనల్ని మనం చెప్పుకోవాలంటే పింక్‌ను ధరించాలంటున్నారు. బేషరతు ప్రేమను అందించడం, రొమాంటిక్‌గా ఉండడం, ఆశావాహ దృక్పథం పింక్‌కు ప్రతిబింబాలని చెప్పవచ్చు. వైట్ అంటే రైట్... పూర్తి స్వచ్ఛతకు, కచ్చితత్వానికి ప్రతిబింబం శ్వేతవర్ణం. అమాయకత్వానికి, సంపూర్ణత్వానికి అర్థంగా దీనిని చెప్పవచ్చట. ఇది ఎటువంటి భావనలను ప్రేరేపించనప్పటికీ, సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉపకరిస్తుందట. మైండ్‌ను ఒక ఖాళీ పేపర్లా మార్చి తద్వారా ఊహాశక్తికి ఊపునిస్తుందట. దాపరికం లేని తత్వానికి తనను తాను ప్రతిబింబంలా చెప్పుకోవాలనుకుంటున్నవారు, ఇతరుల అభిప్రాయాలను స్వచ్ఛందంగా ఆహ్వానించేవారు తెలుపును జీవనశైలిలో భాగం చేసుకుంటారని కలర్సైకాలజిస్ట్లు చెబుతున్నారు. తెలుపు రంగును అనేకమైన అంశాలకు ప్రారంభంగా భావిస్తారు. అందుకే దీన్ని ప్రారంభ కలర్ అని కూడా అంటారు. ఒత్తిడి నివారణకు సైతం ఇది ఉపయుక్తమైనదట. చీకటికి శత్రువుగానూ వర్ణిస్తారు. బ్రౌన్‌తో షైన్... ఎరుపు, నీలం, పసుపు వర్ణాల మిశ్రమంగా బ్రౌన్‌ను చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ ఎనర్జీని రెడ్ అందిస్తే, ఎల్లో, బ్లూ కలర్లు మానసిక దృక్పథాన్ని నిలకడగా ఉంచేందుకు ఉపకరిస్తాయి. అయితే అధికంగా బ్రౌన్ కలర్ వినియోగం కాస్త డల్నెస్ను అందిస్తుంది. ఒక వ్యక్తి లోప్రొఫైల్‌లో, వెనుకగా ఉండిపోవడానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే సహజత్వాన్ని కూడా అనుభూతించేలా చేస్తుంది. సంప్రదాయబద్ధులుగా ఉండాలన్నా, గుంపులో గోవిందాలా కలగలిసిపోవాలన్నా... బ్రౌన్‌ను మనం జీవితంలో భాగం చేసుకోవాలి. స్థిరత్వాన్ని, స్పష్టమైన ఆలోచనల్ని కలిగిస్తాయని బ్రౌన్ జెమ్స్టోన్స్కు పేరు. మన నిజమైన గుణానికి ముసుగులా కూడా బ్రౌన్ ఉపయోగపడుతుందట. మన గురించి మనం అధికంగా ఊహించుకోకుండా ఉండడానికి డౌన్ టు ఎర్త్ అనే ఫీలింగ్ కలిగించుకోవడానికి ఈ రంగు ఉపయుక్తం. గోల్డ్‌కు తిరుగులేదు... విజయానికి, లక్ష్యాలను చేరుకున్నదానికి చిహ్నంగా గోల్డ్కలర్ను వినియోగిస్తారు. అలాగే విలాసానికి, నాణ్యతకు, ప్రతిష్టకు కూడా ఇది ప్రతిబింబం. ఈ రంగుకు సూర్యశక్తిని గ్రహించే గుణం ఉంది కాబట్టి, ఇది అత్యంత ఆరోగ్యకరమైన రంగుగా కూడా పేర్కొంటున్నారు. అందుకేనేమో ఈ రంగులో ఉండే లోహమైన బంగారానికి ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్. అత్యంత ఆకర్షణీయమైన రంగు కూడా కావడంతో నలుగురిలో పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్నవారు దీనిని ఏదో ఒక రూపంలో తమ జీవనశైలిలో భాగం చేసుకుంటారు.. విశేషమేమిటంటే జీవితం మీద అత్యంత ప్రేమ కలిగించే ఈ రంగుకే ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే లక్షణం కూడా ఉంటుందట. అందుకేనేమో... దేవాలయాల్లో విగ్రహాలు, ధ్వజస్థంభాలు... ఇవన్నీ ఎక్కువగా ఈ రంగులో కనిపిస్తాయి. -
హోళీ.. యువతకు రంగేళీ!
భారత దేశాన్ని పండగల దేశం అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు ఎదో ఒక పండగ కార్యక్రమంతో సందడి సందడిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే పండుగల్లో హోళీ ఒకటి. హోళీ పండుగ మతాలు, కులాలు, ప్రాంతాల కతీతంగా, చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరూ కలిసి హోళీ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది. వసంత రుతువు వచ్చిన సందర్భంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకునే పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహా పాల్గుణి, హోలికా, హోలికా దహన్, హోళీ అనే పేర్లతో పిలుస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఏ పేరుతో హోళీని జరుపుకున్న రంగులు పండగగానే ప్రతి ఒక్కరి మనసులో ముద్ర వేసుకుంది. పసిపిల్లు, పెద్దలు, ఆడ, మగ అనే బేధం లేకుండా..స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ హోళీ. వసంత కాలంలో వచ్చే రంగుల పండుగను, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా జరుపుకుంటారు. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ప్రజలు ఆనందంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో 'గోవిందా ఆలా రే.. జరా మట్కి సంభాల్ బ్రిజ్ బాలా' అంటూ జానపద గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ యువతీ, యువకులు రంగుల్లో మునిగి తేలుతారు. హోళీ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి 'ఉట్టి కొట్టడం' అనే ఆటను ఆడుకుంటారు. ఉట్టి కొట్టడానికి యువకులు పిరమిడ్ రూపంలో ఏర్పడి పాలు, పెరుగు ఉన్న ఉట్టిని కొట్టడం హోళీ సందర్బంగా ఎన్నో శతాబ్దాలుగా గుజరాత్ సంస్కృతిలో ఓ భాగమైంది. ఎన్నో సంస్కృతులు, ఆచారాలున్న భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా హోళీని జరుపుకుంటారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. రాక్షస జాతికి చెందిన హిరణ్యకశ్యపుడిని విష్ణువు రూపంలో ఉన్న నరసింహస్వామి సంహరించడానికి గుర్తుగా కూడా హోళీని జరుపుకుంటారని చరిత్ర వెల్లడిస్తోంది. హిరణ్య కశ్యపుడి సోదరి హోళికా దహనాని గుర్తుగా ప్రతి ఏటా హోళికా దహనం చేస్తారని చెప్పుకుంటారు. హోళీకి సంబంధించి ఏన్నో విషయాలను, కథలను పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అందరూ ఆడుకునే హోళీ పండగను బాలీవుడ్, టాలీవుడ్ లో నిర్మించిన పలు చిత్రాల్లో పెద్ద పీట వేశారు. 'హోళీ కే దిన్' అంటూ షోలే చిత్రంలో హేమామాలిని, ధర్మేంద్రలపై చిత్రీకరించిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే 'సిల్ సిలా' చిత్రలో 'రంగ్ బర్సే' అంటూ అమితాబ్ వేసిన స్టెప్పులు భారతీయ హోళీ సంస్కతిలో ఓ భాగమైంది. హోళీ రోజున రంగ్ బరసే అంటూ యువతీ యువకులు చిందేడం చూస్తూనే ఉంటాం. ఇంకా లమ్హే చిత్రంలో 'మోహే చేడో నా', భాగ్ భన్ చిత్రంలో 'హోరి ఖేలే రాఘువీరా' మంగళ్ పాండే చిత్రంలో దేఖో ఆయీ హోళీ అనే పాటలు ఇప్పటికి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇవియే కాకుండా డర్ చిత్రంలో అంగ్ సే ఆంగ్ లగానా సాజన్, కామ్ చోర్ చిత్రంలో 'మాల్ దే గులాల్ మోహే, ఆయే హోలీ ఆయే రే', జక్మీ చిత్రంలో ఆయీ రే ఆయీ రే హోలీ, నవరంగ్ చిత్రంలో 'అరే జా రే హట్ నత్కత్', కటీ పతంగ్ చిత్రంలో 'ఆజ్ నా చోడంగే బస్ హమ్ జోలీ ఖేలేంగే హమ్ హోళీ', కోహినూర్ చిత్రంలో 'తన్ రంగ్ లో జి ఆజ్ మన్ రంగ్ లో' ముంబై సే ఆయే మేరే దోస్త్.. 'కోయి భీఘా హై రంగ్ సే' మదర్ ఇండియాలో 'హోళీ ఆయీ రే కన్హాయీ' పాటలే కాకుండా ఇటీవల వచ్చిన ఇత్నా మాజా క్యో ఆరా రహాహై.. అంటూ యే జవానీ హై దీవాని, రామ్ లీలా, గూండే చిత్రాల్లో పాటలు కూడా ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా సంస్కృతిలో భాగమయ్యాయి. బాలీవుడ్ కు తామేమి తగ్గమనే రీతిలో టాలీవుడ్ లో కూడా హోళీ పండగకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా.. కొట్టు కొట్టు డోల్ దెబ్బ కొట్టూ ఒంటి నిండా సత్తువుందిరా.. హోళీ హోళీ అంటూ నాగార్జున 'మాస్' చిత్రంలో దర్శకుడు లారెన్స్.. రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు బరిసే.. గుండే షబ్బా షబ్బా అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ' లో చిత్రంలో, రంగేళి హోళీ..రంగా కే మా కేళి.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అంటూ ప్రభాస్ తో కృష్ణ వంశీ యువతీ, యువకుల్లో జోష్ ను పెంచారు. ప్రతి ఏటా వచ్చే హోళీ పండగ జాతి సమైక్యతను పెంపొదించడమే కాకుండా కుల, మతాలకతీతంగా దేశ ప్రజలందర్ని ఒక్కటి చేస్తుందని ఆశిద్దాం! -
గవర్నర్‌కు కూడా ఎన్నికల కోడ్!
-
హోలీ ఆయిచే..
హోలీ పండగ వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే గ్రామాల్లో గిరిజన మహిళలు ఆటపాటలతో సందడి చేస్తుంటారు. తండాల్లో పండగను ఘనంగా జరపుకోవడానికి పట్టణానికి వచ్చి సంప్రదాయపాటలు, నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకొని డబ్బులను వసూలు చేస్తారు. వాటితె రంగులను, సంప్రదాయ బట్టలు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. శనివారం మన్యంకొండ వద్ద గిరిజనులు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇలా అలరించారు.