
డప్పు కొట్టి చిందేసిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం డప్పు కొట్టి చిందేశారు. హోలీని పురస్కరించుకుని ఎన్‌టీఆర్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలసి డప్పు కొట్టారు. నృత్యం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖరరెడ్డిలు పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలసిన చంద్రబాబు : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గవర్నర్ ఇటీవలనే రాష్ట్ర శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలపటంతో పాటు హోలీ పండుగను పురస్కరించుకుని గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని అధికారవర్గాల సమాచారం.