Venkatesh-Varun Tej: F3 Movie Team Released Special Video for Holi Festival Goes Viral - Sakshi
Sakshi News home page

F3 Movie: ఆడియన్స్‌కీ హోలీ ట్రీట్‌ ఇచ్చిన ‘ఎఫ్‌3’ మూవీ టీం

Published Fri, Mar 18 2022 2:48 PM | Last Updated on Fri, Mar 18 2022 3:39 PM

F3 Movie Team Released Special Video for Holi Festival - Sakshi

F3 Movie Team Shares Special Video: ‘ఎఫ్‌ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్‌ 3’ టీమ్‌. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్‌ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఇక నేడు హోలీ పండగ సందర్భంగా ఫ్యాన్స్‌ ట్రీట్‌ ఇచ్చింది ఎఫ్‌ 3 టీం. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విటర్‌ పేజీలో ఈ మూవీ అప్‌డేట్‌ ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్‌. 

చదవండి: ‘రాధేశ్యామ్‌’పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌, మూవీకి అంత అవసరం లేదు..

ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్‌తో  ఈ వీడియోలో నటీనటులు కనిపించడంతో బాగా ఆకట్టుకుంటుందో. ఫస్ట్‌ హీరో వెంకటేశ్‌తో స్టార్‌ అయిన ఈ వీడియో వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌, నటి ప్రగతి, సునీల్‌, ఆలీ ఇలా అందరూ నవ్వులు పూయిస్తూ కనిపించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి సైతం టీంలో సందడి చేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు చాలా బాగుందని మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement