సాక్షి, కొమురంభీం జిల్లా: హోలీ పండుగ రోజు అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. మృతులను కౌటాల మండలం నదీమబాద్‌కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)గా గుర్తించారు.
కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ.. సెల్పీలు దిగి హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి వద్దనున్న వార్ధా నదికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు.
గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టిన ఫలితం లభించలేదు. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ నాడుఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో బాధితుల కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి..
Comments
Please login to add a commentAdd a comment