
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.
పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్‌ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.
ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్