Holi 2022: How To Prepare Indian Festival Special Sweet Gujia Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Holi 2022 Sweet: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్‌ రుచి చూడాల్సిందే..

Published Fri, Mar 18 2022 8:21 AM | Last Updated on Fri, Mar 18 2022 9:06 AM

Holi Festival: Indian Sweet Gujia Recipe In Telugu - Sakshi

రంగులు మనసులను ఉల్లాసపరిస్తే.. తియ్యని రుచులు మదిని ఆనందంతో నింపేస్తాయి. వర్ణాలన్నీ ఏకమయ్యే శుభ సమయాన అందరి నోళ్లను ఊరించే ఘుమఘుమలు పండగ వేడుకకు మరిన్ని వన్నెలద్దుతాయి.

గుజియా
కావల్సినవి: మైదా – 3 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఫిల్లింగ్‌కి.. పంచదార – కప్పు; కోవా – 200 గ్రాములు; బాదాములు – 5 (సన్నగా తరగి, నీళ్లలో నానబెట్టాలి); బొంబాయిరవ్వ – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్‌; 

తయారీ: 
► పిండిలో తగినన్ని నీళ్లు పోసి, కలిపి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మెత్తగా కావడానికి ఒక తడి క్లాత్‌ కప్పి, పక్కనుంచాలి.
►స్టౌ పై పాన్‌ పెట్టి, కోవా, రవ్వ. బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పంచదారకలిపి, మంట తీసేసి, చల్లారనివ్వాలి. ∙చల్లారిన కోవా మిశ్రమంలో ఏలకుల పొడి, బాదాంపప్పు తరుగు వేసి బాగా కలపాలి. 
►కొద్దిగా నెయ్యిని వేళ్లతో అద్దుకొని, అరచేతిపైన రాసి, చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఉండలుగా చేసి, అదిమి పక్కనుంచాలి. 
►పిండిని మృదువుగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి, పూరీలా వత్తాలి. 
►∙గుజియా అచ్చుపైన పూరీ వేసి, మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, అదిమి, చుట్టూతా నమూనా ప్రకారం రోల్‌ చేయాలి. ఇదే విధంగా అన్నీ తయారుచేసుకోవాలి.  
►స్టౌ పైన బాణలి పెట్టి, నెయ్యి పోసి వేడిచేయాలి. నెయ్యి కాగుతున్నప్పుడు సిద్ధం చేసుకున్న గుజియాలను వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. 
►ఇలా తయారుచేసుకున్న గుజియాలను ప్లేట్‌లో పెట్టి, తరిగిన బాదంపప్పును అలంకరించి, సర్వ్‌ చేయాలి. 

 Kova Banana Halwa: నోరూరించే కోవా బనానా హల్వా తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement