దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!
బొప్పాయిహల్వా
కావల్సిన పదార్ధాలు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
బొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)
పంచదార – పావు కప్పు
బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – టీ స్పూను
కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు
బాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.
ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ.
సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు
బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్‌లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.
ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.
బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment