
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్‌తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్‌లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ )
ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్‌గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్‌రూట్, తురిమిన చీజ్, క్యారెట్‌లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్‌లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు.
దీంతో నెటిజన్లు నెగిటివ్‌గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం)
Idli Burger 😭😭😭
— MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024
Idli ki MC BC 😭😭
Part 1 pic.twitter.com/a8H9lDwmBM
Comments
Please login to add a commentAdd a comment