Idli
-
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినే అలవాటు మంచిదేనా?
ఇడ్లీ మీద నెయ్యి వేసుకునే అలవాటు మంచిదేనా? ఇలా తింటే బరువు పెరుగుతారా? అని చాలామంది మదిలే మెదిలే సందేహం. అయితే ఇలా ఇడ్లీ మీద నెయ్యి రాసుకుని తినే అలవాటు మంచిదే అంటున్నారు నిపుణులు. అలాగే ఇలా తింటే బరువు పెరుగుతారా అనే సందేహం కూడా వాస్తవమే అని చెబుతున్నారు. మరి తినోచ్చా ?లేదా అంటే..నెయ్యి వేసుకుని తింటే కచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే ఇడ్లీ, నెయ్యి ఆరోగ్యకరమైనవే. కాబట్టి ఆరోగ్యంగా బరువు పెరగడం, వ్యాయామంతో ఫిట్నెస్ సాధించడమే హెల్దీ లైఫ్ స్టైల్. ఇడ్లీలో కేలరీలు, ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో 120 నుంచి 130 కేలరీలు, అరవై శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు తక్కువ. ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నప్పుడు నెయ్యి మోతాదును బట్టి మూడు వందల నుంచి ఆరు వందల కేలరీలు అందుతాయి. నెయ్యి కావాలి! కొవ్వులో కరిగే ఎ,డి,ఇ,కె విటమిన్ల కోసం దేహానికి నెయ్యి అవసరమే. అలాగే దేహంలో వాపులను నివారించే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్‌ను దేహం సరిగ్గా పీల్చుకోవడానికి కూడా నెయ్యి ఉండాలి. ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని తినడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు టీ స్పూన్లకు పరిమితం చేస్తే మంచిది. అలాగే రోజువారీ డైట్లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకుంటూ రోజు మొత్తంలో ఆహారంలో ఎన్ని కేలరీలు చేరుతున్నాయో గమనించుకోవాలి. --సుజాత స్టీఫెన్ ఆర్.డి. న్యూట్రిషనిస్ట్(చదవండి: ఈ డ్రైఫ్రూట్‌తో నిద్రలేమికి చెక్‌పెట్టండి!) -
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
మార్కాపురం: హోటల్‌కు వెళ్లి సర్వర్‌తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్‌రెడ్డి ఇడ్లీ తిన్నాడు. హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
ఆ బామ్మ అమ్మే ఇడ్లీల ధర తెలిస్తే షాకవ్వుతారు! ఈ వయసులో..
ఏ వ్యాపారం అయినా లాభం కోసమే చేస్తుంటారు. మరికొందరూ ఆ క్రమంలో మోసాలతో లాభాలు ఆర్జించే యత్నం చేస్తుంటార. కొందరూ నిస్వార్థంగా వ్యాపారం చేస్తూ..కస్టమర్ల ప్రేమ ఆప్యాయతలను చూరగొంటారు. వారి అండదండలతో ముందుకు సాగిపోతారు. తన వద్దకు వచ్చే కస్టమర్ కడుపు నిండి సంతోషంగా ఫీలైతే చాలు అని భావించే వ్యాపారుల ఉండటం అరుదు. అలాంటి కోవకు చెందిందే ఈ 84 ఏళ్ల బామ్మ.తమిళనాడుకి చెందిన ధనం పాటి బామ్మ ఎనిమిది పదులు వయసులోనూ కాయకష్టం చేసుకుని బతుకుతుంది. ఆమె ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుత కాలంలో పప్పులు, ఉప్పులు ధరలు ఆకాశనంటేలా ఉన్నాయి. అయినా సరే ఈ బామ్మ చాలా చీప్ ధరకే ఇడ్లీలను విక్రయిస్తుంది. అలా అని ఆమె వెల్సెటిల్డ్ కుటుంబం కూడా కాద. చాలా నిరుపేద కుటుంబం. చాల కష్టపడి బతుక పోరాటం సాగిస్తోంది. ఆ బామ్మకు ఇద్దరు పిల్లలు. కూతురుని టెలర్కిచ్చి పెళ్లి చేశానని, కొడుకు లారీ లోడ్‌మ్యాన్‌గా పనిచేస్తాడని చెప్పింది. కొడుకు తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలిపింది. వాళ్లు తనతో ఉండమని చెప్పారు,కానీ ఎందుకు వాళ్లకు భారంగా ఉండటమని వెళ్లలేదని చెప్పింది. పైగా తన చివరి శ్వాస వరకు ఇలా కష్టపడతానని అంటోంది. అయితే ఆమె ఈ వ్యాపారం తన భర్త అనారోగ్యానికి గురైనప్పటి నుంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త మొదట్లో టీ వ్యాపారం చేసేవాడని, ఆ డబ్బులు సరిపోక ఇలా టిఫిన్ సెంటర్ పెట్టామని చెప్పింది. అయితే ఆమెకు ఉన్న కొద్దిపాటి చిన్న ఇంటిలోనే ఇడ్లీలను విక్రయించుకుంటోంది. స్కూల్ పిల్లలు, కార్మికులు, రోజువారీ కూలీలు ఆమె కస్టమర్లు. ఆమె గత నాలుగేళ్ల క్రితం వరకు ఒక్క రూపాయికే ఇడ్లీలను విక్రయించేది. ఇటీవలే ఆర్థిక అవరసరాల రీత్య రూ. 3లకు విక్రయిస్తుంది. ఇది కూడా భర్త చనిపోవడంతోనే ఇడ్లీ ధర పెంచింది. ఇంకాస్త ధర పెంచొచ్చు కదా..! అని ఎవ్వరైనా అడిగితే ప్రజలు రూ. 10లకే కడుపు నిండా టిఫిన్ తినాలని అంటుంది. ఈ బామ్మ స్వతం అవసరాలు ఎన్ని ఉన్నా.. కస్టమర్లకు మాత్రం కడుపునిండా తక్కువ ధరకే టిఫిన్ పెడుతుందని, మూడు ఇడ్లీలు అడిగితే ఇంకో రెండు ఇడ్లీలు ఛార్జీ లేకుండానే పెడుతుందని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. ఇంత తక్కువ ధరకే ధనం పాటి బామ్మ అమ్మడానికి మరో కారణం..రేషన్ బియ్యం, పప్పులతోనే ఈ ఇడ్లీలను తయారు చేస్తుంది. పైగా ఆమె వద్దకు వచ్చిన కస్టమర్లే ప్రేమతో ఆ బియ్యం, పప్పులు ఉచితంగా ఇవ్వడంతో ఇలా తక్కువ ధరకే విక్రయిస్తుంది ఈ బామ్మ. పైగా తన వద్దకు వచ్చే వాళ్లు తనపై చూపించే ప్రేమ ఆప్యాయలతో కాలం వెళ్లదీయగలుగుతున్నానని చెబుతుంది. రెస్ట్ తీసుకోవాల్సిన ఈ వయసులో కష్టపడటమే గాకుండా పిల్లలపై ఆధారపడేందుకు ఇష్టపడలేదు. తన శ్రమనే నమ్ముకుని జీవితాన్ని వెళ్లదీస్తోంది. కటిక దారిద్యం అనుభవిస్తున్నా.. కూడా నిజాయితీగా తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీల విక్రయిస్తూ జీవనం సాగించడం అంటే మాములు విషయం కాదుకదా..!. కొద్ది కష్టాలకి భయపడే మనకు.. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నబామ్మను చూస్తే..హ్యాట్సాఫ్ బామ్మ..! అని అనుకుండా ఉండలేం!.(చదవండి: సూపర్ బామ్మ!.. 71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌ల..!) -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్‌తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్‌గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్‌గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024 -
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 'ఇడ్లీ లొల్లి'.. అసలు ఈ ఇడ్లీ కథేంటంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!. మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు. ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్‌కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్‌లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది. చరిత్రను పరిశీలిస్తే.. చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్‌బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్‌బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది. ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది. (చదవండి: నిమ్మచెక్కతో వంటింటి సమస్యలకు చెక్‌పెట్టండి) -
ఇడ్లీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్‌కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్‌లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్‌లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్‌కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్‌లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్‌లే కేక్‌లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!
చాలా రకాల వెరైటీ ఇడ్లీలు చూసి ఉంటారు. స్వీట్ ఇడ్డీ కూడా చూసుంటారు. కానీ ఇది అలా ఇలా కాదు ఏకంగా పండుతో చేసిన ఫ్రూట్ ఇడ్లీ. పళ్లతోనా అని ఆశ్చర్యపోవద్దు. నిజం! చూస్తే మీరే షాకవ్వుతారు. ఎలా చేశాడంటే.. కుక్కపిల్ల, సబ్బు బిళ్ల..కాదేది కవితకు అనర్హం! అన్నట్టుగా వంటవాడికి పళ్లా, కాయగూరలా మరేదైనా అని కాదు వంట చేయడం వస్తే చాలు. దేన్నైనా వండి.. వార్చేస్తాడు. అది కూరగాయా! పండు అని కాదు. జస్ట్ తన పాక నైపుణ్యంతో రుచికరంగా మార్చేస్తాడు. ఇక ఈ ఫ్రూట్ ఇడ్డీ ఎలా చేశాడంటే..యాపిల్ని సన్నగా తరిగి ఇడ్లీ పిండి మిశ్రమంలో కలిపాడు. ఆ తర్వాత పిండిని ఇండ్లీల ట్రైలో పోసి ఆవిరిపై ఉడికించాడు. అంతే ఫ్రూట్ ఇడ్లీ రెడీ. పైగా రెండు రకాల చట్నీలు, ఓ సాంబర్ కూడా పెట్టి భలే అందంగా పండ్లతో గార్నిష్ చేశాడు. చూస్తే మాత్రం వామ్మో బాగుటుందా ? అని డౌటొస్తోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sukrit jain (@thegreatindianfoodie) (చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్‌ని చూసొండొచ్చా?) -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
ఎప్పుడైనా పెసలుతో ఇలా పాలక్ ఇడ్లీ ట్రై చేశారా...?
పెసర-పాలకూర ఇడ్లీ.. కావలసినవి: పెసరపప్పు – కప్పు పాలకూర – కప్పు నూనె – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కారం – పావు టీస్పూను వంటసోడా – పావు టీస్పూను. తయారీ: పెసరపప్పును శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి నానిన పప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి పాలకూరను కూడా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙పాలకూర పేస్ట్‌లో రుబ్బిన పెసర పప్పు, కారం, వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసి కలపాలి ∙పిండిని మరీ జారుడుగా కాకుండా తగినంత నీటిని చేరుస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ∙ఇడ్లీప్లేటుకు కొద్దిగా నూనె రాసి పిండిని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద ఉడికించాలి ∙పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఉడికిస్తే ఇడ్లీ రెడీ పెసర పాలకూర ఇడ్లీలను పుదీనా చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించాలి. (చదవండి: అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు..) -
చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!
Chandrayaan-3Technician selling idli ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడన్న వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఇస్రోకు చెందిన HEC (హెవీఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో దీపక్ కుమార్ ఉప్రారియా రాంచీలోని ధుర్వా ప్రాంతంలో టీ, ఇడ్లీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వైరల్‌గా మారింది. బీబీసీ కథనం ఆధారంగా ఎన్డీటీవీ అందించిన రిపోర్ట్ ప్రకారం చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్ అండ్ స్లైడింగ్ డోర్‌ను తయారు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి 18 నెలలుగా జీతం చెల్లించకపోవడంతో అతను రోడ్‌సైడ్ స్టాల్‌ను తెరిచాడు. హెచ్ఈసీలో పనిచేస్తున్న ఉప్రారియా ఏమన్నారంటే.. జీతం అందక కొన్నాళ్లు క్రెడిట్ కార్డ్‌తో నెట్టుకొచ్చా. ఆ తరువాత బంధువులు, స్నేహితుల ద్వారా దాదాపు నాలుగు లక్షల అప్పు చేశాను.. భార్య నగలు తాకట్టు పెట్టి కొన్ని రోజులు ఇంటిని నడిపించా.. ఇపుడిక అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆవేదన వ్యక్తం చేశారు ఆకలితో చచ్చిపోవడం కన్నా అందుకే ఇక వేరే గత్యంతరం లేక కడుపు నింపుకుంనేందుకు ఆకలితో చచ్చిపోవడం కన్నా ఇడ్లీ దుకాణం బెటర్ అనే ఉద్దేశంతో ఈ దుకాణాన్ని తెరవాల్సి వచ్చిందని చెప్పారు. భార్య మంచి ఇడ్లీలు చేస్తుంది. వాటిని అమ్మడం ద్వారా రోజుకి 300-400 రూపాయలొస్తాయి. తద్వారా 50-100 రూపాయల లాభం వస్తుంది ఈ డబ్బుతోనే ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని తెలిపారు. అంతేకాదు తనకు ఇద్దరు కూతుళ్లని, ఈ ఏడాది ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో స్కూల్ నుంచి రోజూ నోటీసులు పంపుతున్నా రన్నారు. క్లాస్ రూంలో టీచర్లు హెచ్ఈసీలో పనిచేస్తున్న వారి పిల్లలు ఎవరని అడిగి మరీ అవమానించారనీ, దీంతో తన కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి రావడం చూసి గుండె పగిలిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉప్రారియా తోపాటు సంస్థలోని దాదాపు 2,800 మంది ఉద్యోగుల జీతాలు అందలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన ఉప్రారియా 2012లో, ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, 8,000 జీతంతో HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు. కానీ అతని అంచనాలు తల్లకిందులైనాయి. అయితే జీతాల సమస్యపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ స్వతంత్ర సంస్థకాబట్టి ఉద్యోగుల జీతభత్యాల బాధ్యత ఆ సంస్థదే అని తెలిపింది. కాగా ఇస్రో చంద్రయాన్-3 జూలై 14న విజయ వంతంగా ప్రయోగించింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై కాలిడిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. Meet Deepak Kumar Uprariya who sells Tea & Idli in Ranchi. He is a Technician, who worked for building ISRO's Chandrayaan-3 launchpad. For the last 18 months, he has not received any salary. "When I thought I would die of hunger, I opened an Idli shop" (BBC Reports) pic.twitter.com/cHqytJvtfj — Cow Momma (@Cow__Momma) September 17, 2023 -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
టిఫిన్‌లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్‌గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్‌లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్‌తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి
కర్ణాటక: అరచేయంత ఇడ్లీ ధర రూపాయి మాత్రమే. పాల మాదిరిగా తెల్లగా ఉండే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే క్షణాల్లో కరిగి పోతాయి. ఎలాంటి లాభార్జన లేకుండా పేదల ఆకలి తీర్చాలనే ఉదాత్త ఆశయంతో కాంతమ్మ అనే మహిళ 20 సంవత్సరాలగా రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది. ఇక్కడ ఇడ్లీ, చట్నీ తిన్నవారు ఆహా ఏమి రుచి అని అంటుంటారు. మళ్లీ మళ్లీ వస్తుంటారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హులియారులో బనశంకరమ్మ దేవాలయం ఆలయం వద్ద శిథిలావస్థలో ఉన్న ఇంటివద్ద కాంతమ్మ చిన్నపాటి హోటల్ నిర్వహిస్తోంది. ఇడ్లీలోకి వేరుశనగ పొడి, పల్లీల చట్ని చేసి అందిస్తుంది. గతంలో 2 రూపాయలకు మూడు ఇడ్లీలు ఇచ్చిన కాంతమ్మ.. నిత్యావసరాల ధరలు పెరగడంతో రూపాయికే ఇడ్లీ అందజేస్తోంది. హోటల్ వద్దకు రాలేనివారు ఫోన్ చేస్తే పార్శిల్ పంపుతుంది. ఇందుకు ఎక్స్ట్రా చార్జీలు ఏమీ ఉండవు. అరిసికెరె తాలూకా కురువంక గ్రామానికి చెందిన కాంతమ్మకు హులియారుకి చెందిన తమ్మయ్యతో 24 సంవత్సరాల క్రితం వివాహమైంది. భర్త మద్యానికి బానిస కావడంతో సంసారాన్ని ఆమె తన చేతుల్లోకి తీసుకొని ఇడ్లీల వ్యాపారం మొదలు పెట్టింది. ఇంటివద్ద ఇడ్లీలు తయారు చేసుకొని పాత్రలో పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి విక్రయించేది. వయస్సు మీద పడటంతో ప్రస్తుతం ఇంటివద్దనే తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఇడ్లీలతోపాటు దోసెలు కూడా అమ్ముతోంది. రూ.5కే మూడు దోసెలు అందజేస్తోంది. రుచిగా ఉండటంతో చాలా మంది వచ్చి గంటల తరబడి వేచి ఉండి దోసెలు, ఇడ్లీలు తిని వెళ్తుంటారు. గతంలో కట్టెల పొయ్యిపై ఇడ్లీలు తయారు చేసే కాంతమ్మ.. ప్రస్తుతం గ్యాస్‌స్టౌపై తయారు చేస్తోంది. ఆరని పొయ్యి కాంతమ్మ ఇడ్లీలు అమ్మి పెద్దగా డబ్బు సంపాదించిన దాఖలాలు లేవు. అరకొర సంపాదనతోనే పిల్లలను పెంచి పోషించి చదివించి పెళ్లిళ్లు కూడా చేసింది. మహమ్మారి కరోనా సమయంలో తప్ప ఆమె అంటించిన పొయ్యి ఇంతవరకు ఆరిపోలేదు. రోజూ 300 నుంచి 400 ఇడ్లీలు తయారు చేస్తుంది. ఒక్కరూపాయికే ఇడ్లీ అమ్మితే నష్టం రాదా? అని అడిగితే లాభం కోసం తాను ఈ పనిచేయడం లేదని కాంతమ్మ అంటోంది. తాను బతుకుతూ మరింతమంది పేదల ఆకలి తీర్చడమే తన ధ్యేయమని పేర్కొంది. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్‌లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్‌తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్‌లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్‌కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
క్షణాల్లో వందల ఇడ్లీలు రెడీ.. ఐడియా సూపర్ కదూ
-
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్‌కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్‌ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్‌లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్‌గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్‌లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్‌ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్‌కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్‌గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్‌ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్‌లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్‌పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్‌కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్‌రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు -
ఇడ్లీ, దోశ బ్రేక్‌ఫాస్ట్‌లను ఇలా సరికొత్త రుచితో వండుకొని తింటే..
అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.. సొరకాయ దోశ కావలసినవి.. మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా. తయారీ: ►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి. ►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి. ►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి. ►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ. చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే! సగ్గుబియ్యం ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8 తయారీ: ►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి. ►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి. ►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి. ►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది. -
అక్కడ తెలుగోడి నల్ల ఇడ్లీ ఎంత ఫేమసో..!!
-
రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా జైలు ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసి విక్రయిస్తున్న రూ.5లకే నాలుగు ఇడ్లీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పట్టణంలో వీటిని రుచి చూడాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. కరోనా వల్ల కొన్ని రోజులు మూసివేసినా.. రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతుంది. జిల్లా జైలు ఆధ్వర్యంలో 2019 అక్టోబర్ 15న రూ.5లకే నాలుగు ఇడ్లీలు అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ప్రస్తుత పరిస్థితిలలో రూ.ఐదుతో ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కనీసం తాగడానికి టీ కూడా రావడం లేదు. దీంతో జిల్లా జైలు అధికారులు వినూత్నంగా ఆలోచించి రూ.ఐదుకే నాలుగు ఇడ్లీలు ఇస్తుండడంతో ఆదరణ బాగా పెరిగింది. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇడ్లీలు తయారు చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి రోజూ 250 ప్లేట్ల ఇడ్లీలను విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన ఇడ్లీలు ఇస్తుండడంతో చుట్టు పక్కల వారితో పాటు ప్రధాన రోడ్డు వెంట ప్రయాణం చేసే వారు ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పర్సిల్ తీసుకుపోతే రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. రోజూ ఇక్కడే టిఫిన్.. మా ఇంట్లో ఐదుగురం ఉన్నాం. రోజు ఇక్కడి నుంచే ఆరు ప్లేట్ల ఇడ్లీ తీసుకువెళ్తాను. రూ.30లకు కుటుంబం మొత్తం ఒక్క పూట తినవచ్చు. ఆదివారం మినహాయించి ప్రతి రోజూ ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. రూ.5లకే బయట హోటళ్లలో లభించే విధంగా రుచికరంగా ఉంటుంది. – యాదిన్లాల్, బండ్లగేరి ఈ మార్గంలో వెళ్తే.. ఈ కాలంలో ఐదు రూపాయలకు ఏం వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక పూట కడుపు నిండుతుంది. జైలువాళ్లు తక్కు వ రేటుకే ఇస్తున్నా రు. అందుకే చాలామంది పేదోళ్లు ఇక్కడే తింటారు. నేను ఈ రోడ్డు మార్గంలో వెళ్లిన ప్రతిసారి ఇడ్లీలు తింటాను. రూ.10 ఉంటేతో రెండే పేట్ల ఇడ్లీ తింటా. – చెన్నయ్య, ఆటోడ్రైవర్, నవాబ్‌పేట రుచికరంగా ఉంది.. మార్కెట్లో ఐదు రూపాయలకు చాయ కూడా వస్తలే దు. ఇక్కడ నాలుగు ఇడ్లీలు ఇస్తున్నారు. సమయం ఉన్న ప్రతి సారి ఇక్కడి నుంచే ఇంటికి ఇడ్లీలు తీసుకువెళ్తాను. బయట హోటళ్లలో రూ.30 వెచ్చించే బదులు అదే రుచికరమైన ఇడ్లీ రూ.5లతో తినొచ్చు. – శేఖర్, పాన్‌చౌరస్తా సింగిల్ టీ రావడం లేదు.. నేను ఆటో తీసుకుని రోడ్డు మీదకు వస్తే తప్పకుండా జైలు దగ్గర ఇడ్లీ తింటా ను. ప్రతిసారి రూ. 10లు ఇచ్చి రెండు ప్లేట్లు తీసుకుని తింటా. రోడ్డుమీద సింగిల్ టీ కూడా ఇవ్వడం లేదు, కానీ అదే పది రూపాయలతో ఒకపూట తింటాను. – రాజు, ఆటోడ్రైవర్, పుట్నలబట్టి చదవండి: Hyderabad: కొడుకులే పెద్దలుగా మారి.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..! -
ఇడ్లీ పార్సిల్లో కప్ప కలకలం.. హోటల్ యజమానికి చూపిస్తే..
సాక్షి,తిరువొత్తియూరు(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి తీసుకున్న ఇడ్లీ పార్సిల్లో కప్ప కళేబరం ఉండడం సంచలనం కలిగించింది. కుంభకోణం మాదాపురికి చెందిన మురుగేష్ గుండె చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని బంధువు శనివారం సమీపంలోని ఒక హోటల్లో ఇడ్లీ పార్సిల్ తీసుకువెళ్లాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఇడ్లీ లోపల కప్ప మృతి చెంది ఉంది. దాన్ని బంధువులు హోటల్ యజమానికి చూపించారు. హోటల్లో ఉన్న ఇడ్లీ పిండిని కింద పడేశారు. హోటల్ యజమాని హోటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్ అయింది. సదస్సు విజయవంతం కొరుక్కుపేట: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వడపళని క్యాంపస్(చెన్నై), లింకన్ యూనివర్సి టీ కాలేజ్ మలేషియా ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్ (ఐసీఈఏబీఎం 2021) అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా జరిగింది. ఎస్ఆర్ఎం వడపళని క్యాంపస్ సీఈటీ విభాగం డీన్ డాక్టర్ సి.వి.జయకుమార్, కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ సుభశ్రీ నటరాజన్ నేతృత్వం వహించారు. ప్యూర్టో రికో విశ్వవిద్యాలయం యూఎస్ఏ ప్రొఫెసర్ జస్టిన్ పాల్, సీవీఆర్ డీఈచెన్నై డైరెక్టర్ వి.బాలమురుగన్, ప్రొఫెసర్ శ్యామ్ బహదూర్ మేనేజ్మెంట్ టెక్నాలజీపై ప్రసంగించారు. -
Viral: అచ్చం పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీలు!
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఫేమస్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే రుచికరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా ఉంటాయి. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉన్న ఇడ్లీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఓ ఇడ్లీ ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉండి.. సాంబారులో ముంచబడి ఉంది. పక్కనే మరో చిన్న గిన్నేలో చట్నీ కూడా ఉంది. చదవండి: Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి ఈ ఫోటోను మైక్రో అంబీషియస్ అనే ఓ ట్విటర్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా ‘ఒక్క ప్రశ్న, ఎందుకు??’ అని కాప్షన్ జతచేశారు. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘వావ్ అచ్చం ఐస్ క్రీమ్‌లా ఉన్నాయి ఇడ్లీలు’, ‘చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. Just one question, why?? pic.twitter.com/lH6lAA7r39 — Micro-ambitious (@pal36) September 30, 2021 -
ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
ముంబై: వ్యాపారాల్లో విజయాలు అంత సులువుగా రావు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు.. ఇలా ఎదురయ్యే ప్రతి వాటిని దాటుకుంటూ వెనకడుగు వేయక ముందుక సాగాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ఓ పేద కుటుంబంలోని యువకుడు నేడు వేల కోట్ల కంపెనీకి సీఈవో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ముస్తఫా పేద కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి.. రోజూ కూలీ పని చేస్తే గానీ మూడు పూటల తిండి దొరకని స్థితి. తను 6వ తరగతిలో ఫెయిల్ కావడంతో చదువు మానేసి కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో అతని స్కూల్ టీచర్ చొరవతో మళ్లీ స్కూల్‌కి వెళ్లే అవకాశం దక్కించుకోవడంతో పాటు స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. చివరికి ఉద్యోగం సంపాదించి తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేశాడు. అనంతరం విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడంతో వెళ్లాడు. జీవితం సాఫీగా సాగుతున్నా ఏదో తెలియని వెలితే ఉన్నట్లు అనిపించింది. ఉద్యోగం కన్నా బిజినెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు అతని బంధువులలో ఒకరు నాణ్యమైన ఇడ్లీ-దోశ పిండి కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనను ఇచ్చారు. అది నచ్చడంతో ముస్తఫా ₹ 50,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి తెలిసినవారికే వ్యాపార బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయాడు. అయితే, మూడు సంవత్సరాల తర్వాత అతను తన పూర్తి సమయాన్ని కంపెనీపై దృష్టి పెడితేనే లాభాల్లోకి వెళ్తుందని గ్రహించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా పూర్తి సమయాన్ని కంపెనీ కోసం కేటాయించినప్పటికీ ఒకానొక దశలో తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక కంపెనీలో షేర్లు ఇస్తానని మాటిచ్చాడు. అలా 8 ఏళ్ల పాటు అతని ప్రయాణం ఎన్నో కష్టాలను చవి చూశాక.. చివరకు తన కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్టర్ దొరికారు. 2000 కోట్ల రూపాయలను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ విస్తరించడంతో పాటు సేల్స్ కూడా పెరిగాయి. తాను చెప్పినట్లుగా అందులో ఉన్న ఉద్యోగులను లక్షాధికారులను చేశాడు. ప్రస్తుతం తన కంపెనీలో వందల మంది పనిచేస్తున్నారు. చదవండి: వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్ ఏర్పాటు, అయినా..? -
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
వరంగల్ నగర ప్రజల జిహ్వచాపల్యం భలేగాఉంది. ఉదయం టిఫిన్‌ను ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటుండగా, అదేస్థాయిలో ఆయిల్ ఫుడ్ అయిన పూరీని కూడా అంతే ఇష్టపడుతున్నారు. మరికొందరు వడ, దోశ కూడా భుజిస్తున్నారు. ఉదయాన్నే విధులకు హాజరుకావాల్సి ఉండడంతో ఇంట్లో అల్పాహారం తయారీకి తగిన సమయం లేకపోవడంతో హోటళ్లవైపు చూస్తున్నారు. ఇంట్లోకంటే రుచిగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. ఇంటివారిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టకుండా బయట టిఫిన్ చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. అదేసమయంలో కరోనా సమయం కాబట్టి హోటళ్లకంటే ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల అల్పాహార రుచులపై ‘సాక్షి’ సోమవారం పలుచోట్ల సర్వే నిర్వహించింది. వరంగల్, హనుమకొండలో 8 టిఫిన్ సెంటర్లలో సాక్షి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 20 ఏళ్లలోపు వారికి పూరీ అంటేనే ఇష్టం.. కాజీపేట ఏరియాలో నిట్, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలోని రెండు హోటళ్లలో జరిపిన సర్వేలో యువత పూరీ ఇష్టపడుతున్నారు. ఫాతిమానగర్‌లోని ఓ మెస్‌లో నిట్ విద్యార్థులు పూరీనే అధికంగా తీసుకున్నారు. 10 నుంచి 20 ఏళ్ల వయస్సు గల 25 మందిని సర్వే చేయగా.. ఎవరు కూడా ఇడ్లీని ఇష్టపడడం లేదు. పూరీపైనే ఆసక్తి కనబరిచారు. హన్మకొండలోని మరో ప్రధాన హోటళ్లలో ఇడ్లీ 10 మంది.. పూరీ ఆరుగురు ఇష్టపడ్డారు. వీరంతా యువతే కావడం గమనార్హం. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు.. క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో బిజీ లైఫ్‌లో సైతం ఆహార విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం తీసుకునే టిఫిన్స్‌పై ప్రజల అభిప్రాయాన్ని అధ్యయనం చేయగా అత్యధిక శాతం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆయిల్ఫుడ్కు దూరంగా ఉండాలనుకోవడం, సులువుగా జీర్ణం అవుతుండడం, ఆరోగ్యవంతమైన ఫుడ్ కావడమే ముఖ్య కారణం. యువత పూరీ, దోశ, వడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవీ తినడానికి రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా 15ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు హోటళ్లలో టిఫిన్స్ కోసం వచ్చారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువత ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరీ, దోశను ఆర్డర్ చేశారు. 40ఏళ్ల పైపడిన వారు ఇడ్లీ ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువ ఇడ్లీ, వడ కాంబినేషన్ తిన్నారు. కొంతమంది ఫేమస్ హోటల్స్ అని తెలవడంతో రుచిచూద్దామనే ఆలోచనతో వచ్చామని చెప్పగా, మరికొందరు ఫ్రెండ్స్‌తో టిఫిన్స్ ఆరగించామని వివరించారు. ఉదయం ఇడ్లీ, పూరీ, బొండా, వడ లాంటి టిఫిన్లను నగర వాసులు ఇష్టపడుతుండగా, సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్లకు ఎక్కువగా గిరాకీ ఉంటున్నదని నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో ఒకే వెరైటీ... ఇంట్లో చేస్తే ఒకే వెరైటీ టిఫిన్ చేస్తారు. అదే హోటల్‌కు వెళితే ఇడ్లీ సాంబార్‌తో, చట్నీ, నెయ్యి, కారంతో లాగించేయొచ్చు. ఇలా ఇంట్లో కుదరదు. ఇడ్లీతోపాటు వడ, పూరీ, చక్కరపొంగలి, పెసరట్టు, దోశతోపాటు వెరైటీలు తినొచ్చు.- గాండ్ల మధు, వరంగల్ రుచికరంగా ఉంటాయంటే వచ్చా కరీమాబాద్ జంక్షన్లో టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయని తెలిసి ఫెండ్స్‌తో కలిసి వచ్చాను. అప్పుడçప్పుడు మాత్రమే హోటల్స్‌లో తినడానికి ఇష్టపడతాను. - బొల్లం రాకేశ్, వరంగల్ పూరీ నా ఫేవరెట్ నేను ప్రతి రోజూ పూరీని టిఫిన్‌గా తింటాను, పూరీ నా ఫేవరెట్ టిఫిన్. మా ఇంట్లో చేసిన టిఫిన్ కంటే అన్నపూర్ణ హోటల్లోని పూరీ ఇష్టంగా తింటాను. స్కూల్‌కు వెళ్లే సమయంలో పూరీని టిఫిన్ బాక్స్‌లో తీసుకువెళ్లేందుకు ఇష్టపడతాను. – కట్కూరి అనుష్క, కాజీపేట ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదని నా వయస్సు 55 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్లుగా టైలర్ వృత్తిలో ఉన్నా. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తుంటాను. నేను తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణం కావాలంటే ఇడ్లీ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఇడ్లీ కాకుండా పూరీ, వడ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం కావు. ఆయిల్‌ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడం కంటే వితౌట్ ఆయిల్‌తో చేసిన ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా. – పొడిశెట్టి వెంకటేశ్వర్లు, టైలర్, కుమార్‌పల్లి సర్వే ఇలా.. వరంగల్, హనుమకొండ ఏరియాల్లో మొత్తం 8 ప్రధాన టిఫిన్ సెంటర్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పరిశీలన.. తీసుకున్న శాంపిల్స్ : 105 ఆన్లైన్లో.. 39 పార్సిల్ 46 హోటల్లో తిన్నవారు 128 ఇడ్లీ : 19 పూరీ : 12 వడ : 10 దోశ, ఇతరాలు : 14 ఇడ్లీ : 10 పూరీ : 19 వడ : 04 దోశ, ఇతరాలు : 17 చదవండి: అందరి చూపు చిరుధాన్యాలపైనే.. కారణం ఏంటంటే! -
‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
చెన్నె: ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్ అందించారు. త్వరలోనే ఆమెను ఓ ఇంటి దాన్ని చేయనున్నాడు. ఈ మేరకు ఆ విషయాన్ని ఆనంద్ మహేంద్ర ట్విటర్లో చెప్పారు. త్వరలోనే కమలాథల్‌కు ఓ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని ఆనంద్ మహేంద్ర తెలిపారు. రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్ గురించి రెండేళ్ల కిందట సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. వాటిని చూసి ఆనంద్ మహేంద్ర.. కమలాథల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని ప్రకటించాడు. ఆ మేరకు ఆయన ప్రారంభించారు. కట్టెల పొయ్యితో వండుతుండడాన్ని చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ ఇస్తానని ఆనంద్ మహేంద్ర హామీ ఇచ్చారు. అయితే భారత్ గ్యాస్ వారు ఆమెకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించారు. ఆమెకు ఇల్లు కానీ, హోటల్ కానీ నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో కమలాథల్‌కు కోయంబత్తూరులో ఓ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆనంద్ మహేంద్ర చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా శుక్రవారం కమలాథల్ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి రిజిస్రే్టషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇదే విషయాన్ని ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. మహేంద్ర లైఫ్ స్పేసెస్ ఆ ఇంటిని నిర్మించనుంది. త్వరలోనే ఇంటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. తొండముత్తూరులో ఆమెకు సంబంధించిన భూమి రిజిస్రే్టషన్ చేశారు. 🙏🏽 to the @MahindraRise team for understanding from Kamalathal how we can ‘invest’ in her business. She said her priority was a new home/workspace. Grateful to the Registration Office at Thondamuthur for helping us achieve our 1st milestone by speedily registering the land (2/3) pic.twitter.com/F6qKdHHD4w — anand mahindra (@anandmahindra) April 2, 2021 -
20 కోసం గొడవ.. ఇడ్లీ అమ్మే వ్యక్తి హత్య
థానే: ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇడ్లీలు అమ్మె ఓ వ్యక్తితో రూ.20 కోసం గొడవపడి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర యాదవ్ అనే ఓ వ్యక్తి రోజు మీరా రోడ్డులో ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు. అయితే శుక్రవారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి ఇడ్లీలు తిన్నారు. అనంతరం వారు వీరేంద్ర యాదవ్‌తో రూ. 20 కోసం వాదన దిగారు. ఈ వాదన కాస్త పెద్ద గొడవకు దారితీయటంతో ఆ వ్యక్తులు కోపంతో వీరేంద్ర యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో వీరేంద్ర యాదవ్‌ను వారు కిందకు తోసేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన స్థలం నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వీరేంద్ర యాదవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. మీరా రోడ్డులోని నయా నగర్ పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
ఏం తిందాం? రెస్టారెంట్‌కు వెళ్లినా... ఇంటికి పార్శిల్ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్ ఎప్పుటినుంచో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. మనోళ్లు చికెన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్‌వెజ్, వెజ్ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్ స్టాట్‘ఈట్’స్టిక్స్ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్ హెల్తీఫుడ్కు మెట్రోల మొగ్గు: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్ గ్రెయిన్స్ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్ ఫుడ్ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్‌కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్ ఇడ్లీ, హైప్రోటీన్ కిచ్డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్విచెస్, గ్లూటెన్ రహిత ఐస్‌క్రీమ్‌లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కూ డిమాండే.. పానీపూరి, ఇతర స్ట్రీట్‌ఫుడ్‌ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. ► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్ చికెన్ బిర్యానీయే. ► ఈ ఏడాది 1 వెజ్బిర్యానీకి 6 చికెన్ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి ► లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్ చేశారు ► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్‌దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్‌ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి. ► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. ► ఈ ఏడాది ‘లాక్డౌన్ బర్త్‌డేస్’సెలబ్రేషన్స్ కోసం 6 లక్షల కేక్‌లు డెలివరీ అయ్యాయి. ► స్విగ్గీ డెలివరీ స్టాఫ్‌కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు . హైదరాబాద్ అభి‘రుచు’లు 1) చికెన్ బిర్యానీ 2) ఇడ్లీ 3) మసాలా దోశ 4) చికెన్ 65 5) పన్నీర్ బటర్ మసాలా 6) వడ 7) మటన్ బిర్యానీ 8) వెజ్ బిర్యానీ ఆర్డర్లలో టాప్–5 నగరాలు 1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్ 5) ఢిల్లీ -
ఇడ్లీ బోరింగ్ అని ట్వీట్.. నెటిజన్లు ఫైర్
ఇడ్లీ.. అత్యధిక మంది అల్పాహారంగా తీసుకునే వంటకాట్లో ఒక్కటి. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఇడ్లీ ప్రియులు ఎక్కువగా ఉంటారు. నిరు పేద నుంచి ధనవంతుల వరకు ఇడ్లీను అల్పాహారంగా తీసుకుంటారు. అలాంటి ఇడ్లీలపై ఓ బ్రిటీష్ లెక్చరర్ చేసిన ట్వీట్.. దక్షిణ భారతీయుల కోపాన్ని చవి చూసింది. ఇడ్లీలు ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ అల్పాహారం అని ట్వీట్ చేశారు. దీంతో ఇండ్లీ ప్రియులు అతన్ని వేసుకున్నారు. ప్రజలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలియని ఒక వంటకం పేరు చెప్పండి’ పుడ్ డెలివరీ సంస్థ జొమాటో ట్వీట్ చేసింది. దీనికి చాలా మంది రిప్లై ఇచ్చారు. చోల్ భతురే, రాజ్మా చావల్, బిర్యానీ, మోమోస్, ఇడ్లీ వంటి ప్రసిద్ధ ఇష్టమైన వంటకాల పేర్లను పేర్కొన్నారు. అయితే ఒక బ్రిటిష్ లెక్చరర్ మాత్రం ‘ప్రపంచలో అత్యంత బోరింగ్ అల్పాహారం ఇడ్లీ’ అంటూ వివాదస్పద ట్వీట్ చేశారు. నార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన హిస్టరీ లెక్చరర్ ఎడ్వర్డ్ ఆండర్సన్ ఈ ట్వీట్ చేశారు. అయితే దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఇడ్లీని బోరింగ్ అంటావా అంటూ నెటిజన్లు అతనిపై ఫైర్ అవువున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నీకేం తెలుసు ఇడ్లీల రుచి’, ఇడ్లీల గురించి నీకేం తెలుసు..బిర్యానీ మాత్రమే కాదు.. ఇడ్లీల విషయంలో కూడా దక్షిణ భారతీయులు ఐక్యంగా ఉంటారు’, ‘ఇడ్లీలు కాదు నువ్వే బోరింగ్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కంగుతున్న హిస్టరీ లెక్చరర్.. ‘దక్షిణ భారతీయులు నాపై ట్వీట్ల దాడి చేసే ముందు నాకు దక్షిణ భారత్ వంటకాలైనా దోశ, అప్పం లాంటి వంటకాలు నచ్చుతాయని తెలుసుకోండి. కానీ ఇడ్లీలు అంటే అంతగా ఇష్టం ఉండదు’ అని ట్వీట్ చేశారు. అయినప్పటికీ నెటిజన్ల దాడి ఆగలేదు. దీంతో చివరికి ఆయన క్షమాపణలు చెప్పడంతో ట్వీట్ల దాడి నిలిపివేశారు. Idli are the most boring things in the world. https://t.co/2RgHm6zpm4 — Edward Anderson (@edanderson101) October 6, 2020 Edward, that rumbling you hear is the South Indians mobilising the army. What have you done?!!!! — Rajesh Mehta (@RajeshBKDM) October 6, 2020 YOU ARE BORING. how dare you https://t.co/K4NTH3JUK5 — dr nabila 🌹 (@nmunawar) October 7, 2020 Not just Biriyani...whole of South India is united through idli😂😂 https://t.co/Ljp4uwiooa — S.R.Prabhu (@prabhu_sr) October 7, 2020 Having accidentally enraged the entirety of South India (and its omnipresent diaspora) on twitter, it was only right to order idlis for lunch. I'm very sorry to report that my unpopular - or "blasphemous", as some have said - opinion remains unchanged. #sorrynotsorry https://t.co/qx2VRJw6EO pic.twitter.com/TmIvxNWaYx — Edward Anderson (@edanderson101) October 7, 2020 -
మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయనా
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ పాకశాస్త్ర నిపుణులైనట్లే కనబడుతున్నారు. ఎన్నడూ వంటగది వైపు కన్నెత్తి కూడా చూడని వాళ్లు ఇప్పుడు థింక్ డిఫరెంట్ అండ్ డూ డిఫరెంట్ అన్నట్లుగా వెరైటీ వంటకాలు సృష్టిస్తున్నారు. అయితే వాటిని చూస్తే భోజన ప్రియులు కూడా తిండి మానేసేలా ఉన్నారు. ఇప్పటికే వెరైటీ పేరుతో ఎన్నో ప్రయోగాలు సోషల్ మీడియాలో పుట్టుకురాగా తాజాగా మరో భయంకర వంటకానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పనీర్, పాలకూర కలిపి ఇడ్లీ చేస్తే ఎలాగుంటుంది. అదిగో పై ఫొటోలో చూపించినట్లు ఎబ్బెట్టుగా ఉంటుంది. రుచి పక్కన పెడితే కనీసం చూడటానికి బాగుంటేనైనా తినడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది మరీ ఘోరాన్ని చూసినట్లుగా కనిపిస్తుంటే తినడానికి ఎవరు మాత్రం భయపడరు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) నెటిజన్లను బెంబేలిత్తిస్తున్న ఈ వంటకం ఫొటోను ఏఎన్ఐ ఎడిటర్ స్మిత ప్రకాశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే దీన్ని ఓసారి ప్రయత్నిస్తే పోలా అని ఆలోచిస్తున్నారు. మిగతా అందరూ ఈ టిఫిన్ దరిద్రంగా ఉందని మొహం చాటేస్తున్నారు. "ఐస్ క్రీమ్ దోశతో పోలిస్తే ఇదే కాస్త నయం" అని మరికొందరు సర్ది చెప్తున్నారు. "ఎందుకు నాయనా, ఇలాంటి వంటకాలతో మా ప్రాణాలు తీస్తారు?", "దక్షిణాది వంటకాలను ఖూనీ చేయడం ఆపేయండి", "దీన్ని తయారు చేసినవారికి రోజుకు మూడు పూటలా ఇదే ఇడ్లీ పెట్టాలి. అదే వారికి సరైన శిక్ష అవుతుంది" అంటూ మరికొందరు ఈ వంటకంపైనా, దీన్ని తయారు చేసినవారిపైనా మండిపడుతున్నారు. (గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!) -
కళాకారుడి వినూత్న స్వాగతం.. మోదీ, ట్రంప్ ఇడ్లీలు..
-
ట్రంప్ టూర్: కళాకారుడి వినూత్న స్వాగతం
చెన్నై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేశారు. దీంతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ట్రంప్ రెండు రోజుల పర్యటనపై దేశమంతా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ క్రమంలో ఓ కళాకారుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి వినూత్న స్వాగతం పలికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఇనైవాన్ అనే వ్యక్తి ట్రంప్ పర్యటనతోపాటు రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని తన కళాకృతిలో చాటి చెప్పాడు. అందుకోసం మూడు పే..ద్ద ఇడ్లీలను తయారు చేసి వాటిపై మోదీ, ట్రంప్ ముఖాలను చిత్రీకరించాడు. (మేడమ్ ఫస్ట్ లేడీ) మరో ఇడ్లీపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఆవిష్కరించాడు. ఈ కళాకృతులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటిని ఇనైవాన్ ఆరుగురు వ్యక్తుల సహాయంతో సుమారు 36 గంటల పాటు శ్రమించి సిద్ధం చేశాడు. ఈ మూడు ఇడ్లీల బరువు సుమారు 107 కిలోలు. కాగా నేడు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వీరు అక్కడి నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ట్రంప్ దంపతులు ఇద్దరూ నేలపై కూర్చుని చరఖాపై నూలు వడకడం విశేషం. (మోదీ, నేను మంచి ఫ్రెండ్స్!) -
టాయిలెట్ వాటర్‌తో ఇడ్లీ చట్నీ!
ముంబై : ఓ ఇడ్లీ బండి వ్యక్తి టాయిలెట్ వాటర్‌తో చట్నీ తయారు చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన వీధి బండ్ల ఆహార నాణ్యతపై చర్చకు దారితీసింది. ముంబైలోని బొరివెలి రైల్వేస్టేషన్ సమీప వీధిలో ఇడ్లీలు అమ్ముకునే సదరు వ్యక్తి.. ఆ రైల్వేస్టేషన్ టాయిలెట్లో తెచ్చిన వాటర్‌తో చట్నీని తయారు చేశాడు. ఇదంతా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం ప్రస్తావించలేదు. ఇక ఈ వీడియోపై ఆహార భద్రతా(ఎఫ్‌డీఏ) అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రజలంతా కలుషిత నీటితో తయారు చేసే ఆహారపదార్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఆ వీడియో మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. కలుషిత నీటిని ఉపయోగించే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ నీరు ఆరోగ్యానికి మంచివి కావు. సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్‌ను తనిఖీ చేస్తాం, ఎలాంటి సాంపిల్ దొరికినా సీజ్ చేస్తాం’అని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్ అదావ్ మీడియాకు తెలిపారు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇడ్లీ ప్రియుల్లో బెంగళూరు టాప్
న్యూఢిల్లీ: సాధారణంగా చాలామంది ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. త్వరగా జీర్ణమైపోవడంతో పాటు ఆరోగ్యానికి ఇడ్లీ మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. గోధుమ రవ్వ లేదా రాగిపిండితో చేసిన ఇడ్లీల ద్వా రా ఆరోగ్యంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతారు. ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ అల్పాహారం విషయంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఉదయా న్నే అల్పాహారంగా ఇడ్లీ తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచినట్లు ఉబెర్ ఈట్స్ తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరాది నగరం ముంబై రెండోస్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఉదయం 7.30–11.30 కాలంలో గణనీయమైన సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం నేపథ్యంలో ఈ వివరాలను ‘ఉబెర్ ఈట్స్’ విడుదల చేసింది. ఈ నెల 10న దేశమంతటా అత్యధిక సంఖ్యలో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. వెరైటీ ఇడ్లీలపై మక్కువ ఇడ్లీలపై కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ మక్కువ ఎక్కువేనని సర్వే తేల్చింది. భారత్ వెలుపల అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ, బ్రిటన్‌లోని లండన్ వాసులు ఇడ్లీలను లాగించేస్తున్నారని ఉబెర్ ఈట్స్ వెల్లడించింది. ఇక ఇడ్లీ వెరైటీల విషయంలోనూ భారతీయులు వెనక్కి తగ్గట్లేదని ఈ సందర్భంగా తేలింది. తమిళనాడులోని కోయంబత్తూరు వాసులు చికెన్‌ఫ్రై ఇడ్లీపై మనసు పారేసుకున్నట్లు సర్వే పేర్కొంది. తిరుచినాపల్లి వాసులు ఇడ్లీ మంచూరియాను, నాగ్‌పూర్ నగర వాసులు చాకోలెట్ ఇడ్లీపై మనసు పారేసుకున్నారని సర్వే వెల్లడించింది. అలాగే ఆర్డర్ల సందర్భంగా కొంచెం చట్నీ, కారంపొడి, సాంబార్ ఎక్కువగా వేయాల్సిందిగా చాలామంది వినియోగదారులు కోరారంది. అలాగే ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉన్న మరికొందరు వినియోగదారులు వెజిటబుల్ ఇడ్లీని ఆర్డర్ చేశారని పేర్కొంది. ‘ఇడ్లీ ప్రియులు అత్యధికంగా ఉన్న నగరంగా బెంగళూరు అవతరించడం నిజంగా సంతోషకరమైన విషయం. భారత్‌లో అత్యధికులు ఇడ్లీని తమ అల్పాహారంగా తీసుకుంటారు. అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని గత మూడేళ్లుగా జరుపుతున్నారు. తమిళనాడు కేటరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజమణి అయ్యర్ తొలుత ఈ ప్రతిపాదన చేశారు’ అని బెంగళూరుకు చెందిన ‘బ్రాహ్మిణ్స్ థట్టె ఇడ్లీ’ యజమాని సుభాష్ శర్మ తెలిపారు. -
టెన్షన్ ఆవిరి
వేసవిలో మనమందరం ఉడుకుతాం. అందుకే దేవుడు వేసవి సృష్టించాడు.ఉడికితే మెత్తపడతాం. మెత్తటి బలాన్ని పుంజుకుంటాం.శరీరమంతా శుభ్రమైపోతుంది. చెడు ఆవిరైపోతుంది.ఇడ్లీ జీర్ణించుకోవడం చాలా సులభం. వెంటనే బలాన్నిస్తాయి.ఈ పరీక్షల టైమ్‌లో టెన్షన్‌ని ఆవిరి చేసేస్తాయి. బ్రెడ్ ఇడ్లీ కావలసినవి బ్రెడ్ స్లైసులు – 4 ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; బేకింగ్ సోడా – చిటికెడు; నూనె – కొద్దిగా తయారీ ►బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి ►ఒక పాత్రలో బ్రెడ్‌ను పొడిపొడిగా చేసి వేయాలి ►ఒక కప్పు ఇడ్లీ రవ్వ జత చేయాలి ►ఉప్పు, పెరుగు జత చేయాలి ►తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టి అరగంటసేపు పక్కన ఉంచాలి ►బేకింగ్ పౌడర్ జత చేసి కలపాలి ►ఇడ్లీరేకులకు కొద్దిగా నూనె పూయాలి ►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. అటుకుల ఇడ్లీ కావలసినవి: ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; అటుకులు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఇడ్లీ రేకులకు రాయడానికి తగినంత తయారీ ► ఒక పాత్రలో ఉప్పుడు బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ►అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ►ఒక పాత్రలో వీటిని అన్నిటినీ వేసి తగినన్ని నీళ్లలో సుమారు ఆరు గంటలపాటు నానబెట్టాలి ►నీళ్లు ఒంపేసి, నానబెట్టిన పదార్థాలను గ్రైండర్లో వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా ఇడ్లీ పిండిలా రుబ్బుకుని, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►తగినంత ఉప్పు, పంచదార జత చేసి బాగా కలిపి, మూత పెట్టి సుమారు తొమ్మిది గంటలపాటు ఉంచాలి ►ఇడ్లీ రేకులను శుభ్రంగా కడిగి, నెయ్యి లేదా నూనె పూసి, నానబెట్టిన పిండిని ఆ గుంటలో వేసి, ఇడ్లీ స్టాండులో ఉంచి స్టౌ మీద ఉంచాలి ►సుమారు పావు గంట తరవాత దింపేయాలి ►కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. సాబుదానా ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను; నూనె – కొద్దిగా తయారీ ►సగ్గు బియ్యం, ఇడ్లీ రవ్వలను విడివిడిగా కడగాలి ►ఒక పాత్రలో పెరుగు వేయాలి ►కడిగి ఉంచుకున్న సగ్గుబియ్యం, ఇడ్లీరవ్వల మిశ్రమం వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి) ►కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి, మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఇడ్లీ రేకులలో వేసుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా జత చేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూయాలి ►ప్రతి గుంటలోను కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన ఇడ్లీ పిండి వేయాలి ►ఇడ్లీ స్టాండులో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక ఇడ్లీలను ప్లేట్లలోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటాయి. రవ్వ ఇడ్లీ కావలసినవి: నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చిసెనగ పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను తయారీ ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ►మంట బాగా తగ్గించి, రవ్వ వేసి దోరగా వేయించి దింపేయాలి ►బాగా చల్లారాక పెరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ►తగినన్ని నీళ్లు జతచేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేయాలి ►ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. సేమ్యా ఇడ్లీ కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; నూనె – ఒక టీ స్పూను; సేమ్యా – అర కప్పు; పెరుగు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; బేకింగ్ సోడా – అర టీ స్పూను పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – కొద్దిగా; నూనె – తగినంత; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను తయారీ ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►అదే బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక సేమ్యా వేసి దోరగా వేయించి తీసేయాలి ►ఒక పాత్రలో... వేయించిన రవ్వ, వేయించిన సేమ్యా, పెరుగు వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఇంగువ వేసి వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కరివేపాకు వేసి కలపాలి ►పసుపు జత చేసి బాగా కలిపి దింపేయాలి ►నానబెట్టుకున్న సేమ్యా మిశ్రమానికి జత చేయాలి ►కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి ►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేసి, మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి ►ఇడ్లీలు వేసే ముందు బేకింగ్ సోడా జత చేయాలి ►ఇడ్లీ రేకులకు కొద్దిగా నూనె పూసి, గుంటలలో జీడిపప్పు పలుకులు వేసి, ఆపైన గరిటెడు పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►చల్లారాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటాయి. కాంచీపురం ఇడ్లీ కావలసినవి: బియ్యం – అర కప్పు; ఉప్పుడు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – అర కప్పు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; అరటి ఆకులు – తగినన్ని తయారీ ► బియ్యం, ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రాత్రంతా నానబెట్టాలి ►ఇందులోనే మెంతులు కూడా వేయాలి ►మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, జీడిపప్పు పలుకులు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, తీసేసి, ఇడ్లీ పిండిలో వేసి కలపాలి ►అల్లం తురుము, ఉప్పు జత చేసి కలపాలి ►అరటి ఆకులను పెనం మీద గోరు వెచ్చన చేసి పక్కన ఉంచాలి ►చిన్న చిన్న కప్పులు తీసుకుని వాటికి కొద్దిగా నూనె పూసి, ఆపైన అరటి ఆకు ముక్కలను (కప్పు ఆకారంలో) మడిచి, కప్పులో ఉంచాలి ►అందులో తగినంత పిండి వేయాలి ►ఇడ్లీ కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి, ఇడ్లీ పిండి వేసిన కప్పులను అందులో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ►పది నిమిషాల తరవాత దింపేయాలి ►వేడి తగ్గాక ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవాలి ►కొబ్బరి చట్నీతో అందించాలి. -
సగ్గుతో నెగ్గు
ఓ కోడలమ్మా..! ఊరి నుంచి బంధువులొస్తున్నారేమ్! ఆటో వీధి మలుపు తిరిగిందట ఏదైనా చేసి పెట్టరాదూ!! ఓ క్వీన్ వైఫ్! ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్ ఇక్కడే చూస్తారట మంచింగ్‌కి ఏమైనా...! ఓ మమ్మీ! సంజయ్, లీలా, లక్ష్మీ, అనంత్, సౌరవ్, సోనూ సింగ్, బెనర్జీ, యూసుఫ్.. అందరికీ ఆకలేస్తోంది ఏముంది తినటానికి..? జీవితంలో ఎక్కడైనా గెలవచ్చు కానీ వంటగదిలో గెలవడం కొద్దిగా కష్టమే చక చకా వండి నెగ్గుకురావాలంటే ఏం చేయాలి?! మేడమ్.. సగ్గుతో నెగ్గండి! మనింట్లో చేసుకునే సూపర్‌ఫాస్ట్ ఫుడ్! ఇడ్లీ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు ఇడ్లీ రవ్వ – కప్పు పెరుగు – 2 కప్పులు నీళ్లు – ఒకటిన్నర కప్పు (తగినన్ని) ఉప్పు – తగినంత బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ జీడిపప్పులు – 16 (సగం పలుకు) నూనె – ఇడ్లీ ప్లేట్‌కి రాసేటంత తయారీ: పెద్ద గిన్నెలో సగ్గుబియ్యం (కడగకూడదు), ఇడ్లీ రవ్వ, 2 కప్పుల పెరుగు, కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా లేదా 8 గంటలు అలాగే ఉంచాలి. మరుసటి రోజు పిండిని ఎక్కువ కలపకూడదు. నానిన సగ్గుబియ్యం మరీ మెత్తగా అయిపోతాయి. ఇడ్లీ చేసే ముందు పావు కప్పు నీళ్లు, సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్స్కి నూనె రాసి, జీడిపప్పు పలుకులు ఒక్కొక్కటి పెట్టి, పిండి సర్దాలి. ఈ ప్లేట్‌ని ఇడ్లీపాత్రలో పెట్టి ఆవిరి మీద కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. మంట తీసేసాక ఐదు నిమిషాలు అలాగే ఉంచి, అప్పుడు ఇడ్లీలు తీయాలి. ఏదైనా నచ్చిన చట్నీతో సర్వ్ చేయాలి. నోట్: సగ్గుబియ్యం కుకర్‌లో పెట్టి ఉడికించి కూడా పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకు తక్కువ సమయం పడుతుంది. బనానా కోకనట్ మిల్క్ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; అరటిపండ్లు – 2; కొబ్బరిపాలు – కప్పు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙సగ్గుబియ్యం కడిగి, నీళ్లు పోసి, ఆ నీళ్లను వడకట్టాలి. తర్వాత నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. లేదంటే కుకర్‌లో పెట్టి ఉడికించవచ్చు. ఈ సగ్గుబియ్యంలో 2 కప్పుల నీళ్లు, పంచదార పొడి, చిటికెడు ఉప్పు సాస్పాన్లో పోసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. ∙అరటి పండుపై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి 3 నిమిషాలు ఉంచాలి. అరటిపండు ముక్కలు మరీ మృదువుగా అవుతాయి. దీంట్లో కొబ్బరి పాలు పోసి మంట తీసేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో పైన వేయించిన నువ్వులు, మామిడిపండు ముక్కలు వేసి చల్లగానూ, వేడిగానూ అందించవచ్చు. కిచిడి కావల్సినవి: సగ్గుబియ్యం – కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; బంగాళదుంప ముక్కలు – ముప్పావు కప్పు ; ఉప్పు – తగినంత; వేరుశనగపొడి – అర కప్పు ; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పంచదార – 2 టీ స్పూన్లు తయారీ: ∙ సగ్గుబియ్యం కడిగి, ముప్పావు కప్పు నీళ్లుపోసి నానబెట్టాలి. ∙ నూనె వేసి, వేడయ్యాక నాన్‌స్టిక్ పాన్‌లో జీలకర్ర వేసి వేయించాలి. పోపుగింజలు, ఉడికిన బంగాళదుంప ముక్కలు, బాగా నానిన సగ్గుబియ్యం, ఉప్పు, వేరుశనగపొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, పంచదార, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టాలి. ∙ వేడి వేడిగా సర్వ్ చేయాలి. పకోడీ కావల్సినవి: సగ్గుబియ్యం – 2 కప్పులు; బియ్యప్పిండి – 2 కప్పులు; మజ్జిగ – 3 కప్పులు; కారం – టీ స్పూన్; పచ్చిమిర్చి – 4; ఉప్పు – తగినంత; ఉల్లిపాయలు – 2; నూనె – వేయించడానికి తగినంత తయారీ: సగ్గుబియ్యం కడిగి మజ్జిగలో గంట సేపు నానబెట్టాలి. దీంట్లో బియ్యప్పిండి, కారం కలపాలి. నీళ్లు కలపకూడదు. ఉప్పు, ఉల్లిపాయల తరుగు, టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. సిద్దంగా ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఖీర్ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పాలు – 2 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – 5 టేబుల్‌స్పూన్లు; యాలకులు – 5 (పొడి చేయాలి); జీడిపప్పు, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – అర టేబుల్ స్పూన్; కుంకుమపువ్వు – 5 రేకలు తయారీ: సగ్గుబియ్యం , 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మందపాటి గిన్నెలో సగ్గుబియ్యం, నీళ్లు కలిపి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత పాలు పోసి మళ్లీ మరిగించాలి. దీంట్లో పంచదార, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికాక వేయించిన జీడిపప్పు , బాదం పలుకులు, కిస్మిస్, చివరగా కుంకుమపువ్వు వేసి మంట తీసేయాలి. సర్వ్ చేసేముందు టీ స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. వడ కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఉడకబెట్టిన బంగాళదుంపలు – కప్పు; వేరుశనగపప్పు (కచ్చాపచ్చాగా దంచాలి)– ముప్పావుకప్పు జీలకర్ర – అర టీ స్పూన్; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – అర టీ స్పూన్; పంచదార – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ సగ్గుబియ్యం కడిగి ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ∙ బాగా ఉడికిన సగ్గుబియ్యంలో మిగతా దినుసులన్నీ వేసి కలపాలి. దీనిని 8 భాగాలు గా చేయాలి. ఒక్కో భాగాన్ని ఉండగా, చేసి అరచేత్తో అదమాలి. ∙ మూకుడులో నూనె పోసి, కాగాక సిద్ధం చేసుకున్న వడలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టిష్యూ పేపర్ మీద వేసి, తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. గ్రీన్ చట్నీ లేదా పంచదార కలిపిన పెరుగుతో వడ్డించాలి. -
ఇడ్లీ - దోశ ఒక తులనాత్మక పరిశీలన - అవగాహన!
హ్యూమర్ ‘‘ఇడ్లీ, దోశలలో ఏది ఉత్తమమైంది స్వామీ’’ అని అడిగా మా గురువు గారిని. ‘‘నాయనా తుచ్ఛులైన వారు ఏది ఉత్తమమైనదీ అని అడుగుతారు. నువ్వు వెలిబుచ్చే ఇలాంటి పనికిమాలిన సందేహాలతో పొద్దుపుచ్చుతారు. కానీ తెలివైన వాళ్లు ఏది దొరికితే అది తినేస్తారు. అంతే తప్ప ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడగరు నాయనా’’ అని సెలవిచ్చారు స్వామీజీ. అయినా నేను పట్టు వీడలేదు. ‘‘ఒకసారి ప్రశ్న కోసం పట్టుపట్టాక వదలకూడదని మీరే అన్నారు కదా స్వామీ. నా ప్రశ్న తర్క, మీమాంస శాస్త్రానికి సంబంధించిందని మీరెందుకు అనుకోకూడదు?’’ నేను మళ్లీ రెట్టించాను. ‘‘సరే విను. చిన్న గిన్నెతో పిండిని పెనం మీద వేశాక దోశ కావడానికి ఆ చిన్న గిన్నెతోనే దానిపై ఒత్తిడి పెడతారు. అది పెనం మీద పరుచుకునేలా విస్తరించడానికి దాని తలమీద రుద్దేస్తారు. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్లను రుబ్బుతుండటం సరికాదని నువ్వు నీ స్పీచుల్లో చెబుతుంటావు చూడు. వాళ్ల లాగే దోశ మీద కూడా అలా రుద్దడం సరికాదు నాయనా. అలా రుద్దినప్పుడు ఏమవుతుందో తెల్సా?’’ అడిగారు స్వామీజీ ‘‘ఏమవుతుంది స్వామీ...?’’ అడిగాను నేను. ‘‘దోశల్లా కార్పొరేట్ పిల్లల్లా ఎదగకుండా ఉండిపోతారు. కానీ ఇడ్లీ అలా కాదు. మెదడు వికాసం జరిగినట్లే ఇడ్లీ కూడా పొంగుతుంది. పిండి రేణువుకూ, పిండి రేణువుకూ మధ్య ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దోశ ముక్కలను ఎప్పుడైనా సాంబారులో వేశావా? ఏదో దోశతో పాటు స్పూనుతో తాగడానికి సాంబారు సరిపోతుంది గానీ... దోశముక్కలు సాంబారు అంత తేలిగ్గా పీల్చవు. అచ్చం నీ ఉపన్యాసాల్లో మన కార్పొరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లాగే. వారూ అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాలను గానీ... లోకజ్ఞానాన్నిగానీ అబ్జార్బ్ చేసుకోలేరు...’’ అంటుండగానే నేను మధ్యలోనే అడ్డుపడ్డాను. ‘‘అంటే... ఇడ్లీ పీల్చుకుంటుందా స్వామీ’’ ‘‘తప్పకుండా నాయనా... మంచి నిపుణులైన వంట చేసేవాళ్లు పిండి కలిపారనుకో. ఆ రవ్వా... ఆ మినప్పప్పు సమపాళ్లలో కలిశాయనుకో. ఇడ్లీలోని పిండికి మధ్య ఎంతెంతో పఫ్పీ స్పేస్ ఉంటుంది. ఆ మధ్యనున్న స్థలంలో సాంబారు దూరిపోతుంది. సాంబారులో నానిన ఆ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నాయనా’’ చెబుతున్నారు స్వామీజీ. ‘‘నిజమే కదా స్వామీ’’ బదులిచ్చాను నేను. ‘‘అంతేకాదు నాయనా... జనం పెరిగారు. జనాభా పెరిగింది. వాళ్లకు తగ్గట్లుగా ఇళ్లు కూడా కావాలి కదా’’ అన్నారు స్వామీజీ. ‘‘అవును కదా. మరి దానికీ ఇడ్లీకీ సంబంధమేమిటి స్వామీ?’’ అడిగాను. ‘‘అదే నాయనా నాలాంటి జ్ఞానులకూ, నీకూ తేడా. ఇడ్లీ పాత్రలో గతంలో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. పాత్రపెద్దదవుతూ ఉండేదీ... దానిలోని పిండి పోసే చిప్పలు పెరిగేవి. కానీ... డూప్లెక్సు భవనంలా ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండేవి. కానీ ఇప్పుడు మాడ్రన్ ఇడ్లీ పాత్రను ఎప్పుడైనా హోటల్లో చూడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ర్యాకులనూ, డెస్కులనూ బయటకు లాగినట్లుగా వాటిని లాగుతుంటారు’’ అని జవాబిచ్చారు స్వామీ. ‘‘అవును స్వామీ... ఇడ్లీ పాత్రకూ, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లకూ అంత దగ్గరి సంబంధం ఉంటుందనుకోలేదు’’ అన్నాన్నేను. ‘‘అంతేకాదు... దోశ కంటే ఇడ్లీ ఎన్ని రకాలుగా ఉత్తమమో చెబుతాను ఆగు. ఉదాహరణకు మసాలా దోశ తిన్నావనుకో. అందులో మసాలా పేరిట ఉండే పదార్థం నీకు సరిపడకపోవచ్చు. కడుపులో మంట పుట్టించవచ్చు. దోశకు అది తెచ్చిపెట్టుకున్న టేస్టు. కానీ ఇడ్లీలో అలా కాదు నాయనా... మసాలాలూ, గిసాలాలూ ఏవీ లేకుండా... కేవలం ఇడ్లీ వల్లనే ఇడ్లీకి రుచి వస్తుంది. ఏదీ తెచ్చిపెట్టుకోనిదో, ఏది స్వాభావికమైనదో ఆ టేస్టు గొప్పది నాయనా’’ అన్నారు స్వామీజీ. ‘‘అయినా అరిషడ్వర్గాలనూ జయించిన మీలాంటి స్వామీజీలు రుచుల గురించి ఇంత విపులమైన వర్ణనలేమిటి స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘పిచ్చివాడా... ఇడ్లీ అంటే ఏమిటి? సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం నాయనా. సాంబారు ఇడ్లీలోకి ఎలా ఇంకిపోతుందో తెలుసా? అచ్చం జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లే! మాలాంటి జ్ఞానులకు ఇవన్నీ తెలుసు. కానీ తిండిబోతులైన నీలాంటి తుచ్ఛులకు అర్థమయ్యేలా చెప్పడమెలా? అయినా నువ్వే చెప్పావు కదా. తర్క మీమాంస శాస్త్రాలు నీబోటి సామాన్యులకు కూడా అర్థం కావడం కోసమే నాయనా ఈ ఉదాహరణలు’’ అని సెలవిచ్చారు స్వామీజీ. నాకు జ్ఞానోదయమైంది. అనంతాకాశం అనే సాంబారు ప్లేటులో అర్ధచంద్రుడు ఇడ్లీలా దర్శనమిచ్చాడు! - యాసీన్ -
పరీక్షల ఫలహారం
పిల్లల పరీక్షలొస్తుంటే చదువుల మాట ఏమో కాని, వారి ఆహారం పూర్తిగా నిర్లక్ష్యమవుతుంది. జంక్ ఫుడ్, కప్పుల కొద్దీ కాఫీ, టీ వంటివి నిరంతరం తీసుకునేవారు సైతం పరీక్షల సమయంలో ఆహారాన్ని దూరం పెట్టేస్తారు. అందుకే పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే ముందు నుంచే వారి ఆహారం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ముందుగానే పిల్లలతో చర్చించి, వారు ఏ ఆహారానికి ఎక్కువ... ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకుని వాటితోనే వారికి కావలసిన పోషకాలను అందిస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా ఓట్స్, ముసిలి, ఉప్మా, ఖిచిడీ, ఇడ్లీ... వంటివాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవడం మంచిది. ఈ పదార్థాలన్నీ శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను సక్రమంగా అందిస్తాయి. స్మూతీస్, డ్రై ఫ్రూట్స్ రోజులో నాలుగుసార్లు పెద్ద మొత్తంలో ఆహారం అందించడం వల్ల పిల్లలు వెంటనే నిద్రపోయే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెదడు కంటే ఎక్కువగా ఉదరానికి చేరడం వల్ల వారు త్వరగా నిద్రపోతారు. అందువల్ల తరచుగా కొద్దికొద్దిగా పోషకాహారం అందేలా ప్రణాళిక వేసుకోవాలి. ఫలితంగా వారు నిద్రపోకుండా మెలకువగా ఉండగలుగుతారు. తాజా పళ్లు, స్మూతీలు, తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్, పిల్లలు ఇష్టపడే సలాడ్లు... ఇవి మంచిది. మజ్జిగ, గ్రీన్ టీ పిల్లలు వారికి సౌకర్యంగా ఉండే చోట కూర్చుని, మరీ ముఖ్యంగా ఏసీల ముందు కూర్చుని, దాహం వేయకపోవడంతో, మంచినీళ్లు తాగడం మర్చిపోతారు. దాంతో వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరం, మెదడు సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. కళ్లు తిరిగినట్లవుతుంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతారు. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ వాళ్లు ఎక్కువ నీళ్లు తాగడానికి సుముఖత చూపకపోతే, తాజా పండ్ల రసాలు, పల్చటి మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తరచుగా అందిస్తూండాలి. అల్లం, చెక్క ఎక్కువ మోతాదులో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, టీ, కోలాల... వంటివి పరీక్షల సమయంలో తాగడం మంచిది కాదు. వాటిని తీసుకోవడం వల్ల పిల్లలు సక్రమంగా నిద్రపోలేకపోతారు. అందువల్ల పిల్లలను అలాంటి వాటి నుంచి దూరంగా ఉంచాలి. వాటి స్థానంలో పల్చటి మజ్జిగలో అల్లం, దాల్చినచెక్క పొడి వంటివి జత చేసి ఆరోగ్యకరంగా, రుచికరంగా తయారుచేసి పిల్లలకు తరచు అందచేయాలి. గుడ్లు, పండ్లు ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొనే పరీక్షల సమయంలో, శరీరానికి నీటిలో బాగా కలిసిపోయే విటమిన్ బి కాంప్లెక్స్, సి, మినరల్స్, జింక్... వీటి మోతాదు పెరిగిపోతుంది. దాంతో అడ్రెనల్ హార్మోన్ల పని తీరు తగ్గిపోతుంది. ఇవి ఉంటేనే మనిషిలో ఒత్తిడి ఏర్పడినప్పుడు వాటితో తీవ్రంగా పోరాడి, ఒత్తిడి పోగొడతాయి. దంపుడు బియ్యం, నట్స్, కోడిగుడ్లు, తాజా కూరలు, పండ్లు వంటివి ఒత్తిడిని నిరోధిస్తాయి. చేపలు, ఆకుకూరలు విటమిన్ ఎ, సి, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఒత్తిడికి గురవకుండా కాపాడతాయి. కోడిగుడ్లు, చేప, క్యారట్లు, గుమ్మడికాయ, తాజా ఆకు కూరలు, తాజా పండ్లు... వంటివి వాడటం వల్ల మెదడు చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అందువల్ల పిల్లలు పరీక్షల సమయంలో అనారోగ్యం పాలు కాకుండా ఉండగలుగుతారు. ఇన్పుట్స్: డా. వైజయంతి -
భక్తీ... బ్రేక్‌ఫాస్ట్
సూర్యుడు... చంద్రుడు. తమిళులు... ఆంధ్రులు. మనం చంద్రుణ్ణి ఫాలో అవుతాం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని కాలాన్ని లెక్కేసుకుంటాం. తమిళులు సూర్యుణ్ణి ఫాలో అవుతారు. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని వాళ్లు కాలాన్ని లెక్కేసుకుంటారు. ఆ లెక్కన ధనుర్మాసం తమిళమాసం. మరి మనమెందుకు తెల్లారే లేస్తున్నాం? మనమెందుకు తిరుప్పావై వింటున్నాం? భక్తికి ఎల్లల్లేవు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కీ..! అందుకే ఈవారం... తమిళ ఆహారం. కాంచీపురం ఇడ్లీ కావలసినవి: బాయిల్డ్ రైస్ - అర కప్పు; ముడి బియ్యం - అర కప్పు; మినప్పప్పు - అర కప్పు; పోపు కోసం: నువ్వులు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నెయ్యి - 3 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - ఒకటిన్నర టీ స్పూన్లు; సెనగ పప్పు - టీ స్పూను; మిరియాలు - 2 టీ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); జీలకర్ర - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; జీడిపప్పులు - 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కరివేపాకు - 2 రెమ్మలు; పసుపు - చిటికెడు; కొత్తిమీర - 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ఒకపాత్రలో ముడిబియ్యం, బాయిల్డ్ రైస్‌ను సుమారు ఆరు గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి ఒక పాత్రలో మినప్పప్పును సుమారు 5 గంటలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక గిన్నెలో రెండు పిండి మిశ్రమాలు, ఉప్పు వేసి బాగా కలిపి (మరీ పల్చగా, మరీ గట్టిగా కాకుండా చూడాలి) ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి మరుసటి రోజు, పిండిలో పసుపు, కొత్తిమీర వేసి కలపాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక... పోపు కోసం చెప్పిన పదార్థాలను ఒక్కటొక్కటిగా వేస్తూ వేయించాక, పిండి మిశ్రమంలో వేసి కలపాలి ఇడ్లీ స్టాండ్లలో ఇడ్లీలు వేసి సుమారు పావు గంటసేపు ఆవిరి మీద ఉడికించాలి కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇడ్లీ పొడులతో అందించాలి. అక్కెర వడెసల్ కావలసినవి: బియ్యం - అర కప్పు; పెసరపప్పు - 3 టేబుల్ స్పూన్లు; బెల్లం పొడి - అర కప్పు; మరిగించిన చిక్కటి పాలు - 3 కప్పులు + 1 కప్పు నీళ్లు. నెయ్యి - పావు కప్పు; జీడిపప్పులు - 6 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); కిస్మిస్ - 10; కుంకుమపువ్వు - కొద్దిగా; ఏలకుల పొడి - కొద్దిగా; పచ్చ కర్పూరం - కొద్దిగా. తయారీ: బాణలిలో బెల్లం పొడి, నీళ్లు వేసి బెల్లం కరిగేవరకు బాగా కలిపి స్టౌ మీద ఉంచి మధ్యస్థం మంట మీద సుమారు ఐదు నిమిషాలు పాకం చిక్కబడేవరకు కలుపుతుండాలి బియ్యం, పెసరపప్పులను బాగా కడిగి, నీరంతా ఒంపేసి, వేరొక బాణలిలో నూనె లేకుండా దోరగా వేయించాలి మందపాటి పాత్రలో మూడు కప్పుల పాలు పోసి, అందులో బియ్యం పెసరపప్పు వేసి బాగా కలిపి (పాలు పొంగిపోకుండా ఉండేందుకు అందులో ఒక చిన్న ప్లేట్ ఉంచాలి) కుకర్‌లో ఉంచి స్టౌ మీద పెట్టి, నాలుగైదు విజిల్స్ వచ్చాక దింపి, ఈ మిశ్రమాన్ని మెత్తగా మెదపాలి బెల్లం పాకం జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, కప్పు పాలు కలిపి సుమారు 5 నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి పచ్చ కర్పూరం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచాలి టీ స్పూను చల్లటి పాలలో కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి జీడిపప్పు, కిస్మిస్లను టీ స్పూను నేతిలో వేయించాలి స్టౌ మీద మిశ్రమం బాగా ఉడికిన తర్వాత అందులో కుంకుమపువ్వు కలిపిన పాలు, వేయించిన జీడిపప్పు కిస్మిస్లు వేసి బాగా కలిపి దించి వేడివేడిగా అందించాలి. వెర్కడలై ముందిరి పకోడా కావలసినవి: బియ్యప్పిండి - కప్పు; సెనగ పిండి - పావు కప్పు; వెర్కడలై (పల్లీలు) - కప్పు; ముందిరి (జీడిపప్పు) - 20; పుట్నాల పప్పు - 3 టీ స్పూన్లు; బటర్ - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత. తయారీ: ముందుగా పల్లీలను వేయించి పైన పొట్టు తీసి పక్కన ఉంచాలి జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నేతిలో వేయించి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగపిండి, పల్లీలు, జీడిపప్పు, పుట్నాలపప్పు, కారం, బటర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఈ పిండిని చిన్న చిన్న పకోడీలలా వేసి కరకరలాడే వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసి, వేడివేడిగా అందించాలి. అప్పం కావలసినవి: ముడి బియ్యం - కప్పు; బాయిల్డ్ రైస్ - కప్పు; మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు; మెంతులు - పావు టీ స్పూను; కొబ్బరి పాలు - కప్పు; పంచదార - అర టేబుల్ స్పూను; ఉప్పు - కొద్దిగా; కొబ్బరి నీళ్లు - టీ స్పూను; బేకింగ్ సోడా - పావు టీ స్పూను తయారీ: ఒక పాత్రలో ముడి బియ్యం, మినప్పప్పు, మెంతులు వే సి తగినన్ని నీళ్లలో సుమారు ఆరు గంటలు నానబెట్టి, నీరు ఒంపేయాలి బాయిల్డ్ రైస్‌ను కూడా విడిగా నానబెట్టి నీళ్లు ఒంపేయాలి మిక్సీలో ఈ మూడు దినుసులతో పాటు, బాయిల్డ్ రైస్ కూడా వేసి మెత్తగా పట్టి, పాత్రలోకి తీసి, ఉప్పు, పంచదార జత చేసి, బాగా కలిపి మూత ఉంచి ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి ఈ పిండి దోసె పిండి కంటె కొద్దిగా చిక్కగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా కొబ్బరి నీళ్లు కాని, మామూలు నీళ్లు కాని జత చేయాలి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి సుమారు 20 నిమిషాలు ఉంచాలి పాన్ మీద కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, పిండి మిశ్రమాన్ని దోసె మాదిరిగా వేయాలి రెండు పక్కలా నెయ్యి వేసి, మూత ఉంచి బాగా కాలిన తర్వాత తీసేయాలి కొబ్బరి పచ్చడితో రుచిగా ఉంటాయి. -
ఏపీలో రూపాయికి ఇడ్లీ.. రూ.5కి భోజనం
* ఏపీ పురపాలక మంత్రి నారాయణ * నవంబర్‌లో అన్న క్యాంటీన్లు ప్రారంభం * మధ్యాహ్నం సాంబార్ అన్నం/పులిహోర/పెరుగన్నం * రాత్రి భోజనంలో రెండు చపాతీలునాలుగు నగరాల్లో 35 క్యాంటీన్లు సాక్షి, హైదరాబాద్: అన్న క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభించి రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు రెండు చపాతీలు ప్రజలకు అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూట్లా అన్న క్యాంటీన్లలో ఆహారం లభ్యమవుతుందని చెప్పారు. శనివారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అనంతరం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్న క్యాంటీన్లను నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఉదయం పూట ఒక ఇడ్లీ(65 గ్రాములు), సాం బార్ కలిపి ఒక రూపాయికి ఇస్తామన్నారు. మధ్యాహ్నం భోజనంలో సాంబార్ అన్నం (350 గ్రాములు) లేదా పులిహోర లేదా పెరుగన్నం రూ.5కే ఇస్తామన్నారు.రాత్రిపూట కూరతో కలిపి రెండు చపాతీలను రూ.5కే ఇస్తామన్నారు. రాగి సంకటి సరఫరా చేయూలని అనంతపురం జిల్లా ప్రజలు కోరినందున దీన్ని కూడా మెనూలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తొలి విడతలో విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో 5 క్యాంటీన్లు నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరిస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపా రు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు. పౌర సేవలకు కొత్త సాఫ్ట్వేర్ మున్సిపాలిటీలలో జనన ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకూ ఇంట్లో కూర్చునే దరఖాస్తు చేసుకునేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల లేదా రెణ్నెల్లలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల నుంచి 540 ఫిర్యాదులు అందగా 48 గంటల్లో 390 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పురపాలకశాఖ పరిధిలోని సమస్యలపై ఫొటో తీసి ఛిఛీఝ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపితే స్పందిస్తామన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు. అనధికారిక నీటి కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించటం తదితర చర్యల ద్వారా ఆదాయూన్ని సమకూర్చుకుంటామని తెలిపారు. -
ఇడ్లీ ప్రాణం తీసింది
పాలక్కడ్: కేరళ రాష్ట్రంలో జరిగిన ఓనమ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓనమ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన నిర్వహించిన ఇడ్లీ పోటీలలో పాల్గొన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. పోటీల్లో పాల్గొన్న కందముతన్ అనే వ్యక్తి గొంతులో ఇడ్లీ ఇరికి ప్రాణం వదిలారు. ఓనం సందర్భంగా స్థానిక క్లబ్ నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో కుదముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరికిందని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారని.. అయితే అప్పటికే కుదముతన్ మరణించారని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. -
భోజన సేవ
ఇడ్లీ తినాలంటే ఇరవై... కాసిన్ని టీ నీళ్లు తాగాలంటే పది. అంతోఇంతో డబ్బున్నవారి మాట సరే... మరి అడ్డా కూలీలు... రిక్షావాలాల వంటి పేదల పరిస్థితి..! రోజంతా కాయుకష్టం చేసినా... నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. కడుపు నింపని పని. వారి ఆకలి బాధను అర్థం చేసుకుందో కుటుంబం. తరాలుగా పది రూపాయులకే భోజనం పెడుతోంది. బయుట ధరలు వుండుతున్నా... మసాల నషాలానికి అంటుతున్నా... వీరి మెనూలో ‘షార్టేజ్’ కనిపించదు. రేటులో వూర్పూ ఉండదు. ‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాం. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నిరుపేదలకు కడుపు నిండాలి. మేం చల్లగా ఉండాలి’... ఇదీ గిన్నె బాలకృష్ణ మాట. ఆయున ఉండేది మేడ్చెల్ మండలం కోనాపల్లి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈయన ఇప్పుడు పది రూపాయులకే భోజనం పెడుతున్నారు. ఆయున తాత దాదాపు 70 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చారు. ఆయున మోండా మార్కెట్ సమీపంలో ఎడ్ల బండిపై హోటల్ పెట్టి భోజనం అమ్మేవారు. అప్పట్లో దీని రేటు 25 పైసలు. ఆ తర్వాత బాలకృష్ణ తండ్రి, చిన్నాన్న పెదనాన్నలు కూడా దీన్ని వృత్తిగా మలుచుకున్నారు. వారిని అనుసరిస్తూ... 30 ఏళ్ల కిందట బాలకృష్ణా, ఆయున సోదరులు శ్రీను, చిట్టిబాబు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పుట్‌పాత్ పై తాత్కాలిక హోటళ్లు ఏర్పాటు చేసుకుని రూ. 10లకే భోజనాన్ని అందిస్తున్నారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తుండడంతో క్రమంగా రూ. 3 నుంచి ఇటీవలే రూ. 10కి పెంచారు. దినసరి కూలీలు, కార్మికులే వీరి కస్టమర్లు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కూలీలకు అందుబాటులో ఉంటున్నారు. పప్పు, చారు, చెట్నీ.. కిలో బియ్యం రూ.40 పైవూటే. కూరల ధరలు ఆకాశంలో ఉన్నారుు. పప్పుల వూట వింటేనే వుంట. ఇలాంటి పరిస్థితుల్లో రూ.10కే భోజనం పెట్టడం సావూన్యమైన విషయుం కాదు. ఏదో మొక్కుబడిగా కాకుండా... పప్పు, చారు, చెట్నీ మెనూలో ఉంటారుు. కూరలు కూడా పెట్టిందే పెట్టకుండా రోజుకొక వెరైటీ వడ్డిస్తారు. గ్యాస్‌పై కాకుండా... పూర్తిగా కట్టెల పొరుు్యమీదే వంట. వీళ్లు వాడే బియ్యుం ఖరీదు కిలో రూ.35. అయినా చికెన్ రైస్ కూడా రూ.20కే అందిస్తున్నారు. బోటి రైస్ రూ. 25. వీరి చలవతో తక్కువ ధరలో రుచికరమైన భోజనంతో కడుపు నింపుకుంటున్నారు దినసరి కూలీలు. - మహి అదే పదివేలు.. గరీబోళ్ల పొట్ట నిండి... వారు ఆనందంగా ఉంటే అదే పదివేలు. వాళ్లిచ్చే రూ.10లో మాకు కొంత మిగిలినా చాలు. మాకు పుణ్యం కూడా దక్కుతుంది. దీని మీద వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే నా ముగ్గురు ఆడపిల్లల్ని, ఒక బాబుని చదివిస్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి. నేను ఒక్కడినే కాదు.. మా అన్నదమ్ములు కూడా ప్యారడైజ్, మహబూబ్ కాలేజ్, జైల్కానా దగ్గర హోటళ్లు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ల వద్ద కూడా రూ.10కే భోజనం దొరుకుతుంది. - బాలకృష్ణ -
నగరంలో కన్నడిగులు...
మినీ భారత్: ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర వ్యాపారాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కన్నడిగుల ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగులను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా తప్పనిసరి మర్యాద... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ పిల్లి రాంచందర్ -
వాయనం: కలర్‌ఫుల్ బ్యాగ్స్ తయారు చేద్దామా!
పాలిథీన్ బ్యాగ్స్‌ని వాడకూడదని పర్యావరణవేత్తలు చెప్పడంతో వాటి వాడకం తగ్గిపోయింది. వాటి స్థానంలో పేపర్బ్యాగ్స్ వాడుతున్నారు. అయితే వాటి ఖరీదు పాలిథీన్ బ్యాగ్స కంటే కొంచెం ఎక్కువ. అదే కాస్త ఇబ్బంది. కానీ దీనికో మంచి పరిష్కార మేమిటంటే బ్యాగ్సని మనమే చేసుకోవడం! నిజానికి పేపర్ బ్యాగ్ తయారు చేయడం చాలా తేలిక. పేపర్, గమ్, చిన్న తాడు, కత్తెర ఉంటే చాలు. ముందుగా పేపర్‌ను ముడతలు లేకుండా నేలమీద పరవాలి. బ్యాగ్ ఎంత పొడవు, వెడల్పు ఉండాలో... అంత పొడవు, వెడల్పు ఉన్న రెండు మూడు పుస్తకాలను దొంతరలాగా పేపర్ మీద పెట్టాలి. తర్వాత పేపర్ని అన్ని వైపులా మడవాలి (ఫొటో 1,2,3). ఒక పక్క వదిలేసి మిగతా అన్ని పక్కలా కాగితాన్ని గమ్‌తో అంటించాలి. అంటించని వైపున మడతను విప్పి పుస్తకాలు బయటకు తీసేయాలి (ఫొటో 4లో చూపినట్టు అవుతుంది). ఆపైన మడత విప్పిన వైపున కాగితాన్ని సమానంగా పట్టుకుని కత్తిరించాలి (ఫొటో 5). చివరిగా బ్యాగుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి తాడు లేక వైరును అమర్చుకోవాలి (ఫొటో 6). అంతే... బ్యాగ్ రెడీ అయిపోయినట్టే! స్టేషనరీ షాపుల్లో రకరకాల కాగితాలు, డిజైన్లతో దొరుకుతాయి. తెచ్చుకుని ఒకేసారి నాలుగైదు బ్యాగ్స్ చేసి పెట్టేసుకుంటే... అస్తమానం బ్యాగ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. కాస్త మందంగా ఉన్నవి ఎంచుకుంటే ఎక్కువ బరువును తట్టుకుంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. బ్యాచిలర్స్ కోసం భలే మెషీన్! ఇడ్లీని మించిన టిఫిన్ మరొకటి లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇడ్లీని కాస్త ఎక్కువగానే తింటుంటాం మనం. అయితే బ్యాచిలర్స్కి వీటిని రోజూ తినే అదృష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంత కష్టపడి ఇడ్లీలు చేసుకోలేరు. పప్పు నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి, ఇడ్లీ గిన్నెల్లో వేయాలి, నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఆన్ చేయాలి, కూత పెట్టేవరకూ చూసి ఆపాలి... అబ్బబ్బబ్బ, బోలెడు పని అంటారు వాళ్లు. అయితే వాళ్లకు తెలియనిది ఒకటుంది. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడున్న ఈ బుజ్జి మిషన్... ఇడ్లీలను చాల ఈజీగా వండేస్తుంది. ఇందులో ఉన్న గిన్నెల్లో పిండిని పోసి, మూతపెట్టి, స్విచ్ ఆన్ చేయడమే. క్షణాల్లో ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కాచుకుని కూచోవాల్సిన పని లేదు. ఇడ్లీలు తయారయ్యాక కుక్కర్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. కాబట్టి ఆన్‌చేసి, బయటకు కూడా వెళ్లి రావచ్చు. మరి పిండి సంగతేంటి అంటారా? ఆల్రెడీ మార్కెట్లో రెడీమేడ్ పిండి దొరకుతోంది. పచ్చళ్లూ దొరుకుతున్నాయి. కాబట్టి నో టెన్షన్. దీని ధర రూ. 1,100. ఆన్లైన్లో కొంటే రూ.900. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్కి గుడ్లు కూడా మంచి ఫుడ్డే కదా! అలాగని వాళ్లే కొనాలని లేదు. కరెంటుతో పని చేస్తుంది కాబట్టి గ్యాస్ అయిపోయినప్పుడు వాడుకోవడానికి అందరిళ్లలో ఉండటం మంచిదే! -
ఇడ్లీకరించుకుందాం రండి...
తెలుగువారిదీ... ఇడ్లీదీ... కలివిడి గుణం... అల్లప్పచ్చడితో, ఆవకాయతో, సాంబార్‌తో, కారప్పొడితో, చట్నీతో, దేనితోనైనా ఇట్టే కలిసిపోతుంది.... జాతీయ సమైక్యతకు చిహ్నం ఇడ్లీ... మన సంస్కృతుల్లాగే ఇడ్లీకీ అనేక రూపాలు. రవ్వ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, సాంబారిడ్లీ! అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే... ఇడ్లీది అపర ధన్వంతరి రూపం. అందుకే ఇడ్లీ... నిత్యభోజనం.. పథ్యభోజనం రండి... రకరకాల ఇడ్లీలను నోటిలో ఉంచుకుందాం. పలురకాలైన వాటిని పంటి కింద నంజుకుందాం. కారంపొడి ఇడ్లీలు కావలసినవి: ఇడ్లీలు - 10, మినప్పప్పు - కప్పు, శనగపప్పు - ముప్పావు కప్పు, ఎండుమిర్చి - 6, ఇంగువ - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా తయారి: బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇడ్లీ వెజిటబుల్ సాండ్విచ్ కావలసినవి: ఇడ్లీపిండి - 3 కప్పులు; బంగాళదుంప కూర - కప్పు; వంటసోడా - చిటికెడు కూరకు కావలసినవి: బంగాళదుంపలు - 3, ఉడికించిన బఠాణీ - అర కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, శనగపప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మాష్ చేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి వేయించాలి ఉడికించిన బఠాణీలు జత చేయాలి పసుపు, ఉప్పు, బంగాళదుంప పేస్ట్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి కొత్తిమీర జత చేసి కలిపి దించి చల్లారనివ్వాలి ఇడ్లీ రేకులకు నూనె రాసి, టేబుల్ స్పూను ఇడ్లీ పిండి వేసి, దాని మీద తయారుచేసి ఉంచుకున్న కూర, ఆ పైన రెండు టేబుల్స్పూన్ల ఇడ్లీ పిండి వేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ వచ్చాక దించేయాలి ఇడ్లీలను తీసి, మధ్యకు కట్ చేసి, చట్నీతో సర్వ్ చేయాలి. ఉల్లి మసాలా ఇడ్లీ కావలసినవి: ఇడ్లీ పిండి - 3 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, నానబెట్టిన శనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, క్యారట్ తురుము - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను ఇడ్లీ పిండికి.... ఉప్పుడు బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - కప్పు, అటుకులు - కప్పు; మెంతులు - టీ స్పూను, ఉప్పు - తగినంత తయారి: ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టాలి ఇడ్లీలు తయారుచేయడానికి రెండు గంటల ముందు అటుకులు, మెంతులను విడిగా నానబెట్టాలి మినప్పప్పును గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి బియ్యం, అటుకులు, మెంతులను విడిగా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఒక గిన్నెలో రెండురకాల పిండులను వేసి సుమారు 9 గంటలు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, దించి చల్లారనివ్వాలి నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇడ్లీపిండిలో వేయాలి క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి. ఓట్స్ ఇడ్లీ కావలసినవి: ఓట్లు - కప్పు; గోధుమరవ్వ - అర కప్పు; పెరుగు - అర కప్పు; క్యారట్ తురుము - 3 టేబుల్ స్పూన్లు; క్యాబేజీ తురుము - 2 టేబుల్ స్పూన్లు; బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత; నీరు - కప్పు, అల్లం తురుము - టీ స్పూను; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; నిమ్మరసం - అర టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - కొద్దిగా తయారి: బాణలిలో నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి క్యారట్ తురుము, క్యాబేజీ తురుము, బఠాణీలు వేసి మరో మారు వేయించాలి గోధుమరవ్వ, ఓట్స్ వేసి రెండు నిముషాలు వేయించాలి ఉప్పు జత చేసి కలిపి దించేయాలి చల్లారాక పెరుగు, నీళ్లు వేసి ఇడ్లీపిండి మాదిరిగా కలపాలి కరివేపాకు, నిమ్మరసం జత చేయాలి ఇడ్లీ రేకులకు నూనె రాసి, పిండిని ఇడ్లీలుగా వేసి, కుకర్‌లో ఉంచి పావుగంట తరువాత దించేయాలి. మసాలా మినీ ఇడ్లీ ఫ్రై కావలసినవి: బటన్ ఇడ్లీలు - 18; ఉల్లితరుగు - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు, బఠాణీ - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారి: బాణలిలో నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించాలి బఠాణీ, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు జత చేయాలి బటన్ ఇడ్లీలను జత చేసి, జాగ్రత్తగా కలిపి సర్వ్ చేయాలి. మసాలా ఇడ్లీ ఫ్రై కావలసినవి: ఇడ్లీలు - 6; ఇడ్లీకారం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను; ఆలివ్ ఆయిల్ - టేబుల్ స్పూను, నూనె - అర టీ స్పూను, ఉప్పు - తగినంత; పోపు కోసం: నువ్వుపప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను; శనగపప్పు - అర టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2; కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు; కొత్తిమీర - కొద్దిగా తయారి: ఇడ్లీలను పొడవుగా కట్ చేసి, బాణలిలో నూనె కాగాక అందులో వేసి దోరగా వేయించాలి నూనె రాసిన అల్యూమినియం ఫాయిల్ మీద ఈ ముక్కలను ఉంచి, ఆలివ్ ఆయిల్ చిలకరించాలి 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్చేసిన అవెన్‌లో ఈ ఫాయిల్స్‌ను సుమారు పావుగంటసేపు ఉంచి తీసేయాలి బాణలిలో అర టీ స్పూను నూనె కాగాక, ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు వేసి వేయించాలి వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ జత చేయాలి ఉల్లితరుగు, కరివేపాకు, నిమ్మరసం, ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.