
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం ఇడ్లీ. సాధారణంగా మినప్పప్పు, ఇడ్లీ రవ్యతో చేసే క్లాసిక్ ఇడ్లీ చాలా పాపులర్. అలాగే దీనికి పల్లీ, అల్లం చట్నీ, కారప్పొడి,నెయ్యి మంచి కాంబినేషనల్.అంతేకాదు ఇడ్లీని సాంబారులో ముంచుకొని తింటే ఆ టేస్టే వేరు. దీంతోపాటు సెనగపిండితో చేసే బొంబాయి చట్నీ కూడా చాలా ఫ్యామస్. ఇలా రకాలు ఈసూపర్ టిఫిన్‌ను మనోళ్లు ఆస్వాదిస్తారు. ఇడ్లీలో చాలారకాలుగా రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీతో సహా అనేక రకాల ఇడ్లీలు కూడా ఉన్నాయి. అయితే అరటి ఆకు ఇడ్లీని ఎపుడైనా చూశారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.
అరటి ఆకుల్లో ఇడ్లీ పిండి వేసి గట్టిగా చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ తరహా ఇడ్లీలను కన్నడ/తుళులో 'మూడ్' అని పిలుస్తారు. అరటి ఆకులు ఇడ్లీలకు ప్రత్యేకమైన రుచి ,సువాసనను జోడిస్తాయి. అయితే జ్యోతి కల్బుర్గి అనే ఇన్‌స్టా యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. అరటి ఆకును కట్ చేసి, టూత్ పిక్‌ల సాయంతో చక్కగా చతురస్రాకారంగా కటోరీలు (గిన్నెలు)తయారు చేసింది. ఆ తర్వాత గిన్నెల్లో ఒక లేయర్ ఇడ్లీ పిండి, మరో లేయర్ తురిమిన కొబ్బరి , దానిపై మరొక పొర పిండిని నింపింది. దీన్ని ఆవిరిమీద ఉడికించింది.
చదవండి: పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?
పల్లీలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా చట్నీ చేసింది. వేడి వేడిగా ఉన్న ఇడ్లీలపై (అరటి ఆకు గిన్నెల్లోనే) తురిమిన కొబ్బరితో గార్నిష్ చేసి, చట్నీతో కమ్మగా ఆరగించింది. దీనికి అరటి ఆకు ఇడ్లీ అని పేరు పెట్టింది. దీంతో ఇది నెట్టింట తెగ వైరల్‌గా మారింది.ఫుడ్ లవర్స్, నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపించారు. 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. చాలా బావుంది అంటూ ఫుడ్ లవర్స్ దీన్ని ప్రశంసలతో ముంచెత్తారు. చాలా మంది “చాలా బాగుంది” అని, దయచేసి చట్నీ రెసిపీని పంపండి అని మరొకరు వ్యాఖ్యానించారు. పైన కొద్దిగా దేశీ నెయ్యి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అని మరొక యూజర్ సూచించారు. ముఖ్యంగా నూనెలో వేయించకుండా పల్లీ చట్నీ చేయడం ఎక్కువ ఆకర్షించింది. ఆ వైరేటీ ఏంటో మీరు కూడా చూసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment