మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరూ చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయలును చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశ్యం సబబే అనిపిస్తంది. మరోకోణంలో చూస్తే భారతీయలంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే..ఇక్కడొక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే..షాకవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటిపండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటిపండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్లు చెదిరే రేంజ్‌లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండే ధరే రూ. 100 పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.
అయితే ఆ విదేశీయుడు హ్యూ. సరిగ్గా విన్నానా..? లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరుని చూసి కంగుతింటాడు ఆ విదేశీయుడు. సారీ తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే గాక ఇలా అమ్మితే కచ్చితంగా మీరు నష్టపోతారని అంటాడు.
ఆ తర్వాత తన బ్రిటన్ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలస్తూ..భారత్‌లోని ఒక అరటిపండు ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చని అంటాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్ టాక్స్, చెల్లించి భారత్ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చెయ్యొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..)
Comments
Please login to add a commentAdd a comment