ఇటీవల అరటి పండుతో బజ్జీల గురించి విన్నాం. తాజగా అరటి కాండం లేదా అరటి డొప్ప చేసిన చాట్ రెసిపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ అరటి కాండం లేదా అరటి డొప్పలను కార్తీక మాసం పూజల్లో ఉపయోగిస్తుంటారు. అయ్యప్ప భక్తులు కూడా పూజల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అరటి డొప్పతో స్నాక్స్ వంటకమా..? అని ఆశ్యర్యంగా అనిపిస్తోంది కదా..!
ఎలా చేశారంటే..అరటి కాండం లేదా డొప్ప భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మసాలా వేసి, చిటికెడు ఉప్పుని జోడిస్తారు. దీన్ని స్పూసీ గ్రీన్ చట్నీ, పుల్లని సాస్, స్పైసీ ఆలు భుజియాతో అలంకరిస్తాడు. చివరిగా నిమకాయ రసంతో సర్వ్ చేస్తాడు. అంతే అరటి కాండం చాట్ రెడీ.
దీన్ని అరటి ఆకులోనే అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ చాట్‌ని బెంగళూరులో ఎక్కువగా వినియోగిస్తారట. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తాము అరటి కాండంలను పచ్చిగా తింటామని, ఇవి కిడ్నీలో రాళ్లు, ప్రేగు సమస్యలను నివారిస్తుందని చెప్పగా, మరొకరు ఇది చాలా టేస్టీగా ఉంటుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చెయ్యండి.
(చదవండి: సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు దిగ్గజ క్రికెటర్లు ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment