చెన్నె: ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్ అందించారు. త్వరలోనే ఆమెను ఓ ఇంటి దాన్ని చేయనున్నాడు. ఈ మేరకు ఆ విషయాన్ని ఆనంద్ మహేంద్ర ట్విటర్‌లో చెప్పారు. త్వరలోనే కమలాథల్‌కు ఓ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని ఆనంద్ మహేంద్ర తెలిపారు. రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్ గురించి రెండేళ్ల కిందట సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. వాటిని చూసి ఆనంద్ మహేంద్ర.. కమలాథల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని ప్రకటించాడు. ఆ మేరకు ఆయన ప్రారంభించారు. కట్టెల పొయ్యితో వండుతుండడాన్ని చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ ఇస్తానని ఆనంద్ మహేంద్ర హామీ ఇచ్చారు. అయితే భారత్ గ్యాస్ వారు ఆమెకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించారు.
ఆమెకు ఇల్లు కానీ, హోటల్ కానీ నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో కమలాథల్‌కు కోయంబత్తూరులో ఓ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆనంద్ మహేంద్ర చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా శుక్రవారం కమలాథల్ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి రిజిస్రే‍్టషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇదే విషయాన్ని ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. మహేంద్ర లైఫ్ స్పేసెస్ ఆ ఇంటిని నిర్మించనుంది. త్వరలోనే ఇంటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. తొండముత్తూరులో ఆమెకు సంబంధించిన భూమి రిజిస్రే‍్టషన్ చేశారు.
🙏🏽 to the @MahindraRise team for understanding from Kamalathal how we can ‘invest’ in her business. She said her priority was a new home/workspace. Grateful to the Registration Office at Thondamuthur for helping us achieve our 1st milestone by speedily registering the land (2/3) pic.twitter.com/F6qKdHHD4w
— anand mahindra (@anandmahindra) April 2, 2021
Comments
Please login to add a commentAdd a comment