ఆటోపై లగ్జరీ హౌజ్‌.. ఆనంద్‌ మహీంద్ర ఫిదా | Anand Mahindra Want To Offer Chennai Architect Who Built Home On Auto | Sakshi
Sakshi News home page

ఆటోపై లగ్జరీ హౌజ్‌.. ఆనంద్‌ మహీంద్ర ఫిదా

Published Mon, Mar 1 2021 11:05 AM | Last Updated on Mon, Mar 1 2021 1:05 PM

Anand Mahindra Want To Offer Chennai Architect Who Built Home On Auto - Sakshi

న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌ అరుణ్‌ ప్రభు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెన్సేషనల్ అయ్యాడు. ఆటోపై లగ్జరీ హౌజ్‌ను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అరుణ్‌ ప్రభు ఏడాది క్రిత న నిర్మించిన ఈ మొబైల్‌ హౌజ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఆటో మొబైల్‌ హౌజ్‌లో ఒక‌ చిన్న బెడ్ రూమ్‌, కిచెన్‌, లివింగ్ ఏరియా‌, బాత్‌రూమ్‌తో పాటు వర్కింగ్‌ ఎరియాకు కూడా గది ఉంది. అంతేకాదు ఈ ఇంటిపై ప్రభు 250 లీటర్ల వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. ఈ మొబైల్ ఇంటిని నిర్మించ‌డానికి అతడికి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యింద‌ట‌. 

అది చూసి సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకు అరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర సైతం అరుణ్‌ పనితీరుకు ఫిదా అయ్యారు. ఆదివారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘చిన్న చిన్న స్థలాల్లోనూ నివాస సదుపాయాలు ఎలా ఎర్పరుచుకోవచ్చు అనేది అరుణ్‌ ప్రభు చేసి చూపించాడు. అయితే త్వరలో అరుణ్‌ దృష్టి ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పై పడాలనుకుంటున్నాను. బొలెరోపై కూడా ఇలాంటి ఇంటిని నిర్మిచగలడా అని నేను అతడిని అడగాలనుకుంటున్న. ఎవరైనా అతడి వివరాలను నాకు తెలుపగలరా’ అంటూ ట్వీట్‌ చేశారు.

చదవండి: కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా? 
     గే తమ్ముడి దంపతుల బిడ్డకు జన్మనిచ్చిన అక్క
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement