మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్ క్లీన్ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.
That’s one way of starting a New Year.
Baby steps. The first steps towards fulfilling our new resolutions…
🙂 pic.twitter.com/Qs7GGZEx9b— anand mahindra (@anandmahindra) January 1, 2025
ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment