న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్ నోటీసు (ఎస్‌సీఎన్) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్ మేనేజ్‌మెంట్‌పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్ గోయెంకా వివాద సెటిల్మెంట్ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్–టైమ్ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు.
ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్
రిలయన్స్ నేవల్ పేరు మార్పు
న్యూఢిల్లీ: రిలయన్స్(Reliance) నేవల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పేరు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ను స్వాన్ ఎనర్జీ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment