showcase notice
-
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్ నోటీసు (ఎస్సీఎన్) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్ మేనేజ్మెంట్పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్ గోయెంకా వివాద సెటిల్మెంట్ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్–టైమ్ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు. ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్రిలయన్స్ నేవల్ పేరు మార్పున్యూఢిల్లీ: రిలయన్స్(Reliance) నేవల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పేరు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ను స్వాన్ ఎనర్జీ దక్కించుకుంది. -
విజయవాడలో 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన నగరపాలక సంస్థ
-
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్ నోటీసులు
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. -
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
లోక్‌సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు. -
ఆర్టీసీ ఎండీకి హైకోర్టు షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి నిధుల చెల్లింపుపై తాము ఆదేశించినా ఆ మేరకు ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీకి, చీఫ్ మేనేజర్ (ఎఫ్అండ్ఏ)కు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుగాని పక్షంలో ఎక్స్‌పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు, మరో రూ.100 కోట్లను నవంబర్ 25లోగా సీసీఎస్‌కు డిపాజిట్ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలిచి్చనా ఆర్టీసీ యాజమాన్యం పాటించడం లేదని, కావాలనే ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ఉద్యోగులు జూన్‌లో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌ను పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ పి.మాధవీ దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎండీ, చీఫ్ మేనేజర్ హాజరుకావాలంటూ ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్ వేటు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శనివారం సస్పెండ్ చేశారు. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి.పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్ సప్లై టర్న్ కాక్ ఎం.ఈరన్నలను సస్పెండ్ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్డీ కె.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎన్.ఉమాకాంత్‌రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై డీఈవో జి.సురేష్, వాటర్ సప్లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీల నియామకం డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు. -
ఉన్నత విద్యలో 4 కొత్త కోర్సులు
సాక్షి, అమరావతి: ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో నాలుగు కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత విద్య ప్రణాళికామండలి (హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు)తో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర, సెంట్రల్ వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పరస్పర భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి.. పదినెలల ఇంటర్న్‌షిప్‌తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో చేరి మూడేళ్లు మాత్రమే చదువుతానంటే డిగ్రీ లభిస్తుందని చెప్పారు. నూతన విద్యావిధానంలో 70 శాతం చేరికలు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరికలు 90 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆధునికీకరిస్తున్నామన్నారు. నైపుణ్యాల కల్పన పెంపు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశోధనల పెంపు లక్ష్యంతో ఎంఎస్ఎంఈ, నేషనల్ రీసెర్చి డెవలప్మెంటు కార్పొరేషన్ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఒక విభాగం ఏర్పాటుచేసి తొలిసారి అకడమిక్ ఆడిట్ చేపట్టామన్నారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లిన్ ఎడ్యుకేషన్ రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామన్నారు. తొలివిడతలో శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, జేఎన్‌టీయుకే, జేఎన్‌టీయుఏ, ఆర్జీయూకేటీలను, తదుపరి దశలో నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, పద్మావతి వర్సిటీలను రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామని వివరించారు. నాలుగు వర్సిటీలను ప్రతిపాదించగా కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ, కర్నూలులో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటు చేశామని, టీచర్ ట్రయినింగ్ ప్రాధాన్యతతో ప్రకాశం వర్సిటీని తీర్చిదిద్దనున్నామని, అలాగే విజయనగరంలో వర్సిటీ ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలపై చర్యలు విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఉన్నత విద్యలో పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చామని, 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇంటర్లో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. అవినీతికి తావులేకుండా వర్సిటీలలో పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న అమ్మఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ పాల్గొన్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం మండలి డైరీ ఆవిష్కరణ, మీడియా సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు. ఈ పథకాలతో తమ ఉనికి పూర్తిగా కనుమరుగు అయిపోతోందన్న ఆందోళనతో తెలుగుదేశం సహ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి కుట్ర రాజకీయాలకు దిగుతున్నాయని విమర్శించారు. దేవుళ్లని కూడా రాజకీయాల్లోకి లాగుతూ దిగజారిపోతున్నారని మండిపడ్డారు. రామతీర్థం విగ్రహ ధ్వంసంపై ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించిందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దోషులు ఎవరైనా సరే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం అమ్మ ఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ఈనెల 11న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు. రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి రానీయని బాబు ఇప్పుడెలా సీబీఐ విచారణ అడుగుతారని ఆయన ప్రశ్నించారు. -
48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులు రద్దు
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండా కొనసాగుతుండటం, ఎలాంటి ప్రవేశాలు లేకుండానే నిర్వహిస్తుండటం, ప్రవేశాలు చేపట్టినా చేరికలు 25% కన్నా తక్కువగా ఉండటం వంటి కారణాలతో 246 ప్రయివేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీచేసింది. వీటిపై విచారణ కమిటీని నియమించిన మండలి ఆ షోకాజ్ నోటీసులకు నిర్ణీత డాక్యుమెంట్లతో కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై సమాధానాన్ని తెలియజేయగా, మరికొన్ని విచారణకు హాజరుకాలేదు. కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్‌లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించింది. -
సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చట్టంలోని ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించిన సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సదరు టీవీలో ప్రసారమయ్యే ‘బిందాస్ బోల్’అనే కార్యక్రమంలోని కొన్ని అంశాలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తమ ఉత్తర్వులకు లోబడి ఉండాలని కోర్టు పేర్కొంది. తమకు నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుదర్శన్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(రెగ్యులేషన్) చట్టం-1995లో సెక్షన్ 20-సబ్ సెక్షన్ (3) కింద సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై టీవీ యాజమాన్యం 28వ తేదీలోగా స్పందించాలని, లేదంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగంలోకి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారంటూ సుదర్శన్ టీవీ ఇటీవల ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. -
రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు
సాక్షి, తాడేపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీరు గెలుపొందారు. అంతేగాక సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు.. పార్టీ సభ్యుడిగా ఉండటం పట్ల మీ అయిష్టతను తెలియజేస్తున్నాయి. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకుండా.. వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్గానం చేసింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అయితే మీరు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా.. ఈ విషయంలో వైస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారని ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా నవంబరు 19, నవంబరు 20, 2019 తేదీల్లో పత్రికల్లో ప్రచురించాయి. ఈ విషయంపై వివిధ స్థాయిల్లో పార్టీ వివరణ కోరింది. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ మీరు చేసిన నిరాధార వ్యాఖ్యలను ఈనాడు జూన్ 16, 2020న ప్రచురించింది. అదే విధంగా ఆంధ్రజ్యోతి సైతం జూన్ 15, 2020న మీ పేరును ఆపాదిస్తూ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ఎంపీగా మీ విజయానికి వైఎస్సార్సీపీ లేదా వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణం కాదని మీరు అన్నారు. బతిమిలాడితేనే పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘‘ఎవ్వరి నాయకత్వం నాకు కావాలి? బొచ్చులో నాయకత్వం?’’ వంటి పదాలు ఉపయోగించి ప్రాథమిక నిబంధనలు అతిక్రమించారు. ఈ పరిణామాలన్నీ మీరు పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నాయి. అదే విధంగా అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మీరు వివిధ టీవీ షోల్లో విమర్శించారు. అంతేగాక సొంతపార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఓ టీవీ డిబేట్లో మిమ్మల్ని మీరు సింహంగా అభివర్ణించుకోవడమే గాకుండా.. విశ్వసనీయత ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులను పందులతో పోల్చారు. సహచర సభ్యులను తక్కువ చేసి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. కాబట్టి ఈ విషయాలపై స్పందించేందుకు మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్లమెంటరీ పార్టీ.. చట్ట ప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది’’ అని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా జోడించారు. -
ఆర్బీఐకి సీఐసీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు తనిఖీ నివేదికల వెల్లడి వివాదానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు హాజరు కావాలన్న తమ ఆదేశాలను ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) తేలిగ్గా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెడితే.. 2011 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జరిపిన తనిఖీల వివరాలు వెల్లడించాలంటూ గిరీష్ మిత్తల్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఆర్బీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అనుకూలంగా ఆర్బీఐ సీపీఐవో సూచనలు జారీ చేశారు. అయితే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన వ్యాపార వివరాలు వెల్లడి కావడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీపీఐవోకి తెలిపింది. కానీ సీపీఐవో దాన్ని తోసిపుచ్చడంతో సీఐసీని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ సీఐసీ ఆదేశించినప్పటికీ.. ఆర్బీఐ సీపీఐవో గైర్హాజరయ్యారు. -
ప్రభుత్వ వైద్యులపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది. ఏకంగా 134 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. చెప్పాపెట్టకుండా విధులకు హాజరు కాకపోవడం వల్లే ఈ నోటీసులు జారీ చేసినట్లు షోకాజ్ నోటీసుల్లో వైద్య విధాన పరిషత్ కమిషనర్ మాణిక్‌రాజ్ ప్రస్తావించారు. నోటీసులు అందుకున్న వారిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, ఆర్థో, పీడియాట్రిక్, అనెస్థీషియా, ఈఎన్టీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితర విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యులే ఉండటం గమనార్హం. ఎంతో కీలకమైన విభాగాల్లో పనిచేసే వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ కావడంతో వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు అందుకున్న డాక్టర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గతేడాదే భర్తీ ప్రక్రియ... రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లో 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లు ఉన్నాయి. వాటిల్లో వైద్యుల నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గతేడాది వైద్యుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గతేడాది జులైలో ఏకంగా 15 రకాల స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేశారు. వాటిల్లో మొత్తం 919 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించారు. అయితే తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వలేదని అనేక మంది అసంతృప్తితో ఉన్నారు. చేరిన వారిలో 500 మందికి మించి విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. మరోసారి వెబ్ కౌన్సిలింగ్ పెట్టి ఏర్పాట్లు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. స్పెషలిస్టు వైద్యులు చాలామంది గైర్హాజర్ అవుతుండటంతో వైద్య విధాన కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీచేయడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. కొరవడిన పర్యవేక్షణ... తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేసీఆర్ కిట్, కంటి వెలుగు తదితర అనేక రకాల పథకాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు అనేక ఆసుపత్రులను బలోపేతం చేసింది. ఇంత చేస్తున్నా ఆసుపత్రులను సమగ్రంగా నడపడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. ఇటీవల భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురు డాక్టర్లు... డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్‌కు వెళ్లిన ఘటన బయటపడింది. ఖమ్మంలో బాలింతలకు సెక్యూరిటీ సిబ్బంది సెలైన్ పెట్టిన ఘటన సంచలనం రేపింది మిగతా దవాఖాన్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆసుపత్రుల సూపరింటెండెంట్ల నుంచి డాక్టర్లు, అధికారులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పైగా వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజే కొనసాగడం, ఆయనకు రోజువారీ కలెక్టర్ విధులతోపాటు ఆరోగ్యశ్రీ ఇన్చార్జిగా సైతం బాధ్యతలు ఉండటంతో ఏ విభాగాన్నీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోయింది. -
రిక‘వర్రీ’
►ఉపాధి నిధులకు ఎసరు ►సామాజిక తనిఖీల్లో బహిర్గతం ►రాబట్టేందుకు ఆపసోపాలు ►రూ.10కోట్లలో వసూలైంది పదిశాతమే తంబళ్లపల్లెకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్ ఒకరు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారు. సామాజిక తనిఖీలో రూ.12.65లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. ఏడేళ్ల కిందట షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినా ఒక్క పైసా రికవరీ కాలేదు. ఎర్రావారిపాళెం మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ రూ.7.44లక్షల మేర దుర్వినియోగం చేశారు. సామాజిక తనిఖీ అధికారులు రూ.20 వేలు కడితే చాలని తేల్చారు. మిగతా రూ.4.39 లక్షల స్వాహాపై చర్యలు తీసుకోవడంలో నీటియాజమాన్య సంస్థ అధికారులు నీళ్లు నములుతున్నారు.ఎర్రావారిపాళెం మండలంలో క్షేత్ర స్థాయి సిబ్బంది ఒకరు రూ.1.39లక్షలు అక్రమాలకు పాల్పడితే పూర్తి స్థాయిలో రికవరీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక తనిఖీలో మాత్రం కేవలం రూ.22వేలు దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు. ఆ ఉద్యోగి నుంచి రూ.102 రికవరీ చేశారు. చిత్తూరు, సాక్షి : జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో నిధులు దుర్వినియోగమవుతున్నాయి.2006లో ఈ పథకం ప్రారంభమైంది. అప్పట్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి. కొందరు పనులు ప్రాంభించకుండానే బిల్లులు చేసుకుని సొమ్ము కాజేశారు. దీన్ని సామాజిక తనిఖీ బృం దాలు గుర్తించాయి. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు ఎవరెవరు ఎంత దుర్వినియోగం చేశారనే విషయాలు డ్వామా అధికారులకు అప్పట్లోనే తెలిపారు. రికవరీ చేయాలని నిర్ణయించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ వసూలు చేయలేదు. జిల్లాలోని 66 మండలాల్లోనూ నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.10.22 కోట్ల దుర్వినియోగమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. రూ.1.58కోట్లు మాత్రమే రికవరీ చేశారు. పది లక్షల రూపాయలకు పైగా సొమ్ము దుర్వినియోగమైన మండలాలు దాదాపు పది ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉద్యోగి నుంచి కూడా పూర్తి స్థాయిలో రికవరీ కాకపోవడం గమనార్హం. తంబళ్లపల్లె, ఎర్రావారిపాళెంలోనే సుమారు రూ. 20 లక్షల వరకు దుర్వినియోగమయ్యాయి. కానీ ఈ మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటుంది. కాంట్రాక్టు సిబ్బందిని రెన్యువల్ చేసే క్రమంలో వారు చెల్లించాల్సిన సొమ్ము చెల్లిస్తేనే ఉద్యోగ కాంట్రాక్టు పునరుద్ధరిస్తున్నారు. అప్పట్లో ఉపాధి హామీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ కింద పని చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. -
అఖిలేష్ భవితవ్యం ఏమిటి?
-
అఖిలేష్ భవితవ్యం ఏమిటి?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నుంచి అనూహ్యంగా బహిష్కరణకు గురైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవితవ్యం ఏమిటి? ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అలాగే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. జనవరి 1న అఖిలేష్ తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశంకానున్నారు. అదే రోజు కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. శుక్రవారం ఎస్పీ నుంచి అఖిలేష్‌ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ప్రకటించారు. కొత్త సీఎం ఎవరన్నది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. దీంతో ఎస్పీలో చీలిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. తండ్రి ములాయం, బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ యాదవ్‌లతో విభేదిస్తున్న అఖిలేష్ వేరు కుంపటి పెడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిలేష్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ( చదవండి : అఖిలేశ్ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు) ములాయం ప్రకటన వెలువడగానే అఖిలేష్ ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. లక్నోలో అఖిలేష్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ములాయం, శివపాల్ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం దారుణమని మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్ సూచించిన వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం తన సోదరుడు శివపాల్‌తో కలసి అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. అఖిలేష్ పోటీగా రెబెల్స్ జాబితాను ప్రకటించారు. దీంతో అఖిలేష్‌తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. (చదవండి : 1న అఖిలేశ్ వర్గం భారీ సభ..) -
ఎస్పీలో ముదిరిన ముసలం
అఖిలేశ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరించిన ములాయం - సోదరుడు రాంగోపాల్ పైనా వేటు.. పార్టీని నాశనం చేశారని ధ్వజం - కొత్త సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడి - బహిష్కరించినా నేనే ప్రధాన కార్యదర్శిని: రాంగోపాల్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం శుక్రవారం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడంతో... ఏకంగా కొడుకు అఖిలేశ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ఎస్పీ అధినేత ములాయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను ధిక్కరించి ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ సొంతంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్న ములాయం.. గీత దాటితే ఎవరినీ ఉపేక్షించబోమంటూ గట్టి సంకేతాలు ఇచ్చారు. కొడుకుతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సోదరుడు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్‌నూ ఆరేళ్ల పాటు బహిష్కరించారు. త్వరలో కొత్త సీఎం అభ్యర్థిని పార్టీ ఎన్నుకుంటుందని తెలిపారు. తాజా పరిణామాలతో పార్టీలో చీలిక ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించాక... అఖిలేశ్ మరో జాబితా ఎలా విడుదల చేస్తారు? అఖిలేశ్, రాంగోపాల్‌లు పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు. అలా జరగనివ్వను. పార్టీని నేను ఎంతో కష్టపడి నిర్మించా’ అని విలేకరుల సమావేశంలో ములాయం పేర్కొన్నారు. అఖిలేష్‌ను అట్టహాసంగా సీఎంను చేశానని, ఇప్పుడు పార్టీని నాశనం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్ క్షమాపణలు చెపితే సస్పెన్షన్ ఎత్తివేస్తారా? అని ప్రశ్నించగా బదులివ్వలేదు. ( చదవండి : కొత్త సీఎంను నేనే ప్రకటిస్తా: ములాయం) అభ్యర్థుల జాబితాపై ఫలించని రాజీ చర్చలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ములాయం రెండు రోజుల క్రితం విడుదల చేయగా, అఖిలేశ్ గురువారం రాత్రి 235 మందితో సొంత జాబితా విడుదల చేశారు. ఈ వ్యవహారంలో తండ్రీ కొడుకుల మధ్య గురువారం రాత్రి నుంచి రాజీ ప్రయత్నాలు సాగినా అఖిలేశ్ వర్గం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం ఉదయం నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. పెద్ద ఎత్తున అఖిలేశ్ మద్దతుదారులు ఆయనింటికెళ్లి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీని ధిక్కరించి అభ్యర్థుల జాబితా ప్రకటించినందుకు అఖిలేశ్, రాంగోపాల్‌లకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరింత ఆజ్యం పోసిన రాంగోపాల్ వివాదానికి ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ మరింత ఆజ్యం పోశారు. శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర విలేకరుల భేటీ నిర్వహించి... జనవరి 1న పార్టీ జాతీయ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అఖిలేశ్ ప్రకటించిన జాబితాలోని అభ్యర్థులే ఎన్నికల్లో పోటీచేస్తారని, రెండుమూడు రోజుల్లో తుది జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీలో కొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని, అఖిలేశ్ నేతృత్వంలోనే పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పారు. రాంగోపాల్ వ్యాఖ్యలతో రగిలిపోయిన ములాయం... మరో సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడి నిర్మించిన పార్టీని కాపాడుకునేందుకు అఖిలేశ్, రాంగోపాల్‌పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ‘మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీనే ముఖ్యం. అందుకే అఖిలేశ్, రాంగోపాల్‌ను బహిష్కరిస్తున్నా’ అని చెప్పారు. (చదవండి: అఖిలేష్ భవితవ్యం ఏమిటి?) రాంగోపాల్ ప్రకటన వల్లే వేటు: ములాయం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రాంగోపాల్ పార్టీ అత్యవసర సమావేశం ప్రకటన చేయడం, దాన్ని అఖిలేశ్ సమర్థించడం వల్లే బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అత్యవసర భేటీ కోసం పిలుపునిచ్చే అధికారం కేవలం పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఉందని, రాంగోపాల్ వెర్రి పనులతో పార్టీ నడవదన్నారు. అఖిలేశ్ భవిష్యత్తును రాంగోపాల్ నాశనం చేశారని, అది అతను అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘మేం కష్టపడ్డాం. వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు. ఎమర్జెన్సీలో జైలుకెళ్లా.. రాంగోపాల్ వెళ్లాడా?’ అని ములాయం ప్రశ్నించారు. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెప్టెంబర్‌లోనూ రాంగోపాల్‌ను సస్పెండ్ చేశామని, క్షమాపణలు చెప్పడంతో తిరిగి చేర్చుకున్నామని చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకోను: రాంగోపాల్ బహిష్కరణ అప్రజాస్వామికమని, తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతానని రాంగోపాల్ అన్నారు. ‘అగ్రనాయకత్వమే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే... పార్టీ భేటీకి ఎవరు పిలుపునిస్తారు? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పని చేశాన’న్నారు. ములాయం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను తప్పుపడుతూ... జాబితా ఎంపిక కోసం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. అఖిలేశ్ ప్రకటించిన అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారనిన్నారు. షోకాజ్ నోటీసు జారీ చేసిన రెండు గంటల్లోపే తనను బహిష్కరించారని, వివరణ వినకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ‘కోర్టులోనూ ఇతరుల అభిప్రాయాల్ని వినేందుకు అవకాశమిస్తారు. సుప్రీంకోర్టు కంటే గొప్పగా భావించే ములాయం చీఫ్‌గా ఉన్న పార్టీలో అలా జరగలేదు’ అని అన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే అభ్యర్థుల జాబితాను అఖిలేశ్ విడుదల చేశారని చెప్పారు. కాగా, గవర్నర్ రాం నాయక్ స్పందిస్తూ... పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇది ఎస్పీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. ఒకవేళ సీఎం అఖిలేశ్‌ను మార్చాలని పార్టీ నిర్ణయిస్తే గవర్నర్ పాత్రే కీలకమవుతుంది. నివురుగప్పిన నిప్పులా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన తాజా సంక్షోభం యూపీ రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అంతేకాకుండా, దేశ రాజకీయాల పైనా ప్రభావం చూపనుంది. అయితే, ఈ సంక్షోభం హఠాత్తుగా తలెత్తింది కాదు. నివురు గప్పిన నిప్పులా రగులుతూ.. ఎన్నికల ముంగిట ఒక్కసారిగా బద్ధలైంది. ఇందుకు ములాయం, అఖిలేశ్‌లు వేర్వేరుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా కారణమైంది. ములాయం కోటలో పుట్టిన ఈ ముసలం పుట్టుపుర్వోత్తరాలివీ..! 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలిస్తే ములాయమే సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ, అఖిలేశ్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అప్పుడు తన కొడుకును సీఎంగా అంగీకరించాలని తమ్ముడు శివపాల్, ఆజం ఖాన్ వంటి సీనియర్లకు ములాయం నచ్చజెప్పాల్సి వచ్చింది. ఆరంభంలో కీలుబొమ్మ సీఎంగానే అఖిలేశ్ కనిపించారు. అందుకే, యూపీకి మూడున్నర ముఖ్యమంత్రులనే మాట(ములాయం, శివపాల్, ఆజంఖాన్–ముగ్గురయితే, అఖిలేశ్ అర సీఎం అనే అర్ధం) ప్రచారంలోకి వచ్చింది. నెమ్మదిగా బలపడిన అఖిలేశ్ మొదటి రెండేళ్లలో ప్రతి విషయంలో ములాయం జోక్యం ఎక్కువగా ఉండేది. బహిరంగంగానే కొడుకును మందలించడం, హెచ్చరించడం రివాజుగా మారింది. ఈ పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటిపడిన యువ సీఎం మంచి పేరు తెచ్చుకోవడం మొదలైంది. ఎన్నికల వాగ్దానాలు చాలా వరకు అమలు చేయడమేగాక, లక్నో మెట్రో, ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి మెగా ప్రాజెక్టులు ఆయనకు జనాదరణ పెంచాయి. అవినీతి మరక అంటని సీఎంగా కూడా కనిపించారు. ( చదవండి : చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?) తమ్ముడు, రెండో భార్య, అనారోగ్యం ఆరేడేళ్లుగా ములాయం(77)కు ప్రొస్ట్రేట్ గ్రంథి వాపు సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నాయి. రెండో భార్య సాధనా గుప్తా, రెండో కొడుకు ప్రతీక్ యాదవ్(సాధన కొడుకు) భార్య అపర్ణా యాదవ్.. అఖిలేశ్‌ల మధ్య ములాయం వారసత్వం విషయంలో విభేదాలున్నాయి. శివపాల్ మొదట్నించీ వదిన సాధనాగుప్తాకు దగ్గరే. అలాగే, సాధనను భార్యగా ప్రకటించేలా ములాయంతో ప్రకటన చేయించడంలో కీలకపాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కూడా సాధనకు సన్నిహితుడే. కొన్నాళ్లు ఎస్పీ వెలుపల ఉన్న అమర్‌సింగ్‌ను మళ్లీ చేర్చుకుని రాజ్యసభ సీటివ్వడం కూడా అఖిలేశ్‌కు ఇష్టం లేదు. అఖిలేశ్, ఆయన చిన్నాన్న రాంగోపాల్ యాదవ్ ఒక వర్గంగా, తమ్ముడు శివపాల్ మరో వర్గంగా ఎస్పీ చీలిపోయింది. అనేక కారణాల వల్ల శివపాల్, భార్య సాధనవైపే ములాయం నిలిచారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్ తన వర్గం వారికి టికెట్లు ఇవ్వరేమోననే అనుమానంతో ములాయం ఆయనను ఆ పదవి నుంచి తప్పించి శివపాల్‌ను నియమించడంతో సంక్షోభం ఈ అక్టోబర్ ఆఖరుకు బాగా ముదిరిపోయింది. తాత్కాలికంగా రాజీ కుదిరినా పార్టీ లక్నో సమావేశంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ‘క్లీన్ ఇమేజ్’, కాంగ్రెస్‌తో పొత్తుతో అఖిలేశ్ ముందడుగు కాంగ్రెస్‌తో పొత్తు, తన ‘క్లీన్ ఇమేజ్’ల సాయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు అఖిలేశ్. అయితే, 1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్న ములాయం మరోసారి కాంగ్రెస్ వ్యతిరేకతను ముందుకుతెచ్చి ఈ పార్టీతో పొత్తుకు నిరాకరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఉన్న రహస్య అవగాహన కూడా ములాయం వైఖరికి కారణమని కొందరు అనుమానిస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ములాయం కుటుంబంలో ఏం జరిగింది?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ వివాదాలను మొదట్లో రాజకీయ డ్రామాగా ప్రత్యర్థులు విమర్శించారు. నిజానికి పార్టీలో, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవహారాలు కొన్ని ఇలాగే సాగాయి. అయితే ములాయం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు చివరకు ఎస్పీ చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ములాయం తన కన్నకొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించడంతో ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కొత్త సీఎంను ఎంపిక చేస్తామని ఆయన ప్రకటించారు. ములాయం ఇంట్లో విభేదాలకు కారణాలు చాలానే ఉన్నాయి. ( చదవండి : కొత్త సీఎంను నేనే ప్రకటిస్తా: ములాయం) ఎస్పీలో ములాయం కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. ఆయన కొడుకు అఖిలేష్ యూపీ సీఎం. తమ్ముడు శివపాల్ యాదవ్ యూపీ ఎస్పీ చీఫ్. సోదరుడి వరుసయ్యే రాంగోపాల్ యాదవ్ ఎంపీ. అఖిలేష్ భార్య డింపుల్ కూడా ఎంపీయే. వీరే గాక ములాయం ఇతర బంధువులు కూడా పార్టీలో ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండోభార్య సాధనకు తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలన్నది ఆశ. వదిన సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఆరు నెలల క్రితం అఖిలేష్, బాబాయ్ శివపాల్ మధ్య ఏర్పడ్డ విభేదాలు ఎన్నో మలుపులు తిరుగుతూ, ములాయం కొడుకును బహిష్కరించేదాకా వెళ్లాయి. ఒకప్పటి గ్యాంగ్‌స్టర్, ప్రస్తుత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ నేతృత్వంలోని క్యూఈఎంను ఆరు నెలల క్రితం ఎస్పీలో విలీనం చేయడానికి శివపాల్ చొరవ తీసుకున్నారు. సర్వం సిద్ధమైన నేపథ్యంలో దీనికి పార్టీ హైకమాండ్ అడ్డుపుల్ల వేసింది. దీనివెనుకు అఖిలేష్ ఉన్నారని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి బాబాయ్, అబ్బాయ్ మధ్య చాలా వివాదాలు నడిచాయి. కుటుంబ సభ్యులు చెరో పక్షాన నిలిచారు. అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ నిలవగా.. సాధన, శివపాల్, అమర్ సింగ్ మరో వర్గంగా ఉంటున్నారు. కుటుంబ పెద్ద ములాయం కూడా చివరకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖిలేష్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి ములాయం బహిష్కరించగా, శివపాల్‌కు సన్నిహితులైన ఇద్దరు మంత్రులు గాయత్రి ప్రజాపతి, రాజ్‌కిశోర్ సింగ్‌లపై అఖిలేష్ వేటు వేశారు. శివపాల్‌కు సన్నిహితుడుగా భావించిన యూపీ చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్‌ను పదవి నుంచి అఖిలేష్ తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ములాయం.. యూపీ ఎస్పీ చీఫ్‌గా ఉన్న కొడుకు అఖిలేష్‌ను తొలగించి, తమ్ముడు శివపాల్‌కు పట్టంకట్టారు. అఖిలేష్ ఏకంగా బాబాయ్ శివపాల్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ములాయం ఒత్తిడితో అఖిలేష్ మళ్లీ బాబాయ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అఖిలేష్.. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. (చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?) తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని ఆరోపించారు. అయితే ములాయం అమర్ సింగ్‌ను వెనుకేసుకొచ్చారు. తాజాగా టికెట్ల వ్యవహారం ములాయం కుటుంబంలో మరింత అగ్గి రాజేసింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్ సూచించిన వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం తన సోదరుడు శివపాల్‌తో కలసి అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. అఖిలేష్ పోటీగా రెబెల్స్ జాబితాను ప్రకటించారు. దీంతో అఖిలేష్‌తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ పరిణామం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి..! -
ముదిరిన సంక్షోభం; కుమారుడికి షోకాజ్ నోటీసు
-
ముదిరిన సంక్షోభం; కుమారుడికి షోకాజ్ నోటీసు
రెబెల్స్ జాబితాపై ములాయం గుస్సా అఖిలేష్‌తో పాటు రాంగోపాల్కూ నోటీసులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌లకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ములాయంకు అఖిలేష్ కుమారుడన్న విషయం తెలిసిందే. ఇక రాంగోపాల్ ఆయనకు వరుసకు సోదరుడు అవుతారు. ములాయం కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అఖిలేష్‌కు, ఆయన బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ యాదవ్‌కు పడటం లేదు. వీరిద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు ములాయం ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దీనికితోడు ఇటీవల టికెట్ల కేటాయింపు వ్యవహారం ఏకంగా తండ్రీకొడుకులు ములాయం, అఖిలేష్ మధ్య విభేదాలకు కారణమైంది. అఖిలేష్ సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా ములాయం జాబితాను ప్రకటించారు. 325 మంది పేర్లతో ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం జాబితా విడుదల చేశారు. దీంతో ఆగ్రహం చెందిన అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమై రెబెల్స్‌గా బరిలోకి దిగాలని సూచించారు. అఖిలేష్‌కు రాంగోపాల్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల కింద ములాయం.. వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఎస్పీలో చీలిక ఏర్పడవచ్చని భావిస్తున్నారు.