సమాజ్‌వాదీ పార్టీ నుంచి అనూహ్యంగా బహిష్కరణకు గురైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవితవ్యం ఏమిటి? ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అలాగే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.