Zee Group
-
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్ నోటీసు (ఎస్సీఎన్) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్ మేనేజ్మెంట్పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్ గోయెంకా వివాద సెటిల్మెంట్ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్–టైమ్ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు. ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్రిలయన్స్ నేవల్ పేరు మార్పున్యూఢిల్లీ: రిలయన్స్(Reliance) నేవల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పేరు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ను స్వాన్ ఎనర్జీ దక్కించుకుంది. -
ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఆడిట్లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆడిట్ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్ఫామ్డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ అనేది ఎకనామిక్ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది. -
జీ ఎంటర్టైన్మెంట్ దూకుడు.. మళ్లీ పునీత్ గోయెంకానే
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 70 శాతంపైగా దూసుకెళ్లి రూ. 209 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 123 కోట్లు ఆర్జించింది. పటిష్ట వ్యయ నియంత్రణల కారణంగా మార్జిన్లు 6 శాతంపైగా మెరుగుపడినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం ఆదాయం 19% క్షీణించి రూ. 2,034 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 2,510 కోట్ల టర్నోవర్ అందుకుంది. పునీత్ గోయెంకాను 2025 జనవరి1 నుంచి ఐదేళ్ల కాలానికి ఎండీ, సీఈవోగా బోర్డు తిరిగి నియమించినట్లు జీల్ పేర్కొంది. షేరు 5% జంప్ చేసి రూ. 132 వద్ద ముగిసింది. -
జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) నాలుగో త్రైమాసిక నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13.35 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 196 కోట్ల నష్టం నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 2,126 కోట్ల నుంచి రూ. 2,185 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ. 2,083 కోట్ల నుంచి రూ. 2,044 కోట్లకు తగ్గాయి. షేరు ఒక్కింటికి రూ. 1 చొప్పున కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 48 కోట్ల నుంచి రూ. 141 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 8,168 కోట్ల నుంచి రూ. 8,766 కోట్లకు చేరింది. సబ్ర్స్కిప్షన్ ఆదాయం, ఇతరత్రా సేల్స్, సర్వీస్‌ల ద్వారా ఆదాయం వృద్ధి చెందినట్లు జీల్ వెల్లడించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వన్–టైమ్ ప్రాతిపదికన కొన్ని కేటాయింపులు జరపాల్సి రావచ్చని, దీంతో మార్జిన్లపై కొంత ప్రభావం పడొచ్చని పేర్కొంది. అయితే, రెండో త్రైమాసికం నుంచి మార్జిన్ క్రమంగా మెరుగుపడగలదని వివరించింది. -
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
SONY: భారత్ మార్కెట్‌కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్‌వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు. వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
‘జీ’ పై చర్యలకు డిస్నీ స్టార్ కసరత్తు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ఒప్పందం నుంచి తప్పుకున్నందుకు గాను కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిస్నీ స్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ భారత విభాగం విలీన డీల్ రద్దుతో సతమతమవుతున్న జీకి ఈ పరిణామం మరింత సమస్యాత్మకంగా మారవచ్చని వివరించాయి. నాలుగేళ్ల పాటు ఐసీసీ మెన్స్, అండర్–19 క్రికెట్ టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్‌తో 2022లో జీ 1.4 బిలియన్ డాలర్ల సబ్–లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తొలి విడతగా 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. సోనీతో డీల్ కుదిరితే వచ్చే నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించవచ్చని జీ భావించింది. కానీ అది రద్దవడంతో చెల్లింపులు జరపలేకపోయింది. తదుపరి ఈ విషయంలో ముందుకెళ్లదల్చుకోవడం లేదంటూ డిస్నీ స్టార్‌కి తెలిపింది. దీంతో డిస్నీ స్టార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా సమాచారం. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
సోనీపై ఎన్సీఎల్టీకి జీ
న్యూఢిల్లీ: ప్రతిపాదిత విలీన డీల్‌ను రద్దు చేసుకోవాలన్న సోనీ నిర్ణయంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించినట్లు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) వెల్లడించింది. అలాగే 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 748.5 కోట్లు) టెరి్మనేషన్ ఫీజు కట్టాలన్న సోనీ నోటీసులపై కూడా తగు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ సమాచారమిచ్చింది. జపాన్‌కి చెందిన సోనీ గ్రూప్ భారత విభాగం (కల్వర్ మ్యాక్స్), జీల్ విలీన ప్రతిపాదన రద్దయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం విలీన కంపెనీ సారథ్య బాధ్యతలను జీ సీఈవో పునీత్ గోయెంకాకు అప్పగించడాన్ని ఇష్టపడకపోవడం వల్ల సోనీ గ్రూప్ ఈ డీల్‌ను రద్దు చేసుకుంది. ఆర్థిక మంత్రికి సుభాష్ చంద్ర లేఖ.. విలీన డీల్ నుంచి సోనీ వైదొలగడానికి కొద్ది రోజుల ముందు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఈ ఒప్పందం కుదరకుండా చేసేందుకు ప్రయతి్నస్తోందంటూ అందులో ఆరోపించారు. జీ నిధులను దురి్వనియోగం చేశారంటూ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకాపై సెబీ చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో సెబీ విచారణ జరపరాదని తాను అనడం లేదని, కాకపోతే సరిగ్గా డీల్ కుదిరే సమయంలో సెబీ ఇందుకు సంబంధించిన నోటీసులివ్వడానికి కారణమేమిటనేదే తన ఆందోళన అని చంద్ర పేర్కొన్నారు. జీల్ మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్థిక మంత్రి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యరి్ధంచారు. -
జీ–సోనీ విలీన డీల్ రద్దు!!
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్, సోనీ గ్రూప్ భారత విభాగ విలీన డీల్ ఊహాగానాలకు అనుగుణంగానే రద్దయింది. సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు నోటీసు పంపింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఆర్బిట్రేషన్‌కు తెర తీసినందుకు గాను 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) బ్రేకప్ ఫీజు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. ‘సోనీ గ్రూప్ కార్పొరేషన్లో భాగమైన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్) సంస్థ .. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనానికి సంబంధించి 2021 డిసెంబర్ 22న ప్రకటించిన ఒప్పందాలను రద్దు చేస్తూ, నోటీసులు ఇచ్చింది’ అని సోనీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీన సంస్థకు ఎవరు సారథ్యం వహించాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ విషయమై సోనీ నుంచి నోటీసులు వచి్చనట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీల్ తెలిపింది. ‘విలీన ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు నిబద్ధతతో అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు వన్‌టైమ్ ప్రాతిపదికన, మళ్లీ మళ్లీ ఖర్చులకు దారి తీసే చర్యలు కూడా తీసుకున్నాం’ అని తెలిపింది. డీల్ రద్దు వ్యవహారంపై చట్టపరంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనల పాటింపునకు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు జీల్ 2023 సెపె్టంబర్ వరకు దాదాపు రూ. 367 కోట్లు వెచి్చంచింది. ఇదీ జరిగింది.. ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021 డిసెంబర్లో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 24 నెలల్లోగా విలీనం జరగాలి. అలా జరగకపోవడంతో నెల రోజుల పాటు జనవరి 21 గడువు పొడిగించారు. డీల్ సాకారమై ఉంటే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించేది. విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీల్ ప్రమోటర్లయిన గోయెంకా కుటుంబానికి 3.99 శాతం వాటాలు ఉండేవి. 70 పైగా టీవీ చానల్స్, రెండు వీడియో స్ట్రీమి ంగ్ సరీ్వసులు, రెండు ఫిలిమ్ స్టూడియోలతో భార త్లో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఉండేది. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే, ఈలో గా జీ ప్రమోటర్లయిన సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు .. సీఈవో పునీత్ గోయెంకాలపై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో వారిని లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండకూడదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో గోయెంకాకు స్టే లభించింది. కానీ, ప్రాథమికంగా డీల్ కింద విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పగించాలని భావించినప్పటికీ ఈ పరిణామాలతో ఆ అంశంపై సందిగ్ధత నెలకొంది. గోయెంకాను సీఈవోగా కొనసాగించడాన్ని సోనీ ఇష్టపడటం లేదని, ఆయన వెనక్కి తగ్గటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై నిర్దిష్ట డెడ్‌లైన్‌లోగా ఇరుపక్షాలూ అంగీకారానికి రాకపోవడంతో డీల్ రద్దు కానుందంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడేంటి.. ఆదాయాలు, లాభాల క్షీణతతో కొన్నాళ్లుగా జీ ఆర్థిక పనితీరు తగ్గుతూ వస్తోంది. సోనీతో డీల్ రద్దు అయిన నేపథ్యంలో జీల్‌కి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ భారత మీడియా వ్యాపార విలీనమైతే ఏర్పడే భారీ సంస్థతో పోటీపడేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకోవాలి. కొన్ని క్రికెట్ ఈవెంట్ల ప్రసారం కోసం డిస్నీలో భాగమైన స్టార్‌తో జీల్‌కి ఒప్పందం ఉంది. దీని కోసం నాలుగేళ్ల వ్యవధిలో 1.32–1.44 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాలి. సోనీతో డీల్ రద్దు అయినందున ఈ ఒప్పందంపైనా ప్రభావం పడొచ్చు. మరోవైపు, ప్రాంతీయ భాషల్లో జీల్‌కి ఉన్న కంటెంట్, టీవీ చానల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి సోనీ కూడా భారత్‌లో తన కార్యకలాపాల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
‘అంతా దైవ నిర్ణయమే’..83 వేల కోట్ల డీల్ రద్దుపై జీ సీఈఓ
జీ-సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాల మధ్య కుదుర్చుకున్న భారీ ఒప్పందం రద్దయింది. అయితే, దీనిపై జీ సీఈఓ పునీత్ గోయెంకా తనదైన శైలిలో స్పందించారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అనంతరం ఎక్స్.కామ్‌లో అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక ఫోటోల్ని జత చేస్తూ.. ఈ రోజు ఉదయం ఎంతో ముఖ్యమైన అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యాను. As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 గత రెండేళ్లుగా నేను ఎంతగానో అత్యంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ సోనీ పిక్చర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విలీన ప్రక్రియ ఆగిపోవడం దైవ నిర్ణయంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేను సానుకూలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. భారత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ వాటాదారులందరిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్‌తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
జీ–సోనీ డీల్‌కు బ్రేక్?
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) – సోనీ భారత విభాగం విలీన ప్రయత్నాలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థకు జీ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించే విషయంపై సోనీ సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నిర్దిష్ట షరతులను పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలిపారు. డీల్ కుదుర్చుకునేందుకు నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే జనవరి 20లోగా రద్దు నోటీసును పంపించే అవకాశం ఉందని వివరించాయి. వివరాల్లోకి వెళ్తే.. జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ తమ భారత విభాగాన్ని, జీల్‌ను విలీనం చేసేందుకు సంబంధించి 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సాకారమైతే దేశీయంగా 10 బిలియన్ డాలర్ల మీడియా దిగ్గజంగా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. సదరు ఒప్పందం ప్రకారం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనయుడు, సీఈవో పునీత్ గోయెంకానే విలీన సంస్థకు కూడా సారథ్యం వహించాలి. కానీ, ఈలోగా చంద్ర, గోయెంకాలు తమ అధికారాన్ని దురి్వనియోగం చేసి సొంత అవసరాల కోసం నిధులను మళ్లించారంటూ సెబీ ఆరోపించడంతో డీల్ పురోగతిపై సందేహాలు రేకెత్తాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన వివాదంగా పరిగణిస్తున్న సోనీ.. విలీన సంస్థ సారథ్య బాధ్యతలను గోయెంకాకు అప్పజెప్పడానికి విముఖంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, ముందుగా అనుకున్న ప్రకారం సీఈవోగా తనని కొనసాగించాల్సిందేనంటూ గోయెంకా పట్టుబడుతున్నట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే డీల్‌ను సోనీ రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
జీకి భారీ షాక్.. ‘సోనీ సంచలన నిర్ణయం!’
ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది. 2021లో ఒప్పందం 2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్‌తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్పీసింగ్తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. సెబీ మధ్యంతర ఉత్వరులు అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది. పునిత్ నాయకత్వంపై నీలినీడలు తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్‌కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ప్రమోటర్లు చేసిన అప్పీల్‌ను సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) కొట్టివేసింది. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) ఏడాదిపాటు లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి బాధ్యతలూ చేపట్టకుండా సెబీ నిలువరించడాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా శాట్‌ను ఆశ్రయించారు. నిధుల మళ్లింపు కేసులో వీరిరువురూ లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి డైరెక్టర్లు లేదా కీలక యాజమాన్య బాధ్యతలు చేపట్టకుండా సెబీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా అïప్పీల్పై ఆదేశాలను జూన్ 27కు శాట్ రిజర్వులో ఉంచింది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
సుభాష్ చంద్ర, పునీత్‌లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్‌పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
ఎఫ్‌అండ్‌వోలో జీల్ కొనసాగింపు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్(జీల్)ను కొనసాగించనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించింది. వెరసి డెరివేటివ్స్ నుంచి జీల్‌ను తప్పించేందుకు గురువారం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా ప్రక్రియను వారాంతాన జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) నిలిపివేసింది. ఎసెస్ల్ గ్రూప్‌లోని మరో కంపెనీ సిటీ నెట్వర్క్స్ రూ. 89 కోట్ల చెల్లింపుల్లో విఫలంకావడంపై ఇండస్ఇండ్ బ్యాంక్ క్లెయిమ్ చేసింది. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా ఉంది. కాగా.. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)తో విలీనంకానున్న జీల్‌కు ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఉపశమనాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి జీల్ కౌంటర్లో తిరిగి మే నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ అనుమతించింది. మార్చి, ఏప్రిల్ కాంట్రాక్టులు యథాతథంగా కొనసాగుతాయి. -
‘జీ’పై ఐపీఆర్‌ఎస్ దివాలా అస్త్రం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజ్‌పై రచయితలు, కంపోజర్లు, మ్యూజిక్ పబ్లిషర్లతో కూడిన నాన్–ప్రాఫిట్ సొసైటీ ద ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ(ఐపీఆర్‌ఎస్) దివాలా అస్త్రాన్ని ప్రయోగించింది. రాయల్టీకింద రూ. 211.41 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు పేర్కొంటూ ఐపీఆర్‌ఎస్ దివాలా చట్ట ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్లు స్వయంగా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే ఈ క్లెయిమును తిరస్కరిస్తున్నట్లు జీ తెలియజేసింది. క్లెయిము మొత్తాన్ని తాను చెల్లించాల్సిన పనిలేదని వివరించింది. ఈ మేరకు తాను ఎన్సీఎల్టీలో సమాధానం దాఖలు చేస్తామని తెలిపింది. లిటరరీ, మ్యూజికల్ వర్క్‌లకు సంబంధించి రాయల్టీలు చెల్లించవలసి ఉన్నట్లు ఐపీఆర్‌ఎస్ ప్రస్తావించినట్లు వివరించింది. ఈ కేసుపై గతంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఐపీఆర్‌ఎస్ కోరుతున్న సొమ్ము బకాయికాదని, చెల్లించవలసిన అవసరంలేదని వివరణ ఇచ్చింది. -
Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..
న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్ – ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్) విలీనానికి అక్టోబర్ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్ ఇండియా లేదా వయాకామ్18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్‌పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్‌కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్‌ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
డిస్నీ–స్టార్ సంచలన నిర్ణయం.. ఐసీసీ టోర్నీల టీవీ హక్కులను..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లకు సంబంధించి భారత్‌లో టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను మూడు రోజుల క్రితం సుమారు రూ. 24 వేల కోట్లకు డిస్నీ–స్టార్ సొంతం చేసుకుంది. అయితే మంగళవారం ఆ సంస్థ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ ప్రసారాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తాము గెలుచుకున్న హక్కుల నుంచి టీవీ హక్కులు ‘జీ’ సంస్థకు (సబ్ లీజ్) బదలాయించింది. దీని ప్రకారం 2024–27 మధ్య కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్ టోర్నీలు, అండర్–19 టోర్నీలు ‘జీ’ చానల్స్‌లో ప్రసారం అవుతాయి. ఇదే కాలానికి డిజిటల్ హక్కులను మాత్రం స్టార్ తమ వద్దే అట్టి పెట్టుకుంది. మరోవైపు మహిళల వరల్డ్ కప్ హక్కులను (టీవీ, డిజిటల్) కూడా పూర్తిగా స్టార్ ఉంచుకుంది. వేలంలో తమతో పోటీ పడి ఓడిన ‘జీ’తో స్టార్ ఒప్పందం చేసుకోవడం విశేషం. భారత్‌లో టీవీ ప్రసారాల ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇది తమకు లభించిన గొప్ప అవకాశమని ‘జీ’ సంస్థ సీఈఓ పునీత్ వ్యాఖ్యానించారు. ఒకే మార్కెట్‌ను ఇద్దరు పోటీదారులు పంచుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌లో మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ వేలం నిబంధనల్లో విజేత తమ హక్కులను మరొకరికి ఇచ్చుకోవచ్చనే క్లాజ్ కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే వేలం ఖాయం కావడానికి ముందే స్టార్–జీ మధ్య ఒప్పందం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
క్యూ4లో జీ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్(జీల్) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 33 శాతం క్షీణించి రూ. 182 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 272 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,984 కోట్ల నుంచి రూ. 2,361 కోట్లకు బలపడింది. ప్రకటనల ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 1,120 కోట్లకు చేరింది. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం రూ. 803 కోట్ల నుంచి రూ. 855 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జీ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 956 కోట్లను తాకింది. 2020–21లో రూ. 793 కోట్లు మాత్రమే ఆర్జించింది. -
జీ లెర్న్‌పై యస్ బ్యాంక్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: జీ లెర్న్‌పై దివాలా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి ఫిర్యాదు చేసింది. మొత్తం రూ. 468 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనందున కంపెనీపై చర్యలు తీసుకోవలసిందిగా యస్ బ్యాంక్ ఆరోపించినట్లు జీ లెర్న్ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ నుంచి నోటీసు అందుకున్నట్లు వెల్లడించింది. నిజానిజాలను ధ్రువపరచుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ జీ లెర్న్ ఎడ్యుకేషన్ విభాగంలో సేవలందించే సంగతి తెలిసిందే. చదవండి: నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు.. -
జీల్లో ఇన్వెస్కో వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్)లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్వెస్కో 7.74 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.281.46 ధరలో 7,43,18,476 షేర్లను ఇన్వెస్కో ఓపెన్హీమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అమ్మివేసింది. వీటి విలువ దాదాపు రూ. 2,092 కోట్లుకాగా.. కోటికిపైగా షేర్లను మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం సేగంటి ఇండియా మారిషస్ 99 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. 7.8 శాతం వరకూ జీల్ వాటాను విక్రయించనున్నట్లు బుధవారమే ఇన్వెస్కో ప్రకటించింది. డెవలపింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ టీమ్ నిర్వహిస్తున్న ఇతర ఫండ్స్‌కు తగిన విధంగా ఈ విక్రయాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. వాటాదారులకు విలువ జీల్లో ఇన్వెస్కో అతిపెద్ద వాటాదారుకాగా.. ఈ అమ్మకం తదుపరి మూడు ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఇన్వెస్ట్మెంట్ టీమ్ కంపెనీలో కనీసం 11 శాతం వాటాతో నిలవనుంది. జీ– సోనీ విలీనానికి మద్దతివ్వనున్నట్లు ఇన్వెస్కో గత నెలలోనే ప్రకటించింది. తద్వారా గతంలో చేసిన డిమాండ్లనుంచి వెనక్కి తగ్గుతున్నట్లు తెలియజేసింది. ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులను బోర్డు నుంచి తొలగించాలని, ఇందుకు అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించాలని ఇన్వెస్కో పట్టుపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జీ– సోనీ విలీనంతో జీ వాటాదారులకు ఉత్తమ విలువ చేకూరనున్నట్లు అభిప్రాయపడటం గమనార్హం! ఇన్వెస్కో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీల్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 285 వద్ద ముగిసింది. -
IPL-BCCI: సుమారు రూ. 50 వేల కోట్లు! జూన్ 12 నుంచి..
IPL Media Rights- ముంబై: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండరు ప్రకటన జారీ చేసింది. 2023–2027 మధ్య ఐదేళ్ల కాలానికి బోర్డు హక్కులు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ స్థాయి, విలువ ఎన్నో రెట్లు పెరగడంతో హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రెండు అదనపు జట్ల రాకతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సుమారు రూ. 50 వేల కోట్లను ఆశిస్తోంది. జీ–సోనీ, రిలయన్స్ సంస్థలు ఎంత మొత్తం చెల్లించైనా హక్కులు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జూన్ 12 నుంచి బీసీసీఐ ఈ–వేలం ప్రక్రియ నిర్వహించి ఎవరికి హక్కులు దక్కాయో ప్రకటిస్తుంది. చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా? -
జీ ఎంటర్టైన్మెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో కీలక పరిమాణం...!
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) షేర్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై పలువురు వ్యక్తులుసహా, 10 సంస్థలపై విధించిన ఆంక్షలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుతానికి ఎత్తివేసింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టులో తమ అప్పీల్‌కు లోబడి తన తాజా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. ఉత్తర్వులు ఇవీ... జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు ధరపై ప్రభావం చూపగల బయటకు వెల్లడికాని సమాచారాన్ని పొందడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వహించిన ఆరోపణలపై కొందరు వ్యక్తులుసహా 15 సంస్థలపై ఆంక్షలు విధిస్తూ 2021 ఆగస్టు 20వ తేదీన సెబీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జూన్30తో ముగిసే త్రైమాసిక ఆడిటెడ్ ఫలితాల అంతర్గత సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ సెక్యూరిటీల మార్కెట్లలో లావాదేవీలు చేపట్టరాదన్న ఆంక్షలుసహా, ఈ కేసులో అక్రమంగా లబ్ది పొందారని భావిస్తున్న రూ.23.84 కోట్లను తిరిగి జప్తు చేయాలన్నది సెబీ ఆదేశాల్లో ప్రధాన అంశాలు. శాట్ రూలింగ్‌పై సెబీ అప్పీల్ సెబీ తప్పు పట్టిన వారిలో బిజల్ షా, గోపాల్ రిటోలియా, జతిన్ చావ్లా, అమిత్ భన్వర్‌లాల్ జాజూ, మనీష్ కుమార్ జాజూ, గోమతీ దేవి రిటోలియా, దల్జిత్ గురుచరణ్ చావ్లా, మోనికా లఖోటియా, పుష్పాదేవి జాజూ, భవర్లాల్ రాంనివాస్ జాజూ, భవర్లాల్ జాజూ, భవర్లాల్ జాజోరే విజయ భాగస్వాములు, యష్ అనిల్ జాజూ విమల సోమానిలు ఉన్నారు. వీరిలో మొదటి వ్యక్తి బిజల్ షా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్, విశ్లేషణ, వ్యూహరచన, ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగం చీఫ్‌గా ఉన్నారు. కాగా, ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ, ఐదుగురు వ్యక్తిగతంగా సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. సెబీ మధ్యంతర ఉత్తర్వులను శాట్ గత ఏడాది నవంబర్‌లో తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను ఉదహరిస్తూ, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ఈ కేసులోని మరో 10 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. వీరి విజ్ఞప్తిని స్వీకరించిన సెబీ, ఇందుకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే శాట్ ఉత్తర్వులపై తాను ఇప్పటికే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయని, ఆంక్షలు ఎత్తివేస్తూ తన తాజా ఉత్తర్వులు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. ఈ కేసులో సంస్థలు ఇప్పటికే డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీతోసహా తదుపరి ఆదేశాలను వెలువరించేవరకూ ఎస్క్రో అకౌంట్లో కొనసాగుతాయని కూడా సెబీ వివరించింది. -
‘జీ’పై ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)పై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశ్రయించింది. జీఎల్ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్ దరఖాస్తు సమర్పించినట్లు జీల్ వెల్లడించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్వర్క్స్ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్‌పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్తో జీల్ విలీనమైన సంగతి తెలిసిందే. -
జీ టీవీకి ఝలక్ !
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రూ. 99 కోట్లు తగ్గి రూ. 299 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 398 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,130 కోట్లకు క్షీణించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం వ్యయాలు రూ. 1,701 కోట్లకు చేరాయి. క్యూ3 టర్నోవర్‌లో ప్రకటనల నుంచి రూ. 1,261 కోట్లు, సబ్స్క్రిప్షన్ ఆదాయం రూ. 790 కోట్లు, ఇతర సర్వీసులు, అమ్మకాల నుంచి రూ. 62 కోట్లు చొప్పున లభించాయి. గత క్యూ3లో ఇతర సర్వీసుల పద్దుకింద భారీగా రూ. 842 కోట్ల ఆదాయం నమోదుకావడం గమనార్హం! ఈ కాలంలో సోనీ పిక్చర్స్ అనుబంధ సంస్థతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. -
జీ, సోనీ విలీనం దిశగా మరో ముందడుగు
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడింది. విలువ మదింపునకు సంబంధించి చర్చల ప్రక్రియకు గడువు ముగియడంతో నెట్‌వర్క్‌లు, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసే విధంగా ఇరు సంస్థలు నిర్దిష్ట ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జీల్, ఎస్పీఎన్ఐ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్‌పీఎన్‌ఐలో జీల్ విలీన డీల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ (ఎస్పీఈ) 1.575 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. దానికి ప్రతిగా 50.86 శాతం వాటాలు దక్కించుకుంటుంది. జీల్ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులు) 3.99 శాతం, ఇతర జీల్ షేర్హోల్డర్లకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. డీల్ పూర్తయ్యాక విలీన సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేస్తారు. జీల్ సీఈవో పునీత్ గోయెంకా ఎండీ, సీఈవోగా కొనసాగుతారు. ‘భారతీయ వినియోగదారులకు మెరుగైన వినోదం అందించేందుకు.. మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన 2 టీమ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, ఫిలిమ్ లైబ్రరీలను ఒక తాటిపైకి తెచ్చే దిశగా మా ప్రయత్నాల్లో ఇది కీలక అడుగు‘ అని ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఎస్పీఈ చైర్మన్ (గ్లోబల్ టెలివిజన్ స్టూడియోస్) రవి అహుజా తెలిపారు. వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్ అందించేందుకు ఈ డీల్ దోహదపడగలదని పునీత్ గోయెంకా పేర్కొన్నారు. -
జీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. బోర్డు మార్గదర్శకత్వంలో కంపెనీ భవిష్యత్‌కు అనువైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల మౌనాన్ని వీడుతూ గోయెంకా.. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ప్రతిపాదించిన డీల్ అంశాన్ని ఇన్వెస్కో పబ్లిక్కు వెల్లడించకపోవడాన్ని ప్రశ్నించారు. జీలో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఇన్వెస్కో కొద్ది రోజులుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఏజీఎం)కి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా పునీత్ గోయెంకాసహా బోర్డులో ఇతర నామినీలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతక్రితం వేసిన ప్రణాళికలను పబ్లిక్కు ఎందుకు తెలియజేయలేదని ఇన్వెస్కోను వేలెత్తి చూపారు. కార్పొరేట్ సుపరిపాలన అనేది కార్పొరేట్లకు మాత్రమేకాదని, కంపెనీలో వాటా కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకూ వర్తిస్తుందని ఇన్వెస్కోనుద్ధేశించి పేర్కొన్నారు. జీల్లో.. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. జీ భవిష్యత్‌ను ప్రభావితం చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్న వాటాదారుల విలువకు దెబ్బతగలనీయబోమని వ్యాఖ్యానించారు. ఇన్వెస్కోతో వివాదం నేపథ్యంలో జీ మరిన్ని వృద్ధి అవకాశాలను అందుకుంటుందని, మరింత పటిష్టపడుతుందని తెలియజేశారు. తద్వారా మీడియా, వినోద రంగాలలో దిగ్గజ కంపెనీగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం మాత్రమే పోరాడుతున్నానని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాదని గోయెంకా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచిన ఇన్వెస్కో విఫలమైందని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని వివరించారు. వాటాదారుల ప్రయోజనార్ధమే ఈ నిజాలను బోర్డు ముందుంచినట్లు పేర్కొన్నారు. -
జీ మీడియా, ఇన్వెస్కో వివాదంపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్!
జీ ఎంటర్ ప్రైజెస్, ఇన్వెస్కో మధ్య వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై చింతిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రిలయన్స్ స్పష్టం చేసింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా షేర్ హోల్డర్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంతో రిలయన్స్ స్పష్టతనిచ్చింది. 2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది. తక్కువ ధరకే జీతో మా మీడియా ఆస్తులను విలీనం చేయడానికి మేము విస్తృత ప్రతిపాదన చేసాము. జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. ఈ ప్రతిపాదనను అన్ని విలీన సంస్థలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. జీ వాటాదారులతో సహా అందరికీ గణనీయమైన విలువను సృష్టించడానికి ప్రయత్నించామని రిలయన్స్ తెలిపింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే నిర్వహణను కొనసాగించడానికి రిలయన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని, వారి పనితీరును బట్టి ప్రతిఫలం అందిస్తుందని తెలిపింది.(చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న అంశం కూడా ఉందని, గోయెంకాతో పాటు టాప్ మేనేజ్మెంట్కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ESOPs) ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపక కుటుంబం భావించడంతో గోయెంకాకు, ఇన్వెస్కోకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని రిలయన్స్ వివరించింది. అయితే మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ పెట్టుబడులు పెంచుకోవచ్చని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. -
జీ వాటాదారులు ఏకంకావాలి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జీ ఎంటర్టైన్మెంట్(జీల్) యాజమాన్య మార్పిడికి డిమాండ్ చేస్తున్న ఇన్వెస్కో తాజాగా కంపెనీ వాటాదారులకు లేఖ రాసింది. సోనీ గ్రూప్‌తో జీల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రమోటరేతర వాటాదారులంతా ఏకంకావాలంటూ అభ్యరి్థంచింది. ఈ డీల్ ద్వారా వాటాదారులను నష్టపరుస్తూ సుభాష్ చంద్ర కుటుంబం లబ్ది పొందే వీలున్నట్లు లేఖలో ఆరోపించింది. జీల్లో 7.74 శాతం వాటా ను కలిగిన ఇన్వెస్కో ఓపెన్ లెటర్ ద్వారా మరోసారి జీల్ బోర్డును పునర్వ్యవస్థీకరించాలం టూ డిమాండ్ చేసింది. ఇందుకు వీలుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని పేర్కొంది. జీల్ సీఈవో పునీత్ గోయెంకాసహా ఇద్దరు ఇతర డైరెక్టర్లను తొలగించమంటూ ఇన్వెస్కో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీల్ ఇలా..: గత నెలలో సోనీ గ్రూప్‌నకు చెందిన దేశీ విభాగం జీ కొనుగోలుకి తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రెండు సంస్థల విలీనాన్ని చేపట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీ ఇండియా వాటాదారులకు 53 శాతం వాటా లభించనుండగా.. మిగిలిన భాగం జీ వాటాదారులకు చెందనుంది. డీల్ ప్రకారం పోటీపడకుండా ఉండే క్లాజుతో చంద్ర కుటుంబానికి 2 శాతం అదనపు వాటాను బహుమతిగా ఇవ్వడాన్ని ఇన్వెస్కో లేఖ ద్వారా తప్పుపట్టింది. అంతేకాకుండా వీరి వాటాను 4 శాతం నుంచి 20 శాతానికి పెరిగేందుకు వీలు కలి్పంచడాన్ని అక్రమ చర్యగా పేర్కొంది. జీల్లో ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీతో కలసి ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. కంపెనీ టేకోవర్‌కు ఆసక్తి ఉంటే 75 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించమంటూ గత వారం సుభాష్ చంద్ర సవాల్ విసిరిన నేపథ్యంలో ఇన్వెస్కో తాజా లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్వెస్కో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
మైనారిటీ వాటాదారుల అభిప్రాయాలూ తెలుసుకోండి
ముంబై: వివిధ అంశాలు, సమస్యలపై చర్చకు జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ వాటాదారు ఇన్వెస్కో చేసిన అభ్యర్థనకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సానుకూలంగా స్పందించింది. బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)ను ఆదేశించింది. అమెరికాకు చెందిన ఇనెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిగి జీ ఎంటర్టైన్మెంట్పై ఈ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ సమావేశం ఏర్పాటు ద్వారా జీల్ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకాసహా మరో ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని ఆశిస్తోంది. అలాగే కొత్తగా ఎంపిక చేసిన ఆరుగురు డైరెక్టర్లతో బోర్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను షేర్ హోల్డర్లందరికీ తగిన విధంగా తెలియజేయాలని కూడా జీ ఎంటర్టైన్మెంట్నుజీ ఎంటర్టైన్మెంట్, అత్యవసర వాటాదారుల సమావేశం, ఇన్వెస్కో , ఎన్సీఎల్టీ , బోర్డ్ సమావేశం ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను అక్టోబర్ 4న చేపట్టనున్నట్లు ఇద్దరు సభ్యుల బెంచ్ తెలియజేసింది. మరోపక్క ఈ అంశాలపై చట్ట ప్రకారం కేటాయించిన గడువులోగా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వాటాలు ఇలా... ఈజీఎంను చేపట్టమంటూ సెప్టెంబర్ 11న జీల్‌ను అభ్యర్థించినట్లు ఇన్వెస్కో తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణార్ధం ప్రస్తుత బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ నిర్వహణ చేపట్టరాదంటూ పేర్కొన్నారు. కొత్త డైరెక్టర్లను నియమించుకోవడం ద్వారా బోర్డును తిరిగి నిర్మించాలని కోరారు. దీంతో 45 రోజుల్లోగా ఈజీఎంను చేపట్టవలసిందిగా జీల్‌ను ఆదేశించమంటూ ఎన్సీఎల్టీని వేడుకున్నారు. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ జీల్లో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. సెపె్టంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో విలీనమయ్యేందుకు జీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 2 శాతం క్షీణించి రూ. 304 వద్ద ముగిసింది. -
సోనీకి ‘జీ’ హుజూర్!
న్యూఢిల్లీ: దేశీ ఎంటర్టైన్మెంట్ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్ఐ)తో లిస్టెడ్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) విలీనం కానుంది. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. డీల్ ప్రకారం విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా చేపట్టనున్నారు. దీంతో ఇటీవల కొద్ది రోజులుగా జీ యాజమాన్య మార్పుపై చెలరేగిన వివాదాలకు చెక్ పడే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది. ఓఎఫ్‌ఐగ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి 17.9 శాతం వాటా కలిగిన ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ గత వారం పునీత్ గోయెంకాతోపాటు.. జీ బోర్డులోని మరో ఇద్దరు సభ్యులను తప్పించమంటూ అత్యవసర సమావేశం కోసం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ నేపథ్యంలో జీలో తలెత్తిన సంక్షోభం ముగియడంతోపాటు.. దేశీయంగా సోనీ బిజినెస్ మరింత విస్తరించనుంది. 90 రోజులు.. ఎస్‌పీఎన్‌ఐతో తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) కాలానుగుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జీల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. డీల్ ద్వారా రెండు సంస్థల నెట్వర్క్స్, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రామ్ లైబ్రరీలు ఏకంకానున్నట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్ సరీ్వసులు(జీ5, సోనీ లివ్), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్ డిస్నీ నిలవనుంది. ఒప్పందాన్ని తప్పనిసరి చేసుకునేందుకు 90 రోజుల గడువుంటుందని జీల్ వెల్లడించింది. వినియోగదారులకు మేలు జీల్, ఎస్‌పీఎన్‌ఐల విలీనంతో దేశీయంగా అతిపెద్ద మీడియా నెట్వర్క్ బిజినెస్ ఏర్పాటుకానుందని సోనీ పిక్చర్స్ పేర్కొంది. తద్వారా కంటెంట్, సినిమాలు, క్రీడలు తదితర విభాగాలలో వినియోగదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలియజేసింది. విలీన ముందస్తు ఒప్పందాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జీల్ వెల్లడించింది. వాటాదారులందరికీ ఇది మేలు చేయగలదని తెలియజేసింది. అధిక వృద్ధి, లాభదాయకతలను సాధించేందుకు ఈ డీల్ ఉపయుక్తం కాగలదని పేర్కొంది. మరోవైపు డీల్ ప్రకారం జీల్లో 4 శాతం వాటాగల ప్రమోటర్ సుభాష్ చంద్ర కుంటుంబం వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కనుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుత 4 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశముంటుందని జీల్ పేర్కొంది. ప్రస్తుత ఈక్విటీ విలువల ఆధారంగా విలీన నిష్పత్తి జీల్‌కు అనుగుణంగా 61.25 శాతంగా ఉండవచ్చని అంచనా. షేర్ల దూకుడు యాజమాన్య మారి్పడి తదితర అంశాలపై ఇటీవల చెలరేగిన వివాదాలకు చెక్ పడటంతోపాటు.. సోనీ పిక్చర్స్‌తో విలీనంకానున్న నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్(జీల్) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 334 వద్ద ముగిసింది. ఒక దశలో గరిష్టంగా రూ. 355ను సైతం అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..రూ. 281 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో బీఎస్ఈలోనూ 39 శాతం జంప్‌చేసి రూ. 355 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 7,824 కోట్లు ఎగసి రూ. 32,379 కోట్లకు చేరింది. గ్రూప్ షేర్లు: జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ ఎస్‌పీఎన్‌ఐతో విలీన వార్తల నేపథ్యంలో జీ గ్రూప్‌లోని ఇతర కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. జీ లెర్న్ 13 శాతంపైగా ఎగసి రూ. 16 వద్ద నిలవగా.. జీ మీడియా 5 శాతం బలపడి రూ. 12.30 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
జీ -సోనీ డీల్..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!
భారత మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ! కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...! జీ, సోనీ నెట్వర్క్స్ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్‌వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్‌వర్క్స్‌ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్ జున్‌జున్‌వాలా సుమారు 50లక్షల జీల్ షేర్లను కొనుగోలు చేశారు. జీల్ ఒక్కో షేర్‌ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది. దీంతో రాకేశ్ 50 శాతం మేర లాభాలను గడించారు. జీ మీడియా చీఫ్ పునీత్ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్తోపాటుగా , యూరప్‌కు చెందిన బోఫా సెక్యూరిటీస్ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్ గురించి ముందే తెలిసి జీల్ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది. చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..? -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
భారత మీడియా రంగంలో రెండు సంస్థల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సోనీ టీవీలో..జీ ఎంటర్ టైన్మెంట్ విలీనమైంది. కంటెంట్ క్రియేషన్‌లో గత మూడు దశాబ్దాలుగా వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్న జీఎంటర్ టైన్మెంట్ పలు కీలక పరిణామల నేపథ్యంలో సోనీ టీవీలో విలీనం అయ్యేందుకు సిద్ధ పడింది. ఇందుకు జీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడంతో విలీనం ఖరారైంది. దీంతో విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్టైన్మెంట్కు 47 శాతం, ఎస్పీఎన్ఐకు 52 శాతం వాటాలు దక్కనున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్ టైన్మెంట్ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. జీ లెర్న్, జీ మీడియాకూ సెగ! మరో వైపు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.తొలుత డిష్ టీవీలో సవాళ్లు ఎదురుకాగా..గత వారం జీ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రమోటర్లతో పాటు,పునీత్ గోయెంకా అధ్యక్షతన ఏర్పాటైన మేనేజ్మెంట్ను తొలగించడంపై ఈజీఏం ఏర్పాటుకు డిమాండ్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ లెర్న్, జీ మీడియా నుంచి సైతం సుభాష్ చంద్రకు చెందిన ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా వాటాదారులు గళమెత్తే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు. -
జీ గ్రూప్‌కు షాక్: ఐటీ సోదాలు
ముంబై: ప్రముఖ టీవీ చానెల్ గ్రూప్ ‘జీ’ కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 15కి పైగా చోట్ల తనిఖీలు చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడటంతోపాటు బోగస్ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను జీ గ్రూప్ దాఖలు చేసిందని ఐటీ అధికారులు చెప్పారు. దీంతో పాటు లార్సెన్ అండ్ టౌబ్రో (ఎల్ అండ్ టీ) కంపెనీలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. (చదవండి: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు) ‘జీ’ గ్రూప్ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సమాచారాన్ని ఆదాయ పన్నుశాఖ అధికారులతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ (డీజీసీఈఐ) షేర్ చేసుకుందని అధికార వర్గాల కథనం. పన్ను ఎగవేత కేసులో వివిధ గ్రూపులకు చెందిన కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిపామని ఓ ఐటీ అధికారి వెల్లడించారు. ఇక ఐటీ సోదాలపై జీ ఎంటర్టైన్మెంట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తామన్నారు. -
రణసింగం నేరుగా ఓటీటీకే
విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘క పే రణసింగం’. విరుమాండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రైతుల పోరాటం నేపథ్యంలో ఉంటుంది. హీరోహీరోయిన్ రైతుల వైపు నిలబడి ఎలాంటి పోరాటం చేశారన్నది కథాంశం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో(జీ ఫ్లెక్స్) విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది జీ సంస్థ. పేఫర్ వ్యూ (డబ్బు కట్టి వీక్షించడం) పద్ధతిలో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. -
సినీ అభిమానులకు ‘జీ’ సంస్థ శుభవార్త
ముంబై: సినిమా ప్రేమికులకు జీ ఎంటర్టేన్మెంట్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. త్వరలో ‘సినిమా టు హోమ్’, జీప్లెక్స్ సేవలను వినియోగదారులకు అందించనుంది. కాగా తమ సినిమా టు హోమ్ సేవల ద్వారా వినియోగదారులు, సినీ నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని జీ ఎంటర్టేన్మెంట్ తెలిపింది. అయితే ఎంటర్టేన్మెంట్ ప్టాట్ఫార్మ్లో తమ సేవలు నూతన ఒరవడి సృష్టిస్తాయని పేర్కొంది. ఈ విషయమై జీ స్టూడియో సీఈఓ షారీక్ పటేల్ స్పందిస్తు.. నూతన సాంకేతికతో జీప్లెక్స్ సేవలను ప్రారంభించనున్నామని, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సేవలను అందిస్తామని తెలిపారు. కాగా తాము ప్రారంభించబోయే జీప్లెక్స్ సేవల పట్ల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు జీప్లెక్స్ సేవల ద్వారా వివిధ భాషలలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలను అందించనున్నట్లు జీ సంస్థ రెవెన్యూ అధికారి అతుల్ దాస్ పేర్కొన్నారు. అయిత నాణ్యతలో నూతన ట్రెండ్ సృష్టిస్తామని జీ సంస్థ తెలిపింది. అత్యుత్తమ నాణ్యత అందించేందుకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సంస్థ తెలిపింది. జీ 5 చానెల్‌లోను సీనిమా టు హోమ్ సేవలు అందుబాటులో ఉంటాయని, దేశంలో జీప్లెక్స్ సేవలు అక్టోబర్ 2న ప్రారంభించనున్నట్లు సంస్థ పేర్కొంది. -
జీ- అదానీ ఎంటర్ప్రైజెస్.. హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు కారణంగా కంటెంట్ ప్రొడక్షన్‌కు సమస్యలు ఎదురైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా జీల్ పేర్కొంది. అయితే ప్రస్తుతం తిరిగి ప్రొడక్షన్ తదితర పనులు ప్రారంభంకావడంతో ఇకపై మెరుగైన పనితీరు చూపగలమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 196 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఇలా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్) కాలంలో జీ నికర లాభం రూ. 29.3 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 530 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2112 కోట్ల నుంచి రూ. 1338 కోట్లకు క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ. 1187 కోట్ల నుంచి రూ. 421 కోట్లకు భారీగా నీరసించినట్లు జీ తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా ఇతర త్రైమాసిక ఫలితాలతో వీటిని పోల్చిచూడ తగదని తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ(ఏఏఐ) ప్రతిపాదనను నేడు కేంద్ర కేబినెట్ పరిశీలించనుందన్న అంచనాలతో అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 233 వద్ద ట్రేడవుతోంది. తొలి దశ ప్రయివేటైజేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బిడ్డింగ్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ ఆరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. వీటిలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు ఏఏఐ నుంచి ఒప్పందాలను కుదుర్చుకుంది. మిగిలిన మూడు ఒప్పందాలు వాయిదా పడ్డాయి. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యం కింద గువాహటి, జైపూర్, తిరువనంతపురం విమానాశ్రయాల అభివృద్ధికి ఒప్పందాలు కుదిరే వీలున్నట్లు తెలుస్తోంది. అయితే విమానాశ్రయాల ప్రయివేటైజేషన్పై విచారణ జరుగుతున్న కారణంగా కోర్డు ఆదేశాలకు లోబడి ఒప్పందాలు కుదరవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. రూ. 1,000 కోట్ల ముందస్తు చెల్లింపులకు అదానీ గ్రూప్ మరింత గడువు కోరిన నేపథ్యంలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో ఎయిర్‌పోర్టుల అప్పగింత పెండింగ్‌లో పడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
నిరాశపరిచిన జీ ఎంటర్టైన్మెంట్
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ.766 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.292 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,992 కోట్లుగా నమోదైంది. ప్రకటనల రూపంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.1,039 కోట్లుగా ఉంది. 2019–20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 67 శాతం తగ్గి రూ.524 కోట్లకు చేరగా, ఆదాయం రూ.8,185 కోట్ల నుంచి రూ.8,413 కోట్లకు పెరిగింది. -
నిర్మాతగా సుష్మిత
‘రంగస్థలం, సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మాతగా మారారు. భర్త విష్ణుప్రసాద్‌తో కలసి ఆమె ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. విష్ణు ప్రసాద్, సుష్మితాలతో కలిసి జీ5 సంస్థ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం ఓటీటీ వేదిక ‘జీ5’తో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. -
ఛైర్మన్ షాక్‌తో జీ షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో కంపెనీ షేరు మంగళవారం సెషన్లో భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ట్రేడర్ల అమ్మకాలతో జీ 9 శాతం నష్టపోయింది. గత సెషన్లో రూ. 343.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. జీలో సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ వాటా అమ్మకం గురించి గత వారం ప్రతికూల ప్రభావం చూపకపోయినప్పటికీ, జీ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి చంద్ర పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రతికూలంగా మారింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ సోమవారం రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే సుభాష్ చంద్ర కుమారుడు పునిత్ గోయెంకా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ (జీఈఈఎల్ మాతృసంస్థ) తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల చెల్లింపుల కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు నవంబర్ 20న ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. రుణాల భారం తగ్గింపునకు ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. -
జీ ఎంటర్టైన్మెంట్కు చైర్మన్ గుడ్‌బై
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయితే బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా ఆయన కొనసాగునున్నారు.అలాగే ఈయనతోపాటు పునీత్ గోయంకా కూడా ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు. అలాగే జీ బోర్డును పునర్యవస్థీకరించిన బోర్డును కొత్తగా ఆరుగురిని ఇండిపెండెంట్ డైరెక్టర్లగా నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర వెంటనే బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామాను బోర్డు అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను (సెకండరీ మార్కెట్ ప్లేస్మెంట్ ద్వారా) 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నవంబర్ 21 న జీల్లో 2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిందనీ తెలిపింది. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్‌హైమర్ ఫండ్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించన్నుట్టు ఈ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2.3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. -
వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్
సాక్షి, ముంబై: ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో దేశీయ అతిపెద్ద లిస్టెడ్ మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు. జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్ 77 మిలియన్ షేర్లను, క్వైతర్ గ్రూప్ 61 మిలియన్ షేర్లను, ఎస్సెల్ గ్రూప్ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్ సంస్థ డీల్స్‌కు బుక్ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. -
‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై
ముంబై: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీ గ్రూప్‌నకు ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ ఫండ్ మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీ)లో ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ డీల్ విలువ రూ. 4,224 కోట్లుగా ఉండనుంది. ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌లో భాగమైన డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ ఈ వాటాలను కొనుగోలు చేయనుంది. 2002 నుంచి జీ లో ఇన్వెస్టరుగా కొనసాగుతున్న ఇన్వెస్కో ఫండ్‌కు ప్రస్తుతం ఇందులో 7.74 శాతం వాటాలు ఉన్నాయి. ‘ఇన్వెస్కో ఓపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ .. జీ లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ప్రమోటర్ల నుంచి మరో 11 శాతం దాకా వాటాలను రూ. 4,224 కోట్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించింది‘ అని జీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థపై ఇన్వెస్కో ఫండ్‌కున్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు తెలియజేస్తున్నాయని జీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా పేర్కొన్నారు. ఈ డీల్‌తో జీ లో ప్రమోటర్ల వాటా 23 శాతానికి తగ్గుతుంది. 2019 జూన్ నాటికి జీ లో ప్రమోటర్ల వాటా 35.79 శాతంగా ఉంది. ఇందులో 63.98 శాతం వాటాలు మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర తనఖాలో ఉన్నాయి. బుధవారం షేరు ముగింపు ధరను బట్టి జీ మార్కెట్ విలువ రూ. 34,717 కోట్లు కాగా.. ఇందులో ప్రమోటర్ల వాటాల విలువ సుమారు రూ. 13,000 కోట్లుగా అంచనా. ఏడాదిగా ప్రమోటర్ల ప్రయత్నాలు.. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చంద్ర ఈ ఏడాది జనవరిలో రాసిన బహిరంగ లేఖతో కంపెనీ వాస్తవ స్థితిగతులు అధికారికంగా బైటపడ్డాయి. ఇన్ఫ్రా రంగంలో భారీగా పెట్టిన పెట్టుబడులు, వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు లావాదేవీలు ప్రతికూలంగా మారాయని చంద్ర పేర్కొన్నారు. అయితే, బ్యాంకర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందిన రుణాలన్నీ పూర్తిగా తీర్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ దాకా ఎటువంటి చర్యలూ తీసుకోకుండా రుణదాతలతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి భారీగా పేరుకుపోతున్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు గతేడాది నవంబర్ నుంచీ ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రుణాల రీపేమెంట్‌కు 2019 సెప్టెంబర్‌ను గడువుగా నిర్దేశించుకున్నారు. జీ లో తమకున్న వాటాల్లో దాదాపు 50 శాతం వాటాలు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించేందుకు ప్రమోటర్లు గతేడాది నవంబర్ నుంచి ప్రయత్నిస్తున్నారు. జీ లోనూ, ఇతరత్రా మీడియాయేతర అసెట్స్‌లో వాటాల కొనుగోలుకు వివిధ భాగస్వాముల నుంచి సానుకూల స్పందన కూడా వస్తున్నట్లు ఎస్సెల్ గ్రూప్ చెబుతూ వస్తోంది. తాజాగా ఇన్వెస్కో ఓపెన్‌హైమర్‌తో ఒప్పందం కుదరడం సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. రూ. 7,000 కోట్లకు తగ్గనున్న రుణభారం.. బుధవారం నాటి జీ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్కో 10 శాతం ప్రీమియం చెల్లించనుంది. ఈ డీల్‌తో గ్రూప్ రుణ భారం రూ. 11,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు తగ్గనుందని జీ సీఈవో, ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. జనవరిలో రూ. 13,000 కోట్లుగా ఉన్న రుణభారాన్ని అంతర్గత వనరుల సమీకరణ తదితర చర్యల ద్వారా ప్రస్తుతం రూ. 11,000 కోట్లకు తగ్గించుకున్నట్లు వివరించారు. షేరు 5 శాతం డౌన్.. బుధవారం మార్కెట్లు ముగిశాక డీల్ వెల్లడైంది. బీఎస్ఈలో జీ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 361.45 వద్ద ముగిసింది. మిగతా అసెట్స్ విక్రయంపై దృష్టి.. రుణాల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రమోటర్లకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు ఈ డీల్‌తో లభించగలదని జీ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్ పేర్కొంది. ఇతరత్రా అసెట్స్ విక్రయం దిశగా ఇది ముందడుగని తెలిపింది. మీడియాయేతర అసెట్స్‌నూ విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్దేశించుకున్న సెప్టెంబర్ గడువులోగా రుణాల రీపేమెంట్ ప్రక్రియను పూర్తి చేయగలం‘ అని ఎస్సెల్ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. -
జీ..ఎవరి చేజిక్కేనో..?
ముంబై : దేశీ మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజెస్‌ను చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం ముర్ధోక్‌ల మధ్య పోరు నెలకొంది. జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునేందుకు ఫేస్బుక్ సంకేతాలు పంపగా ముర్ధోక్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బ్లాక్‌స్టోన్‌లతో కలిసి అమెరికా కేబుల్ దిగ్గజం కామ్‌కాస్ట్ కన్సార్షియంగా ఏర్పడి జీ ఎంటర్టైన్మెంట్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ విలువను మదించే ప్రక్రియనూ కామ్‌కాస్ట్ కన్సార్షియం చేపట్టిందన్న ప్రచారం సాగుతోంది. సీఎన్‌బీసీ, యూనివర్సల్ పిక్చర్స్ వంటి గ్లోబల్ మీడియా బ్రాండ్లను కలిగిఉన్న కామ్‌కాస్ట్ కన్సార్షియం భారత మీడియాలో మెరుగైన మార్కెట్ వాటా కోసం జీ ఎంటర్టైన్మెంట్ను కైవసం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. మరోవైపు జీ ప్రమోటర్లు వ్యాపార నిర్వహణలో తాము చురుకైన పాత్రను కొనసాగించేందుకు మొగ్గుచూపుతుండగా కొనుగోలుదారులు మాత్రం కంపెనీపై పూర్తి నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర ప్రకారం ప్రమోటర్ల వాటాలో సగం విలువ రూ 6,603 కోట్లుగా అంచనా వేస్తుండగా మదింపు విలువను మరింత పెంచాలని జీ ప్రమోటర్లు పట్టుబడుతున్నట్టు తెలిసింది. జీ ఎంటర్టైన్మెంట్ విక్రయ ఒప్పందం ఓ కొలిక్కివస్తే రుణభారంతో సతమతమవుతున్న ప్రమోటింగ్ కంపెనీ ఎస్సెల్ గ్రూప్‌కు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. -
జీ షేరు ఢమాల్ : కంపెనీ వివరణ
సాక్షి, ముంబై : ఎస్సాల్ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్ (తనఖా) షేర్లు విక్రయంపైమంగళవారం నుంచి పుకార్లు చెలరేగడంతో ఇన్వెస్లర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బుధవారం జీ కౌంటర్ ఏకంగా 12 శాతానికి పైగా పతనమైంది. మరోవైపు ఈ పుకార్లను కొట్టి పారేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్లో ప్లెడ్జ్డ్ షేర్ల విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే వాటా విక్రయ అంశం తుది దశకు చేరుకుందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 6-8 వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. అయితే వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ సీఈవో పునీత్ గోయంకా స్పష్టం చేశారు. అలాగే షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి ఫిర్యాదు చేయనున్నామని గోయంకా తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టాండ్‌లోన్ ఫలితాలను మే 27వ తేదీన వెల్లడించ నున్నామన్నారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్టైన్మెంట్లో 50 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఏడు నెలల కాలంగా జీ ఎంటర్ టైన్మెంట్ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. -
‘జీ’ హుజూర్ ఎవరికో..?
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్ దిగ్గజం, కామ్‌కాస్ట్(అమెరికాలో ఎన్బీసీ యూనివర్శల్ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్ మాజీ సీఎఫ్ఓ మైకేల్ ఏంజెలాకిస్ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఎటైర్స్, సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్, భారత చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (జీ ఎంటర్టైన్మెంట్లో వాటా కొనుగోలు కోసం రంగంలో ఉన్న ఏకైక భారత కంపెనీ ఇదే)లు ఇప్పటికే తమ బిడ్లను సమర్పించాయి. కామ్‌కాస్ట్, అటైర్స్ కలిసి సంయుక్తంగా వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. చైనాకు చెందిన టెన్సెంట్, ఆలీబాబాలు కూడా రంగంలోకి వస్తాయనే అంచనాలున్నాయి. కానీ, ఇంతవరకూ ఇవి ఎలాంటి బిడ్లు సమర్పించలేదు. జోరుగా చర్చలు... జీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో వాటా విక్రయ చర్చలు జోరుగానే సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సంప్రదింపులు, మేనేజ్మెంట్లో చర్చలు అన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయని, కొన్ని చర్చలు సీరియస్‌గానే సాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయని, సందర్భానికి తగ్గటు నిర్ణయాలు తీసుకోవడం కోసం వేచి చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాలపై కామ్‌కాస్ట్, సోనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జీ ప్రతినిధి పేర్కొన్నారు. వాటా విక్రయ ప్రక్రియ నిలకడగా కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. అటైర్స్, యాపిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎలాంటి స్పందన ఇప్పటివరకూ వ్యక్తం చేయలేదు. బ్రియాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని కామ్‌కాస్ట్ కంపెనీ మీడియా ఆస్తులను కొని, విక్రయించడం చేస్తోంది. ఈ కంపెనీ కేబుల్ నెట్వర్క్స్, బ్రాండ్‌బాండ్ అసెట్స్, కంటెంట్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, యానిమేషన్ స్డూడియోలు వంటి మీడియా ఆస్తుల క్రయ, విక్రయాలు జరుపుతోంది. రేసులో సోనీ ముందంజ... ఈ రేసులో సోనీ కార్పొ ముందంజలో ఉందని సమాచారం. వేగంగా వృద్ధి చెందుతున్న భారత టీవీ, మీడియా, వినోద రంగాల్లో కామ్‌కాస్ట్, అటైర్స్, యాపిల్.. వంటి సంస్థలకు చెప్పుకోదగ్గ ఉనికి లేదు. ఈ సంస్థలు ఆరంభంలో ప్రమోటర్లతో సమానమైన వాటాను కొనుగోలు చేసి, 3–5 ఏళ్ల తర్వాత పూర్తి వాటాను కొనుగోలు చేస్తాయని అంచనాలున్నాయి. వినోద, మీడియా రంగాల్లో వంద శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేయవచ్చు. అయితే సంక్లిష్టమైన, బహు భాషలతో కూడిన భారత మార్కెట్లో ఏ విదేశీ సంస్థకైనా స్థానిక భాగస్వామి తప్పనిసరి. భారత శాటిలైట్ టెలివిజన్ రంగంలో ముందుగానే ప్రవేశించిన కంపెనీల్లో సోనీ పిక్చర్స్నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్) ఒకటి. వివిధ జోనర్ల కొత్త చానెళ్లను ఆరంభించే జోరును ఇటీవలనే మరింతగా పెంచింది. రెండేళ్ల క్రితం జీ స్పోర్ట్స్ బిజినెస్‌ను రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసి తాజ్ టెలివిజన్(టెన్ స్పోర్ట్స్ బ్రాండ్)గా ప్రసారాలు చేస్తోంది. గత ఏడాది మరాఠి జనరల్ ఎంటర్టైన్మెంట్స్పేస్లోకి ప్రవేశించింది. ఇప్పుడు జీలో వాటా కొనుగోలు సోనీకి ఎంతగానే కలసివస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎస్పీఎన్కు పట్టణ ప్రాంతాల్లోనే, హిందీ మాట్లాడే మార్కెట్లోనే వీక్షకులున్నారు. జీకి మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకూ పాతుకుపోయింది. మొత్తం భారత టెలివిజన్ వీక్షణ మార్కెట్లో జీ వాటా 20% పైనే ఉంటుందని అంచనా. జీలో వాటాను విక్రయిస్తామని సుభాష్ చంద్ర వెల్లడించిన కొన్ని రోజులకే సోనీ కీలక అధికారులు–మైక్ హాప్కిన్స్(సోమీ పిక్చర్స్ టెలివిజన్ చైర్మన్), టోనీ విన్సిక్యెరా (సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్లు) సుభాష్ చంద్రను ఆయన నివాసంలో సందర్శించడం గమనార్హం. కష్టాల్లో సుభాష్ చంద్ర... జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో 50 శాతం వాటాను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్లోనే కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర వెల్లడించారు. అయితే, ఈ పరిణామం తర్వాత కంపెనీ షేరు భారీగా పతనమైంది. గత ఏడాది కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ షేర్ 23 శాతం కుదేలైంది. దీంతో ఈ కంపెనీలో వాటాను ప్రీమియమ్ ధరకు విక్రయించాలన్న సుభాష్ చంద్ర ఆశలు వమ్మయ్యాయి. ఈ కంపెనీలో దేశీ, విదేశీ సంస్థలతో కలుపుకొని ప్రమోటర్ల మొత్తం వాటా 41.62%%. దేశీయ ప్రమోటర్ సంస్థల వాటాలో 85 శాతం వరకూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల వద్ద తాకట్టులో ఉన్నాయి. -
షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జీ గ్రూపు ప్రమోటర్లు ఆరు లిస్టెడ్ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్ మార్కెట్లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, డిష్‌టీవీ, జీ మీడియా కార్పొరేషన్, సిటీ నెట్వర్క్స్, జీ లెర్న్ కంపెనీల్లో వాటాలను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎస్సెల్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రంగంలో చేసిన వ్యాపారాలు బెడిసి కొట్టాయని, భారీ రుణ భారాన్ని తీర్చడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు జీ ప్రమోటర్ సుభాష్‌చంద్ర గత నెల 26న ప్రకటించడం గమనార్హం. అమ్మకాలు వీటిల్లోనే... ►జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల సంస్థలు అయిన... సైక్వేటర్ మీడియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ 1.69 శాతం, ఎస్సెల్ కార్పొరేట్ ఎల్ఎల్పీ 0.85 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ఈవాటాల విక్రయం ద్వారానే ప్రమోటర్లకు రూ.874.11 కోట్లు సమకూరాయి. ►డిష్ టీవీలో వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ 0.86 శాతం, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్ 0.80 శాతం, వీనా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ 0.35 శాతం చొప్పున రూ.97.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ►జీ మీడియా కార్పొరేషన్లో ఏఆర్ఎం ఇన్ఫ్రా అండ్ యుటిలిటీస్ 2.38 శాతం, 25ఎఫ్‌పీఎస్ మీడియా 3.09 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ►సిటీ నెట్‌వర్క్స్‌లో ఆరో మీడియా అండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రైవేటు లిమిటెడ్ 4.50 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ.28.88 కోట్లుగా ఉంది. -
జీ పై జియో కన్ను!!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌పై (జీల్) టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కన్నేసింది. చౌక చార్జీలతో టెలికం రంగాన్ని కుదిపేసిన జియో... తాజాగా మీడియా కంటెంట్ విషయంలోనూ ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీన్లో భాగంగా జీల్లో వాటాలు దక్కించుకోవడంపై దృష్టి సారిస్తోంది. ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాల్లో సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా అంతర్జాతీయ సంస్థలతోనే జట్టు కడతామంటూ వచిన జీల్ ప్రమోటర్లు... తాజాగా దేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పడంతో జియో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) అంతర్జాతీయ దిగ్గజాలు రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీ ఇన్వెస్టరుకు విక్రయించే యోచన.. దీర్ఘకాలికంగా జీల్‌కు మరింత విలువ తెచ్చిపెట్టేలా కంపెనీని తీర్చిదిద్దగలిగే సామర్థ్యమున్న అంతర్జాతీయ సంస్థలకు సగం వాటా దాకా విక్రయించేందుకు సిద్ధమని 2018 నవంబర్‌లో సుభాష్ చంద్ర ప్రకటించారు. కాకపోతే, దేశీ ఇన్వెస్టర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇటీవల జీల్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు కూడా మొదలెట్టామని, మరికొద్ది వారాల్లో డీల్ ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో వంటి దేశీ దిగ్గజాలు కూడా జీల్‌పై దృష్టి సారిస్తున్నాయి. మీడియాలో రిలయన్స్ హవా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇప్పటికే పలు మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్వర్క్18లో 75 శాతం వాటాలు కొనుగోలు చేశారు. న్యూస్‌కి సంబంధించి సీఎన్ఎన్–న్యూస్18, సీఎన్‌బీసీ–టీవీ18, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వయాకామ్ 18తో పాటు సినిమాల నిర్మాణ సంస్థ వయాకామ్18 మోషన్ పిక్చర్స్ వంటివి ఇందులో భాగమే. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సహా పలు భారతీయ భాషల్లో డిజిటల్, పబ్లిషింగ్ సంస్థలూ ఇందులో ఉన్నాయి. రామోజీరావుకు చెందిన ఈటీవీ వివిధ భాషల్లో ఆరంభించిన న్యూస్ ఛానెళ్లు కూడా ప్రస్తుతం నెట్వర్క్–18 చేతిలోనే ఉన్నాయి. 2017 జూలైలో కంటెంట్ ప్రొడక్షన్ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌లో రిలయన్స్ 24.9 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంస్థకి ఆల్ట్‌బాలాజీ పేరుతో ఓవర్–ది–టాప్ (ఓటీటీ) యాప్ కూడా ఉంది. ఇక ఇప్పుడు జీల్లో కూడా వాటాలు కొనుగోలు చేస్తే ఓటీటీ, బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో రిలయన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, దేశీయ నెట్‌ఫ్లిక్స్‌గా ఎదిగేందుకు రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత దన్ను లభిస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సుభాష్ చంద్రకు దక్కేదెంత.. ప్రస్తుతం జీల్లో సుభాష్ చంద్ర, ఆయన కుటుంబానికి 41 శాతం వాటాలుండగా.. ఇందులో 20 శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నారు. వాటాల విక్రయ వార్తలతో డిసెంబర్లో జీల్ షేరు రూ.500 స్థాయికి ఎగియడంతో వీటి విలువ రూ.10,000 కోట్లకు ఎగిసింది. అయితే, శుక్రవారం ప్రతికూల వార్తలతో జీల్ షేరు ఏకంగా 26 శాతం పతనం కావడంతో ఆ రోజు లెక్కల ప్రకారం 20 శాతం వాటాలకు గాను సుభాష్ చంద్రకు రూ. 7,000 కోట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది డిసెంబర్ నాటి విలువతో పోలిస్తే 30 శాతం తక్కువ. అయితే, సోమవారం షేరు కోలుకోవడంతో విలువ మళ్లీ కొంత మేర పెరిగిందని, రూ.8వేల కోట్ల దరిదాపుల్లో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సెల్‌కు బ్యాంకర్ల భరోసా.. షేరు 17 శాతం జూమ్.. రుణాల చెల్లింపు అంశానికి సంబంధించి జీల్ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్, బ్యాంకర్లకు మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం సంస్థ షేరు ఎగిసింది. ఒప్పందం ప్రకారం.. తనఖాలోని ప్రమోటర్ల షేర్లను మూడు నెలల దాకా విక్రయించబోమని, ధర తగ్గినా దీనికి కట్టుబడి ఉంటామని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు భరోసా ఇచ్చాయి. ఈలోగా జీల్లో వాటాలతో పాటు ఇన్ఫ్రా అసెట్స్ మొదలైన వాటిని విక్రయించడం ద్వారా ఎస్సెల్ గ్రూప్ దశలవారీగా రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం.. జీల్ మార్కెట్ విలువ రూ. 30,673 కోట్లుగా ఉండగా.. రూ.7,580 కోట్ల విలువ చేసే షేర్లు తనఖాలో ఉన్నాయి. మరోవైపు, డీమోనిటైజేషన్ అనంతరం గ్రూప్ సంస్థల సందేహాస్పద డిపాజిట్లపై విచారణ జరుగుతోందన్న వార్తలను కంపెనీ ఖండించింది. ఈ సానుకూల అంశాలతో సోమవారం జీల్ షేరు ఏకంగా 17 శాతం ఎగిసి రూ. 372.50 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 19 శాతం కూడా పెరిగి రూ. 380.80 స్థాయిని తాకింది. ప్రతికూల వార్తల మధ్య జీల్ షేరు శుక్రవారం ఏకంగా 26 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఓటీటీ రంగం..రూ.35 వేల కోట్లకు! ఇంటర్నెట్ ద్వారా జరిగే మీడియా కంటెంట్ ప్రసారాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు. 2018లో దేశీ ఓటీటీ మార్కెట్ రూ.3,500 కోట్లుగా ఉండగా.. 2023 నాటికి ఇది పది రెట్ల వృద్ధితో రూ. 35,000 కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో 40 శాతం వాటాతో హాట్‌స్టార్ అగ్రస్థానంలో ఉండగా, జియో టీవీ 18% వాటాతో రెండో స్థానంలో ఉంది. జీ గ్రూప్‌నకు చెందిన జీ5కి 15%, వూట్ (వయాకామ్18)కి 12 శాతం, అమెజాన్ ప్రైమ్ వీడియోకి 1.43 శాతం, నెట్‌ఫ్లిక్స్‌కు 2 శాతం మార్కెట్ వాటా ఉంది. -
జీ కొత్త వ్యూహాలు : 50శాతం వాటా అమ్మకం
సాక్షి, ముంబై: ఎస్సెల్ గ్రూప్‌లోని జీ ఎంటర్టైన్మెంట్లో మేజర్ వాటాను ప్రమోటర్ల విక్రయించనున్నారు. మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ,సుభాష్ చంద్ర ప్రమోటర్‌గా తమ వాటాలో సగభాగాన్ని విక్రయించనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వ్యూహాత్మక బిజినెస్ ప్రణాళికల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్‌నకున్న వాటాలో సగభాగాన్ని విదేశీ సంస్థకు విక్రయించనున్నట్లు పేర్కొంది. జీ గ్రూప్‌ను గ్లోబల్ మీడియా టెక్ సంస్థగా రూపొందించే బాటలో అంతర్జాతీయ భాగస్వామికి ప్రమోటర్ల వాటాలో సగభాగం వరకూ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ అంశంలో సలహాల కోసం అడ్వయిజర్లతో సమావేశమైనట్లు జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఈ బాటలో గోల్డ్‌మన్ శాక్స్ సెక్యూరిటీస్, లయన్ ట్రీ సంస్థలను అంతర్జాతీయ వ్యూహాత్మక సలహాదారుగా నియమించాలని నిర్ణయించింది. ఇది 2019 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ముగించాలని భావిస్తోంది.సెప్టెంబర్ నాటికి జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వాటాను కలిగి ఉంది. బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లో తమ బలం తెలుసు. ఇప్పటికే జీ 5 మార్కెట్లో రెండవ అతిపెద్ద ప్లేయగా ఉంది.. కానీ ప్రపంచ లక్ష్యాలు సాధించడానికి నిర్ణయం తీసుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయెంకా అన్నారు. అలాగే మైనారిటీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబోయే సమయంలో మరింత మెరుగవుతాయని ఆయన చెప్పారు మరోవైపు ప్రమోటర్ల వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. తొలుత 4 శాతం పతనమైంది. వెంటనే కొనుగోళ్ల తిరిగి జోరందుకుంది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 455 ఎగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 470 వరకూ ఎగసింది. -
38 శాతం తగ్గిన జీ ఎంటర్టైన్మెంట్ లాభం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జడ్‌ఈఈఎల్) నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 38 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.625 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.386 కోట్లకు తగ్గిందని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,785 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.2,035 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ పునీత్ గోయెంకా తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,147 కోట్ల నుంచి రూ.1,386 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. చందా, ప్రకటనల ఆదాయాలు పెరుగుతాయ్ ! బ్రాడ్కాస్ట్ వ్యాపారం మంచి వృద్ధిని సాధించిందని పునీత్ వివరించారు. ప్రకటనల, చందా ఆదాయాలు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకటనల ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.1,211 కోట్లకు, చందా ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.608 కోట్లకు ఎగసిందని వివరించారు. భవిష్యత్తులో ప్రకటనల, చందా ఆదాయాలు మరింతగా వృద్ధి చెందగలవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 6.3 శాతం లాభపడి రూ.459 వద్ద ముగిసింది. -
అడాగ్ గ్రూప్ టీవీ చానళ్లు జీ చేతికి
• రేడియో వ్యాపారంలో 49 శాతం వాటా కూడా • లావాదేవీ విలువ రూ. 1,900 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100 శాతం వాటాతో పాటు రిలయన్స రేడియో వ్యాపారంలో 49 శాతం వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ మేరకు ఇరు గ్రూప్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయా కంపెనీల బోర్డులు ఈ ఒప్పందాన్ని ఆమోదించారుు. ఈ మొత్తం లావాదేవీ విలువ రూ.1,900 కోట్లు. జీగ్రూప్ కంపెనీ అరుున జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రెజైస్ తమ టీవీ వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందని, జీ మీడియా కార్పొరేషన్‌కు తమ రెడియో వ్యాపారంలో 49 శాతాన్ని విక్రరుుస్తున్నామని రిలయన్స క్యాపిటల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. తమకు ప్రధానం కాని వ్యాపారాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ విక్రయాలు జరిపినట్లు అడాగ్ తెలియజేసింది. హిందీలో బిగ్ మ్యాజిక్ పేరుతో ఒక కామెడీ చానల్, భోజ్‌పురి భాషలో బిగ్ గంగా పేరుతో ఒక ఎంటర్టైన్మెంట్ చానల్‌ను అడాగ్ గ్రూపు నిర్వహిస్తోంది. అలాగే ఈ సంస్థకు 45 ఎఫ్ఎం రెడియో స్టేషన్లు కూడా ఉండగా... మరో 14 కొత్త లెసైన్సుల్ని ఇటీవల వేలంలో దక్కించుకుంది. ఈ రేడియో వ్యాపారంలో రిలయన్స తనకున్న వాటాను కొత్తగా ఏర్పాటుచేసే ఒక సంస్థకు బదిలీ చేస్తుంది. ఈ కొత్త సంస్థలో జీ 49 శాతం వాటాను తీసుకుంటుంది.