న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్‌వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు.
వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment