terminated
-
SONY: భారత్ మార్కెట్‌కు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో ఇతర అవకాశాలను అన్వేషించనున్నట్లు జపనీస్ దిగ్గజం సోనీ తాజాగా వెల్లడించింది. దేశీ మార్కెట్లో వృద్ధి అవకాశాలరీత్యా మరొక కొత్త ప్రణాళికకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. దీర్ఘకాలంలో భారీ వృద్ధికి వీలున్న దేశీ మార్కెట్లో సొంత కార్యకలాపాలకూ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అత్యంత అవకాశాలున్న భారత్ మార్కెట్లో పెట్టుబడులను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్లు సోనీ ప్రెసిడెంట్, సీవోవో, సీఎఫ్‌వో హిరోకీ టొటోకీ పేర్కొన్నారు. వెరసి వివిధ అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేశారు. కొత్తగా అవకాశం లభిస్తే పాత ప్రణాళికస్థానే అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ‘జీ’తో ప్రతిపాదిత విలీనం రద్దయిన నేపథ్యంలో హిరోకీ భారత్ మార్కెట్లో కంపెనీ వ్యూహాలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గత పెట్టుబడుల ప్రణాళికలు లేదా ఆలోచనల్లో ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని వెల్లడించారు. కల్వెర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్(గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) ద్వారా దేశీయంగా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు హీరోకీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
111 జీవో పూర్తిగా రద్దు
-
నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తొలగింపు
తాడేపల్లిగూడెం: ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థ ఏపీ నిట్ డైరెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న సస్పెండైన నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావును టెర్మినేట్ చేసింది. కాగా, వరంగల్ నిట్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు ఏపీ నిట్‌కు డైరెక్టర్‌గా 2018 మార్చి 19న బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం లేదా 70 ఏళ్ల వయస్సు.. ఏది ముందైతే అప్పుడు డైరెక్టర్ పదవి నుంచి తొలగిపోవచ్చు. ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా, ఇంకా వయస్సు ఉంటే మరోసారి డైరెక్టర్‌గా అవకాశం తెచ్చుకోవచ్చు. నిట్ తాత్కాలిక ప్రాంగణం నుంచి సొంత భవనానికి వచ్చే సరికి సీఎస్పీ రావుపై అభియోగాలు మొదలయ్యాయి. రావుకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిట్ రెండు, మూడో స్నాతకోత్సవాలు జరిగాక రావు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, రాష్ట్రపతి భవన్, కేంద్ర ఉన్నత విద్యా శాఖ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి, ఈ ఏడాది మార్చిలో 60వ పుట్టిన రోజు వేడుకలను సీఎస్పీ రావు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఆ మరునాడే సీబీఐ కేసులు నమోదు కావడం, సీఎస్పీ రావు సస్పెండ్ కావడం జరిగింది. జూన్ 27న సస్పెన్షన్‌ను మరో 90 రోజులు పొడిగించారు. ఇదే సమయంలో సీఎస్పీ రావుపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై విచారణకు రాష్ట్రపతి కార్యాలయం అనుమతితో జూన్ 27న వన్‌మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. పూర్తి ఆధారాలను సేకరించింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఉన్నత విద్యా సంస్ధగా ఉన్న ఏపీ నిట్ డైరెక్టర్ స్థాయి వ్యక్తిగా రావు వ్యవహరించలేదని కమిటీ నివేదికను ఇచి్చంది. డైరెక్టర్ పదవికి అనర్హుడిగా తేలి్చంది. ఈ నివేదిక ఆధారంగా సెంట్రల్ సివిల్ సరీ్వస్ రూల్సును అనుసరించి సీఎస్పీ రావును డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచి్చంది. దీని ప్రకారం మాతృ సంస్థ వరంగల్ నిట్‌కు సీఎస్పీ రావు రిపోర్టు చేయాలి. అభియోగాలపై క్రమశిక్షణ చర్యలు అక్కడ తీసుకోవాలనేది ఉత్తర్వుల్లో ఉన్న సారాంశం. -
సింగర్ చిన్మయిపై వేటు : మీటూ ఎఫెక్ట్?
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఇండియాలో విస్తృతమైన ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా పేర్కొనదగిన వ్యక్తి. ముఖ్యంగా తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. తాజాగా తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని చిన్నయి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనను డబ్బింగ్ యూనియన్నుంచి తొలగించారని ప్రకటించారు. అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్ త్రిషకు చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ఆమె ట్వీట్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే డబ్బింగ్ యూనియన్ ద్వారానే తనపై తొలి వేటు తాను ముందే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ పరిణామంపై నటి మంచు లక్ష్మి కూడా స్పందించారు. ఇది ఇలా వుంటే ఈ ప్రమాదాన్ని చిన్మయి ముందే ఊహించారు. తమిళ సినీ రంగంలో పేరొందిన నటుడు, యూనియన్ అధ్యక్షుడు రాధా రవి కారణంగా తన డబ్బింగ్ కరియర్ ప్రమాదంలో పడనుందంటూ అక్టోబర్ 9న ఒక ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు గత రెండు సంవత్సరాలుగా డబ్బింగ్ యూనియన్‌కు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుమును చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు. మరి ఇన్నిరోజులుగా పలు సినిమాలకు చిన్మయి డబ్బింగ్ ఎలా చెప్పింది అన్న ప్రశ్నకు స్పందించిన సంఘం.. కేవలం పేరున్న ఆర్టిస్ట్ అన్నగౌరవంతోనే ఆమెకు మినహాయింపు నిచ్చినట్టు చెప్పుకొచ్చారు. కాగా సినీ నేపథ్యగాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో సమంత, తమిళంలో త్రిషలాంటి హీరోయిన్లకు చిన్మయి తన గొంతును అరువిచ్చారు. వారి నటనకు చిన్మయి డబ్బింగ్ ప్రాణం పోసిందంటే అతిశయోక్తి కాదు. Sooo given to understand that I have been terminated from the dubbing union. Which means I can longer dub in Tamil films henceforth. The reason stated is that I haven’t paid ‘subscription fees’ for 2 years though this hasn’t stopped them from taking 10% off my dubbing income — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 I can see my Dubbing career go up in smoke now. He heads the dubbing union. — Chinmayi Sripaada (@Chinmayi) October 9, 2018 Anyway I always knew my career would be done with. Society is run by the powerful. The predators will NEVER be questioned. Neither will disciplinary action be taken against them. Fact that Mr Radha Ravi is still President of the Dubbing Union despite all the allegations https://t.co/gFrQJJuXIa — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2018 Wth!!! They cant do that to you!! This is ridiculous!! https://t.co/4IW4yLAwUC — Lakshmi Manchu (@LakshmiManchu) November 17, 2018 -
# మీటూ : మరో వికెట్ ఔట్
న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్ (55)కు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో పలువురి గోముఖ వ్యాఘ్రాల బండారం బట్టబయలవుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులపై సంబంధిత చర్యలకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విశేషం. ఈ క్రమంలో టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్ చర్యలకు దిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుహేల్ సేథీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. టాటా గ్రూపులో ప్రధాన భాగామైన టాటా సన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోసించిన సేథ్తో కలిసి పనిచేయమని తేల్చి చెప్పింది.నవంబర్ 30, 2018 నముగియనుంది కానీ, నెల రోజుల నోటీసుతో నెలముందే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టాటా సన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే ఆరోపణలు వెల్లువెత్తిన సమయం నుంచి టాటా సన్స్ కౌన్సెల్జీ అతనితో సంబంధాలను నిలిపివేసినట్టు చెప్పారు. కాగా ఇటీవల ఇండియాలో సోషల్ మీడియా ద్వారా మీడియా రంగంలో మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్ని రంగాల్లోని ‘పెద్దమనుషు’ల బండారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే సుహేల్ సేథ్‌పై కూడా వరుస ఆరోపణల వెల్లువ కురిసింది. మోడల్,మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ డియాండ్రా సోర్స్, చిత్రనిర్మాత నటాషా రథోర్, జర్నలిస్టు మందాకిని గెహ్లాట్, రచయిత ఇరా త్రివేదిలతో సహా ఆరుగురు మీటూ పేరుతో సేథ్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
జపాన్ పార్లమెంట్ రద్దు
టోక్యో: జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే గురువారం ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ‘కఠిన పరీక్ష ఈ రోజే మొదలైంది, ప్రజల ప్రాణాల్ని కాపాడటం కోసమే ఈ ఎన్నిక. అంతర్జాతీయ సమాజంతో కలిసికట్టుగా సాగుతూ.. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమంతా పోరాడాల్సిన అవసరముంది’ అని అబే పేర్కొన్నారు. ఉత్తర కొరియా విషయంలో అనుసరిస్తున్న దృఢమైన విదేశీ విధానానికి దేశ ప్రజలు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో షింజో అబే ప్రధాన ప్రత్యర్థిగా టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ‘పార్టీ ఆఫ్ హోప్’ పార్టీని స్థాపించిన ఆమె అబేకు గట్టి సవాలు విసురుతున్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌లో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున దాన్ని అవకాశంగా మలచుకునేందుకే పార్లమెంట్‌ను రద్దు చేశారని భావిస్తున్నారు. -
ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట
ముంబై: తప్ప తాగి ఇద్దరి మృతికి కారకురాలైన మహిళా లాయర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ముంబై ఆర్టీవో జీవిత కాలం రద్దు చేశారు. వివరాలు... మద్యం మత్తులో జాహ్నవి గడ్కర్ (35) అనే న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్లో నడిపి ఓ టాక్సీని ఢీకొట్టింది. గత ఏడాది జూన్ 10న జరిగిన ఈ సంఘటనలో టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు మరణించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే.