ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట | Mumbai hit-and-run: Jhanvi Gadkar's driving license terminated for life | Sakshi
Sakshi News home page

ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట

Published Tue, Jan 19 2016 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట

ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట

ముంబై: తప్ప తాగి ఇద్దరి మృతికి కారకురాలైన మహిళా లాయర్  డ్రైవింగ్ లైసెన్స్ను ముంబై ఆర్టీవో జీవిత కాలం రద్దు చేశారు. వివరాలు... మద్యం మత్తులో జాహ్నవి గడ్కర్ (35) అనే న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్లో నడిపి  ఓ టాక్సీని ఢీకొట్టింది. గత ఏడాది జూన్ 10న జరిగిన ఈ సంఘటనలో టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు మరణించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement