Driving license
-
ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే!
డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చే దరఖాస్తుదారులు సిమ్యులేటర్, 108 కెమెరాల పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (DTC) డ్రైవింగ్ పరీక్షను మరింత కష్టతరం చేయనుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ మోసాలను అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.ఇప్పటి వరకు ఇలా..ఇప్పటి వరకు డివిజనల్ రవాణాశాఖ కార్యాలయంలో మాన్యువల్‌గా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేవారు. ఏదో ఫార్మాలిటీగా మాత్రమే ఈ పరీక్ష ఉండేది. దీంతో డ్రైవింగ్ తెలియని వారు కూడా పరీక్ష రాసేవారు. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.‘జనవరి 16 నుంచి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇందులో కెమెరాలు, సిమ్యులేటర్లు ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో మోసానికి ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ తెలిసిన వారు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉన్నవారు మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు’ అని ప్రాంతీయ రవాణా అధికారి ప్రమోద్ కుమార్ సింగ్ చెబుతున్నారు.ఘజియాబాద్‌లో ప్రతిరోజూ సగటున 225 మంది మాన్యువల్ డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతున్నారు. అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ కోసం డిపార్ట్మెంట్ డీటీసీని ఏర్పాటు చేసింది. డీటీసీ పనులు పూర్తయ్యాయి. డీటీసీలో 108 కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.డ్రైవర్ పరీక్ష ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారా అనేది అధికారులు నిర్ణయిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల ప్రతి కదలికనూ వీడియో రికార్డింగ్ చేస్తారు.దరఖాస్తుదారు డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నియమాలన్నింటినీ తెలుసుకోవాలి. డ్రైవింగ్‌తో పాటు ప్రతి నియమం తెలిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దీంతో టెస్టింగ్‌లో మోసాలు పూర్తిగా నిలిచిపోతాయి. 108 కెమెరాల వీడియో రికార్డును కేంద్రంలో భద్రంగా ఉంచుతారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.సిమ్యులేటర్ అంటే ఏమిటి?సిమ్యులేటర్ అనేది నిజమైన కారుకు ప్రతిరూపం. ఇందులో స్టీరింగ్ వీల్, గేర్లు, బ్రేక్‌లు, పెడల్స్, సూచికలు, స్విచ్‌లు, స్పీడ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిమ్యులేటర్ నడుస్తుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగశాలగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారా ఎకో డ్రైవింగ్ శిక్షణ కూడా అందించవచ్చు. -
సిటీ స్కై డ్రోన్స్ ఫ్లై
సాక్షి, హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.యాచారంలో డ్రోన్ అకాడమీ..ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్ఓ’ డ్రోన్‌ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్‌లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.ఔషధాల సరఫరా కోసంనగర శివార్లలోని బీబీనగర్‌లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్‌తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్‌లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్‌తో మందులను సరఫరా చేస్తున్నారు.వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభంవ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్‌కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.వాతావరణ మార్పుల పరిశీలనకూ..నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్‌తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.అటవీశాఖ పరిధిలోనూ..అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలిలైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరంవాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్‌ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్‌కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.ఫీజు రూ. 38వేలు...నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.డ్రోన్లతో స్టార్టప్‌లు పెడుతున్నారువయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది. -
శభాష్.. తాన్సేన్
● రెండు చేతులు లేని దివ్యాంగుడికి డ్రైవింగ్ లైసెన్స్ ● రాష్ట్రంలోనే తొలిసారి.. నేడు ప్లస్–2 ఫలితాల విడుదలకొరుక్కుపేట: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. రెండు చేతుల లేని ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందాడు. రాష్ట్రంలో కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి దివ్యాంగుడిగా చైన్నెకి చెందిన తాన్సేన్ గుర్తింపు పొందాడు. 31 ఏళ్ల తాన్సేన్ చైన్నెలోని వ్యాసార్పాడి పెరియార్‌నగర్‌కు చెందినవాడు. ఇతనికి 10 సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తూ గ్యాస్ పంప్లో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో ఇతని చేతులను మోచేయి కిందికి తీసేయాల్సి వచ్చింది. దీంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేతులు లేకపోవడం మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా ఏ సహాయం లేకుండా తన దైనందిన పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకున్నాడు. కాళ్లతోనే.. ఆ తర్వాత కాళ్లతో రాయడం, ఈత కొట్టడం, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. తన పాఠశాల విద్యను పూర్తి చేసి, ఇంజినీరింగ్ చదివిన తర్వాత, అతను న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది. బయటకు వెళ్లటం కష్టంగా మారుతుండడంతో కారు నడపాలనుకున్నాడు. అనుకుందే తడువుగా స్నేహితుల సహకారంతో కాళ్లతోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం, చైన్నె కె.కె. నగర్‌లోని రిహాబిలిటేషన్ ఆసుపత్రికి వెళ్లగా కారు డిజైన్‌కు ఆయనకు అనువుగా మార్చాలని తెలిపారు. ఆసుపత్రి ఫిజియోలాజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ గునార్ తిరునావుక్కరసు, వైద్యులు మార్గనిర్దేశం చేశారు. సాక్షి, చైన్నె: ప్లస్–2 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. వివరాలు.. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 7,534 ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 7.72 లక్షల మంది రెగ్యులర్, 21,875 మంది ప్రైవేటు, 125 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. గ్రేటర్ చైన్నె పరిధిలోని 405 పాఠశాలల నుంచి 45 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎన్నికల సీజన్ కావడంతో సకాలంలో వాల్యుయేషన్ ప్రక్రియను ముగించి, ముందుగా నిర్ణయించిన మేరకు ఫలితాలను విడుదల చేయడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 40 వేల మంది ఉపాధ్యాయులు సకాలంలో మూల్యాంకనాన్ని ముగించారు. మార్కుల జాబితాను గత వారం రోజు లుగా అధికారులు సిద్దం చేస్తూ వచ్చారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎన్నికల యంత్రాంగం అనుమతితో సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ ఫలితాలను విడుద ల చేయాడానికి సిద్ధమయ్యారు. ఉదయం 9.30 గంటలకు చైన్నెలో ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు రిజిస్టడ్ చేసుకున్న మొబైల్ నంబర్లకు తక్షణం ఎస్ఎంఎస్ రూపంలో ఉత్తీర్ణత శాతం వివరాలను తెలియజేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా పాఠశాలలోని నోటీసు బోర్డులలో ఫలితాలను ప్రకటించనున్నారు. అంతే కాకుండా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. డీజీఈ.టీఎన్.జీఓవీ.ఇన్, డీజీఈ1.టీఎన్.జీఓవీ వెబ్సైట్ల ద్వారా మార్కుల జాబితాను అందుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే 10వ తేదీన ముందుగా నిర్ణయించిన మేరకు పదో తరగతి ఫలితాలనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఎట్టకేలకూ.. అన్ని నిబంధనలను పూర్తి చేసి రెట్టేరి ఆర్టీఓ కార్యాలయంలో తాన్సేన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. కేకే నగర్‌లోని గవర్నమెంట్ ఇనన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ మెడిసిన్ వైద్యులు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత చైన్నె నార్త్ ఆర్టీఓ కార్యాలయం తాన్సేన్కు మోడిఫైడ్ కారును నడపడానికి 10 సంవత్సరాల లైసెన్స్‌ను జారీ చేసింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తమిళనాడులోనే మొదటి దివ్యాంగుడిగా తాన్సేన్ గుర్తింపు పొందాడు. రెండు చేతులు లేకుండా లైసెన్స్ పొందిన దేశంలో మూడవ వ్యక్తి కూడా ఆయనే. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయ్యింది. -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
కార్డులెస్.. లైసెన్స్
వాహనంపై వెళుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా రవాణాశాఖ అధికారులు ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ చూపించు అని అడుగుతుంటారు. ఆ సమయంలో పత్రాలు అందుబాటులో లేని వాళ్లు సార్ ఇంట్లో పెట్టి వచ్చాననో, మర్చిపోయాననో చెప్పి అక్కడి నుంచి బయటపడుతుంటాం. కానీ ఇక నుంచి ఆ ఇబ్బంది లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి రవాణాశాఖ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటివి మన ఫోన్లోనే భద్రపరుచుకుని, తనిఖీల సమయంలో చూపించే వెసులుబాటు కలి్పంచింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రవాణాశాఖ ఇటీవల వరకు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేసేది. టూ వీలర్, ఫోర్ వీలర్, హెవీ వెహికల్ లైసెన్స్‌లు.. ఇలా పలురకాల లైసెన్స్‌లను మంజూరు చేసేది. ఇందుకోసం రవాణా శాఖ ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను ప్రింట్ చేసి లైసెన్స్ కార్డులుగా ఇప్పటి వరకు ఇస్తూ వచ్చింది. దీని కోసం పోస్టల్ చార్జీలు, లైసెన్స్ ఫీజు కింద రూ.235 వరకు చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం రవాణాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం కార్డు లెస్ డ్రైవింగ్ లైసెన్స్‌లను మంజూరు చేస్తున్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారుడికి అన్ని డ్రైవింగ్ టెస్టులు నిర్వహించిన తరువాత లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. అయితే నూతన విధానంలో ఎలాంటి కార్డులు ఇవ్వకుండా కేవలం ఆన్లైన్లో రవాణాశాఖ మంజూరు చేసిన లైసెన్స్ పత్రాలను వాహనదారుడి ఫోన్‌కు పంపుతారు. ఆ పత్రాలను వాహనదారుడే నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు లేదా తన ఫోన్లోనే భద్రపరుచుకోవచ్చు. అధికారులు అడిగినప్పుడు ఫోన్లోనే తన డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపే అవకాశాన్ని కలి్పంచారు. ఈ విధానంలో లైసెన్స్ కోసం వాహనదారుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా తనిఖీకి వీలు దేశం మొత్తం ఒకే డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలా వద్దా అనే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నూతన డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ లైసెన్స్ పత్రాలను మన ఫోన్లో, డిజి లాకర్‌లోనూ భద్రపరుచుకోవచ్చు. రవాణాశాఖ మంజూరు చేసే ఈ పత్రాలను దేశంలో ఎక్కడైనా తనిఖీల సమయంలో అధికారులకు చూపించవచ్చు. సదరు అధికారికి ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఆన్లైన్లో చెక్ చేస్తే సదరు వాహనదారుడికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. పాత విధానంలో ఈ సదుపాయం ఉండేది కాదు. వాహనదారుడి వివరాలు తెలుసుకోవడం, లైసెన్స్ సరైనదా కాదా అని పరిశీలించడం కాస్త కష్టతరంగా ఉండేది. కానీ నూతన విధానంలో తనిఖీ అధికారులు వాహనదారుడి పూర్తి సమాచారం క్షణాల్లో పొందవచ్చు. ఈ విధానం తనిఖీలకు సులభతరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌కి కార్డులు ఉండవు నూతన విధానంలో లైసెన్స్‌ల మంజూరు చేసిన తరువాత ఎలాంటి ప్రింటెడ్ కార్డులు ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో మాత్రమే లైసెన్స్ పత్రాలను పంపుతారు. వీటిని వాహనదారుడు ప్రింట్ తీసుకుని తన వద్ద ఉంచుకోవచ్చు. అలాగే ఫోన్లో కూడా భద్రపరుచుకోవచ్చు. అధికారుల తనిఖీల సమయంలో ఈ పత్రాలను చూపితే సరిపోతుంది. – ఎస్కే ఎండీ రఫి, ఎంవీఐ, కందుకూరు -
ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే 'డ్రైవింగ్ లైసెన్స్' అక్కర్లేదు - అవేంటో ఇక్కడ (ఫొటోలు)
-
అందాల చిన్నది లగ్జరీ కారు: ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్ చూడాలి!
సాక్షి, ముంబై: బాలనటి, టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. రివా అరోరా (13)రూ. 44 లక్షల విలువైన ఆడి కారును సొంతం చేసుకుంది. ఈమేరకు బ్లాక్ ఆడి కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ('డ్రైవింగ్ లైసెన్స్ బనా హై?') అంటూ మరి కొంతమంది ప్రశ్నించారు. రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తల్లి నిషా ఆమెకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది. 44 లక్షలకు పైగా విలువైన బ్లాక్ ఆడి క్యూ3 కారుతో ఫోజులిస్తూ రివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను తమ ప్యాన్స్‌తో పంచుకుంది. కొంచెం ఆలస్యమైనాగానీ, మొత్తానికి సెలబ్రేట్ చేసుకుంటున్నా..ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. 10.6 మిలియన్ ఇన్‌స్టా ఫ్యామిలీ ఎంతో అపురూపమైన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో లైసెన్స్ ఉందా ముందు లైసెన్స్ తీసుకో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రివా అరోరా ఎవరంటే? రివా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాదు మామ్, మణికర్ణిక, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ది సర్జికల్ స్ట్రైక్ , గుంజన్ సక్సేనాలో నటించింది. ఆమె చివరిగా రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతో ఆకట్టుకుంది. కాగా మికా సింగ్, కరణ్ కుంద్రాలతో రొమాంటిక్ రీల్ చేయడంపై చిన్నపిల్లతో డ్యాన్సులా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 2010లో పుట్టిందని భావిస్తున్న రివా వయసుపై వివాదం ఉంది. అయితే తన వయసు 12 కాదంటూ రివా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే రివా వయసు 12 కాదు 16 ఏళ్ల అని నిషా తల్లి ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) -
Telangana: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి చిప్ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది. గతంలో విచ్చలవిడిగా నకిలీ కార్డులు రావడంతో వాటిని అడ్డుకునే క్రమంలో రవాణాశాఖ చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కానీ 40 రోజులుగా చిప్‌ల కొరతతో కార్డుల జారీ నిలిచిపోయింది. ఆరు లక్షల వరకు కార్డుల జారీ పేరుకుపోయింది. విదేశాల నుంచి చిప్‌ల దిగుమతి నిలిచిపోవటంతో తప్పనిస్థితిలో మళ్లీ పాతపద్ధతిలో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కార్డులు లేకపోవటంతో తనిఖీల్లో పోలీసులు చలానాలు రాస్తుండటం, రాష్ట్ర సరిహద్దుల్లో సమస్యలు ఎదురవుతుండటంతో గందరగోళంగా మారింది. ఈ మొత్తం పరిస్థితిని వారం కిందట ‘తైవాన్ చిప్ ఆగింది.. కార్డుల జారీ నిలిచింది’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో నిలిచిపోయిన కార్డులన్నింటినీ చిప్‌లు లేకుండా వెంటనే జారీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. చిప్ లేని కార్డుల జారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మళ్లీ రెండుమూడు నెలల్లో చిప్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్న రవాణాశాఖ.. అప్పటి వరకు చిప్ లేకుండానే కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చిప్ ఉన్నా రీడర్లు లేవు.. వాహనం, దాని యజమానికి సంబంధించిన వివరాలను చిప్‌లో నిక్షిప్తం చేసి దాన్ని స్మార్ట్‌కార్డులో పొందుపరుస్తారు. పోలీసులు తనిఖీ సమయంలో కార్డును చిప్ రీడర్ పరికరం ముందు ఉంచగానే ఆ వివరాలు ఆ రీడర్లో కనిపిస్తాయి. కానీ మన అధికారుల వద్ద పరిమితంగానే చిప్ రీడర్లు ఉన్నాయి. దీంతో చిప్‌ఉన్నా దాని ఆధారంగా వివరాలు స్కాన్ చేసే వీలు లేకుండాపోయింది. ఇప్పుడు చిప్ లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదన్న భావనతో చిప్ లేని కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఇప్పుడు చిప్ లేని కార్డుల జారీ మొదలైతే మళ్లీ నకిలీ కార్డులతో కేటుగాళ్లు దందా చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరలో చిప్‌లు తెప్పించి మళ్లీ చిప్ ఉండే కార్డులను జారీచేస్తామని రవాణాశాఖ చెబుతోంది. గతంలో చైనా, ఉక్రెయిన్, తైవాన్ దేశాల నుంచి చిప్‌లు దిగుమతి అయ్యేవి. చైనా నుంచి దిగుమతిని కేంద్రం నిషేధించగా, యుద్ధంతో ఉక్రెయిన్ చిప్‌లు రావడంలేదు. స్థానికంగా వినియోగం పెరగడంతో తైవాన్ కూడా ఆపేసింది. -
గుడ్ న్యూస్: ఆర్టీవో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పరీక్ష లేకుండా లైసెన్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఆర్సీలు, లైసెన్సులు రావట్లే!
సాక్షి, హైదరాబాద్: సుధీర్ నెల క్రితం కొత్త వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డు మాత్రం అతనికి అందలేదు. కర్నూలుకు వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఫోన్లో ఉన్న ఆర్సీని చూపాడు. కానీ స్మార్ట్ కార్డు కావాల్సిందేనని పట్టుబట్టిన అధికారులు, రూ.4 వేల ఫైన్ వసూలు చేశారు. కార్డు సిద్ధమైనా బట్వాడా జరగకపోవడమే ఇందుకు కారణం. ఒక్క ఆర్సీ కార్డులే కాదు.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, డూప్లికేట్లు సంబంధిత స్మార్ట్ కార్డులు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రోజుకు దాదాపు 15 వేలకు పైగా కార్డులు సిద్ధమవుతాయి. వీటిని స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులకు పంపాలి. బట్వాడా చేసే బాధ్యత తపాలాశాఖది. కానీ గత రెండు నెలలుగా తపాలాశాఖ ఆ బట్వాడా జరపటం లేదు. దీంతో కార్డులన్నీ కార్యాలయాల్లోనే ఉండిపోతున్నాయి. బట్వాడా ఎందుకు నిలిచింది? ఏ స్మార్ట్ కార్డునైనా ఆ ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో వాహనదారులకు పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు బట్వాడా చేసినందుకు ప్రతి కార్డుకు రూ.17 చొప్పున పోస్టల్ చార్జీ కింద తపాలా శాఖకు రవాణా శాఖ చెల్లిస్తుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఏకంగా రూ.నాలుగైదు కోట్ల మొత్తాన్ని రవాణా శాఖ బకాయి పడింది. ఆ బకాయిల కోసం అడిగీఅడిగీ విసిగిపోయిన తపాలా శాఖ రెండు నెలల క్రితం బట్వాడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నా.. వాహనదారులు ఆయా సేవల కోసం రవాణా శాఖలో దరఖాస్తు చేసినప్పుడే, నిర్ధారిత ఫీజుతో పాటు సంబంధిత స్మార్ట్ కార్డు ఇంటికి పంపేందుకు గాను పోస్టల్ చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. వాహనదారుల నుంచి రూ.35 వసూలు చేస్తున్నా.. తపాలా శాఖకు మాత్రం రూ.17 మాత్రమే చెల్లిస్తోంది. అంటే జనం నుంచి రెట్టింపు మొత్తం రవాణాశాఖ వసూలు చేస్తోందన్నమాట. అయినా సదరు చార్జీలు తపాలా శాఖకు చెల్లించకుండా బకాయి పడింది. ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఆ మొత్తం అందక పోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆడిట్ అభ్యంతరంతో.. తపాలాశాఖ ‘బుక్ నౌ.. పే లేటర్’అన్న నినాదాన్ని అవలంబిస్తోంది. చార్జీలు ముందుగా చెల్లించకున్నా సేవలు అందిస్తుంది. ఇలా ఏడాదిగా రవాణా శాఖ చెల్లించకున్నా సేవలు కొనసాగించింది. కానీ రెండు నెలల క్రితం అంతర్గత ఆడిట్ విభాగం దీన్ని తప్పుబట్టింది. రవాణా శాఖ దరఖాస్తుదారుల నుంచి చార్జీలు వసూలు చేసి కూడా పోస్టల్‌కు చెల్లించకపోవడం సరికాదని, అలాంటప్పుడు సేవలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ బట్వాడా నిలిపివేసింది. వాహనదారులు కార్డు అందలేదని కార్యాలయాలకు వచ్చి నిలదీస్తే రవాణా శాఖ సిబ్బంది అప్పటికప్పుడు వెతికి ఇస్తున్నారు. మిగతావారు ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. మొత్తం మీద అన్ని రుసుములు చెల్లించిన తర్వాత కూడా, కార్డుల బట్వాడాలో రవాణా శాఖ వైఫల్యం కారణంగా వాహనదారులు తనిఖీల సమయంలో జరిమానాలు కట్టాల్సి వస్తోంది. -
TS: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ప్రకటన లేకుండా ఉద్యోగ అర్హత నిబంధనల్లో మార్పులు చేయటం మహిళా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి అటుంచితే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది. అయితే, రవాణాశాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) 113 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్–1లో 54, మల్టీజోన్–2లో 59 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. వీటిలో మహిళలకు 41 పోస్టులు రిజర్వ్ చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా తత్సమాన విద్యార్హత, మూడేళ్ల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమాలను విద్యార్హతలుగా ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. నోటిఫికేషన్ వెలువడ్డ తేదీ నాటికి మహిళా అభ్యర్థులు కూడా కచ్చితంగా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. గతంలో ఈ పోస్టుకు ఈ నిబంధన లేదు. మహిళలకు మినహాయింపు ఉండటంతో చాలామంది ఆ లైసెన్సు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు వారెవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు లైసెన్సు తీసుకుని ఉండేలా నిబంధన మార్చాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. ఆ లైసెన్సు తీసుకోవటానికి తగు సమయం ఇవ్వాలని, తరువాతే దరఖాస్తులు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో, ఆ మేరకు సడలింపు ఇస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సానుకూలంగా నిబంధన మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇది కూడా చదవండి: బల్దియాపై పిడుగు -
డ్రైవింగ్ టెస్ట్.. ఇకపై అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్‌గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్‌లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి,చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం ఇలా మొత్తం ఇక్కడ 13 ట్రాక్‌లు ఉన్నాయి. ఎంవీ(మోటార్ వెహికల్)కు సంబంధించి 5 ట్రాక్‌లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్‌పిన్ ట్రాక్, బ్యాలన్స్ బ్రిడ్జి ట్రాక్, రఫ్ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్ వంటి ట్రాక్‌లు ఉన్నాయి. ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్)లో కూడా 5 ట్రాక్‌లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్లు ఉంటాయి. హెచ్ఎంవీ (హెవీ మోటార్ వెహికల్)లో మూడు ట్రాక్‌లు మాత్రమే ఉండగా, హెచ్ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్ చేశారు. ఈ ట్రాక్‌ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్‌లోను బొలెట్స్ (సెన్సర్‌ను అమర్చిన పోల్స్) అమర్చారు. దీంతో పాటు ఆర్ఎఫ్ రీడర్స్ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డులు –13, సిగ్నల్ స్తంభాలు 13, కంప్యూటర్ పరికరాలు 15, మానిటర్ 2, ఒక కియోస్క్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్, నెట్ వర్కింగ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్ ట్రయల్‌కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్ రూమ్ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. డ్రైవింగ్ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. ఆటోమెటిక్ పద్ధతి ద్వారా ఎల్ఎల్ఆర్ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ ట్రయల్‌కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్ఎల్ఆర్ నంబరు నమోదు చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్ రూమ్‌లో బయోమెట్రిక్ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్‌లోకి వెళ్లేముందు ఆర్ఎఫ్ రీడర్‌కు ట్యాగ్‌ను మ్యాచింగ్కు చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ సిగ్నల్‌ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్ వద్ద ట్యాగ్‌ను మ్యాచింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్‌లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్ మార్క్ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్ రూపంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్ ట్రయల్‌లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్ పడనుంది. పనులు పూర్తయ్యాయి ట్రాక్ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్ విధానం ద్వారానే ట్రయల్ ఉంటుంది. సెన్సార్ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి. – బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
బతుకు బండి: బామ్మ స్టీరింగ్... బంగారు డ్రైవింగ్
భర్త చనిపోయిన దుఃఖం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న రాధామణి, బతుకు మార్గంపై దృష్టి పెట్టింది. వ్యాపారం చేసిన అనుభవం లేదు. ఆర్థిక స్థోమత అంతకంటే లేదు. తనకు తెలిసిన ఏకైక విద్య డ్రైవింగ్. ముప్పై సంవత్సరాల వయసులో భర్త లలాన్ దగ్గర స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంది రాధామణి. మొదట్లో ఎంత భయమేసిందో! అయితే ఆ భయం కొన్ని రోజులే. ఆ తరువాత భయం స్థానంలో ఇష్టం ఏర్పడింది. స్కూటర్ డ్రైవింగ్‌ను పర్ఫెక్ట్గా నేర్చుకుంది. కేరళలోని తొప్పుంపేడి పట్టణానికి చెందిన రాధ స్కూటర్ డ్రైవింగ్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. కారు, బస్, లారీ, ట్రాక్టర్, ఆటో–రిక్షా, క్రెన్, రోడ్ రోలర్ అండ్ జేసిబి, కంటేనర్ ట్రక్...ఇలా 11 వాహనాలను నడపడంలో లైసెన్స్ తీసుకుంది. కేరళలో హెవీ వెహికిల్ లైసెన్స్ తీసుకున్న తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది రాధామణి. కొన్ని సంవత్సరాల క్రితం... తొప్పుంపేడి నుంచి చెర్తాలం వరకు రాధామణి బస్సు నడిపినప్పుడు, ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు. ‘నా దృష్టిలో ఒక కొత్త వాహనం నేర్చుకోవడం అంటే, కొత్త బడిలో చేరడం లాంటిది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. దీనికి ఏకైక కారణం డ్రైవింగ్ అని చెబుతుంటాను’ అంటుంది 71 సంవత్సరాల రాధామణి. ఆమెను అందరూ ‘మణియమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తన పిల్లలతో కలిసి తొప్పుంపేడిలో మొదలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కు అనూహ్యమైన ఆదరణ ఏర్పడింది. కాలేజి స్టూడెంట్ రీతిక ఇలా అంటుంది... ‘గతంలో డ్రైవింగ్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాలేజీలో చేరిన తరువాత మాత్రం బండి నేర్చుకోవడం తప్పనిసరి అనిపించింది. వెంటనే మణియమ్మ డ్రైవింగ్ స్కూల్ గుర్తొచ్చి చేరిపోయాను. అమ్మాయిలు ఇక్కడ సేఫ్టీగా ఫీలవుతారు. మణియమ్మ దగ్గరికి వెళితే డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపించదు. బామ్మ దగ్గరకు వెళ్లినట్లు అనిపిస్తుంది. చాలా సరదాగా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నేను టూవీలర్స్ మాత్రమే కాదు కారు కూడా నడుపుతున్నాను’ మణియమ్మ భర్త కోచిలో ‘ఏ టు జెడ్’ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్కూల్ మూతపడింది. అయితే ఇప్పుడు తొప్పుంపేడిలోని ‘డ్రైవింగ్ స్కూల్’లో అడుగడుగునా భర్తను చూసుకుంటుంది మణియమ్మ! -
ఆర్టీసీతో కలిసి డ్రైవింగ్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక డ్రైవింగ్ స్కూలు చొప్పున ఏర్పాటుకు ఆర్టీసీతో కలసి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ తదితరాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. రహదారి భద్రత నిధికి సంబంధించి ప్రత్యేకంగా ఖాతా, అధికారులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ట్రామా కేర్ సెంటర్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి చోటా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను నెలకొల్పాలన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా సహాయ, పునరావాస కేంద్రాన్ని విశాఖలో ఉంచాలని, తిరుపతి బర్డ్ ఆస్పత్రిలోని కేంద్రాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. వేర్వేరుగా లేన్ మార్కింగ్ రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు లేన్ మార్కింగ్ చాలా స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు విడివిడిగా ప్రత్యేక లైన్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఎంత వేగంగా వెళ్లవచ్చో సూచిస్తూ బోర్డులు అమర్చడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్నారు. 1,190 బ్లాక్ స్పాట్స్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 1,190 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడంతో పాటు 520 చోట్ల నివారణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారులపై కూడా 78 బ్లాక్ స్పాట్స్‌ను సవరించినట్లు చెప్పారు. రహదారుల పక్కన నిర్వహించే ధాబాల్లో మద్యం విక్రయించకుండా అరికట్టడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలన్నారు. జిల్లాలవారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలు, తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలన్నారు. 108 ఆపద్బాంధవి.. రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడటంలో 108 అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చాలన్న నిబంధన ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గోల్డెన్ అవర్‌లోగా ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి.సునీత, రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ సిగ్నల్.. ► పోలీసు, రవాణా, హెల్త్, రోడ్ ఇంజనీరింగ్ నిపుణులతో రోడ్ సేఫ్టీపై లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం. ► క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స అందించేలా నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రోత్సాహం. ► రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించే వారికి మద్దతు ► ‘ఐరాడ్’ (ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్) యాప్ ద్వారా ప్రమాదాలపై పోలీసులకు లైవ్ అప్డేట్ ► పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్‌సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ ► రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు -
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడగానే లైసెన్స్ ఫట్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరించే మందుబాబుల కట్టడికి నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినవారి డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్)లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ)లకు ట్రాఫిక్ పోలీసులు భౌతికంగా లేఖలు పంపించేవారు. కానీ, ఇక నుంచి ఆ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరిగిపోనుంది. ట్రాఫిక్ యాప్‌లో డీఎల్ రద్దు అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనిని ఆర్టీఏతో అనుసంధానించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వెంటనే యాప్‌లో డీఎల్ రద్దు ఫీచర్‌ను నొక్కగానే క్షణాల్లో సంబంధిత సమాచారం ఆర్టీఏ అధికారులకు చేరుతుంది. వాళ్లు ఆయా డీఎల్‌ను పరిశీలించి రద్దుచేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ వాహనదారులకు భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 255 డీఎల్లు రద్దయ్యాయి. అత్యధికంగా గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9,981 డీఎల్ రద్దులను ఆర్టీఏకు పంపించగా, 215 డీఎల్లు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో 25, రాచకొండలో 15 లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఔటర్‌పై డ్రంకెన్ డ్రైవ్‌లు రాష్ట్ర, జాతీయ రహదారులతోపాటు ఓఆర్‌ఆర్‌పైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ఓఆర్ఆర్పై కూడా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రైవింగ్ స్కూల్ వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్‌పైకి అనుమతి లేదు. గతేడాది సైబరాబాద్‌లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 759 మంది మరణించారు. సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ఓఆర్ఆర్పై 191 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ పరిధిలో జరిగిన 2,529 రోడ్డు ప్రమాదాల్లో 618 మంది చనిపోయారు. గతేడాది రాచకొండ పరిధిలోకి వచ్చే ఔటర్‌పై 41 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 19 మంది మరణించారు. 13 రోడ్డు ప్రమాదాల్లో 50 మందికి గాయాలయ్యాయి. పరిమితవేగాన్ని మించొద్దు ఔటర్‌పై వాహనాలను జాగ్రత్తగా నడపాలి. టోల్‌గేట్స్ వద్ద మంచు ఎక్కువ ఉందని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్ గన్‌తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తున్నాం. – డి. శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ -
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు డిమాండ్.. ఇక్కడ లైసెన్స్ తీసుకొని..
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది. ఎంత ప్రతిభ ఉన్నా ఉద్యోగసాధనలో కొంతమంది విఫలం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు మోటార్డ్రైవింగ్పై ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌లో అవకాశాలు మెండుగా ఉండటం, విదేశాల్లో మంచి వేతనాలు లభిస్తుండటంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయస్థాయి లైసెన్స్‌లు పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రోడ్లపై కారు నడిపినా, బైక్ నడిపినా ప్రపంచంలోఎక్కడైనా సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ నిబంధనలు, నిరంతర అప్రమత్తత వాహనదారులకు ప్రతీరోజు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ వాహనాలు నడిపేవాళ్లు విదేశీ రహదారులపై పరుగు పెడుతున్నారు. ఈ కారణంగా కూడా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు డిమాండ్ పెరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో జారీ కరీంనగర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతీరోజు సాధారణ డ్రైవింగ్ లైసెన్సులతోపాటు పదుల సంఖ్యలో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు 381 ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ లైసెన్సులకు అంతర్జాతీయస్థాయిలో సముచితమైన గుర్తింపు, అర్హత ఉండడమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లేవాళ్లే కాదు.. పర్యాటక వీసాలపైన వెళ్లేవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు సైతం తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్! హిమాన్షును అలా అనలేదని వివరణ? ఏడాది పాటు చెల్లుబాటు తెలంగాణ రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో బండి నడిపేందుకు అనుమతినిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే అక్కడి నిబంధనల మేరకు లైసెన్సులు తీసుకోవలసి ఉంటుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ లైసెన్సులను తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని యురోప్ దేశాల్లో, ఆసియా దేశాల్లో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు ఏడాది పాటు చెల్లుబాటు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వెంటనే వాహనం నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఏడాది దాటిన తరువాత కూడా అక్కడే ఉండాలనుకుంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా లైసెన్సుతీసుకోవలసిందే. ఇవీ నిబంధనలు సొంతదేశంలో లైసెన్సుఉండాలి: చాలా మంది భారతీయులు ఈ రోజుల్లో విదేశాల్లో నివా సముంటున్నారు.ఎన్ఆర్ఐలుగా ఆయా దేశాల్లో ఉంటున్న వీరు అక్కడడ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసె న్సు కావాలి. ఇందుకోసం ముందుగా సొంతదేశంలో లైసెన్సును కలిగి ఉండాలి. ఇది లేకపోతే కుదరదు. ఇందుకోసం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ► పాస్ పోర్టు తప్పనిసరి: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసే టప్పుడు సొంత దేశంలో లైసెన్సుతో పాటు పాస్‌పోర్టును సమర్పించాలి. దీని వాలిడిటీ పీరియడ్ కనీసం ఆరు నెలలు ఉండాలి. ► ఎయిర్‌లైన్ టిక్కెట్: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏ దేశమైతే మీరు వెళ్తున్నారు.. అందుకు సంబంధించిన ఎయిర్ లైన్ టిక్కెట్ పొందుపరచాలి. మీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ప్రకారం కొన్నిసార్లు రిటర్న్ ఎయిర్ లైన్ టిక్కెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ► వీసా: పైన చెప్పిన పత్రాలతో పాటు మీరు ఏ దేశమైతే వెళ్తున్నారో ఆ దేశానికి సంబంధించిన వీసా కూడా వీటికి జత చేయాలి. ఒకవేళ వీసా త్వరలో వస్తుందనుకుంటే అందుకు సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలి. ► ఫొటోలు: లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పొందుపరచాలి. దీంతోపాటు ఫామ్ సీఎంవీ4 అప్లికేషన్ ఫిల్ చేసి స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించాలి. ► మెడికల్ ప్రూఫ్: మీరు శారీరకంగా ధ్రుడంగా ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన వైద్యుడు ధ్రువీకరించిన మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి. వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే ఆర్టీఓ జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ► ఫీజు: ఈ మొత్తం ప్రొసెస్ చేసేందుకు రీజనల్ ట్రాఫిక్ ఆఫీస్ (ఆర్టీఓ)లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేసమయంలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. అప్లికేషన్ సమర్పించిన రెండు మూడు రోజుల అనంతరం మీ దరఖాస్తును సంబంధిత అధికారులు ఆమోదించి తర్వాతే కార్యచరణకు పిలుపునిస్తారు. అప్పుడు పరీక్షలో పాసైతే.. లెర్నింగ్ జారీ చేస్తారు. విదేశాల్లో ఉపాధికి తోడ్పాటు.. సంవత్సరం పాటు టూరిజం వాళ్లతోపాటు విదేశాల్లో స్థిరపడ్డవ్యక్తులకు డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకునేవారికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగపడుతుంది. మన దేశం తీసుకున్న లైసెన్స్ అక్కడ లెర్నింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ లైసెన్స్ ద్వారా అక్కడి దేశాల్లో లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్ ఉంటే వారికి త్వరగా లైసెన్స్ వస్తుంది. – మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, డీటీసీ -
డ్రైవింగ్ లైసెన్స్ లేదనడానికి ఫొటోలే సాక్ష్యమా?
సాక్షి, అమరావతి: డ్రైవింగ్ లైసెన్స్ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది. మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్ చేసి చలాన్ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్ పెట్టుకోలేదని, సెల్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ డ్రైవింగ్ లైసెన్స్ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్ చేస్తూ చలాన్ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. వాలిడిటీ ముగిసిపోయిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువును పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. "కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" ట్విటర్ ద్వారా కేంద్రం తెలిపింది.ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, రవాణాదారులు అసౌకర్యానికి గురికాకుండా చూసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మోటారు వాహనాల చట్టం, 1988 & సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989కు సంబంధించిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల పొడిగించింది. గత ఏడాది మార్చిలో వచ్చిన మహమ్మారి కారణంగా అప్పటి నుంచి వీటి గడువును 6 సార్లు పొడిగించింది. చదవండి: అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్! MoRT&H has issued advisory to all States/UTs to extend validity of documents till 31 October 2021. pic.twitter.com/DQicN1tk8C — MORTHINDIA (@MORTHIndia) September 30, 2021 -
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదు, ఆపై మద్యం తాగి నిర్లక్ష్యంగా..
హైదరాబాద్: అసలే చెల్లని డ్రైవింగ్ లైసెన్స్..ఆపై మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరిని బలిగొన్న టిప్పర్ లారీ డ్రైవర్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లకపోయినప్పటికీ అతడికి వాహనం ఇచ్చిన టిప్పర్ యజమానిపై కూడా కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి నివాసి ఉప్పర సుంక రామాంజనేయులు (53) భవన నిర్మాణ సూపర్వైజర్. ఈ నెల 14న రాత్రి 10.20 గంటలకు కూకట్పల్లి బీజేపీ కార్యాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏపీ29టి157) ఢీకొట్టింది. తీవ్రగాయాలైన రామాంజనేయులను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గాజులరామారం కైసర్‌నగర్‌కు చెందిన డ్రైవర్ షేక్‌పాషా మద్యం తాగి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చెల్లని డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తేల్చారు. దీంతో షేక్‌పాషాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టిప్పర్ యజమాని షేక్ రహీంపై కూడా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. -
Aadhaar Card: పోయినా... పొందవచ్చు
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు పోయినప్పుడు ఆందోళనకు గురవుతుంటాం. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. – కడప కార్పొరేషన్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికెట్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌ను లాస్ ఆర్ డిస్ట్రడన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం(ఎల్ఎల్డీ)తో రోడ్డు రవాణా కార్యాలయంలో అందించాలి. రూ.20 బాండ్ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్ఎల్డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు రకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. ఆదాయ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్డు పోయినప్పుడు రేషన్ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్లో నామమాత్రపు రుసుంతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్సైట్ ద్వారా జిరాక్స్ కాపీ పొందవచ్చు. పాన్ కార్డు పాన్‌కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్‌కార్డ్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. ఏటీఎం కార్డు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా , ఎవరైనా దొంగిలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్ చేయించవచ్చు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. ఓటరు కార్డు కేవలం ఓటు వేయడానికి కాకుండా కొన్ని సార్లు నివాసం, పుట్టిన తేది ధ్రువీకరణ కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్, కార్డ్ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ సేవా కేంద్రంలో గానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ మళ్లీ కార్డు పొందవచ్చు. నంబర్ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. ఆధార్ కార్డు ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. కొత్త కార్డు మళ్లీ పోస్టు ద్వారా పంపిస్తారు. వెబ్సైట్లోగానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ పూర్తి సమాచారం పొందవచ్చు. పాస్‌పోర్ట్ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి ఆచూకీ లభించకపోతే.. నాన్ ట్రేస్డ్ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలం పడుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. -
వైరల్: యువతుల బైక్ స్టంట్.. రూ.28 వేలు ఫైన్
లక్నో: ఏ పని చేసినా వీడియో తీసుకోవటం దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం యువతకు సరదాగా మారిపోయింది. తాను చేసిన వీడియో వల్ల ఆ యువతికి ఫైన్ పడింది. సరదాగా చేసిన బైక్ స్టంట్ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించిన సదరు యువతికి పోలీసులు రూ.28 వేల ఫైన్ వేశారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంషి ఇద్దరు స్నేహితులు. అయితే శనివారం ఘజియాబాద్ రోడ్డుపై స్నేహి రఘువంషి తన స్నేహితురాలు శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చుబెట్టుకొని బైక్‌ను నడిపింది. ఈ బైక్ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల కంటపడటంతో రఘువంషి తల్లి మంజూ దేవికి రూ.11వేల చలానా పంపారు. అదే విధంగా ఆ బైక్ యజమాని అయిన సంజయ్ కుమార్‌కు రూ.17వేల ఫైన్ వేశారు. ఈ ఇద్దరు యువతలకు డ్రైవింగ్ లైసన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా రోడ్డుపై స్టంట్ చేసినందుకు చలానా పంపి, ఫైన్ వేశామని ఘజియాబాద్ ట్రాఫిక్ ఎస్పీ రామానంద్ కుష్వాహా తెలిపారు. వాళ్లు నడిపిన బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీనిపై రఘువంషి మాట్లాడుతూ.. తాము స్టంట్ ప్రాక్టిస్ చేయటం కోసం జనాలు ఎక్కువ లేని రోడ్డును ఎంచుకున్నాం. కేవలం సరదాగా ఆ వీడియో తీశామని, ఆ వీడియో ఇంత పెద్ద వివాదంగా మారుతుందని ఊహించలేదని తెలిపారు. చదవండి: వైరల్: హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా! -
డ్రైవింగ్ లైసెన్సు లేదు.. సార్!
సాక్షి, అమరావతి: గత రెండు నెలల్లో జరిపిన వాహనాల తనిఖీల్లో 22,130 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేనట్లు రవాణా శాఖ అధికారులు తేల్చారు. కానీ రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు రవాణా శాఖ వద్ద గణాంకాలున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు కాకుండా భారీ వాహనాలు నడిపే దాదాపు 10 వేల మంది కూడా లైసెన్సులు లేవని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. కొత్త విషయం వెల్లడైంది. కేవలం లైసెన్సు సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకే.. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఈ విధంగా చెబుతున్నారని తేల్చారు. ప్రతి వంద మంది వాహనదారుల్లో 70 మంది ఇలాగే చెబుతున్నట్లు వెల్లడైంది. డ్రైవింగ్ లైసెన్స్‌లేదని చెప్పడంతో రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందని చెబితే సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఉపాధి పోతుందని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు చెబుతున్నారు. ఆధార్‌తో లింక్ చేస్తే తేలిపోతుంది.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా రవాణా సేవలన్నింటికీ ఆధార్ లింక్‌ను అనుమతించింది. రాష్ట్రంలో రవాణా శాఖ కూడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 20 వేల వరకు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ చెబుతోంది. సస్పెండ్ చేసిన లైసెన్సులను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల వాహనదారుడు ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకున్నానని చెప్పేందుకు వీలుండదు. కొత్త కార్డు పొందేందుకూ అవకాశముండదు. అలాగే ఆధార్‌తో లింక్ చేస్తే వాహనదారుడికి అసలు లైసెన్సు ఉందా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో లైసెన్సు డేటాను పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్
సాక్షి, అమరావతి: వీడియో ఆధారిత సెన్సర్ల వినియోగం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షల నిర్వహణకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. రూ.13.4 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్ నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకు కేంద్రం ఏపీకి రూ.9 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.4.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలోని రవాణా కార్యాలయాల్లో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల ఈ ఆటోమేషన్ డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మిస్తారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులలో ఈ ట్రాక్‌లకు టెండర్లు ఖరారయ్యాయి. మార్చి నెలాఖరుకల్లా విశాఖ, అనంతపురం, చిత్తూరు, విజయవాడలలో, డిసెంబర్ నాటికి తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రొద్దుటూరులలో ట్రాక్‌ల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఆటో మేషన్ డ్రైవింగ్ ట్రాక్ అంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులు మాన్యువల్ విధానంలో పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లైసెన్స్‌లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా, పారదర్శకంగా నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఇవి నమోదు చేస్తాయి. వాహనాన్ని నడిపే తీరు, వేగం, వాహనం కండిషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తయిన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి. -
డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆరునెలల్లో శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయితే తాజాగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు గుర్తింపు ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చేత గుర్తింపబడిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వారు రాష్ట్ర రవాణా అధికారుల నుండి లైసెన్స్ పొందవచ్చు. అలాగని శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను గుర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను సూచిస్తుంది. ఆ డ్రైవింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.(చదవండి: అసోంలో ప్రధాని మోదీ పర్యటన) -
ఆర్సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే
సాక్షి, అమరావతి: వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డుల డెలివరీలో రవాణాశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారుడు ఇంటి చిరునామా సరిగా ఇవ్వకపోవడం, కార్డుల ముద్రణలో సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఈ కార్డులు డెలివరీ కావడం లేదు. ఆధార్ కార్డుల్లో అడ్రస్ వేరుగా ఉండటం, లైసెన్సుకు దరఖాస్తు, వాహన రిజిస్ట్రేషన్ సమయంలో అడ్రస్ మార్చకపోవడం వల్ల రోజూ డెలివరీ అయ్యే ఆర్సీ, లైసెన్సు కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వస్తున్నాయి. దీంతో తనిఖీల సమయంలో వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించినా.. అనుమతించాలని రవాణాశాఖ అధికారులు జిల్లాల పోలీస్ అధికారులకు లేఖలు రాస్తున్నారు. రిజిస్ట్రేషన్, కార్డులు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సరిగా అందించలేదు. కాంట్రాక్టు సంస్థ సరఫరా చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడింది. దీంతో వాహన తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే పోలీసులు అనుమతించకుండా జరిమానా వసూలు చేశారు. ఇప్పుడు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న దృష్ట్యా పత్రాలు చూపిస్తే అనుమతించాలని రవాణా అధికారులు జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ద్వారా పోలీస్ శాఖను కోరారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీ చేశారు. వాహనదారులు పత్రాలు చూపిస్తూ.. లైసెన్సు, రిజిస్ట్రేషన్ కార్డులు చూపించ కపోవడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీ కార్డుల జారీలో జాప్యంతో పాటు కోవిడ్ కారణంగా పత్రాలు ఫోన్లో చూపించినా.. వదిలిపెట్టాలని, జరిమానా విధించవద్దని సూచనలు జారీ అయ్యాయి. గతేడాది 1,932 లైసెన్సుల సస్పెన్షన్ రాష్ట్రంలో గతేడాది పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు సంబంధించిన 1,932 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే జైలుకు పంపుతామని రవాణాశాఖ స్పష్టం చేసింది. వాహన డ్రైవర్లు ఉల్లంఘనలకు పాల్పడినా, ప్రమాదాలకు కారకులైనా.. వారికి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
సాక్షి, అమరావతి : వాహన నిబంధన ఉల్లంఘనపై జరిమానాలను భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌ల నుంచి 7సీటర్ కార్ల వరకు ఒకే విధమైన జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు, రెండోసారికి రూ.10వేలు, పర్మిట్‌లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహానాల బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40వేలు, ఓవర్ లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు జరిమానా విధించనుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన జరిమానాలు వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750 సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750 అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000 అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000 డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000 రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000 వేగంగా బండి నడిపితే - రూ. 1000 సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000 రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000 రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000 పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000 ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000 ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000 అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష -
పోయినా... పొందండి ఇలా..!
గుడిపాల(చిత్తూరు): ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలు పాన్, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల కార్డులు పోయినప్పుడు ఆందోళన తప్పదు. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. (చదవండి: వీనుల విందుగా సుందరకాండ) డ్రైవింగ్ లైసెన్స్.. డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికేట్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌ను, లాస్ ఆర్ డిస్ట్రడన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం (ఎల్ఎల్డీ)తో రోడ్డు రవాణా కార్యాలయానికి అందించాలి. రూ.20 బాండ్ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్ఎల్డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. (చదవండి: కుప్పంలో టీడీపీ నేతల దౌర్జన్యం) రేషన్‌కార్డు.. ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలురకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌కార్డు ఉపయోగపడుతుంది. రేషన్‌కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ కార్డు పోయినప్పుడు రేషన్ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్‌పై నామమాత్రపు రుసుముతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్సైట్ ద్వారా జిరాక్స్ కాపీ పొందవచ్చు. ఆధార్‌కార్డ్.. ఈ కార్డ్పోతే టోల్‌ఫ్రీ నెంబర్ 18001801947కు కాలేచేసి, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్లీ పోస్ట్‌ద్వారా పంపిస్తారు. వెబ్సైట్లో కానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో కానీ పూర్తి సమాచారం పొందవచ్చు. పాన్‌కార్డ్.. పాన్‌కార్డ్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్‌కార్డ్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. ఏటీఎం కార్డు.. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. బ్యాంక్ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. పాస్‌పోర్ట్.. పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి లభించకపోతే నాన్ట్రేస్డ్ ధృవపత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి పేరిట రూ.వెయ్యి డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరచి, దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి, డూప్లికేట్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలవ్యవధి పడుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. ఓటరు గుర్తింపు కార్డు.. కేవలం ఓటు వేయడానికి కాకుండా, కొన్నిసార్లు నివాసం, పుట్టినతేదీ ధృవీకరణ కోసం ఈ కార్డు ఉపయోగ పడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్ నంబర్, కార్డ్ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ–సేవా కేంద్రంలో మళ్లీకార్డు పొందవచ్చు. నంబర్ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. -
ఆర్టీఏ: ఆన్లైన్లో మరో ఆరు సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్ (హజార్డస్ లైసెన్స్) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్ లైసెన్స్ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి) జూన్ 24న, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, పాత లైసెన్స్ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్) -
మైనర్ల చేతికి ద్విచక్రవాహనాలు
ఏటూరునాగారం: మైనర్లు రోడ్లపై బైక్ విన్యాసాలతో హల్చల్ చేస్తున్నారు. బండ్లను ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులుగా మిగులున్నారు. పదేళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సులో ఉన్న చిన్నారులు అతివేగంగా, విన్యాసాలు చేస్తూ ద్విచక్రవాహనాలు నడుపుతూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ వచ్చి తమను ద్విచక్రవాహనాలతో ఢీకొడతారోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు బైక్‌లపై వస్తున్నారంటే పక్కకు జరిగి కాసేపు ఆగి వెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీ మండలాల్లో ఉంది. ఏజెన్సీ మండలాల్లో.. ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం(కె), వాజేడు మండలాల పరిధి గ్రామాల్లో మైనర్లు బైక్ రైడ్ చేయడం సర్వత్రా ఆగ్రహం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారే ద్విచక్రవాహనాల లైసెన్స్ అర్హులు. కానీ ఏజెన్సీలో ఈ నిబంధనలు ఏమీ పనికి రావడం లేదు. ఇక్కడ ఆర్టీఏ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది లేకపోడంతో చిన్నారుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. అయితే పోలీసులు రోడ్డు నిబంధనలు విషయాలను పరిశీలిస్తుంటారు. ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు, జరినామాలను విధిస్తున్నప్పటికీ ఈ చైల్డ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారి ప్రవర్తన మితిమీరినట్లుగా కనిపిస్తోంది. ట్రిపుల్ రైడ్ అసలే చైల్డ్ డ్రైవ్ అందులో త్రీబుల్ డ్రైవ్ చేసుకుంటూ దర్జాగా రోడ్డుపై నుంచి వెళ్లడంతో పక్కన వాహనదారులు, బాటసారులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఎక్కడ ఆ బాలుడు వచ్చి ఢీకొడతాడోనని ఆందోళన నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కెమెరాలతో ఫొటోలు తిసి ఇంటికి జరిమానాలను పంపించే అవకాశం ఉంది. ఇక్కడ అలాంటి లేకపోవడం వల్ల విచ్చలవిడిగా చైల్డ్ డ్రైవ్, త్రిబుల్ డ్రైవ్ కొనసాగుతోంది. దీనిని నివారించాలని ఏజెన్సీలోని ప్రజలు కోరుతున్నారు. బాధ్యతను విస్మరిస్తున్న తల్లిదండ్రులు చిన్నారులకు ద్విచక్ర వాహనాలను ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రలు బాధ్యతలను విస్మరించి వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్నారులకు బైక్‌లు ఇచ్చి రోడ్లపైకి పంపడం సరికాదు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇవ్వకపోవడమే మంచిదని పలువురు కోరుతున్నారు. కఠిన చర్యలు తప్పవు చిన్నారులు ద్విచక్రవాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే చైల్డ్ డ్రైవ్ పేరుతో కేసులు నమోదు చేస్తాం. అలాగే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులతో పాటు జరిమానాలు విధిస్తాం. బైక్‌లను సీజ్ చేస్తాం. ఇక నుంచి ప్రతి రోజు రోడ్లపై బాల బాలికలు వాహనాలను నడిపితే సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.– శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై ఏటూరునాగారం -
నీకు లైసెన్స్ ఇవ్వలేమమ్మా..
ఇరవై ఎనిమిదేళ్ల జిలిమోల్ మారియట్ థామస్.. కారు డ్రైవింగ్ లైసెన్సు కోసం వచ్చినప్పుడు ఆర్టీయే అధికారులు ‘‘నీకు లైసెన్స్ ఇవ్వలేమమ్మా’’అన్నారు.‘‘నాకు డ్రైవింగ్ వచ్చు సార్, కావాలంటే మీ కళ్ల ముందే కారు నడిపి చూపిస్తాను’’ అంది జలిమోల్. చక్కగా డ్రైవ్ చేస్తే ఎవరికైనా లైసెన్స్ ఇచ్చి తీరవలసిందే కానీ, ఆమెకు ఇవ్వడానికి మాత్రం అధికారులు నిరాకరించారు. కారణం.. ఆమె చేతులతో కాకుండా కాళ్లతో కారు నడిపింది. జిలిమోల్కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చేతులు లేవన్నది అధికారుల అభ్యంతరం. ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. ఏం చేయాలో తోచక ఆమె లైసెన్స్ విషయాన్ని అలా ఫైళ్లలో ఉంచేశారు.థలిడోమైడ్ సిండ్రోమ్ అనే జన్యు అపసవ్యత కారణంగా రెండు చేతులూ లేకుండా పుట్టింది జిలిమోల్. తన పనులైనా తను చేసుకోలేదు. కానీ కాస్త వయసు రాగానే జిలిమోల్ సొంతంగా పనులు చేసుకోవడం నేర్చుకుంది. ఎవరిపైనా దేనికీ ఆధార పడకూడదు అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నాక.. తనకు చేతులు లేవన్న భావను తుడిచిపెట్టేసింది. చురుగ్గా ఉండటం, చదువుల్లో రాణించడం ఆమెకు కష్టం కాలేదు కానీ.. ఆమెకు ఉన్న ఒక కోరిక తీరడానికి మాత్రం ఇంట్లోవాళ్లను ఆమె సంసిద్దులను చెయ్యాల్సి వచ్చింది. కారు నడుపుతున్న జిలిమోల్ ‘‘కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను నాన్నా’’ అంది ఓ రోజు. ఆ మాటకు తల్లిదండ్రులిద్దరూ సంశయంలో పడ్డారు. నాన్న థామస్ రైతు. అమ్మ అన్నాకుట్టి గృహిణి. ఆ వంశం లో డ్రైవింగ్ తెలిసినవాళ్లే లేరు. ‘అది కాదు తల్లీ..’ అనబోయారు కానీ, కూతురి పట్టుదల తెలిసి ఆమె ముచ్చట తీర్చారు. మారుతి సెలరో–ఆటోమేటిక్కి తనకు అనుకూలంగా మార్పులు చేయించుకుని (ఒక ఆర్టీయే అధికారి సూచనలతో) కాళ్లతో డ్రైవింగ్ నేర్చుకుంది జిలిమోల్. చాలా త్వరగా డ్రైవింగ్ వచ్చేసింది! అమ్మానాన్న, చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎర్నాకులంలో వాళ్లుంటున్న నివాసం పక్కన వైఎంసిఎ కాంపౌండ్‌లో డ్రైవింగ్ నేర్చుకుంది జిలిమోల్. కాళ్లతో కారు డ్రైవ్ చేసుకుంటూ ధైర్యంగా ఎర్నాకులం రోడ్లన్నీ తిరిగేస్తోంది కూడా. కానీ, ఆమెకు లైసెన్స్ ఇచ్చే చొరవనే అధికారులు చూపించలేకపోతున్నారు. తనకు లైసెన్స్ ఇప్పించమని జిలిమోల్ 2018లో హైకోర్టుకు కూడా వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అంది. రాష్ట్ర ప్రభుత్వమే వెనకాడుతోంది. జిలిమోల్ మాత్రం లైసెన్స్ సాధించి తీరుతాను అంటోంది. -
వెంకీ డ్రైవింగ్ లైసెన్స్?
వెంకటేశ్‌కు రామ్‌చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఇవ్వాలనుకుంటున్నారట. విచిత్రంగా ఉంది కదూ.. ‘డ్రైవింగ్ లెసెన్స్’ అనేది మలయాళం సినిమా. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో వెంకటేశ్ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇందుకోసం రామ్‌చరణ్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ చిత్రాల్లో నటించిన క్రెడిట్ వెంకటేశ్‌కే దక్కుతుంది. గడచిన పదేళ్లల్లోనే ‘బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు’ వంటి రీమేక్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘నారప్ప’ కూడా తమిళ చిత్రం ‘అసురున్’కి రీమేక్ కావడం విశేషం. మరి.. ‘డ్రైవింగ్ లెసెన్స్’తో వెంకీ రీమేక్ ఖాతాలో మరో సినిమా చేరుతుందా? -
హలో డ్రైవర్.. లైసెన్స్ తీసుకెళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరునామాలు సరిగ్గాలేక రవాణా శాఖ పంపుతున్న డ్రైవింగ్ లైసెన్సు (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులు తిరిగొస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో ఏడు వేలకు పైగా కార్డులు రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చాయి. వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరైన సమయంలో అందజేసే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు రవాణా శాఖాధికారులు ఆర్సీలు, డీఎల్లు పంపడమే ఇందుకు కారణం. అయితే, వాహనదారుడు ఆ అడ్రస్‌లో లేకపోవడంతో పోస్టల్ శాఖ వాటిని తిరిగి రవాణా శాఖకు పంపుతోంది. అంతేకాక.. వాహనదారులు సైతం దరఖాస్తు చేసి పట్టించుకోవడంలేదు. కాగా, విశాఖ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడొక్క చోటే రెండు వేలకు పైగా కార్డులు తిరిగొచ్చాయి. అడ్రస్ మారితే మార్చుకోవాలి వాహనదారులు వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఇస్తున్నారు. దీంతోనే వాహనదారులు తమ వాహనాలను తిప్పుతున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. ఆర్సీలు లేకుండా వాహనాలు తిప్పితే సీజ్ చేయాలని రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ఆర్సీలు, డీఎల్లు పొందినా.. అడ్రస్ మారితే ఆ అడ్రస్ ఆధారంగా కార్డులను మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. కాగా, తిరిగొచ్చిన ఆర్సీలు, డీఎల్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంటలోగా పొందేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు. అప్పటికీ వాహనదారుల నుంచి స్పందన లేకుంటే వాటిని రద్దు చేయనున్నారు. రవాణా, పోలీసు శాఖలకు చిక్కులు ఇదిలా ఉంటే.. ఆర్సీలో ఉన్న చిరునామా, వాహనదారుడు నివాసం ఉండే చిరునామా వేర్వేరుగా ఉండడంతో పోలీస్, రవాణా శాఖలకు చిక్కులు ఎదురవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ–చలానాలు పంపినా.. వేల సంఖ్యలో అవి తిరిగొస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు వాహన నంబరు నోట్ చేసుకుని ఆన్లైన్లో చిరునామా కోసం వెతికితే తప్పుడు అడ్రస్సులు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జనవరి నుంచి ఆర్సీల తనిఖీని ముమ్మరం చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. -
జనవరి నుంచి ‘సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్’
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. డ్రైవింగ్ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. వాహనాన్ని సరిగ్గా డ్రైవింగ్ చేయకుంటే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా లైసెన్సు జారీ చేయలేరు. ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో అమలవుతోంది. అక్కడ ‘సాఫ్ట్’ ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రాక్‌ల నిర్మాణం ఇక్కడే.. రాష్ట్రంలో మొత్తం తొమ్మది చోట్ల అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌లు నిర్మించడానికి రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒక్కో ట్రాక్‌ను రూ. కోటి ఖర్చుతో నిర్మించనున్నారు. కేంద్రం రూ. 9 కోట్లు సాయం చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు వెచ్చించనుంది. విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఈ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం లైసెన్సుల జారీ ఇలా.. ప్రస్తుతం టూ వీలర్, త్రీ వీలర్, హెవీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు పొందాలంటే డ్రైవింగ్ ట్రాక్‌లలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో వాహనం నడపాల్సి ఉంటుంది. డ్రైవింగ్ పరీక్ష పాస్ కాకున్నా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ లైసెన్సు జారీ చేసే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి. ఆటోమేషన్ విధానంలో ఇలా.. అధునాతనంగా ఏర్పాటు చేసే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో సెన్సార్లు, కెమెరాలు బిగించి మొత్తం డ్రైవింగ్ పరీక్షను రికార్డ్ చేస్తారు. తాము డ్రైవింగ్ సరిగ్గా చేసినా.. తమకు లైసెన్సు ఇవ్వలేదని దరఖాస్తుదారులు ఆరోపించడానికి అవకాశం ఉండదు. ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదు. నిర్దేశిత నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసిన వారికి లైసెన్సు వస్తుంది. దరఖాస్తుదారుడు కోరితే తన డ్రైవింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు ఫుటేజీ ఇవ్వనున్నారు. ఆరోపణలకు తావుండదు రాష్ట్రంలో ఏర్పాటయ్యే 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లకు కేంద్రం రూ. 9 కోట్లు ఇవ్వనుంది. రూ. 2 కోట్లు టెండర్ల ప్రక్రియకు, రూ. 2.50 కోట్లు టెస్ట్ డ్రైవ్ ట్రాక్‌లకు వెచ్చించేలా రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డ్రైవింగ్ శిక్షణా, తనిఖీ మొత్తం ఆటోమేటెడ్ విధానం ద్వారానే జరుగుతుంది. ఈ విధానంతో లైసెన్సుల జారీలో ఎలాంటి ఆరోపణలకు వివాదాలకు తావుండదు. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నిటికీ ఒకటే కార్డు
న్యూఢిల్లీ: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అనేక గుర్తింపు కార్డుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఒక్క బహుళార్థక గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారాన్నంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. ‘2021 నాటి జనాభా లెక్కల సేకరణకు మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించనున్నాం. జనగణనలో ఇదో విప్లవాత్మకమైన మార్పు కానుంది. అన్ని వివరాలను ఒకే కార్డులో నిక్షిప్తం చేసేందుకు ఇది సాయపడుతుంది’ అని వివరించారు. దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 130 కోట్ల మందికి జనాభా లెక్కల సేకరణ వల్ల కలిగే లాభాలను వివరించాలి. ప్రభుత్వ పథకాలకు ఈ జాబితా, వివరాలను ఎలా ఉపయోగకరమో తెలియజేయాలి. ఈ సమాచారం దేశ పురోగతిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది’’అన్నారు. 2011 జనగణన ఆధారంగా కేంద్రం చేపట్టిన 22 సంక్షేమ పథకాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఉజ్వల’, ‘బేటీ బచావో బేటీ పఢావో’ ఉన్నాయన్నారు. అధికారులూ పుణ్యం కట్టుకోండి..! జనాభా లెక్కలను నిజాయతీతో నిర్వహించడం ద్వారా అధికారులు పుణ్యం కట్టుకోవాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని హోం మంత్రి కోరారు. జనగణన మున్సిపాలిటీ వార్డుల హద్దులు నిర్ణయించడం మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను గుర్తించడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అరకొర పద్ధతుల్లోనే సంక్షేమ పథకాలను చేపట్టిందని, గత ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయకపోవడమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. 2021 నాటి జనగణనపై హోం మంత్రి మాట్లాడుతూ.. మంచు ప్రాంతాలతో కూడిన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెఫరెన్స్ డేట్ 2020 అక్టోబరు ఒకటో తేదీ కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు 2021 మార్చి 21గా ఉండనుందని చెప్పారు. మొత్తం 16 భాషల్లో రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన చేపట్టనున్నామని వివరించారు. దీంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కూడా వివరాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఈ జాబితా ప్రాతిపదిక కావచ్చునని అధికారుల అంచనా. -
ఇక్కడ పాత చలాన్లే!
సాక్షి, హైదరాబాద్: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశవ్యాప్తంగా ఆదివారం అమలులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం పోలీసులు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పాత చలాన్లే విధించారు. కొత్త చట్టం ప్రకారం.. చలాన్లు విధించాలంటూ తమకు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా కొత్త చలాన్లు ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుంది? అన్న విషయాలు కూడా అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మనకు ఇక్కడ పాత జరిమానాలే వర్తించనున్నాయని రవాణా, పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి... మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కొత్త నిబంధనలతో జరిమానాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి.. నిబంధనల్ని పాటిస్తే ఏ మేరకు డబ్బు ‘ఆదా’చేసుకోవచ్చు తదితర విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు సైతం వాహనచోదకుల్ని ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్ని తనిఖీ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ప్రస్తుతం ఎంత జరిమానా పడుతోంది, కొత్త యాక్ట్ అమలులోకి వస్తే ఏ స్థాయిలో పడుతుంది అనేవి వివరిస్తున్నారు. మరోపక్క వాహనదారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో డ్రైవింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా హెల్మెట్ వినియోగం పెరిగిందని, ఇదే వాహనచోదకులు తీసుకుంటున్న జాగ్రత్తకు నిదర్శనమని ఓ అధికారి తెలిపారు. -
దళారులకు కేరాఫ్ రవాణాశాఖ !
సాక్షి, కరీంనగర్ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్టేట్హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్‌లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్ జిల్లానే టాప్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్‌కు ఆయనను ఇన్చార్జిగా నియమించడం. జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్ పే’ వంటి అధునాతన ఆన్లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. ఇన్చార్జి అధికారులే ఇక్కడ..! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్లో గానీ రెగ్యులర్ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్‌కు ఈమెనే రెగ్యులర్ ఆర్టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్‌చార్జీలే. 2014–17 వరకు వినోద్‌కుమార్ ఇన్చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్‌పాషా గూగుల్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్‌కే సరెండర్ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్ అధికారి. గౌస్‌పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్‌ను తాత్కాలికంగా కరీంనగర్‌కు ఏఎంవీఐగా నియమించారు. లంచాల కోసం పీడింపు.. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్ లైసెన్స్ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ టాక్స్, ఫిట్నెస్ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్‌తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది. అంతా ఏజెంట్లదే.. రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్ గానీ, వాహనం రిజిస్ట్రేషన్ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. పంపకాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు... ఏజెంట్ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బాస్ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్‌కు సమాచారం అందించడంతోపాటు స్లాట్‌బుక్ చేయడం.. నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. -
ఆర్టీఏ.. అదంతే!
‘హలో సార్.. నాలుగు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యాను. వారం రోజుల్లో లైసెన్స్ నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాలేదు’ ఇదో వాహనదారుడి ఆందోళన. ‘కొత్త బండి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు నెలలైంది.ఇంకా ఆర్సీ రాలేదు. ట్రాఫిక్ పోలీసులుఇబ్బందులకుగురిచేస్తున్నారు’ మరో వాహనదారుడి ఆవేదన. ‘వాహనం అడ్రస్ మార్పు కోసం అధికారులనుసంప్రదిస్తే సరైన స్పందన లేదు. పట్టించుకునేవాళ్లే లేరంటూ’ నగర శివార్లలోని ఒక ఆర్టీఏకార్యాలయంలో ఎదురైన పరిస్థితిపైఓ మహిళ విస్మయం. సాక్షి, సిటీబ్యూరో: ఇలా ఒక్కరో, ఇద్దరో కాదు. లక్షలాది మంది వాహనదారులు ఆర్టీఏ పౌరసేవల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి, నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లను అందజేసినప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు తదితర పౌరసేవలు లభించక నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2.15 లక్షల ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెం డింగ్ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఒకట్రెండు ఆర్టీఏ కార్యాలయాల్లో సత్వరమే పరిష్కారం లభిస్తున్నప్పటికీ చాలాచోట్ల అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఆర్టీఏ పౌరసేవలపైన నిర్దిష్టమైన కాలపరిమితిని విధించారు. అంతర్రాష్ట్ర బదిలీలపైన మాత్రమే 30 రోజుల గడువు విధించారు. మిగతా అన్ని రకాల పౌరసేవలు... ముఖ్యం గా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, అడ్రస్ మార్పులు తదితర వారం, పది రోజుల్లో లభించే విధంగా సిటిజన్ చార్టర్‌ను రూపొందించారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారంరోజుల కాలపరిమితి 6 నెలల వరకు కొనసాగడం గమనార్హం. ఎందుకిలా.? రవాణాశాఖ పౌరసేవలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పటిష్టమైన ఆన్లైన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఓజీఆర్టీఎస్) ఏర్పాటు చేశారు. వాహన వినియోగదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని ‘సిటిజన్ చార్టర్ కంప్లయింట్స్’ను ఎంపిక చేసుకొని తమ ఫిర్యాదును తెలియజేయవచ్చు. అలాగే బీఎస్ఎన్ఎల్ ద్వారా స్వీకరించేందుకు ‘1100’, ఇతర ఫోన్ల నుంచి స్వీకరించేందుకు ‘18004251110’ అనే రెండు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. జిల్లాల విభజన వరకు ఈ వ్యవస్థలు సక్రమంగానే పని చేశాయి. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్లో చాలా వరకు అప్పటికప్పుడు పరిష్కరించడమో లేదా ఎప్పటిలోగా తమ సమస్యను పరిష్కరిస్తారో తెలియజేసేవారు. కానీ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి, పైస్థాయి ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటికి ప్రాంతీయ రవాణా అధికారులు, యూనిట్ మోటారు వాహన ఇన్స్పెక్టర్ల స్థాయిలో పరిష్కారాన్ని సాధించడంలో ఓజీఆర్ఆటీఎస్ వ్యవస్థ విఫలమైంది. దీంతో ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ జాబితాలో చేరిపోయాయి. మరోవైపు తమకు సకాలంలో సరైన పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారులు పదే పదే ఫిర్యాదులు చేయడం కూడా మరో కారణం. ఇదే అసలు సమస్య.. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి నుంచి పైవరకు సమన్వయ లేమితో పాటు ఇటీవల కాలంలో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు) ముద్రించేందుకు అవసరమైన కార్డులు, రిబ్బన్ల కొరత మరో ప్రధానమైన సమస్యగా మారింది. రవాణాశాఖకు స్టేషనరీ అందజేసే ప్రైవేట్ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సదరు సంస్థలు కార్డులు, రిబ్బన్ల పంపిణీకి చేతులెత్తేయడంతో వినియోగదారులకు సకాలంలో అందజేయలేకపోయారు. కేవలం వారం రోజుల్లో అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం 4 నెలల నుంచి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న వినియోగదారులు కూడా ఉన్నారు. మంత్రి సమీక్షతో కదలిక.. ఇటీవల రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ స్తంభించిపోవడం, స్టేషనరీ కొరత, ప్రింటర్లు, స్కానర్లు లేకపోవడం, పనిచేయని కంప్యూటర్లు తదితర అంశాలను పరిశీలించారు. వాహనదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా ఓజీఆర్టీఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు తేలిగ్గా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్ నంబర్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘కొద్ది రోజుల క్రితమే కొత్త ప్రింటర్లు, స్కానర్లు, స్టేషనరీ వచ్చాయి. త్వరలోనే వాహనదారుల సమస్యలన్నింటినీ పరిష్కస్తాం’ అని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌కు ‘ఆధార్’ ఆపేశాం
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేముందు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభకు తెలిపారు. 2018 సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాము ఈ చర్య తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఆధారంగా 1.57 కోట్ల డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశామనీ, అలాగే 1.65 కోట్ల వాహనాలను రిజిస్టర్ చేశామనీ, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆధార్‌ను ధ్రువీకరణకు వాడటాన్ని నిలిపివేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం) -
కార్డు స్కాన్ చేస్తేనే బండి స్టార్ట్
సిరిసిల్ల: ఓ ఐడియా బైక్‌లకు భద్రతను తెచ్చిపెట్టింది. వాహనానికి తాళం వేసి ఉంటే చాలు.. ఏదో ఒక కీతో ఆన్‌చేసి చోరీ చేసే రోజులివి. బైక్‌లు, స్కూటీలు, కార్లు సైతం దొంగల బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆర్సీకార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒక కార్డుతో స్కాన్ చేస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా డివైస్‌ను రూపొందించాడు. జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన బుధవారపు మల్లేశం తన బైక్ ఆక్టివాకు ఆర్సీ కార్డు నంబరును స్కాన్ చేశాడు. రేడియో ఫీక్వెన్సీ స్కానర్, మైక్రో కంట్రోల్ ఐసీని ద్విచక్రవాహనానికి అమర్చాడు. వాహనం బ్యాటరీ సాయంతో అది పని చేస్తోంది. బండికి కీస్పెట్టి, ఆర్సీ కార్డు, లేదా లైసెన్స్ కార్డును ఏదో ఒకదానిని స్కాన్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది. కార్డు స్కాన్ కాకుండా.. కీస్ ఉన్నా బండి ఇంజిన్ ఆన్ కాదు. ఈ తరహా రేడియో ప్రీక్వెన్సీ డివైస్‌ను బైక్, కారు, లారీ, బస్సు లాంటి ఇతర వాహనాలకు ఏర్పాటు చేసుకోవచ్చు. బీటెక్ ఈసీఈ చదివిన మల్లేశం కేవలం రూ.1,500 ఖర్చుతో డివైస్‌ను రూపొందించాడు. ఎవరైనా వాహనదారులు కావాలనుకుంటే లాభాపేక్ష లేకుండా బైక్‌లు, కార్లకు దీనిని అమర్చుతానని మల్లేశం తెలిపాడు. ఆసక్తి గలవారు 63024 72700 సెల్ నంబరులో సంప్రదించండి. -
లైసెన్స్ లేకున్నా ‘బడి బండి డ్రైవర్’.!
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులను పాఠశాలలకు తరలించే బడి వాహనాల భద్రత అంతంత మాత్రంగా మారింది. వీటి ఫిట్నెస్ మాట అటుంచితే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లూ వీటిని నడిపేస్తున్నారు. శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు 12 మంది లైసెన్స్ లేని డ్రైవర్లను గుర్తించారు. యాజమాన్యాల కక్కుర్తి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి స్కూల్ వాహనాల డ్రైవర్లు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందాల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. ఒక్క రోజులోనే 521 కేసులు నమోదు చేశామని, భవిష్యత్‌లోనూ తనిఖీలు కొనసాగుతా యని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. యథేచ్చగా ఉల్లంఘన... బుధవారం నుంచి నగరంలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో మళ్లీ రోడ్లపై పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోలు, వ్యాన్ల హడావుడి ఎక్కువైంది. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లకు ఆటోల్లోనే వెళుతుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తున్నారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు స్కూల్ వాహనాలపై స్పెషల్‌డ్రైవ్స్ చేపట్టాలని నిర్ణయించారు. ఆర్టీఏ అధికారుల సాయంతో... ఇందుకుగాను ఆర్టీఏ అధికారులతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ను సంప్రదించగా, ఆయన ఆరుగురు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐ) కేటాయించారు. వీరితో పాటు స్థానిక ట్రాఫిక్ ఏసీపీల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో ఏఎంవీఐ, ట్రాఫిక్ ఎస్సై, ఆర్టీఏ కానిస్టేబుల్లతో పాటు ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ప్రధానంగా ఈ బృందాలు స్కూళ్లు తెరిచే, ముగిసే సమయాల్లోనే డ్రైవ్స్ చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వర కు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆరింటిపైనే దృష్టి... ప్రత్యేకంగా ఏర్పాటైన ఆరు ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేయడం, ఓవర్ లోడింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలను పరీక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులను తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కొందరు తల్లిదండ్రులు బైక్‌లపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పరిమితికి మించి చిన్నారుల్ని తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిండ్రులతో సహా అంతా భాగస్వాములు కావాలి. ఓవర్లోడింగ్ వాహనాల్లో తమ పిల్లలను పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే 9010203626తో పాటు ‘ట్రాఫిక్ లైవ్’ యాప్‌ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్ 16న రవాణా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లోని (జీఓ ఎంఎస్ నెం.35) అంశాలను కచ్చితంగా పాటించాలి.– అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
అమ్మమాట
‘‘ఏమైందన్నా అట్టా మొహం మొటమొటలాడిస్తన్నావు? మన హిట్లర్ లీవ్ ఇవ్వనన్నాడా ఏంటి?’’ విసురుగా వస్తున్న విఠల్‌ని అడిగాడు కండక్టర్ కాంతారావు. ‘‘అవున్రా.. కూతురి పెళ్లికి ఒక్క పదిహేనురోజులుసెలవడితే ఇవ్వనంటాడేమిట్రా? స్టాఫ్ సరిపోకపోతే కొత్తవాళ్లని తీసుకోవాలిగానీ ఒక వారం రోజులు తీసుకో అంటే ఎట్లా? వారం రోజులు ఏమూలకి సరిపోతై చెప్పు?’’ చికాకు పడ్డాడు విఠల్.‘‘అదే అన్నా! సిన్సియర్‌గా పన్జేసేవాళ్లకి ఇట్టాజేస్తారు. పనెగ్గొటి ్టతిరిగేవాళ్లకి రూల్సేమీ అడ్డురావు. సర్సరే పద పద. ఇది మనకి రోజూ ఉండే రపరపే. మళ్లీ టైంకి బస్సు తియ్యలేదంటే అదొక గొడవ వాడితో. అయినా ఇవ్వన్నీ మనసులో పెట్టుకుని బస్సు డ్రైవింగ్ చేసేవు... అసలే మన రూటు చాలా బిజీ’’ హెచ్చరించాడు కాంతారావు.‘‘అదేం లేదులేరా. పద’’ అంటూ బస్సుకేసి నడిచాడు విఠల్. కాంతారావు బస్సులోకి దూరిజనాన్ని నెట్టుకుంటూ చకచకా టిక్కెట్లివ్వటం మొదలుపెట్టాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. మనసంతా చిరాగ్గా ఉంది. ఒక పక్కన భార్య గొడవ ‘ఇంకో ఇరవై రోజుల్లో చిన్నదాని పెళ్లి ఉంది. ఇప్పటికైనా సెలవు పెట్టరా?’ అని. పెళ్లి పనులు నత్తనడకతో సాగుతున్నాయి. పెళ్లిపత్రికలు అచ్చై ఇంటికొచ్చాయి. అవి బంధువులందరికీ పంచాలి. పెద్దల్లుడు మంచివాడు కాబట్టి మరదలి పెళ్ళికోసం తన భార్యని ముందే పంపాడు. తనూ పది రోజుల ముందు వస్తానన్నాడు. వచ్చీరావటంతోనే తన పెద్దకూతురు అన్నీ తానే అయి ఇంట్లో పనులన్నీ చూస్తోంది. అల్లుడు వస్తే తనకి సహాయంగా ఉండమనొచ్చుగాని మొత్తం బయటి పనులన్నీ అతడి నెత్తిన వేస్తే ఏం బాగుంటుంది? అప్పటికీ శని ఆదివారాల్లో వచ్చి, కొన్ని పనులు చేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆమాత్రంకూడా అతను చెయ్యకపోయివుంటే తనకి ఇంకా కష్టమయ్యేది’. ఇలా ఆలోచనల్లో సతమతమవుతుండగా కాంతారావు విజిల్ వెయ్యటంతో బస్‌ను ముందుకు కదిలించాడు. అసలే ఆ రూట్ చాలా బిజీ. దానికి తోడు మెట్రో పనులకోసమో, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసమో రోడ్లని ఆక్రమిస్తున్న కాంట్రాక్టర్లు. మామూలుగానైతే అతడి చేతి స్టీరింగ్ కృష్ణుడి చేతిలోని చక్రమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.సాధారణంగా కొందరు డ్రైవర్లు బస్టాప్‌కి కాస్త ముందోవెనకో కొంత దూరంలో బస్సుని ఆపి, ప్రయాణీకులు పరిగెత్తుకువచ్చి అందుకునేలోపు బస్సుని దౌడు తీయుస్తుంటారు. తమ కోర్కెలు తీర్చని యాజమాన్యంపై కోపంతోనూ, కసితోనూకొందరలా చేస్తుంటారు. మరికొందరికి ఆ రకంగా ప్రయాణీకుల్ని ఊరించి ఊరించి విసిగించటం వినోదం. నిజాయితీపరులైన ఉద్యోగులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో విధిలేక ఆ పని చేస్తుంటారు. ఆ రోజు విఠల్ కూడా తనకు బాస్ లీవ్ ఇవ్వలేదన్న కసిని ప్యాసింజర్ల మీద చూపించసాగాడు. అంతగా రద్దీ లేకున్నా, ప్యాసింజర్లు ఆపమని అభ్యర్ధిస్తున్నా పట్టించుకోకుండా స్పీడుగా బస్ నడపసాగాడు. ఈ విషయంలో జనం తనని తిట్టుకుంటారని అతనికి తెలుసు. ‘అయినా వాళ్లకు ఇదొక్కటే బస్సు కాదుగదా’ అని తనని తాను సమాధానపరచుకున్నాడు. ఇక చివరి ట్రిప్పుకొచ్చేసరికి ఎంత తొందరగా ఇంటికెళ్దామా అనే ఆత్రంలో బస్సు ఖాళీగా ఉన్నా ఎక్కడా ఆపకుండా వేగంగా నడపసాగాడు. తాను ఆపొద్దని చెప్పినావినకుండా, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదంటూ ప్రతి స్టాప్‌లో బస్సునాపే విఠల్, ఆరోజు అలా బస్సు వేగంగా నడపటం చూసిన కాంతారావు ‘మంచోణ్ణీ కూడా చెడగొట్టావు గదరా!’ అని అనుకున్నాడుం తన బాస్‌ని తలచుకుంటూ. ఆ రోజు ఆఫీసులో చక్రి మనసు మనసులోలేదు. అతని ధ్యాసంతా తన ఇంటిమీదనే ఉంది. ఆ ఇంటిని ఏవిధంగా సరిచేయాలోపాలుపోని స్థితిలో ఉన్నాడతడు. ఆ పరధ్యానంతో అతడు తెచ్చిన ఫైలు చూసి అతని బాస్ ‘‘ఏంటి చక్రీ ఇది? ఎంతో సిన్సియర్‌గా పని చేస్తావని నీకు పేరుంది. నువ్వుగూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఫైల్లో చూడు ఎన్ని తప్పులు చేశావో. ఒకసారి మళ్లీ చూసి సరిచేసి తీసుకురా’’ అంటూ సుతిమెత్తగా మందలించాడు. ఆ ఫైలు పట్టుకుని అతడు తన సీట్లోకొచ్చికూర్చున్నాడు. చక్రి అంటే అతని పై ఆఫీసర్‌కి మంచి అభిప్రాయముంది. కానీ అది జీతం పెంచేంతగాలేకపొవటం వల్ల అతడి జీతం గొర్రెతోకను మించటంలేదు. ఇంట్లో తన తల్లి, భార్య, కూతురు, కొడుకు మొత్తం ఐదుగురి కుటుంబభారం తనే మొయ్యాల్సివుంది. రెండువందల గజాల్లో ఓ మూలగా ఉన్న రెండు గదుల డాబా ఇల్లొక్కటే తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా తనకు సంక్రమించింది. అవీ చిన్న చిన్న గదులు. అదీ నగరం పొలిమేరల్లో ఉన్న ఒక పల్లెటూర్లో. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి ఇప్పటివరకూ ఎలాగో సర్దుకుంటూ వస్తున్నారు. వాళ్లు పెద్దవాళ్లవుతున్నకొద్దీ ఇల్లు మరీ ఇరుకైపోసాగింది. గత వర్షాకాలంలో ఆ ఇల్లు కురవటం మొదలైంది. దాంతో అప్పుడు ఇంట్లోఅందరూ చెట్టుకింద వర్షంలో కూర్చున్నట్లుగా కూర్చుని రాత్రుళ్లు జాగారం చేశారు. ఆ ఇల్లు కట్టి అప్పటికి దాదాపు యాభై ఏళ్లవుతోందిమరి. ఇహ లాభం లేదని తాపీ మేస్త్రీని పిలిచి మాట్లాడాడు. ‘‘ఇల్లు కట్టినప్పుడు డాబా పైన ప్లాస్టరింగ్చేయించివుంటే ఈ సమస్య వచ్చేది కాదు సార్. ఇప్పటికైనా ఆ పని చెయ్యకపోతే వానకి తడిసి తడిసి కొన్నిరోజులకు రూఫ్ కూలినా కూలవచ్చు’’ అని భయపెట్టాడు. వర్షాకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా గడవాలంటే ఆ పని చేయించక తప్పదు. దానికి కనీసం మూడు బస్తాల సిమెంట్, ఒక టిల్లర్ ఇసక తెప్పిస్తే పని మొదలుపెడతానని చెప్పి వెళ్లిపోయాడా మేస్త్రి. అప్పటికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో ఆ పనిని తర్వాతి సంవత్సరానికి వాయిదా వేశాడు. ఎలాగోలా ఆ వర్షాకాలం గడిచి పోయింది. అయితే ఉన్నట్లుండి క్రితంరోజు సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. రాత్రికల్లాకుంభవృష్టి మొదలయ్యింది. మొత్తం కాలనీలన్నీ చెరువులైపోయాయి. పైకప్పు నుంచి నీరు కారటంతో ఆ రాత్రి చాలా ఇబ్బందయ్యింది. దాంతో ఇల్లు కాసారమైపోయింది. తామూ తడుస్తున్నా, తన భార్యతో కలిసి పిల్లలకూ తల్లికీ ఇబ్బంది కాకుండా చూడటానికి ఎంతో కష్టపడ్డాడు. తెల్లారే సరికి మళ్ళీ ఫెళ్ళున ఎండ. హైదరాబాద్ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ‘‘అసలిప్పుడీ అకాలవర్షమేమిటి? కురవాల్సిన కాలంలో, కురవాల్సిన చోట కురవకుండా వుండటం చూస్తుంటే కలి ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఆ సిమెంట్ పనేదో చేయించు నాయినా. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావుగా’’ అందతని తల్లి. అతని ఇబ్బంది ఆవిడకు తెలుసు. కానీ ఇంటి పరిస్థితి చూశాక కొడుకుతో ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. అతని తల్లి ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అతన్ని అడిగి ఎరగదు. అలాంటిది ఇప్పుడిలా అడిగిందంటే ఆమె ఎంత కలత చెంది ఉంటుందో అర్థమై ‘‘అలాగే అమ్మా. ఈ సారి తప్పకుండా చేయిస్తా.’’ అంటూ మాట ఇచ్చాడు. అందుకే తెల్లారగానే మేస్త్రిని పిలిపించాడు. అతడు వస్తూనే ‘‘నేనెప్పుడో చెప్పాగద సార్. మీరు సిమెంట్, ఇసుక తెప్పించండి. ఒక్కరోజులో పని పూర్తవుతుంది’’ అన్నాడతడు. మెటీరియల్కీ, మేస్త్రికీ కలిపి దాదాపు పదివేలు. కనీసం ఇప్పుడైనా ఆ ప్లాస్టరింగ్ పని చేయించకపోతే వచ్చే వర్షాకాలంలో తాము ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ‘తల్లి కోరిక తీర్చేందుకైనా సరే ఈ పని చేయించాల్సిందే’ అని తీర్మానించుకున్నాడు. అందుకే ఒక స్థిర నిర్ణయానికొచ్చినట్లు తన బాస్ గదిలోకెళ్లి తనకొచ్చిన ఇబ్బందిని గూర్చి చెప్పాడు. తనకి కనీసం పదివేలయినా కావాలని అడిగాడు. ఆయన ఏ కళనున్నాడోగానీ అతని పీఎఫ్ అకౌంట్లోంచి పదివేలు లోన్ శాంక్షన్ చేయించాడు. తన ఇంటిదగ్గర్లో కొత్తగా కడుతున్న ఒక ఇంటిదగ్గర మిగిలిన ఇసుకని ఆ ఇంటివారిని బ్రతిమాలి, తక్కువ ధరకు తెచ్చుకున్నాడు. మర్నాడు రెండో శనివారం కావటంతో ఆ పని పూర్తి చేయించాలనుకుని సిమెంట్ కోసం బయల్దేరాడు. తన ఊర్లో సిమెంట్ షాపులేమీ లేకపోవటంతో సిటీకి వెళ్లక తప్పలేదతనికి. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో సిమెంట్ దాదాపు షాపులన్నీ మూసి ఉన్నాయి. ఏం చెయ్యాలోపాలుపోలేదతనికి. నిరాశగా వచ్చి బస్టాపులో నిల్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఒక సిమెంట్ షాపు ముందు ఆగింది. దానిలోంచి ఓ యాభైఏళ్ల వ్యక్తి దిగి, ఆ షాపు మూసి వుండటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతన్ని చక్రి అంతగా పట్టించుకోకపోయేవాడే. కానీ అతగాడొచ్చిన ఆటోలో మూడు సిమెంట్ బస్తాలు కనిపించటంతో అతడి మనసులో ఏ మూలనో చిన్న ఆశ చిగురించింది. అతని దగ్గరికెళ్లి, ‘‘వర్షం భయానికి షాపులన్నీ మూసేశారు’’ అని అతనితో మాటలు కలిపాడు. ‘‘అవునండీ. మా ఇంటిదగ్గరపనంతా అయిపోయింది. కానీ ఈ సిమెంట్ బ్యాగులు మూడూ మిగిలిపోయినై. ఇంటిదగ్గరే ఉంచితే గడ్డగట్టి పోతాయని తిరిగి ఇచ్చేద్దామని వచ్చా. వీడేమో షాపు బంద్ చేసేశాడు’’ అన్నాడు. చక్రి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ‘‘బస్తా ఎంతకి కొన్నారు?’’అనడిగాడు.‘‘ఒక్కొక్క బస్తా మూడొందల యాభై. మీకు కావాలంటే చెప్పండి. బస్తాకి వంద తగ్గించి ఇస్తా’’ అన్నాడు. ఆ మాట వినటంతోటే ప్రాణం లేచొచ్చిందతనికి. ఇక మరోమాట లేకుండా ఏడొందలయాభై అతని చేతిలో పెట్టాడు. అతడు ఆటోవాలా సాయంతో ఆ మూడు సిమెంట్ బస్తాలూ అక్కడి బస్టాప్ దగ్గర దించేసి, అదే ఆటోలో వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి తన ఇంటికి ఆటో మాట్లాడుకుంటే కనీసం రెండొందలౌతుంది. అంత డబ్బు పెట్టటం దండగ. ఎలాగూ డిస్ట్రిక్ట్ బస్సులతోపాటు సిటీ బస్సులుకూడా తన గ్రామం వరకూ వెళ్తుంటాయి. ఆ బస్సు డ్రైవర్నో కండక్టర్నో బ్రతిమిలాడైనా సరే ఆ సంచులు ఇంటికి తీసుకెళ్లాలని అతని కోరిక. కానీ వచ్చిన బస్సులేవీ అక్కడ ఆగకుండా వెళ్లిపోసాగాయి. దాంతో అతడు నిరాశ పడిపోసాగాడు. అదే ఏ డిస్టిక్ బస్సో అయితే లగేజీ టికెట్ కొట్టకుండా, ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇక సిటీ బస్సులవాళ్లైతే పాల క్యాన్లు, కూరలకైతే ఓకే అంటారుగానీ, సిమెంట్ బస్తాలంటే అస్సలు ఒప్పుకోరు. అయినా అతడిలో ఆశ చావక ‘ఒక్క బస్సయినాఆగకపోతుందా’ అని ఎదురు చూడసాగాడు. ఆలోచనలు ఎంతగా ముప్పిరిగొంటున్నా విఠల్ బస్సుని జెట్ స్పీడ్‌లో లాగించేస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటం మూలాన రోడ్లు ఖాళీ అయిపోసాగాయి. భారీవర్షం పడే సూచనలుండటంతో జనం పలచబడ్డారు. విఠల్ బస్సు స్పీడ్ పెంచేశాడు. తొందరగా డ్యూటీ దిగి ఇంటికెళ్లాలని అతడి మనసు పీకుతోంది. అలా వెళ్తుండగా ఒక బస్టాప్‌లో ఒక ముసలావిడ నిల్చుని ఉండటం చూడగానే అప్రయత్నంగానే అతడి కాలు బ్రేక్ నొక్కింది. అది చూడగానే కాంతారావు ఆశ్చర్యపోయి, ‘‘ఏంటన్నా. సడెన్‌గా ఈ ముసలిదాని కోసం బస్సాపావు?’’అనడిగాడు. అతడు జవాబివ్వకుండా నవ్వి, ఆ ముసలావిడ ఎక్కగానే బస్సుని ముందుకు కదిలించాడు. ఆ తర్వాతి స్టాప్‌లో కూడా ఒక్కరే ఉన్నారు. అది చూసిన కాంతారావు ‘‘ఒక్కడి కోసం బస్సాపటం వేస్ట్. రైట్ రైట్’’ అన్నాడు.కానీ బస్సు ఆ స్టాపులో ఆపటం చూసి, ‘‘ఏమైందన్నా. తొందరగా ఇంటికి పొవాలని లేదా?’’ అన్నాడు. కానీ అతడి నుంచి జవాబుగా అదే నవ్వు. కాంతారావుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాతి స్టాప్‌లో ఉన్న ఒకే ఒక ప్యాసింజర్ని చూసి ‘‘అన్నా. ఇక ఆపకు. అసలే వాడి దగ్గర సిమెంట్ బ్యాగులున్నట్లున్నై. అవి లోపలికెక్కిస్తే, బస్సంతా ఖరాబవుతుంది. పోనియ్’’ అన్నాడు. ఆ మాటలు అసలు వినబడనట్లువిఠల్ బస్సుని సరాసరి తీసికెళ్లి ఆ సిమెంట్ బస్తాల దగ్గర ఆపి, ‘‘ఎక్కు’’ అన్నట్లుగా సైగ చేశాడు. అప్పటిదాకా ఏ బస్సూ ఆగకపోవటం, మళ్లీ చినుకులు మొదలైతే తక్కువ రేటుకి కొన్న సిమెంట్ పాడైపోతుందేమోనన్న దిగులులో కూరుకుపోయి ఉన్న చక్రికి, బస్సు తన దగ్గరికే వచ్చి ఆగటం, ఎక్కమని డ్రైవర్ సైగ చెయ్యటంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా సిమెంట్ బస్తాల్ని బస్సులోకి ఎక్కించేసి, ‘‘థాంక్యూ... థాంక్యూ వెరీమచ్ డ్రైవర్‌గారూ’’ అన్నాడు కృతజ్ఞత గుండెలో ఉప్పొంగగా. విఠల్ నవ్వుతూ తలాడించి, గేర్ మార్చి ఏక్సిలేటర్ మీద కాలువేశాడు.‘నక్క తోక తొక్కి వచ్చినట్లున్నావ్’ అన్నట్లుగా చూస్తూ, కాంతారావు అతడికి టికెట్ ఇచ్చాడు. అంతవరకూ ఎవరెంత బ్రతిమాలినా ఆపకుండా బస్సుని లాగించిన విఠల్ వైఖరి ఉన్నట్లుండి ఎందుకు మారిందో అర్థం కాలేదతనికి. అయితే కూతురి పెళ్లికి సెలవివ్వని బాస్ మీద కసితో బస్సు నడుపుతున్న విఠల్‌కి,ఎందుకో తెలీదుగానీ అక్కడ బస్టాపులో నిలబడ్డ ముసలావిడని చూడగానే చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది.తండ్రి లేని తనను ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా పెంచి పెద్దచేసిందావిడ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమె, ఎప్పుడూ పదుగురికి ఆదర్శంగా నిలిచేది. తన కొడుకుకి చదువు పెద్దగా అబ్బకపోవటంతో ఆమె కొంత కలతచెందినా, అతడికి ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఉద్యోగంలో చేరటానికి బయల్దేరుతున్న సమయంలో ‘‘నాయినా! నువ్వు చెయ్యబోయే ఉద్యోగం సామాన్యమైంది కాదు. ఎంతోమంది ప్రాణాలే కాదు, వారి ఆశలూ, ఆశయాలూ నీ చేతిలో ఉంటాయి. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా దరిచేరనీయకూడదు. జనం ఎన్నో కష్టాల్లోనూ, టెన్షన్లలోనూ ఉండీ, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో నమ్మకంతో నీ బస్సెక్కుతారు. వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకు. నీమూలంగా ఏ ఒక్కరూ ఇబ్బందిపాలు కాకూడదు. నీవల్ల నష్టపోయిన వాళ్ల తిట్లు మన కుటుంబానికి శాపాలవుతాయి. వాళ్ల కృతజ్ఞతలు నీ పిల్లలకు ఆశీర్వచనాలై వారి మంచి భవిష్యత్తుకు సోపానాలవుతాయి. స్టీరింగ్ పట్టుకునే ప్రతిసారీ నా ఈ మాటల్ని మననం చేసుకో’’ అంటూ చెప్పింది. తన ప్రవర్తనవల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయనని తల్లికిచ్చిన మాట గుర్తుకొచ్చి ఒక్కసారిగా వీపుపై చెర్నాకోలతో చరిచినట్లైందతనికి. ‘ఎప్పుడూ నిబద్ధతతో మెలిగే తను ఈరోజిలా మారటం తప్పు. తన కూతురి పెళ్లి పనులురోజూ తాను డ్యూటీకి ఎక్కేముందుగానీ, దిగిన తర్వాతగానీ, నిద్రాహారాలు మానుకునైనా చేసుకోవచ్చు. అంతేగానీ ఒకరిమీద కోపాన్ని మరొకరిమీద చూపించటం ఎంతవరకు సమంజసం!?’ అనుకుంటూ ఆ ముసలమ్మకోసం బస్సాపాడు. కాస్త ఆలస్యంగానైనా సరే తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రతి స్టాపులోనూ బస్సుని ఆపసాగాడు. - గండ్రకోట సూర్యనారాయణ శర్మ -
సారీ...నో డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ మరోసారి స్తంభించింది. దాదాపు 1.5 లక్షల స్మార్ట్‌కార్డుల పంపిణీ పెండింగ్ జాబితాలో పడింది. దీంతో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరైన వారు, కొత్త వాహనాలను నమో దు చేసుకొన్న వాహనదారులు గత రెండు నెలలు గా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిబంధనల మేరకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో లైసెన్సులు, ఆర్సీ కార్డులను అందుకోలేకపోతున్నా రు. గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలతో పాటు, జిల్లాల్లోనూ ప్రతి ఆర్టీఏ కార్యాలయం పరిధిలో సుమారు 8 వేల నుంచి 10 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ పోస్టు ద్వారా వారం రోజుల్లో వాహనదారుల ఇంటికి చేరాల్సిన స్మార్ట్‌కార్డులు 2 నెలలు దాటినా అందకపోవడంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనల మేర కు స్మార్ట్ కార్డు ప్రింటింగ్ ఖర్చుతో పాటు, పోస్టల్ చార్జీలు, వివిధ పౌరసేవల ఫీజులు, తదితర ఖర్చులన్నీ కలిపి రూ.వేలల్లో వసూలు చేస్తున్న అధికారులు సకాలంలో సేవలను అందజేయకపోవడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా తరచూ కార్డుల కొరత తలెత్తుతుండటంతో నెలల తరబడి పంపిణీ స్తంభించిపోతోంది. అయినాప్రభుత్వం ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బకాయిలే కారణం... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వివిధ రకాల పౌరసేవల రెన్యువల్స్ పత్రాలను రవాణాశాఖ స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేస్తోంది. ఇందులో భాగంగా కార్డులు, ప్రింటింగ్‌కు అవసరమయ్యే రిబ్బన్లు, తదితర సామాగ్రిని ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఏటా సుమారు 21 లక్షల కార్డుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ద్వారా టెండర్లను నిర్వహించి అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థ గత కొన్నేళ్లుగా స్మార్ట్‌కార్డులను సరఫరా చేస్తోంది. ఒక్కో కార్డుకు రూ.21 చొప్పున చెల్లించి సదరు సంస్థ నుంచి కార్డులను కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా రవాణాశాఖ బకాయిలు చెల్లించకపోవడంతో సదరు సంస్థ తరచూ కార్డుల సరఫరాను నిలిపివేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల మేర బకాయిలు ఎం.టెక్కు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. దీంతో రెండేళ్లుగా కార్డు ల జారీకి బ్రేక్ పడుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో కార్డుల ప్రింటింగ్ స్తంభించిన ప్రతిసారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ మారితే పరిష్కారం లభిస్తుందా... ఒకవైపు కార్డుల కొరత ఇలా కొనసాగుతుండగానే మరోవైపు రవాణా అధికారులు పాత కాంట్రాక్ట్ స్థానంలో మూడు రోజుల క్రితం కొత్త సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థకు బదులు తాజాగా ఖైరోస్ అనే కొత్త సంస్థకు కార్డుల సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టారు. పాత సంస్థ రూ.21 కి ఒక కార్డు చొప్పున అందజేస్తుండగా, ఖైరోస్ మాత్రం రూ.19.17 కే కార్డు చొప్పున ప్రింట్ చేసి ఇచ్చేందుకు ముందుకు రావడంతో పాత సంస్థ స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఏ సంస్థకైనా కార్డులు సరఫరా చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. మొరాయిస్తున్న ప్రింటర్లు... మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రింట్ చేసే యంత్రాలు కూడా పాడయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో పని చేస్తున్నప్పటికీ వాహనదారుల డిమాండ్‌కు తగిన విధంగా కా>ర్డులను ప్రింట్ చేసి అందజేయలేకపోతున్నారు. ఒకవైపు సకాలంలో స్మార్ట్ కార్డులు సరఫరా కాకపోవడం, మరోవైపు ప్రింటర్లు మొరాయించడంతో కొన్ని చోట్ల 2 నుంచి 3 నెలల వరకు కూడా వినియోగదారులకు స్మార్ట్‌కార్డులు అందజేయలేకపోతున్నారు. కార్డులు, ప్రింటర్లు, టెక్నికల్ సామాగ్రి, వాహనాల అద్దెలు, తదితర ఖర్చులన్నీ కలిపి సుమారు రూ.26 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిధులు మంజూరు చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంత నిర్లక్ష్యమా... జీవితకాల పన్ను, త్రైమాసిక పన్ను, వివిధ రకాల పౌరసేవలపై విధించే ఫీజులు, అపరాధ రుసుములు, పర్మిట్లు, తదితర రూపంలో రవాణాశాఖకు ఏటా రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. పౌరసేవలకు సంబంధించి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, రెన్యువల్స్, తదితర సేవల కోసం ఆన్లైన్లో వాహనదారుల నుంచి ఫీజులు ముందే వసూలు చేస్తారు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1500 ఫీజు ఉంటే అందులో నిర్ధారిత ఫీజు మినహాయించి కార్డు ధర, ప్రింటింగ్ ఖర్చు, స్పీడ్ పోస్టు కోసం రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఫీజులు ముందే చెల్లించినప్పటికీ వినియోగదారులకు సకాలంలో పౌరసేవలను మాత్రం అందజేయలేకపోతున్నారు. ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని సముపార్జించే రవాణాశాఖ కేవలం రూ.26 కోట్ల బకాయిలు చెల్లించలేక, వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం గమనార్హం. -
తస్మాత్.. జాగ్రత్త
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : గడప దాటి రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా సరే మైనర్లు, తాగుబోతులు ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను చూసినట్లయితే డ్రైవింగ్‌పై అవగాహన లేని మైనర్లు వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఇటీవలే కొత్త అమెండ్మెంట్ వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట తరచూ జరుగుతుండగా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వెహికిల్స్ తోలడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం తదితరవి కొన్ని కారణాలైతే.. ఏమాత్రం అవగాహన లేని మైనర్లు ద్విచక్ర వాహనాలనే కాక ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలు కూడా నడపటం ప్రమాదాలు జరుగటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు నడిపితే ..తల్లిదండ్రులపై కేసు మోటార్ వెహికల్ యాక్ట్‌లో మరో కొత్త అమెండ్మెంట్ను ఇటీవలే తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఇకపై తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. పిల్లలు అతివేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైనా లేక పోలీసులకు పట్టుబడ్డా కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఇకపై సదరు మైనర్ల పైనే కాక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు కానుంది. సాధారణంగా వాహనం ఎవరిదైనా సరే దానిని నడిపే సమయంలో సదరు వ్యక్తికి సరైన పత్రాలు లేకుంటే జరిమానాలు విధిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు లేదా వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయి. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్ కొత్తగా వచ్చిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికే పేరెంట్స్ వాహనాలు ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఎంవీ అమెండ్మెంట్ ప్రకారం మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తాం. డైవింగ్ చేసే వారు ఎవరైనా సరే వాహనానికి సంబంధించిన పేపర్లతోపాటు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. మైనర్లు డ్రైవింగ్ చేయటం నేరం. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. – శ్రీకాంత్, ఆర్కేపీ ఎస్ఐ -
లైసెన్స్‌కూ ‘ఆధార’మే!
జలంధర్: దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు త్వరలోనే ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల నకిలీ, డూప్లికేట్ లైసెన్సుల జారీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ప్రసాద్ వెల్లడించారు. ‘పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో మరో కీలక సవరణ చేయబోతున్నాం. త్వరలోనే మోటార్ వాహనాల లైసెన్సులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడంలో ఆధార్ అన్నది గొప్ప పరిణామం’ అని పేర్కొన్నారు. ఆధార్–డ్రైవింగ్ లైసెన్సు అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలపై మాట్లాడుతూ..‘ఉదాహరణకు ఓ తాగుబోతు వాహనం నడుపుతూ నలుగురు వ్యక్తులను గుద్ది చంపేశాడనుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పంజాబ్ నుంచి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పుడు డాక్యుమెంట్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పొందగలడు. కానీ ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానిస్తే.. ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయి. ఓ వ్యక్తి మహా అయితే తన పేరును మార్చుకోగలడు తప్ప చేతి వేలిముద్రలను మార్చుకోలేడు. ఎవరైనా వ్యక్తులు నకిలీ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యత్నిస్తే.. కొత్త వ్యవస్థ బయోమెట్రిక్ ఆధారంగా సదరు వ్యక్తికి ఇప్పటికే లైసెన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. దీనివల్ల జరిమానాలు కట్టకుండా వాహనాలు నడపడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో 124 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
ఈజీగా డ్రైవింగ్ లైసెన్సు ..
లైసెన్స్‌ల జారీ విధానంలో రవాణాశాఖ సమూల మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటి వల్ల సులువుగా డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విశేషాలు.. వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. తొండంగి (తుని): ద్విచక్రవాహనాలకు మోటార్స్ సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్ రెండు రకాల లైసెన్స్‌లు ఉండేవి. ఆటోలు నడిపేందుకు త్రీవీలర్ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి ఉండాలి. ట్రాన్స్‌పోర్టు ప్యాసింజర్ వెహికల్స్, గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్‌పోర్టు వెహికల్ నడిపేందుకు విడివిడిగా లైసెన్స్‌లు మంజూరు చేసేవారు. దీంతోపాటు ప్యాసింజర్, హెవీ గూడ్స్ వెహికల్ నడిపాలంటే బ్యాడ్జిని పొందాల్సి ఉంది. మూడేళ్ల అనుభవం ఉన్న వారికి బ్యాడ్జి మంజూరు చేసేవారు. లైట్ మోటార్ వెహికల్ నాన్‌ట్రాన్స్‌పోర్టు ఉంటే సొంత కారు, లైట్‌మోటార్ వెహికల్(ట్రాన్స్‌పోర్టు) ఉంటే నాలుగు చక్రాల కమర్షియల్ పాసింజర్ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు జారీచేసే వారు. వాహనాలు నడిపేందుకు లైసెన్స్ జారీ విధానంలో పలు నిబంధనలతో కూడిన పలు రకాలు లైసెన్సు రవాణాశాఖ జారీ చేసేది. వీటిని పొందేందుకు వాహన యజమానులు, డ్రైవర్లు గతంలో పుట్టిన తేదీ కోసం పాఠశాలలో చదివిన ధ్రువీకరణపత్రం, ఎల్ఐసీ బాండ్ పేపర్ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇవి లేక వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు కాక తనిఖీ సమయంలో అపరాధ రుసుములు కట్టాల్సిన పరిస్ధితి ఉంది. దీంతో వాహనదారులు వాహనాన్ని నడిపే అనుభవం ఎంత ఉన్నా లైసెన్సులేక రహదారులపై తనిఖీల సమయంలో అధికారులకు పట్టుబడి ఇబ్బందులుపడుతున్నారు. పాత నిబంధనలతో బీమావర్తింపునకు ఆటంకం ప్రస్తుతం ఇప్పటి వరకూ డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అమలు చేసిన నిబంధనలు బీమా వర్తింపునకు ఆటంకంగా మారేవి. రోడ్డుపై ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వాహనానికి చేయించిన బీమా వర్తించాలంటే కచ్చితంగా ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. అదే సందర్భంలో నిబంధనల ప్రకారం వాహన రకాన్ని బట్టి ఆయా కేటగిరీకి చెందిన లైసెన్సు నిబంధనల ప్రకారం పొంది ఉన్నాడా? లేదా? అన్న విషయంపై బీమా సంస్థలు విచారణ చేసేవి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బీమా క్లెయిమ్‌ను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనల మార్పు బీమా వర్తింపునకు సులభతరం కానుంది. నూతన విధానం ఇలా.. వాహనాలను నడిపేందుకు లైసెన్స్ మంజూరులో నిబంధనలు పూర్తిగా మార్పు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయని కత్తిపూడి రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మోటార్‌సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్‌మోటార్ వెహికల్, ట్రాన్స్‌పోర్టు వెహికల్ నాలుగు విధానాల్లో మంజూరు చేసే విధంగా నిబంధనలు మార్పు చేశారు. 1. మోటార్ సైకిల్ వితౌట్ గేర్ 2.మోటార్ సైకిల్ విత్ గేర్ 3. లైట్ మోటార్ వెహికల్ ( ఈలైసెన్స్తో 7500 కిలోలు జీవీడబ్ల్యూ (గ్రాస్ వెహికల్ వెయిట్) వాహనం బరువు లోపు అన్ని త్రిచక్ర(ఆటోలు, గూడ్స్ ఆటోలు) నాలుగు చక్రాల వాహనాలు(కార్లు, సొంతవి, అద్దెవి, ట్రాన్స్‌పోర్టు, నాన్‌ట్రాన్స్‌పోర్టు, పాసింజర్, కమర్షియల్ టాటా మేజిక్ వంటి వాహనాలు) నడపవచ్చు. పైమూడు లైసెన్స్‌లు పొందేందుకు ఆధార్‌కార్డు ఉంటే చాలు. ఎటువంటి ధృవపత్రాలు అవసరంలేదు. (యాభై ఏళ్లు పైబడితే మెడికల్ సర్టిఫికెట్ ఇవాల్సి ఉంది. 4. ట్రాన్స్‌పోర్టు వెహికల్ లైసెన్స్: 7500 జీవీడబ్ల్యూ పైన ఉన్న పాసింజర్, గూడ్స్ వాహనాలన్నీ నడపవచ్చు. (లైసెన్స్ పొందేందుకు ఎనిమిదో తరగతి విద్యార్హత పొంది ఉండాలి). -
నికారుసైనోడు
‘‘ఏమిటోయి భేతాళా విశేషాలు?’’ రిలాక్స్డ్గా అడిగాడు విక్రమార్కుడు.‘‘నా దగ్గర విశేషాలుండవండీ... ప్రశ్నలే ఉంటాయండి’’ గంభీరంగా బదులిచ్చాడు భేతాళుడు.‘‘నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. ఎప్పుడూ ప్రశ్నలేనా? ఈరోజు సరదాగా జోక్ ఏదైనా చెప్పొచ్చుకదా’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఇవ్వాళ రేపు దారినపోయే దానయ్యను టచ్ చేసినా బోలెడు జోకులు చెబుతున్నాడు. మరి నా కంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి కదా’’ అన్నాడు భేతాళుడు.‘‘నీ స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు విక్రమార్కుడు.‘‘నువ్వు ఒక లైన్ చెబితే... దాని మీదే జోక్ చెబుతా’’ అన్నాడు భేతాళుడు.‘‘మనిషి అనేవాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువైతే ఇక అంతే!’’ లైన్ చెప్పాడు విక్రమార్కుడు.అప్పుడు విక్రమార్కుడి భుజం మీద ఉన్న భేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు...అది చలికాలం రాత్రి.పంజగుట్ట ఫ్లైవోవర్ సమీపంలో ఒకడు వేగంగా కారు నడుపుతున్నాడు. వాడిని కానిస్టేబుల్ ఆపాడు.‘‘ఏమిటండీ మీ ప్రాబ్లం?’’ కళ్లద్దాలు చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు కారువాడు.‘‘మీరు చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నారు సార్. డ్రైవింగ్ వచ్చిన వాళ్లెవరూ ఇలా డ్రైవ్ చేయరు. అసలు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఒకసారి చూపించండి’’ విండోలోకి తొంగి చూస్తూ అడిగాడు కానిస్టేబుల్.‘‘చూపిస్తే మీరేమైనా కొరుక్కుతింటారా? అదేమన్నా యాపిల్ పండా!’’ నవ్వుతూ అన్నాడు కారువాడు.‘‘అయితే చూపించండి సార్’’ వీలైనంత వినయంగా అడిగాడు కానిస్టేబుల్.‘‘ఉండీ ఛస్తేగా నీకు చూపించడానికి’’ కొండ చెరియలు కూలిపడ్డట్టు భళ్లున నవ్వాడు కారువాడు.‘‘ఏమిటీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా?’’ గట్టిగా అరిచాడు కానిస్టేబుల్.నిజంగా చెప్పాలంటే ఆ అరుపులో అరుపు మాత్రమే లేదు. కొండంత ఆవేదన ఉంది. రెండు కొండలంత ఆగ్రహం ఉంది!‘‘డ్రైవింగ్ లైసెన్స్ లేదా?’’ అనే కానిస్టేబుల్ ఆవేదనను, ఆగ్రహాన్ని పట్టించుకోకుండా...‘‘లేదంటే లేదని కాదు. ఉందిగానీ...’’ నసిగాడు కారువాడు.‘‘మరి ఉంటే చూపించరేం?’’ కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు కానిస్టేబుల్.‘‘ఉండి ఛస్తేగా’’ అన్నాడు తాపీగా కారువాడు.‘‘అదేంటీ సార్. ఉందంటారు. లేదంటారు. ఉందంటారు. లేదంటారు. మీ మాటలేమీ నాకు బోధ పడడం లేదు’’ అని బుర్ర గోక్కున్నాడు కానిస్టేబుల్.‘‘నీకు డాండ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లుంది. మంచి షాంపువాడు’’ అని సలహా ఇచ్చాడు కారువాడు.‘‘షాంపు సంగతి తరువాత.... ముందు మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి’’ బతిమిలాడుతున్నట్లు అడిగాడు కానిస్టేబుల్. ‘‘నిన్నటి వరకు ఉండేది. ఇవ్వాళ మందు కొట్టాను కదా. ఎక్కడో పోగొట్టుకున్నాను’’ చెప్పాడు కారువాడు.‘‘మందు కొట్టి కారు డ్రైవింగ్ చేస్తున్నారా?’’ అతిపెద్దగా ఆశ్చర్యపోయాడు కానిస్టేబుల్.‘‘నేను పెద్దగా తాగనండీ. నా బిజినెస్ పాట్నర్‌తో గొడవ జరిగింది. ఒరేయ్ నిన్ను చంపేస్తా అని అరిచాను. ఏది చంపు చూద్దాం అన్నాడు. చూపాను. నా దగ్గర నాటు తుపాకి ఉన్న మాటేగానే ఏరోజు చిన్నపిట్టను కాల్చిన పాపాన పోలేదు. అలాంటిది ఆరుడుగుల వ్యక్తిని అరనిమిషంలో కాల్చి పారేశాను.సరే, దురదృష్టమో అదృష్టమో వాడిని కాల్చాను.ఆ తరువాత దడ మొదలైంది.గుండెల్లో మెట్రోరైలు పరుగులు తీస్తుంది.ఇక తట్టుకోలేక పోయాను. దగ్గరలో ఉన్న బార్లోకి దూరి పూటుగా తాగేశాను. అప్పుడుగానీ దడ కంట్రోల్లోకి రాలేదంటే నమ్మండి’’ వివరంగా చెప్పాడు కారువాడు.‘‘ఒకర్ని చంపి, పూటుగా తాగి డ్రైవింగ్ చేస్తున్నారా!!!!! వామ్మో! అసలు మీ కారు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయా?’’ ఆందోళనగా అడిగాడు కానిస్టేబుల్.‘‘అసలు కారు నాదైతేగా’’ ఫ్లైవోవర్ కూలినట్లు మరోసారి భళ్లుమని నవ్వాడు కారువాడు.‘‘కారు మీది కాదా? మరెవరిది?’’ గుండెలు అరచేతిలో పెట్టుకొని అడిగాడు కానిస్టేబుల్.‘‘పూటుగా తాగిన మత్తులో నా కారు అనుకొని ఎవడిదో కారెక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. దారి మధ్యలో ఇది నా కారు కాదు వేరెవరిదో అనే విషయం అర్థమైంది. కానీ, కారులు వేరైనా దారులు ఒక్కటే...అని మన పెద్దలు అన్నారు కాబట్టి... కారు ఏదైతేనేం అనుకొని ఇలా కంటిన్యూ అయిపోయాను...’’ అని పండ్లు ఇకిలించాడు కారువాడు.కారువాడి మాటలకు కానిస్టేబుల్ మైండ్ బ్లాకైంది. వైట్ అయింది. రెడ్ కూడా అయింది. ‘‘వామ్మో... వీడు మామూలుడో కాదయ్యో’’ అని గుండెలు బాదుకుంటూ పై అధికారికి ఫోన్ చేశాడు.పెద్ద ఆఫీసర్ రంగంలోకి దిగాడు. ‘‘సర్, మీ కారును రోడ్డు పక్కన ఆపుతారా!’’ రిక్వెస్ట్ స్వరంతో అడిగాడు సీనియర్ ఆఫీసర్.‘‘అలాగే’’ అని రోడ్డుకు ఒక పక్కన కారు ఆపాడు కారువాడు.‘‘మీరు ఒకరిని కాల్చి చంపారని, అంతేకాదు...’’ అని పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్పబోతుండగానే మధ్యలోనే అడ్డుపడి...‘‘ఏమిటండీ మాటిమాటికీ కాల్చాను కాల్చాను అంటున్నారు. అసలు వాడు ఏంచేశాడో తెలుసా?’’ అని అరిచాడు కారువాడు.‘‘ఏంచేశాడు?’’ కళ్లు పెద్దవి చేసి అడిగాడు ఆఫీసర్.‘‘వాడు నేను కలిసి గంజాయి బిజినెస్ మొదలుపెట్టామండీ. ఐడియా నాదే. బ్రహ్మాండంగా వర్కవుటైంది. నాకు రావల్సిన కోటిరూపాయలను ఎగ్గొట్టాడు. మరి నేను ఎలా ఊరుకుంటానండి. వ్యాపారం అన్నాక న్యాయం, ధర్మం ఉండనక్కర్లేదా? మీరే చెప్పండి’’ గాద్గదిక స్వరంతో అన్నాడు కారువాడు.‘‘ఏమిటీ? గంజాయి వ్యాపారం చేశావా?’’ సన్నగా వణుకుతూ అడిగాడు ఆఫీసర్.‘‘బిజినెస్‌లో లాస్ వస్తే మరేం చేస్తామండీ’’ అమాయకంగా ముఖం పెట్టాడు కారువాడు.‘‘ఇంతకీ ఏం బిజినెస్ చేశారు?’’ గుండెను చిక్కబట్టుకుంటూ అడిగాడు ఆఫీసర్. ‘‘కట్ఫండ్ బిజినెస్ చేశానండీ’’ అన్నాడు కారువాడు.‘‘చిట్‌ఫండ్ గురించి విన్నాంగానీ కట్ఫంట్ ఏమిటండీ నా బొందా’’ అని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు ఆఫీసర్.‘‘కష్టాలన్నీ కట్ అయిపోయి... ఫండ్ చేతికందడమే కట్ఫండ్ బిజినెస్. ఒక్క రూపాయితో మా కంపెనీ షేర్ కొంటే... సంవత్సరం తిరిగేసరికల్లా లక్షరూపాయాలు చేతికందిలే ప్లాన్ చేశాను. బిజినెస్ సూపర్‌హిట్ అయింది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి, మా విషయం వినియోగదారులకు తెలిసిపోయి... మొదట కాల్ చేసి బెదిరించారు. ఆ తరువాత కత్తులతో ఆఫీసు ముందు క్యూ కట్టారు. ‘మా రూపాయి మాకు ఇవ్వాల్సిందే’ అని గట్టిగా అరిచారు. ‘మీ రూపాయి మీకు ఇవ్వడమే కాదు... మీకు ఇస్తానన్న లక్షరూపాయలు కూడా పువ్వులో పెట్టి ఇస్తాను అని చెప్పాను. ఇచ్చిన మాట కోసం గంజాయి దందా చేశాను. ఇప్పుడు చెప్పండి యవరారనర్. నేను చేసింది తప్పా... తప్పా... తప్పా... తప్పా.....’’ అని గట్టిగా అరిచాడు కారువాడు.రకరకాల ఏమోషన్స్ తట్టుకోలేక ఉన్నచోటునే కుప్పకూలిపోయాడు పూర్... పోలీస్ ఆఫీసర్! – యాకుబ్ పాషా -
రోడ్డు ప్రమాదాలకు ‘లైసెన్స్’
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, రోడ్డు నిబంధనలు, డ్రైవింగ్ నియమాలు తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ భావిస్తుంటారు. అయితే, గతేడాది (2017) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలకు కారకులు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారేనని తాజా అధ్యయనంలో తేలింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2019 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే విధమైన డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే, డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించడం జరగకపోతే ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని సేవ్‌లైవ్ ఫౌండేషన్ సీఈవో పీయూష్ తివారి హెచ్చరించారు. చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా అనర్హులు కూడా డ్రైవింగ్ లైసెన్సులు ‘కొనేస్తున్నార’ని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా సర్వే ప్రకారం... 2017లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలకు డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారే కారణం. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు పొందిన వారిలో 59శాతం మంది ఒక్క పరీక్షకు కూడా హాజరు కాలేదు. దేశంలో 25 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిలో రోడ్డు నిబంధనలు తెలిసిన వారు 12 శాతం కంటే తక్కువే. చాలామంది ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండానే దళారులకు 3,4 వేలు చెల్లించి డ్రైవింగ్ లైసెన్సు పొందుతున్నారనీ, అలాంటి వారి చేతిలో వాహనం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుందని పీయూష్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలను కచ్చితంగా అమలు పరచాలని ఇందుకోసం పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో లైసెన్స్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వాహనాల ఫిట్నెస్ను పరీక్షించడానికి ఆటోమేటిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారని, డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేస్తే లోపాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. -
ఆ ఒక్కటీ ఉంటే..!
సాక్షి, సిటీబ్యూరో: వందలకొద్దీ ప్రమాదాలు.. వేల సంఖ్యలో క్షతగాత్రులు. ఒక్క చిన్న లోపం కారణంగా సకాలంలో వైద్యం లభించక అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులలో ఆధార్ నెంబర్‌తో పాటు వ్యక్తిగత వివరాలను పక్కాగా నమోదు చేసే రవాణాశాఖ మరో ముఖ్యమైన అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. అదే బ్లడ్ గ్రూప్. ఈ ఒక్క అంశం డ్రైవింగ్ లైసెన్సుల్లో ప్రస్తావించకపోవడంతో ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సత్వరమే వైద్యం లభించడం లేదు. క్షతగాత్రుల రక్తనమూనా వివరాలు వైద్యులకు వెంటనే తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ప్రమాదాల్లో పెద్ద ఎత్తున రక్తస్రావమైన వారికి వెంటనే రక్తం ఎక్కించలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల తీవ్రత, బాధితుల సంఖ్య పెరుగుతోందని రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన సుమారు 1209 రోడ్డు ప్రమాదాల్లో 1,221 మంది వరకు గాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు. 154 మంది మృత్యువాత పడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందితే మృతుల సంఖ్య ఇంకా తగ్గేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తీవ్ర రక్తస్రావానికి గురైన వారికి సకాలంలో వైద్యం లభించకపోవడంతో చివరకు కాళ్లు, చేతులు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ‘ఎక్కడో ఊరికి దూరంగా ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో బంధువులు, తెలిసినవాళ్లు ఎవ్వరూ ఉండరు. క్షతగాత్రులను పోలీసులు, 108 సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్పిస్తారు. కానీ ఆ సమయంలో బాధితుల రక్త నమూనా తెలిస్తే తప్ప వైద్యం చేయలేం. అప్పటికే గాయపడి రక్తస్రావమవుతున్నవాళ్లు, రక్త నమూనా తెలుసుకొనే వరకు మరింత రక్తాన్ని కోల్పోవాల్సి వస్తోంద’ని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్‌కమల్ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు రహదారి భద్రతా రంగంలో పనిచేసే సంస్థలు సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ‘అనేక దేశాల్లో వాహనదారుల పూర్తి వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా డ్రైవింగ్ లైసెన్సుల్లో నమోదై ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అది తప్పనిసరి కాకపోవడం గమనార్హం’ అని ఇండియన్ రోడ్ సేఫ్టీ సంస్థ ప్రతినిధి వినోద్ కనుముల పేర్కొన్నారు. లైసెన్సుల జారీ ఇలా... గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1000 నుంచి 1500 వరకు లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తారు. లైసెన్సులు తీసుకొనే అభ్యర్థులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈ స్లాట్ సమోదు సమయంలోనే అభ్యర్ధులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, విద్యార్హతలు నమోదు చేయాలి. వీటిలో ఏ ఒక్కటీ నమోదు చేయకపోయినా స్లాట్ లభించదు. అన్ని వివరాలకు ప్రత్యేకంగా ఒక కాలమ్ కేటాయించినట్లుగానే బ్లడ్ గ్రూపు కోసం కూడా కేటాయించారు. కానీ అభ్యర్థులు తమ బ్లడ్ గ్రూపు వివరాలను నమోదు చేయకపోయినా సరే స్లాట్ లభిస్తుంది. మోటారు వాహన చట్టంలో బ్లడ్ గ్రూపు తప్పనిసరి అనే నిబంధన లేకపోవడంతోనే, దానిని ఒక ఆప్షన్‌గా ఉంచామని రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘బ్లడ్గ్రూపును తప్పనిసరి చేస్తే మంచిదే. కానీ అభ్యర్థులు నమోదు చేసిన వివరాలు సరైనవా కాదా తెలుసుకొనేందుకు డాక్టర్ల ధ్రువీకరణ అవసరం. ఇది చాలా పెద్ద పని. కేంద్ర మోటారు వాహన నిబంధనల్లో ఆ అంశం తప్పనిసరి అని లేకపోవడంతో పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని మరో అధికారి చెప్పారు. గవర్నర్ చెప్పినా... డ్రైవింగ్ లైసెన్సుల్లో బ్లడ్‌గ్రూపు తప్పనిసరిగా ప్రస్తావించకపోవడాన్ని గవర్నర్ నరసింహన్ గతంలోనే గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో బ్లడ్ గ్రూపు ఉంటే మంచిదని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్లకు పని తేలికవుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఆర్టీఏ అధికారులు ఈ సలహాను సీరియస్‌గానే పరిగణించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉంటే మంచిది... డ్రైవింగ్ లైసెన్సులో బ్లడ్ గ్రూపు ఉంటే చాలా మంచిది. వెంటనే వైద్యం చేయగలుగుతాం. చాలామంది తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరుతారు. అలాంటి సమయంలో వెంటనే రక్తం ఎక్కించలేం కదా. పరీక్ష చేయాల్సిందే. అప్పటి వరకు పేషెంట్ మరింత నష్టపోవాల్సి వస్తుంది.– డాక్టర్ రామ్ కమల్, ఆర్థోపెడిక్ సర్జన్ తప్పనిసరి చేయాలి.. స్లాట్ నమోదులో బ్లడ్‌గ్రూపు కోసం ఒక కాలమ్ ఉంచినప్పుడు దానిని తప్పనిసరి చేస్తే మరింత బాగుండేది. నిజానికి డ్రైవింగ్ లైసెన్సు ఒక కీలకమైన ధ్రువీకరణ. దానిని ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రామాణికంగా ధ్రువీకరించే వెసులుబాటు ఉండాలి.– వినోద్ , ఇండియన్ రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ -
బండి..లైసెన్సు లేదండి
జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనాలకంటే డ్రైవింగ్ లైసెన్స్‌లు తక్కువగా ఉండడంఆశ్చర్యం కలిగిస్తోంది. వాహనచోదకులు చాలావరకు లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడపడం, తరచూ పోలీసుల తనిఖీలలో పట్టుబడి జరిమానా కట్టడం షరా మామూలుగా మారింది. మరికొందరు లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవడంలోను అలసత్వం వహిస్తూ జరిమానాలు చెల్లిస్తున్నారు. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అవగాహనా శిబిరాలు, ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించినా వాహనదారుల్లో చలనం రావడం లేదు. తిరుపతి అన్నమయ్యసర్కిల్: నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తున్నా వాహనచోదకులలో మార్పు కనిపించడం లేదు. ఒక తిరుపతి పరిధిలోనే వేలసంఖ్యలో వాహనచోదకులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకపోవడం దారుణం. వాహనదారులు జరిమానాలను సైతం లెక్కచేయకుండా చెల్లించడం మళ్లీ షరామామూలుగా డీఎల్ లేకుండా తిరుగుతున్నారు. ద్విచక్రవాహన చోదకునికి డీఎల్ లేకపోతే రూ.1500, లైట్ మోటార్ వెహికల్ చోదకులకు రు.2000, హెవీ మోటార్ వెహికల్ చోదకులకు రూ.5000 వరకు ప్రస్తుతం జరిమానా విధిస్తున్నారు. స్పందించని వాహనదారులు.. వాహన చోదకుల్లో మార్పు తీసుకురావడానికి రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పలు రకాలుగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. వీటికి మంచి స్పందన కనిపిస్తున్నా వాహనచోదకులలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంలో ఎన్నివిధాలుగా అధికారులు వారించినా ఫలితం ఉండడం లేదు. జిల్లాలో ఎక్కువ శాతం ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్స్‌లేని వాహనచోదకుల కారణంగానే జరుగుతుండటం గమనార్హం. కఠినతరం చేయాల్సిందే.. డీఎల్ లేని వాహనచోదకులకు జరిమానా విషయంలో భారీగా విధించి, శిక్షను సైతం కఠినంగా విధించేలా చట్టాలలో మార్పు తీసుకురావాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చనేది వారి అభిప్రాయం. ప్రజలలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై అనేక కేసులలో న్యాయస్థానాలు సైతం కఠినంగా వ్యవహరించాయి. డీఎల్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదం సంభవిస్తే ఎటువంటి బీమా వాహనచోదకుడికి లభించదు. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన సదరు వ్యక్తి నుంచి అపరాధరుసుంను సైతం వసూలుచేసి ప్రమాదానికి గురైన వ్యక్తికి చెల్లించడం జరుగుతుంది. కఠినంగా వ్యవహరిస్తున్నాం ప్రమాదాలను అరికట్టేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానాలతో పాటు, కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నాం. డీఎల్ ప్రక్రియను సైతం రవాణా శాఖ సులభతరం చేసింది. ఎల్ఎల్ఆర్ పరీక్షకోసం ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ యాప్ అందుబాటులో ఉంది. పరీక్షలో సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చు. డీఎల్ కాలపరిమితి ముగిసిన వాహనచోదకులు ఆన్లైన్ ద్వారా రెన్యూవల్ చేయించుకోవాలి.–జి. వివేకానందరెడ్డి, తిరుపతి ఆర్టీఓ ద్విచక్ర వాహనాలే ఎక్కువ ప్రతిరోజు తిరుపతి పరిసర ప్రాంతాలలో 250 నుంచి 350 కేసులు అన్ని రకాల వాహనాలపై నమోదు అవుతున్నాయి. వీటిలో రోజుకు 50 నుంచి 80 కేసులు లైసెన్స్‌లేని ద్విచక్ర వాహన చోదకులపైనే. జరిమానాలతో ప్రభుత్వానికి రోజుకు రూ.80 నుంచి ఒకలక్ష వరకు చెల్లిస్తున్నారు. తర్వాత స్థానంలో ఆటోలు, కార్లపై కేసులు నమోదవుతున్నాయి. వాహన చోదకులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి – తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారి -
మీ ‘గుర్తింపు’ @ డిజిలాకర్!
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, ఓటర్ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు...ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా సరే మీరు ఇక ఎంచక్కా డిజిటల్ రూపం ఇవ్వొచ్చు. మీ సెల్ఫోన్లోనే అన్నింటినీ ఒకేచోట ఈృకాపీల రూపంలో భద్రపరుచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక్క క్లిక్‌తో వాటిని తీసి అడిగిన వారికి చూపించొచ్చు. ‘డిజిటల్ ఇండియా’లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ యాప్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. ఈ అప్లికేషన్ వెబ్సైట్లతోపాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ లాకర్లో భద్రపరుచుకోవడమే ‘డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, మీసెల్ఫోన్ నంబర్లకు దీనిని లింక్చేస్తారు. ఒక్కోవినియోగదారుడు 1 జీబీ డేటావరకు క్లౌడ్ పద్ధతిలో లో భద్రపరుచుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో స్కాన్ చేసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఈృసంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్లుఅవుతుంది.అదే విధంగా సీబీఎస్ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్నుశాఖలు జారీచేసే డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలనూ నేరుగా మీ డిజిలాకర్ఖాతాలోకి పంపొచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థతోపాటు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ, సీబీఎస్ఈ సహా వివిధ స్కూలు బోర్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కులషీట్లు, కుల, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం డిజిలాకర్నువాడుతున్నారు. ఉపయోగించడం ఇలా.. - డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్సైట్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిలాకర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ కోసం ఆధార్, మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి. - ఏదైనా సంస్థ మీ ఈృడాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేసినా మీ అకౌంట్లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్లోడ్ చేయడంతోపాటు వాటిపై సంతకం చేయొచ్చు. - ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందొచ్చు. ఇందుకోసం ఈృడాక్యుమెంట్లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది. -
విశాఖలో ఎనర్జీ స్టోరేజి పార్కు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజి పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ స్టోరేజీకి రాష్ట్రంలో అన్ని అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఉండవల్లిలోనీ గ్రీవెన్స్ హాలులో సోమవారం హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజి డివైజ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపైనే యువత దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి ఖరీదైందని, అలాంటిది ఇప్పుడు చౌకధరకు ఇస్తున్నామని చెప్పారు. నిన్నటిదాకా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్నారని, ఇప్పుడు పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎనర్జీ స్టోరేజి కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, చివరికి అది కూడా సాధ్యమైందని తెలిపారు. 2020 నాటికి దేశంలో 15 వేల మెగావాట్ల హై ఎనర్జీ స్టోరేజి డివైజ్ మార్కెట్‌కు అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో ఎనర్జీ స్టోరేజికి అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అంతరం తొలగించేందుకు నాలుగేళ్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఉపాధి కల్పించే చదువుకే పెద్దపీట వేయాలన్నారు. ఈ సందర్భంగా భారత్ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీని చంద్రబాబు అభినందించారు. నేనూ అవయవదానం చేస్తా.. అవయవదానానికి తాను ముందుకు వస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అవయవదానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో అవయవదానం ఒక షరతుగా పెట్టే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో అవయవదాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా), ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు అందించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాల దానం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. 1.20 లక్షల మంది అవయవదానానికి ముందుకురావడాన్ని ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.వి.రావు, మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య పాల్గొన్నారు. తిరుపతిలో హోలీటెక్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ నెలకొల్పేందుకు దానికి సంబంధించిన హోలీటెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభించాలని, జనవరిలో ఉత్పత్తి ప్రారంభించాలని హోలీటెక్ ప్రతినిధులను కోరారు. సమావేశంలో మంత్రి నారా లోకేశ్, హోలీటెక్ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమీ వైస్ ప్రెసిడెంట్ మనోజైన్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదతరులు పాల్గొన్నారు. -
డ్రైవర్ సారమ్మ
ఇద్దరు వాదులాడుకుంటుంటే జనాలంతా గుమిగూడి చోద్యం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి సైలెంట్‌గా అక్కడ టీ స్టాల్ ఓపెన్ చేసేస్తే అతను కేరళకు చెందినవాడని నిర్ధారించుకోవచ్చట. స్పేస్‌లో మనిషి జాడ కనపడగానే అక్కడా ఓ దుకాణం వెలుస్తుందట. అది కచ్చితంగా మలయాళీదే అయ్యుంటుందిట! ఇలాంటివన్నీ కేరళైట్స్ మీద జోక్స్‌లా కొట్టిపారేయొద్దు. వాళ్ల శ్రమతత్వానికి, వేగవంతమైన ఆలోచనలకు, ముందుచూపులకు నిదర్శనం ఇవి. ఈ వాస్తవానికొక నిదర్శనమే కేరళకు చెందిన సారమ్మ థామస్. కానీ ఇప్పుడు ఆమె ఉంటోంది సౌదీ అరేబియాలో. దమ్మమ్లోని జుబైల్ కింగ్ అబ్దుల్ అజిజ్ నావల్ బేస్ మిలిటరీ హాస్పిటల్లో నర్స్‌గా పనిచేస్తోంది సారమ్మ. తొలి భారతీయ మహిళ విషయం ఏంటంటే.. కిందటేడు అంటే 2017, సెప్టెంబర్‌లో సౌదీ కింగ్ సల్మాన్ .. అక్కడి మహిళలు డ్రైవింగ్ చేయొచ్చు అని చట్టాన్ని సడలించాడు.. సవరించాడు. అది కిందటి నెల (జూన్) 24 నుంచి అమల్లోకి వచ్చింది. అలా సవరించగానే ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి భారతీయురాలే ఈ సారమ్మ థామస్. ఈ జూన్ 28న ఆమె సౌదీ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకుంది. ట్యాక్సీ నడపడమూ మొదలుపెట్టింది. లేడీ టీచర్లను తీసుకెళ్లే బస్సులకు, గర్ల్స్ స్కూల్ బస్సులకు మహిళా డ్రైవర్లనే నియమించే ప్రయత్నం చేస్తోంది సౌదీ ప్రభుత్వం. అంతేకాదు మహిళా ట్యాక్సీలకు, కార్ రెంటల్ సర్వీసులకూ అనుమతులు ఇచ్చింది. మహిళా డ్రైవర్లకు శిక్షణనివ్వడం కోసం మహిళా శిక్షకులకే అవకాశం ఇస్తోందట. దీని కోసం సౌదీలో అయిదు ప్రధాన ప్రాంతాల్లో శిక్షణా సంస్థల్ని కూడా ప్రారంభించింది. అయితే వీటన్నిటికీ కేరళ స్త్రీల క్యూనే ఎక్కువగా ఉందట. నిజానికి సౌదీ ప్రభుత్వమూ మలయాళీ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందట. ఏకాగ్రత, సహనం, సౌదీ చట్టాల పట్ల వాళ్లకున్న అవగాహన, గౌరవం, బాధ్యత వీటన్నిటి దృష్ట్యా మలయాళీలకే ప్రాముఖ్యం దొరుకుతోందని అంటున్నారు సౌదీలోని భారతీయులు. అందుకే మలయాళీల మీద జోకులు ఆపి వాళ్లలో ఉన్న కష్టపడే తత్వాన్ని నేర్చుకుంటే మంచిదేమో! -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఏం ఆందోళన చెందక్కర్లేదట. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను ఐడీ ప్రూఫ్స్ అంగీకరిస్తామని దేశీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం ప్రకటించింది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది. ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను, వాలిడ్‌గా భావిస్తామని రైల్వే చెప్పింది. ‘డిజిలాకర్ అకౌంట్లోకి లాగిన్ అయి ఇష్యూడ్ డాక్యుమెంట్ల సెక్షన్‌కు వెళ్లి ప్రయాణికులు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే, దాన్ని వాలిడ్ గుర్తింపుగానే ధృవీకరించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను, ఆధార్‌ను డిజిటల్‌గా అందిస్తోంది. సీబీఎస్ఈతో కూడా ఇది భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. -
దరఖాస్తు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్సులు..!
మథుర: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. మరి అడగకుండానే.. అసలు దరఖాస్తు చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుచేసేవాళ్లను ఏమంటారు? అదికూడా చనిపోయినవారికి!! ఉత్తరప్రదేశ్‌లో ఘనత వహించిన మథుర రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి కార్యాలయం చేసిన బిత్తిరిపని ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్నేళ్ల కిందట ఇదే మథుర ఆర్టీఏ.. పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ పేరు, ఫొటోతో డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. జైసింగ్‌పూర్‌లో నివసించిన ఛెత్రామ్ జాదన్ అనే వ్యక్తి 2017, జూన్9న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మొహల్లా మసాని ప్రాంతానికి చెందిన వీరేంద్ర అనే మరో వ్యక్తి 2017, నవంబర్26న లారీ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వీరిద్దరి పేర్లమీద మథుర అసిస్టెంట్ ఆర్టీఏ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా మథుర ఏఆర్టీఏను ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఆ ఏఆర్టీఏ మాత్రం తప్పందా క్లర్క్‌దేనని వాదిస్తున్నాడు. చివరికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. -
లైసెన్స్ లేకుండానే రయ్..రయ్!
నూనూగు మీసాలు కూడా రాని బాలుడు లైసెన్స్ లేకుండానే బులెట్‌పై నగరంలో హల్చల్ చేస్తాడు. కాలేజీ కుర్రకారు బైక్ రేసులతో భయం పుట్టిస్తారు. మైనర్లతో పాటు చాలామంది వాహనదారులు ఎటువంటి లైసెన్సులు లేకుండానే వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణా శాఖ తనిఖీల్లో చేపట్టి జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో జూన్ 3న పదివేల మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేసేందుకు రవాణా అధికారులు ప్రణాళిక రూపొందించారు. విజయవాడ: ఏపీ తాత్కాలిక రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ నగర రోడ్లపైకి వేలాది మంది వాహనదారులు లైసెన్స్ లేకుండా దూసుకువస్తున్నారు. ఓ వైపు విస్తరణకు నోచని రహదారులు, ఏటా పెరుగుతున్న వాహనాలు, మరోవైపు లైసెన్స్ లేకుండా వేలాది మంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో నగర వాసులు బెంబెలెత్తిపోతున్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా రవాణాశాఖ అప్రమత్తమైంది. సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నగరంలో ప్రతి నిత్యం సుమారుగా 5లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటిలో సింహభాగం ద్విచక్ర వాహనాలే. రెండేళ్ల కాలంలో కొత్తగా 1.75లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇటీవల కాలంలో లైసెన్స్ లేకుండా వాహనాదారులు అడ్డూ అదుపు లేకుండా రోడ్లపై చెలరేగుతున్నారు. ఈ క్రమంలో రవాణాశాఖ ముందుగా కొరడా ఝళిపించింది. వాహనాల తనిఖీలు చేసేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. ఈ తనిఖీల్లో వేలాది మంది లైసెన్స్ లేని వాహనదారులు రోడ్లపైకి వస్తున్నట్లు తేలింది. 2016లో 19,617 కేసులు, 2017లో 14,066 కేసులు, 2018లో ఇప్పటివరకు 3వేల మంది లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో మైనర్లు, మహిళలు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని వారిపై మరింత కఠిన చర్యలకు రవాణాశాఖ దిగింది. మూడు నెలల్లో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 270 మందికి కోర్టు ద్వారా జైలు శిక్ష కూడా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయినా వారిలో మార్పురాక పోవటంతో రవాణా శాఖ వినూత్నంగా ఆలోచించి వాహనం నడిపే వారందరూ విధిగా లైసెన్స్ పొందే విధంగా ప్రజ లకు అవగాహన కల్పిస్తోంది. కళాశాలలు, విద్యాసంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా వాహనచోదకులు విధిగా లైసెన్స్ పొందాలని సూచిస్తోంది. జిల్లాలో మచిలీ పట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట ఏరియాల్లో రవాణా అధికారులు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహించారు. ఏడాది కాలంలో 6500మందికి కొత్తగా లైసెన్స్‌లు జారీ చేశారు. తాజగా జూన్ 3వ తేదీన విజయవాడలో మెగా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేళా ద్వారా దాదాపు నగర వ్యాప్తంగా 10వేల మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేయాలనే లక్ష్యంతో ప్రైవేటు సంస్థల సాంకేతిక సహకారంతో ఎల్ఎల్ఆర్ టెస్ట్‌లు నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్ఎల్ఆర్ మేళాపై కరపత్రాల ద్వారా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. -
వాహన యజమానులకు గుడ్‌న్యూస్
గౌహతి : వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాయి. వాహన యజమానులు తమ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసేముందు ఎలాంటి రోడ్డు పన్ను చెల్లించాల్సినవసరం లేకుండా రాష్ట్రాల రవాణా మంత్రుల బృందం ప్రతిపాదనలను రూపొందించింది. అంతేకాక తేలికగా కొత్త రిజిస్ట్రర్ నెంబర్ పొందేలా కూడా మార్గదర్శకాలను తయారుచేసింది. వీటిని ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తేబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం నాటి వాహనాలకు లేదా రెండు రాష్ట్రాల మధ్య పన్ను రేటు 2 శాతం తక్కువగా ఉంటే అమల్లోకి వస్తుంది. ఈ విషయంపై 12 మంది రవాణా మంత్రుల బృందం గౌహతిలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహనాల బదిలీ, ఆన్లైన్లోనే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రైవింగ్ లైసెన్సును బదిలీ చేయడం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రోడ్డు, రవాణాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించడమే కాకుండా, ప్రజలకు వేధింపులు తగ్గించవచ్చని మంత్రులు నిర్ణయించారు. రవాణా రంగానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ, రూల్స్‌తో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతోంది. ప్రస్తుతం వాహన రిజిస్ట్రేషన్‌ను, డ్రైవింగ్ లైసెన్స్‌ను బదిలీ చేయడానికి వాహనదారులు ఆర్టీఓ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలేమీ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియలన్నీ ముగించేలా మంత్రుల బృందం మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రెండు సెంట్రల్ ఆన్లైన్ డేటా బేస్‌లను రూపొందించింది. దానిలో ఒకటి వాహన్-4 దీనిలో వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి. రెండు సారథి-4 దీనిలో అంతకముందు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ తొలగించి, కొత్త దాన్ని జారీచేస్తారు. మంత్రుల బృంద ప్రతిపాదనల మేరకు సెంట్రల్ డేటాబేస్‌లో ప్రతి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. -
మందుబాబులూ జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్‌లో చిక్కిన మందుబాబుల్లో ఆరుగురి డ్రైవింగ్ లైసెన్సుల్ని న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ వి.రవీందర్ శనివారం వెల్లడించారు. గత నెల 26 నుంచి శుక్రవారం వరకు మొత్తం ఆరు రకాలైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కిన 655 మంది వాహనచోదకులపై ఎర్రమంజిల్‌లోని మెట్రోపాలిటన్ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయగా అందులో 195 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు ఆరుగురి డ్రైవింగ్ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేయగా... నలుగురివి మూడేళ్ళు, పది మందివి రెండేళ్ళు, ఎనిమిది మందివి ఏడాది, ఇద్దరివి ఆరు నెలలు, 49 మందివి మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. గరిష్టంగా 10 రోజులు..కనిష్టంగా ఒక రోజు మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, తొమ్మిది మందికి ఐదు రోజులు, పది మందికి నాలుగు రోజులు, 18 మందికి మూడు రోజులు, 69 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు పడ్డాయని రవీందర్ తెలిపారు. మైనర్ డ్రైవింగ్ కేసులో ఒకరికి నాలుగు రోజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరంపై 36 మందికి ఒకరోజు, నలుగురికి రెండు రోజులు, మైనర్‌కు వాహనం ఇవ్వడం నేరంపై (తండ్రి/యజమాని) తొమ్మిది మందికి ఒక రోజు, భారీ స్థాయిలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఒకరికి ఒక రోజు, ఇద్దరికి 2 రోజులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన 21 మందికి ఒక రోజు, 12 మందికి రెండు రోజులు జైలు శిక్ష పడింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, వీరికి పాస్పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన చెప్పారు. -
బాలుడి ప్రాణం తీసిన ‘మైనర్ డ్రైవింగ్’
-
‘మైనర్’ నిర్లక్ష్యమే అని వదిలేస్తే..
సాక్షి, హైదరాబాద్: - పద్నాలుగేళ్ల కుర్రాడు స్పోర్ట్స్ బైక్‌పై దూసుకుపోతుంటాడు.. - పదిహేడేళ్ల విద్యార్థి హైస్పీడ్ వాహనాన్ని నడిపేస్తుంటాడు.. ఇలాంటి దృశ్యాలు నగరంలోనూ.. శివారు ప్రాంతాల్లోనూ నిత్యం మనకు కనిపిస్తుంటాయి. ఇది కొందరికి సరదా అయితే మరికొందరికి అవసరం. ఏదిఏమైనా.. వీరు మైనర్లని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, వాహనం నడపకూడదని అందరికీ తెలుసు. అయినా అడ్డూఅదుపూ లేకుండా నగరంలో.. ప్రధానంగా ఓల్డ్‌సిటీలో మైనర్లు వాహనాలపై దూసుకుపోతూనే ఉన్నారు. వీరిని ఎవరూ పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యమే ఆదివారం బహదూర్‌పుర ప్రాంతంలో రియాజ్(12) ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఉన్న ప్రేమతో మైనార్టీ తీరకుండానే వాహనాలు కొనిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మైనర్లు యథేచ్ఛగా ‘దూసుకుపోతున్నారు’. ఫలితంగా పెనువిషాదాలతో కడుపుకోత మిగులుతోంది. నిబంధనలు ఏం చెప్తున్నాయంటే.. భారత మోటారు వాహనాల చట్టం(ఎంవీ యాక్ట్) ప్రకారం పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్లపైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. ఇతర దేశాల్లో అయితే.. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు, యూత్ విజృంభిస్తున్నారనేది అధికారుల వాదన. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంపై బయటకు వస్తే వాహనం సీజ్ చేస్తారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. అక్కడ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే వారి లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఉన్న కొన్నింటినీ సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే.. అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఓ వాహనచోదకుడు ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడనే డేటా ఎక్కడా అందుబాటులో ఉండదు. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రవాణా శాఖ వద్ద లేదు. దీంతో ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఉల్లంఘించినా ఫైన్‌తో సరిపెట్టాల్సి వస్తోంది. టీనేజర్లు.. టూవీలర్లు.. ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువ జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాతి స్థానం తేలికపాటి వాహనాలైన కార్లది. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహనచోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వాటికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకుంటున్న రేసింగ్స్ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి. తల్లిదండ్రుల పాత్ర ఎంతో.. పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక యాంత్రిక జీవితం నేపథ్యంలో తల్లిదండ్రులకు ఉండట్లేదన్నది ట్రాఫిక్ పోలీసుల మాట. దీంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలకు మైనార్టీ తీరకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు కొని ఇస్తూ ‘ప్రేమను’ చాటుకుంటున్న తల్లిదండ్రులు పరోక్షంగా వారి విచ్చలవిడితనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు. -
మద్యం మత్తులో ప్రాణాలు చిత్తు
చిత్రంలో తలతెగి మొండెం కలిగిన బైక్ చూశారా.. మద్యం మత్తులో హెల్మెట్ పెట్టుకోకుండా ఎన్.బంగారయ్య (24) అనే యువకుడు ఈ నెల 16న ఆర్టీవో కార్యాలయం సమీపంలో నేరుగా విద్యుత్ స్తంభానికి బైక్‌తో ఢీకొట్టాడు. తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ప్రమాదంలోనే బైక్ ఇలా రెండు ముక్కలైంది. దీనినే ట్రాఫిక్ పోలీసులు ప్రజలందరికీ తెలిసేలా ఒక పోస్టర్లో మృతుడి ఫొటోతో పాటూ బైక్‌ను ప్రదర్శించి, వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరం టౌన్: ఆ ప్రమాదమే కాదు.. ఇప్పుడు చాలా ప్రమాదాలు మద్యం మత్తులోనే జరుగుతున్నట్టు పోస్టు మార్టం నివేదికలు తేల్చి చెబుతున్నాయి. మద్యం మత్తులో ఊగుతూ.. జోగుతూ మోటార్ బైక్‌లు నడపుతూ ఎదుటివారిని గుర్తించకుండా.. తామేమైపోతున్నామో తెలియని స్థితిలో ఏ చెట్టుకో, స్తంభానికో, లేక ఎదురుగా వస్తున్నా వారికో ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. అవతలవారి ప్రాణాలు తీస్తున్నారు. ఇరువైపుల కుటుంబాల్లోనూ విషాదం నింపుతున్నారు. మద్యం మత్తులో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారే ప్రమాదాలకు కారకులవుతుండడం పోలీసులను కలవర పరుస్తోంది. వేగంగా నడుపుతూ... మద్యం మత్తుతో పాటు యువకులు బైక్‌లను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సాధారణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు బైక్‌లపై దూసుకుపోతూ ఎదుటివారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్నిసార్లు అదుపుతప్పి డివైడర్లకు ఢీకొట్టి ప్రాణాలు విడుస్తున్నారు. నూతన సంవత్సరం రోజున అతివేగమే నలుగురు యువత ప్రాణాలను తీసినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత కుడుకు డిగ్రీకెళ్తే చాలు తల్లిదండ్రులు బైక్‌లు కొనిస్తున్నారు. డ్రైవింగ్ వచ్చా.. లైసెన్స్ ఉందా.. లేదా అన్న విషయాలు పట్టించుకోవడంలేదు. ఈ నిర్లక్ష్యమే వారి ప్రాణాలను తోడేస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నా స్పందించేవారు కరువయ్యారు. పోలీస్ కేసులు ఇలా... ♦ 2017లో ఒక వాహనం ఒకటి కన్నా ఎక్కువసార్లు ప్రమాదానికి గురైనవి 1779 వరకూ ఉన్నాయి. ప్రమాదానికి కారకులైన 210 మంది డ్రైవింగ్ లైసెన్సులను పోలీసులు రద్దుచేశారు. ♦ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై 2016లో 72,371 మందిపై కేసులు నమోదు చేయగా.. 2017లో 88,722 మంది ఉన్నారు. ♦ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేసే వారి సంఖ్య 2016లో 17,178 మంది ఉండగా, 2017లో అలాంటి వారిపై 12,508 పై కేసులు నమోదు చేశారు. ♦ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2016లో 4021 నమోదుకాగా, 2017లో 5,165 నమోదయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై 2016లో 625 కేసులు నమోదు చేయగా, 2017లో 1797 కేసులు నమోదుచేశారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌లకు బ్రేక్..!
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలం కోరుకొండపాలెంనకు చెందిన కె. సతీష్ అక్టోబర్‌లో రవాణాశాఖ కార్యాలయంలో త్రీవీలర్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై పాసయ్యాడు. అయితే ఈ రోజు వరకు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందలేదు. అలాగే ఎస్.కోట మండలం కిల్తంపాలెం గ్రామానికి చెందిన కె.వంశీకృష్ణ ఆగస్టులో టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఇతనికి కూడా ఇంతవరకు లైసెన్స్ కార్డు అందజేయలేదు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో వేలాదిమంది వాహనదారుల పరిస్థితి ఇలానే ఉంది. నాలుగు నెలలుగా కార్డులు అందకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనంతో రోడ్డుపైకి వెళ్లాలంటనే వాహనదారులు భయపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అన్ని అర్హతలున్నా డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో లేక చాలామంది అపరాధ రుసుం చెల్లించక తప్పడం లేదు. ఎల్ఎల్ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేస్తే అదే రోజు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ముద్రిస్తారు. అనంతరం ముద్రించిన కార్డులను పోస్టు ద్వారా వాహనదారుడి ఇంటికి నాలుగు, ఐదు రోజుల్లో పంపించాలి. కాని నెలలు గడుస్తున్నా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు), లైసెన్స్ రెన్యూవల్ కార్డుల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఐదు వేల మందికి.. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు అందాల్సి ఉంది. ఇందులో 2500 రిజిస్ట్రేషన్ కార్డులు, 2500 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఉన్నాయి. మూలకు చేరిన ప్రింటర్ జిల్లా కేంద్రంలో ఉపరవాణా కమిషనర్ కార్యాలయం ఉంది. అదేవిధంగా సాలురు, పార్వతీపురంల్లో వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అన్నింటికీ కార్డుల ముద్రణ విజయనగరంలో ఉన్న ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలోనే జరుగుతుంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రింటర్ తరచూ మొరాయిస్తుండడంతో సమస్య నెలకొంటోంది. సుమారు పదిహేనేళ్ల కిందటి ప్రింటర్ కావడంతో ఎప్పటికప్పుడు సమస్యలు నెలకొంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అవసరాలు బట్టి కనీసం మూడు ప్రింటర్లు ఉండాలి. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే శాఖలో రవాణాశాఖ ఒకటి అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు తెలియజేశాం.. ప్రింటర్ పాడైన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. సుమారు ఐదు వేల వరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ప్రింట్ చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – భువనగిరి కృష్ణవేణి, ఉపరవాణా కమిషనర్ -
ఆ చెక్‌పోస్టులు.. అంతేనా!
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులను ‘క్లియర్’ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తమ శాఖ ఆధ్వర్యంలోని 12 చెక్ పోస్టులను మూసేసి 5 నెలలవుతున్నా కోట్ల రూపాయల విలువ చేసే ఆ చెక్ పోస్టుల్లోని వస్తువులను మాత్రం వదిలేసింది. చెక్ పోస్టులను రద్దు చేయడానికి కొంతకాలం ముందే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, ఇతర సామగ్రిని కనీసం కాపలా లేకుండా గాలికొదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల్లోని సామగ్రినే కాదు అక్కడ పనిచేసి వచ్చిన ఉద్యోగుల వేతనాల విషయంలోనూ గందరగోళ వైఖరిని అవలంబిస్తోంది. కనీస ‘చెక్’ లేదు వాస్తవానికి, జీఎస్టీ అమల్లోకి రాక ముందు రాష్ట్ర నలుమూలలా 12 చెక్ పోస్టులుండేవి. భైంసా, వాంకిడి, మద్నూరు, చిరాగ్పల్లి, జహీరాబాద్, కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, తుంగభద్ర, పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేటల్లో ఉన్న ఈ చెక్‌పోస్టులను జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై 1 అర్ధరాత్రి నుంచే మూసేశారు. వాణిజ్య తనిఖీలు జరిగే చెక్ పోస్టులను ఎత్తేయాలన్న కేంద్ర నిర్ణయంతో ఇక్కడ కూడా చెక్‌పోస్టులను మూసేశారు. అక్కడ వదిలేసి వచ్చిన సీసీ కెమెరాలు, ఐటీ పరికరాలు, కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్ సరిచూసుకునేందుకు కూడా యత్నించకపోవడం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా నిలుస్తోంది. అక్కడ ఉండే జీపులను కూడా హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ మూలన పడేశారు తప్ప వాటిని వాడేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. మొత్తం వీటి విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసినా.. తిరిగి వాడుకునే వీలున్నా మూలన పడేయడంపై ఆ శాఖ వర్గాల్లోనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిదీ అదే స్థితి చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బందికి వేరే విధులు కేటాయించారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడి సౌకర్యాలు, హెచ్ఆర్ఏ లాంటివి వర్తింపజేయకుండా పాత స్థానంలో ఉన్న సౌకర్యాలు, హెచ్ఆర్ఏలే ఇస్తుండటం గమనార్హం. అలా చెక్‌పోస్టుల నుంచి వచ్చిన సిబ్బందిలో ఐదుగురిని విలీనం చేసుకోకుండా డిçప్యుటేషన్ అంటూ విధుల్లో కొనసాగిస్తుండటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే వాహన భత్యం విషయంలోనూ వీరి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఓ సర్కిల్లో చెక్‌పోస్టుల నుం చి వచ్చిన ఓ అధికారికి వాహన భత్యం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ప్రభుత్వానికి ఫైల్ పంపడం గమనార్హం. అదే సర్కిల్లో పనిచేస్తున్న మరి కొంతమందికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేవని, వాహనాల ఈసీ పుస్తకాలు లేవంటూ వాహన భత్యం నిలిపేశారని సమాచారం. -
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్
అనంతపురం సెంట్రల్: వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్లైన్ విధానంలో సులభంగా పొందవచ్చని ఉప రవాణా కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థి సాయి శరత్‌కు బుధవారం ఆయన తన కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ విధానం వల్ల కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను పారదర్శకంగా అందించడమే ఆన్లైన్ ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, కానిస్టేబుళ్లు చలపతి, వలి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్!
త్వరలో అమలు చేస్తాం: కేంద్ర మంత్రి రవిశంకర్ గురుగ్రామ్: త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. హరియా ణాలో శుక్రవారం జరిగిన డిజిటల్ సదస్సు– 2017 ప్రారంభోత్సవంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్‌తో అనుసంధానంపై తాను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో ఇప్పటికే చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్ (ఐరిస్, వేలిముద్రలు) సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ (సంకేత నిక్షిప్త సందేశాలు) విధానంలో సురక్షితంగా భద్రపరిచామని దీనివల్ల ఆధార్ భద్రతకు ఢోకా ఉండదని తెలిపారు. ఆధార్ అనేది కేవలం డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, భౌతిక గుర్తింపు కాదని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం(డీబీటీ) అమలుచేయడం వల్ల ఇప్పటి వరకు రూ. 57 వేల కోట్లు ఆదా అయ్యాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డీబీటీ ద్వారా ప్రయోజనాలు లబ్ధిదారులకే చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
లెఫ్ట్ టు రైట్‌కు ‘టెస్ట్’..!
ఎడమ నుంచి కుడికి మారాలంటే పరీక్ష పాసవ్వాల్సిందే కనీస శిక్షణ ఉంటేనే విదేశీ డ్రైవింగ్ లైసెన్సుల మార్పిడి హైదరాబాద్ ట్రాఫిక్‌పై అవగాహన ఉండాలంటున్న నిపుణులు ప్రస్తుతం డేటా ఆధారంగానే లైసెన్సుల బదిలీ లైసెన్స్ బదిలీ విధానంలో మార్పులకు ఆర్టీఏ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశారా..? ఆ దేశంలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సును ఇక్కడికి బదిలీ చేసుకోవా లని అనుకుంటున్నారా..? అయితే మీరు కొంతకాలం డ్రైవింగ్‌లో శిక్షణ పొందాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలకు అనుగు ణంగా వాహనం నడిపే నైపుణ్యం సాధిస్తేనే మీ డ్రైవింగ్ లైసెన్సు బదిలీ అవుతుంది. అమెరికా యే కాదు.. ఏ విదేశీ డ్రైవింగ్ లైసెన్సు అయినా మార్చుకోవాలంటే డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావలసిందే. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్సుల ఆధారంగా ఇక్కడ కొత్తగా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంలో మార్పులు అవసరమని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. లెఫ్ట్ టూ రైట్ కోసం.. విదేశాల్లో ఎక్కువ శాతం ఎడమ వైపు స్టీరింగ్ ఉంటుంది. అక్కడ వాహనాలు నడిపే వాళ్లంతా ఎడమవైపు డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవాళ్లు. పైగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ట్రాఫిక్ నిబంధనలకు, మన నిబంధనలకు ఎంతో తేడా ఉంటుంది. రోడ్డు నిర్మాణంలోనూ మార్పులుంటాయి. హైదరా బాద్‌లో ట్రాఫిక్ ఎక్కువ. మన రోడ్లపై 18 నుంచి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లడం సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లన్నీ కుడివైపు డ్రైవింగ్‌కు అనుగుణమైన నిబంధనలతో ఉన్నాయి. అయితే ఈ మార్పులను పరిగణన లోకి తీసుకోకుండా అమెరికా లైసెన్సు కలిగి ఉన్నవాళ్లకు ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చేస్తున్నారు. స్పీడ్‌పై నియంత్రణ లేకపోవడం.. ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో వాహనదారులు తరచు అదుపు కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్ నిబంధనలు, ఎడమ నుంచి కుడికి స్టీరింగ్ మార్పుపై కొంత శిక్షణ అవసరమని నిఫుణులు భావిస్తున్నారు. లైసెన్సు మార్చుకునేందుకు వచ్చేవారికి ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్‌ల్లో పరీక్షలు నిర్వహించి లైసెన్సులిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనువాదం ఉండాలి.. విదేశాల్లో తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులు ఎక్కువ శాతం ఇంగ్లిష్‌లోనే ఉన్నప్పటికీ.. సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాల డ్రైవింగ్ లైసెన్సులు అరబిక్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ఇలాంటి లైసెన్సుల్లో డేటాను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసుకుని ఆర్టీఏలో సమర్పించాలి. వీటిని ఇఫ్లూ యూనివర్సిటీలోనూ, ఇతర అధికారిక అనువాదకుల వద్ద ట్రాన్స్‌లేట్ చేసుకోవలసి ఉంటుంది. మన డ్రైవింగ్ లైసెన్సుల్లో ‘ఎంసీ (మోటార్ సైకిల్), ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్) వంటి పదాలు ఉంటాయి. విదేశీ లైసెన్సుల్లో ‘ఎ,’‘బి’, ‘సి’, ‘డి’వంటి అక్షరాలు ఉంటాయి. ఏ అక్షరం ఏ వాహనానికి సంకేతం అనేది ఆయా దేశాల్లోని రవాణా కార్యాలయాల్లో మాత్రమే నమోదై ఉంటుంది. డేటా మార్పిడిలో ఇలాంటి సాంకేతిక పదజాలం కూడా మారుతుంది. అలాగే విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సుకు కాలపరిమితి ఎంత వరకు ఉంటే అంతవరకే ఇక్కడ ఇస్తారు. ‘‘మనం ఇచ్చే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను(ఐడీపీ) కొన్ని దేశాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇది ఒక డాక్యుమెంట్గానే నమోదై ఉంది. కానీ డ్రైవింగ్ లైసెన్సుగా కాదు. హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వాహనం నడపగలరు. కానీ విదేశాల్లో డ్రైవింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఇక్కడ నడపాలంటే కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’’అని ఆర్టీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఏటా వందల్లో మార్పులు.. ప్రస్తుతం విదేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితికి అనుగు ణంగా ఎలాంటి టెస్టులు లేకుండానే ఇక్కడ లైసెన్సులు ఇస్తున్నారు. ఇందు కోసం వాహనదారులు హైదరాబాద్‌లో తమ శాశ్వత చిరునామా ధ్రువీకరణ, విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సు డేటాను అందజేయాలి. ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుని రూ.750 ఫీజు చెల్లించి.. నిర్ణీత తేదీ, సమయంలో ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే.. విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సు డేటాను హైదరాబాద్ ఆర్టీఏకు మార్చుకుని కొత్త లైసెన్సు ఇస్తారు. అమెరికా, సింగపూర్, బ్రిటన్, దుబాయ్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ఈ తరహా లైసెన్సుల బదిలీ కోసం ఏటా వందలాది మంది వస్తుంటారు. -
గీత దాటారో.. లైసెన్స్ గోవిందా!
-
గీత దాటారో.. లైసెన్స్ గోవిందా!
ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాయింట్ల విధానంతో చెక్ రెండేళ్లలో 12 పాయింట్లు వస్తే లైసెన్స్ రద్దు.. ఉత్తర్వు జారీ సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రయ్.. రయ్.. అంటూ దూసుకుపోయారో జాగ్రత్త! ఇప్పటివరకు పెనాల్టీలతో సరిపుచ్చిన అధికారులు ఇక ఏకంగా లైసెన్సునే రద్దు చేయబోతున్నారు. ఇందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. పెనాల్టీలతోపాటు ఆ నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వాటి సంఖ్య 12కు చేరితే లైసెన్సు రద్దవుతుంది. అదే లెర్నింగ్ లెసెన్సు ఉన్నవారికి ఆ పాయింట్ల సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. అంతకుమించితే వారి తాత్కాలిక లైసెన్సు కూడా రద్దవుతుంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. చలానా కట్టేస్తే సరిపోతుందనే ధీమాతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారికి ఇక ఈ కొత్త విధానంతో ముకుతాడు పడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో భారీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారుల విషయంలో ఇక కఠినంగా ఉండబోతున్నారు. అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో ఈ విధానం చక్కటి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమల్లోకి తేవాలని గతంలోనే నిర్ణయించి కసరత్తు చేసింది. రోడ్డు భద్రత చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని అటు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.వేలల్లో పెనాల్టీలు, లైసెన్సు రద్దు, వాహనాల జప్తు లాంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇది అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ల విధానానికి శ్రీకారం చుడుతోంది. సీసీ కెమెరాలే ఆయుధం ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్లలోని సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుల ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలు పంపుతున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కూడళ్లలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి చిక్కటం ఖాయం. దాని ఆధారంగా ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటాబేస్ ఎప్పటికప్పుడు లెక్క కడుతూ ఉంటుంది. రెండేళ్ల (24 నెలలు) సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్సు రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతుంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్లపాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్లపాటు లైసెన్సును రద్దు చేస్తారు. పాయింట్లు ఇలా తగ్గించుకోవచ్చు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో వాహనా ల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశా లపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటివరకు వాహనదారుడి ఖాతాలో నమోదైన పాయింట్ల నుంచి మూడు పాయింట్లను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఉల్లంఘన పాయింట్లు ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే 1 సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2 హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపితే 1 రాంగ్ రూట్లో వాహనం నడిపితే.. 2 నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2 నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3 ప్రమాదకరంగా వాహనం నడపడం/సెల్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్ 2 మద్యం తాగి బైక్ నడిపితే, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే.. 3 మద్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4 మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగినడిపితే 5 ఇబ్బంది కలిగేలా నడిపితే/శబ్ద, వాయు కాలుష్యానికి కారణమైనా/అనుమతిలేని చోట పార్క్ చేసినా.. 2 బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2 అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2 ర్యాష్ డ్రైవింగ్/ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపరిచేలా నడిపితే 2 నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే.. 5 వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీ.. తదితర నేరాలకు పాల్పడితే 5 -
‘స్పాట్’ పెడతారు!
►ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఇక పెనాల్టీ పాయింట్స్ ►ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ►రెండేళ్లలో 12 పెనాల్టీ పాయింట్లు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ►ప్రాథమికంగా ‘స్పాట్ చలాన్’కే పరిమితం సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా రాంగ్ సైడ్‌లో దూసుకుపోతున్నాం... ట్రాఫిక్ పోలీసులు ఆపితే విధించిన చలాన్ చెల్లించేద్దాం... అక్కడితో కథ ముగిసిపోతుందని అనుకుంటున్నారా..! ఇకపై అలా కుదరదు. జరిమానాతో పాటు మీరు చేసిన రెండు ఉల్లంఘనలకు సంబంధించి మూడు పెనాల్టీ పాయింట్లు మీ డ్రైవింగ్ లైసెన్స్లోకి చేరతాయి. ఇలా పాయింట్లు పడటం ప్రారంభమైన నాటి నుంచి 24 నెలల్లో మీ స్కోర్ 12 దాటితే సీన్ మారిపోతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయడం ద్వారా వాహనం నడిపే చాన్స్ లేకుండా చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వుల్ని ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. భవిష్యత్తులో పెనాల్టీ పాయింట్స్ విధింపు విధానాన్ని మరింత విస్తరించే ఆస్కారం ఉందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మూడు కమిషనరేట్లకే... ఈ పెనాల్టీ పాయింట్స్ విధానం పూర్తిగా కంప్యూటర్, సాఫ్ట్వేర్, సర్వర్ ఆధారంగా జరుగుతుంది. రాష్ట్రంలో రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మినహా మిగిలిన చోట్ల ఉల్లంఘనల నమోదు ఆన్లైన్లో జరగట్లేదు. పీడీఏ మెషిన్లు, సర్వర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని నేపథ్యంలోనే మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో పెనాల్టీ పాయింట్స్ విధానం ప్రస్తుతానికి అమలుకాదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏఏ కమిషనరేట్లు, జిల్లాలు అప్డేట్ అయితే ఆయా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేయడానికి అనువుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికైతే స్పాట్ చలాన్లకే... ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లం«ఘనులకు రెండు రకాలుగా జరిమానాలు విధిస్తుంటారు. పాయింట్ డ్యూటీలుగా పిలిచే క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు రోడ్లపై వాహనాలను ఆపి పీడీఏ మిషన్ల ద్వారా విధించడం మొదటి రకం. వాహనచోదకుడి పరోక్షంలో ఉల్లంఘనల్ని కెమెరాల ద్వారా షూట్ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఈ–చలాన్ పంప డం రెండో రకం. పెనాల్టీ పాయింట్స్ విధానం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్ నెంబర్ సేకరించడం ద్వారా పాయింట్స్ దానిపై నమోదయ్యేలా చూ స్తారు. ఈ–చలాన్ విధానంలో ఈ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయిం ట్స్‌ను స్పాట్ చలాన్లకే వర్తింపజేస్తున్నారు. ఆ ఇబ్బందులకు ఆస్కారం లేకుండా... ప్రస్తుతం పెనాల్టీ పాయింట్స్ విధానాన్ని స్పాట్ చలాన్లకే పరిమితం చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఓ వ్యక్తికి చెందిన వాహనాన్ని మరొకరు తీసుకువెళ్ళి ఉల్లంఘనకు పాల్పడ్డాడనుకుందాం. ఈ–చలాన్ విధానంలోనూ పెనాల్టీ పాయింట్స్ విధిస్తే ఆ పాయింట్స్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి కాకుండా, వాహనం యజమానికి చేరతాయి. మరోపక్క ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న వాహనాల్లో అత్యధికం రిజిస్ట్రేషన్లు మారనివే. సెకండ్ హ్యాండ్ వాహనాలను ఖరీదు చేస్తున్న వారు వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరిట మార్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ వాహనం నెంబర్ ఆధారంగా పెనాల్టీ పాయింట్స్ విధిస్తే అవి దాని పాత యజమానికి వర్తిస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం స్పాట్ చలాన్ విధానంలోనే ఈ పాయింట్లు వర్తింపజేయాలని నిర్ణయించారు. తీవ్రమైన వాటికే తొలి ప్రాధాన్యం... ట్రాఫిక్ పోలీసులు వాహనచోదకుల్ని పట్టుకున్నప్పుడు, ఫొటో ద్వారా బంధించినప్పుడు వారి పాల్పడిన ఉల్లంఘన ఆధారంగా జరిమానా విధిస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసు విభాగం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం నుంచి క్యాబ్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వరకు మొత్తం 101 రకాలైన ఉల్లంఘనలకు జరిమానా విధిస్తున్నారు. అయితే తొలిదశలో పెనాల్టీ పాయింట్ విధానాన్ని ఎంవీ యాక్ట్‌లో ఉన్న ఎనిమిది సెక్షన్ల కిందికి వచ్చే 17 ఉల్లంఘనలకే వర్తింపజేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. అత్యంత ప్రమాదకరంగా పరిగణించే ఈ మూడో తరహా ఉల్లంఘనల పైనే ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ఆటోలో ముందు భాగంలో ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం నుంచి మద్యం తాగి వాహనం నడపడం వరకు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌లో గోల్మాల్ చేస్తే జైలుకే... ఈ ఉత్తర్వులు జారీ చేసింది ట్రాన్స్పోర్ట్ విభాగమైనా... అత్యధికంగా అమలు చేసేది మాత్రం ట్రాఫిక్ పోలీసులే. నిర్ణీత కాలంలో పరిమితికి మించి పెనాల్టీ పాయింట్స్ పొందిన వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసు విభాగం సిఫార్సుల ఆధారంగా ఆర్టీఏ విభాగం సస్పెండ్ చేస్తుంది. ఈ వివరాలను ఆర్టీఏ డేటాబేస్‌లో పొందుపరుస్తుంది. ట్రాఫిక్ విభాగం అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లు ఈ సర్వర్‌తోనూ అనుసంధానించి ఉంటాయి. దీంతో ఎవరైనా వ్యక్తి సస్పెండ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని పోలీసులు తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ అరెస్టు చేయించేందుకు ఆస్కారం ఉంది. సస్పెండ్ అయింది కదా అని లైసెన్స్ విడిచిపెట్టి, అసలు లేదంటూ వాహనం నడిపినా జైలుకు వెళ్ళడం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వాహనాలు వినియోగించి అనేక నేరాలకు పాల్పడిన వారు ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిపై ఇప్పటి వరకు ప్రత్యేకమైన చర్యలకంటూ ఆస్కారం లేదు. ఫలితంగానే స్నాచర్లు వంటి వాళ్ళు పదేపదే వాహనాలపై తిరుగుతూ నేరాలు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులు ఆపితే... తమ దగ్గరున్న పత్రాలు చూపించి తప్పించుకుంటున్నారు. అయితే పెనాల్టీ పాయింట్స్ వి«ధింపులో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇలాంటి వారికీ చెక్ పడనుంది. ఈ విధానంలో కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదు.. ప్రమాదాలకు కారకులైనా, వాహనాన్ని వినియోగించి స్నాచింగ్, దోపిడీ వంటి నేరాలు చేసినా.. వారిపై కేసుతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై అత్యధిక పెనాల్టీ పాయింట్లు పడేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదేపదే వాహనాలు వినియోగిస్తూ నేరాలు చేసే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సులు సైతం సస్పెండ్ అవుతాయి. ఈ డేటాబేస్ సాయంతోనూ పాత నేరగాళ్ళను గుర్తించడంతో పాటు వారికి చెక్ చెప్పడానికి ఆస్కారం ఏర్పడనుంది. కొన్నాళ్ళ పాటు అవగాహన కల్పిస్తాం ఈ పెనాల్టీ పాయింట్స్ విధింపు విషయంలో వాహనచోదకులకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించాం. నిర్ణీత కాలం వరకు వివిధ మాధ్యమాల ద్వారా వాహనచోదకుల్లో ఈ పాయింట్స్‌పై అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మీడియాతో పాటు ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్‌మీడియాలు, ప్రధాన కూడళ్ళలో ఉన్న బోర్డులు, ట్రాఫిక్ పోలీసుల పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసుస్టేషన్ల వారీగా కరపత్రాల పంపిణీ ద్వారా విస్తృతస్థాయిలో అవగాహనకు కృషి చేస్తాం. ఆపై ఆర్టీఏ అధికారుల సాయంతో రంగంలోకి దిగి పాయింట్స్ విధానం పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ వి.రవీందర్, ట్రాఫిక్ చీఫ్ -
సైకిల్ కావాలా.. ఆటో కావాలా..!
- ఎస్‌హెచ్‌జీల మహిళలకు స్త్రీనిధి బ్యాంక్ రుణ సదుపాయాలు - సైకిల్‌కు రూ.5వేలు, ఆటో లేదా ట్రాలీకి రూ.1.20 లక్షలు రుణమివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల కుటుంబాలకు సాధారణ రవాణా సౌలభ్యంతో పాటు జీవనోపాధికి రెండు కొత్త రుణ సదుపాయాలను స్త్రీనిధి బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి సైకిల్ కొనుగోలుకు కాగా, మరొకటి ఆటో లేదా ట్రాలీని కొనుక్కునేందుకు రుణాలను అందించాలని నిర్ణయించింది. సైకిల్ కొనుక్కోవాలనుకున్న మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 3వేల నుంచి రూ.5 వేల చొప్పున, ఆటో లేదా ట్రాలీ కొనుగోలుకు రూ.1.20 లక్షల చొప్పున రుణాలిచ్చే ప్రతిపాదనలకు స్త్రీనిధి బ్యాంక్ యాజమాన్య కమిటీ ఆమోదం తెలిపింది. స్త్రీనిధి బ్యాంక్ నుంచి ఆయా స్వయం సహాయక సంఘాలు సాధారణంగా తీసుకునే మైక్రో/టైనీ రుణాలతో నిమిత్తం లేకుండా కొత్త రుణాలను పొందవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కొత్త రుణ సదుపాయాల నిమిత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల దాకా బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సైకిల్ రవాణా.. పర్యావరణ హితం: పర్యావరణ హితమైనది కాబట్టి సైకిల్ రవాణాను పోత్సహించాలని స్త్రీనిధి బ్యాంక్ భావించింది. తొలుత ఆయా గ్రామాలు, మురికివాడల్లోని ఏ, బీ, సీ గ్రేడ్ సంఘాల్లోని సభ్యులకు, ఏ, బీ, సీ గ్రేడ్ మండల, పట్టణ సమాఖ్యల్లోని సభ్యులకు సైకిల్ రుణాలను అందించనున్నారు. సైకిల్ కోసం తీసుకున్న రుణాన్ని 12 సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. లాభసాటి ఉపాధి కోసం ఆటో, ట్రాలీ: లాభసాటి ఉపాధిని కోరుకునే ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబసభ్యులు ఆటో లేదా ట్రాలీ కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలని స్త్రీనిధి బ్యాంక్ నిర్ణయించింది. కొత్త వాహనం లేదా మూడేళ్లకు మించని సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా కొనుక్కునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక్కొక్క గ్రామ/మురికివాడ(స్లమ్ లెవల్ ఫెడరేషన్ సమాఖ్య)లో ఈ రుణ సదుపాయాన్ని ఇద్దరికే పరిమితం చేశారు. ప్యాసింజర్ ఆటో లేదా ట్రాన్స్పోర్ట్ ట్రాలీ కొనుగోలు చేయనున్న ఎస్‌హెచ్‌జీ మహిళ కుటుంబసభ్యుల్లో ఒకరికి సదరు వాహనం నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం కొనుగోలుకు గరిష్టంగా రూ.1.20 లక్షలను స్త్రీనిధి బ్యాంక్ ఇస్తుండగా, అంతకన్నా ఎక్కువ ధర అయినట్లయితే మిగతా సొమ్మును లబ్ధిదారులే భరించాలి. వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత రుణ మొత్తాన్ని 60 సులభ వాయిదాల్లో చెల్లించాలి. -
ప్రమాదాలకు లైసెన్స్!
►ఫిట్‌లెస్ పరీక్షలు ►డ్రైవింగ్ ట్రాక్‌లలో మొక్కుబడి తంతు ►డ్రైవర్ల సామర్ధ్యంపై అవగాహన లేకుండా లైసెన్సుల జారీ ►పెరుగుతున్న యాక్సిడెంట్లు గ్రేటర్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే విచ్చల విడిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకు అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నా..వాటిపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. రోజుకు మొక్కుబడిగా 20 మందికి పరీక్షల ద్వారా లైసెన్స్‌లు ఇస్తూ... వందలాది మందికి ఎలాంటి పరీక్షలు లేకుండానే జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పరిశీలించి లైసెన్సులు అందజేయవలసిన ఈ ట్రాక్‌లో రోజుకు 20 మంది అభ్యర్థులకు కూడా పరీక్షలు నిర్వహించడం లేదు. వందలాది మంది ఈ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటారు. కానీ పరీక్షలకు హాజరయ్యేవాళ్లు చాలా తక్కువ మంది. పైగా ఈ డ్రైవింగ్ పరీక్షలు సైతంఅధికారుల పర్యవేక్షణ లేకుండా మొక్కుబడిగా జరిగిపోతాయి. ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మరికొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలు నడిపే వ్యక్తుల డ్రైవింగ్ సామరŠాధ్యనికి ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు లేకుండానే లైసెన్సులు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కసారి లెర్నింగ్ లైసెన్సు కోసం వస్తే చాలు. ఇక డ్రైవింగ్ లైసెన్సు కోసం మరోసారి పరీక్షలకు హాజరుకావలసిన అవసరమే లేదు. ఇలా లైసెన్సులు తీసుకొని హై వేలలో రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. రహదారి భద్రతకు అతి పెద్ద సవాల్‌గా మారుతున్నారు. మితిమీరిన వేగం, నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం, వాహనాలను అదుపు చేసే సామర్ధ్యం కొరవడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్ఎఫ్ఐడీ కూడా అంతేసంగతులు... మరోవైపు బెంగళూర్ నగరంలోని 9 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పరిజ్ఞానంతో అనుసంధానించినట్లుగానే నగరంలోని ఉప్పల్, నాగోల్ ట్రాక్‌లను అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. పూనేకు చెందిన ఓ సాంకేతిక సంస్థ సహకారంతో ఉప్పల్ ట్రాక్‌లలో ఆర్ఎఫ్ఐడీ ఏర్పాటు చేశారు. యాంటీన్నా ద్వారా ట్రాక్‌లలో వాహనం కదలికలను కంప్యూటర్లో నమోదు చేసే శాస్త్రీయ పరిజ్ఞానం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అప్పట్లో అనేక రకాల ఆటంకాలు చోటుచేసుకున్నాయి. దీంతోరూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీని శాశ్వతంగా వదిలేశారు. ప్రత్యక్ష పరీక్షలకు సెలవ్... డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు గతంలో విదేశీ తరహాలో ప్రత్యక్ష పరీక్షా పద్ధతి ఉండేది. ట్రాక్‌లలో కాకుండా ప్రధానరహదారులలో డ్రైవర్ వాహనాన్ని నడిపేటప్పుడు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్.. డ్రైవర్‌తో పాటు వాహనంలో పయనిస్తూ అతన్ని నైపుణ్యాన్ని పరీక్షించేవాడు. అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తైన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపైన ఈ పరీక్షలు ఉండేవి. ప్రస్తుతం బ్రిటన్ వంటి యూరోప్ దేశాల్లో కచ్చితంగా అమలవుతున్న ఈ విధానిన్ని ఇక్కడ రద్దు చేశారు. దీంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ఎలాంటి పర్యవేక్షణ లేని ఒక ప్రహసనంగా కొనసాగుతోంది. నగరంలోని ట్రాక్‌లు –అందజేసే లైసెన్సులు... గ్రేటర్ హైదరాబాద్‌లో ఉప్పల్, నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు ఉన్నాయి.ఈ ట్రాక్‌లలో ‘హెచ్’, ‘ఎస్’, ‘రివర్స్ యు’ ‘8’ వంటి ఆకృతులలో ట్రాక్‌లను నిర్మించారు. ఈ ట్రాక్లలోనే ద్విచక్ర వాహనదారులకు, మోటారు వాహనాలకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు ఇస్తారు.సాధారణంగా ఈ పరీక్షలు ఎంవీఐల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. కానీ మొక్కుబడిగానే ఈ పర్యవేక్షణ ఉంటుంది. నాగోల్, కొండాపూర్‌లలో రోజుకు సుమారు 500 డ్రైవింగ్ లైసెన్సుల చొప్పున జారీ అవుతుండగా, మిగతా చోట్ల 300–350 వరకు ఇస్తున్నారు. జాడలేని వీడియో సెన్సర్లు.... వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ 2 సంవత్సరాల క్రితం ప్రణాళికలను రూపొందించింది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలోని నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించాలని అప్పట్లో ప్రతిపాదించారు. ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం లేకుండా అభ్యర్థుల నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చునని భావించారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు అప్పట్లో త్రివేండ్రమ్‌తో పాటు మరికొన్ని నగరాల్లోని వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేసే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు. వీడియో సెన్సర్ల ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని ప్రతిపాదించినా ఫలితం లేదు. -
8న లేడీస్ స్పెషల్
♦ మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా ♦ విమెన్ స్పెషల్ స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీఏ సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాలను సాధిస్తున్న మహిళలు డ్రైవింగ్‌లో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇప్పటికీ డ్రైవింగ్ విషయంలో ఇతరులపైనే ఆధారపడి ఉన్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ లైసెన్స్ తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 20,62,541 మంది మగవారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉంటే మహిళలు 1,23,437 మంది మాత్రమే ఉన్నారు. సొంతంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ‘మహిళా డ్రైవింగ్ లైసెన్స్ మేళా’కు శ్రీకారం చుట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్సులు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్లాట్ నమోదు చేసుకోవచ్చు... మార్చి 8న సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట్, మెహదీ పట్నం, బహదూర్‌పురా ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్సు తీసుకొనేలా స్లాట్స్ (సమయం+ తేదీ) ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ కేంద్రాల్లో మహిళా ఎంవీఐలు, మహిళా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్సులకు హాజరయ్యే మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్ అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్సుతో పాటు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. -
వాహనదారులపై రవాణా బాదుడు
భారీగా ఫీజులు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపైనా వడ్డన విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వం ప్రజల నెత్తిన మరోభారం మోపింది. రవాణా శాఖలో నిర్వహించే వివిధ పనులకు సంబంధించి చార్జీలను అమాంతం పెంచేసింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు.. డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. పెరుగుదల వివరాలు.. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసిన వారి నుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం రూ.90 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.260కు పెంచారు. ఇది టూవీలర్ ఎల్‌ఎల్‌ఆర్‌కు మాత్రమే. అదనంగా ఫోర్ వీలర్‌కు గానీ, ఆటోరిక్షాకు గానీ ఎల్ఎల్ఆర్ కావాలంటే.. ఒక్కోదానికీ రూ.150 చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్సు ఫీజు రూ.550 ఉండేది. దాన్ని రూ.960కి పెంచారు. లైసెన్సు రెన్యువల్‌కు రూ.485 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660కి పెంచారు. చిరునామా మార్పునకు గతంలో రూ.560 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ.660 మొత్తానికి పెంచారు. అదేవిధంగా ఎండార్స్‌మెంట్‌కు గతంలో రూ.560ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1260కుపెంచారు. టూవీలర్ రిజిస్ట్రేషన్‌కు గతంలో రూ.445 ఉంటే.. దాన్ని రూ.685 కు పెంచారు. కారుకు గతంలో రూ.735 ఉంటే దాన్ని ఇప్పుడు 1135కు పెంచారు. వాహనాన్ని బదిలీ చేయడానికి గతంలో టూవీలర్‌కు రూ.410 ఉంటే.. ఇప్పుడు అది రూ.535కు పెరిగింది. కారుకు గతంలో రూ.635ఉంటే ఇప్పుడు రూ.835కు పెరిగింది. ఏడాదికి రూ.80 కోట్ల మేర అదనపు భారం ప్రభుత్వం రవాణా చార్జీలు పెంచడం వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.కోట్లలో భారం పడనుంది. అన్ని రకాల సేవలు ఫీజులు, చార్జీలు పెరగడం వల్ల ఏడాదికి అదనంగా సుమారు రూ.80 కోట్ల వరకు భారం పడనుంది. -
‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..!
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్టేషన్, డ్రైవింగ్ లెసైన్స్ సాఫ్ట్వేర్ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చారుు. పెండింగ్ కార్డులతో వాహనదారుల ఇబ్బందులపై ఈనెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కార్డులు ఇంకెన్నడు..!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన ఐదు జిల్లాల పర్యవేక్షణాధికారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొత్త జిల్లాల లోగోతో కూడిన కార్డులను గురువారం పూర్తిస్థారుులో విడుదల చేశారు. జిల్లాకు సుమారు ఐదువేల కార్డుల చొప్పున అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కార్డులను వేగంగా ఆయా జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ముద్రణ పూర్తి చేసి స్పీడ్పోస్ట్కు అందజేశారు. ప్రతి వినియోగదారుడు మరో రెండు రోజుల్లో రిజస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్సకార్డులను అందుకోనున్నారు. -
చేతుల్లేకుండా కారు డ్రైవింగ్!
చేతుల్లేకుండా కారును నడపగలమా? నేను నడపగలనంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన విక్రం అగ్నిహోత్రి(45). అంతేకాదు.. ఇతడికి తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లెసైన్స్ కూడా జారీ చేసింది. చిన్నప్పుడు ఓ ప్రమాదంలో చేతులను కోల్పోయిన విక్రంకు కారును నడపాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. అయితే.. అందరిలా నిరాశలో మునిగిపోకుండా తన కల సాకారానికి నడుం బిగించాడు. కాళ్లతో కారును నడపడం నేర్చుకున్నాడు. దీనికి తగ్గట్లుగా తన వాహనంలో చిన్నచిన్న మార్పులు చేసుకున్నాడు. ఒక కాలుతో స్టీరింగ్ తిప్పుతూ.. మరో కాలుతో గేర్ వేస్తుంటాడు. లెసైన్స్ ఇవ్వాలన్న ఇతడి వినతిని తొలుత ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. నెలల పోరాటం అనంతరం విక్రం కారు నడిపిన తీరును గమనించిన తర్వాత అతడికి లెసైన్స్ ఇచ్చారు. దేశంలో చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లెసైన్స్ ఇవ్వడం ఇదే తొలిసారని చెబుతున్నారు. -
ఆన్‘లైన్ క్లియర్
ఆర్టీఏ ఆన్లైన్ సేవలు షురూ నేటి నుంచే ప్రారంభం అందుబాటులో 53 రకాల సేవలు సంగారెడ్డి టౌన్:శివ్వంపేటకు చెందిన అవినాష్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. నిర్దేశించిన తేదీన సంగారెడ్డి మండలం కందిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నాడు. ఎంతకీ తన వంతు రాలేదు. కానీ, కొందరు వరుసలో నిల్చోకుండానే దర్జాగా క్షణాల్లో పని కానిచ్చేసుకుని వెళ్లిపోయారు. ఆరా తీస్తే దళారుల ద్వారా వారు పని చక్కబెట్టుకున్నారని తెలిసింది. ఆన్లైన్ అంటూ ఆర్భాటం చేసినా ఎందుకు ఉపయోగం అని అవినాష్ వంటి వారంతా పెదవి విరుస్తున్నారు. ఇదంతా నిన్నటి వ్యథ.. నేటి నుంచి రవాణా శాఖలో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇకనైనా ఇటువంటి వ్యథలు తప్పేనా అని వాహన చోదకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి రవాణా శాఖ (ఆర్టీఏ)కు సంబంధించిన అన్ని సేవలు ఆన్లైన్లోనే అందనున్నాయి. సంగారెడ్డిలోని కంది, పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, సిద్దిపేటలలో గల ప్రాంతీయ రవాణా కేంద్రాలను ఇందుకునుగుణంగా తీర్చిదిద్దారు. ఇకపై దరఖాస్తులు నింపడం, ఏ సేవకు ఏ ఫారం నింపాలో గందరగోళపడటం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి. ఆర్టీఏ ఆన్లైన్ వెబ్సైట్ (www.transport.telangana.gov.in) లోకి లాగిన్ అయ్యి కావాల్సిన సేవలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిని స్లాట్ బుకింగ్ అంటారు. అనంతరం కంప్యూటర్ ఒక అప్లికేషన్ నెంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది. దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. సంబంధిత ఫీజు ఆన్లైన్లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్ (కేటాయించిన తేదీ) రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయానికి వెళ్లి సమర్పిస్తే సరిపోతుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి కావలసి సేవలు అందిస్తారు. 53 రకాల సేవలు.. లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల్ని ఆన్లైన్లో పొందవచ్చు. రవాణా శాఖకు సంబంధించిన 9 విభాగాలలో 53 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. లర్నింగ్ లైసెన్స్‌కు సంబంధించి 5 సేవలు, డ్రైవింగ్ లైసెన్సు-9, రిజిస్ట్రేషన్-12, కండక్టర్ లైసెన్స్-4, కొత్త పర్మిట్ మంజూరుకు సంబంధించి-9, ఫిట్నెస్ సర్టిఫికెట్-4, రికమండేషన్ లెటర్-5, టాక్స్ పేమెంట్-2, ట్రేడ్ సర్టిఫికెట్-3.. తదితర 53 సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
‘ఆధార్’ లేకుంటే జప్తే..!
- డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు - ఆధార్ కార్డు ఉండాల్సిందే లేకుంటే వాహనం జప్తు.. - సైబరాబాద్ పరిధిలో అమలు! - ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసమే అంటున్న పోలీసులు - ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి - 27 నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్ : వాహనాలు నడపాలంటే కనీసం మన దగ్గర ఉండాల్సినవి డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. అయితే ఈ వాహన పత్రాలతో పాటు ఇకపై ఆధార్ కార్డును కూడా వాహనచోదకులు వెంట ఉంచుకోవాలట. లేకుంటే వాహనం జప్తు చేస్తామని చెబుతున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. డ్రంకన్ డ్రైవర్లు, లెసైన్స్ లేకుండా తిరిగే వ్యక్తుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దీనిని తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం సాధారణ తనిఖీలతో పాటు ప్రత్యేక డ్రైవ్‌లను ఈ నెల 27 నుంచి చేపడతామని, ఎవరి వద్దనైనా వాహన డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కార్డు లేకపోయినా సదరు వాహనాన్ని జప్తు చేసుకోవడంతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. వ్యక్తి గుర్తింపు కోసమే ‘ఆధార్’ వాహన డాక్యుమెంట్లతో పాటు సదరు వ్యక్తిని గుర్తించడం కోసం ఆధార్ కార్డును తప్పనిసరి చేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్తుతున్నారు. దీని ద్వారా తాగి నడిపే డ్రైవర్ల వివరాలను ఆధార్‌తో సేకరించవచ్చంటున్నారు. ఒకవేళ వాహన డాక్యుమెంట్లు ఉండి ఆధార్ లేని వారు ఎవరైనా పట్టుబడితే వారి వాహనాన్ని జప్తు చేస్తామని, తిరిగి ఆధార్ కార్డు వివరాలు ఇచ్చి ఆ వాహనాన్ని తీసుకెళ్లవచ్చని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు కారకులై తప్పించుకునే వారిని, నేరం చేసి పారిపోయే వారిని సులభంగా పట్టుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందని చెపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, అనుమానితులను గుర్తించడానికి దీని ద్వారా వీలవుతుందంటున్నారు. స్థానిక చోరులు దొంగతనానికి వెళ్లే సమయాల్లో నంబర్ ప్లేట్ లేని వాహనాలు వినియోగిస్తుంటారని, ఈ డ్రైవ్‌ల ద్వారా వారికి చెక్ పెడతామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల కోసమే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు ఆధార్ కార్డును వెంటబెట్టుకోవాలని సాధారణ జనాన్ని కోరుతున్నాం. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ చాలా మంది దగ్గర డ్రైవింగ్ లెసైన్స్ ఉండటం లేదు. అలాగే చాలా మంది మైనర్లు దొరుకుతున్నారు. అటువంటి వాళ్ల ఐడెంటిటీ కోసమే ఆధార్ కార్డు వెంటబెట్టుకోవాలని చెప్తుతున్నాం. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలు చేస్తున్నవారు.. నేరాలకు పాల్పడి తప్పించుకుపోయేవాళ్లను నియంత్రించేందుకు.. ప్రజల భద్రత కోసం అందరూ ఆధార్ కార్డు వెంట ఉంచుకుంటే మంచిది. దీనికి ప్రజలంతా సహకరించాలి. - ఏఆర్ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ -
వారి జీవితాలతో ఆడుకోవద్దు:పాపయ్య
సాక్షి,సిటీబ్యూరో: ‘‘జీవితం చాలా విలువైనది. ఒక్కసారి దానిని కోల్పోతే తిరిగిరాదు. మైనర్లకు వాహనాలిచ్చి వారి జీవితాలతో ఆడుకోవద్దు’’.. అని ట్రాఫిక్ నార్త్ డిస్ట్రిక్ అడిషనల్ డీసీపీ పాపయ్య తల్లిదండ్రులకు సూచించారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ)లో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ పాపయ్య మాట్లాడుతూ... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఎంవీఐ యాక్ట్ ప్రకారం నడిపిన వారితో పాటు వాహనం యజమానిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాహన యజమానికి రూ.1200ల చలాన్ విధించి కౌన్సెలింగ్ చేస్తామన్నారు. నగర రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకే మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మైనర్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి మద్యం సరఫరా చేసిన బార్, వైన్‌షాపుల లైసెన్స్ రద్దుకు ఎక్సైజ్‌శాఖకు సిఫారసు చేస్తామన్నారు. అలాగే మైనర్ల సమాచారాన్ని వారు చదువుకొనే విద్యా సంస్థలకు, పెద్దలైతే వారు పనిచేసే సంస్థలకు తెలియజేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.